PAN card
-
పిల్లలకు పాన్ కార్డ్: సింపుల్‌గా అప్లై చేయండిలా..
ప్రస్తుతం అందరికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కాకుండా, మైనర్స్ లేదా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయసు అవసరం లేదు. కాబట్టి ఎవ్వరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలు స్వయంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులే పాన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.పిల్లలకు పాన్ కార్డు ఎందుకంటే?తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు, లేదా వారి ఆస్తులకు నామినీలుగా చేర్చినప్పుడు పాన్ కార్డు అవసరం. అంతే కాకుండా పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల కోసం ఖాతాలను ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు అవసరం.పిల్లల కోసం పాన్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి అవసరమవుతాయి.ఆన్లైన్లో అప్లై చేయడం.. ➤ముందుగా అధికారిక 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్' (NSDL) వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤అప్లికేషన్ ఫారమ్‌లో 'న్యూ పాన్ - ఇండియన్ సిటిజన్ (ఫారం 49ఏ)', 'వ్యక్తిగతం' అనే వర్గాన్ని ఎంచుకోవాలి.➤అప్లికేషన్ వివరాల విభాగంలో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.➤మైనర్ ఫోటో & అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.➤డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపు కొనసాగించాలి. తరువాత 'సమర్పించు' బటన్‌ను క్లిక్ చేయాలి.➤పైవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక అక్నాలెజ్మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తరువాత 15 నుంచి 20 రోజులలోపు మీ చిరునామాకు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడం..➤అధికారిక NSDL వెబ్సైట్ నుంచి ఫారమ్ 49ఏను డౌన్లోడ్ చేసుకోవాలి.➤సూచనల ప్రకారం అన్ని వివరాలను పూరించండి. ➤సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను, పిల్లల ఫోటోలు రెండు జత చేసి, సమీపంలోని పాన్ సెంటర్లో ఫీజు చెల్లించి సమర్పించండి.➤మీ అప్లికేషన్ సమర్పించిన తరువాత మీకు అక్నాలెజ్మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. ➤తరువాత మీ చిరునామాలకు 15 నుంచి 20 రోజులలోపు పాన్ కార్డు డెలివరీ అవుతుంది. -
పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దు
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ (పాన్ కార్డు) అనేది ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం. సంస్థలు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఆర్ధిక కార్యకలాపాలలో దీని ద్వారానే భాగస్వాములవుతారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డును కూడా డిజిటలైజ్ చేయదలచి, కేంద్రం పాన్ 2.0 ప్రకటించింది. ఇది మరింత సేఫ్ అని పేర్కొంది.మన దేశంలో ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తికి, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే.. అది చట్టరీత్యా నేరం. అలాంటి వారు జరిమానా కట్టాల్సి ఉంటుంది.మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను తీసుకుంటారు. తప్పుడు వివరాలతో.. ఫేక్ పాన్ కార్డులను పొందటం నేరం. ఈ నేరానికి సెక్షన్ 272 బీ ప్రకారం.. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటం మాత్రమే కాకుండా.. అవసరమైన ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డును ఉపయోగించకపోవడం కూడా నేరమే. అలాంటి వారు కూడా శిక్షార్హులే. కాబట్టి ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారు వెంటనే డీ-యాక్టివేట్ చేసుకోవాలి. అసలు పాన్ కార్డు లేనివారు వెంటనే.. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.పాన్ 2.0పాన్ 2.0 అనేది రూ. 1,435 కోట్ల బడ్జెట్‌తో క్యాబినెట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ద్వారా క్యూఆర్ కోడ్ పాన్ కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన ప్రక్రియలను నిర్ధారించడం లక్ష్యం. PAN 2.0 పన్ను చెల్లింపుదారులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది. -
డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం..
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్లైన్ యాప్‌లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్‌లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్‌లు, ఆన్లైన్ యాప్‌లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్‌ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది. ఈఎంఐల్లోనే.. నేడు బ్యాంక్‌లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్‌ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్‌లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్‌ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. సులువుగా.. యాప్‌లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్‌కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ.. కొత్త కొత్త లోన్ యాప్‌లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్‌లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్‌లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిబిల్‌ను కాపాడుకుంటేనే.. రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్‌లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. – సీహెచ్ వెంకటసందీప్, సీఏ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ -
పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.పాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్పోర్ట్పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్‌కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్‌తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. -
కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-
క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డ్‌లు: కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశ ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లేటెస్ట్ వెర్షన్ పాన్ 2.0 ప్రారంభించే ప్రణాళికలను ఆవిష్కరించారు. లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద 1972లో ప్రవేశపెట్టిన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ప్రవేశపెట్టారు. ఆ తరువాత పాన్ ఎప్పుడూ అప్డేట్ అవ్వలేదు.. కాగా ఇప్పటికే డిజిటల్ అప్డేట్ అందుకుంది. ఇప్పటికి 78 కోట్లకు పైగా సాధారణ పాన్‌కార్డులను జారీ చేశారు. అయితే రాబోయే రోజుల్లో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.1,435 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో.. ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సోమవారం ఆమోదం తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచునికి ఈ పాన్ 2.0 ప్రవేశపెట్టారు.#Cabinet approves PAN 2.0 Project of the Income Tax Department enabling technology driven transformation of Taxpayer registration services #CabinetDecisions pic.twitter.com/iQhZCgGWGu— Dhirendra Ojha (@DG_PIB) November 25, 2024 -
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆ ఐడీతో కుదరదు!
దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరు. ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..దేశంలో మొదటి ఆధార్ కార్డ్ 2010 సంవత్సరంలో జారీ అయింది. ఇప్పటి వరకు, దేశంలోని జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డ్ ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు కొత్త రూల్ జారీ అయింది.ఇంతకు ముందు, ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడీని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడీని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించలేరు.ఇప్పుడు పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతకుముందులాగా ఆధార్ కార్డ్ లేకపోతే, ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డ్‌ని పొందేందుకు ఇప్పుడు వీలులేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ సరిపోదు. ఆధార్ కార్డు నంబర్ ఉండాల్సిందే. -
డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారా..? బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసేపుడు అనుకోకుండా పాన్‌కార్డు మరిచిపోయారా..? టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసేపుడు ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవడం గుర్తులేదా..? కంగారు పడకండి. మీ కోసమే ఈ కథనం.నిత్యం ఏదో ఒక సందర్భంలో పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..వంటి గుర్తింపుకార్డులు అవసరమవుతూ ఉంటాయి. నిత్యం ఫిజికల్‌గా వీటిని వెంటతీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కానీ ఎంత అత్యవసరాల్లో అయినా మొబైల్‌ను మాత్రం దాదాపు గుర్తుంచుకుని తీసుకెళ్తుంటాం. మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో అన్ని గుర్తింపుకార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అసలు ఈ లాకర్ ఏంటీ..? దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.డిజీలాకర్ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా వినియోగించుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ లాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కినా డిజీలాకర్‌లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.వినియోగం ఇలా..ప్లేస్టోర్ నుంచి ఫోన్లో డిజీలాకర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆరంకెల సెక్యూరిటీ పిన్ను వస్తుంది. దాన్ని సంబంధింత బ్లాక్‌లో ఎంటర్ చేయాలి. మీ ఆధార్‌కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ పిన్ సాయంతో లాగిన్ అవగానే మీ ఆధార్ కార్డు, పాన్‌కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్‌లో సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్‌కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..ఇతర పత్రాలను ఎలా అప్లోడ్ చేయాలంటే..కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో ఈ లాకర్లో భద్రపరచుకోవచ్చు. డిజీలాకర్ యాప్‌లో సైన్-ఇన్ అవ్వగానే కిందకు స్క్రోల్ చేస్తే ‘డిజీలాకర్ డ్రైవ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ‘+’ సింబల్‌పై ప్రెస్ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్‌గా అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్‌లో ప్రతీ యూజర్‌కు 1 జీబీ క్లౌడ్ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఒక్కో ఫైల్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్ చేయొచ్చు. -
ఆన్లైన్లో పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాలకు, గుర్తింపు రుజువుగానూ పనిచేస్తుంది. ప్రతి పాన్ కార్డు ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఏ ఉత్తరప్రత్యుత్తరాలపై పాన్ కార్డు నంబరును కోట్ చేయడం తప్పనిసరి. 2005 జనవరి 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన చెల్లింపులకు చలాన్లపై పాన్ కోట్ చేయడం తప్పనిసరి. ఈ క్రింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో పాన్ ను కోట్ చేయడం కూడా తప్పనిసరి. దీని కోసం పాన్ కార్డును ఎప్పటికప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్లో పాన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియస్టెప్ 1: ఇన్కమ్ ట్యాక్స్ 'ఈ-ఫైలింగ్' పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.స్టెప్ 2: 'క్విక్ లింక్స్' సెక్షన్ నుంచి 'వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్' హైపర్ లింక్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 3: పాన్, పూర్తి పేరు (పాన్ ప్రకారం), పుట్టిన తేదీ ఎంటర్ చేసి 'స్టేటస్'పై క్లిక్ చేయండిస్టెప్ 4: ఇమేజ్‌లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీ పాన్ వివరాలను ధ్రువీకరించడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి. -
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్సైట్లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్సైట్ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.NSDL e-Gov పోర్టల్‌లో.. స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్ చేయండిస్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.స్టెప్ 3: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండిస్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండిస్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండిఅప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్‌లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.UTIITSL పోర్టల్‌లో ఇలా..స్టెప్ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండిస్టెప్ 2: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్ టు అప్లయి’ మీద క్లిక్ చేయండిస్టెప్ 3: 'అప్లయి ఫర్ చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్' ట్యాబ్‌ను ఎంచుకోండిస్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండిస్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.స్టెప్ 11: నచ్చిన ఆన్లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.కావాల్సిన డాక్యుమెంట్లుపాన్ కార్డు డూప్లికేట్ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు. -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
పాన్‌కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్‌ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్‌కార్డ్ నెంబర్‌తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
పాన్‌కార్డులో మార్పులు చేయాలా..? ప్రాసెస్ ఇదే..
ఫొటో ఐడెంటిటీలో భాగంగా మన వద్ద ఆదార్, ఓటర్ ఐటీ వంటి చాలా కార్డులే ఉంటాయి. అయితే నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో ప్రస్తుతం పాన్ కార్డు కూడా వచ్చి చేరింది. విలువైన వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును వినియోగిస్తుంటారు. ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫొటో, పుట్టినతేదీ, సంతకం వంటి వివరాలు ఉంటాయి. నగదు లావాదేవీలకు పాన్‌కార్డు కీలకంగా ఉంటుంది. అలాంటి కార్డులో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్యేం కాదు. ఇంటి వద్దనే మనం వీటిని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లయిన తరవాత చాలా మంది మహిళలు పాన్ కార్డులో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు. అయితే దాని కోసం ఎక్కడకీ వెళ్లే అవసరం లేకుండా తమ ఫోన్ ద్వారానే పేరు మార్చుకోవచ్చు. మార్పు చేసుకోండిలా.. మొబైల్/ డెస్క్‌టాప్ బ్రౌజర్లో టీఐఎన్ ఎన్ఎస్డీఎల్ (www.tin-nsdl.com) అని టైప్ చేస్తే, సంబంధిత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సర్వీసెస్ విభాగంలో PAN అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేశాక Change/Correction in PAN Data అనే సెక్షన్లో అప్లయ్పై క్లిక్ చేయాలి. అందులో ‘Application Type’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్ చేయాలి. పాన్ నంబర్ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో ఇవ్వాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేశాక మీకో టోకెన్ నంబర్ జారీ చేస్తారు. తర్వాత కింద బటన్‌పై క్లిక్ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించిన కరెక్షన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది. సబ్మిట్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన విధానంలో పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది. పేమెంట్ అయిన వెంటనే మీరు కార్డును అప్డేట్ చేసినట్టుగా ఓ స్లిప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. -
పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్‌తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్‌కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారిపోయాయి. -
దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - ఐటీ శాఖ రిప్లై ఇలా..!
Aadhaar Pan Link: గత కొన్ని రోజులుగా ఆధార్-పాన్ లింకింగ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023 జూన్ 30 లింకింగ్ చివరి గడువు అంటూ పలుమార్లు సంబంధిత శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆధార్ & పాన్ లింకింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ వినియోగదారుల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు. ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. (ఇదీ చూడండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?) నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. Dear @secureyoursites, It may be noted that non-linking of PAN with Aadhaar makes a PAN inoperative and not inactive, consequences of which have already been specified vide Press Release in https://t.co/N1IRieLOfr The NRIs who had intimated their NRI status to the Department are… — Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023 అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది. ఇందులో భాగంగా వారి పాస్‌పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్‌కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
పాన్ - ఆధార్ లింక్‌లో కొత్త అప్డేట్
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, ఈ ప్రక్రియ 2023 జూన్ 30 చివరి నాటికి పూర్తి చేసుకోవాలని గతంలోనే చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాన్ కార్డు - ఆధార్ లింకింగ్‌లో కొత్త అప్డేట్ వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్మెంట్ ఏడాదిని 2023 - 24గా కాకుండా, అసెస్మెంట్ ఇయర్‌ను 2024-25గా ఎంచుకోవాలి. పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే గమనించాలి. ఆలా కాకుండా దావుబ్బు చెల్లిస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకుని ఉంటారు. అలాంటి వారు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిదో లేదో చూసుకోవడం మంచింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు: మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పోజీలో క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. -
పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు
న్యూఢిల్లీ: పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగించింది. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే, ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు ప్రజలకు మరింత సమయం ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలు సహా పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్స్‌పేయర్లకు మరికాస్త సమయం ఇచ్చే క్రమంలో పాన్, ఆధార్‌ను లింక్ చేసుకునేందుకు గడువు తేదీని 2023 జూన్ 30 వరకు పెంచినట్లు ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత గడువులోగా వీటిని లింకు చేసుకోని వారి పాన్ నంబర్లు జూలై 1 నుంచి పనిచేయవు. దీని వల్ల ట్యాక్స్‌పేయర్లు ట్యాక్స్ రీఫండ్లను గానీ వాటిపై వడ్డీలను గానీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. అలాగే వారికి టీడీఎస్, టీసీఎస్ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. పాన్, ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌ను పలు దఫాలు పొడిగిస్తూ వస్తోంది. వాస్తవానికి గతేడాది (2022) మార్చి ఆఖరు నాటికే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని తొలుత గడువు విధించారు. అది దాటాకా 2022 ఏప్రిల్ 1 నుంచి రూ. 500 జరిమానా ప్రతిపాదించారు. దాన్ని గతేడాది జూలై 1 నుంచి రూ. 1,000కి పెంచారు. ప్రస్తుతం ఇదే పెనాల్టీ అమలవుతోంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్లు (పర్మనెంట్ అకౌంటు నంబర్) ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. -
పాన్ అప్డేట్ అంటూ సందేశాలు.. క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా!
ఆధార్ అప్డేట్, పాన్ కార్డు అప్డేట్ వంటివి వినియోగదారులు ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది అప్డేట్ యువర్ పాన్ అనే సందేశంతో కొన్ని ఫేక్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై క్లిక్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశిస్తోంది. గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో కొన్ని ఫేక్ మెసేజిలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇవి నకిలీ సందేశాలైనప్పటికీ @TheOfficialSBI అనే పేరుతో రావడం గమనార్హం. ఇందులో మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందని ఉంటుంది. దీనికి భయపడి కొంతమంది దానిపైన క్లిక్ చేసి సైబర్ దాడులకు బలైపోతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలపై ఎవరూ క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. SBI ఎప్పుడూ మీ పర్సనల్ డీటైల్స్, అకౌంట్ వివరాలు సందేశాల ద్వారా అడగదు, కావున వినియోగదారుడు తప్పకుండా వీటిని గమనించి జాగ్రత్త వహించాలి. ఇదిలా ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కూడా ఫేక్ మెసేజస్ వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్‌ల ప్రీ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్లుగా ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపించలేదని, దానికి ఎవరూ స్పందించవద్దని అధికారులు చెబుతున్నారు. A #Fake message issued in the name of @TheOfficialSBI is asking recipients to update their PAN on a suspicious link to prevent their account from getting expired.#PIBFactCheck ✅ Beware of such frauds. ✅ SBI never sends emails/SMS asking for personal/banking details. pic.twitter.com/1u8tFywQcf — PIB Fact Check (@PIBFactCheck) March 24, 2023 -
NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!
ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలుసు. దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, ఆదాయ పన్ను చెల్లించేవారు పాన్ కార్డు కలిగి ఉంటారు. అయితే కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు (NRI) కూడా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) అనేది నెంబర్స్, ఇంగ్లీష్ అక్షరాలతో కలిసి ఉంటుంది. మనదేశంలోని ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబర్‌తో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఇండియాలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి. పాన్ కార్డు కోసం ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.. ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి భారతదేశంలో ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వారు. భారతదేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనునుకునే వారు. మ్యుచ్చువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి చూపే వారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం UTIITSL లేదా Proteanలో అప్లై ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49ఏ ఫర్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీ పౌరసత్వం ఉన్నవారైతే ఫామ్ 49ఏఏ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అన్ని వివరాలను నింపిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన అవసరమైన డాక్యుమెంట్స్, డిజిటల్ సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత ఓపెన్ అయ్యే పేమెంట్ పేజీలో అమౌంట్ పే చేసిన తరువాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేనివారు, ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకునేవారు సమీపంలో ఉన్న ఐటి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిఐఎన్ ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, ఫీజు చెల్లించి అక్కడే సబ్మిట్ చేయాలి. డీడీ ద్వారా కూడా చెల్లించాల్సిన ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తరువాత వారు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ని పాన్ కార్డ్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. -
పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి
ఆధునిక కాలంలో పాన్ కార్డు గురించి దాదాపు అందరికి తెలుసు. తాజాగా విడుదలైన కొన్ని నోటిఫికేషన్స్ ప్రకారం, పాన్ కార్డు కలిగిన వినియోగదారులు తమ ఆధార్ నెంబర్‌తో తప్పకుండా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఆలా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినియోగదారుల పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకునేవారికి కొన్ని సులభమైన టిప్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు లింక్ చేయడం ఎలా? ఇన్‌కమ్‌టాక్స్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి. ప్రక్రియను ప్రారంభించడానికి పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సిస్టమ్ మీ పాన్ నంబర్ & ఆధార్ నంబర్ని ధృవీకరిస్తుంది. మీ పాన్ కార్డుని ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1,000 ఈ-పే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ఫీజు చెల్లించడానికి ఓటీపీ పొందటానికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ-పే టాక్స్ పేజీలో, ఇన్‌కమ్‌టాక్స్ మీద క్లిక్ చేయండి. అసెస్మెంట్ సంవత్సరాన్ని 2023 - 2024గా, ఆధార్ పేమెంట్స్ కోసం అక్కడ ఎంచుకోండి. మీకు వర్తించే మొత్తం అమౌంట్‌కి సంబంధించి వివరాలు వేరే ట్యాబ్‌లో చూడవచ్చు. మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తరువాత IT వెబ్‌సైట్‌లోని మీ ప్రొఫైల్ డ్యాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది. అక్కడ 'లింక్ ఆధార్ టు పాన్' అనే ఆప్సన్ చూడవచ్చు దానిపైన క్లిక్ చేసిన తరువాత మీ పాన్ కార్డ్‌తో మీ ఆధార్‌ను లింక్ చేయడానికి అభ్యర్థనను తెలియజేస్తుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. కావాల్సిన వివరాలను అందించిన తరువాత "లింక్ ఆధార్" బటన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ దృవీకరించండి తరువాత, మీ పాన్ నంబర్‌తో ఆధార్ కార్డ్‌ని విజయవంతంగా లింక్ చేసారని తెలుసుకోవచ్చు. పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోవడం ఎలా? ఇక్కడ కూడా ఇన్‌కమ్‌టాక్స్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి అలా కాకపోతే ఇక్కడున్న రెండు లింకులతో దేనినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్ వెబ్సైట్ / పాన్ కార్డ్ వెబ్సైట్ మీరు ఆధార్-పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయడానికి ఇన్‌కమ్‌టాక్స్ వెబ్సైట్ ఉపయోగించుకుంటే పాన్ నంబర్ & ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి. సిస్టమ్ చెక్ చేసి పాన్ కార్డ్ మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది. పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పాన్ కార్డ్ వెబ్సైట్ ఉపయోగించవచ్చు. ఇక్కడ పాన్ నంబర్ & పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరగా సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ పాన్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది. పైన తెలిపిన సూచనలను పాటిస్తూ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోండి. అంతే కాకుండా ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు లింక్ చేయడం గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెల 31లోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలి. ఈ నెల చివరిలోపు పాన్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చెకపోతే పాన్ కార్డ్ పనిచేయదు. -
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్‌ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు!
పాన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు తరుముకొస్తోంది. పాన్ ఆధార్ లింక్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్లు చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ.1000 రుసుం చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటికీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ చెల్లదు . ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు. అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్‌కి UIDPAN < SPACE > < 12 అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10 అంకెల పాన్ నంబర్ > టైప్ చేసి ఎస్మెమ్మెస్ చేయొచ్చు. ఇన్ ఆఫ్‌లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వారు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. వీరికి మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఎఎ ప్రకారం.. పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది పనిచేయదు. అయితే దీని నుంచి కొందరికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2017 మేలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది. అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్లు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. భారతదేశ పౌరులు కాని వారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
ఆధార్‌తో 48 కోట్ల పాన్లు అనుసంధానం
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 48 కోట్ల పాన్లు ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానం చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. మొత్తం 61 కోట్ల వ్యక్తిగత పాన్లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు చెప్పారు. అంటే 80 శాతం కార్డులనే అనుసంధానించుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 13 కోట్ల పాన్ హోల్డర్లు ఈ ఏడాది మార్చి 31లోపు అనుసంధానించుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనుసంధానం చేసుకుని పాన్లు పనిచేయకుండా పోతాయన్నారు. దీంతో వ్యాపార, పెట్టుబడులు, పన్నుల సంబంధిత ప్రయోజనాలు నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఆధార్–పాన్ అనుసంధానానికి కేంద్రం ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసింది. దీంతో రూ.1,000 ఫీజు చెల్లించి ఈ ఏడాది మార్చి 31 వరకు అనుసంధానించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా గడువు పెంచుకుంటూ, ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన విషయాన్ని నితిన్ గుప్తా వివరించారు.