KYC
-
ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.కేవైసీ ప్రక్రియ సులభతరంఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్‌వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్‌లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లతో ఈపీఎఫ్‌వో మెంబర్షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్‌వో దృష్టి సారిస్తోంది.క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణబ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్‌కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈపీఎఫ్‌వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్‌వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పీపీఐ లావాదేవీలకు అనుమతి
ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (గిఫ్ట్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు) ఉపయోగించే యూజర్లు ఇకపై గూగుల్‌పే (Google Pay), ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ (Mobile Apps) ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, నగదు స్వీకరించేందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (PPI) పూర్తి స్థాయిలో ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులను సదరు బ్యాంకు లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి చేయడానికి వీలుంటోంది. కానీ పీపీఐల నుంచి చెల్లించాలన్నా, స్వీకరించాలన్నా ఆయా పీపీఐ సంస్థ యాప్ ద్వారానే చేయాల్సి ఉంటోంది. -
నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్‌కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్డేట్ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుఅంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం పని చేయాలని సూచించారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలర్ట్.. ఆగస్టు 12 డెడ్‌లైన్!
దేశంలో పురాతన, అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తమ కస్టమర్లను కోరింది. నిర్ణీత గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే, వారి ఖాతాలను నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అల్టిమేటం మార్చి 31 నాటికి కేవైసీ వివరాలు అప్డేట్ చేయని ఖాతాల కోసమని బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కస్టమర్లు తమ శాఖకు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో, పాన్, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ వంటివి అందించి కేవైసీ వివరాలను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టు 12 లోపు కేవైసీని అప్డేట్ చేసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూచించింది. పీఎన్బీ వన్ యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) / రిజిస్టర్డ్ ఈ-మెయిల్ / పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఏదైనా బ్రాంచ్ని సందర్శించడం ద్వారా కేవైసీ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. -
ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలు
ఫిన్‌టెక్ స్టార్టప్‌లు కస్టమర్ వెరిఫికేషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇటీవల కేవైసీ నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ అధికారులు ఫిన్‌టెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఆర్బీఐ గతంలో వెల్లడించిన నిబంధనల్లో ఎలాంటి మార్పలు లేవని స్పష్టం చేశారు.ఆఫ్‌లైన్ ఆధార్ ధ్రువీకరణ, సెంట్రలైజ్డ్ కేవైసీ, డిజిలాకర్ వంటి అన్ని డాక్యుమెంట్ సేకరణ ప్రక్రియలతో పాటు ఫిన్‌టెక్ కంపెనీలు డిజిటల్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌లో భాగంగా వీడియో కేవైసీని పాటించాలని ఆర్బీఐ తెలిపింది. గతంలో వీడియో కేవైసీ తప్పనిసరనే నిబంధనేదీ లేదు. కానీ ఇటీవల ఆర్బీఐ ఫిన్‌టెక్ కంపెనీల కస్టమర్ కేవైసీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌లో తప్పకుండా వీడియో కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని సడలించాలని కంపెనీ ప్రతినిధులు ఆర్బీఐతో చర్చలు జరిపారు. కానీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. కచ్చితంగా అన్ని ఫిన్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?పీర్-టు-పీర్(ఆన్లైన్లో నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి అప్పు తీసుకోవడం) రుణాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే పీర్ టు పీర్(పీ2పీ) లెండింగ్ కంపెనీలు కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలనే వాదనలున్నాయి. ఈ స్టార్టప్‌లపై ఆర్బీఐ మరిన్ని నిబంధనలు విధించే వీలుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా, పీ2పీలో అప్పు తీసుకుని చెల్లించకుండా డీఫాల్ట్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
కేవైసీతోనే.. ఫండ్స్‌లో పెట్టుబడులు
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? గతంలో ఎప్పుడో కేవైసీ (నో యువర్ కస్టమర్) చేసి ఉన్నారా..? అయితే ఒక్కసారి మీరు మీ కేవైసీ స్థితిని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు మరో విడత కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన తరుణం వచి్చంది. ఇందుకు విధించిన ఏప్రిల్ 1 గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తున్న పథకాలు కాకుండా.. కొత్త వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం కేవైసీని అప్డేట్ చేసుకోవడమే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి తిరిగి కేవైసీ చేసే విషయంలో గందరగోళం నెలకొంది. కొంత మంది ఇన్వెస్టర్లు మినహా చాలా మందిలో దీనిపై స్పష్టత లేదు. కేవైసీ చేసేందుకు ప్రయత్నించకపోవడం, ఏ డాక్యుమెంట్లు కావాలో అవగాహన లేకపోవడమే ఈ అయోమయానికి కారణమని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్టర్ సర్వీసెస్ హెడ్ అబ్దుల్లా చౌదరి అంటున్నారు. మ్యూచు వల్ ఫండ్స్ సంస్థల వెబ్సైట్ నుంచే ఆన్లైన్లో సులభంగా కేవైసీని మరోసారి చేసుకోవచ్చని తెలిపారు. చెక్ చేసుకోవాల్సిందే.. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తిరిగి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా..? అంటే లేదన్నదే సమాధానం. అసలు ఎవరు కేవైసీ ప్రక్రియను తిరిగి నిర్వహించుకోవాలో తెలుసుకోవాలంటే.. ఆన్లైన్లో తమ కేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించుకుంటే కానీ తెలియదు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు సీవీఎల్ను కేవైసీ కోసం ఉపయోగిస్తుంటారు. కనుక సీవీఎల్కేఆర్ఏ డాట్ కామ్ సైట్‌కు వెళ్లాలి. లేదంటే ఎన్డీఎంఎల్ కేఆర్ఏ, క్యామ్స్ (సీఏఎంఎస్) కేఆర్ఏ లేదా కార్వీ కేఆర్ఏ ద్వారా తమ కేవైసీ స్థితిని తెలుసుకోవచ్చు. సీవీఎల్కేఆర్ఏ పోర్టల్‌కు వెళ్లి పైన కనిపించే మెనూ ఆప్షన్లలో కేవైసీ ఇంక్వైరీ సెలక్ట్ చేసుకోవాలి.తర్వాత వచ్చే విండోలో పాన్ నంబర్ నమోదు చేయాలి. ఐ యామ్ హ్యూమన్ పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ కేవైసీ స్థితి అక్కడ కనిపిస్తుంది. కేవైసీ వ్యాలిడేటెడ్.. అని ఉంటే తిరిగి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. దీనర్థం మీరు అప్పటికే సమర్పించిన కేవైసీ ఆధార్ ఆధారితమైనది. మొబైల్, ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయి ఉన్నట్టు. కనుక అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. మళ్లీ కేవైసీ అవసరం లేదు. కేవైసీ రిజిస్టర్డ్.. అని ఉంటే మీరు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ (ఓవీడీ) ఆధారంగా కేవైసీ చేసినట్టు. అంటే ఆ సమయంలో ఆధార్ ధ్రువీకరణ చేయలేదు. మొబైల్, ఈ మెయిల్ ధ్రువీరణ చేసినట్టు. అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ, ఇప్పటి వరకు పెట్టుబడులు లేని కొత్త సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఆన్ హోల్డ్.. మొదట సమర్పించిన కేవైసీ ఓవీడీ ఆధారితం కాదని దీనర్థం. లేదంటే ఈ మెయిల్, మొబైల్ నంబర్ మనుగడలో లేవని అర్థం. ఈ స్థితి చూపిస్తుంటే, అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణకు అనుమతి లేదని తెలుసుకోవాలి. వీరు తాజాగా కేవైసీ సమర్పించాలి. రిజెక్టెడ్ ఆన్ హోల్డ్ 10–15 రోజుల పాటు ఉన్న తర్వాత రిజెక్టెడ్గా మారుతుంది. వీరు కూడా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు నిర్వహించలేరు. అంటే తాజాగా ఇన్వెస్ట్ చేయలేరు. అప్పటికే ఉన్న పెట్టుబడులు వెనక్కి తీసుకోలేరు. తాజాగా కేవైసీ సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ కేవైసీ వ్యాలిడేటెడ్ అనే స్థితి ఉన్న వారు మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారితంగా తాజా కేవైసీ సమర్పించడం మంచిది. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ అయితే.. పాన్ నంబర్ నమోదు చేసి, క్యాపెచా కోడ్ తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో మీరు చేయాల్సినది ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ వద్ద కేవైసీ నమోదు చేయని వారు ఇక్కడ కేవైసీ చేయడానికి వీలు పడదు. అదే సీవీఎల్–కేఆర్ఏలో అయితే మీ వివరాలు సమర్పించిన అనంతరం.. కేవైసీ ఎక్కడ నమోదై ఉన్నది కూడా చూపిస్తుంది.అంటే సీవీఎల్ కేఆర్ఏ/ఎన్డీఎంఎల్ కేఆర్ఏ/డాటెక్స్ కేఆర్ఏ/క్యామ్స్ కేఆర్ఏ/ కార్వీ కేఆర్ఏ వీటిల్లో ఎక్కడ నమోదైతే కేవైసీ స్టేటస్ కాలమ్‌లో అక్కడ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ఎక్కడ నమోదై ఉందన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. లేదంటే మీ పెట్టుబడులు కలిగిన ఫండ్ హౌస్ (ఏఎంసీ) పోర్టల్‌కు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ లేదా సెబీ నమోదిత ఆర్టీఏ (రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్) హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు. కేవైసీ అప్డేట్కేవైసీ స్థితి తెలుసుకున్న తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్‌కు అయినా వెళ్లి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీని సమర్పించొచ్చు. ఇలా ఒకసారి కేవైసీ అప్డేట్ అయితే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడుల్లోనూ అదే ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే, సంస్థ పోర్టల్‌కు వెళ్లి తమ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.ప్రొఫైల్ సెక్షన్లో కేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ‘రిజిస్టర్డ్’ లేదా ‘ఆన్హోల్డ్’ చూపిస్తుంటే ఎం–ఆధార్ లేదా డిజిలాకర్ ఖాతా నుంచి ఈ–ఆధార్ సమర్పించొచ్చు. దీంతో యూఐడీఏఐ ద్వారా వచ్చే ఓటీపీని సమర్పించిన అనంతరం కేవైసీ వ్యాలిడేట్ అవుతుంది. కేవైసీ రిజిస్టర్డ్ అనే స్థితితో ఉన్న వారు మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, తాజాగా కేవైసీ సమర్పించేంత వరకు సాధ్యపడదు. అప్పటి వరకు పెట్టుబడులు లేని మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. అప్పుడు ఆయా సంస్థ కేవైసీని పరిశీలిస్తుంది. వ్యాలిడేటెడ్ అని ఉంటేనే వారు ఆమోదిస్తారు. రిజిస్టర్డ్ అని ఉంటే మాత్రం కేవైసీ సమర్పించాలి. నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీ సమర్పించే వారు ఆధార్ కాపీపై క్యూఆర్ కోడ్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే దాన్ని సిస్టమ్ రీడ్ చేయలేదు. అలాంటప్పుడు అది వ్యాలిడేట్ కాదు. ఎప్పుడో ఆధార్ తీసుకున్న వారి డాక్యుమెంట్‌పై క్యూఆర్ కోడ్ మసకగా మారుతుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఎన్ఆర్ఐల పరిస్థితి?భారతీయులతో పోలిస్తే ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) కేవైసీ అంత సులభం కాదు. ఇతర దేశాల్లో నివసిస్తూ, భారత మొబైల్ నంబర్ కలిగి లేని వారు.. ఆధార్ ఆధారిత ఓటీపీ స్వీకరణ, నమోదు చేయలేరు. దీంతో ఎన్ఆర్ఐల కేవైసీ స్థితి ‘రిజిస్టర్డ్’గానే కొనసాగొచ్చు. దీంతో అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇకమీదటా పెట్టుబడులను ఎన్ఆర్ఐలు కొనసాగించుకోవచ్చు. ఎన్ఆర్ఐలు భారత్‌లో జారీ అయిన మొబైల్ నంబర్ కలిగి ఉంటే, ఆన్లైన్లో ఆధార్ ఆధారితంగా కేవైసీని సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లేదంటే వీరు కొత్త సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ అధికారికంగా చెల్లుబాటయ్యే ఇతర డాక్యుమెంట్ల సాయంతో కేవైసీ సమర్పించడమే మార్గం. తిరిగి కేవైసీ.. ఏ డాక్యుమెంట్?అధికారికంగా చెల్లుబాటయ్యే ఏ డాక్యుమెంట్ (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డ్) సాయంతో తిరిగి కేవైసీ చేసుకోవచ్చు. కానీ, భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ సాయంతో కేవైసీ వ్యాలిడేట్ చేసుకోవడమే అత్యుత్తమం. ఇతర డాక్యుమెంట్‌తో కేవైసీ చేస్తే కనుక, కొత్త మ్యూచువల్ ఫండ్ సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్లీ కేవైసీ సమర్పించాల్సి వస్తుంది. అదే ఆధార్‌తో చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. -
ఆర్థిక మోసాలపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం కేవైసీ నిబంధనలను కఠినతరం చేయడం, బిజినెస్ కరెస్పాండెంట్లను (బీసీ) చేర్చుకునేటప్పుడు మదింపు ప్రక్రియను మరింత పటిష్టం చేసేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించడం మొదలైన అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే వ్యాపారులు, బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) మదింపు ప్రక్రియను పటిష్టం చేయడమనేది మోసాల నివారణతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు దోహదపడగలదని వివరించాయి. సాధారణంగా వ్యాపారులు, బీసీల వద్దే డేటా ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే డేటాకు భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. సైబర్ మోసాలకు హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల్లో బీసీలు ఎక్కువగా ఉండటాన్ని, వారి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పునఃసమీక్షించుకోవాలని, మోసాల్లో ప్రమేయమున్నట్లుగా తేలిన మైక్రో ఏటీఎంలను బ్లాక్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక మోసాల నివారణపై ఇటీవల జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ మేరకు సూచనలు వచి్చనట్లు పేర్కొన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2023లో రూ. 7,489 కోట్ల సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించి 11,28,265 కేసులు నమోదయ్యాయి. -
అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన పనులకు అదే చివరి తేదీగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చాలా సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మార్చి 31తో గడువు ముగియనున్న కొన్నింటి వివరాలు ఈ కింది కథనంలో తెలుసుకుందాం. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాలకోసం మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూంటారు. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు మార్చి 31లోపు రీకేవైసీని పూర్తి చేయాలి. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే గడువులోపు కేవైసీని అప్డేట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి మార్చి 31తో ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్ని బ్యాంకులు హోంలోన్లపై మార్చి 31 వరకు రాయితీలు ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ముగుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అంబానీ-అదానీ దోస్త్ మేరా దోస్త్..! -
ఇక పై ఒకే KYC తో అన్ని ఆర్థిక లావాదేవీలు.
-
మళ్లీ అందరూ బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ చేయాలి..?
ఆర్థిక అవసరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. దానికి బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. చాలామందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలుండడం సహజం. అయితే వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దానికి అదనపు గుర్తింపులు కావాలని ప్రత్యేక కమిటీ సూచించింది. బ్యాంకుల్లో ఖాతాలను, ఖాతాదార్లను గుర్తించడానికి అదనపు ధ్రువీకరణ ప్రక్రియలను అమలు చేయనున్నారు. వినియోగదారు సమాచారాన్ని (కేవైసీ-నో యువర్ కస్టమర్) మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి సారించాయి. ప్రస్తుత ఖాతాలన్నిటికీ ముఖ్యంగా పలు ఖాతాలు లేదా జాయింట్ ఖాతాలకు ఒకే ఫోన్ నంబరు ఉన్న ఖాతాలకు దీనిని వర్తింపజేయాలని భావిస్తున్నాయి. వేర్వేరు పత్రాలతో పలు ఖాతాలను తెరచిన ఖాతాదార్ల నుంచి మరిన్ని ధ్రువీకరణలను కోరవచ్చు. ఇదీ చదవండి: కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్ ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడం కోసం ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని గతంలోనే ఏర్పాటు చేసింది. పాన్, ఆధార్, మొబైల్ నంబరు తదితరాలను అదనపు గుర్తింపుల కింద పరిశీలిస్తున్నట్లు ఒక బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి, అదనపు గుర్తింపులతో వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలిసింది. -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
మీ ఫాస్ట్ ట్యాగ్ KYC పూర్తి చేశారా? ఇంకా 3 రోజులే గడువు
-
తెలియని సంస్థలకు పత్రాలు ఇవ్వకండి..
ముంబై: కేవైసీ అప్డేషన్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. గుర్తుతెలియని వారికి పత్రాలను ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘అపరిచిత వ్యక్తులు లేదా సంస్థలకు కేవైసీ (గుర్తింపు, చిరునామా ధృవీకరణకు ఆధారాలు) పత్రాలు లేదా వాటి కాపీలను ఇవ్వకండి‘ అని పేర్కొంది. అలాగే అకౌంట్ లాగిన్ వివరాలు, కార్డు సమాచారం, పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలను కూడా ఎవరికీ చెప్పరాదంటూ సూచించింది. ‘సాధారణంగా ఈ తరహా మోసాల్లో.. కస్టమర్లు తమ వ్యక్తిగత సమాచారం, అకౌంటు వివరాలను తెలియజేసే విధంగా లేదా మెసేజీల్లో పంపే లింకుల ద్వారా అనధికారిక యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ మోసపుచ్చేలా ఖాతాదారులకు అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ మొదలైనవి వస్తుంటాయి. కస్టమర్లు అప్పటికప్పుడు స్పందించకపోతే అకౌంటు ఫ్రీజ్ అవుతుందని లేదా మూతబడుతుందని బెదిరించే ధోరణిలో ఇవి ఉంటాయి. అలాంటప్పుడు కస్టమర్లు తమ వ్యక్తిగత లేదా లాగిన్ వివరాలు గానీ ఇచ్చారంటే మోసగాళ్లు వారి ఖాతాల్లోకి అనధికారికంగా చొరబడతారు‘ అని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ అప్డేషన్ కోసం అభ్యర్ధన ఏదైనా వస్తే నేరుగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థనే సంప్రదించాలని సూచించింది. అలాగే, ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచే కాంటాక్ట్ నంబర్లు తీసుకోవాలని పేర్కొంది. సైబర్ మోసం జరిగితే వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ఇలాంటి మోసాలపై ఈ తరహా హెచ్చరికలు జారీ చేసింది. -
జాగ్రత్త పడండి.. ఆర్బీఐ వార్నింగ్!
కేవైసీ అప్డేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరించింది. కేవైసీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని సంస్థలతో పత్రాలను పంచుకోవద్దని సూచించింది. కేవైసీ అప్డేట్ల పేరుతో తరచుగా మోసాలు జరుగుతన్న నేపథ్యంలో వాటిని నివారించడానికి జాగ్రత్తలు పాటించాలని కోరుతూ ఆర్బీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి మోసాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ప్రజలను హెచ్చరించింది. కేవైసీ పత్రాలు లేదా వాటి కాపీలను తెలియని, గుర్తింపులేని వ్యక్తులు లేదా సంస్థలతో పంచుకోవద్దని పేర్కొంది. అలాగే అకౌంట్ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, కార్డ్ సమాచారం, పిన్, పాస్వర్డ్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. సాధారణంగా ఇటువంటి మోసాలు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ వంటి వాటి ద్వారా జరుగుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలా వచ్చిన వాటికి స్పందించి వ్యక్తిగత సమాచారం, అకౌంట్ లాగిన్ వివరాలను బహిర్గతం చేయడం, సందేశాలలో అందించిన లింక్‌ల ద్వారా అనధికారిక లేదా ధ్రువీకరించని యాప్‌లను ఇన్స్టాల్ చేయడం వంటివి చేస్తూ కస్టమర్లు మోసపోతున్నారని వివరించింది. కేవైసీ అప్డేట్ కోసం అభ్యర్థన వచ్చినప్పుడు నిర్ధారణ కోసం నేరుగా మీ బ్యాంక్, సంబంధిత ఆర్థిక సంస్థను సంప్రదించాలని ఆర్బీఐ సూచించింది. బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల కాంటాక్ట్ నంబర్, కస్టమర్ కేర్ ఫోన్ నంబర్‌ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఏదైనా సైబర్ మోసం జరిగినప్పుడు కస్టమర్లు వెంటనే బ్యాంక్, ఫైనాన్స్ సంస్థకు తెలియజేయాలని సూచించింది. -
FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగింపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్హెచ్ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్‌తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం. -
కేవైసీ అప్డేట్.. రేపే లాస్ట్ డేట్ - ఇలా అప్డేట్ చేసుకోండి
ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌లను కేవైసీతో అప్డేట్ చేసుకోవాలని, దీని కోసం జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఎన్హెచ్ఏఐ ఇచ్చిన గడువు రేపటితో (జనవరి 31) ముగుస్తుంది. ఈ కథనంలో ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? అప్డేట్ చేయడం ఎలా? ఎందుకు అప్డేట్ చేసుకోవాలని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి
ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI).. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు కేవైసీ చేసుకోవాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేస్తూ ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించింది. జనవరి 31 నాటికి కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లు డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వినియోగదారుడు నిర్దిష్ట సమయంలోనే కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? 👉వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. 👉ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ చేయడం ఎలా? 👉ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు తెలిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. 👉దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాల్సి ఉంటుంది. 👉ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. 👉తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. -
FASTag: వాహనదారులకు అలర్ట్.. ఫాస్ట్‌ట్యాగ్‌పై NHAI కీలక ప్రకటన
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి? ఆలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. NHAI ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా.. అలంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్‌ట్యాగ్ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31 లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకులు ఎనిమిది కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలామంది ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి గతంలో వెల్లడించారు. ఇదీ చదవండి: 60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే? కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిని అరికట్టడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ఈ విధానికి కూడా జనవరి 31 తరువాత మంగళం పాడనున్నారు. -
నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే..
ప్రతి ఏడాది మునుపటి సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది. 2024 కూడా అంతే. 2023తో పోలిస్తే కొన్ని మార్పులు సహజం. ఇవన్నీ అందరి జీవితాలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. ఆర్థిక అవగాహనతో సమాజంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. అయితే జనవరి 1, 2024 నుంచి వచ్చే కొన్ని ప్రధాన మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. పెరిగిన కార్ల ధరలు టాటా మోటార్స్, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి చాలా ఆటో కంపెనీలు జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతామని ప్రకటించాయి. అధిక ఇన్పుట్ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశాయి. ధరల పెంపు దాదాపు 2-3 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని మోడళ్లకు అధిక ధరల పెంపు ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. యూపీఐ ఐడీలు రద్దు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లలోని యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. ఇలాంటి ఐడీలను జనవరి ఒకటో తేదీ నుంచే డీయాక్టివేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి ఈ ఏడాది నవంబర్ ఏడో తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన జారీ చేసింది. లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల ఫోన్ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. కావాలంటే వాటిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. సులభమైన భాషలో బీమా వివరాలు 2024 జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను (సీఐఎస్) విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. కస్టమర్లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడం దీని లక్ష్యం. సులభమైన భాషలో అన్నింటినీ వివరించాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్! డిజిటల్ కేవైసీ ఇకపై మొబైల్ కనెక్షన్ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే విధానం మారుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆదేశాల ప్రకారం.. కస్టమర్లకు సిమ్ కార్డ్‌లను విక్రయించే ముందు వారి ఫిజికల్ వెరిఫికేషన్‌ను దశలవారీగా తొలగించాలని టెలికమ్యూనికేషన్ కంపెనీలను ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. కస్టమర్లు తమ ఫొటో గుర్తింపు రుజువును చూపించి, డిజిటల్‌గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి ఈ చర్య ఒక మార్గమని డాట్ వివరించింది. -
‘మహాలక్ష్మి’ సిలిండర్ల కోసం బారులు
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. వినియోగదారులు తమ వివరాలను (కేవైసీ) అప్డేట్ చేయించుకుంటే నే ఈ పథకం వర్తిస్తుందని జరిగిన ప్రచారంతో వారం రోజులుగా ప్రజలు గ్యాస్ కనెక్షన్ బుక్‌లు, ఆధార్‌కార్డులతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈనెల 28 నుంచి ప్రారంభం కాను న్న ‘ప్రజా పాలన’కార్యక్రమం ఎజెండాలో కూడా గ్యాస్ సిలిండర్ల అంశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇందులో మహాలక్ష్మి పథకానికి అర్హులెవరనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలనే ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగుతుండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. రేషన్ తరహాలోనే గ్యాస్‌కూ... కేంద్ర ప్రభుత్వం అర్హులకు రేషన్ ఇచ్చేందుకు కార్డులో నమోదైన సభ్యులందరూ వేలిముద్రలు వేసి, ఈ–కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలిచ్చి ంది. దీంతో గత మూడు నెలలుగా రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ ప్రక్రియ సాగుతోంది. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ వేలిముద్రలు వేస్తున్నారు. రేషన్ కార్డుల్లో అర్హులను గుర్తించేందుకు కేవైసీ అప్డేట్ చేసినట్లుగానే వంటగ్యాస్ వినియోగదారులు సైతం కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం చెప్పింది. అయితే, ఇది కేవలం గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుమీద ఉంది? కనెక్షన్ ఉన్న వ్యక్తి మరణించాడా లేక బదిలీ చేసుకున్నాడా? లేక కనెక్షన్ వద్దనుకుని వదిలేశాడా..అన్న అంశాలను తెలుసుకోవడానికేనని గ్యాస్ ఏజెన్సీలు చెప్పాయి. అయితే వినియోగదారులు ఈ–కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రాదనే అపోహతో గ్యాస్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. ఎలాంటి గడువు లేదు.. గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేవైసీ అప్డేట్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గడువును విధించలేదు. వినియోగదారుల సమగ్ర సమాచారం కోసం సేకరిస్తున్న కేవైసీ అప్డేట్కు మహాలక్ష్మి పథకానికి సంబంధం లేదు. ఈ విషయాన్ని గ్యాస్ కంపెనీల ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఏజెన్సీ బాయ్ ఇంటికొచ్చినప్పుడు కేవైసీ వివరాలు సేకరిస్తారని, ప్రజలెవరూ ఏజెన్సీల వద్దకు రావద్దని కోరారు. కాగా, గ్యాస్ వినియోగదారుల కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, పౌరసరఫరాల శాఖకు గానీ ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈకేవైసీ చేసుకుంటేనే ఇస్తారట.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గ్యాస్ బండ రూ. 500కే ఇస్తోందని చెప్పారు. అయితే ఈ–కేవైసీ చేసుకుంటేనే సబ్సిడీ వస్తుందన్నారు. అందుకోసమే ఒకరోజు పనికి పోకుండా గ్యాస్ కేంద్రానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకుంటున్నా. కాలనీలోని అందరూ అప్డేట్ చేయించుకున్నారని ప్రచారం జరగడంతో నేను కూడా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చాను. – ఇస్లావత్ మురళి, మంగళి కాలనీ, మహబూబాబాద్ -
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
బధిర వినియోగదారులకు కోసం అమెజాన్ పే కొత్త సర్వీస్ - వివరాలు
అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ పే, ఇటీవల వినికిడి, మాట లోపం ఉన్న భారతీయ వినియోగదారుల కోసం ఒక వీడియో సంకేత భాషలో కేవైసీ (KYC) సర్వీస్ ప్రారంభించింది. ఇందులో సైన్ లాంగ్వేజ్ల ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. అమెజాన్ పే ఉద్యోగులు, వినియోగదారుల మధ్య సంకేత భాషలో టూ-వే వీడియో కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ప్రయత్నాన్ని కంపెనీ రూపొందించింది. సంకేత భాషపై ఆధారపడే వారి కోసం కేవైసీ ప్రక్రియను సునాయాసంగా చేయడం, డిజిటల్ చెల్లింపులను మరింత సులువగా చేసే లక్ష్యంతో కంపెనీ దీన్ని రూపొందించింది. డిజిటల్ భారత్‌కు అనుకూలంగా అమెజాన్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టింది. డిజిటల్‌గా సాధికారత కలిగిన భారతదేశం కోసం విస్తృత దృష్టికి అనుగుణంగా, తన సేవలు అందరినీ కలుపుకొని, అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ సర్వీస్ గురించి ఇన్ పేమెంట్స్, పేమెంట్స్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్.. డైరెక్టర్ 'వికాస్ బన్సాల్' మాట్లాడుతూ, సైన్ లాంగ్వేజ్ వీడియో కేవైసీ సర్వీస్ అబ్సెషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై అమెజాన్ పే దృష్టికి ఇది సహజమైన పొడిగింపు. మేము మా అవరోధ రహిత సేవ పరిధిలో అమలు చేసిన ఈ సేవతో, వీడియో కేవైసీ ద్వారా సులభంగా, సురక్షితంగా ప్రయోజనం పొందేందుకు వైకల్యాలున్న మా వినియోగదారులకు సేవలు అందుందుకునే చేస్తున్నాము. ఈ సేవ వారి రోజువారీ చెల్లింపు అవసరాల కోసం డిజిటల్ వాలెట్ మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. మా ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయని, మా సేవలు, అనుభవాలు, కార్యాచరణ ప్రతి ఒక్కరికీ వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని మేము కోరుకుంటున్నామని వివరించారు. భారతదేశంలోని వినియోగదారులకు వీడియో ఆధారిత కైవైసీ సేవలను అందించడానికి 120 మంది ఉద్యోగులకు అమెజాన్ పే భారతీయ సంకేత భాషపై శిక్షణ ఇచ్చింది. ఇంటరాక్టివ్ ట్రైనింగ్ మాడ్యూల్, వినికిడి, మాట్లాడలేని సమస్య ఉన్న వినియోగదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం ఈ ఉద్యోగులకు ఉంది. దివ్యాంగులైన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా, దివ్యాంగులైన వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ ప్రత్యేక అవసరాల గురించి తెలుసుకునేందుకు అమెజాన్ భారతదేశంలోని వినియోగదారులకు ‘లిజన్-ఇన్స్ ఫర్ యాక్ససబిలిటీ’ పేరిట ప్రయోజనాన్ని చేకూర్చే పలు కార్యక్రమాలను ప్రారంభించగా, ఇందులో కస్టమర్ సర్వీస్ టీమ్‌లు అపరిచితులు చేసిన కాల్ రికార్డింగ్‌లను వింటాయి. అంతే కాకుండా అమెజాన్ డిజిటల్, డివైస్ అండ్ అలెక్సా సపోర్ట్ (D2AS) సంస్థ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మరియు జర్మనీలతో సహా ఎనిమిది మార్కెట్ ప్లేస్‌లలో వినియోగదారునికి మద్దతును అందించే యాక్ససబిలిటీ సపోర్ట్ బృందాలను అందుబాటులో ఉంచింది. ఈ యాక్సెసిబిలిటీ అసోసియేట్లలో అధిక మొత్తంలో భారతదేశం వెలుపల ఉన్నారు. అమెజాన్ తమ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసేందుకు ఉద్యోగులందరికీ సమాన అవకాశాలను అందించే సమగ్ర సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. మహిళలు, LGBTQIA+ కమ్యూనిటీ, సైనిక అనుభవజ్ఞులు, విభిన్న సామర్థ్యం ఉన్న వారితో సహా వివిధ వర్గాలకు చెందిన వారందరికీ అవకాశాలను కల్పించేందుకు లింగ వైవిధ్యానికి మించి దృష్టి విస్తరించింది. అమెజాన్ విభిన్నమైన వర్క్‌ఫోర్స్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. విభిన్న కస్టమర్ బేస్‌ను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతూ, విభిన్న దృక్కోణాల ద్వారా నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. డీఈ & ఐ పట్ల కంపెనీ దాని నిబద్ధత దాని విధానాలు, ప్రోగ్రామ్‌లు మరియు కార్యాలయంలో వైవిధ్యం, ఈక్విటీ, చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో చేసిన కార్యక్రమాలలో ఇది ప్రతిబింబిస్తుంది. -
కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్
ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది. లోన్ అడ్వాన్స్‌లు చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు; మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ పెనాల్టీకి బ్యాంకుల కస్టమర్లకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. కాగా, ఇటీవల కేవైసీ నిబందల్ని పాటించడంలో విఫలమైందంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.5.39 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందా? సింపుల్‌గా యాక్టివేట్ చేసుకోండిలా!
రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం, ఒక కస్టమర్ నిర్ణీత గడువు లోపల తప్పకుండా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇది జరిగితే లావాదేవీలు చేయడం కుదరదు. అయితే కేవైసీ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కథనంలో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. కేవైసీ అప్డేట్ అనేది హై రిస్క్ కస్టమర్లకు రెండు సంవత్సరాలు, మీడియం అండ్ లో (తక్కువ) రిస్క్ కస్టమర్లకు వరుసగా 8, 10 సంవత్సరాల వరకు ఉంటుంది. RBI ప్రకారం, 2019 మే 29న జారీ చేసిన సర్క్యులర్‌ను 2023 మే 4న అప్డేట్ చేసింది. కావున దీని ప్రకారం ఖాతాదారుడు పాన్ కార్డు లేదా ఫారమ్ 16ని అందించనట్లైతే అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. అంతకంటే ముందు బ్యాంకులు ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా కష్టమరలకు హెచ్చరికలు జారీ చేస్తాయి. అకౌంట్ యాక్టివేట్ చేయడం ఎలా? కేవైసీ పూర్తి చేయకపోతే ఖాతా తాత్కాలికంగా నిలిపివేసిన అకౌంట్‌ను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సులభమైన మార్గాలు ఉన్నాయి. 1) కేవైసీ ఫారమ్‌తో నేరుగా బ్యాంకుని సందర్శించి యాక్టివేట్ చేసుకోవచ్చు 2) మీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే! మీకు తెలుసా? ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్.. బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ లాగిన్ చేసి, 'KYC' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్‌పైన సూచనలను అనుసరించి మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఆధార్, పాన్ ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సర్వీస్ నెంబర్ పొందుతారు. దీనికి సంబంధించి ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ వంటివి పొందుతారు. -
వీడియో కేవైసీని ప్రవేశపెట్టిన బీవోబీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వీడియో ఆర్ఈ కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఎప్పటికప్పుడు తమ కేవైసీ ధ్రువీకరణ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం బ్యాంక్ శాఖ వరకు రావాల్సిన అవసరాన్ని వీడియో ఆర్ఈ కేవైసీ విధానం నివారిస్తుంది. వీడియో కేవైసీ సదుపాయం వినియోగించుకోవాలంటే కస్టమర్ వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. భారతీయ పౌరసత్వం కలిగి, ఆధార్, పాన్ ఉండాలని బీవోబీ తెలిపింది. ముందుగా కస్టమర్లు బీవోబీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్ ఆర్ఈ–కేవైసీ దరఖాస్తును సమరి్పంచాలి. ఇందులో అడిగిన వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌కు వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్ కంటే ముందు కస్టమర్ తన ఒరిజినల్ పాన్ కార్డ్, ఖాళీ వైట్ పేపర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ సిద్ధంగా ఉంచుకోవాలి. వీడియో ఆర్ఈ కేవైసీ కాల్‌ను అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య చేసుకోవచ్చు. -
ఎస్బీఎం కస్టమర్లకు అలర్ట్: ఆ క్రెడిట్ కార్డులపై బ్యాన్
సాక్షి, ముంబై: విదేశీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) అనుబంధ సంస్థ ఎస్బీఎం ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఫిన్‌టెక్ భాగస్వాములకు చెందిన కొందమంది కస్టమర్లకు జారీ చేయబడిన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని మార్చి 31, 2023 నుంచి బ్లాక్ చేసింది. (IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!) భారతదేశంలోని అనేక ఫిన్‌టెక్ ప్లేయర్లతో భాగస్వామ్యంతో అందించే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేసింది. కేవేసీవివరాలను ఆయా ఖాతాల్లో అప్డేట్ చేయడానికి బ్లాక్ చేసినట్టు భావిస్తున్నారు. దీని ప్రకారం కేవైసీ అప్డేట్ తర్వాత ఎస్బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు కేవైసీ వివరాలను నమోదు చేయాలి.(బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు) ఎస్బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కస్టమర్లకు ఇ-మెయిల్స్ సమాచారాన్ని అందించింది ఎస్బీఎం బ్యాంక్ ఇండియా. అయితే తమకు సమాచారం అందిందని, తక్కువ టైం ఉందని కొంతమంది ఖాతాదారులు విమర్శిస్తున్నారు. కాగా ఎస్బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
కేవైసీ ఒక్కసారి చేస్తే చాలదా?
ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ మరణించినట్టయితే అవి నామీనికి బదిలీ అవుతాయి. నామినీ విక్రయ నిబంధనలు ఏమిటి? – విశ్వ ప్రకాశ్ జాయింట్ హోల్డర్ ఉంటే, రెండో వాటాదారునకు అవి బదిలీ అవుతాయి. ఇది అసలు హోల్డర్ లేని సందర్భంగా బదిలీ చేస్తున్నారు కనుక పన్ను వర్తించదు. సంబంధిత యూనిట్లను పొందిన వారు వాటిని విక్రయించినప్పుడు పన్ను చెల్లించాలి. యూనిట్లను ఎంత కాలం ఉంచుకున్నారనే అంశాల ఆధారంగా, స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాలపన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది కాలంలోపు విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని, స్వల్పకాల మూలధన లాభాల పన్నుగా పరిగణిస్తారు. ఈ మొత్తంపై 15 శాతం పన్ను పడుతుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే లాభం దీర్ఘకాల మూలధన లాభాల పన్నుగా చట్టం పరిగణిస్తుంది. మొదటి రూ.లక్ష లాభం మినహా మిగిలిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాల మూలధన లాభంగాను, మూడేళ్లకు మించిన పెట్టుబడులపై లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చూస్తారు. స్వల్పకాల మూలధన లాభం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఒకరి నుంచి వారసత్వంగా లేదంటే నామినీగా వచ్చే పెట్టుబడులను విక్రయించినప్పుడు వాటి అసలు కొనుగోలు తేదీ నుంచి హోల్డింగ్ పీరియడ్ అమలవుతుంది. బదిలీ అయిన తేదీ కాదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ రూ.5 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను 2020లో కొనుగోలు చేసి, 2021లో మరణిస్తే, వివిధ మ్యూచువల్ ఫండ్స్‌కు ఏకీకృత కేవైసీ ప్లాట్‌ఫామ్ ఉందా?– సమీర్ పటేల్ ప్రస్తుతం సెంట్రల్ కేవైసీ అనేది ఉంది. ఇన్వెస్టర్లు వారి కేవైసీ ప్రక్రియను ఒక్కసారి మాత్రమే పూర్తి చేసేందుకు సెంట్రల్ కేవైసీ అవకాశం కల్పిస్తోంది. వేర్వేరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిసారి కేవైసీ ఇవ్వాల్సిన అవసరం దీంతో ఉండదు. పాన్, చిరునామా ధ్రువీకరణను ఇన్వెస్టర్ పంపిణీదారు లేదా సెబీ వద్ద నమోదు అయిన మార్కెట్ ఇంటర్మీడియరీ అయిన స్టాక్ బ్రోకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ఇచ్చినా.. తాజా సమాచారం సెంట్రల్ కేవైసీ రికార్డుల్లో అప్డేట్ అవుతుంది. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
సామన్యులకు అలర్ట్: కొత్తగా మారిన రూల్స్ తెలుసుకోవడం తప్పనిసరి!
2023లోకి అడుగు పెట్టాం. కొత్త ఏడాదిలో ముందుగా నిర్వహించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు ఉన్నాయి. బ్యాంకు లాకర్ల ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మొదటిది. ఇందుకు సంబంధించి కొన్ని బ్యాంకు కస్టమర్లకు సందేశాలు వస్తున్నాయి. తర్వాత పన్నుల ఆదా పెట్టుబడులకు సంబంధించిన వివరాలను పనిచేస్తున్న కంపెనీలకు సమర్పించడం. ఒకవేళ ఇప్పటికీ ఆ పనిచేయకపోతే మించిపోయినది ఏమీ లేదు. మరో మూడు నెలల గడువు ఉందని గమనించాలి. అలాగే, కొన్ని కీలకమైన మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.. లాకర్ ఒప్పందాల్లో మార్పులు బ్యాంకుల్లో లాకర్లు చాలా మందికి ఉంటాయి. ఈ సేఫ్ డిపాజిట్ లాకర్‌కు సంబంధించి ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలంటూ బ్యాంకులు తమ కస్టమర్లను కోరుతున్నాయి. ‘‘ప్రియమైన కస్టమర్, ఆర్బీఐ సూచనల మేరకు మీరు మీ బ్రాంచ్‌కు వెళ్లి సవరించిన లాకర్ ఒప్పందాన్ని జనవరి 1 నాటికి కుదుర్చుకోవాలి. ఇప్పటికే ఆ పనిచేసి ఉంటే ఈ సందేశాన్ని మర్చిపోండి’’అనే సందేశం చాలా మంది కస్టమర్లకు వస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఇందుకు సంబంధించి తన కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తోంది. 2021 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితమే ఇది. కోర్టు ఆదేశాలు వెలువడిన ఆరు నెలల్లో లాకర్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులను ఖరారు చేయాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2021 ఆగస్ట్‌లో ఆర్బీఐ ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా బ్యాంక్ బోర్డులు ఆమోదించిన లాకర్ నిర్వహణ ఒప్పందాన్ని బ్యాంకులు అమల్లో పెట్టాల్సి ఉంది. ‘‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించే నమూనా లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు అమలు చేయవచ్చు. ఈ ఒప్పందం, సవరించిన మార్గదర్శకాలు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి’’అని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. కొత్త నిబంధనలు కొత్తగా లాకర్ తీసుకునే వారికి 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. కానీ, దానికంటే ముందు లాకర్ తీసుకున్న వారికి ఈ ఏడాది జనవరి 1 వరకు గడువు ఉంది. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర చాలా బ్యాంకులు సవరించిన నిబంధనలతో లాకర్ ఒప్పందాలను అమల్లోకి తీసుకొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ చాలా మంది లాకర్ ఒప్పందాలపై తిరిగి సంతకాలు చేయలేదు. నిజానికి నూతన నిబంధనలన్నవి కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో తీసుకొచ్చినవి. అందుకుని ఆలస్యం చేయకుండా కస్టమర్లు తమ బ్యాంక్ శాఖకు వెళ్లి కొత్త ఒప్పంద డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లపై సంతకాలు పెట్టాలి. కొన్ని బ్యాంకులు స్వయంగా ఈ డాక్యుమెంట్లను అందిస్తుంటే, కొన్ని స్టాంప్ పేపర్లు తెచ్చుకోవాలంటూ కస్టమర్లకే చెబుతున్నాయి. స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇరు పార్టీలు చేసుకున్న ఒప్పందం కాపీ ఒకదాన్ని లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తికి అందించడం కూడా తప్పనిసరి. ఒరిజినల్ అగ్రిమెంట్ పత్రాలు బ్యాంకు దగ్గరే ఉంటాయి. బ్యాంక్ అడిగినప్పుడే లాకర్ పునరుద్ధర గురించి ఆలోచిద్దామని అనుకోకుండా, స్వయంగా వెళ్లి దాన్ని పూర్తి చేసుకోవడం అవసరం. ‘‘బ్యాంక్‌లు తమ కస్టమర్లతో కొత్త ఒప్పందాలను 2023 జనవరి 1 నాటికి చేసుకోవడం తప్పనిసరి. ఈ తేదీని పొడిగింపుపై స్పష్టత లేదు. అందుకని కస్టమర్లే తమ బ్యాంక్ శాఖలకు వెళ్లి దీన్ని అప్డేట్ చేసుకోవాలి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. కొన్ని బ్యాంక్‌లు కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయే కానీ, నిర్ణీత గడువులోపు చేయాలంటూ నిర్ధేశించడం లేదు. కాకపోతే లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే సమయంలో పూర్తిగా చదివి, నియమ నిబంధనలు తెలుసుకోవాలి. ఇక బ్యాంకు లాకర్ నిబంధనలపైనా అవగాహన కలిగి ఉండడం అవసరం. ఏడాదిలో ఒక్కసారి అయినా లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉండాలి. లేదంటే బ్యాంక్‌లు చర్యలు తీసుకుంటాయి. ఏడాది పాటు వినియోగంలో లేని లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న వాటిని స్వాధీనం చేసుకునే అధికారం బ్యాంక్‌లకు ఉంటుంది. ఈ విధమైన సమస్య రావద్దని అనుకుంటే కనీసం ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. బ్యాంక్‌లు లాకర్లకు సంబంధించి మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను ఖాతాదారుల నుంచి తీసుకునేందుకును ఆర్బీఐ అనుమతించింది. అంతేకాదు, లాకర్లను బ్రేక్ చేసేందుకు అయ్యే వ్యయాలను కూడా ముందుగా తీసుకోవచ్చు. లాకర్ తీసుకుని, వాటిని నిర్వహించకుండా, అద్దె కట్టకుండా ఉండే రిస్క్‌ను ఇది తప్పిస్తుంది. అయితే, దీర్ఘకాలం నుంచి ఖాతాదారులుగా, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కస్టమర్ల విషయంలో బ్యాంకులు ఈ విధమైన చర్యలను దాదాపుగా తీసుకోవు. లాకర్లను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా నిర్వహించే కస్టమర్లను లాకర్ డిపాజిట్ కోసం ఒత్తిడి చేయవద్దని ఆర్బీఐ సైతం బ్యాంక్‌లకు సూచించడం గమనార్హం. బ్యాంక్‌లు లాకర్ కోసం డిపాజిట్ తీసుకున్నా.. రద్దు చేసుకుంటే తిరిగి ఆ డిపాజిట్ వెనక్కిచ్చేస్తాయి. పన్ను ఆదా వివరాలు ఉద్యోగులు పన్ను మినహాయింపు పెట్టుబడులు, ఇతర వ్యయాలకు సంబంధించిన వివరాలను పనిచేసే సంస్థకు జనవరి నెలలోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే, టీడీఎస్‌ను మూడు నెలల వేతనాల్లో సంస్థలు మినహాయిస్తాయి. కనుక ప్రతి ఉద్యోగి బీమా పథకాలు, ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు, పీపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, పిల్లల ట్యూషన్ ఫీజు తదితర వివరాలను అందించాలి. పన్ను మినహాయింపుల పెట్టుబడుల వివరాలు ఇవ్వడం వల్ల టీడీఎస్ బాధ్యతను తప్పించుకోవడం లేదంటే తగ్గించుకోవచ్చు. కేవైసీ తప్పనిసరి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ట్రావెల్ లేదా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని జనవరి 1 నుంచి కొనుగోలు చేసేవారు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ మేరకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ‘‘గతంలో అయితే క్లెయిమ్ రూ.లక్ష మించినప్పుడే పాన్, ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు హెల్త్, ట్రావెల్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలోనే గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ కోసం పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సమర్పించడం తప్పనిసరి. అన్ని రకాల బీమా ప్లాన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది’’అని పాలసీబజార్ సీఈవో సర్బ్వీర్ సింగ్ తెలిపారు. బ్యాంక్ పాస్‌బుక్ కాపీ పనికిరాదు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు కేవైసీ కింద చిరునామా ధ్రువీకరణ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ కాపీ ఇస్తే గతంలో అనుమతించేవారు. ఇప్పుడు ఇవి చెల్లుబాటు కావు. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లెటర్, ఆధార్‌ను సమర్పించొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం ఇప్పటికీ బ్యాంకు స్టేట్మెంట్ కాపీ ఇవ్వొచ్చు. ఎన్పీఎస్ పాక్షిక ఉపసంహరణలు కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఎన్పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణకు సంబంధించి నోడల్ ఆఫీసర్ ధ్రువీకరణ తప్పనిసరి నిబంధన నుంచి పీఎఫ్ఆర్డీఏ ఉపశమనాన్ని ఇచ్చింది. దీంతో నోడల్ ఆఫీసర్ లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ నుంచి ఆమోదం అవసరం లేకుండానే ఎన్పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణలకు వెసులుబాటు 2021 జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కరోనా దాదాపు స్వల్ప స్థాయికి చేరడం, లాక్డౌన్ తదితర నిబంధనలు లేకపోవడంతో తిరిగి పాత నిబంధనను పీఎఫ్ఆర్డీఏ అమల్లోకి తీసుకొచ్చింది. కనుక ఈ జనవరి1 నుంచి ఎన్పీఎస్ కింద ప్రభుత్వ చందాదారులు గతంలోని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. లకార్పై రుణం బ్యాంక్ లాకర్లో ఆభరణాలతోపాటు విలువైన పత్రాలను పెట్టుకోవడం సహజం. లాకర్ అద్దె చెల్లించడంలో విఫలమైన కస్టమర్లను లాకర్ స్వాధీనం చేయాలని కొన్ని బ్యాంకులు సూచిస్తాయి. లాకర్లో ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చని బ్యాంక్‌లు కస్టమర్లకు చెబుతుంటాయి. అలా చేస్తే రుణంపై ప్రాసెసింగ్ చార్జీలు, వ్యాల్యూయర్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. గోల్డ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ సుదుపాయంలో.. కావాల్సినప్పుడే రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్నప్పుడు రుణంపై నామమాత్రపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగించుకోకపోతే లాకర్ చార్జీల కంటే తక్కువే చెల్లిస్తే సరిపోతుంది. కానీ, దీని కంటే కూడా లాకర్లో ఉంచిన ఒకటి రెండు ఆభరణాలపై నేరుగా గోల్డ్ లోన్ తీసుకోవడమే నయం. అంతే కానీ, లాకర్ల ఆధారంగా ఇచ్చే గోల్డ్‌లోన్ కు వెళ్లకపోవడమే మంచిదని నిపుణుల సూచన. (క్లిక్: పన్ను ఆదా.. స్థిరమైన రాబడులు పొందాలంటే ఈ స్కీమ్‌లో చేరాల్సిందే!) -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
కేవైసీ (KYC) సమాచారంలో ఎలాంటి మార్పులు లేకపోతే... రీకేవైసీ (Re-KYC) ప్రకక్రియను పూర్తి చేసేందుకు ఖాతాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. కస్టమర్ నమోదిత ఇ-మెయిల్ , ఏటీఎం, ఫోన్ నంబరు, డిజిటల్ ఛానల్లు (ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్), తదితరాల రూపంలో స్వీయ ధ్రువీకరణ ద్వారా కేవైసీని పూర్తి చేసే సదుపాయాలను ఖాతాదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. రీ-కెవైసి ప్రక్రియ కోసం కస్టమర్లు బ్యాంకులకు వెళ్లాల్సిన అనవసరం లేదు కాబట్టి ఇది వారికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందనే చెప్పాలి. ఒకవేళ అడ్రస్‌లో మార్పు మాత్రమే ఉన్నట్లయితే, కస్టమర్లు ఈ ఛానెల్‌లలో దేని ద్వారానైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండు నెలల్లోగా డిక్లేర్డ్ అడ్రస్ని బ్యాంక్ వెరిఫికేషన్ చేస్తుంది. కొత్తగా కేవైసీ ప్రక్రియ చేయాలనుకున్న కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించడం ద్వారా లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా రిమోట్‌గా చేయవచ్చని’ అర్బీఐ తెలిపింది. చదవండి: కొత్త చిక్కుల్లో ఎలాన్ మస్క్.. ఈ సారి పెద్ద తలనొప్పే వచ్చింది! -
పెన్షన్.. పరేషాన్! నగదు జమ కాక లబ్ధిదారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా బ్యాంక్ ఖాతాలకు కేవైసీ ప్రక్రియ చిక్కుముడిగా తయారైంది. బ్యాంకు ఖాతాల ద్వారా కొంత కాలంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రెండు, మూడు నెలలుగా పింఛన్ సొమ్ము జమకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్ అప్డేట్ సమస్య కూడా వెంటాడుతోంది. లబ్ధిదారులు తహసీల్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు సరైన సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు పింఛన్ల కోసం ఆందోళన చెందుతున్నారు. కార్డుల పంపిణీలో నిర్లక్ష్యమే ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో పాటు పాత లబ్ధిదారులకు సైతం ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులను ముద్రించింది. లబి్ధదారులు ఇళ్లు మారడంతో పాటు పంపిణీకి చిరునామా సమస్య తలెత్తింది. దీంతో సగానికి పైగా కార్డులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. కనీసం వార్డుల సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం ఎమ్మెల్యేల ద్వారా కొన్ని కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల 65 ఏళ్ల వృద్ధులతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతేడాది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తోంది. బ్యాంక్ ఖాతాకు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రధాన సమస్యగా పరిణమించింది. చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే రిజిస్టర్డ్ అడ్రస్‌కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్డేట్ ఇంకా పెండింగ్‌లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్బీ అధికారికి ట్వీటర్లో ట్వీట్ చేసింది. ట్వీట్లో ఏముంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్‌లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. KYCని ఎలా అప్డేట్ చేయాలి పీఎన్బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటోలు, పాన్ కార్డ్, ఇన్‌కం ప్రూఫ్, మొబైల్ నంబర్లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు (తమ బ్యాంక్ అకౌంట్లో రిజస్టర్ చేసుకున్న ఈమెయిల్ ద్వారా), లేదా వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు. Points to be noted 👇🏻 Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL — Punjab National Bank (@pnbindia) November 20, 2022 చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే? -
సంవత్సరానికి రూ.436 కడితే.. రూ.2 లక్షల బెన్ఫిట్
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని అందిస్తోంది. అతి తక్కువ ప్రీమియంతో ఈ స్కీమ్ లబ్ధి దారులు రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్‌లో చేరిన వారు సంవత్సరానికి రూ.436 చెల్లించి రూ.2 లక్షల వరకు జీవిత బీమా భద్రతను పొందవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షల్ని కేంద్రం అందజేస్తుంది. పథకంలో ఎలా చేరాలి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ స్కీమ్‌లో చేరేందుకు బ్రాంచ్ బ్యాంక్, పోస్టాఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న మొత్తం అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. అర్హతలు ఇవే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. రూ. 2 లక్షలు ఎలా వస్తాయి? పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.436 కట్టాలి. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి రూ.2 లక్షల అందజేస్తారు. -
అన్నింటికీ ఒక్కటే కేవైసీ
న్యూఢిల్లీ: అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘సెంట్రల్ కేవైసీ కోసం సెంట్రల్ రిపాజిటరీ ఉంది. అయితే, ఒక్కసారి కేవైసీ ఇస్తే పలు ఆర్థిక సంస్థల వద్ద, వేర్వేరు సమయాల్లో, పలు అవసరాలకు అది ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించాం. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది’’అని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఫిక్కీ లీడ్స్ 2022 కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లకు ఉమ్మడి కేవైసీ విధానంపై ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఆర్థిక శాఖ మధ్య గత వారం సమావేశంలో చర్చ జరగడం గమనార్హం. జూలై నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లు దాటిందని, 628 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో యూపీఐ లావాదేవీలను రోజుకు 100 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ మరింత డిజిటైజ్ అవుతుందన్నారు. ప్రభుత్వం, ఫిన్‌టెక్ సంస్థల మధ్య సయోధ్య పెరగాలి ప్రభుత్వం, ఫిన్‌టెక్ పరిశ్రమ మధ్య దూరం తగ్గాలని, సయోధ్య పెరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీల నమ్మకాన్ని చూరగొనేందుకు పరిశ్రమ మరింత తరచుగా సంప్రదింపులు జరుపుతుండాలని ఆమె సూచించారు. ‘దూరం వల్ల అపనమ్మకం పెరుగుతుంది. కాబట్టి దూరం తగ్గించుకోవాలి. ప్రభుత్వంతో మరింతగా సంప్రదింపులు జరపాలి. ఎంత తరచుగా సంప్రదింపులు జరిగితే అంత ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది‘ అని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిశ్రమ, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం నెలకొనేలా చూసేందుకు తీసుకోతగిన చర్యలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. చర్చించేందుకు, ఐడియాలను పంచుకునేందుకు ప్రధాని సహా ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులు అందరూ కూడా సదా అందుబాటులోనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుందని వివరించారు. ఫిన్‌టెక్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలను పరీక్షించుకునేందుకు, ఫలితాలను బట్టి వాటిని విస్తరించేందుకు ఆర్బీఐ రూపొందించిన శాండ్బాక్స్ విధానం తోడ్పడుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022–23లో 7 శాతం వృద్ధి భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల నేపథ్యంలో క్రితం 8 శాతం అంచనాలను ఒకశాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఆర్థిక రికవరీ బాగుందని పేర్కొన్న ఆయన, ఈ దిశలో అన్ని స్తాయిల్లో మరింత సమన్వయ చర్యలు అవసరమని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో అన్నారు. కోవిడ్ అనంతర సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధికి విఘాగంగా ఉన్నాయని అన్నారు. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
కోటక్, ఇండస్ ఇండ్ బ్యాంకులకు ఆర్బీఐ షాక్!
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం దీనికి కారణమని పేర్కొంది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది. నిర్దిష్ట నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్ఇండ్ బ్యాంక్‌పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్ జీవన్ కో–ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్ బ్యాంక్ (కోల్‌కతా), ది పళని కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలిపింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్, మీకు ఈ మెసేజ్ వచ్చిందా!
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? మీ బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?అయితే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq — State Bank of India (@TheOfficialSBI) March 4, 2022 కేవైసీ సబ్మిట్ చేయకపోతే అకౌంట్లను బ్లాక్ చేస్తామని వస్తున్న మెసేజ్‌లపై కేంద్రం అప్రమత్తమైంది.ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఎస్బీఐ ఖాతాదారుల్ని టార్గెట్ చేశారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తులు కాల్ చేసినా,మెయిల్స్ పెట్టినా రిప్లయి ఇవ్వొద్దని తెలిపింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున వచ్చిన మెసేజ్‌లకు సమాధానాలు ఇచ్చి ఉంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని తెలిపింది. A message in circulation claiming that your @TheOfficialSBI account has been blocked is #FAKE #PIBFactCheck ▶️ Do not respond to emails/SMS asking to share your personal or banking details. ▶️ If you receive any such message, report immediately at report.phishing@sbi.co.in pic.twitter.com/Y8sVlk95wH — PIB Fact Check (@PIBFactCheck) May 18, 2022 ఇప్పుడు రెండో సారి డియర్ కస్టమర్ మీ ఎస్బీఐ బ్యాంక్ డాక్యుమెంట్లకు కాలం చెల్లింది. అందుకే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 24గంటల్లోపు కేవైసీ సబ్మిట్ చేయండి. అందుకోసం మేం పంపిన లింక్స్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయండి అంటూ సైబర్ నేరస్తులు ఓ లింక్‌ను ఎస్బీఐ ఖాతాదరులకు పంపిస్తున్నారు. ఇలా పంపడం ఇదే తొలిసారి కాదని, ఈ ఏడాది మార్చిలో ఒకసారి ఈ తరహా లింక్స్ పంపినట్లు ఎస్బీఐ అధికారికంగా తెలిపింది. అకౌంట్ హోల్డర్లు ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది. అనుమానం ఉంటే బ్యాంక్ అధికారుల్ని సంప్రదించాలని ట్వీట్లో పేర్కొంది. -
ఇకపై తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే..
న్యూఢిల్లీ: ఫోన్ కాంటాక్ట్స్ జాబితాలో ఉన్నవారి నుంచి కాల్ వస్తే వారి పేరు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే పేరు తెలిసేది ఎలా? కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ అంశంపై పరిశ్రమతో సంప్రదింపులు జరపడానికి టెలికం శాఖ నుంచి సూచన అందుకున్నట్టు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. కొన్ని నెలల్లో సంప్రదింపులు మొదలుకానున్నాయని ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా వెల్లడించారు. ఇలాంటి ఫీచర్‌ను అమలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే ఆలోచిస్తోంది. కానీ ఇప్పుడు టెలికం శాఖ నుండి నిర్దిష్ట సూచనతో దీనికి సంబంధించిన పని త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విధానం అమలైతే కాల్ చేస్తున్న వారిని గుర్తించడంతోపాటు కచ్చితత్వం, పారదర్శకత, చట్టబద్ధత ఉంటుందన్నది ట్రాయ్ ఆలోచన. మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకునే సమయంలో టెలికం కంపెనీలకు వినియోగదారు అందించే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల ఆధారంగా కాల్ చేస్తున్నవారి పేరు ఫోన్ స్క్రీన్ మీద దర్శనమీయనుంది. చదవండి: వద్దురా బాబు అంటున్నా వినకుండా.. -
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది, పాన్‌తో ఆధార్ లింక్ చేశారా!..చేయకపోతే..!
అవును..మరో నాలుగు రోజుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ సందర్భంగా నాలుగు ముక్కలు. 2021–22 ఆర్థిక సంవత్సరం 31–03–2022తో ముగియనుండటంతో .. ఏదైనా కారణం వల్ల చేయాల్సిన విధులు చేయకపోతే, ఇంకా టైమ్ ఉంది. త్వరపడండి. ► వాస్తవానికి 31–03–21తో పూర్తయ్యే సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేయడానికి గడువు తేదీ 31–07–21. తర్వాత రెండు సార్లు పొడిగించారు. 31–12–2021 తర్వాత పెనాల్టీతో వేసుకోవ చ్చు. ఆ గడువు కూడా 31–03–22తో ముగు స్తుంది. ఈ గడువు దాటితే ఇక రిటర్ను వేయలేరు. రిటర్ను వేయకపోతే ఏర్పడే నష్టాలు మీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకుండా నడుం కట్టండి. రిటర్నులు దాఖలు చేయండి. ► అడ్వాన్స్ ట్యాక్స్ 15–03–2022 లోపల చెల్లించాలి. నాలుగు విడతల్లో జూన్ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే వడ్డీ పడుతుంది. అశ్రద్ధ వద్దు. 15–03–22 లోపల చెల్లించకపోయినా కనీసం 31–03–22 లోగా చెల్లించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ తగ్గుతుంది. రెండోది రిటర్నులు వేసే వరకు ఆగకుండా రుణం కోసమో వీసా కోసమో ఈ చలాన్లను బట్టి మీ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. ► ఇక ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్మెంట్లు.. సేవింగ్స్.. చెల్లింపులు మొదలైనవి చేయవచ్చు. 80సి కింద ఏ ప్రయోజనం పొందాలన్నా 31–03–22 లోపల చెయ్యాలి. గత 4 వారాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న .. ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ..సేవింగ్స్..వివరాలు మీకు తెలియజేశాము. బ్యాంకులో డిపాజిట్ చేయండి. మదుపు ఖాతా జమలు మీ ఖాతాలో ఖర్చు పడేలా తొందరపడండి. కొన్ని క్లెయిమ్‌లను చెల్లించడం జరిగితేనే మినహాయింపు పొందగలరు .. మరిచిపోతే ప్రయోజనం ఉండదు. మెడిక్లెయిమ్ .. డొనేషన్లు ఇలా ఎన్నో ఉంటాయి. త్వరపడండి. ► ఇక నాలుగోది.. పాన్‌తో ఆధార్ అనుసంధానం. ఎన్నో గడువు తేదీలు..ఎన్నో సార్లు వాయిదాలు ఇచ్చారు. ఇక వెయిట్ చేయవద్దు. అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. పెన్షన్, స్కాలర్షిప్, గ్యాస్ సబ్సిడీ ఈ కోవకి వస్తాయి. దీన్ని పాటించకపోతే సెక్షన్ 272బి ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా కేవైసీ పథకం కింద గడువు తేదీ 31–3–22 అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్, మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఈ మధ్య ఎందరో ప్రముఖులు, సినీ హీరోలు .. ఈ చట్టప్రకారం శిక్షార్హులయ్యారు. అశ్రద్ధ వద్దు. కేవైసీ కాగితాలు సమర్పించండి. ఇవన్నీ పూర్తి చేసి.. ప్రశాంతంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడదాం. -
మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!
ప్రతి ఏడాది కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి చాలా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అందులో భాగంగానే మార్చి చివరిలో, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చాలా పాత నిబంధనలు మారుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక కూడా తప్పనిసరి. ఏడాది పూర్తవుతున్నా కొన్ని పనులు పూర్తిచేయకపోతే మనం నష్టపోవాల్సి వస్తోంది. మార్చి 31లోపు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను రిటర్న్ ఎవై 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా రూ.10,000 వరకు విధించే అవకాశం ఉంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి. పాన్ నెంబర్‌తో - ఆధార్ లింకు ఆధార్ లింకింగ్ గడువు తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021న గడువును పొడిగించిన తర్వాత మీ పాన్ నెంబర్‌ను- ఆధార్ నెంబర్‌తో చట్టాల ప్రకారం లింకు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గడువు తేదీలోగా రెండు డాక్యుమెంట్ లింక్ చేయడంలో విఫలమైనట్లయితే మీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బి కింద మీరు రూ.10,000 జరిమానా విధించవచ్చు. కేవైసీ అప్డేట్ బ్యాంక్ ఖాతాలలో కేవైసీని పూర్తి చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పాన్ చిరునామా రుజువు, బ్యాంక్ సూచించిన ఇతర సమాచారంతో సహా కేవైసీ అప్డేట్'లో భాగంగా సమర్పించాలి. పన్ను ఆదా ఈ సంవత్సరానికి మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి, సెక్షన్ 80C కింద పన్ను ఆదా కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు మార్చి 31లోపు కనీస సహకారం అందించాలి. కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఖాతా క్లోజ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో డేటాసెంటర్.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా) -
కెవిన్ పీటర్సన్ లా మీరు మీ పాన్ కార్డ్ ను పోగొట్టుకున్నారా? తిరిగి పొందండిలా!!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్ బ్రాడ్ కాస్టర్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల భారత్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పాన్ కార్డ్ పోగొట్టుకున్నాడు.పాన్ కార్డ్ పోవడంతో కంగారు పడిన కెవిన్ భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు. కెవిన్ విజ్ఞప్తికి ఐటీ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య మనకే ఎదురైతే? ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే ఎలా తిరిగిపొందాలి? ఎలాంటి ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. ►పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ పాన్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ►ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ‘Changes or correction in existing PAN data/ Reprint of PAN card’. అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అందులో మన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సమ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ►అనంతరం మీకు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడిపై టోకెన్ నంబర్ ఐడికి టోకెన్ నెంబర్ వస్తుంది. ►తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ►అందులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ►ఇప్పుడు మీరు వ్యక్తిగత వివరాల డాక్యుమెంట్స్ ఫిజికల్ కాపీలను పాన్ కార్డ్ సేవల యూనిట్ ఎన్ ఎస్డీఎల్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. లేదా ఈకేవైసీ కోసం ఇ-సైన్ ఇన్ అవ్వాలి. ► అందులోదొంగతనం జరిగితే, ఎఫ్ఐఆర్ను జత చేయండి. ►ఇప్పుడు తదుపరి మెనులో కార్డును స్వీకరించే మోడ్‌ను ఎంచుకోండి. మీరు ‘ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా?’ కింద ‘అవును’ ఎంచుకుంటే, కార్డ్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి పంపబడుతుంది. లేదంటే, రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్‌ను సంబంధిత శాఖ అధికారులు పంపిస్తారు. ►'సంప్రదింపు వివరాలు, పత్రం వివరాలు వంటి మిగిలిన వివరాలను పూర్తి చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ►చెల్లింపు పేజీలో అవసరమైన చెల్లింపును చెల్లించి రసీదును పొందండి ►ఇప్పుడు, మీరు మీకు పంపిన 15-అంకెల రసీదు సంఖ్యను ఉపయోగించి మీ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ►దరఖాస్తు చేసిన 14 రోజుల్లోగా కార్డ్ పంపబడుతుంది. -
డిసెంబర్ 31 డెడ్‌లైన్...! వీటిని పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి..? లేకపోతే మీకే నష్టం..!
2021 ఎండ్ కాబోతుంది. కొత్త ఏడాది 2022 మరో నాలుగు రోజుల్లో రానుంది. పలు ఆర్థిక కార్యకలాపాలకు, ద్రువీకరణలకు, ఆధార్ లింక్‌కు, పలు ఖాతాల కేవైసీ అప్డేట్కు డిసెంబర్ 31తో డెడ్‌లైన్ ముగియనుంది. వీటిని పూర్తి చేయకపోతే ఆయా సంస్థలు అందించే ఫలాలు నష్టపోయే అవకాశం ఉంది. ► జీవన ద్రువీకరణ: పెన్షనర్లు జీవన ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికెట్)ను సమర్పించాల్సిన గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రతి ఏడాది నవంబర్ 30లోపు ప్రభుత్వ ఫించనుదారులు వారి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉండేది. అప్పుడే పెన్షన్‌దారులు ఎలాంటి అవాంతరాలూ లేకుండా పెన్షన్ పొందవచ్చును. బ్యాంకు, పోస్టాఫీసు, డోర్ స్టెప్, ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో ఆన్లైన్ ద్వారా గానీ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చును. ► ఆధార్, పీఎఫ్ లింక్: ఈపీఫ్ ఖాతాకు, ఆధార్‌ను అనుసంధానించడాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తప్పనిసరి చేసింది. ఆధార్ అనుసంధానం కోసం డిసెంబరు 31, 2021 వరకు గడువు ఇచ్చింది. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాలకు ఈసీఆర్ దాఖలు చేయలేరు. దీంతో ఆయా సంస్థలు అందించే కాంట్రీబ్యూషన్ నిలిచిపోతుంది. ► ఈపీఎఎఫ్ఓ ఈ-నామినేషన్ దాఖలు: ఈపీఎఫ్‌వో చందాదారులు డిసెంబరు 31లోపు ‘ఈ-నామినేషన్’ ప్రక్రియను పూర్తిచేయాలి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు గరిష్ఠంగా రూ.7 లక్షల బీమా హామీ లభిస్తోంది. ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్లైతే, కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద బీమా ప్రయోజనం అందుతుంది. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. ► ఐటీఆర్ ఫైలింగ్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. కోవిడ్-19, ఆదాయపు పోర్టల్‌లో వచ్చిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఐటీఆర్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువు ముగిసేలోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే..టాక్స్ చెల్లింపుదారులుపై రూ.5 వేలు పెనాల్టీ కట్టాల్సి వస్తోంది. ► డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ: స్టాక్చేంజ్లో ట్రేడింగ్ చేసే వారు తమ డీమ్యాట్ ఖాతాల కెవైసీ పూర్తి చేయాలని సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సూచించింది. కేవైసీ పూర్తి చేసేందుకు డిసెంబరు 31 వరకు గడువు పొడిగించింది. చదవండి: అలర్ట్: జనవరిలో నెలలో బ్యాంక్ హాలిడేస్..! ఎన్ని రోజులంటే..! -
స్టాక్ మార్కెట్,నెలాఖరులోగా పాన్–ఆధార్ లింక్ చేసుకోవాలి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 30 నాటికి తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సెబీ కోరింది. తద్వారా లావాదేవీలు సాఫీగా నిర్వహించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. పాన్–ఆధార్‌తో లింక్ చేసుకోవాలని కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో కోరుతోంది. కాకపోతే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 30 వరకు పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు ఉంది. గడువులోపు లింక్ చేసుకోకపోతే పాన్ పనిచేయదు. పాన్ పనిచేయనప్పుడు కేవైసీ అసంపూర్ణంగా మారుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అని తెలిసిందే. దీంతో పాన్ బ్లాక్ చేయడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని, కొత్తగా పెట్టుబడులు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ‘‘సెక్యూరిటీస్ మార్కెట్లో అన్ని లావాదేవీలకు పాన్ ఏకైక గుర్తింపు సంఖ్య. సీబీడీటీ నోటిఫికేషన్ నిబంధనలను సెబీ నమోదిత సంస్థలు అమలు చేయాలి. సెప్టెంబర్ 30 తర్వాత కొత్త ఖాతాల ప్రారంభానికి ఆపరేటివ్ పాన్నే అనుమతించాలి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
కేవైసీ మోసాలు: కన్ఫ్యూజ్ కాకండి.. ఇలా చేయండి
KYC Frauds Alert: ఓవైపు బ్యాంకులు.. మరోవైపు టెలికామ్ ఆపరేటర్లు ‘కేవైసీ అప్డేట్’ పేరిట కస్టమర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఓసారి ‘అప్డేట్ తప్పనిసరి’ అంటున్నాయి. మరోసారి ‘మోసాలు జరుగుతున్నాయి..జాగ్రత్త!’ అంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో గందరగోళంలో పడిపోయి కస్టమర్ ఆ కన్ఫ్యూజింగ్ స్టేజ్‌లోనే మోసగాళ్ల బారినపడుతున్నారు. కాబట్టి, అయోమయానికి గురికాకుండా.. జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: నో యువర్ కస్టమర్(కేవైసీ) స్కామ్ ద్వారా వ్యక్తిగత డేటాను స్కామర్లు తస్కరించే అవకాశం ఉంటుందని తన 27 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను హెచ్చరించింది వొడాఫోన్ ఐడియా(Vi). ఇక వీఐ కంటే ముందు ఎయిర్టెల్ కూడా ఇలాంటి ఓ హెచ్చరికే జారీ చేసింది. మరోవైపు ఎస్బీఐ లాంటి బడా బ్యాంకులు కూడా అదే తోవలో పయనిస్తూ కేవైసీ మోసాలపై కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. కేవైసీ అప్డేట్ పేరుతో వ్యక్తిగత వివరాలను, సంబంధిత డాక్యుమెంట్ల సమాచారాన్ని సేకరించి.. కొన్నేళ్లుగా పక్కా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ఈ మధ్య అలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండడం కస్టమర్లకు అవసరం కూడా. హలో, కస్టమర్ సర్వీస్ నుంచి.. కేవైసీ మోసాల కోసం హై ఫ్రొఫైల్ టెక్నికల్నేం మోసగాళ్లు ఉపయోగించడం లేదు. సింపుల్‌గా.. టెలికామ్ ఆపరేటర్ల కంపెనీలు, బ్యాంకుల పేరిట మెసేజ్‌లు పంపుతున్నారు. కస్టమర్ సర్వీస్, ఆథరైజేషన్ వింగ్ నుంచి ప్రతినిధులమంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తక్షణమే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని.. లేకుంటే బ్యాంక్ సేవలు నిలిపివేస్తామని, సిమ్ బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పైగా పరిష్కారం ఇదేనంటూ కొన్ని మెసేజ్‌లు, లింకులు పంపుతున్నారు. లేదంటే ఫలానా టోల్‌ఫ్రీ(ఫ్రాడ్) నెంబర్‌కి ఫోన్ చేయమని.. వాళ్లిచ్చే సూచనలు ఫాలో అవ్వమని అదీ కుదరదంటే ఫలానా మెసేజ్‌లకు రిప్లైలు ఇవ్వమని యూజర్లను, సబ్స్క్రయిబర్లను కోరుతున్నారు. పని తేలికగా అయిపోతుంది కదా అని వివరాలు ఇచ్చేస్తున్నారు చాలామంది. ఇక చదువుకున్న వాళ్లను, కొద్దిగా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లను బోల్తా కొట్టించడానికి ‘యాప్’ ఇన్స్టాల్ చేసుకుని.. అందులో వివరాలు నింపమని అడుగుతున్నారు. ఓవరాల్‌గా.. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో కీలక సమాచారం లాగేసి కస్టమర్లను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. లైట్ తీస్కోవద్దు KYC మోసాల తరుణంలో టెలికామ్ కంపెనీలు, బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. తమ తరపున అలాంటి సందేశాలు, కాల్స్ రావని.. ఒకవేళ వచ్చినా అప్రమత్తం చేస్తాయే తప్పా వ్యక్తిగత వివరాలను అడగవనే విషయాన్ని గుర్తించాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. అంతేకాదు థర్డ్ పార్టీ యాప్(సంబంధం లేని యాప్‌లు) ఇన్స్టాల్ ఎట్టిపరిస్థితుల్లో చేసుకోకూడదని హెచ్చరిస్తున్నాయి కూడా. అయితే కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో ఏది సిసలో.. ఏది నకిలీనో గ్రహించలేక కస్టమర్లు నష్టపోతున్నారు. అవగాహన లేకపోవడమో లేదంటే నిర్లక్క్ష్య ధోరణి వల్లనో ఇలాంటి ఆన్లైన్ మోసాలను లైట్‌గా తీసుకునే కస్టమర్లే ఎక్కువగా ఉంటున్నారు మన దేశంలో. ఇది సాకుగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. (ఆన్లైన్ మోసాల బారినపడుతున్న దేశాల్లో టాప్ ప్లేస్ మనదే). ఫిర్యాదులు చేయడం, సంబంధిత విభాగాలను సంప్రదించడం వల్లే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టపడేదని గుర్తించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా డీల్ చేయండి ఈ-మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్స్, అడ్రస్, ఆధార్ డిటెయిల్స్, ఫొటో.. ఏది పంపినా, ఏ వివరాలు చెప్పిన కేవైసీ మోసాల బారిన పడే అవకాశం కచ్ఛితంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టే ప్రయత్నం కాదు.. జరుగుతున్నది చెప్పడమే అంటున్నారు. ఈ మధ్య కొన్ని బ్యాంకింగ్ సర్వీసులు, టెలికామ్ సంబంధిత వ్యవహారాలు ఫోన్లు, యాప్‌లలోనే నడుస్తున్నాయి. వాట్సాప్, మెయిల్స్ ద్వారా డాక్యుమెంటేషన్ నిమిషాల్లో నడిచిపోతోంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల లోన్లు, హెల్త్ ఇన్సూరెన్ల విషయంలో ఇది ఎక్కువగా నడుస్తోంది. కాబట్టి, అవతల ఉంది నిజమైన ఎంప్లాయేనా అని నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లాలి. ఇక టెలికామ్ కంపెనీల నుంచి వచ్చే మెసేజ్‌లు పర్టిక్యులర్‌గా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. వోడాఫోన్ ఐడియా నుంచి వచ్చే మెసేజ్‌లు ViCARE అని ఉంటాయి. ఇందులోనూ స్పెల్లింగ్ మిస్టేక్‌తో మోసాలకు పాల్పడే ఛాన్స్ ఉంది కాబట్టి.. మెసేజ్‌ను నిశితంగా పరిశీలించాలి. అంతేతప్ప కంగారుపడిపోయి వివరాలను అవతలి వాళ్లకు రివీల్ చేయకూడదు. మరోవైపు బ్యాంకింగ్ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కేవైసీ అప్డేట్ సందేశాలు, కాల్స్ వస్తే.. స్వయంగా బ్యాంక్‌కు వెళ్లి కనుక్కోవాలి. అవసరమైతేనే డాక్యుమెంట్లు సమర్పించాలి. అంతేతప్ప కాల్స్, మెసేజ్‌లకు బదులివ్వకూడదు. సిమ్ కేవైసీ వ్యవహారాల్లోనూ సంబంధిత స్టోర్లకు వెళ్లి కనుక్కోవాలి. ఇంట్లో చదువుకోని వాళ్లకు ఇలాంటి కాల్స్ వస్తే ఎలా స్పందించాలో తెలియజెప్పాలి. కస్టమర్ సెంటర్‌కు కాల్ చేయడమో లేదంటే బ్యాంకుకు వెళ్లి కనుక్కోవడమో చేయాలని చెప్పాలి. అంతేతప్ప భయపడి వివరాలు చెప్పకూడదని వివరించాలి. బ్యాంకింగ్ అయినా.. సెల్యూలార్ అయినా అధికారిక టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి ధృవీకరించుకోవడమో లేదంటే స్వయంగా వెళ్లి కనుక్కోవడమో చేయాలి. వీలైతే ఫిర్యాదులు చేయాలి. నిర్లక్క్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వీఐపీ నెంబర్ స్కామ్ ఈ-కేవైసీ మోసాలు మాత్రమే కాదు.. ఈమధ్య వీఐపీ నెంబర్ స్కామ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. భారీ డిస్కౌంట్‌తో వీఐపీ నెంబర్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు కొందరు. అయితే టోకెన్ కోసం ప్రీ పేమెంట్ చేయాలని కోరుతున్నారు. డిజిటల్ పే అయినా ఫర్వాలేదని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే సిమ్ జారీల విషయంలో ‘థర్డ్ పార్టీ’లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని హెచ్చరిస్తోంది సెల్యూలార్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ). -
పీఎఫ్ ఖాతాదారులు వెంటనే కేవైసి అప్డేట్ చేసుకోండి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖాతాదారుల పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతా వివరాలను, కేవైసి ప్రక్రియను అప్డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అప్పుడే ఎటువంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొంది. ఇటీవల, అనేక బ్యాంకులు విలీనం అయ్యాయి కాబట్టి మరోసారి వాటి ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారే అవకాశం ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసుకునేతప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి వారి వివరాలను అప్డేట్, కొత్త ఖాతాలను లింక్ చేయాలని ఇటీవల విలీనం అయిన ప్రభుత్వ బ్యాంకుల వినియోగదారులను ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ పీఎఫ్ ఖాతాలను బ్యాంకులతో లింక్ చేయనట్లయితే, ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లు వారి మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోలేరని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులు ఉన్నారు. ఇంకా పీఎఫ్ ఖాతాదారుల తమ ఖాతాలను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేసేయండి లేకపోతే వారు ఈపీఎఫ్ఓ ఇతర సేవలను ఉపయోగించుకోలేరు. చదవండి: ఎస్బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది? -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. మీరు కనుక ఎస్బీఐ ఖాతాదారులు అయితే వెంటనే మీ కెవైసీ వివరాలను అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. 2021 మే 31 లోగా వినియోగదారులు అందరూ కేవైసీ వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని కోరుతూ ట్విట్టర్, ఇమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం ఇచ్చింది. కాబట్టి ఎస్బీఐ ఖాతాదారులు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సిందే. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కస్టమర్లు పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా తమ కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపవచ్చు అని తెలిపింది. ఖాతాదారులు సంబంధిత పత్రాలను బ్యాంకుకు పంపితే సరిపోతుంది. అయితే కస్టమర్లు తమ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్ నుంచే కేవైసీ డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది. ఖాతాదారులు ప్రభుత్వం చేత గుర్తింపబడిన పాస్ పోర్ట్ ఐడీ, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, NREGA కార్డ్, పాన్ కార్డ్ వంటి వాటిలో ఏదైనా ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే కొందరు మోసాగాళ్లు కెవైసీ పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు ఎస్బీఐ గుర్తించింది. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరైనా కెవైసీ అప్డేట్ చేయకపోతే 24 ఖాతా బ్లాక్ అనే సందేశం వస్తే ఆ లింకుపై క్లిక్ చేయవద్దు అని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక పోర్టల్ ను సందర్శించాలని కోరింది. Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF — State Bank of India (@TheOfficialSBI) May 1, 2021 చదవండి: 5జీ ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు -
కేవైసీ అప్డేట్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా(ఆర్బీఐ) కేవైసీ అప్డేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కారణంగా 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు ,ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. నేడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో సూచించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కస్టమర్లను ఇటీవల కోరాయి. ఇందుకోసం మే 31 వరకు గడువును విధించాయి. అయితే ఆర్బీఐ మాత్రం తాజాగా కేవైసీ అప్ డేట్ గడువును డిసెంబర్ చివరి వరకు పొడగిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్ డేట్ చేసుకోకపోయిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరంతరంగా వారు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు -
SBI: ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్
ముంబై: ఎస్బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. కొద్దీ రోజుల క్రితమే గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు అని భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిర్ణయించింది. ఏప్రిల్ 30 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఇచ్చిన సమాచారంలో కస్టమర్ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా కెవైసి అప్డేట్ చేసిన అభ్యర్థనలను అంగీకరించాలని సూచించారు. ఈ చర్యను ఇతర ప్రభుత్వ రంగ రుణదాతలు అనుసరిస్తారని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లోని విధించిన కోవిడ్ -19 లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు పోస్ట్ ద్వారా స్వీకరించిన పత్రాల ఆధారంగా శాఖలు కేవైసీ నవీకరణను నిర్వహించగలవని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ నవీకరణ కోసం కస్టమర్‌ను వ్యక్తిగతంగా బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. "అంతేకాక కేవైసీ అప్డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం” అని ఎస్బీఐ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF — State Bank of India (@TheOfficialSBI) May 1, 2021 చదవండి: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ -
కొత్త అకౌంట్ తీసుకునే వారికి ఎస్బీఐ తీపికబురు!
కొత్తగా బ్యాంక్ ఖాతా తీసుకోవాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఖాతాదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వీడియో కేవైసీ ఆధారిత అకౌంట్ ఓపెనింగ్ సర్వీసు లాంచ్ చేసింది. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సేవల వల్ల ఖాతాదారులు శాఖకు వెళ్లకుండానే సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు అని ఎస్బీఐ వివరించింది. ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల్లో ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు అత్యవసరమని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. ఎస్బీఐలో బ్యాంక్ ఖాతా తెరవాలని భావించే వారు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఖాతా తెరవాలంటే యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత న్యూ టు ఎస్బీఐ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఓకే చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ వివరాలు సమర్పించాలి. ఆధార్ అథంటికేషన్ పూర్తైన తర్వాత వ్యక్తిగత వివరాలు అందించాలి. వీడియో కాల్ కేవైసీ పూర్తైన తర్వాత కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. 2017 నవంబర్ లో యోనో యాప్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డ్! -
‘కేవైసీ’ తెలుసుకోవాల్సింది ఎవరు?
ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజ లను వశపర్చుకొనే తంత్రం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ‘కేవైసీ’ అనే ఓ క్యాచీ స్లోగన్ వది లారు. అంటే నో యువర్ కాన్స్టి ట్యూషన్. ఇప్పటివరకూ కేవైసీకి నో యువర్ కస్టమర్ (నీ వినియోగ దారుని గురించి తెలుసుకో) అనే అర్థం ఉంది. మోదీ నో యువర్ కాన్ స్టిట్యూషన్ (నీ రాజ్యాంగాన్ని తెలుసుకో) అనే అర్థాన్నిచ్చి, భారత రాజ్యాంగ అమలుపై మరోసారి చర్చ జరిగేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 26, 2020న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత సభాపతుల ముగింపు సమావేశంలో మోదీ దీన్ని ప్రస్తావించడం విశేషం. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగంలో, చట్టాల్లో ఉన్న భాషను సరళతరం చేయాలని మోదీ చేసిన సూచన సముచితమైనది. రాజ్యాంగం ప్రతులు ప్రజలందరి దగ్గర ఉండాలి. ముఖ్యంగా, ప్రజాప్రతినిధుల వద్ద తప్పని సరిగా ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలిసినంత మాత్రాన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయా? గత 7 దశాబ్దాల అనుభవాలను చూసినట్లయితే అన్ని అక్ర మాలు రాజ్యాంగం నీడలోనే జరిగాయి. రాజ్యాంగం అమ లులో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దితేనే అన్ని వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తాయి. అంబేడ్కర్ ‘ఈ రాజ్యాంగం ఎంత మంచిదైనా కావొచ్చు. దీనిని అమలు జరిపేవారు మంచివారైతే ఇది మంచిదవుతుంది. చెడ్డవారైతే ఇది చెడ్డదవుతుంది’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నిజానికి, 5 ఏళ్ల క్రితమే 2016 నవంబర్ 26ను రాజ్యాంగదినంగా ప్రకటించి, నవంబర్ 26, 27 తేదీలలో రెండు రోజులపాటు ‘రాజ్యాంగానికి నిబద్ధులం’ అనే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్ పాలనలో అనేక రాజ్యాంగ వ్యవ స్థలు గాడి తప్పాయి. కాంగ్రెస్‌కు భిన్నంగా మోదీ నేతృ త్వంలో అన్ని వ్యవస్థలు రాజ్యాంగ సూత్రాలకు లోబడి పని చేస్తాయని ఆశించడం జరిగింది. గవర్నర్ల వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ... అన్నీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయ డానికి తగిన సంస్కరణలను ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుం దని ఆశించారు. గత ఆరేళ్ల అనుభవాలు చూసినట్లయితే రాజ్యాంగాన్ని ఓ దిక్సూచిలా చేసుకొన్నట్లు కనపడదు. అందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గతంలో కంటే మెరుగుపడిన దాఖలాలు లేవు సరికదా పలు అంశాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పీఠముడి పడేస్థాయికి చేరాయి. పశ్చిమ బెంగా ల్లో గవర్నర్ వ్యవహారశైలి వివాదంగా మారింది. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం దురదృ ష్టకరం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణల తర్వాత కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవడానికి కారణం సభాపతి (స్పీకర్/చైర్మన్) తన నిర్ణయాన్ని వెలువ రించడానికి నిర్ణీత కాలపరిమితి లేకపోవడం. ఇది ఫిరాయిం పుదారులకు వరంగా పరిణమించింది. 2014–19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అందులో నలు గురు రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఈ ప్రక్రియను సరిదిద్దడా నికి మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం చేయడం లేదు. 190వ ‘లా కమిషన్’ సిఫార్సులను అమలు చేయడం లేదా మరోసారి చట్టసవరణ చేయడం ద్వారా ఫిరాయింపుల జాడ్యాన్ని అరికట్టవచ్చు. అటువంటి చొరవ ఎన్డీఏ ప్రభు త్వంలో కనపడటం లేదు. పార్లమెంటులో చేసే చట్టాలను పటిష్టవంతంగా అమలు చేయడం కేంద్రానికున్న రాజ్యాంగ బాధ్యతల్లో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పార్లమెంట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014’లోని పలు అంశాలను ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదు. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా అందించా ల్సిన విధులు, నిధులు బదలాయించడంలో గత యూపీఏ అనుసరించిన మార్గంలోనే ఎన్డీఏ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అటకెక్కిన మహిళా రిజర్వే షన్ల బిల్లు చట్టరూపం దాల్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. వైద్యరంగంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రైవేటు వైద్యరంగం పాల్పడిన దాష్టీకాలనుండి గుణపాఠాలు నేర్చు కోవాలి. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు కబంధ హస్తాల నుండి విముక్తం చేసి వాటిని సార్వజనీనం చేయాలి. ప్రజల విశ్వసనీయతను కోల్పోతున్న వ్యవస్థల్లో ఒకటైన ‘భారత ఎన్నికల కమిషన్’ను మరింత సమర్థవంతంగా, పారదర్శ కంగా రూపొందించి ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షిం చదన్న భయాన్ని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు కలిగేలా సంస్కరణలు చేపడతారని ఆశించినప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. న్యాయవ్యవస్థ ప్రజలకు సమ న్యాయాన్ని, సత్వర న్యాయాన్ని అందించడానికి అవసర మైన సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందగలగాలి. దేశంలో దాదాపు 3,500కుపైగా వెనుకబడిన కులాలు ఉండగా అందులో 3,400 కులాలు ఇంతవరకు పార్లమెం టులోగానీ, అసెంబ్లీలోగానీ అడుగు పెట్టలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 100కుపైగా ఉన్న వెనుక బడిన కులాలవారికి దాదాపు 70కుపైగా ప్రత్యేక కార్పొ రేషన్లు ఏర్పరచి రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రోత్సాహం కల్పించడం దేశంలోనే ఓ విప్లవాత్మక ముందడుగు. అయితే, జనాభాలో 50 శాతంగా ఉన్న ఓబీసీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు పెంచాల్సిన అవ సరం ఉంది. ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకించి మంత్రి త్వశాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ దానిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వంలో కనపడటం లేదు. రాజ్యాంగానికి నిబద్ధులం అని చాటుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆకలి, అనారోగ్యం, పేదరికం నిర్మూలన, దోపిడీ, వివక్షల నుండి రక్షణ తదితర సామాజిక లక్ష్యాల సాధనలో ఏ మేరకు విజయం సాధించారన్నదే కొలమానం. రాజ్యాంగం అంటే చట్టపరమైన పత్రాలే కాదు, అదొక సామాజిక పత్రం అన్న అంబేడ్కర్ మాటల్ని చిత్త శుద్ధితో అమలు చేసి ఫలితాలు చూపించాలి. అప్పుడే రాజ్యాంగానికి కట్టుబడినట్లు భావించగలం. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
ఇంటి వద్దే ఈకేవైసీ
కాకినాడ సిటీ: గతంలో రైస్‌కార్డు (రేషన్‌కార్డు) పొందాలన్నా, అందులో తప్పొప్పులను సరి చేసుకోవాలన్నా పెద్ద ప్రహసనంగా ఉండేది. పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. నెలలు గడిచినా సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో నవశకం సర్వే ఆధారంగా కొత్త బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డుల్లో ప్రింటింగ్ తప్పొప్పులను సరి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా సాగుతోంది. ఇళ్లకు వచ్చే వలంటీర్లకు ప్రజలు సరైన సమాచారాన్ని ఇస్తే ప్రత్యేక యాప్ ద్వారా తప్పొప్పులను సరి చేస్తున్నారు. 41.08 లక్షల మంది వివరాలు నమోదు చేయాలి జిల్లాలో 14,67,777 కుటుంబాలకు రైస్ కార్డులు అందజేశారు. వాటిలో దాదాపు 41,08,299 మందికి ఈకేవైసీ (ఎలాక్ట్రానిక్ నో యువర్ క్లయింట్) వివరాలు నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి ఈకేవైసీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఈకేవైసీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9,51,702 కుటుంబాలకు చెందిన 21,54,158 మంది వివరాలు సేకరించారు. మిగిలిన 5,16,070 కుటుంబాలకు సంబంధించి 19,54,141 మంది ఈకేవైసీని తీసుకోనేందుకు వలంటీర్లు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం అందజేసిన 14,67,777 కార్డుల్లో చాలా వరకు కుటుంబ పెద్ద (కార్డు హోల్డర్), కార్డులోని ఇతరుల సంబంధాలు తికమకగా ఉన్నాయి. వీటిని సరి చేస్తున్నారు. కొన్ని కార్డుల్లో సంబంధం లేని వారి పేర్లు ఉండడంతో తొలగింపు, చేర్పుల ప్రక్రియ మొదలైంది. తొలగింపు విషయంలో కేవలం మృతుల పేర్లు, కుటుంబానికి సంబంధం లేని వ్యక్తుల వివరాలను తొలగిస్తున్నారు. చేర్పులు విషయంలో కొత్తగా పెళ్లయిన కోడళ్లు, ఏ కార్డులోనూ లేని వారిని వారి కుటుంబానికి ఉండే కార్డులో చేర్చుతారు. కొత్తగా 49,791 రైస్ కార్డులు జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు కోసం ‘స్పందన’లో దరఖాస్తు చేసుకున్న వారిలో 49,791 మంది రేషన్‌కార్డుల పొందేందుకు అర్హత పొందారు. వీరు ఇప్పటి వరకు ఎలాంటి రేషన్ కార్డు పొందలేదు. వీరికి కొత్తగా కార్డులు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. కార్డు మంజూరు ఉత్తర్వులు రావడంతో ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ సరుకులను ఇప్పటికే వీరు పొందుతున్నారు. పెండింగ్‌లో ఆధార్ సీడింగ్ రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడి ఆధార్ వివరాలు అందులో ఉన్నాయి. అయితే కొంతమందికి సంబంధించి తప్పుడు ఆధార్ నంబర్లు ప్రింట్ కావడంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. దీంతో వారికి రేషన్ అందడంలేదు. అయితే ఆధార్ సీడింగ్ తప్పొప్పులను సరి చేయడాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయని అంటున్నారు. వలంటీర్లే వివరాలు సరి చేస్తారు కొన్ని కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ముఖ్యంగా కుటుంబ పెద్దతోపాటు ఇతరుల వివరాలు తికమకగా ఉన్నాయి. కొందరికి ఈకేవైసీ లేదు. చనిపోయిన వారి పేర్లు తీసివేయడం, కొత్తగా పెళ్లి అయిన వారు, కార్డుల్లో లేని వారిని చేర్చడం తదితర వివరాలను వలంటీర్ల ద్వారా ప్రత్యేక యాప్‌తో సర్వే చేయిస్తున్నాం. ఇంటికి వచ్చిన వలంటీర్‌కు సరైన సమాచారం ఇచ్చి తప్పొప్పులను సరి చేసుకోవచ్చు. అర్హత ఉండి కొత్త రేషన్‌కార్డు కావాల్సిన వ్యక్తులు గ్రామ/వార్డు సచివాలయంలోనే దరఖాస్తులు ఇవ్వాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈకేవైసీ కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని వలంటీర్లకు ఆదేశాలిచ్చాం. ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరాం.– పి.ప్రసాదరావు,జిల్లా పౌరసరఫరాల అధికారి -
ఈపీఎఫ్‌వోలో జనన ధ్రువీకరణకు ఆధార్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) ఖాతాదారులు తమ జనన తేదీ ధ్రువీకరణకు ఆధార్ కార్డును రుజువుగా చూపవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలిచ్చిందని పేర్కొంది. ఖాతాదారులు తమ ఆధార్‌తో ఆన్లైన్లో కేవైసీ సమర్పించవచ్చని వివరించింది. రికార్డుల్లో ఉన్న పుట్టిన రోజుకు, ఆధార్‌లో జనన తేదీకి మధ్య మూడేళ్లలోపు ఉంటే అధికారులు ఆధార్‌నే పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందిపడే ఖాతాదారులు తమ మూడు నెలల బేసిక్ వేతనం, డీఏ ఉపసంహరించుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కేవైసీ ద్వారా పూర్తి వివరాలు అందజేసిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది. -
పేటీఎం కేవైసీ అప్డేట్ పేరుతో..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన వృద్ధుడికి కేవైసీ అప్డేట్ పేరుతో ఫోన్ చేసి, ఓ యాప్‌ను డౌన్లోడ్ చేయించి, రూ.8 లక్షలు కాజేసిన ఇద్దరు ఝార్ఖండ్ వాసుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వీరి చేతిలో మరికొందరు మోసపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌లోని జామ్‌తార జిల్లాకు చెందిన రాహుల్ మండల్, కపిల్ మండల్లతో కూడిన ముఠా గత ఏడాది సెప్టెంబర్‌లో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కాల్ చేసింది. తాము పేటీఎం నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న గ్యాంగ్ సభ్యులు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పారు. దానికోసమే అంటూ ఓ లింకును పంపారు. దీన్ని క్లిక్ చేయడంతో ఆయన స్మార్ట్‌ఫోన్‌లోని క్విక్ వ్యూవర్ యాప్ డౌన్లోడ్ అయింది. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన దీనికి సంబంధించి ఓ పాస్వర్డ్ చెప్పిన నేరగాళ్లు దాన్ని యాక్టివ్ చేసుకునేలా చేశారు. అలా చేయడంతో బాధితుడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ల్యాప్‌టాప్‌లో కనిపించడం మొదలైంది. దీని ఆధారంగా ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.8 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వినియోగించిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్ళారు. జార్ఖండ్ వెళ్ళిన ప్రత్యేక బృందం రాహుల్, కపిల్‌లను అరెస్టు చేసి తీసుకువచ్చింది. పది మంది బాధితులు బ్యాంకు ఖాతాలతో పాటు పే టీఎం తరహా యాప్స్‌కు ఆధార్ లింకేజ్ అని, అప్‌గ్రేడ్ కోసమని, కేవైసీ అప్డేట్ చేయాలని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ఇలాంటి కాల్స్‌కు స్పందించి వారు పంపిన లింకులు క్లిక్ చేయడం, వారు సూచించినట్లు ప్లే స్టోర్స్ నుంచి ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం చేయకూడదు. ఇలా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఖాతాల్లోని డబ్బు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఒక్క సోమవారమే ఇలాంటి బాధితులు పది మంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ఫోన్‌కాల్స్ వల్లో పడి వీటిని ఎవరూ డౌన్లోడ్ చేసుకోవద్దు. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్‌సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ,హైదరాబాద్ సైబర్ క్రైమ్ -
స్కామ్ మెసేజ్‌లతో జాగ్రత్త..
ముంబై: స్కామ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండడం ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కస్టమర్లకు పేటీఎం అధినేత విజయ్‌శేఖర్ శర్మ కోరారు. కంపెనీ అధికారులమంటూ మోసగాళ్లు పంపే ఈ మెయిల్స్, మెసేజ్‌ల వలలో పడిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘మీ పేటీఎం అకౌంట్ బ్లాకింగ్‌కు సంబంధించి లేదా కేవైసీ చేయాలని కోరుతూ ఎటువంటి మెస్సేజ్ వచ్చినా నమ్మకండి. వీరంతా మోసగాళ్లు’’ అని ట్విట్టర్ వేదికగా శేఖర్ శర్మ కోరారు. పేటీఎం కస్టమర్లు కొందరికి మోసగాళ్లు పంపిన ఎస్ఎంఎస్ ఫొటోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘కొంత సమయం పాటు మీ పేటీఎం అకౌంట్లోని నగదును నిలిపివేస్తున్నాం. పేటీఎం కేవైసీని పూర్తి చేయాల్సి ఉంది’’ అంటూ సంబంధిత ఎస్ఎంఎస్లో పేర్కొన్న విషయాన్ని ఆయన తెలిపారు. వ్యక్తిగత వివరాలను పొందేందుకు మోసగాళ్లు ఈ పనిచేస్తున్నారని, వారి మోసానికి గురికావద్దని సూచించారు. గడిచిన మూడు నెలల్లో వందలాది పేటీఎం కస్టమర్లు ఈ తరహా ఎస్ఎంఎస్లను చూసి కంపెనీ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయగా, కొందరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేవైసీ చేసేందుకు గాను మొబైల్ లేదా డెస్క్‌టాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరడం ద్వారా.. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్న అనంతరం అందులోని డేటాను తస్కరించడంతోపాటు, పేటీఎం వ్యాలెట్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి నగదును కూడా తరలించుకుపోతారు. -
‘యాప్’తో ఉఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న అంశాల్లో కేవైసీగా పిలిచే ‘నో యువర్ కస్టమర్’ విధానం కచ్చితం చేయడం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఇప్పటి వరకు కేవైసీ యాడ్ చేసుకోవాలంటూ టోకరా వేసి అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా దాని గడువు ముగిసిందని, ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలంటూ ఫోన్లు చేస్తున్నారు. తమ వల్లో పడిన వారి స్మార్ట్ఫోన్లలో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్లోడ్ చేయించి నిండా ముంచుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసుల సంఖ్య పెరిగిందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివిధ మార్గాల్లో డేటా సేకరణ.. ఈ తరహా మోసాలు చేసే వారికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న, ఆర్థిక లావాదేవీలు చేయడానికి వాలెట్ వినియోగిస్తున్న వారి వివరాలు తెలియడం ముఖ్యం. ఈ సైబర్ నేరగాళ్లు డార్క్ నెట్‌తో పాటు వివిధ మార్గాల్లో ఆ డేటాను సంగ్రహిస్తున్నారు. ఆపై ఆయా వినియోగదారులకు ఫోన్లు చేస్తూ తాము ఫలానా బ్యాంకు/వాలెట్ ప్రతినిధులమని పరిచయం చేసుకుంటున్నారు. ఈ కాల్ అందుకుంటున్న వారి ఆ బ్యాంకు ఖాతాదారుడు కావడమో, వాలెట్ వినియోగిస్తుండటమో చేస్తుండటంతో వారు సైబర్ నేరగాళ్ల వల్లో పడుతున్నారు. గతంలో అప్లోడ్ చేసిన కేవైసీ గడువు ముగిసిందనో, అది ఇన్‌వ్యాలీడ్‌గా మారిందనే చెప్పే సైబర్ నేరగాళ్లు ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే తక్షణం ఆన్లైన్లో మరోసారి కేవైసీని పొందుపరచాలని నమ్మబలుకుతున్నారు. టీమ్‌వ్యూవర్ తరహా యాప్.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్స్ వినియోగించే వారు ఓ సమూహంగా సమాచార మార్పిడి చేసుకునేందుకు, సందేహాల నివృత్తికి టీమ్ వ్యూవర్ అనే అప్లికేషన్ వాడుతుంటారు. సైబర్ నేరగాళ్లు సైతం ఇదే కోవకు చెందిన ఎనీ డెస్క్ యాప్‌ను ఎరగా వేస్తున్నారు. కేవైసీ ఆన్లైన్లో వాలిడేషన్ చేయించడానికి క్లిక్ చేయాలంటూ ఓ లింకును వినియోగదారుడికి పంపిస్తున్నారు. దీనిని అందుకునే వ్యక్తి ఆ లింకు క్లిక్ చేయగానే వారి ఫోన్లలో ఎనీ డెస్క్ యాప్ ఇన్‌స్టల్ అయిపోతోంది. ఈ యాప్ సైబర్ నేరగాడి వద్ద ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ఆ విధంగా ఈ లింకును వారు ముందే సెట్ చేసి ఉంచుతారు. ఫలితంగా దీన్ని ఇన్‌స్టల్ చేసుకున్న వ్యక్తి తన ఫోన్ కీ ప్యాడ్ ద్వారా టైప్ చేసే ప్రతి అక్షరం సైబర్ నేరగాడు చూడగలుగుతాడు. చిన్న లావాదేవీ చేయమంటూ... ఎనీ డెస్క్‌ను ఇన్‌స్టల్ చేసుకుని, అందులో వివరాలు పూరించిన తర్వాత సైబర్ నేరగాళ్లు మరో అంకం మొదలెడుతున్నారు. కేవైసీ అప్డేషన్ పూర్తయిందని, అయితే పరీక్షించుకోవాల్సి ఉందని, మీ బ్యాంక్ ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని వాలెట్‌లోకి బదిలీ చేసుకోవాలని సూచిస్తున్నారు. వినియోగదారుడు తన స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు అతడు టైప్ చేస్తున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్ సహా అన్ని వివరాలు సైబర్ నేరగాడు చూస్తూ నమోదు చేసుకుంటాడు. ఆపై వీటిని వినియోగించి లావాదేవీలు చేస్తూ బాధితు డి ఖాతాలోని డబ్బును తమ ఖాతాలు/వాలెట్స్‌లోకి మళ్లిస్తాడు. ఈ లావాదేవీలకు సంబంధించిన వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) వినియోగదారుడి సెల్ నెంబర్‌కే వస్తాయి. అయితే అతడి ఫోన్లో ఉన్న యాప్ సహా యంతో వీటిని సైబర్ నేరగాడు చూడగలుగుతాడు. నిమిషాల్లో ఖాళీ చేస్తారు ఇలాంటి నేరాల్లో సైబర్ నేరగాళ్లు నిమిషాల్లో ఖాతాలోకి డబ్బును వారి వాలెట్స్‌లోకి మళ్లిచుకుంటున్నారు. మోసపోతున్నాం అని గుర్తించే లోపే నష్టపోవాల్సి వస్తోంది. బ్యాంకు ఖాతాదారులు, యాప్స్ వినియోగదారుల డేటా వారికి ఎలా చిక్కుతోందనే విషయాన్ని పోలీసులు గుర్తించాలి. ఆ మార్గాలు కట్టడి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఇలాంటి నేరాలు తగ్గుతాయి. నేను ఈ కేవైసీ క్రైమ్‌లో బాధితుడిగా మారి రూ.20 వేలు పోగొట్టుకున్నాను. చిన్న చిన్న మొత్తాలు పోగొట్టుకుని బాధితులుగా మారిన అనేక మంది వివిధ కారణాల నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి వ్యవహారాలను పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిరోధక మార్గాలు అన్వేషించాలి. – యాదగిరి, మౌలాలీ అప్రమత్తతే పరిష్కారం కంటికి కనిపించకుండా ఆన్లైన్లోనే అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటున్నారు. ఓ తరహా నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లోకి చేరే సరికి మరో తరహాలో మోసాలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి నేరగాళ్లకు చెక్ పెట్టగలం. వీరు వినియోగించే సెల్‌ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ బోగస్ పేర్లు, వివరాలతో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కేసుల్లో బాధ్యులను పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ప్రతి ఒక్కరూ అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు చేయరాదు. కేవైసీ, లింకేజ్, అప్డేషన్ తదితరాలను నేరుగా ఆయా బ్యాంకులకు లేదా వాలెట్ అధీకృత వ్యక్తుల వద్దకు వెళ్లి చేసుకోవాలి. ఫోన్ కాల్స్‌ను నమ్మి ఎలాంటి లింకులు క్లిక్ చేయకూడదు. ఇవి ఒక్కోసారి విపరీత పరిణామాలకు కారణమవుతాయి. – సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
ఎఫ్‌పీఐలకు సులభ కేవైసీ
క్యాపిటల్ మార్కెట్లను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు నిర్మలాసీతారామన్ బడ్జెట్లో కనిపించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి కేవైసీ నిబంధనల సడలింపు, సామాజిక, స్వచ్చంద సంస్థల లిస్టింగ్‌కు వీలుకల్పించే విధంగా సోషల్ స్టాక్ ఎక్సే ్చంజ్ ఏర్పాటు, లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం నుంచి 35 శాతానికి పెంపు ప్రతిపాదనలు బడ్జెట్లో చోటు చేసుకున్నాయి. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలు కనిపించాయి. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఆర్బీఐ, సెబీతో సంప్రదింపుల అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. సామరస్య, సమస్యల్లేని పెట్టుబడుల వాతావరణాన్ని ఎఫ్‌పీఐలకు కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అందుకే వారికి సంబంధించి కేవైసీ (మీ క్లయింట్ ఎవరన్నది తెలుసుకునే వివరాలు) నిబంధనలను క్రమబద్ధీకరించడం, సులభతరం చేయడం ద్వారా... సమగ్ర, సీమాంతర పెట్టుబడుల విషయంలో రాజీ పడకుండా మరింత పెట్టుబడి అనుకూలంగా మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. స్టాక్ మార్కెట్లో అడ్డంకుల్లేని పెట్టుబడులకు గాను ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మార్గాన్ని కూడా ఎఫ్‌పీఐల మార్గంలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు. డెట్ సెక్యూరిటీల్లో ఎఫ్ఐఐలు, ఎఫ్‌పీఐల పెట్టుబడులను దేశీయ ఇన్వెస్టర్లకు బదలాయించడం, విక్రయించడం, అలాగే, ఎన్బీఎఫ్సీలు జారీ చేసే డెట్ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల ప్రవేశానికి మంత్రి ప్రతిపాదించారు. -
ఆధార్ ప్రత్యామ్నాయానికి అనుమతివ్వండి..
ముంబై: కస్టమర్ల గుర్తింపు ధృవీకరణ కోసం (కేవైసీ) ఆధార్‌ను వినియోగించరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలకు అనుమతినివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను పేమెంట్స్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఫేస్ రికగ్నిషన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు అనుమతించాలని కోరాయి. కస్టమర్లు తమ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసి, ఆ తర్వాత కెమెరా ముందు మరోసారి దాన్ని నిర్ధారించేలా ఒక ప్రతిపాదనను ఆర్బీఐకి సమర్పించినట్లు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ నవీన్ సూర్య తెలిపారు. ఈ విధానంలో కస్టమర్ అప్లోడ్ చేసిన పత్రాన్ని ఆల్గోరిథం ఆధారంగా సిస్టమ్ ధృవీకరించుకుంటుందని, ఆ తర్వాత కెమెరా ముందు కూర్చున్న వ్యక్తిని ఆ డాక్యుమెంట్‌లోని ఫొటోతో సరిపోల్చి చూసుకుని నిర్ధారణ చేస్తుందని ఆయన తెలిపారు. ఆర్బీఐ ఇంకా తమ ప్రతిపాదనకు అంగీకరించలేదని, ఇందుకు సుమారు ఆరు నెలలు పట్టొచ్చని సూర్య పేర్కొన్నారు. -
‘వాలెట్ల’కు మార్చి గండం!
న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవంతో కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన మొబైల్ వాలెట్ సంస్థలకు ప్రస్తుతం కేవైసీ నిబంధనలు సంకటంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కస్టమర్లందరి వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయడానికి వాలెట్ సంస్థలు పరుగులు తీస్తున్నాయి. కానీ, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోపక్క, ప్రైవేటు సంస్థలు కస్టమర్ల నుంచి ఈ–కేవైసీ కోసం ఆధార్‌ను తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాలెట్ సంస్థలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. డెడ్‌లైన్ ముగియడానికి ఇంకా కొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటిదాకా చాలా మటుకు సంస్థలు కేవలం కొద్ది మంది కస్టమర్ల కేవైసీ మాత్రమే పూర్తి చేయగలిగాయి. దీంతో దాదాపు 95 శాతం మొబైల్ వాలెట్లు మార్చి తర్వాత కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ వాలెట్ సంస్థలన్నీ కూడా కచ్చితంగా కేవైసీ ధ్రువీకరణ జరపాల్సిందేనంటూ 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీంతో వనరులున్న సంస్థలు ఆధార్ ఆధారంగా ఎలక్ట్రానిక్ రూపంలో కేవైసీ వెరిఫికేషన్ జరిపాయి. పేమెంట్స్ బ్యాంకింగ్ లైసెన్స్ కూడా పొందిన పేటీఎం.. బయోమెట్రిక్ డాంగిల్స్, ఫీల్డ్ ఏజెంట్లను ఉపయోగించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా తెరిచింది. ఈ విధంగా పేటీఎం తమ యూజర్లలో దాదాపు 70 శాతం మందికి పూర్తి స్థాయిలో కేవైసీ నిబంధనలు అమలు చేయగలిగినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. కానీ మిగతా కంపెనీలు నానాతంటాలు పడుతున్నాయి. ప్రాథమిక స్థాయి ధ్రువీకరణ మాత్రమే పూర్తి చేయగలిగామని, బయోమెట్రిక్స్ లేకపోవడంతో పూర్తి వెరిఫికేషన్ చేయలేకపోతున్నామని మరో వాలెట్ సంస్థ అధికారి వివరించారు. పేపర్ రూపంలో డాక్యుమెంట్స్‌ను సేకరించి, వెరిఫికేషన్ చేయాలంటే ఖర్చులు భారీగా పెరిగిపోయి, లాభదాయకత సమస్యలు ఉంటున్నాయని వాపోయారు. మరోవైపు, సుప్రీం తీర్పు కారణంగా ఇప్పటికే ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేసిన కస్టమర్ల డేటా అంతా కూడా మార్చి తర్వాత తమ సర్వర్ల నుంచి తొలగించనుండటంతో ఆయా యూజర్లు కూడా మళ్లీ ప్రత్యేకంగా ఇతరత్రా ధృవీకరణ పత్రాలతో కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం రావొచ్చని కూడా వాలెట్ సంస్థల వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం.. ప్రైవేట్ కంపెనీలు తమ కస్టమర్ల ధృవీకరణ కోసం ఆధార్ ఆధారిత ఎలక్ట్రానిక్ కేవైసీ వెరిఫికేషన్Œ (ఈకేవైసీ) ప్రక్రియను అమలు చేయడానికి లేదంటూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పునివ్వడంతో మొబైల్ వాలెట్ సంస్థలకు తాజా సమస్యలు వచ్చి పడ్డాయి. ’ఈకేవైసీ లేదు. సులభతరమైన ప్రత్యామ్నాయ కేవైసీ విధానాల గురించి ఆర్బీఐ ఇప్పటివరకూ ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదు. మరోవైపు, డెడ్‌లైన్ చూస్తే ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉంది. ప్రస్తుత స్థాయిని బట్టి చూస్తే.. ఆలోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు’ అని ఒక వాలెట్ సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలకు ఈ–కేవైసీ అందుబాటులో లేకపోవడంతో.. వీడియో ఆధారిత వెరిఫికేషన్, ఎక్స్ఎంఎల్ ఆధారిత కేవైసీ వంటి ప్రత్యామ్నాయ విధానాలనైనా అనుమతించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, వీటికి రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారికంగా ఆమోదముద్ర లేదు. పార్లమెంటు వైపు చూపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ చట్ట సవరణకి పార్లమెంటు ఆమోదముద్ర వేస్తే కాస్తంత గట్టెక్కగలమని వాలెట్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం కస్టమర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ని ఇచ్చేలా చట్ట సవరణ ప్రతిపాదనలు ఉన్నాయి. సౌకర్యంపరంగా.. కస్టమర్లు ఆధార్ వెరిఫికేషన్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అటు ఆర్బీఐ నుంచి కూడా కొంత భరోసా లభిస్తే గట్టెక్కుతామని అంటున్నాయి. స్టాండెలోన్ వాలెట్లపైనే ప్రభావం ఎక్కువ.. దేశీయంగా నాలుగేళ్ల క్రితం పెద్దయెత్తున వాలెట్ కంపెనీలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్‌పే వంటి సంస్థలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లేదా టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవలు అందించే ఇతరత్రా ఫిన్‌టెక్ కార్యకలాపాల్లోకి మళ్లాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు మాత్రమే మనుగడ ఉండవచ్చని, స్టాండెలోన్ వాలెట్లపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ వర్గాలు తెలిపాయి. -
సబ్సిడీ నగదు బదిలీకి ఆధార్ ఈ–కేవైసీ వాడొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు సంబంధించి నగదు బదిలీ (డీబీటీ) లబ్ధిదారుల ధృవీకరణ కోసం బ్యాంకులు ఆధార్ ఈ–కేవైసీని ఉపయోగించవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ యూఐడీఏఐ స్పష్టతనిచ్చింది. ఒకవేళ ఖాతాదారు స్వచ్ఛందంగా అనుమతి ఇచ్చిన పక్షంలో వారి ధృవీకరణకు ఆఫ్‌లైన్‌లో పేపరు రూపంలోని ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ధృవీకరణ కోసం ఆధార్‌ను ఏయే సందర్భాల్లో, ఏయే రూపాల్లో ఉపయోగించవచ్చో బ్యాంకులకు గత వారంలో చేసిన సూచనల కాపీని తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు కూడా పంపినట్లు యూఐడీఏఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు, చిరునామా ధృవీకరణ కోసం ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను ఉపయోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యూఐడీఏఐ తాజా వివరణనిచ్చింది. -
మొబైల్ కనెక్షన్లకు ఆధార్ ఈ–కేవైసీ వాడొద్దు
న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో టెలికం శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. -
ఎఫ్‌పీఐల కేవైసీ నిబంధనల్లో మార్పులు!
న్యూఢిల్లీ: కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)ఊరటనిచ్చే నిర్ణయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ శనివారం తీసుకుంది. ఈ కొత్త కేవైసీ నిబంధనలపై ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్. ఆర్. ఖాన్ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి సంఘం పలు వివాదాస్పద విషయాలపై చాలా మార్పులను సూచించింది. ఈ సిఫార్సుల ప్రకారం ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా), ఆర్ఐలు (రెసిడెంట్ ఇండియన్స్) విదేశీ ఫండ్స్‌లో 50 శాతం లోపువాటాను కలిగివుండవచ్చు. ఆ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. అలాగే ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించనక్కర్లేదని సూచించింది. కొత్త మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చే ముందు ఈ మార్పులపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సెబీ నిర్ణయించింది. ఈ నెల 17 వరకూ హెచ్.ఆర్. ఖాన్ కమిటీ నివేదికపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని సెబీ పేర్కొంది. నివాస భారతీయులు, ప్రవాసభారతీయులు...విదేశీ ఫండ్స్ ద్వారా నిధుల్ని దేశీయ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న కారణంగా కొత్తగా కైవైసీ నిబంధనల్ని గతంలో సెబి జారీచేసింది. సెబీ కేవైసీ నిబంధనల కారణంగా 7,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు తరలిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
అడకత్తెరలో వాలెట్ సంస్థలు!
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, టెలికం సేవలతో పాటు అన్ని రకాల సర్వీసులకూ ఆధార్ సంఖ్యను అనుసంధానించడానికి కేంద్రం ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించటం మొబైల్ వాలెట్ సంస్థలకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పేటీఎం, మొబిక్విక్ వంటి ప్రీపెయిడ్ ఇనుస్ట్రుమెంట్ సంస్థలు (పీపీఐ) ఆర్బీఐ గడువును ఆధారంగా చేసుకుని ఇప్పటికే తమ కస్టమర్ల కేవైసీ వివరాలను తీసుకునే పనిని ఆరంభించాయి. అయితే కేవైసీ వివరాల కోసం ఇవన్నీ ప్రధానంగా ఆధార్ సంఖ్యపైనే ఆధారపడుతున్నాయి. కారణం... ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలక్ట్రానిక్ తరహాలో సులువుగా పూర్తయిపోతుండటం... దానికి ఖర్చు కూడా తక్కువ కావటమే. అయితే, ఆధార్ చెల్లుబాటుపై విచారణ పూర్తయ్యేంత వరకు గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కస్టమర్లు తమ ఆధార్ నంబర్ ఇవ్వటానికి, బయోమెట్రిక్ వివరాలివ్వటానికి ఆసక్తి చూపించకపోవచ్చనేది పరిశ్రమ వర్గాల తాజా అంచనా. మొబైల్ వాలెట్ సంస్థలన్నీ ఫిబ్రవరి 28 నాటికి తమ కస్టమర్లకు సంబంధించి పూర్తి కేవైసీ వివరాలను సమీకరించాలన్నది ఆర్బీఐ ఆదేశం. కేవైసీ వివరాలు లేని ఖాతాల్లో కొత్తగా నగదు జమ చేయటం వంటి లావాదేవీల్ని ఆర్బీఐ నిషేధించింది కూడా. దీంతో కేవైసీ వివరాలను సమీకరించి, యూజర్లను కాపాడుకోవటానికి వాలెట్ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్బీఐ గడువు ముగిశాక రూ.12,000 కోట్లు విలువ కలిగిన ప్రీపెయిడ్ వాలెట్ పరిశ్రమ లావాదేవీలు దాదాపు 60 శాతం వరకూ తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి కూడా. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఆధార్ గడువు పొడిగించడం తమకు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి గందరగోళానికి దారితీసిందని మొబిక్విక్ సీఈవో బిపిన్ ప్రీత్‌సింగ్ ట్వీటర్లో పేర్కొన్నారు కూడా. ఆధార్‌తోనే కేవైసీ ఎందుకంటే..! నిజానికి కేవైసీ వివరాలను నమోదు చేయటానికి ప్రభుత్వం ఆమోదించిన ఏ గుర్తింపు కార్డునయినా తీసుకోవచ్చని వాలెట్ కంపెనీలకు ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ, మొబిక్విక్, పేటీఎం వంటి సంస్థలు ఆధార్ బయోమెట్రిక్ డేటాబేస్పైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. ఎందుకంటే ఇది వేగంతో కూడినదే కాక చౌక కావడమే. ‘‘కేవైసీకి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. పేపర్ డాక్యుమెంట్ ఆధారంగా చేసే ప్రక్రియతో యూజర్లకు అసౌకర్యం. కంపెనీలకు వ్యయ భారం. అదే ఆధార్‌తో అయితే ధ్రువీకరణ డిజిటల్ విధానంలో వేగంగా పూర్తవుతుంది’’ అని ఓ పేమెంట్ కంపెనీ సీఈవో వ్యాఖ్యానించారు. పలు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులున్న ఓ వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ... ‘‘కంపెనీలు ఆధార్ ఆధారిత కేవైసీని రూ.25లోపు ఖర్చుతోనే పూర్తి చేసుకోగలవు. అదే గతంలో మాదిరి పేపర్ ఆధారిత కేవేసీని పూర్తి చేయాలంటే ఎంతలేదన్నా రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. ఇక పేపర్ డాక్యుమెంట్లను తీసుకుంటే భద్రతాపరమైన రిస్క్ ఎదురవుతుందని, ప్రతీ కస్టమర్‌కు సంబంధించిన వివరాలతో డేటా నిర్వహించాల్సి వస్తుందని, ఇది మోసగాళ్లకు వరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని కూడా పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆధార్ అయితే ఆ వివరాలు సంస్థల వద్ద ఉండవు. నంబర్ మాత్రమే ఉంటుంది. ఆ నంబర్‌కు సంబంధించి అన్ని వివరాలు యూఐడీఏఐ వద్దే ఉంటాయి. తప్పదంటే చేసేదేమీ లేదు... సుప్రీంకోర్టు గడువు పొడిగించినప్పటికీ, కేవైసీకి ఆధార్ తీసుకోవడంపై ఎటువంటి నిషేధం లేనందున కంపెనీలు ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విషయంలో ముందుకు వెళ్లే ఆలోచనతోనే ఉన్నాయి. అదే సమయంలో అవసరమైతే ఇతర గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసేందుకూ సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఆమోదించిన ఇతర డాక్యుమెంట్ల ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసేందుకు తాము అనుమతిస్తున్నట్టు ఆక్సిజెన్ సర్వీసెస్ జాయింట్ ఎండీ సునీల్ కులకర్ణి తెలిపారు. అయితే, కేవైసీ పూర్తి చేసే విషయంలో కస్టమర్ల నుంచి స్పందన పెద్దగా లేదని, ఇది ఇంకా పెరగాల్సి ఉందని చెప్పారాయన. ఇక మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ తొలుత ఆధార్ నంబర్‌ను మాత్రమే తీసుకోగా, కొన్ని రోజులుగా కేవైసీ కింద ఇతర గుర్తింపు కార్డులను కూడా ఆమోదించడం మొదలు పెట్టింది. -
వ్యాలెట్లకు గడువు రేపటి వరకే
ముంబై: ప్రీపెయిడ్ వ్యాలెట్లు (పేటీఎం, మొబిక్విక్, ఓలా మనీ, అమెజాన్ పే తరహా) తమ కస్టమర్లకు సంబంధించిన కేవైసీ వివరాలు ధ్రువీకరించేందుకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28గానే ఉంటుందని, దీన్ని పొడిగించేది లేదని ఆర్బీఐ సోమవారం స్పష్టం చేసింది. ‘‘కేవైసీ మార్గదర్శకాల అమలుకు కావాల్సినంత వ్యవధి ఇచ్చాం. గడువులోపు కేవైసీకి సంబంధించిన వివరాలు సమర్పించని కస్టమర్లు ఆందోళన చెందక్కర్లేదు. వ్యాలెట్లలో ఉన్న బ్యాలన్స్‌ను సరుకుల కొనుగోలుకు, సేవలకు వినియోగించుకోవచ్చు. వ్యాలెట్ తిరిగి రీచార్జ్ చేసుకోవాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలి’’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో స్పష్టంచేశారు. లావాదేవీల భద్రతా, కస్టమర్ల రక్షణ కోసమే ఈ నిబంధన అమలు చేస్తున్నట్టు కనుంగో చెప్పారు. బ్యాంకులు ప్రమోట్ చేసిన 50 వ్యాలెట్లతోపాటు నాన్ బ్యాంకింగ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లు 55 వరకు ప్రస్తుతం మనదేశంలో ఉన్నాయి. కేవైసీ నిబంధనలు అమలు చేసేందుకు ఈ సంస్థలకు గతేడాది డిసెంబర్ 31 వరకు తొలుత గడువు ఇచ్చారు. తర్వాత దీన్ని ఈ నెల 28కి పొడిగించారు. నిజానికి ఈ నిబంధన వ్యాలెట్ సంస్థలను కలవరపరిచేదే. ఎందుకంటే 90 శాతం కస్టమర్లు కేవలం ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలతోనే వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. మొబైల్ ఫోన్లకు కేవైసీ అమలు చేస్తున్నందున దాన్నే పరిగణనలోకి తీసుకుంటే పోతుందిగా అన్నది ప్రీపెయిడ్ పేమెంట్ వ్యాలెట్ల పరిశ్రమ అభిప్రాయం. -
5వేల డిపాజిట్‌పై యూటర్న్
• 5 వేల డిపాజిట్‌పై వెనక్కి తగ్గిన రిజర్వ్ బ్యాంక్ • డిసెంబర్ 30 వరకు ఎంతైనా వేసుకోవచ్చని ప్రకటన • కేవైసీ ఉంటే అధికారులు ప్రశ్నించరని భరోసా • బుధవారం మధ్యాహ్నం నుంచి బ్యాంకుల ముందు పెరిగిన క్యూలు ముంబై: బ్యాంకు ఖాతాల్లో ఒకసారి రూ.5వేలకు మించి పాతనోట్లు డిపాజిట్ చేయరాదన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవటంతో ఆర్బీఐ వెనక్కు తగ్గింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) సర్టిఫికెట్లు సమర్పించిన వినియోగదారులు డిసెంబర్ 30 వరకు ఎన్నిసార్లైనా ఎంత మొత్తంలోనైనా పాతనోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నిరోజులు ఎందుకు పాతనోట్లు డిపాజిట్ చేయలేదనే ప్రశ్న కూడా బ్యాంకు అధికారులు అడగబోరని స్పష్టం చేసింది. మంగళ, బుధవారాల్లో అరుణ్‌జైట్లీ ప్రకటన (ఎంతమొత్తం డిపాజిట్ చేసినా బ్యాంకు అధికారులు ప్రశ్నించరు), ఆర్బీఐ ప్రకటనల్లో (అధికారులు ప్రశ్నిస్తారు) వైరుధ్యం నేపథ్యంలో.. డిపాజిట్ నిబంధనలను పూర్తిగా సమీక్షించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. బుధవారం ఉదయం వరకు రెండ్రోజులుగా నడుస్తున్న పద్ధతిలోనే ప్రశ్నావళితో ముందుకెళ్లిన బ్యాంకు అధికారులు.. మధ్యాహ్నం నుంచి ఆర్బీఐ తాజా ఆదేశాలను అమలుచేసి ప్రశ్నించటం ఆపేశారు. అయితే కేవైసీ నిబంధనను మాత్రం బ్యాంకులు కఠినంగా అమలుచేస్తున్నాయి. కాగా, నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చాక రూ. 5.92 లక్షల కోట్ల మొత్తాన్ని మార్కెట్లోకి బ్యాంకింగ్ రంగం ద్వారా పంపించామని ఆర్బీఐ వెల్లడించింది. ‘ఎలక్ట్రానిక్’ రుసుముపై నిషేధం: నోట్లరద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేదిశగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా చెల్లింపులపై రుసుంను నిషేధించాలని ఆర్థిక శాఖ కోరింది. వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్‌కు రుసుములను తొలగించాలని ఓ ప్రకటనలో సూచించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.10వేల వరకు నెఫ్ట్‌కు బ్యాంకులు రూ.2.5, పదివేల నుంచి లక్ష వరకు రూ.5, రూ.1–2లక్షల వరకు రూ. 15, రెండు లక్షలకన్నా ఎక్కువగా ఉంటే రూ. 25 వసూలు చేస్తున్నాయి. సర్వీస్ టాక్స్ దీనికి అదనం. ఆర్థిక శాఖ సూచన ప్రకారం ఐఎంపీఎస్, యూపీఐ చెల్లింపుల రుసుములపై మార్చి 31, 2017 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. యూఎస్ఎస్డీ లావాదేవీలపై వెయ్యి, అంతకుమించిన చెల్లింపులపై యాభై పైసలు తగ్గనుంది. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపార్ యోజన’లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, వినియోగదారుల అకౌంట్లలో రూ.5వేల కన్నా ఎక్కువ జమచేస్తుంటే బ్యాంకు అధికారులే విచారణ చేయాలంటూ ఆర్బీఐ రెండ్రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలపై అఖిల భారతీయ బ్యాంకు అధికారుల సంఘం నిరసన చేపట్టింది. ఐడీఎస్ నల్లధనం రూ. 55 వేల కోట్లే! న్యూఢిల్లీ: ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద ప్రకటించినట్లు పేర్కొన్న రూ. 67,382 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రూ. 55 వేల కోట్లకు తగ్గించి చూపే అవకాశముంది. తమ వద్ద లెక్కల్లో చూపని రూ. 10 వేల కోట్లకుపైగా నల్లధనం ఉందని చెప్పిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ రావు, ఆయన సన్నిహితులు ఆ డబ్బుపై పన్ను తొలి వాయిదాను నవంబర్ 30లోగా చెల్లించకపోవడంతో ఈమేరకు సవరణ చేయనున్నారు. నల్లధన ప్రకటనకు తెచ్చిన ఐడీఎస్ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడం తెలిసిందే. -
సులభంగా పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ పెన్షన్ సొమ్మును తీసుకునే ప్రక్రియను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సులభతరం చేసింది. ఇక ఉద్యోగి పనిచేసిన కంపెనీ ధ్రువీకరణ లేకుండానే పీఎఫ్ సొమ్మును తీసుకునేలా ఈపీఎఫ్ఓ కొత్తగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) దరఖాస్తు (ఫారం 10 డి)ను ప్రవేశపెట్టింది. ఈ దరఖాస్తును పూర్తిచేసి నేరుగా ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించి పీఎఫ్ ఖాతాదారులు డబ్బు తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు యూఏఎన్‌లో అనుసంధానమై ఉంటాయి. కంపెనీ డిజిటల్ సంతకం, ఉద్యోగి పూర్తి వివరాలు ఫారం 11లో పొందుపరచబడి ఉంటాయి. వీటిని సంస్థ సరిపోల్చుకుంటుంది. -
మొబైల్ కనెక్షన్‌కు ఆధార్ ఒక్కటీ చాలు
న్యూఢిల్లీ: మొబైల్ కనెక్షన్‌ను మరింత సులభంగా పొందేం దుకు వీలుగా ఆధార్‌ను ఈ కేవైసీగా పరిగణిస్తూ టెలికం శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో వినియోగదారులు ఆధార్ కార్డుతో వెళ్లి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డులను సత్వర యాక్టివేషన్‌తో పొందడానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కొత్త సిమ్ కార్డు కోసం ఫొటో ఐడీ, చిరునామా ఐడీ, పాస్‌పోర్ట్ ఫొటో వంటివన్నీ వెంట తీసుకెళ్లి దరఖాస్తు పూరించి ఇస్తే... ఒకటి, రెండు రోజులకు గానీ యాక్టివేట్ కావడం లేదు.యూఐడీఏఐ నుంచి ఆధార్ నంబర్ ఆధారంగా పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ ఆపరేటర్లకు వెళతాయి. వాటిని ఆపరేటర్లు తమ డేటాబేస్‌లో భద్రపరచుకుంటే సరిపోతుంది. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విధానాన్ని ఈ వారంలోనే అమల్లోకి తెస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది. వొడాఫోన్ సైతం సానుకూల చర్యగా పేర్కొంది. -
ఆధార్‌యేతర కేవైసీపై పీఎఫ్ఆర్డీఏ కసరత్తు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) స్కీమ్ ఆన్లైన్ సౌలభ్యతకు సంబంధించి కొత్త చందాదారులకు తాజా కేవైసీ (నో-యువర్-కస్టమర్) నిబంధనల రూపకల్పనకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్-పీఎఫ్ఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ధుృవీకరణకు సంబంధించి ఆధార్ కార్డ్ వినియోగంపై సుప్రీంకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఫండ్ రెగ్యులేటర్ ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోందని చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ సీఐఐ గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా తెలిపారు. తాజా కేవైసీ రూపకల్పనకు కొద్ది సమయం పడుతుందని తెలిపారు. -
అధిక విలువ చెక్కుల చెల్లింపుల్లో జాగ్రత్త: ఆర్బీఐ
ముంబై: అధిక విలువ చెక్కులకు సంబంధించి చెల్లింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. చెక్కు సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆర్బీఐ ఈ విషయంలో బ్యాంకులను అప్రమత్తం చేసింది. ఫోన్ కాల్ ద్వారా అకౌంట్ హోల్డర్లను అలర్ట్ చేయాలని, నాన్ హోమ్ చెక్కుల విషయంలో బేస్ బ్రాంచ్ని సంప్రదించాలని కూడా సూచించింది. 2 లక్షల పైబడిన చెక్కుల చెల్లింపు విషయంలో చెక్కు ఇచ్చిన వారికి, సంబంధిత సొమ్ము తీసుకునే వారికి ఎస్ఎంఎస్ అలర్ట్ చేయాలని పేర్కొంది. యూవీ ల్యాంప్ కింద చెక్కును క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొంది. రూ.5 లక్షల పైబడిన చెక్కు చెల్లింపుల్లో బహుళ స్థాయిలో చెకింగ్ ప్రక్రియ అవసరమని పేర్కొంది. పూర్తి అప్రమత్తం ద్వారా మోసాలను అరికట్టడానికి తగిన ప్రయత్నాలు చేయాలని పేర్కొంది. -
బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ షాక్!
ముంబై: బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. నో యూవర్ కస్టమర్ (KYC) పత్రాలు సమర్పించని కస్టమర్ల ఖాతాలను పాక్షికంగా స్తంభింపచేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు కేవైసీ ప్రత్నాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. రిజర్వు బ్యాంకు ఆదేశాలను ఖాతరు చేయని కస్టమర్ల అకౌంట్లను తొలగించాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ తెలిపింది.