ఉద్యోగులకు పీఎఫ్ అందించే ప్రయోజనాలివే!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఇటీవల ప్రావిడెంట్ ఫండ్ క్లయిమ్స్ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలతో ఉద్యోగుల ముందుకు వస్తోంది. క్లయిమ్స్ ను ఆన్ లైన్ లోనే దరఖాస్తు కోవడం నుంచి పేమెంట్లను ఎలక్ట్రానిక్ గా ట్రాన్స్ ఫర్ చేసుకునేలా అన్ని సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ఓ కొత్తగా తీసుకొస్తున్న ఈ సులభతర మార్గాలతో నాలుగు కోట్ల మంది ఉద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఈపీఎఫ్ఓ ఇటీవల తీసుకొచ్చిన, తీసుకురాబోతున్న ప్రయోజనాలివే...
చెల్లింపులను ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ఫండ్ ట్రాన్సఫర్ ద్వారా చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.. నెలవారీ ఈఎంఐ చెల్లించుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) అందుబాటులోకి తీసుకొస్తోంది. వెనువెంటనే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసుకోవడం, సులభతరంగా ట్రాకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం వంటి ప్రక్రియలను ప్రవేశపెట్టనున్నట్టు రిటైర్ మెంట్ బాడీ పేర్కొంది. దీంతో 4 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లకు, 54 లక్షల మంది పెన్షనర్లకు ఎంతో మేలు చేకూరనుందని తెలిపింది.
ఈ-గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా, ఎవరైతే యూఏఎన్( రిటైర్ మెంట్ ఫండ్ బాడీ జారీచేసే యూనివర్సల్ అకౌంట్ నెంబర్), కేవైసీ(ఆధార్)లను యాక్టివేట్ చేసుకుంటారో ఆ సబ్ స్క్రైబర్లకు ఆన్ లైన్ లోనే పీఎఫ్ ఫైనల్ సెటిల్ మెంట్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. రిటైర్మెంట్ బాడీ జారీచేసే ఈ యూఏఎన్ నెంబర్ తో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకో ఎంప్లాయర్ కు పోర్టబులిటీ పెట్టుకోవచ్చు.
రిటైర్మెంట్ సంస్థ క్షేత్రస్థాయి కార్యలయాలకు, ఎంప్లాయర్స్ వద్దకు వెళ్లకుండానే ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లు తమ మొత్తం పీఎఫ్ ప్రక్రియను ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. క్లయిమ్ ను సమర్పించిన వెంటనే ఈపీఎఫ్ఓ డేటాబేస్ నుంచి ఫండ్స్, అప్లయ్ చేసిన దరఖాస్తుదారుడి బ్యాంకు అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి.
విత్ డ్రాయల్స్ లో కూడా నిబంధనలను ఈపీఎఫ్ఓ సరళీకరం చేసింది. స్వీయ ధృవీకరణతోనే అడ్వాన్స్ క్లయిమ్ ను ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. అంతేకాక డౌన్ పేమెంట్ కోసం 90 శాతం పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు తెలిపింది.