ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అకౌంట్‌లో ఉన్న డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటుపైన కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8% వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.
2022-23లో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.15 శాతం, 2022-21 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 8 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రస్తతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పెట్టుబడులపై రాబడిని మెరుగుపరిచేందుకు స్టాక్స్‌లో పెట్టుబడిని ప్రస్తుత 10% నుంచి 15%కి పెంచడానికి EPFO బోర్డు నుంచి ఆమోదం పొందాలని కూడా యోచిస్తోంది.
ప్రభుత్వం ఎన్నికల సంవత్సరం కావడంతో, ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్లపై స్థిరమైన రాబడి రేటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఎటువంటి ఎదురుదెబ్బలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న రేట్లకు అనుగుణంగా చూసే అవకాశం ఉందని EPFO బోర్డు సభ్యుడు వెల్లడించారు.
2013-14 నుంచి 2022-23 వరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు 8 శాతానికి రాలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వడ్డీ రేటు 8 శాతంగా నిర్ణయిస్తే.. గత పది సంవత్సరాలకంటే తక్కువ వడ్డీ రేటు ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఇదీ చదవండి: సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్!
Comments
Please login to add a commentAdd a comment