న్యూఢిల్లీ : గుడ్‌న్యూస్..ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) తన నిర్ణయం మార్చుకుంది. రూ.10 లక్షలకు పైన ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. అంతకముందు ఈ విత్‌డ్రాను కేవలం ఆన్‌లైన్‌గా మాత్రమే చేపట్టాలని ఈపీఎఫ్‌ఓ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగితరహిత సంస్థగా ఈపీఎఫ్‌ఓను మార్చడానికి, ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌ఓ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌గా కూడా ఈ క్లయిమ్స్‌ను చేపట్టవచ్చని పేర్కొంది. 2018 ఏప్రిల్ 13న ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ ఎంప్లాయూస్, పెన్షన్ స్కీమ్ విత్‌డ్రాయల్స్‌ను సమీక్షిస్తూ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం రూ.10 లక్షలకు పైన ఉన్న అన్ని పీఎఫ్ క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా సమర్పించే దరఖాస్తుల ద్వారా కూడా సెటిల్ చేయాలని పేర్కొంది. అదేవిధంగా ఈపీఎస్ విషయంలో రూ.5 లక్షలకు పైన ఉన్న పీఎఫ్ క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా చేపట్టవచ్చని తెలిపింది.
ఆన్‌లైన్‌గా క్లయిమ్ చేసుకునేటప్పుడు ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కేసుల్లోనూ ఈ ఆఫ్‌లైన్ క్లయిమ్స్‌ను చేపట్టనున్నారు. ఆఫ్‌లైన్‌గా సమర్పించిన దరఖాస్తులను ఈపీఎఫ్‌ఓ, ఎంప్లాయర్స్(ఆర్గనైజేషన్స్)కు ఆన్‌లైన్‌గా పంపించనుంది. దీంతో తుదిపరి వెరిఫికేషన్ చేపట్టి, మోసాలను తగ్గించవచ్చని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. అయితే ఎంప్లాయర్స్ పొందిన ఆ క్లయిమ్ దరఖాస్తులను ఆమోదిస్తున్నటా? లేదా తిరస్కరిస్తున్నటా? తెలుపుతూ మూడు రోజుల్లోగా తిరిగి ఈపీఎఫ్‌ఓ ఆఫీసుకు పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment