సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ డైరీ ఖాతను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ తాత్కలికంగా నిలిపివేసింది. ఇండియా - చైనా మధ్య సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ డైరీ ‘ఎగ్జిట్ ది డ్రాగన్’ అంటూ ఒక పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతలో షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో అమూల్ బేబీ చైనా చిహ్నం డ్రాగన్‌ను చేతితో ఆపుతున్నట్లు ఉంది. అదేవిధంగా ఈ పోస్టర్‌లో చైనా యాప్ టిక్‌టాక్ కనిపిస్తుండటం ఉండటం విశేషం. దీంతో ట్విటర్ అమూల్ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమ్యూల్ సంస్థ ధృవీకరించింది. (అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా)
#Amul Topical: About the boycott of Chinese products... pic.twitter.com/ZITa0tOb1h
— Amul.coop (@Amul_Coop) June 3, 2020
ఎగ్జిట్ డ్రాగన్ పోస్ట్ కారణంగా తమ ఎకౌంట్‌ను తాత్కలికంగా తొలగించిందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి ట్విటర్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమ్యూల్ సంస్థ పేర్కొంది. తాము అన్ని విషయాల మీద స్పందిస్తామని, పక్షపాత ధోరణితో ఏ విషయంలో వ్యవహరించమని అమ్యూల్ సంస్థ తెలిపింది. అకౌంట్‌ను తిరిగి పునరుద్దరించాలని ట్విటర్ను కోరినట్లు తెలిపింది. తమ అకౌంట్‌ను తొలగించిన కారణంగా ఈ పోస్ట్ తమ ఫాలోవర్స్ ఎవరికి కనిపించడం లేదని సంస్థ తెలిపింది. అందరూ అమూల్ సంస్థకు అండగా నిలుస్తున్నారని, ట్విటర్ ఇలా చేయడంతో వారు అందరూ ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ విషయంపై ట్విటర్‌ను వివరణ కోరామని కూడా అమూల్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించిన ట్విటర్ అమూల్ సంస్థ రక్షణ కోసమే ఇలా చేశామని, ట్విటర్లో పబ్లిష్ చేసిన విషయంతో దీనికి సంబంధం లేదని తెలిపింది. ఇండియా- చైనా సరిహద్దు వివాదం, మహమ్మారి కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని చాలా మంది భావిస్తుండటంతో చైనా ఉత్పత్తులను భారత్‌లో నిషేధించాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment