KYC details
-
నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్‌కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్డేట్ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుఅంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం పని చేయాలని సూచించారు. -
మళ్లీ అందరూ బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ చేయాలి..?
ఆర్థిక అవసరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. దానికి బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. చాలామందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలుండడం సహజం. అయితే వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దానికి అదనపు గుర్తింపులు కావాలని ప్రత్యేక కమిటీ సూచించింది. బ్యాంకుల్లో ఖాతాలను, ఖాతాదార్లను గుర్తించడానికి అదనపు ధ్రువీకరణ ప్రక్రియలను అమలు చేయనున్నారు. వినియోగదారు సమాచారాన్ని (కేవైసీ-నో యువర్ కస్టమర్) మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి సారించాయి. ప్రస్తుత ఖాతాలన్నిటికీ ముఖ్యంగా పలు ఖాతాలు లేదా జాయింట్ ఖాతాలకు ఒకే ఫోన్ నంబరు ఉన్న ఖాతాలకు దీనిని వర్తింపజేయాలని భావిస్తున్నాయి. వేర్వేరు పత్రాలతో పలు ఖాతాలను తెరచిన ఖాతాదార్ల నుంచి మరిన్ని ధ్రువీకరణలను కోరవచ్చు. ఇదీ చదవండి: కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్ ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడం కోసం ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని గతంలోనే ఏర్పాటు చేసింది. పాన్, ఆధార్, మొబైల్ నంబరు తదితరాలను అదనపు గుర్తింపుల కింద పరిశీలిస్తున్నట్లు ఒక బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి, అదనపు గుర్తింపులతో వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలిసింది. -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగినే బురిడీ కొట్టించిన కేటుగాడు!
ముంబై: ఇటీవల కాలంలో చాలా రకాల సైబర్ మోసాలను చూశాం. కానీ చాలా వరకు చదువుకున్నవారు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగలు మోసపోవడం చూశాం. అచ్చం అలానే ఇప్పుడు తాజాగా ఒక ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి ఆన్లైన్ సైబర్ మోసానికి గురైంది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) అసలు విషయంలోకెళ్లితే...70 ఏళ్ల ఆర్బీఐ రిటైర్డ్ మహిళా ఉద్యోగికి కేవైసీ అప్‌గ్రేడేషన్ కోసం హెచ్చరిస్తూ ఎస్బీఐ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని భావించింది. దీంతో ఆమె ఆ మెసేజ్‌లో వచ్చిన నెంబర్‌కి కాల్ చేస్తే సదరు వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిగా రాహుల్‌గా పేర్కొంటాడు. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం కేవైసీ ఆన్లైన్ అప్‌గ్రేడేషన్‌కి సంబంధించిన ఒక కొత్త సేవను బ్యాంక్ ప్రారంభించిందంటూ నమ్మబలుకుతాడు. దీంతో ఆమె అతను పంపించిన వెబ్ లింక్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. అయితే ఆ వెబ్ పేజి ఎస్బీఐ లోగోతో సహా ఉండటంతో ఆమె పూర్తిగా అతన్ని నమ్మి ఆ వెబ్‌పేజ్‌లో తన పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్‌తో సహా నమోదు చేస్తుంది. ఇక అంతే ఏకంగా ఆరు లావాదేవీల్లో ఒక్కసారిగా రూ 3 లక్షలు పోయినట్లు గుర్తించి వెంటనే ఆమె బ్యాంక్‌కి కాల్చేసి కార్డుని బ్లాక్ చేయిస్తుంది. ఆ తర్వాత బాధితురాలు చితల్సర్ మాన్పాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..) -
ఆందోళన కలిగిస్తున్న సైబర్ నేరాలు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఎయిర్టెల్ తెలిపింది. కేవైసీ అప్డేట్ పేరుతో బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును తస్కరిస్తున్నారని కంపెనీ సీఈవో గోపాల్ విఠల్ గుర్తు చేశారు. ఇటువంటి నేరాలు పెరుగుతున్నందున వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘మోసపూరిత యూపీఐ హ్యాండిల్స్, వెబ్‌సైట్స్, ఓటీపీలు తరచుగా వస్తున్నాయి. ఎన్పీసీఐ, భీమ్ పదాలు, లోగోలతో తప్పుడు యూపీఐ యాప్స్, వెబ్‌సైట్స్ వెల్లువెత్తుతున్నాయి. అవి డౌన్లోడ్ చేసిన వెంటనే బ్యాంకు వివరాలను తీసుకుంటున్నాయి. దీంతో ఖాతాలో ఉన్న నగదును తస్కరించేందుకు మోసగాళ్లకు పని సులువు అవుతోంది. బ్యాంక్ ఖాతా అప్‌గ్రేడ్, రెనివల్ చేస్తామంటూ ఓటీపీ పంపి మోసం చేస్తున్నారు. నేరాలను కట్టడి చేయాలంటే కస్టమర్ ఐడీ, ఎమ్–పిన్, ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదు. నమ్మశక్యం కాని ఆఫర్లు, డిస్కౌంట్లను చూపే యాప్స్, వెబ్సైట్లను తెరువరాదు’ అని తెలిపారు. -
మాటల్లో దించి.. మాయచేసి..
సాంకేతిక పెరిగేకొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్త ఎత్తుగడలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమదైన శైలిలో దోచుకుంటున్నారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేయరని, అలాంటి ఫోన్లు వస్తే ఎలాంటి వివరాలు ఇవ్వరాదని సమీపంలోని స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి వాసులు సైబర్ వలకు చిక్కకుండా పోలీసులు, కాలనీ సంక్షేమ సభ్యులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – బాలానగర్ మచ్చుకుకొన్ని.. లింక్ ఓపెన్ చేయడంతో.. బాలానగర్ ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూడగా ‘మీ బ్యాంక్ అకౌంట్ 24 గంటల్లో డియాక్టివేట్ అవుతుంది’. వెంటనే మీ కేవైసీ డాక్యుమెంట్స్‌ను చేయాలని ఓ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి బ్యాంక్ సీఆర్ఎం నంబర్, పాస్వర్డ్ ఎంట్రీ చేయగా ఆ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.49,999 డెబిట్ అయ్యాయి. నౌకరీ.కామ్ పేరుతో.. 27 ఏప్రిల్ 2021 రాత్రి 11.41 సమయంలో ఓ మహిళలకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి నౌకరీ.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఓ లింక్ పంపించాం. ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఉంది. అందుకు గాను రూ. 25తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఆ లింక్‌ను తెరిచిన ఆమె వివరాలు అందించి పేమెంట్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. ఆ తర్వాత ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అప్పటికే తమ దగ్గర ఉన్న వివరాలతో సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.16,665 దోచుకున్నారు. ఇట్లు అద్దెకు తీసుకుంటానని.. ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. బాలానగర్ డివిజన్ సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్టు చేశాడు. అది చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంటి అద్దె, అడ్వాన్స్ గురించి యజమాని తెలుపగా మొత్తం రూ. 45 వేలు చెల్లిస్తానని గూగుల్ పేమెంట్ నంబర్ నుండి అకౌంట్‌కు వివరాలు పంపాలని చెప్పడంతో బాధితుడి విరాలు పంపగా క్షణల్లో సైబర్ నేరగాళ్లు మూడు దఫాల్లో రూ. లక్ష తమ ఖాతల్లోకి మార్చుకున్నారు. ఈఎంఐ చెల్లించే క్రమంలో.. ఫిరోజ్‌గూడలో నివసించే ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు ఈఎంఐ లోన్ కట్టేందుకు గూగుల్‌లో వెతుకుతుండగా కస్టమర్ కేర్ అని కనిపించిన ఓ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఈఎంఐ నగదు డెబిట్ కాలేదు.. కారణమేంటని ప్రశ్నించగా మీ నగదు జమ కావాలంటే మీ ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి క్రెడిట్ కార్డు నెంబర్, ఓటీపీనీ చెప్పాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు చేయడంతో అరగంటలో దాదాపుగా రూ. 15 వేలకు పైగా బాధితుడి ఖాతాలోంచి దోచుకున్నారు. ► బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన సైబర్ క్రైమ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకున్నారు. అందులో 7 మంది మహిళలు ఉన్నారు. ► సైబర్ నేరగాళ్లు రూ. 54. 31 లక్షలు దోచుకోగా అందులో నుంచి రూ. 8.75 లక్షలు రికవరీ చేశారు. ► బాధితులు ఎవరైన ఉంటే ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి, లేదా 155260 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ► సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన కొందరైతే.. బంధువులు, స్నేహితులకు తెలిస్తే వారి దగ్గర చులకన అవుతామనే ఆలోచనలతో ఫిర్యాదు చేయడం లేదు. బ్యాంక్ వివరాలు ఇవొద్దు.. సైబర్ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన రావాలి. కేవైసీ అప్డేట్, బీమా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని మోసం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాగాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎవ్వరికీ బ్యాంక్ వివరాలు ఇవొద్దు. బాధితులుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. –ఎండీ. వాహిదుద్దీన్, బాలానగర్ సీఐ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
కేవైసీ పెండింగ్‌లో ఉంటే.. డీమ్యాట్ ఖాతా కట్..
జులై 31 లోగా తమ KYC డిటెయిల్స్ పూర్తి చేయని డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు నిలిపేస్తామంటూ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లు సర్క్యులర్ జారీ చేశాయి. ఈ ఖాతాలు నిలిపేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కేవైసీకి సంబంధించి పేరు,అడ్రస్, పాన్‌కార్డు వివరాలు, ఉపయోగంలో ఉన్న ఫోను నంబరు, ఈ మెయిల్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో లింకైన పాన్‌కార్డునే కేవైసీ గుర్తిస్తుంది. కాబట్టి పాన్‌కార్డును ముందుగా ఆధార్‌లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వడం ఉత్తమం. వ్యక్తిగత వివరాలతో పాటు వార్షిక సంపాదన అంశాలను కేవైసీలో పొందు పరచాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఐదు కేటగిరీలు, వ్యక్తిగతేతర ఆదాయానికి సంబంధించి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. వీటిని అనుసరించి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్లు .. తమ ఆదాయ వివరాల ఆధారంగా తగు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. -
నగల కొనుగోళ్లపై ‘పాన్’ పిడుగు!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు మించి కొనుగోలు చేస్తుంటే కేవైసీ వివరాలు ఇవ్వాలన్నది నిబంధన. అయితే, ఆభరణాల విక్రయదారులు (జ్యుయలర్స్) రూ.2 లక్షల్లోపు కొనుగోళ్లకూ కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ అడగడం మొదలు పెట్టేశారు. రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీని తప్పనిసరి చేయవచ్చని వర్తకులు భావిస్తున్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి జ్యుయలరీ పరిశ్రమను తీసుకొచ్చినందున.. భవిష్యత్తులో ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినట్టయితే తమపై కఠినచర్యలు తీసుకోవచ్చన్న భయం వర్తకుల్లో నెలకొని ఉంది. బంగారం మినహా ఇతర అన్ని రకాల పెట్టుబడి సాధనాలకూ కేవైసీ తప్పనిసరిగా అమల్లో ఉంది. బంగారానికి వస్తే రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకే కేవైసీ ప్రస్తుతం అమల్లో ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మాదిరే బంగారాన్నీ పెట్టుబడి సాధనంగా గుర్తించాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉందని.. ఇందుకోసం సమగ్రమైన బంగారం విధానాన్ని తీసుకురానుందని జ్యుయలరీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మన దేశం 800–850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది. వివరాలను వెల్లడించాల్సిందే.. ఖరీదైన మెటల్స్, ఖరీదైన స్టోన్స్ డీలర్లను పీఎంఎల్ఏ కిందకు తీసుకురావడంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలు, ఇతర రాళ్లను విక్రయించే జ్యుయలర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి వస్తుందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. పీఎంఎల్ఏ కిందకు బంగారాన్ని గత డిసెంబర్ 28 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీంతో బంగారం ఆభరణాల వర్తకులు అనుమానిత లావాదేవీల వివరాలను, ఒక నెలలో రూ. 10 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సి ఉంటుందని మెహతా చెప్పారు. ‘‘కుటుంబ సభ్యుల కోసం రూ.2 లక్షల్లోపు కొనుగోలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పటివరకు అభిప్రాయం ఉంది. అయితే, ప్రభుత్వ ఏజెన్సీలు మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా.. అన్ని లావాదేవీల వివరాలను అనుసంధానించి జ్యుయలర్లపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆభరణాల పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అధిక విలువ కొనుగోళ్లకే కేవైసీ పరిమితం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: అన్ని రకాల బంగారం కొనుగోళ్లకు కేవైసీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అధిక విలువ కలిగిన బంగారం, వెండి, జెమ్స్ కొనుగోళ్లకు చేసే నగదు చెల్లింపులకు కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీఎమ్ఎల్ఏ చట్టం కిందకు తమనూ చేర్చడంతో అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీ తప్పనిసరి చేయవచ్చని ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. డిసెంబర్ 28న వచ్చిన నోటిఫికేషన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం స్పందించింది. ‘‘నగదు రూపంలో ఆభరణాలు, బంగారం, వెండి, ఖరీదైన జెమ్స్, రాళ్ల విలువ రూ.2లక్షలు మించి కొనుగోళ్లు ఉంటే కేవైసీ ఇవ్వాలన్నది గత కొన్నేళ్ల నుంచి అమల్లో ఉన్నదే. పీఎమ్ఎల్ యాక్ట్, 2002 చట్టం కింద డిసెంబర్ 28 నాటి నోటిఫికేషన్.. వ్యక్తులు లేదా సంస్థలు బంగారం, వెండి, జ్యుయలరీ, ఖరీదైన రాళ్లను రూ. 10లక్షలు, అంతకుమించి కొనుగోలు చేస్తే కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)లో భాగమే ఇది’’ అని తెలిపింది. -
ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్..
ముంబై : తమ ఖాతాదారులు ఈనెల 28లోగా తగిన కేవైసీ పత్రాలు సమర్పించని పక్షంలో వారి ఖాతాలను నిలిపివేస్తామని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ స్పష్టం చేసింది. అసంపూర్తి కేవైసీ పత్రాలను అందించిన వారు తక్షణమే తగిన పత్రాలతో సంప్రదించాలని, భవిష్యత్‌లో బ్యాంకింగ్ లావాదేవీల్లో అసౌకర్యాన్ని నివారించాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు జారీ చేసిన బహిరంగ నోటీసులో పేర్కొంది. ఇటీవల బ్యాంకులు పలుమార్లు రికార్డులను అప్డేట్ చేస్తూ కేవైసీ పత్రాలను అడుగుతున్నాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్న ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ ఎస్బీఐ తరచూ టెక్స్ట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపుతోంది. ఎస్బీఐ ఖాతాదారులు ఎవరికైనా అలాంటి మెసేజ్‌లు వస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన సమాచారం అందించడం మేలని తగినంత సమయం ఉన్నందున తగిన కేవైసీ పత్రాలను బ్యాంకులో సమర్పించవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్‌ను సంప్రదించి ఎలాంటి చిరునామా, గుర్తింపు కార్డులను అందించి తమ కేవైసీ పత్రాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ యూజర్లు తమ కేవైసీని ఆన్‌లైన్‌లోనూ అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. సరైన గుర్తింపు ధ్రువీకరణగా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, పెన్షన్ పేఆర్డర్, విద్యుత్ బిల్లు, ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డులను సమర్పించవచ్చు. ఇక ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు కేవైసీ వివరాలను తాజాపరచడంలో భాగంగా బ్యాంకులు ఈ దిశగా కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి : ఆర్బీఐ రివ్యూ, ఎస్బీఐ కీలక నిర్ణయం -
డిజిటల్ వాలెట్లకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : పేటీఎం, ఓలా మనీ, గూగుల్ తేజ్ వంటి డిజిటల్ వాలెట్లకు లేదా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కస్టమర్ల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన కేవైసీ-కంప్లీయెన్స్ తుది గడువును మరింత పొడిగించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిరాకరించింది. రేపే ఆఖరి తేదీగా ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటికే సరిపోయేంత సమయం ఇచ్చామని, మరోసారి ఈ గడువును పొడిగించలేమని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకులు ప్రమోట్ చేసే 50 వాలెట్లతో పాటు 55 ప్రీపెయిడ్ వాలెట్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీరందరూ ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియను పూర్తిగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత ఈ వాలెట్ల కస్టమర్లందరూ 2017 డిసెంబర్ 31 వరకు కేవైసీ వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే తమ కేవైసీ వివరాలను సమర్పించారు. అయితే తక్కువ మంది మాత్రమే కేవైసీ వివరాలు సమర్పించడంతో, మిగతా యూజర్లను కోల్పోతామేమోనని డిజిటల్ వాలెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదురహిత ఆప్షన్ల నుంచి మళ్లీ నగదుకు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోంది. తమ వాలెట్‌ను లేదా పీపీఐ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రెసిడెన్షియల్ ప్రూఫ్ లాంటి మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ ప్రక్రియలో అవసరం పడనున్నాయి. కేవైసీ వివరాలు కోరడంపై వాలెట్ల యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. యూజర్లు దీనిపై ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం లేదని ఆర్బీఐ తెలిపింది. తుది గడువు వరకు కేవైసీ సంబంధిత వివరాలను పీపీఐ యూజర్లకు ఇవ్వకపోయినప్పటికీ, కస్టమర్లు తమ నగదును కోల్పోరని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. ఇప్పటికీ కేవైసీ ఫార్మాలటీలు పూర్తి చేయని వారికి ఫిబ్రవరి 28 తర్వాత కూడా తమ బ్యాలెన్స్‌ను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చని లేదా పీపీఐ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.. ఈ బ్యాలెన్స్ నగదును మీ బ్యాంకు అకౌంట్లకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చని పేర్కొంది. -
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: జ్యూవెలర్లు, కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. రూ 50,000కు మించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే పాన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్త జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో జ్యూవెలర్లు యాభైవేలకు మించి బంగారం కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదించాల్సిన అవసరం లేదు. మనీల్యాండరింగ్ చట్ట నిబంధనలు బంగారు ఆభరణాల కొనుగోలుకు వర్తింపచేస్తే కేవైసీ నిబంధనల కారణంగా బంగారం సేల్స్ భారీగా తగ్గుతాయని జ్యూవెలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారంలో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆగస్ట్ 23న జెమ్స్, జ్యూవెలరీ రంగానికీ మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనలను వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆదాయ పన్ను చట్టం కేవైసీతో నిమిత్తం లేకుండా రూ2 లక్షల వరకూ నగదు అమ్మకాలకు అనుమతించినా మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనల కింద పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారాలు లేకుండా రూ 50,000కు మించి నగదు లావాదేవీలు జరిపేందుకు వెసులుబాటు లేదు. -
కేవైసీ వివరాలివ్వకుంటే బ్యాంక్ ఖాతాల నిలుపుదల
ముంబై: పదేపదే కోరినప్పటికీ నో యువర్ కస్టమర్(కేవైసీ) వివరాలను అందించకుంటే ఆ ఖాతాలను తొలుత పాక్షికంగా నిలిపి వేసేందుకు బ్యాంకులకు వీలు చిక్కింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేవైసీ వివరాలను ఇవ్వని కస్టమర్ల ఖాతాలను దశలవారీగా స్థంభింపచేయమంటూ బ్యాంకులను ఆర్బీఐ తాజాగా ఆదేశించింది. అప్పటికీ కస్టమర్లు స్పందించకుంటే ఆపై ఖాతాలను పూర్తిగా మూసివేయమంటూ సూచించింది. ఈ ఆదేశాలలో భాగంగా బ్యాంకులు ఖాతాదారులకు తొలి దశకింద మూడు నెలల సమయాన్ని ఇస్తాయి. ఆపై ఖాతాలను పాక్షికంగా నిలిపివేస్తాయి. దీంతో నగదు జమలకు అవకాశముంటుందిగానీ, ఉపసంహరణకు వీలుండదు. కాగా, ఇది జరిగిన తదుపరి మరో మూడు నెలల కాలం బ్యాంకులు వేచిచూస్తాయి. ఖాతాలను పాక్షికంగా నిలిపివేసిన ఆరు నెలలకుకూడా వివరాలు లభించకుంటే ఆపై ఖాతాలను పూర్తిస్థాయిలో స్థంభింపచేసేందుకు అవకాశముంటుంది.