ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI).. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు కేవైసీ చేసుకోవాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేస్తూ ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించింది.
జనవరి 31 నాటికి కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లు డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వినియోగదారుడు నిర్దిష్ట సమయంలోనే కేవైసీ పూర్తి చేసుకోవాలి.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా?
👉వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
👉ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్‌లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
కేవైసీ అప్డేట్ చేయడం ఎలా?
👉ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు తెలిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.
👉దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాల్సి ఉంటుంది.
👉ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
👉తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment