కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే? | FASTag KYC Update Deadline Today; Check The Details | Sakshi
Sakshi News home page

కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?

Published Thu, Feb 29 2024 3:53 PM | Last Updated on Thu, Feb 29 2024 4:18 PM

FASTag KYC Update Deadline Today Check The Details - Sakshi

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. 

ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • ఓటీపీ అథెంటికేషన్‌ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్‌లో KYC స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు. 
  • సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు.

కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే..

  • ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్‌ సెక్షన్‌ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.
  • దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. 
  • ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 
  • తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్‌ చేస్తే కేవైసీ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

కేవైసీ అప్డేట్ఎందుకంటే..
కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement