deactive
-
అమూల్ డైరీ ఖాతాను నిలిపివేసిన ట్విటర్, కారణం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ డైరీ ఖాతను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ తాత్కలికంగా నిలిపివేసింది. ఇండియా - చైనా మధ్య సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ డైరీ ‘ఎగ్జిట్ ది డ్రాగన్’ అంటూ ఒక పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతలో షేర్ చేసింది. ఈ పోస్టర్లో అమూల్ బేబీ చైనా చిహ్నం డ్రాగన్‌ను చేతితో ఆపుతున్నట్లు ఉంది. అదేవిధంగా ఈ పోస్టర్లో చైనా యాప్ టిక్‌టాక్ కనిపిస్తుండటం ఉండటం విశేషం. దీంతో ట్విటర్ అమూల్ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమ్యూల్ సంస్థ ధృవీకరించింది. (అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా) #Amul Topical: About the boycott of Chinese products... pic.twitter.com/ZITa0tOb1h — Amul.coop (@Amul_Coop) June 3, 2020 ఎగ్జిట్ డ్రాగన్ పోస్ట్ కారణంగా తమ ఎకౌంట్‌ను తాత్కలికంగా తొలగించిందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి ట్విటర్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమ్యూల్ సంస్థ పేర్కొంది. తాము అన్ని విషయాల మీద స్పందిస్తామని, పక్షపాత ధోరణితో ఏ విషయంలో వ్యవహరించమని అమ్యూల్ సంస్థ తెలిపింది. అకౌంట్‌ను తిరిగి పునరుద్దరించాలని ట్విటర్‌ను కోరినట్లు తెలిపింది. తమ అకౌంట్‌ను తొలగించిన కారణంగా ఈ పోస్ట్ తమ ఫాలోవర్స్ ఎవరికి కనిపించడం లేదని సంస్థ తెలిపింది. అందరూ అమూల్ సంస్థకు అండగా నిలుస్తున్నారని, ట్విటర్ ఇలా చేయడంతో వారు అందరూ ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ విషయంపై ట్విటర్‌ను వివరణ కోరామని కూడా అమూల్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించిన ట్విటర్ అమూల్ సంస్థ రక్షణ కోసమే ఇలా చేశామని, ట్విటర్లో పబ్లిష్ చేసిన విషయంతో దీనికి సంబంధం లేదని తెలిపింది. ఇండియా- చైనా సరిహద్దు వివాదం, మహమ్మారి కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని చాలా మంది భావిస్తుండటంతో చైనా ఉత్పత్తులను భారత్‌లో నిషేధించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. (‘రిమూవ్ చైనా యాప్స్’కు) -
ప్రియా.. ప్రియా... వెళ్లొద్దే!
రెండేళ్ల క్రితం ‘ఒరు అడార్ లవ్’ సినిమా టీజర్లో కన్ను కొడుతూ కనిపించి, ‘కన్నుకుట్టి’గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు ప్రియా ప్రకాష్ వారియర్. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఒక్కరోజులోనే ఆరులక్షల ఫాలోయర్స్‌ను సంపాదించిన ఇండియన్ సెలబ్రిటీగా సోషల్ మీడియా రికార్డును దక్కించుకున్న ఘనత ప్రియాది. తాజాగా ప్రియ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. ‘‘మా అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఇది తాత్కాలికం మాత్రమే. తను కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటోంది. కొంత సమయం తర్వాత ఆమె తిరిగి ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ కావొచ్చు’’ అని ప్రియ తండ్రి ప్రకాష్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రియ తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించిందని, అందుకే ప్రియ ఇలా చేశారని టాక్. సోషల్ మీడియా స్టార్ కన్నా కూడా నటిగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు ఇటీవలే టిక్‌టాక్‌లో జాయిన్ అయ్యారు ప్రియాప్రకాష్. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్, టిక్‌టాక్ అకౌంట్స్ యాక్టివ్గానే ఉన్నాయి. ఇన్‌స్టా నుంచి ఈ కన్నుకుట్టి వెళ్లగానే ‘ప్రియా.. ప్రియా.. వెళ్లొద్దే’ అంటూ అభిమానులు బాధపడిపోతున్నారు. -
బానిసనయ్యాను అందుకే దూరంగా ఉంటున్నాను
ప్రతి విషయం గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే నటి, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ స్వర భాస్కర్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు.. అంటే ట్విటర్లో కనిపించడం లేదని. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. నిఖచ్చిగా మాట్లాడుతూ.. నెటిజన్ల విమర్శలు ఎదుర్కొనే స్వర భాస్కర్ కొద్ది రోజులుగా ట్విటర్లో కనిపించడం లేదు. దాంతో ట్రోలర్స్‌కి భయపడి స్వర తన ట్విటర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్వయంగా స్పందించారు స్వర భాస్కర్. ‘ప్రస్తుతం నేను యూరోప్ టూర్లో ఉన్నాను. వచ్చేవారం ఇండియాకు తిరిగి వస్తాను. ఈ సెలవులను ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంతేకాక ఈ మధ్య నేను ట్విటర్‌కు బాగా అడిక్ట్ అయినట్లు అన్పిస్తోంది.అందుకే ట్విటర్‌కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం ‘ఈ 30 ఏళ్ల నటి నోటికి అడ్డు అదుపూ లేకుండా మాట్లాడ్తది. దాంతో స్వరకు, ఆమె హేటర్స్‌కు మధ్య ఇప్పటికే చాలాసార్లు గొడవలు జరిగాయి. వీటన్నింటి దృష్టిలోపెట్టుకునే స్వర ప్రస్తుతం ట్విటర్‌కు దూరంగా ఉంటుందనే’ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కానీ స్వర మాత్రం ఈ వార్తలు వాస్తవం కాదంటున్నారు. ప్రస్తుతం స్వర ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో యాక్టీవ్‌గానే ఉన్నారు. -
11.44 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్
ముంబై: పాన్‌కార్డు హోల్డర్స్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశ వాప్తంగా సుమారు 11.4 లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అందులో కొన్నింటిని డిలీట్ కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నెంబర్‌తో లింక్ చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది. డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ డిపార్ట్ మెంట్ ఇ- ఫిల్లింగ్ వెబ్ సైట్‌ను ని సందర్శించండి. అందులో 'Know Your Pan' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జగ్రత్తగా నింపి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. ఇంకా చదవండి: ఆగస్టు 31 డెడ్‌లైన్..లేదంటే