Interest Hike
-
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్న శ్రీలంక ప్రభుత్వం ఉన్న కొద్ది పాటి ఆర్థిక నిల్వలను కాపాడుకునే పనిలో పడింది. అందులో భాగంగా వడ్డీరేట్లను భారీగా పెంచుతూ శ్రీలంక సెంట్రల్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా వడ్డీరేట్లను దాదాపు రెట్టింపు చేసింది. గత ఆర్నెళ్లుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తిండి గింజలతో మొదలైన సమస్య పవర్, పెట్రోల్ కొరతల వరకు పాకింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో బ్యాంకుల్లో నిల్వ ఉన్న కొద్ది పాటీ మొత్తాలు అడుగంటి పోతున్నాయి. మరోవైపు డాలరుతో శ్రీలంక రూపాయి మారకం విలువ నెల రోజుల వ్యవధిలో 32 శాతం క్షీణించింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా అయినా బూస్ట్ ఇచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను రెట్టింపు చేసింది. దీని ప్రకారం స్టాండింగ్ లెండింగ్ రేటు 14.5 శాతానికి చేరుకోగా స్టాండింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 13.5 శాతానికి చేరుకుంది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. 2022 మార్చిలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 18.7 శాతానికి చేరుకుంది. విదేశాల నుంచి నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకునేందుకు ఆ దేశం దగ్గర డాలర్ల నిల్వలు లేని పరిస్థితి నెలకొంది. The Central Bank of Sri Lanka Significantly Tightens its Monetary Policy Stance to Stabilise the Economy SDFR - 13.50% SLFR - 14.50% For more details - https://t.co/WuCePp1dIA#SriLanka #CBSL #MonetaryPolicy pic.twitter.com/HquLxaaxL6 — CBSL (@CBSL) April 8, 2022 చదవండి: సంక్షోభంతో బెంబేలెత్తిన ఇన్వెస్టర్లు.. ఆకస్మాత్తుగా కొలంబో మార్కెట్ క్లోజ్ -
ఎఫ్డీలపై ఎస్బీఐ శుభవార్త
సాక్షి, ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. పెంచిన వడ్డీ రేటు 0.05-0.10 శాతం లేదా 5- 10 బేసిస్ పాయింట్లు మధ్య ఉంటుంది. కోటి రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల మాత్రమే పెంచిన రేట్లు వర్తిస్తాయి. మరిన్ని వివరాలు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో లభ్యం. మరో వారం రోజుల్లో ఆర్బీఐ పాలసీ రివ్యూ జరగనున్న నేపథ్యంలో ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపును ప్రకటించడం గమనార్హం. -
పీఎఫ్‌పై వడ్డీ 8.55 శాతం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్‌పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని నిర్ణయించి ఫిబ్రవరిలోనే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది. అయితే, ఆర్థిక శాఖ ఆమోదం ఆలస్యం కావటంతోపాటు ఈనెల 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల నియమావళి అడ్డుగా నిలిచింది. వచ్చే వారంలో ఎన్నికల సంఘం అనుమతి రాగానే కార్మిక శాఖ ప్రకటన చేస్తుందనీ, ఆ వెంటనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌వో చందాదారులకు చెల్లిస్తున్న అతి తక్కువ వడ్డీ ఇదే కావటం గమనార్హం. -
300 పాయింట్లు పతనం
మార్కెట్ అప్డేట్ * 27,209కు దిగిన సెన్సెక్స్ * అమెరికా వడ్డీ పెంపు భయాలు * లాభాల స్వీకరణ ఎఫెక్ట్ కూడా * ఎన్ఎస్ఈ టర్నోవర్ రికార్డు అంచనాలకంటే ముందుగానే అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చునన్న ఆందోళనలు దేశీ స్టాక్ మార్కెట్లను మరోసారి పడగొట్టాయి. క్యూ3లో యూఎస్ జీడీపీ 5% పుంజుకోవడం దీనికి కారణం కాగా, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ ముగింపు రోజు కావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడం కూడా జతకలిసింది. వెరసి సెన్సెక్స్ 298 పాయింట్లు పతనమైంది. వారం రోజుల కనిష్టమైన 27,209 వద్ద ముగిసింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 93 పాయింట్లు జారి 8,200 కీలక స్థాయి దిగువకు చేరింది. 8,174 వద్ద నిలిచింది. పీఎస్‌యూలు డీలా సెన్సెక్స్ దిగ్గజాలలో పీఎస్‌యూలు భెల్, ఎన్టీపీసీ, గెయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా 3-2% మధ్య నీరసించా యి. ఈ బాటలో ఇతర బ్లూచిప్స్ హెచ్డీఎఫ్సీ ద్వయం, డాక్టర్ రెడ్డీస్ 2-1% మధ్య క్షీణించాయి. డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల ము గింపు నేపథ్యంలో ఎన్ఎస్ఈ ఈక్విటీ డెరివేటివ్స్‌లో రికార్డు టర్నోవర్ జరిగింది. ఇండెక్స్ ఆప్షన్స్‌లో నమోదైన రూ. 4,53,562 కోట్లతో కలిపి ఎఫ్‌అండ్‌వోలో మొత్తం రూ. 5,66,898 కోట్లు జరిగింది. ఇక నగదు విభాగంలోనూ రూ. 22,159 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా, అల్ట్రాటెక్‌కు 2 సిమెంట్ ప్లాంట్లను విక్రయించనున్న జేపీ అసోసియేట్స్ షేరు 9% జంప్‌చేసింది. మెడికల్ పరికరాల రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయడంతో ఆప్టో సర్క్యూట్స్ 16% దూసుకెళ్లింది. నేడు మార్కెట్లకు సెలవు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం(25న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు.