ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ఈ అంశం ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛా గొంతుక(పోస్టులు) వినిపించే అవకాశం యూజర్లకు కల్పిస్తానంటూ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భారీ డీల్‌పై ఎలన్ మస్క్ వ్యాపార ప్రత్యర్థి జెఫ్ బెజోస్ స్పందించారు.
అమెజాన్ బాస్, ప్రపంచంలో రెండో ధనికుడు జెఫ్ బెజోస్.. ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన అంశంపై స్పందించారు. చరకలు అంటిస్తూనే.. ఆ వెంటనే మస్క్‌ను అభినందించినట్లు బెజోస్ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ తరుణంలో తెరపైకి ఆయన చైనా ప్రస్తావన తీసుకొచ్చారు.
► ఇకపై టెస్లాతో పాటు ట్విటర్‌లోనూ చైనా కీలక పాత్ర పోషించబోతుందంటూ అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారాయన. ‘‘చైనీస్ ప్రభుత్వం ‘టౌన్ స్క్వేర్’తో.. ఇప్పుడు పరపతి పొందుతుందా? ఆసక్తికరమైన ప్రశ్న..’’ అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారాయన.
Interesting question. Did the Chinese government just gain a bit of leverage over the town square? https://t.co/jTiEnabP6T
— Jeff Bezos (@JeffBezos) April 25, 2022
► విషయం ఏంటంటే.. ఆటోమేకింగ్ దిగ్గజం టెస్లా.. చైనాలోనే తొలి ఓవర్సీస్ ఫ్యాక్టరీ నెలకొల్పింది. తద్వారా అతిపెద్ద మార్కెట్ ఆసియా మీద దృష్టిసారించింది. ఇప్పుడు ట్విటర్‌తోనూ మస్క్.. చైనా పరపతిని పెంచుతాడేమో అంటూ పరోక్షంగా విసుర్లు విసిరాడు బెజోస్.
► స్వేచ్ఛా ప్రకటనకు ట్విటర్ అనేది డిజిటల్ టౌన్ స్క్వేర్ లాంటిదని ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెజోస్.. టౌన్‌స్క్వేర్ అంటూ సెటైర్ వేశాడు. అయితే ప్రశ్న సంధించినట్లే సంధించి.. దానికి సమాధానం ఏమో పాజిటివ్‌గా ఇచ్చాడు బెజోస్.
► నా ఉద్దేశంలో అలా జరగకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. చైనా-టెస్లాలో ఉన్న సంక్లిష్టత, ట్విటర్‌కు ఉన్న సెన్సార్‌షిప్ అడ్డంకులు ఒకటి కాకపోవచ్చంటూ కామెంట్ చేశాడు. ఆ వెంటనే.. మస్క్ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను డీల్ చేయడంలో దిట్ట అంటూ ప్రశంసలు గుప్పించాడు జెఫ్ బెజోస్. మొత్తానికి తన అక్కసును వెల్లగక్కినట్లే కక్కి.. మస్క్‌పై ప్రశంసలు గుప్పించాడు బెజోస్. దీనిపై మస్క్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.
My own answer to this question is probably not. The more likely outcome in this regard is complexity in China for Tesla, rather than censorship at Twitter.
— Jeff Bezos (@JeffBezos) April 26, 2022
But we’ll see. Musk is extremely good at navigating this kind of complexity.
— Jeff Bezos (@JeffBezos) April 26, 2022
Comments
Please login to add a commentAdd a comment