EPF
-
ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.కేవైసీ ప్రక్రియ సులభతరంఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్‌వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్‌లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లతో ఈపీఎఫ్‌వో మెంబర్షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్‌వో దృష్టి సారిస్తోంది.క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణబ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్‌కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈపీఎఫ్‌వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్‌వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. -
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
మాజీ క్రికెటర్ ఊతప్పపై వారెంటు
సాక్షి బెంగళూరు: ఉద్యోగుల ఈపీఎఫ్ డబ్బులను జమ చేయలేదనే కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై ఈ నెల 4న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉత్తప్ప బెంగళూరు పులకేశి నగర పోలీసు స్టేషన్ పరిధిలోని నివాసి కావడంతో ఆయనను అరెస్టు చేయాలని అక్కడి పోలీసులకు ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ షడాక్షరి గోపాలరెడ్డి లేఖ రాశారు. వివరాలు.. సెంచురీస్ లైఫ్‌స్టైల్ ప్రై.లి. అనే కంపెనీకి రాబిన్ ఉత్తప్ప సహ యజమానిగా ఉన్నారు. కంపెనీలో సిబ్బంది జీతం ఉంచి ఈపీఎఫ్ డబ్బులు కట్ చేశారని, కానీ ఖాతాలోకి వేయలేదని, మొత్తం రూ. 23 లక్షల మోసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. -
రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఎంప్లాయి ప్రొవిడెంట్ ఫంఢ్(EPF) నిధుల మళ్లింపు కేసులో ఇరుక్కున్నాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరులో ఉన్న సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఊతప్ప డైరెక్టర్‌గా ఉన్నాడు.రూ. 23 లక్షల మేర మోసం?అయితే, ఈ కంపెనీ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ రూపంలో కట్ చేసిన రూ. 23 లక్షలను తిరిగి డిపాజిట్ చేయలేదు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్, రికవరీ ఆఫీసర్ అయిన శదక్షర గోపాలరెడ్డి చర్యలు చేపట్టారు. ఊతప్పపై అరెంస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా డిసెంబరు 4న తూర్పు బెంగళూరులోని పులకేశ్నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.అయితే, ప్రస్తుతం రాబిన్ ఊతప్ప తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేఎర్ పురం చిరునామాలో అతడు లేకపోవడంతో తాము ఊతప్పను అరెస్ట్ చేయలేకపోయినట్లు సంబంధిత పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అతడు తమ స్టేషన్ పరిధిలో లేడన్న విషయాన్ని పీఎఫ్ ఆఫీస్ వర్గాలకు తెలియజేశామన్నారు.దుబాయ్‌కు మకాం మార్చిన ఊతప్పకాగా రాబిన్ ఊతప్ప పులకేశినగర్‌లోని వీలర్ రోడ్లో గల అపార్టుమెంట్లో నివాసం ఉండేవాడు. అయితే, ఏడాది క్రితమే ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసినట్లు సమాచారం. ఇక పీఎఫ్ ఫ్రాడ్ కేసులో రాబిన్ ఊతప్పపై ఇంతవరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006- 2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన అంతర్జాతీయ కెరీర్లో 46 వన్డేలు, 13 టీ20 ఆడి.. ఆయా ఫార్మాట్లలో 934, 249 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడి 4952 రన్స్ సాధించాడు. కాగా రాబిన్ ఊతప్ప ఇటీవల జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ -
చెట్ల ట్రాన్స్లోకేషన్పై విధాన నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: చెట్లను కొట్టేయకుండా, వాటిని వేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటే ప్రక్రియ (ట్రాన్స్‌లొకేషన్)కు ప్రాధాన్యతనివ్వాలని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌లొకేషన్‌కు అవసరమైన యంత్రాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నిర్వహణ తదితరాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తుండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపింది. చెట్ల నరికివేతను గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాన్స్‌లొకేషన్ అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది.ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఆ కమిటీ సలహాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మూడు నెలల్లో పూర్తి వివరాలతో స్పందనను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దాఖలు చేసిన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంది. ట్రాన్స్‌లొకేషన్ కోసం పిల్... రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితరాల పేరుతో భారీ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారని, చెట్లను కొట్టేయకుండా వాటిని మరో చోట నాటేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు వచ్చిoది. పిటిషనర్ తరఫు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. చాలా రాష్ట్రాల్లో చెట్లను నరికేయకుండా వాటిని మరో చోట నాటుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, మరో చోట విజయవంతంగా నాటారని తెలిపారు. ఇందుకోసం హైకోర్టులో ఓ సంస్థ పనిచేస్తోందని వివరించారు. జీపీఎఫ్, ఈపీఎఫ్ దేనిని ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం » ఫలానా స్కీంను వర్తింపజేయాలని కోర్టులు ఆదేశించలేవు »ఉద్యోగులు జీపీఎఫ్ కోరుతున్నందున దానిపై నిర్ణయం తీసుకోండి » ఆర్థిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ స్కీం లేదా జీపీఎఫ్ స్కీంలలో దేనిని వర్తింపజేయాలన్నది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్టంగా ఫలానా స్కీంను వర్తింపజేయాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) స్కీం వర్తింపజేయాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు అభ్యర్థనలు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తమకు పాత పెన్షన్ స్కీం అయిన జీపీఎఫ్‌ను వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కొందరు ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఉద్యోగుల తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన మెమోరాండం ప్రకారం పిటిషనర్లందరూ జీపీఎఫ్‌కు అర్హులని చెప్పారు. జీపీఎఫ్ కోసం పిటిషనర్లు పై అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది ఆర్థికపరమైన అంశమని, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని డిస్కంలు, ఆరి్థక, ఇంధన శాఖల న్యాయవాదులు వాదనలు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. -
ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్మెంట్లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!ఈపీఎఫ్‌వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
రూ.25,820 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు!
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌లు రూ.25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3 శాతం అధికంగా ఉంది. ఇది గతంలో రూ.15,254.06 కోట్లు ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలుఈపీఎఫ్ఓ రికవరీ ఇలా..రాష్ట్ర ప్రభుత్వ సహాయం: బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతోపాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది.డిఫాల్టర్ల వివరాలు ప్రచారం చేయడం: కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.ఆస్తుల అటాచ్మెంట్: ఈపీఎఫ్‌వో యాజమాన్యాల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తోంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తోంది.చట్టపరమైన చర్యలు: దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన శిక్షలు విధించేలా చూస్తోంది. -
ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
EPFO Update: ఆధార్ లేకుండానే ఈపీఎఫ్ క్లెయిమ్!
కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!వీరంతా ఆధార్ స్థానంలో పాస్‌పోర్ట్‌లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. -
ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్ఎస్సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. -
EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్‌వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్‌కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద, ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను వారి సమ్మతితో పెన్షన్‌గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
EPFO: కొత్తగా 18.81 లక్షల మందికి పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్‌వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం. 21 శాతం మహారాష్ట్ర నుంచే.. సెప్టెంబర్ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. -
EPFO: 18.53 లక్షల మందికి కొత్తగా పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్‌వో) ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది కొత్త సభ్యులు జతయ్యారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం, ఈపీఎఫ్‌వో ప్రచార కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్తగా చేరిన వారిలో 18–25 ఏళ్ల వయస్సు వారి వాటా గణనీయంగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో తొలిసారి చేరేవారు, యువత సంఖ్య పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. దాదాపు 13.54 లక్షల మంది ఉద్యోగాలు మారి, తిరిగి ఈపీఎఫ్‌లో చేరినట్లు పేర్కొంది.రాష్ట్రాలవారీగా చూస్తే నికరంగా కొత్తగా చేరిన సభ్యుల సంఖ్యను బట్టి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి చేరిన వారి సంఖ్య తలో అయిదు శాతం పైగా ఉంది. -
ఈపీఎఫ్‌వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్‌వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్‌వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్‌వో ప్లాన్ చేస్తోంది.ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. -
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది బెస్ట్?
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఏదో ఒక ఇండెక్స్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్‌లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.మ్యూచువల్ ఫండ్స్‌లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్‌లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్‌తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త! మీ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు..వంటి కీలక వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే ఇకపై వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికోసం జాయింట్ డిక్లరేషన్‌ను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.ఏమిటీ జాయింట్ డిక్లరేషన్..ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల వివరాలు ఇందులో మార్చుకోవచ్చు. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, సంస్థ యజమాని ఇద్దరూ ఈ మార్పును ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్‌కి పంపించాలి. దాని అనుసరించి చందాదారుల వివరాలు అప్డేట్ అవుతాయి.సవరణ ఇలా..చందాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.inకు వెళ్లాలి.హోం పేజీ టాప్‌లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి.For Employees అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్లో Member UAN/ online Service(OCS/OTCP)పై క్లిక్ చేయాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి. సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.ఎంప్లాయర్ కూడా ఆయా వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్‌ను పీఎఫ్ కమిషనర్‌కు పంపించాలి. -
ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులు ప్రారంభం
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్ వడ్డీ సొమ్మును అవుట్గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు.ఈపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు..» యాప్‌ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి» ఆప్షన్స్ నుంచి "EPFO"ని ఎంచుకుని, "View Passbook"పై క్లిక్ చేయండి» స్క్రీన్‌పై మీ పాస్‌బుక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూడటానికి UAN ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండిఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా.. » ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోని ఎంప్లాయీ సెక్షన్‌కి వెళ్లి, "మెంబర్ పాస్‌బుక్"పై క్లిక్ చేయండి. » పీఎఫ్ పాస్‌బుక్‌ని చూడటానికి, మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.» మీ UAN ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899కి SMS పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. -
రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.స్పైస్‌జెట్ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్ అవుతున్న ఈపీఎఫ్ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్మెంట్ వాటాను ఈపీఎఫ్ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా స్పైస్‌జెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్ సెక్షన్ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్ఓలో తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. -
ఈపీఎఫ్‌లో ఉన్న ఈ అదనపు బెనిఫిట్ గురించి తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు భవిష్యత్తు కోసం తమ కొంత మొత్తాన్ని ఇందులో జమ చేస్తుంటారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. అయితే దీంతోపాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అందించే అద్భుతమైన అదనపు ప్రయోజనం ఒకటుంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకాన్ని ఈపీఎఫ్ఓ 1976లో ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ సభ్యుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌కు కంపెనీ కంట్రిబ్యూషన్ ఇస్తుంది.బీమా మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..బీమా మొత్తం గత 12 నెలల బేసిక్ జీతం, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ క్లెయిమ్ చివరి మూల వేతనం + డీఏకు 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా, రూ .1,75,000 వరకు బోనస్ మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.ఈపీఎఫ్ఓ సభ్యుడు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే ఈడీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తరువాత, అతని కుటుంబం, వారసులు, నామినీలు దానిని క్లెయిమ్ చేయలేరు. ఈపీఎఫ్ఓ సభ్యుడు 12 నెలలు నిరంతరాయంగా పనిచేస్తుంటే, ఉద్యోగి మరణించిన తర్వాత, నామినీకి కనీసం రూ .2.5 లక్షల ప్రయోజనం లభిస్తుంది.ఉద్యోగి పనిచేసేటప్పుడు అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవిస్తే ఈడీఎల్ఐ క్లెయిమ్ చేయవచ్చు. ఈడీఎల్ఐ పథకం కింద నామినీలుగా ఎవరినీ పేర్కొనకపోతే మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తెలు, మైనర్ కొడుకులు, కుమారులను కవరేజీని లబ్ధిదారులుగా పరిగణిస్తారు.ఎలా క్లెయిమ్ చేయాలంటే..ఈపీఎఫ్ చందాదారు అకాల మరణం చెందితే, వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు బీమా కవరేజీ కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం నామినీ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు వారి తరఫున క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మైనర్ సంరక్షకుడి తరఫున క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్ షిప్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. -
ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టం
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో చేరి పదేళ్లు పూర్తి కాలేదా..? ఉద్యోగుల పింఛను స్కీం (ఈపీఎస్)లో జమైన డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు వచ్చే నగదు కొంతమేర తగ్గనుంది. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల్లో ఈపీఎఫ్‌వో మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో పని చేసిన సర్వీసును ఇప్పటివరకు ఏడాది పరంగా లెక్కగట్టేవారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం సంస్థలో ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డీలో కార్మికశాఖ సవరణలు చేసింది.ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..ఉద్యోగి ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్ సర్వీసు పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను వస్తుంది. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను చెల్లించదు. కనీస సర్వీసు లేనివారు మాత్రమే ఈ నగదు తీసుకునేందుకు అర్హులు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొంతమంది రెండు, మూడేళ్లకో సంస్థ మారుతూ అప్పటికే ఈపీఎస్‌లో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..ఎలా లెక్కిస్తారంటే..ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమవుతుంది. పనిచేస్తున్న సంస్థ అంతేమొత్తంలో 12 శాతం వాటాను ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే సంస్థ చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం సంస్థ చెల్లించే 12 శాతం వాటా (రూ.1,800)లో 8.33 శాతం అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే రాజీనామా చేసినా, రిటైర్డ్ అయినా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఒకవేళ మూలవేతనం, డీఏ కలిపి రూ.15000 ఉందనుకుందాం. ఉద్యోగి ఏడేళ్ల ఏడు నెలలు పని చేశాడనుకుంటే గతంలోని నిబంధన ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలను ఎనిమిదేళ్లుగా పరిణించేవారు. రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మూలవేతనం రూ.15000 ఉన్నందున ఈపీఎస్ టేబుల్-డీ ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి 8.22 నిష్పత్తి చొప్పున చెల్లించేవారు. అంటే రూ.15,000 X 8.22 చొప్పున రూ.1,23,300 వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలు అంటే 91 నెలలు అవుతుంది. 91 నెలల కాలానికి నిష్పత్తి 7.61 అవుతుంది. అంటే రూ.15000 X 7.61 లెక్కన రూ.1,14,150 చెల్లిస్తారు. -
త్వరలో ఈపీఎఫ్ వడ్డీ.. మీ ఖాతాలో ఎంతుంది.. ఎంతొస్తుంది?
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని ఇందులో దాచుకుంటారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని జమ చేస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై ఈపీఎఫ్‌వో ఏటా వడ్డీని చెల్లిస్తుంది.వడ్డీ ఎంతొస్తుందో తెలుసుకోండి..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకారం.. ఈ ఏడాది జూలై-ఆగస్టు నాటికి అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.. మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల డిపాజిట్లు ఉంటే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నాం..వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి ఇది 8.25 శాతంగా ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష ఉంటే దానిపై 8.25 శాతం వడ్డీ పొందితే ఏడాదికి మీ వడ్డీ రూ.8,250 అవుతుంది.అదే రూ.3 లక్షలు ఉన్నట్లయితే రూ.24,500 వడ్డీ వస్తుంది. ఒక వేళ రూ.5 లక్షలు ఉంటే మీకు వచ్చే వడ్డీ రూ.41,250 అవుతుంది.పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..⇒ ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.⇒ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి⇒ ఈ-పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.⇒ ఇది మిమ్మల్ని మరొక స్క్రీన్కు తీసుకువెళుతుంది. ఇక్కడ మీ యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.⇒ విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, పాస్‌బుక్ కోసం మెంబర్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకోండి.⇒ పాస్‌బుక్ పీడీఎఫ్ ఫార్మాట్లో లభిస్తుంది. నిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.