న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తీసుకుంది. ఒక ఉద్యోగి ఒక సంస్థలో చేరి ఆరు నెలల్లోపు మానేస్తే, కేవలం తన పీఎఫ్ ఖాతాలోని బ్యాలన్స్ వరకే వెనక్కి తీసుకోగలరు.
పెన్షన్ ఖాతా (ఈపీఎస్–95)లోని జమలను తీసుకోవడానికి లేదు. కానీ, ఆరు నెలల సర్వీసు కూడా లేకుండా ఉద్యోగం మానేసే వారు పెన్షన్ ఖాతాలోని బ్యాలన్స్‌ను సైతం వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సోమవారం నాటి 232వ సమావేశంలో నిర్ణయించింది. ఇక ఈటీఎఫ్‌లలో తన పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన విధానానికీ ఆమోదం తెలిపింది. 2018లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్లకు సంబంధించి లాభాలను వెనక్కి తీసుకుని, 2022–23 సంవత్సరానికి వడ్డీ ఆదాయం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment