employers
-
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్‌తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? -
భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు!
భారతదేశంలో ఉద్యోగార్థుల అవసరాలు, ప్రాధాన్యతలపై ప్రముఖ సంస్థ లింక్డ్ఇన్ అధ్యయనం (Linkedin Research) చేసింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నివేదికలో.. వృత్తి పరమైన నైపుణ్యాల్ని పెంపు(Upskilling), పని- పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్, ప్రమోషన్స్.. లాంటి వాటిని ఉద్యోగులు కోరుకుంటున్నారు. చాలా రంగాలలోని ఉద్యోగులు అధిక ప్రాధాన్యతల గురించి మాట్లాడుతూ.. వారి కెరీర్లో అభివృద్ధి, ఉద్యోగాలలో మార్పు అవసరమని పేర్కొంది. 2 లేదా మూడు సంవత్సరాల పాటు ఒకే రోల్ ఉంటున్న వారితో పోల్చితే, ప్రమోషన్ వచ్చిన వారు అదే సంస్థలో కొనసాగే అవకాశం 10 శాతం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా నైపుణ్యాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలను అనుకుంటున్నారు. ఎందుకంటే 2015 తర్వాత దేశంలో ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ విషయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు సుమారు 29 శాతం మేర ఉండగా, 2025 నాటికి 50శాతం వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు ఉద్యోగుల అనుభవం కంటే పని తీరు, టాలెంట్లు ఉన్నవారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. ప్రస్తుతం భారత్‌లో (51%) యజమానులు.. ఉద్యోగుల సహకారాన్ని, నాలెడ్జ్ షేరింగ్‌ని ప్రోత్సహిస్తున్నారని తెలిపింది. ఉద్యోగులు తమ తోటి సిబ్బందితో సత్సంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఇది వారి టీమ్స్ బలోపేతం చేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని, తద్వారా కంపెనీ కూడా కలిసొచ్చే అంశంగా మారుతుంతని నివేదిక చెప్తోంది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. పని ఒత్తిళ్లు ఎక్కువే.. పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్ సూచించింది. -
రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త!
రూ.15 వేల కంటే తక్కువ వేతనం గల ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన(ఏబీఆర్‌వై) పథకం కింద ఉద్యోగులు రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని మార్చి 31, 2022 వరకు పొడగించినట్లు తెలిపింది. ఈ మేరకు ఏబీఆర్‌వై కింద రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని వచ్చే ఏడాది 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్ఓ ఒక ట్వీట్ చేసింది. అధికారిక రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనను తీసుకొచ్చింది. రూ.15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారు ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు. ఏబీఆర్‌వై పథకం: కీలక ముఖ్యాంశాలు.. 1) ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న అర్హత కలిగిన సంస్థల యజమానులు, కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. 2) కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రెండు సంవత్సరాల వరకు ప్రోత్సాహకాలను అందుకుంటారు. 3) చెల్లింపు రూపంలో ఇన్సెంటివ్ ఎ) 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. బి) 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. 4) నిర్దిష్ట సంఖ్యలో కొత్త ఉద్యోగులను చేర్చుకున్న సంస్థలకు మాత్రమే పైన ప్రోత్సహాకాలు అందుతాయి. 5) సెప్టెంబర్ 2020 కొరకు ఈసిఆర్లో కంట్రిబ్యూటరీ ఈపిఎఫ్ సభ్యుల సంఖ్యగా ఉద్యోగుల రిఫరెన్స్ బేస్ తీసుకోబడుతుంది. 6) రూ.15000 కంటే తక్కువ నెలవారీ వేతనం గల కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 24 నెలల వరకు ఈ ప్రయోజనాలను పొందుతారు. 7) అక్టోబర్ 1, 2020 తర్వాత ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సంస్థ కొత్త ఉద్యోగుల కూడా పలు ప్రయోజనాలను పొందుతారు. ఏబీఆర్‌వై పథకం ఏబీఆర్‌వై కింద1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. 4 డిసెంబర్ 2021 నాటికి, 39.73 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు పొందారు. వారి అకౌంట్లలో కూడా రూ.2612.10 కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. Registration facility under #ABRY has been extended till 31.03.2022. ABRY के तहत पंजीकरण सुविधा 31.03.2022 तक बढ़ा दी गई है।#EPFO #Employees pic.twitter.com/l9SuskDNQ9 — EPFO (@socialepfo) December 15, 2021 (చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..!) -
2022లోనూ వర్క్‌ఫ్రమ్ హోమ్!!
Work From Home Continue In 2022: ఏడాది ముగింపుతో వర్క్‌ఫ్రమ్ హోంకీ ఎండ్ కార్డు పడనుందని అంతా భావించారు. ఈలోపే కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’ విజృంభణతో భయాందోళనలు తెర మీదకు వచ్చాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులను కంపెనీలు ఎలాగైనా ఆఫీసులకు రప్పించి తీరతాయని, 2022 జనవరి నుంచి ఆఫీసులు కరోనాకి ముందు తరహాలో నడుస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలు సర్వేలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి. గ్రాంట్ థోరంటన్ భారత్ సర్వే ప్రకారం.. దాదాపు 10 కంపెనీల్లో ఆరు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వైపే మొగ్గు చూపిస్తున్నాయి. సుమారు 65 శాతం కంపెనీ మేనేజ్మెంట్లు.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. కరోనా భయంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేందుకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే కంటిన్యూ చేయాలని నిర్ణయించాయి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్, రవాణా, ఆతిథ్య, వైద్య, ఇతరత్ర అత్యవసర సర్వీసులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం నుంచి దూరంగానే ఉన్నాయి. మొత్తం 4, 650 రియాక్షన్ల ఆధారంగా ఈ సర్వేను పూర్తి చేసింది గ్రాంట్ థోరంటన్. మరోవైపు కంపెనీలు నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోం వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ప్రొడక్టివిటీ పెరగడం, ఆఫీస్ స్పేస్ భారం తగ్గుతుండడంతో వాళ్లకు తగ్గట్లు నడుచుకోవాలని భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి జూన్, 2022 వరకు వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగించాలని తొలుత అనుకున్న కంపెనీలు, తాజా నిర్ణయం ప్రకారం.. 2022 మొత్తం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కొన్ని బెనిఫిట్స్‌ను దూరం చేస్తూనే.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించాలని కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన పూర్తిస్థాయిలో ఉద్యోగుల్ని రప్పించాలని భావిస్తున్న కంపెనీలు కొన్ని మాత్రమే. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్! ఇప్పటికే కొందరు ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ఫ్రమ్ హోంను ఇస్తూ.. హైక్‌లు, ఇతర వెసులుబాటులను దూరం చేశాయి. చిన్న, మధ్యస్థ కంపెనీలతో పాటు ఇదే తరహాలో టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ప్రణాళికలు వేస్తున్నాయి. టీసీఎస్ 95 శాతం ఉద్యోగుల్ని వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగించాలని, అత్యవసర సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు భారత్‌లోని ఉద్యోగులకు ఇప్పటికే సంకేతాలు అందించాయి కూడా. పర్యవేక్షణ కోసం! స్మార్ట్‌హోం డివైజ్‌లను రంగంలోకి దించుతుండడంతో దాదాపు ఇది ఖరారైనట్లేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘హోం ఆఫీసుల’లో ఉద్యోగుల పర్యవేక్షణ కోసమే వీటిని తీసుకురాబోతున్నట్లు, ఈ మేరకు అమెజాన్, మెటా, గూగుల్ సైతం దరఖాస్తులకు ఉద్యోగుల నుంచి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఒకవేళ దరఖాస్తులు రాకున్నా.. ప్రొత్సాహాకాలను మినహాయించుకుని ఈ ఎక్విప్మెంట్ అందించాలని(తప్పనిసరి) భావిస్తున్నాయి. ఏది ఏమైనా వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపుపై డిసెంబర్ మొదటి వారంలోగానీ, మధ్యలో వరుసబెట్టి ఒక్కో కంపెనీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. చదవండి: వారంలో 3 రోజులే పని.. ఎలా ఉంటుంది? -
కోవిడ్ సాయానికి పన్ను మినహాయింపు
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా నిలిచిన యాజమాన్యాలు, కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించి బాసటగా నిలిచిన వారిని ప్రోత్సహించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడ్డ ఉద్యోగులను ఆదుకునేందుకు యాజమాన్యాలు చెల్లించిన మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన సూచనల ప్రకారం ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంస్థలు ఇచ్చిన పరిహారం మొత్తంపైనా ఎలాంటి పన్ను వసూలు ఉండదు. అదే విధంగా కరోనా చికిత్స కోసం పలువురికి వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయం చేశారు. ఈ సాయం మొత్తం రూ. 10 లక్షల లోపు వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఆగష్టు 31 వరకు పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించే వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది. అదే విధంగా అక్టోబరు 31 వరకు పన్ను చెల్లించే అవకాశం కల్పించింది. చదవండి : మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం! -
కరోనా కోసం విధుల్లోకి..
-
ఇక నుంచి కొత్త ఫామ్–16
న్యూఢిల్లీ: యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) వివరాలకు సంబంధించి జారీచేసే ఫామ్ –16 సర్టిఫికెట్ ఫార్మాట్‌ను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సవరించింది. హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్–16ను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతల నిరోధమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్‌ను రూపొందించినట్లు ఆ వర్గాలు చెప్పాయి. వివిధ పన్ను పొదుపు పథకాల కింద కోతలు, పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులు, ఉద్యోగులు అందుకునే వివిధ అలవెన్సులు అలాగే ఇతర వనరుల ద్వారా ఆదాయం, పొదుపు ఖాతాలో డిపాజిట్లపై వడ్డీలు, రిబేట్స్, సర్‌చార్జీలు.... ఇలా విస్తృత సమాచారం దీనివల్ల అందుబాటులోకి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసిన సవరిత ఫామ్–16 మే 12వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ తాజా ఫామ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. -
గుడ్‌న్యూస్! నిర్ణయం మార్చుకున్న ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ : గుడ్‌న్యూస్..ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తన నిర్ణయం మార్చుకుంది. రూ.10 లక్షలకు పైన ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. అంతకముందు ఈ విత్‌డ్రాను కేవలం ఆన్‌లైన్‌గా మాత్రమే చేపట్టాలని ఈపీఎఫ్ఓ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగితరహిత సంస్థగా ఈపీఎఫ్ఓను మార్చడానికి, ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌గా కూడా ఈ క్లయిమ్స్‌ను చేపట్టవచ్చని పేర్కొంది. 2018 ఏప్రిల్ 13న ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ ఎంప్లాయూస్, పెన్షన్ స్కీమ్ విత్‌డ్రాయల్స్‌ను సమీక్షిస్తూ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం రూ.10 లక్షలకు పైన ఉన్న అన్ని పీఎఫ్ క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా సమర్పించే దరఖాస్తుల ద్వారా కూడా సెటిల్ చేయాలని పేర్కొంది. అదేవిధంగా ఈపీఎస్ విషయంలో రూ.5 లక్షలకు పైన ఉన్న పీఎఫ్ క్లయిమ్స్‌ను ఆఫ్‌లైన్‌గా చేపట్టవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌గా క్లయిమ్ చేసుకునేటప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కేసుల్లోనూ ఈ ఆఫ్‌లైన్ క్లయిమ్స్‌ను చేపట్టనున్నారు. ఆఫ్‌లైన్‌గా సమర్పించిన దరఖాస్తులను ఈపీఎఫ్ఓ, ఎంప్లాయర్స్(ఆర్గనైజేషన్స్)కు ఆన్‌లైన్‌గా పంపించనుంది. దీంతో తుదిపరి వెరిఫికేషన్ చేపట్టి, మోసాలను తగ్గించవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అయితే ఎంప్లాయర్స్ పొందిన ఆ క్లయిమ్ దరఖాస్తులను ఆమోదిస్తున్నటా? లేదా తిరస్కరిస్తున్నటా? తెలుపుతూ మూడు రోజుల్లోగా తిరిగి ఈపీఎఫ్ఓ ఆఫీసుకు పంపించాలి. -
1,214 మంది ఉద్యోగులు కావాలి
ముందుగా ఔట్ సోర్సింగ్...ఆపై పోస్టుల భర్తీ అత్యధిక ఉద్యోగులున్న జిల్లాగా రికార్డులకెక్కనున్న ఖమ్మం మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇలా... జిల్లాపేరు మంజూరైవి పనిచేస్తున్నది కావాల్సింది ఖమ్మం 3,191 2,631 560 కొత్తగూడెం 2,731 2,077 654 సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు తుదిదశకు చేరుకుంది. జిల్లా నుంచి అందిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించింది. దీని ప్రకారం..ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు కలిపి అదనంగా 1,214 ఉద్యోగులు అవసరం. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అప్పటి వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయించుకోవాలని నిర్ణయించారు. దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన మనుగడలోకి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో నెలరోజుల క్రితమే ఉద్యోగుల పంపిణీపై కసరత్తు మొదలైంది. రెండు జిల్లాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యాశాఖ, ఇంకా ముఖ్యమైన శాఖల్లో జిల్లాస్థాయితోపాటు మండల స్థాయి అధికారుల నియామకానికి సంబం«ధించిన ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. వీటితోపాటు ఇతర శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉన్నారు.. ఇప్పుడు ఎంతమంది అందుబాటులో ఉన్నారు. వారిని ఏ జిల్లాలో భర్తీ చేయాలనే అంశాలతోపాటు ఫర్నిచర్, వాహనాల విభజన దాదాపు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 4,708 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే విభజన నేపథ్యంలో రెండు జిల్లాలకు మొత్తం 5,922 మంది ఉద్యోగులు అవసరం ఉంటుంది. అంటే ఇంకా 1,214 మంది ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేయడం సాధ్యం అయ్యే పని కాకపోవడంతో అప్పటి వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా పనిచేయించుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఆయా జిల్లాల్లోని ఇతర శాఖల్లో ఉన్న ఉద్యోగులు, ఒకే పనితీరు ఉన్న శాఖలను విలీనం చేసి అప్పటి వరకు పనులు చేయించుకోనున్నారు. దశలవారీగా ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాకు 3,191 పోస్టులు మంజూరు కాగా.. ఇప్పుడు 2,631 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఈ జిల్లాలో 560 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఽ కొత్తగూడెం జిల్లాలో 2,ఽ731 పోస్టులు మంజూరు కాగా.. ఇక్కడ 2,077 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా ఇక్కడ 654 మంది ఉద్యోగులు అవసరం ఉంది. వీరిని తర్వాత భర్తీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చి. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేసేది తెలుస్తుంది. ఆర్డర్‌టూ సర్వ్‌పై ఉద్యోగుల్లో అనుమానాలు.. ఆర్డర్‌టూ సర్వ్ పేరుతో తాత్కాలికంగా ఉద్యోగులను విభజిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ప్రక్రియ అయినప్పటికీ ఒకసారి ఆ జిల్లాకు అధికారిని గానీ ఉద్యోగిని గానీ కేటాయిస్తే ఇక ఆ ఉద్యోగి అక్కడికి వెళ్లనని చెప్పకూడదు. ముందుగా తనకు కేటాయించిన ప్రదేశానికి వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ వెసులుబాటును బట్టి ఉద్యోగి అభ్యర్థన మేరకు పాత ప్రదేశానికి వెళ్లవచ్చు. అయితే ఈ విధానంపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్‌టూ సర్వ్ పేరుతో తమను ఎక్కడో కేటాయించి.. తర్వాత తమను పూర్తిస్థాయిలో అక్కడే విధులు నిర్వహించమంటారేమోననే ఆందోళన చెందుతున్నారు. అలా కాకుండా ఉద్యోగులను అడిగి. వారి ఇష్టప్రకారం ఇతర ప్రాంతాలకు పంపించాలని సూచిస్తున్నారు. -
ఫిట్లెసే..
యథేచ్ఛగా తిరుగుతున్న స్కూల్ బస్సులు కండిషన్ లేకపోయినా రోడ్డెక్కుతున్న 127 బస్సులు ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీఏ అధికారుల హడావిడి యాజమాన్యాలకు పట్టదు అధికారులు తొంగిచూడరు ఆందోళనలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు సంగారెడ్డి టౌన్:ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను యథేచ్ఛగా రోడ్డెక్కిస్తున్నాయి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు కండీషన్లో లేకపోవడం, అనుభవం లేని డ్రైవర్లు నడపడం వంటి కారణాలతో సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో వందకుపైగా బస్సులు రోడ్లపై చక్కర్లు కొడుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ రోజు, ఎక్కడ, ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. స్కూళ్లు ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నా జిల్లాలో ఇంకా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో తనిఖీల పేరిట హడావిడి చేసిన ఆర్టీఏ అధికారులు ప్రస్తుతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు స్కూల్ బస్సులు 1,438 ఉండగా అందులో 1,195 ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 116 బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి దాటినందున వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ఇంకా 127 మిగిలినట్టు తెలుస్తోంది. అంటే ఈ బస్సుల్లో ప్రయాణం ప్రమాదకరమని తల్లిదండ్రులు గమనించాలని అధికారులే సూచించారు. నిబంధనలకు అనుగుణంగా లేని ప్రైవేటు పాఠశాలల బస్సుల విషయంలో కఠినంగా వ్యవహారించాలని ప్రభుత్వం చెప్పినా.. వందకు పైగా బస్సులు ఇంకా రోడ్డు మీద తిరుగుతుండడం గమనార్హం. జూలై 2న ఫిట్నెస్ పొందిన సంగారెడ్డిలోని కాకతీయ పాఠశాల బస్సు అనుభవం లేని డ్రైవరు నడపడంతో కొండాపూర్ మండలం అలియాబాద్ శివారులో చెట్టును ఢీకొంది. ప్రాణ నష్టం జరగకపోయినా పదుల సంఖ్యలో చిన్న పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఫిట్నెస్ పొందిన బడి బస్సుల పరిస్థితి ఏ పాటిదో అర్థమవుతోంది. -
ఉదయం 11 వరకే తరగతులు
నిబంధనలు అతిక్ర మించే పాఠశాలలపై చర్యలు డీఈవో నాగేశ్వరరావు హెచ్చరిక చిత్తూరు(గిరింపేట): జిల్లాలో ప్రస్తుతమున్న ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఉదయం 11 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను త నిఖీ చేయడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. వారు 11 గంటలపై అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తార న్నారు. రెండో పేపర్ పరీక్ష ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం 11 గంటలకుపైన పరీక్షలను రాయించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే సంబంధిత ప్రదేశాల్లో వున్న ఎంఈవోలకు, డీవైఈఓలకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పోయాం... మోసం...
* నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారుపై మండిపాటు * నమ్మి నిలువునా మోసపోయామంటున్న యువత * ఉపాధి లేదు సరికదా... భృతికూడా లేదనడం దారుణం... ఉద్యోగం రాకున్నా... భృతిపై ఆశపడ్డా... బాడంగికి చెందిన ఈమె పేరు అనకాపల్లి ఇందిర. గుంటూరులో ఈమె బీపీఈడీని 2015లో పూర్తి చేశారు. దురదృష్టం పీఈటీల నియామకాన్ని ఈ సర్కారు నిలిపేసింది. ఇక చేసేది లేక కానిస్టేబుల్ ఉద్యోగంకోసం యత్నిస్తున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ నిజమే అనుకున్నారు. అసలు విషయం తెలుసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ ఉద్యోగం రాకపోయినా కనీసం నెలకు 2వేలు భృతి వస్తుందని నమ్మాననీ, దానితోనైనా ఏవైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని భావించాననీ... ఇప్పటికీ ప్రతీదానికీ తల్లితండ్రులపైనే అధారపడాల్సి వస్తోందనీ వాపోయారు. ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా... మీరు ఏమీ చదువుకోక పోయినా... నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి కావాలంటే బాబు రావాలి.’ - ఎన్నికల్లో వాడవాడలా టీడీపీ నేతలు చేసిన ప్రచారం. ‘నిరుద్యోగ భృతి పథకమే లేదు... మరి అలాంటపుడు ఎంత భృతి చెల్లించామన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.’ - నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రకటనలూ జిల్లాలో కలకలం సృష్టించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ... నెరవేర్చకపోగా... అలాంటిదేమీ లేదని మంత్రి చెప్పడాన్ని అంతా తప్పుపడుతున్నారు. నిలువునా మోసపోయామని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సర్కారు మోసం మరోసారి బట్టబయలైంది. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిన వైనం తేటతెల్లమైపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ... నిరుద్యోగ భృతి కల్పిస్తామని చేసిన వాగ్దానాలు నమ్మిన జిల్లాలోని 5లక్షల85వేల కుటుంబాలు, 3లక్షల మంది నిరుద్యోగులు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. కొత్త ఉద్యోగాలిస్తానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఆవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగుల్ని ఊడపీకారు. రైతులకు ఎంతో సేవలందించిన ఆదర్శరైతులను అర్ధంతరంగా తొలగించారు. ఉపాధి వేతనదారులకు పని చూపించిన క్షేత్ర సహాయకులను అకారణంగా తీసేశారు. ఇంజినీర్లతో కలిసి పనిచేసిన వర్క్ ఇన్స్పెక్టర్లను రోడ్డున పడేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనైతే ఉన్నపళంగా ఆపేశారు. వారంతా ఇప్పుడు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారి దయనీయంగా బతుకుతున్నారు. నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించారు. ఒక్కొక్కరికీ రూ. 2వేలు చొప్పున నెలకు భృతి అందిస్తామని ఆశ చూపారు. ప్రజలను భ్రమల్లోకి తీసుకెళ్లి ఓట్లేయించుకున్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా పీఠమెక్కాక ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఇదేమంటే అసలు ఆ పథకమే లేదని మంత్రి అడ్డంగా బొంకేశారు. ప్రస్తుతం జిల్లాలో 5లక్షల 85వేల కుటుంబాలు ఉండగా అందులో 2లక్షల మంది వరకు నిరుద్యోగులున్నారు. వారంతా ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డున పడ్డ 55వేల మంది కార్మికులు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులకూ భరోసానివ్వడంలేదు. ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10జూట్‌మిల్లులు ఇప్పటికే మూతపడటంతో 20వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పిల్లల్ని పోషించలేక, చదివించుకోలేక కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఆందోళనకు గురై హఠాన్మరణం చెందుతున్నారు. ఇక, ఫెర్రో పరిశ్రమలు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 12పరిశ్రమలు మూతపడ్డాయి. 25వేల మంది పనిలేక అలమటిస్తున్నారు. చిన్న చితకా పరిశ్రమలు మరో 20వరకు మూతపడ్డాయి. వీటిలో పనిచేసిన 10వేల మంది పనిలేక అవస్థలు పడుతున్నారు.దయనీయంగా బతుకుతున్నారు. మోసపోయిన నిరుద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తారన్న ఆశతో గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారు గణనీయంగా పెరిగారు. దాదాపు 54వేల మంది జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఒక్క ఉద్యోగం తీయలేదు. నిరుద్యోగ భృతికి సంబంధించి కనీసం మాట్లాటలేదు. ఎందుకింత మోసమని నిరుద్యోగులంతా మండిపడు తున్నారు. -
సర్కార్ దగా !
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా.. మీరు ఏమీ చదువుకోపోయినా నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి’. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’..ఇదీ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు పలికిన చిలక పలుకులు. జాబు రావాలంటే బాబు రావాలి అంటూ ఎక్కడ చూసినా ప్రకటనలు.. టీవీల్లో ఒకటే హోరు.. గోడలపై రాతలు.. ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.రెండు వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు బాబు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. రాష్ర్టంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పించారు. దీంతో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. ఉద్యోగం లేదు..కనీసం భృతి అయినా ఇస్తారేమోనని కుటుంబసభ్యులు ఆశపడ్డారు. ఆ ఆశని సర్కార్ వమ్ము చేసింది. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లా నిరుద్యోగులు తక్షణమే ఆయన గద్దె దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. * నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు భృతి అంటూ హామీ * ఎన్నికల సమయంలో వాగ్దానం * అసెంబ్లీ సాక్షిగా మాటమార్చిన మంత్రి * పోరాటం తప్పదని హెచ్చరిక * జిల్లాలో 1.50 లక్షల నిరుద్యోగులు * మండిపడుతున్న నిరుద్యోగులు * నిరుద్యోగ భృతిపై మోసపూరిత ప్రకటన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిరుద్యోగ భృతిపై మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నయవంచనకు పాల్పడడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో లక్షన్నర మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు విడుదలవుతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలొస్తే బతుకులు బాగుపడుతాయని సుమారు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కనీసం భృతి కల్పిస్తే కొంతయినా ఆదుకున్నట్టు ఉంటుందని నిరుద్యోగుల తల్లిదండ్రులంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం సాక్ష్యాత్తూ జిల్లా మంత్రే నిరుద్యోగ భృతిపై మాట మార్చడంపై తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇవిగో ఉదాహారణ జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ కార్యాలయంలో ఉన్న గణాంకాలు చూస్తుంటే నివ్వెరపోక తప్పదు. ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజీలో సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య గత ఫిబ్రవరి నాటికి 51,946 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 9,200 మంది కాగా బీసీలు 36,738, మహిళలు 13,609మంది. 38 వేల మందికి పైగా పురుష నిరుద్యోగులున్నారు. మూడేళ్ల తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే వారి వివరాలు మరికనిపించవు. అలాంటివారు వేలల్లో ఉన్నారు. పీజీ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలు ఇక్కడ లభ్యం కావు. విశాఖలోని ఏయూలో ఎంప్లాయీమెంట్ గెడైన్స్ బ్యూరోలో పొందుపర్చారు. ఇక్కడ కేవలం డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీఈడీ, డీఈడీ సహా ఇతర టెక్నికల్ అభ్యర్థుల వివరాలే నమోదయ్యాయి. 2014లో 13,252 మంది, 2015లో 9,011 మంది, 2016లో ఇప్పటివరకు 2048 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఏటికేడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని అధికారులే చెబుతున్నారు. ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో మరెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్కే లేదు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస పోతున్నవారి సంఖ్య ఏటా లక్షమంది అని సాక్ష్యాత్తూ జిల్లా యంత్రాంగమే ప్రకటించింది. ఉద్యోగం లేకపోవడంతో గుజరాత్ తీర ప్రాంతానికి బోట్లలో పనిచేసేందుకు ఎంతోమంది వెళ్లిపోతున్నారు. పదోతరగతి తరువాత.. జిల్లాలో పదోతరగతి పూర్తిచేసి ఉపాధికల్పనాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్న వారి సంఖ్యే 13,323 మంది ఉన్నారు. ఇంటర్ 11,916, డిగ్రీ 7,361, స్టెనోగ్రాఫర్లు 341, టైపిస్టు 1474, బీఈడీ 2,722, డీఈడీ 678, అన్ని వర్గాల డిప్లమో పూర్తిచేసిన వాళ్లు 1679, ఏఎన్ఎం, స్టాఫ్‌నర్స్‌లు 1060, ఐటీఐ 5,713, ఎంఎల్జే తరహా 1145, అన్‌స్కిల్డ్ (పదోతరగతి లోపు) 4537 మంది అభ్యర్థులు తాము ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని, ఏదైనా అవకాశం వస్తే తెలియజేయాలని రిజిస్ట్రేషన్ ద్వారా విన్నవించుకున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా ఇటు ఉద్యోగమూ లేక, అటు నిరుద్యోగ భృతీ అందక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చడంపై ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అవగాహనా లేదు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడే ఉపాధి కల్పన, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. రెండేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఆయన ఒక్క హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉండి పోరాడాల్సిన వ్యక్తే అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో తాము చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని పదేళ్ల నుంచీ రిజిస్టర్ చేయించుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరి గూర్చి ఆలోచించలేకపోయిన మంత్రి మోసపూరిత ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. బాబు గద్దె దిగాలి నిరుద్యోగుల ఓట్లతో అధికారం తెచ్చుకున్న చంద్రబాబు తక్షణమే గద్దె దిగాలి. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేనివాళ్లకు నెలకు రూ.2వేల భృతి అంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలిచ్చి ఇప్పుడు ఆ పథకమే లేదంటారా? అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల ప్రకటించిన బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు భరోసా కల్పించలేకపోయారు. జిల్లాలో లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.టీడీపీ సర్కార్ గద్దె దిగేవరకు పోరాటం చేస్తాం. - తలసముద్రం సూర్యం, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. చంద్రబాబు దయతో రోడ్డునపడి తిరుగుతున్నాం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తాడని ఆశతో గెలిపిం చాం. ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. నేను డిగ్రీ పూర్తి చేసి ఏడేళ్లయింది అప్పటి నుంచి కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు ప్రిపేరవుతున్నా. కరెక్టుగా అన్ని విభాగాల్లోను సరైన శిక్షణ పొందానన్న సమయంలో చంద్రబాబు అధికారం చేపట్టడంతో ఉద్యోగాలు తీయక రోడ్డున పడి ఉపాధి కోసం తిరగాల్సి వస్తోంది. - ఎం.శ్రీనివాసరావు, నిరుద్యోగి, గుజరాతీపేట నూతన పరిశ్రమల జాడే లేదు రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు బూట కపు మాటలు చెబుతున్నారే తప్పా ఎక్కడా పరిశ్రమలు రాలేదు. దీంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. బీటెక్ పట్టాలు పెట్టెలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి ఉద్యోగాలు ఇవ్వడానికి చొరవ చూపిస్తే బాగుంటుంది. - ఆర్.శివ, బిటెక్ విద్యార్థి, శ్రీకాకుళం. బాబు వైఖరి తెలియనిది కాదు చంద్రబాబు ద్వంద్వవైఖరి తెలియనిది కాదు. తొమ్మిదేళ్లు పా లించి ప్రజలను హింసపెట్టా రు. ఇటీవల ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయానని, ప్రజా సంక్షేమమే ధ్యేయమని నమ్మబలి కారు. గద్దెనెక్కాక మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు. - కర్నేన గౌరినాయుడు, నిరుద్యోగి, రాజాం -
ఓపిక లేకున్నా ఉద్యోగానికి ఎందుకెళ్తారో తెలుసా?
లండన్: ఆరోగ్యం బాగోలేకపోయినా, ఒంట్లో సత్తువ లేకున్నా కొన్ని భయాల కారణంగానే నేటి తరం ఉద్యోగాలకు వెళ్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అందులో ప్రధాన కారణాలుగా ఉద్యోగాలకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటం, ఒత్తిడి, అభద్రతా భావం, వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలు వారిని విధుల నిర్వహణకు గైర్హాజరు కాకుండా చేస్తాయట. అసలు కొంతమంది వ్యక్తులు చిన్న జబ్బులు చేసినా, రోగంతో బాధపడుతున్నా అవన్నీ పట్టించుకోకుండా ఎందుకు ఉద్యోగానికి వెళుతుంటారో అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అనే విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మారియెల్లా మిరాగిలియా ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా పై మూడు కారణాలు గుర్తించిన ఆయన ఫలితాలు కూడా వివరించారు. 'ఆరోగ్యం బాగాలేనప్పుడు పనిచేస్తుండటం వల్ల ఏ పని చేస్తున్నామో దానిపై ప్రతికూల దృక్పథం ఏర్పడే ప్రమాదం ఉంది.పనిమధ్యలో విరమించుకునే అవకాశం కూడా ఉంది. ఇవి తెలిసినా కూడా చాలా మంది ఉద్యోగులు అలాగే తమ విధులకు హాజరవుతుంటారు. అయితే, ఇలా చేయడం కొందరికి స్ఫూర్తి దాయకంగా కనిపిస్తుంటుంది. మరింత ముందుకు వెళ్లేలా పనిచేయాలని అవతలివారికి అనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా విధులు తప్పక నిర్వర్తించాలనే బాధ్యతను గుర్తు చేస్తుంటుంది' అని ఆయన తెలిపారు. ఈ అధ్యయనం కోసం ఆయన మొత్తం 61 అధ్యయనాలు పూర్తి చేశారు. ఈ అధ్యయనాల్లో మొత్తం 1,75,960మంది పాల్గొన్నట్లు తెలిసింది. -
జీతగాళ్లు దొరకని తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీతగాళ్లు కావాలంటే దొరకని పరిస్థితి రావాలని పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆకాంక్షించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్య వంటి వాటిలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్య, ఉపాధి రంగాల్లో హామీలు- నిర్లక్ష్యం’ అంశంపై శనివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్యర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, భాగ్య నాయక్, రమేశ్ రెడ్డి, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, కె.నాగేశ్వర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చేశారు. కాషాయీకరణకు బీజేపీ కుట్ర: కంచె ఐలయ్య కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి పేదలకు విద్యను దూరం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. విద్యను కాషాయీకరణ చేసే దురాలోచనలో ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 వేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ప్రజలంతా ఇంగ్లిష్ విద్యను చదువుకుంటే కేసీఆర్‌కు, దొరలకు జీతగాళ్లు దొరకరనే భయం ఉంది. చరిత్రను వక్రీకరిస్తున్నారు: ప్రొ. భాగ్య నాయక్ చరిత్రను కేంద్రం వక్రీకరిస్తోంది. పుష్కరాలకోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం టీచర్లను నియమించలేకపోతోంది. నిర్బంధ విద్య అమలు చేయాలి: విశ్వేశ్వరరావు ప్రతీ వ్యక్తికి ఉచితంగా నిర్బంధ విద్యను అమలుచేయాలి. రాష్ట్రంలో విద్యావిధానం వల్ల పేదలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. 22 వేల పాఠశాలల్లో మంచినీటి సౌకర్యంలేదు.. 12వేల బడుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది. విద్య, ఉద్యోగాలపై శ్వేతపత్రం: కె.నాగేశ్వర్ విద్య, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలున్నా వాటిని భర్తీచేయడం లేదు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి. సమావేశంలో చేసిన తీర్మానాలు.. ⇒ కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి. ⇒ రీయింబర్సుమెంటు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. ⇒ జాతీయ విద్యావిధానాన్ని తీసుకురావాలి. ⇒ విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఆపాలి. -
ఫీజుల నియంత్రణకు ప్రాణాలే ఫణంగా
ఉతన్య పాఠశాల ఎదుట ఆందోళన బీసీ సంక్షేమ సంఘం నేత ఆత్మహత్యాయత్నం సంగారెడ్డిలో ఉద్రిక్తత సంగారెడ్డి క్రైం/రూరల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయని బీసీ సంఘం నేత గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. అయినా ప్రభుత్వంలోగానీ, అధికార యంత్రాంగంలోగానీ, పాఠశాలల యాజమాన్యాల్లో గానీ స్పందన రాలేదు. దీంతో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టేందుకు ప్రయత్నించాడు. పాఠశాల వద్ద ఉద్రిక్తత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడన్న వార్త పట్టణంలో దావాణంలా వ్యాపించడంతో ఆ సంఘం నాయకులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు శ్రీచైతన్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ఫీజులను నియంత్రించడంలో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి సంగారెడ్డి రూరల్ ఎస్ఐ బాలస్వామి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన శ్రీచైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
అనుమతిలేని 115 స్కూళ్లకు నోటీసులు
- 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలన్న విద్యాశాఖ - వివరణ సంతృప్తికరంగా లేకుంటే సీజ్ - గుర్తింపులేనివన్నీ నగర శివారులోనే.. అనుమతిలేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా ఝళిపించింది. జిల్లా వ్యాప్తంగా 115 పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్నట్లు గుర్తించిన జిల్లా విద్యాశాఖ.. ఆయా యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి అనుమతిలేకుండా పాఠశాలలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇవన్నీ నగర శివారు మండలాల్లోనే ఉండడం గమనార్హం. జిల్లాలో 2,650 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మండలాల వారీగా ఈ పాఠశాలల అనుమతులపై మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గతనెలలో అధికారులు ప్రత్యేక పరిశీలన చేపట్టారు. ఇందులో 115 పాఠశాలలకు అనుమతులు లేనట్లు గుర్తించారు. దీంతో ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన విద్యాశాఖ.. ఆయా మండల విద్యాధికారులకు నోటీసులను పంపింది. ఈ క్రమంలో గతవారం నోటీసుల జారీని పూర్తిచేసిన అధికారులు.. వాటిని అందుకున్న పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 18లోపు అనుమతి లేని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాల్సి ఉంది. అదేవిధంగా గుర్తింపు ఉన్న పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని తప్పకుండా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని పేర్కొంది. వెసులుబాటు కల్పిస్తూ.. ప్రైవేటు పాఠశాల అనుమతులకు సంబంధించి నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్దేశిత గడువులోగా వచ్చిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం అపరాధ రుసుముతో చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీంతో గుర్తింపులేని పాఠశాల యాజమాన్యాలు ఇప్పుడు కూడా నిర్దేశించిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలావచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలను బట్టి పాఠశాలకు గుర్తింపునిస్తారు. ఇకపై ప్రతి పాఠశాలలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందిగా విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. గుర్తింపు పత్రాన్ని చూసిన తర్వాతే విద్యార్థులను బడిలో చేర్పించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. మూతబడే.. గుర్తింపు లేని పాఠశాలల వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్దేశిత గడువులోగా సరైన రీతిలో స్పందించకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని పాఠశాలలు 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను చేపట్టాయి. -
నాలుగేళ్లుగా అద్దెల్లేవ్
548 ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు ప్రభుత్వం ఇచ్చేది రూ.250 అది కూడా నాలుగేళ్లుగా పెండింగ్ ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి మచిలీపట్నం/కంచికచర్ల : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు పట్టింది. నాలుగేళ్ల క్రితం పట్టిన ఈ జబ్బును నయం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 548 ఆరోగ్య ఉపకేంద్రాలు ఖాళీ చేయాల్సిన ప్రమాదం ముంచుకొస్తోంది. పేదలకు ప్రాథమిక వైద్యం దూరమయ్యే దుస్థితి దాపురిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 620 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 72 భవనాలను మాత్రమే ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 548 ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు ప్రభుత్వం నెలకు రూ.250 చొప్పున అద్దె మంజూరు చేస్తోంది. వాస్తవానికి ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,200 వరకు ప్రతి నెలా ఏఎన్ఎంలే సొంత డబ్బుతో అద్దె చెల్లిస్తున్నారు. భారీగా బకాయిలు ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కూడా నాలుగేళ్లుగా మంజూరు చేయడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఏడాదికి అద్దె బకాయిలు చెల్లించాలంటే జిల్లా వ్యాప్తంగా రూ.16.44 లక్షలు కావాలి. ప్రభుత్వం ఏటా కేవలం రూ.5 లక్షలకు మించి విడుదల చేయటం లేదు. ఈ నగదు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 25వ తేదీన విడుదల చేసి 31లోపు ఖర్చు చేయాలనే నిబంధన విధిస్తోంది. ఈ సమయంలో ట్రెజరీలో బిల్లులు మార్చుకునేందుకు ఫ్రీజింగ్ అడ్డుగా ఉండటంతో ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించే అవకాశం లేకుండాపోతోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొందని డీఎం, హెచ్‌వో జె.సరసిజాక్షి ‘సాక్షి’కి తెలిపారు. అద్దె భారం ఏఎన్ఎంల పైనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ జీతంలో నుంచి ఆయా కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను సైతం తామే చెల్లిస్తున్నామని పలువురు ఏఎన్ఎంలు వాపోతున్నారు. ప్రస్తుతం గృహాల అద్దె పెరిగిపోవటంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆరోగ్య ఉప కేంద్రాలు ఎక్కడ కొనసాగించాలా.. అని ఏఎన్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దె బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పలువురు ఏఎన్ఎంలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే..
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతల డిమాండ్ హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిందేనని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా తాము సహకరిస్తామని, అయితే, పాత బకాయిలను మాత్రం వెంటనే విడుదల చేయాలన్నారు. హైదరాబాద్‌లో శనివారం తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాల సంఘం వివిధ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీసీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ఫీజు బ కాయిలను చెల్లించడంతోపాటు కౌన్సెలింగ్‌ను త్వరగా ప్రారంభించాలని అన్నిపార్టీలు కోరాయి. మానవతా దృక్పథంలో ఫీజులను చెల్లించాలని, తప్పులకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ రామునాయక్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్నాథరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రావారికి ఆపాలనుకునే క్రమంలో పెడుతున్న నిబంధనలు, 1956 స్థానికత వంటి వాటితో తెలంగాణలోని నిరుపేదలకే అన్యాయం జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. ఈ సమస్యలపై సీఎం దృష్టిసారించాలన్నారు. రేపు అడ్మిషన్స్ కమిటీల సమావేశం హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఏర్పాటైన సెట్స్ కమిటీల సమావేశం ఈనెల 28న నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు హాజరుకానున్నారు. ప్రవేశాల ప్రక్రియపై భవిష్యత్తు కార్యాచరణను ఈ సందర్భంగా నిర్ణయించే అవకాశం ఉంది. -
ఈ ఏడాది జోరుగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొత్త ఉద్యోగాలివ్వనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగానే ఈ ఏడాది కొత్త కొలువులివ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రముఖ జాబ్ సెర్చ్, కెరీర్ పోర్టల్ హెడ్హన్కోస్డాట్కామ్ నిర్వహించిన సర్వేలో 84 శాతానికి పైగా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను భారీగానే పెంచుకోనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య 160 కంపెనీలకు చెందిన హెచ్ఆర్, నియామక నిపుణులపై నిర్వహించిన ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఉద్యోగాలిచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు విస్తరణకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో భారీ సంఖ్యలో కొత్త కొలువులొస్తాయి. కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని 6 శాతం కంపెనీలు, ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని 10% కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 10 శాతానికి పైగా పెరుగుతుందని 55 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిభ గల ఉద్యోగుల కోసం కంపెనీలు పోటీపడనున్నందున వేతనాలు బాగానే పెరిగే అవకాశాలున్నాయి. -
జంకులేని బంకులు
సిటీలో పెట్రోల్ బంకుల బరితెగింపు శివారు ప్రాంతాల్లో మరీనూ... వాహనదారులను నిలువునా దోచేస్తున్న వైనం ఏటా రూ.35 కోట్లకుపైగా మోసం యథేచ్చగా కల్తీ పరిమాణంలోనూ భారీగా చేతివాటం మామూళ్ల మత్తులో తూనికలు కొలతలశాఖ హైదరాబాద్ సంఘటనలతోనైనా కళ్లుతెరవని అధికారులు కంటికి కనిపించని దొంగతనం అంటే ఏంటో తెలుసా..ఎప్పుడైనా చూసి ఉంటారా...లేదంటే సిటీలో పెట్రోల్ బంక్‌ల తీరును నిశితంగా గమనిస్తే ఇట్టే పట్టేయొచ్చు. నిజం..నగరంలో పెట్రోల్ బంకులు బరితెగించేస్తున్నాయి. నిలువు దోపిడీయే లక్ష్యంగా బంక్‌లతో పంపింగ్ చేస్తున్నాయి. నాలుగు చేతులు నిండితేచాలు వాహనదారులు ఏమైపోతే మనకెందుకు అనే ధోరణితో ఏటా కోట్లకు కోట్లు పిండేస్తున్నాయి. బంక్‌కు వచ్చిన వాహనదారులు తొందరగా పెట్రోల్ పోయించుకుపోతే చాలనే కంగారుతో పరోక్షంగా బంక్‌ల అక్రమాలకు బలైపోతున్నారు. ఒక పక్క కల్తీ, మరోపక్క పరిమాణం రూపంలో బంక్‌ల యాజమాన్యాలు భారీగా దిగమింగుతూ చెలరేగిపోతున్నాయి. అడ్డుకునేవాళ్లు లేక, బాధ్యత వహించాల్సిన తూనికలు కొలతలశాఖ బంక్‌లు పోసే మామూళ్ల మత్తులో తేలుతున్నాయి. ఏటా రూ.35 కోట్లకుపైగా జరుగుతున్న ఈ దోపిడీకి అంతంలేకుండా పోతోంది. మేమంతే...అడ్డుకునేవాళ్లేరి? అన్ని కంపెనీలవి కలిపి నగరంలో మొత్తం 72పెట్రోలు బంక్‌లున్నాయి. వీటిలో చాలా బంకులు అడ్డగోలుగా బరితెగించేస్తున్నాయి. నిబంధనలకు పెట్రోలొదిలి అందినకాడికి దోచుకుంటున్నాయి. వాస్తవా నికి వాహనదారుడెవరైనా బంక్‌కు వస్తేనిక్కచ్చి కొలతతో ఇంధనం పోయాలి. కానీ అడ్డగోలు మాయాజాలం లెక్కలతో తక్కువ పరిమాణం పెట్రోలుతో దోచేస్తున్నాయి. శివారు ప్రాంతంతోపాటు జాతీయరహదారిపైనున్న పదులసంఖ్యలోని పెట్రోల్ బంకులు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. లీటర్ ఇంధనం కొట్టాల్సినచోట పరిమాణం తగ్గించి పంప్ చేస్తున్నాయి. ఇలా నిత్యం వందల వాహనాల్లో ఇంధనం నింపి ఏటా కోట్లలో వెనకేసుకుంటున్నాయి. కొన్ని బంక్‌లు తక్కువ పరిమాణంలో ఇంధనం నింపి ఎక్కువ కొట్టినట్టు తప్పుడు మీటర్లతో మాయచేస్తోన్న సంఘటనలు ఇటీవల రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో బయట పడ్డాయి. సరిగ్గా ఇటువంటి దోపిడీకూడా నగరంలో యథేచ్చగా జరుగుతోంది. పేరుకు మీటర్ రీడింగ్ సక్రమంగానే కనిపించినా ట్యాంకులో మాత్రం అంత ఇంధనం పడడంలేదు. విషయం తెలియక, బంక్‌ల బరితెగింపు అర్థంకాక వినియోగదారులు చేసేదిలేక మళ్లీ ఇంధనానికి అక్కడకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేవలం కొన్ని బంక్‌లు మినహా చాలావి ఇదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ కల్తీచేసి విక్రయిస్తూ వేలాది వాహనాల జీవిత కాలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏదైనా లారీ 100 లీటర్లు డీజిల్ కొట్టిస్తే ట్యాంకులో పడేది కేవలం 9వేల మిల్లీలీటర్ల వరకు పరిమాణం తగ్గించేస్తున్నారు. అంటే సుమారుగా 9లీటర్లకుపైగానే మోసం జరుగుతోంది. ఈ విధంగా నిత్యం నగరం, చుట్టుపక్క ప్రాంతాల్లో వేలాది లారీలు వందలాది లీటర్లు ఇంధనం కొట్టిస్తాయి. ఈ విధంగా ఏటా కోట్లలో వీటినుంచి పిండేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టించుకునే ఇంధనంలో అయిదు లీటర్లకు 100ఎంఎల్ వరకు తగ్గించేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అయితే యథేచ్చగా మీటర్ ట్యాంపరింగ్ జరుగుతోంది. అయిదు లీటర్లు పెట్రోలుకు నాలుగు లీటర్లే కొట్టినా మీటర్ రీడింగ్ మాత్రం సరిగ్గానే చూపిస్తున్నాయి. వాస్తవానికి పెట్రోల్ బంక్‌ల మాయాజాలాన్ని జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులు పట్టుకుని వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ నగరంలో మాత్రం ఆశాఖ పనిచేస్తోన్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిసార్లు నెలనెలా, వివిధ సందర్భాల్లోనూ, నిబంధనలన్నీ సరిగ్గా అమలవుతున్నాయన్న సర్టిఫికెట్, స్టాంపింగ్ వేసే సమయాల్లో వీటినుంచి అందినకాడికి దోచేస్తున్నారు. దీంతో అధికారులు తమ జోలికి రారనే ధైర్యంతో అడ్డగోలుగా బరితెగించేస్తున్నారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్‌లపై ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. కానీ ఇదెక్కడా అమలు కావడంలేదు. నగరంలో భారీగా బంక్‌లు దోచేస్తుంటే అధికారులు మాత్రం తమ తనిఖీల్లో కేవలం అయిదు లీటర్లకు 30నుంచి 40 ఎంఎల్ మాత్రమే పరిమాణం తగ్గిస్తున్నారని చెప్పడం విశేషం. మరో పక్క ప్రతి పెట్రోల్ బంక్ విక్రయించే ఇంధన శాంపిళ్లను బంక్ వద్ద ప్రదర్శించాలి. దాన్ని తరచూ అధికారులు తనిఖీలు చేస్తుండాలి. నగరంలో 90శాతం వరకు బంక్‌లు శాంపిళ్లను ప్రదర్శించడం లేదు. విడి పెట్రోల్‌ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఇందులోను భారీగా బయటకుతరలిపోయి బాటిళ్ల రూపంలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై తూనికలుకొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మాధురిని వివరణ కోరగా, సిటీలో బంక్‌లు కొంతవరకు మోసంచేసున్నాయని, పదిరోజులుగా తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు.