ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖాతాదారుల పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతా వివరాలను, కేవైసి ప్రక్రియను అప్‌డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అప్పుడే ఎటువంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొంది.
ఇటీవల, అనేక బ్యాంకులు విలీనం అయ్యాయి కాబట్టి మరోసారి వాటి ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారే అవకాశం ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసుకునేతప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి వారి వివరాలను అప్‌డేట్, కొత్త ఖాతాలను లింక్ చేయాలని ఇటీవల విలీనం అయిన ప్రభుత్వ బ్యాంకుల వినియోగదారులను ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ పీఎఫ్ ఖాతాలను బ్యాంకులతో లింక్ చేయనట్లయితే, ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లు వారి మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోలేరని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులు ఉన్నారు. ఇంకా పీఎఫ్ ఖాతాదారుల తమ ఖాతాలను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేసేయండి లేకపోతే వారు ఈపీఎఫ్ఓ ఇతర సేవలను ఉపయోగించుకోలేరు.
చదవండి: ఎస్‌బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది?
Comments
Please login to add a commentAdd a comment