సాక్షి,న్యూఢిల్లీ: జ్యూవెలర్లు, కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. రూ 50,000కు మించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే పాన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్త జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో జ్యూవెలర్లు యాభైవేలకు మించి బంగారం కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదించాల్సిన అవసరం లేదు.
మనీల్యాండరింగ్ చట్ట నిబంధనలు బంగారు ఆభరణాల కొనుగోలుకు వర్తింపచేస్తే కేవైసీ నిబంధనల కారణంగా బంగారం సేల్స్ భారీగా తగ్గుతాయని జ్యూవెలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారంలో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆగస్ట్ 23న జెమ్స్, జ్యూవెలరీ రంగానికీ మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనలను వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆదాయ పన్ను చట్టం కేవైసీతో నిమిత్తం లేకుండా రూ2 లక్షల వరకూ నగదు అమ్మకాలకు అనుమతించినా మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనల కింద పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారాలు లేకుండా రూ 50,000కు మించి నగదు లావాదేవీలు జరిపేందుకు వెసులుబాటు లేదు.
Comments
Please login to add a commentAdd a comment