ప్రతిపాదనను పరిశీలించనున్న ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు
న్యూఢిల్లీ: ఉద్యోగుల పింఛను పథకం పరిధిలోకి వచ్చే సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ట్రస్టీల కేంద్ర మండలి(సీబీటీ) నెల 5న జరిగే సమావేశంలో పరిశీలించనుంది. కేంద్ర కార్మిక మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో.. 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి రెండేళ్ల బోనస్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించాలన్న ప్రతిపాదనపైనా చర్చించనున్నారు.
ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్-95) కింద చందాదారులు సభ్యత్వాన్ని వదులుకుని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే వారు 58 ఏళ్ల తర్వాత పథకంలో కొనసాగలేరు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలకు చందాలు జమచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదని ఈపీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎస్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచితే 27 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి కలుగుతుంది. కార్మిక శాఖకు అందజేసిన మెమొరాండంలో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలను పొందుపరచింది. ఈపీఎస్ పథకం కింద కనీస పింఛనును రూ.1,000కి పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదించడం తెలిసిందే.
పింఛను స్కీం రిటైర్మెంట్ వయసు పెంపు!
Published Mon, Feb 3 2014 1:09 AM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM
Advertisement