11.44 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్
ముంబై: పాన్‌కార్డు హోల్డర్స్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశ వాప్తంగా సుమారు 11.4 లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అందులో కొన్నింటిని డిలీట్ కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నెంబర్‌తో లింక్ చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది.
డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ డిపార్ట్ మెంట్ ఇ- ఫిల్లింగ్ వెబ్ సైట్‌ను ని సందర్శించండి. అందులో 'Know Your Pan' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జగ్రత్తగా నింపి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది.
ఇంకా చదవండి: ఆగస్టు 31 డెడ్‌లైన్..లేదంటే