రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్-95) కింద... పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. వెయ్యి అందించాలన్న పథకం త్వరలో అమలు కానుంది. ఐదు లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి వల్ల అది సాధ్యంకాలేదు.
ఎన్నికలు పూర్తయినందున ఇప్పుడీ ఈ పథకాన్ని (ఈపీఎస్-95) అమలు చేయనున్నట్టు ఈపీఎఫ్‌ఓ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.కనీస పింఛన్ కింద రూ.వెయ్యిని అందజేసేందుకోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ.1,217 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.