రూ.15 వేల కంటే తక్కువ వేతనం గల ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన(ఏబీఆర్‌వై) పథకం కింద ఉద్యోగులు రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని మార్చి 31, 2022 వరకు పొడగించినట్లు తెలిపింది. ఈ మేరకు ఏబీఆర్‌వై కింద రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని వచ్చే ఏడాది 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్ఓ ఒక ట్వీట్ చేసింది. అధికారిక రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనను తీసుకొచ్చింది. రూ.15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారు ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు.
ఏబీఆర్‌వై పథకం: కీలక ముఖ్యాంశాలు..
- 1) ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న అర్హత కలిగిన సంస్థల యజమానులు, కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది.
- 2) కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రెండు సంవత్సరాల వరకు ప్రోత్సాహకాలను అందుకుంటారు.
- 3) చెల్లింపు రూపంలో ఇన్సెంటివ్
- ఎ) 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది.
బి) 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. - 4) నిర్దిష్ట సంఖ్యలో కొత్త ఉద్యోగులను చేర్చుకున్న సంస్థలకు మాత్రమే పైన ప్రోత్సహాకాలు అందుతాయి.
- 5) సెప్టెంబర్ 2020 కొరకు ఈసిఆర్లో కంట్రిబ్యూటరీ ఈపిఎఫ్ సభ్యుల సంఖ్యగా ఉద్యోగుల రిఫరెన్స్ బేస్ తీసుకోబడుతుంది.
- 6) రూ.15000 కంటే తక్కువ నెలవారీ వేతనం గల కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 24 నెలల వరకు ఈ ప్రయోజనాలను పొందుతారు.
- 7) అక్టోబర్ 1, 2020 తర్వాత ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సంస్థ కొత్త ఉద్యోగుల కూడా పలు ప్రయోజనాలను పొందుతారు.
ఏబీఆర్‌వై పథకం
- ఏబీఆర్‌వై కింద1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది.
- 4 డిసెంబర్ 2021 నాటికి, 39.73 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు పొందారు. వారి అకౌంట్లలో కూడా రూ.2612.10 కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేసింది.
Registration facility under #ABRY has been extended till 31.03.2022.
— EPFO (@socialepfo) December 15, 2021
ABRY के तहत पंजीकरण सुविधा 31.03.2022 तक बढ़ा दी गई है।#EPFO #Employees pic.twitter.com/l9SuskDNQ9
(చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..!)
Comments
Please login to add a commentAdd a comment