Jeff Bezos
-
అంబానీ బాటలో.. బెజోస్!: ఏకంగా రూ.71 వేలకోట్లు
మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. ఇది రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే చారిత్రాత్మక పెట్టుబడి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) పేర్కొన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ఒప్పంద ప్రకటనలు వెలువడిన తరువాత.. ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్'కు చెందిన అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' (AWS), 2030 నాటికి మహారాష్ట్రలో 8.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 71,600 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటురిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్, పాలిస్టర్, పునరుత్పాదక ఇంధనం, బయో ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ కెమికల్స్, ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్స్, రిటైల్, డేటా సెంటర్లు, టెలికమ్యూనికేషన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఈ రంగాల్లో సుమారు 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సమాచారం.Government of Maharashtra and RIL sign historic MoU worth ₹3,05,000 crore at #WEF25 #Davos https://t.co/Ho5OFW73IO— Reliance Industries Limited (@RIL_Updates) January 22, 2025 -
అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?
అమెజాన్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజిన్(Blue Origin) స్పేస్ సర్వీస్ కంపెనీ తన మొదటి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జెఫ్ బెజోస్(Jeff Bezos) నేతృత్వంలోని ఈ సంస్థ ‘న్యూ గ్లెన్’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను జనవరి 8న ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ స్థాపించిన 25 ఏళ్లకు మొదటి రాకెట్‌ను లాంచ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ఎక్స్ ప్రైవేట్ స్పేస్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి పోటీగా అమెజాన్ ఈ ప్రయోగం చేయడం రెండు సంస్థల మధ్య పోటీని తెలియజేస్తుంది. త్వరలో ప్రయోగించబోయే రాకెట్ లాంచ్‌కు సంబంధించి ‘నెక్ట్స్ స్టాప్ లాంచ్’ అని తెలియజేస్తూ జెఫ్ బెజోస్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఆరు గంటల ప్రయోగంబ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ రాకెట్(New Glenn rocket)ను లండన్‌లోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ‘స్పేస్ ఫ్లైట్ నౌ’ తెలిపింది. 2024 డిసెంబర్ 27న రాకెట్ హాట్-ఫైర్ పరీక్ష పూర్తయినట్లు తెలిపింది. రాకెట్ పనితీరును, పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించే ఈ ప్రయోగం సుమారు ఆరు గంటల పాటు ఉంటుందని భావిస్తున్నారు. న్యూ గ్లెన్ విజయవంతమైతే, బ్లూ ఆరిజిన్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష రేసులో ముందంజలో ఉంచుతుందని కంపెనీ విశ్వసిస్తుంది.ఇదీ చదవండి: 130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మాస్పేస్ఎక్స్కు ముప్పు?స్పేస్ఎక్స్ ఇటీవల పునర్వినియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 2024లోనే 132 ప్రయోగాలు చేసి 99 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఈ కంపెనీకు చెందిన స్టార్ లింక్‌కు పోటీగా బ్లూ ఆరిజిన్ నిలుస్తుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. స్పేస్‌ఎక్స్‌తోపాటు లూనార్ ల్యాండర్ తయారీ కంపెనీలు, ప్రైవేట్ స్పేస్ స్టేషన్లు వంటి పోటీదారులతో పోటీ పడటానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. -
ప్రియురాలిని పెళ్లిచేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ బెజోస్ (ఫోటోలు)
-
ప్రియురాలితో బెజోస్ పెళ్లి.. ఖర్చు అన్ని వేలకొట్లా?
అమెజాన్ ఫౌండర్, ప్రపంచ ధనవంతులలో రెండో వ్యక్తి 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు. ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. కాగా 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం 2019లో నిజమని తెలిసింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 55 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంది. 60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య 'మెకంజీ స్కాట్'కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?జెఫ్ బెజోస్ నికర విలువప్రపంచ కుబేరుడైన ఇలాన్ మస్క్ తరువాత, రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ నికర విలువ 244 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ. -
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్‌లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్‌మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్‌ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్‌ను విమర్శించారు. గతంలో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్‌కు సంబంధించి అమెజాన్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్‌లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్‌మస్క్ ఇప్పటికే ట్రంప్‌నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
స్పందించిన బెజోస్.. రిప్లై ఇచ్చిన మస్క్: ట్వీట్స్ వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతారని ఊహించినందున.. తమ టెస్లా, స్పేస్ఎక్స్ స్టాక్లను విక్రయించమని అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రజలకు సలహా ఇచ్చారని 'ఇలాన్ మస్క్' (Elon Musk) చేసిన వాదనపై జెఫ్ బెజోస్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మస్క్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అది వంద శాతం తప్పు అని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. సరే, నేను సరిదిద్దుకున్నాను అంటూ.. మస్క్ స్మైల్ ఎమోజీని యాడ్ చేశారు.అంతే కంటే ముందు నవంబర్ 6న జెఫ్ బెజోస్ తన ఎక్స్ ఖాతాలో డోనాల్డ్ ట్రంప్‌ను అభినందించారు. మా 47వ అధ్యక్షుడికి శుభాకాంక్షలు అంటూ.. మనమందరం ఇష్టపడే అమెరికాను నడిపించడంలో ట్రంప్ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జెఫ్ బెజోస్ కమలా హారిస్‌కు సపోర్ట్ చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..రూ.28 లక్షల కోట్లకు చేరిన మస్క్ సంపదఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దీంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.Nope. 100% not true.— Jeff Bezos (@JeffBezos) November 21, 2024Well, then, I stand corrected 😂— Elon Musk (@elonmusk) November 21, 2024 -
ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ (ఫోటోలు)
-
60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లిచేసుకోనున్నట్లు తెలుస్తోంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం 2019లో బయటకు వచ్చింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 54 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈమెకు సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.జెఫ్ బెజోస్ నికర విలువప్రపంచలోనే అత్యంత ధనవంతులైన.. టాప్ 10 కుబేరుల జాబితాలో ఒకరుగా నిలిచిన జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఈయన నికర విలువ 2024 నవంబర్ 13 నాటికి 230 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1,94,17,68,88,43,000. -
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్‌ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
US Presidential Election 2024: వాషింగ్టన్ పోస్ట్‌కు హారిస్ దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలకాలని గత వారం ‘వాషింగ్టన్ పోస్ట్’వార్తాసంస్థ తీసుకున్న నిర్ణయం తాజాగా ఆ సంస్థ సర్కులేషన్‌కు ఎసరుపెట్టింది. హారిస్‌కు మద్దతు పలుకుతున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ‘తటస్థ’వైఖరిని అవలంభించాలని సంస్థను ఇటీవల కొనుగోలుచేసిన ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాజాగా ఆదేశించడమే ఇందుకు అసలు కారణం. అసలేం జరిగింది? కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పత్రిక ఎడిటోరియల్ సిబ్బంది గత వారం ప్రకటించారు. ఇది నచ్చని యజమాని, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వెంటనే రంగంలోకి దిగారు. ‘అధ్యక్ష అభ్యర్థికి మద్దతు పలకడం అనేది పక్షపాత భావనను సృష్టిస్తుంది. ఇది పాఠకుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని పోగొట్టడమే అవుతుంది. అందుకే అధ్యక్ష అభ్యర్థులకు మద్దతు పలికే సంప్రదాయాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నా. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, నాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సీఈఓ డేవ్ లింప్ మధ్య అక్టోబర్ 25న భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి వాషింగ్టన్పోస్ట్ హారిస్‌కు మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వక వ్యూహం కాదు. ఇక్కడ ఏ విధమైన క్విడ్ ప్రోకో జరగలేదని స్పష్టం చేయదల్చుకున్నా’’అని వ్యాఖ్యానించారు. దీంతో బెజోస్ ఆదేశాలను శిరసావహిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణకర్త విల్ లూయిస్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేశారు. ‘ఏ అభ్యర్థికి ఓటేయాలనే విచక్షణా సామర్థ్యం అమెరికా ఓటర్లయిన మా పాఠకులకు ఉంది’ అని అందులో పేర్కొన్నారు. దీంతో సోమవారం 2 లక్షల మంది చందాదారులు వాషింగ్టన్పోస్ట్ సభ్యత్వాన్నిరద్దుచేసుకున్నారు. ఇది సంస్థ ప్రింట్, డిజిటల్ సర్కులేషన్ల 8 శాతానికి సమానం. ఈ సంఖ్య మరింతపెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కమలా హారిస్‌కు మద్దతుపలికే చందాదారులే తమ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకున్నట్లు వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ టైమ్స్ సైతం ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకూడదని నిర్ణయించింది. అభ్యర్థికి పత్రిక ఆమోదం ఎందుకు? అధ్యక్ష అభ్యర్థులను సమర్థించే వార్తాపత్రిక ఎడిటోరియల్ పేజీల సంప్రదాయం అమెరికాలో శతాబ్దానికి పైగా ఉంది. వార్తా పత్రికలు తాము విశ్వసించే అభ్యర్థిని సమర్థించడం ద్వారా సమాచారంతో కూడిన ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. మద్దతు పలకడం అనగానే ఆ వార్తాసంస్థ ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తోందని కాదు. పత్రిక పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తూనే నిష్పాక్షిక కవరేజీని అందిస్తాయి.ఆ అభ్యర్థి ఏరకంగా అధ్యక్ష పదవికి అర్హుడో వాస్తవకోణంలో తెలియజేయస్తాయి. ఓటేసేటపుడు ఏది ఉత్తమ నిర్ణయమో పాఠకులకు తెలియజేయడం ఈ మద్దతు అంతిమ లక్ష్యం. అనేక వార్తాపత్రికలకు అభిప్రాయాలు, మద్దతును ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఎడిటోరియల్ బోర్డ్‌లు ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ అనధికారికంగా కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానళ్లు తాము మెచ్చిన అభ్యర్థి/రాజకీయ పార్టీకి అనుకూలంగా అత్యధిక కవరేజీ ఇచ్చే ధోరణి మాత్రం భారత్‌లో బాగా పెరిగింది. ఏ ప్రాతిపదికన సమరి్థస్తారు? అభ్యర్థి గెలిచి అధ్యక్షుడయ్యాక పరిపాలన ఎలా ఉండొచ్చు? హామీలను నెరవేర్చడానికి అమలుకు పక్కా ప్రణాళిక ఉందా?. మన వార్తాసంస్థ విలువలకు అనుగుణంగా ఏ అభ్యర్థి ఉన్నారు? అసలు అధ్యక్షుడయ్యే అర్హత ఆ అభ్యర్థికి ఉందా? అంతర్జాతీయ పరిణామాలను అవపోశన పట్టి అగ్రరాజ్య అధిపతిగా నెగ్గుకురాగలడా? వంటివి పరిగణనలోకి తీసుకుని వేర్వేరు వార్తాసంస్థలు తమకు నచ్చిన అభ్యర్థికేే మద్దతు ప్రకటిస్తాయి. అయితే అమెరికాలో వార్తాపత్రికలు బలపరిచిన అభ్యర్థులు ప్రతిసారీ గెలవలేదనే వాదన కూడా ఉంది. 1897లో దాదాపు అన్ని న్యూయార్క్ వార్తాపత్రికలు మద్దతు పలికిన అభ్యర్థులు ఓటమిని చవిచూడటం గమనార్హం. కానీ న్యూయార్క్ టైమ్స్ అధ్యయనం ప్రకారం 1940 నుంచి 2016 వరకు జరిగిన దాదాపు అన్ని అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యధిక వార్తాపత్రికల మద్దతు అందుకున్న అభ్యర్థే అధికారాన్ని కైవసం చేసుకుని శ్వేతసౌధంలో అడుగుపెట్టగలిగారు. ఈసారి ఎందుకు వివాదాస్పదమైంది?అనుకూల, ప్రతికూల అనే అంశాలను పక్కనబెడితే అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అభ్యర్థుల్లో ట్రంప్ ఒకరు. అతని అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లను తీవ్రంగా విభజించాయి. డెమొక్రటిక్ అభ్యర్థి గెలిస్తే అమెరికా నాశనమవుతుందని ట్రంప్ బలంగా ప్రచారంచేశారు. 2016లో తొలిసారి గెలిచినప్పటి నుంచి మీడియాలో వస్తున్న విమర్శలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తా పత్రికలను ఫేక్ న్యూస్ అని పదేపదే ఖండించారు. ఈ నేపథ్యంలో ఎండార్స్మెంట్ విషయమై వాషింగ్టన్ పోస్ట్, లాస్ఏంజిల్స్ టైమ్స్ వెనుకంజ వేయడానికి వ్యాపారపరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్‌కు అమెరికా ప్రభుత్వంతో బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాలు ఉన్నాయి. ఆయన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌కు స్పేస్ ఫోర్స్, నాసాతో ఒప్పందాలున్నాయి. 2023లో డెమొక్రాట్ల బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ ట్రస్ట్ దావాను కూడా అమెజాన్ ఎదుర్కొంటోంది. బయోఫార్మా ఇన్నోవేటర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సూన్–షియోంగ్ ప్రస్తుతం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి అవసరమయ్యే కొత్త మందులపై పనిచేస్తున్నారు. విజయావకాశాలు 50–50 ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో ట్రంప్‌ను గెలిపిస్తే తమ వ్యాపార ఒప్పందాలకు ఢోకా ఉండబోదని వ్యాపార దిగ్గజాలు భావించి ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. -
జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్'.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానాల్లో జుకర్‌బర్గ్, బెజోస్ ఉన్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇలాన్ మస్క్ నికర విలువ రూ. 256 బిలియన్ డాలర్స్, జుకర్‌బర్గ్ నికర విలువ 206 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ విలువ 205 బిలియన్ డాలర్లు. మెటా ప్లాట్‌ఫామ్ షేర్లు పెరగడంతో.. మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.నికర విలువ పరంగా జుకర్‌బర్గ్.. బెజోస్ కంటే 1.1 బిలియన్ డాలర్ల ముందు, టెస్లా సీఈఓ కంటే 50 బిలియన్ల వెనుకంజలో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, లారీ ఎల్లిసన్, బిల్ గేట్స్, లారీ పేజీ, స్టీవ్ బాల్మెర్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్ వరుస పది స్థానాల్లో ఉన్నారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో భారతీయులుప్రపంచ ధనవంతుల జాబితాలో భారతీయ ధనవంతులైన ముకేశ్ అంబానీ 14వ స్థానంలో, గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నారు. 37వ స్థానంలో శివ నాడార్, 38వ స్థానంలో షాపూర్ మిస్త్రీ, సావిత్రి జిందాల్ 49వ స్థానంలో, 61వ స్థానంలో దిలీప్ శాంఘ్వీ, 62వ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ, సునీల్ మిట్టల్ 72వ స్థానంలో, 89వ స్థానంలో రాధాకిషన్ దమాని, 90వ స్థానంలో కుమార మంగళం బిర్లా, 97వ స్థానంలో లక్ష్మీ మిట్టల్, 100వ స్థానాల్లో సైరస్ పూనావల్ల ఉన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు (ఫొటోలు)
-
లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..
1994లో జెఫ్ బెజోస్ సీటెల్ గ్యారేజీలో స్థాపించిన ఒక చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్ నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ సంస్థ పేరే 'అమెజాన్'. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిన అమెజాన్.. సమావేశాల్లో ఎప్పుడూ ఓ కుర్చీ ఖాళీగానే ఉంటుంది. ఇంతకీ మీటింగులో ఖాళీ కుర్చీ ఎందుకు ఉంటుంది. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బిలినీయర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ కనిపించే ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తుకు తెస్తుంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ తన మొదటి ప్రాధాన్యతను కస్టమర్లకు ఇస్తున్నట్లు చెప్పడానికే అమెజాన్ కంపెనీ ఆ ఖాళీ కుర్చీని ఉంచుతుంది.ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. అమెజాన్ కంపెనీ నిర్వహించే సమావేశాల్లో కేవలం ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉంటారు. సమావేశంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్దిగ్గజ కంపెనీలలో ఒకటిగా ఎదిగిన అమెజాన్ సంస్థలో నిర్వహించే సమావేశాలలో ఇప్పటికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిషేధమే. సమావేశంలో పాల్గొనేవారు ఖచ్చితంగా తమ ప్రెజెంటేషన్లను పాయింట్ల రూపంలో లేదా మెమోల రూపంలో సమర్పించాల్సిందే. బహుశా ఇలాంటి విధానాన్ని పాటిస్తున్న పెద్ద కంపెనీ అమెజాన్ అనే చెప్పాలి. -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ తనకు వారెన్‌బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ వారెన్‌బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్‌మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
సన్నబడ్డ సంపన్నులు! రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి!!
ప్రపంచంలో సంపన్నుల సంపద కరిగిపోయింది. ఒక్క జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ శుక్రవారం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపద 134 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు) క్షీణించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ షేర్లు మార్కెట్లో విస్తృత అమ్మకాల మధ్య 8.8% పడిపోయాయి. బెజోస్ నెట్‌వర్త్ 191.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో భారీగా సంపద క్షీణించడం జెజోస్కి ఇది మూడోసారి. 2019లో విడాకుల పరిష్కారం తర్వాత 36 బిలియన్ డాలర్లు, 2022లో అమెజాన్ షేర్లు 14% పడిపోయాయి.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4% పడిపోయింది. ఇలాన్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్‌తో సహా ఇతర టెక్ బిలియనీర్ల సంపదలు వరుసగా 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలపై అనిశ్చితి, అలాగే కొన్ని అధిక-ప్రొఫైల్ ఆదాయాల్లో నిరాశలు, టెక్-హెవీ ఇండెక్స్‌ను దిద్దుబాటులోకి నెట్టేశాయి. కేవలం మూడు వారాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల విలువను తుడిచిపెట్టేసింది. -
బిలీయనీర్లకు బ్యాడ్ ఫ్రైడే
స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు. -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
వ్యాపారంలో విజయవంతమైన ప్రతిఒక్కరికీ ఓ టెక్నిక్ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ మరికొంతమంది సక్సెస్ సాధిస్తుంటారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్ఫూర్తితో ప్రముఖ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ కోఫౌండర్ ఘజల్ అలాఘ్ వ్యూహాత్మక సమావేశ టెక్నిక్‌ను పంచుకున్నారు.తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించిన హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కంపెనీలో ఈ టెక్నిక్ నిర్ణయాలను గణనీయంగా ఎలా మెరుగుపరిచిందో ‘ఎక్స్’ పోస్ట్‌లో అలఘ్ వివరించారు. "మీరు నిర్వహించే ప్రతి వ్యూహాత్మక సమావేశంలో మీ కస్టమర్లు కూర్చున్నారని ఊహించుకోండి. మా ప్రతి వ్యూహాత్మక సమావేశాలలో ఒక కుర్చీని ఖాళీగా ఉంచుతాం. మా కస్టమర్లే అక్కడ కూర్చున్నారని భావిస్తాం. నేను జెఫ్ బెజోస్ నుంచి ఈ అద్భుతమైన టెక్నిక్ నేర్చుకున్నాను. ఇది హోనాసాలో నిర్ణయాలు తీసుకునే ప్రమాణాలను మెరుగుపరుస్తోంది" అని ఆమె రాసుకొచ్చారు."మేము ప్రతి ఆలోచనను కస్టమర్ల దృక్కోణం నుంచి పునఃపరిశీలన చేసుకుంటాం" అని అలఘ్ పేర్కొన్నారు. కస్టమర్లకు మేలు జరిగేలా ఉంటేనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ అత్యంత వినియోగదారు-స్పృహ కలిగిన కంపెనీలలో ఒకటిగా మారాలనే తమ లక్ష్యాన్ని అలఘ్ నొక్కి చెప్పారు.2008లో ఎన్ఐఐటీలో కార్పొరేట్ ట్రైనీగా ఘజల్ అలఘ్ వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. 2016లో ఆమె హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ (మామెర్త్) ను స్థాపించారు. ఇది టాక్సిన్ లేని చర్మ సంరక్షణ, హెయిర్ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులతో తక్కువ సమయంలోనే ఖ్యాతిని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ మోడల్ విజయవంతమైంది. -
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
స్పేస్ టూరిజంలో అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్ సంస్థ టెక్సాస్ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్ఎస్-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్ బయలుదేరుతుంది. ఈ ఎన్ఎస్ -25 మెషిన్లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు. -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
అపరకుబేరుడు ఎలోన్ మస్క్‌కి భారీ షాక్
ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్ నెట్‌వర్త్ 198 బిలియన్లుగా ఉంది. అంత వేతనం వదులు కోవాల్సిందే టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5లక్షల కోట్లు) వేతనాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అంత వేతనం అందుకోవడంపై టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఈ అంశంపై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. తాజాగా మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పుతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. పడిపోయిన టెస్లా కార్ల ఎగుమతులు దానికి తోడు చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టెస్లా షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అమెజాన్‌లో అమ్మకాలో జోరందుకోవడం ఆ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్‌కి కలిసి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు దోహదం చేసింది. -
రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్..
అమెజాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ 1.2 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు 2.04 బిలియన్ డాలర్లు(సుమారు రూ.17వేలకోట్లు)గా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. ఈ మేరకు 7, 8 తేదీల్లోనే 1.19 కోట్ల షేర్లను బెజోస్ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు తెలిసింది. ఇంతటితో బెజోస్ షేర్ల అమ్మకాలు అయిపోయినట్లు కాదని సమాచారం. మొత్తంగా 8.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదనగా తెలిసింది. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు గత ఏడాది నవంబర్లోనే వెల్లడించారు. తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో విక్రయించినట్లు బెజోస్ వెల్లడించారు. 169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్‌ను విక్రయించినా.. ఇంకా ఆయన 11.8 శాతం వాటా కలిగి ఉంటారని అంచనా. తన నివాసాన్ని సియాటెల్ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్‌లో బెజోస్ వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్‌లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా. పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్ డాలర్లతో ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్ డాలర్ల ‘బెజోస్ డే వన్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ మాజీ భార్య మకెంజీ స్కాట్ సైతం గతేడాది అమెజాన్‌లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్‌లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల నిర్ణయం ఆ సమయంలో మెకెంజీ స్కాట్‌కి అమెజాన్‌లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు(రూ.2.9లక్షల కోట్లు). దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -
జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం.. అమ్మకానికి అమెజాన్ షేర్లు!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 12 నెలల కాలంలో ఏకంగా 50 మిలియన్ల అమెజాన్. కామ్ షేర్లను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఆయన ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. మహమ్మారి ప్రారంభంతో అమెజాన్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఆ సంస్థ షేర్లు సైతం భారీగా లాభపడ్డాయి. దీంతో దాదాపు 8 శాతం లాభపడి షేర్ ధర 172 డాలర్లకి చేరింది. ఈ క్రమంలో జెఫ్‌బెజోస్ అమెజాన్ షేర్లు అమ్మాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బెజోస్ నిర్ణయం అనంతరం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద శుక్రవారం 12.1 బిలియన్ డాలర్లు లాభపడింది. బిలియనీర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ అధిగమించాలంటే బెజోస్‌కు 8.1 బిలియన్ డాలర్లకు కావాల్సి ఉంది. కాగా, బెజోస్ 2021 నుండి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతూ వస్తున్నారు. కానీ అదెప్పుడ సాధ్యపడలేదు. -
అమ్మకానికి అమెజాన్ పుట్టినిల్లు.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం!
జెఫ్‌బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1994లో జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్లు కలిసి అమెరికాలోని సియోటెల్‌లో ఒకే అంతస్తులో మూడు పడకగదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దాన్ని కార్యాలయంగా మార్చారు. అక్కడే అమెజాన్ సంస్థ పురుడు పోసుకుంది. ఆన్లైన్లో పుస్తకాలు అమ్మేలా ఓ వేదికగా ప్రారంభమై ఇప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఐదవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో ఉన్న జాన్ వైన్‌రైట్ అనే ఆస్ట్రేలియన్ ఐటీ ఉద్యోగికి అమెజాన్ ‘ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్: కంప్యూటర్ మోడల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ మెకానిజమ్స్ ఆఫ్ థాట్’ అనే మొదటి పుస్తకాన్ని అమ్మింది. అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దాని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ను 1.6 ట్రిలియన్లని అంచనా ఇలా ఎన్నో మైలురాళ్లను తనఖాతాలో వేసుకున్న జెఫ్‌బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1,540-చదరపు అడుగుల (143-చదరపు మీటర్ల) ఇంటి ప్రస్తుతం ధర 2.3 మిలియన్లగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేందుకు జెఫ్‌బెజోస్ సిద్ధమవ్వగా.. దాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగులో దారులు ఎగబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్..
గడియారం అంటే 24 గంటలు నడుస్తుందని అందరికి తెలుసు, అయితే 10,000 సంవత్సరాలు నడిచే గడియారం అంటే? అదెలా ఉంటుందో తెలుసుకోవడానికి అందరూ తెగ ఉత్సాహపడిపోతారు. అలాంటి వాచ్ నిర్మించడానికి అమెజాన్ ఫౌండర్ భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పదివేల సంవత్సరాల పాటు పనిచేసే గడియారాన్ని నిర్మించడానికి జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 350 కోట్లు) పెట్టుబడి పెట్టారు. అమెరికాలోని టెక్సాస్ కొండలపై ఏర్పాటు చేయనున్న ఈ గడియారం పొడవు 500 అడుగుల వరకు ఉంటుంది. దీనిని 'లాంగ్ న్యూఫౌండేషన్' అనే సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే 'టిక్' అంటూ సౌండ్ చేస్తుందని చెబుతున్నారు. ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ 'డానీ హిల్స్' (Danny Hillis) ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టుకి 'ది క్లాక్ ఆఫ్ ది లాంగ్ నౌ' అని పేరు పెట్టారు. ఇది దీర్ఘకాల ఆలోచనకు చిహ్నంగా, భవిష్యత్తు పట్ల మన బాధ్యతను గుర్తుచేయడానికి ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. అమెరికాలో ఏర్పాటుకానున్న ఈ 500 అడుగుల అతి పెద్ద వాచ్ థర్మల్ సైకిల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సోలార్ సింక్రొనైజర్, పెండలం, చైమ్ జనరేటర్, గేర్లు, డయల్ వంటివి ఉండనున్నాయి. ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యం త్వరలో నిర్మితం కానున్న ఈ అతి పెద్ద గడియారంలో ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్లు ఉండనున్నట్లు సమాచారం. మొదటి సంవత్సరం మొదటి ఛాంబర్, 10వ ఏడాదికి రెండవ ఛాంబర్, 100వ సంవత్సరం నాటికి మూడవ ఛాంబర్, 1000వ ఏడాదికి నాలుగవ ఛాంబర్, 10000వ ఏడాదికి ఐదవ ఛాంబర్ కేటాయించనున్నట్లు చెబుతున్నారు. -
అక్కడ మాత్రం రాక్షసుడే : జెఫ్ బెజోస్పై ప్రియురాలి వ్యాఖ్యలు
ప్రపంచ రెండో అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్పై అతని కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా శాంచెజ్ బెజోస్ ఫిట్నెస్ గురించి మాట్లాడింది. వోగ్‌తో మాట్లాడిన శాంచెస్ తరచూ తామిద్దరం కలిసే ఈ జంట తరచుగా కలిసి వ్యాయామం చేస్తామని చెప్పింది. అయితే రోజువారి రొటీన్ లైఫ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందని కానీ దాన్ని గోప్యంగా ఉంచడమే తనకిష్టమని వెల్లడించింది. జిమ్‌లో ఇద్దరమూ ఒకే తరహా ఎక్స్‌ర్‌సైజ్ చేయలేం.. కానీ తనతో పోలిస్తే బెజోస్ పూర్తిగా భిన్నం.. ఒక విధంగా చెప్పాలంటే జిమ్‌లో రాక్షసుడే అంటూ కాబోయే భర్త ఫిట్నెస్ కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించింది. ఫిట్నెస్ ఫ్రీక్‌గా జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవోగా తప్పుకున్నప్పటినుంచి బెజోస్ ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిపెట్టాడు. వ్యాయాయంతోపాటు, ఆహారంపై కూడా శ్రద్ధ ఎక్కువే. కొవ్వు, మాంసకృత్తులలో కూడిన బలమైన ఆహారాన్ని తీసుకుంటాడు. ముఖ్యంగా ప్రతీరాత్రి ఎనిమిది గంటల నిద్రే తన సక్సెస్‌కు కారణమని గతంలోనే చెప్పాడు బెజోస్. అంతేకాదు ఫిట్నెస్ కోసం స్టెరాయిడ్స్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్లను ఉపయోగిస్తాడనే వాదనలను కూడా ఖండించాడు జెఫ్ బెజోస్. 59 ఏళ్ల లేటు వయసులో గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌ను త్వరలోనే పెళ్లాడనున్నాడు. -
జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్!
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్' ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) తమ కంపెనీలో ఉద్యోగం మానేయాలనుకునే వారికి 5000 డాలర్లు ఆఫర్ చేస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. ఊహూ... సంస్థకు ఉపయోగడరని భావిస్తున్న ఉద్యోగులను వదిలించుకునేందుకు కాదీ ప్రకటన. ఉద్యోగుల్లో సంస్థపట్ల ఎంతమందికి విధేయత కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు వేసిన ఎత్తుగడ. అదెలాగంటరా... ? చదివేయండి! ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన అమెజాన్ ఈ రోజు ఈ కామర్స్ విభాగంలో తిరుగులేని కంపెనీగా అవతరించింది. యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా మారాడు. అసాధారణ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న బెజోస్ 2014లో మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి, కంపెనీ పట్ల విధేయత కలిగినవారి కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ప్రారంభంలో ఈ ఆఫర్ కింద స్వచ్చందంగా జాబ్ వదిలేసేవారికి 2000 డాలర్లు ఇస్తామని ప్రకటించారు, ఆ తరువాత ఈ మొత్తాన్ని 3000 డాలర్లకు పెంచారు, ఇప్పుడు అది 5000 డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో ఈ ఆఫర్ ప్రకటించిన సందర్భంగా 'Please Don’t Take This Offer' అని కోరడం విశేషం. సంస్థలో అందరూ ఉండాలని, ఈ ఆఫర్ ఎవరూ స్వీకరించరని భావిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. ఇలాంటి ఆఫర్ లాస్ ఏంజెలస్కు చెందిన ఆన్లైన్ రిటైలర్ 'జప్పోస్' మొదట ప్రారంభించింది. ఆ తరువాత బెజోస్ మొదలుపెట్టారు. -
అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ అయ్యారు. జెఫ్‌బెజోస్ 1994లో అమెరికాలోని న్యూయార్క్ నగరం సియాటెల్‌కు చెందిన ఓ గ్యారేజీలో అమెజాన్ సంస్థను ప్రారంభించారు. ‘ఇంతై.. ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా ఆ సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా బెజోస్‌ను నిలబెట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఫ్లోరిడా మయామికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెజాన్.కామ్ ఆఫీస్ మొత్తం చూసేందుకు మీకు ఎక్కువ సమయం పట్టదు అంటూ సియోటెల్ గ్యారేజీలో అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో తీసుకున్న వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) ఆప్పట్లో అమెజాన్‌ను స్థాపించిన సమయంలో తన ఆఫీస్ ఎలా ఉందో చూడండి అంటూ బెజోస్ తన ఆఫీస్‌ను చూపిస్తుండగా.. ఆ వీడియో తీస్తున్న బెజోస్ తండ్రి ఉత్సాహపరుస్తున్నట్లు వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న సంభాణల్ని మనం వినొచ్చు. అయితే బెజోస్ హైస్కూల్ విద్యార్ధిగా ఉన్న సమయంలో నివసించిన మయామి ప్రాంతానికి తన తల్లిదండ్రుల కోసమే సియోటెల్ని వదిలి వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ కార్యకలాపాలు ఎక్కువగా ఫ్లోరిడా కేప్ కెనావెరల్ నుంచి కొనసాగుతున్నాయి. ఆ స్పేస్ పనులు దగ్గరుండి చూసుకునేందుకు వీలు కలుగుతున్నట్లు వెల్లడించారు. బిలియనీర్ బంకర్లోని జెఫ్ బెజోస్ ఇంటి ప్రత్యేకతలు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న జెఫ్‌బెజోస్ ఫ్లోరిడాలోని బిలియనీర్ బంకర్ ద్వీపంలో తన 68 మిలియన్ల విలువైన ఎస్టేట్‌కు పక్కనే ఉన్న భవనాన్ని 79 మిలియన్లు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు తర్వాత సియోటెల్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2000లో నిర్మించిన 19,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖరీదైన ఇల్లు, ఏడు బెడ్రూమ్లు, 14 బాత్రూమ్లు, ఒక కొలను, థియేటర్, లైబ్రరీ, ఒక వైన్ సెల్లార్,మెయిడ్స్ క్వార్టర్స్ మరియు ఆరు గ్యారేజ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో బిలియనీర్ బంకర్ ద్వీపంలో మరో ప్రాంతంలో కొనుగోలు చేసిన 9,259 చదరపు అడుగుల మాన్స్‌లో కేవలం మూడు బెడ్రూమ్లు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. చదవండి👉 చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్! -
‘రహస్య అల్గారిథమ్’ ద్వారా రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్.. ఎలాగంటే..
దిగ్గజ ఆన్లైన్ ఈకార్ట్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి రహస్య అల్గారిథమ్‌లు వినియోగించిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలా రహస్య అల్గారిథమ్‌ల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్..అమెజాన్ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ సెప్టెంబర్‌లోనే కోర్టులో దావా వేసింది. కానీ గురువారం వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా యూస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిటిషన్‌లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. అమెజాన్ ఆన్లైన్ సూపర్స్టోర్ల్లో దాదాపు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయి. వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథమ్(ప్రాజెక్ట్ నెస్సీ)ను సంస్థ ఉపయోగిస్తుంది. దాంతో సదరు వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కస్టమర్లలో ఆందోళన సృష్టించి అమెజాన్ అమెరికాలో ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది. కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను వినియోగదారులు బయటి రిటైలర్లతో పోల్చిచూస్తారు. ఆ వివరాలు నమోదు చేసుకుని తర్వాత అమెజాన్‌లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్‌టీసీ తెలిపింది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్లు, హాలిడే షాపింగ్ సీజన్లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నెస్సీ అల్గారిథమ్‌ను నిలిపివేస్తున్నారని వివరించింది. అమెజాన్ ఏప్రిల్ 2018లో కస్టమర్లు కొనుగోలు చేసిన 80 లక్షలకు పైగా వస్తువుల ధరలను నిర్ణయించడానికి నెస్సీను ఉపయోగించింది. ఈ వస్తువుల ధర ఏకంగా దాదాపు రూ.1600కోట్లు అని ఫిర్యాదులో పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే.. అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ మాట్లాడుతూ..ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్లో తెలిపిన సమాచారం అవాస్తవం అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా ఏళ్ల క్రితం కంపెనీ ఆ అల్గారిథమ్‌ను వాడడం నిలిపివేసిందన్నారు. కేవలం వినియోగదారులు సదరు ప్రోడక్ట్ ధరను వేరే ఏదైనా ప్లాట్ఫామ్లో పోల్చి చూసారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే నెస్సీని 2010లో పరీక్షించినట్లు చెప్పారు. -
ఆ దీవిలో ఏముంది? మరో భవంతి కొన్న అమెజాన్ ఫౌండర్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ‘బిలియనీర్ బంకర్’ దీవిలో మరో భవంతిని కొనుగోలు చేశారు. దాదాపు 156 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడైన బెజోస్ సుమారు 79 మిలియన్ డాలర్లు (రూ.659 కోట్లు) పెట్టి దీన్ని కొన్నారు. కాగా రెండు నెలల ముందే ఇదే దీవిలో ప్రస్తుతం కొన్న మాన్షన్‌కు పక్కనున్న భవంతిని 68 మిలియన్ డాలర్లకు బెజోస్ కొనుగోలు చేశారు. 7 బెడ్రూమ్లు అమెరికన్ రియల్ ఎస్టేట్ సంస్థ జ్లిలో (Zillow)లో ఈ ప్రాపర్టీ లిస్ట్ అయింది. అందులో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ భవంతిలో ఏడు పడక గదులు, 14 బాత్రూమ్లు ఉన్నాయి. ఈ మాన్షన్ విక్రయ ప్రక్రియ అక్టోబర్ 12న పూర్తయనట్లుగా పేర్కొన్నారు. ఈ భవంతి ధర 85 మిలియన్ డాలర్లు కాగా బెజోస్ 7.1 శాతం తగ్గింపుతో దక్కించుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విశాలమైన 19,064 చదరపు అడుగుల నివాసం ఇండియన్ క్రీక్ ఐలాండ్ అని పిలిచే మానవ నిర్మిత ద్వీపంలో 1.84 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపం బిస్కేన్ బే శివార్లలో ఒక కోటగా నిలుస్తోంది. దీనికి సొంత మునిసిపాలిటీ, మేయర్, పోలీసు బలగాలు ఉన్నాయి. జిల్లో లిస్టింగ్ ప్రకారం.. ఈ భవంతిలో కొలను, థియేటర్, లైబ్రరీ, వైన్ సెల్లార్, మెయిడ్స్ క్వార్టర్స్, ఆవిరి స్నానాలు, ఆరు గ్యారేజ్ స్పేస్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్లాన్ అదేనా? 12 ఇండియన్ క్రీక్ ఐలాండ్ రోడ్ వద్ద నిర్పించిన ఈ విశాలమైన ఎస్టేట్.. గత ఆగస్ట్‌లో బెజోస్ కొనుగోలు చేసిన 68 మిలియన్ డాలర్ల ప్రాపర్టీకి పక్కనే ఉంది. ఈ ట్రిపుల్ బెడ్రూమ్ మాన్షన్‌ను తన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ కోసం కొన్నారు. బెజోస్ ఈ భవంతిని కూల్చివేసి మెగామాన్షన్ను నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా కొన్న భవంతిని కూడా ఇలాగే చేస్తారా అన్నది తెలియరాలేదు. జనాభా 81 ఇండియన్ క్రీక్ ఐలాండ్ దాదాపు 40 వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీలకు నిలయం. ఈ ఐలాండ్‌లో 294 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్సు ఉంది. విలాసవంతమైన ఓడల కోసం బ్రెజిలియన్ టేకు రేవులు ఇక్కడ ఉన్నాయి. బెజోస్ వద్ద ఉన్న 500 మిలియన్ డాలర్ల విలువైన సూపర్‌యాచ్ ‘కోరు’కు ఇది అనువైనది. అంతేకాకుండా ఇందులో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం, ఈ ద్వీపం జనాభా కేవలం 81. ఇందులో సొంత భవంతులు ఉన్న ప్రముఖులలో టామ్ బ్రాడీ, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, ఫిలడెల్ఫియా ఈగల్స్ మాజీ యజమాని నార్మన్ బ్రమన్ ఉన్నారు. -
బెజోస్ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్
ప్రముఖ వ్యాక్సిన్ మేకర్ సీరంసీఈవో అదార్ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు. ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో నటాషా తనదైన ఫ్యాషన్ స్టయిల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్హాటన్లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్ గెస్ట్‌లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్ లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) View this post on Instagram A post shared by Salma Hayek Pinault (@salmahayek) View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఇతడు వేలకోట్ల ఆస్తిని పక్కన పెట్టి నెలకు సుమారు రూ. 5 కోట్లు రెంట్ చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. దాదాపు రూ. 12 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియాలోని మాలిబు మాన్షన్‌లో ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీ (Kenny G)కి చెందిన ఈ భవనం 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. దీనికి నెలకు 600000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు) అద్దె చెల్లిస్తున్నారు. ఇదీ చదవండి: లాంచ్‌కి ముందే 'సైబర్‌ట్రక్' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్ సముద్ర తీరంలో ఉన్న ఈ భవనంలో గత మార్చి నుంచి వీరిరువురు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెజోస్ ప్రస్తుతం ఒక విశాలమైన భవనం నిర్మించుకుంటున్నట్లు సమాచారం. అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు అద్దె భవనంలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి జెఫ్ బెజోస్ 2018లో తన మాజీ భార్య 'మెకంజీ స్కాట్'కి విడాకులిచ్చి, పెద్ద మొత్తంలో భరణం కూడా చెల్లించాడు. ఆ తరువాత లారెన్ శాంచెజ్‌తో డేటింగ్ చేస్తున్నారు. కాగా వీరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తరువాత కొత్తగా నిర్మించుకున్న భవనంలోకి మారనున్నట్లు సమాచారం. -
చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు
చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్ సక్సెస్ కావడంపై అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రక క్షణాల తరువాత చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ అద్భుతమైన క్షణాల కోసం యావత్ ప్రపంచంగా ఉత్కంఠగా ఎదురు చూసింది. భారత్ ప్రయత్నాన్ని, కృషిని కొనియాడింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. నీటిని కనుగొనే అవకాశం ఉన్నందున దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా జెఫ్ బెజోస్, ట్విటర్ అధినేత ఎలాన్‌మస్క్ తోపాటు, నటుడు, ఆర్ మాధవన్ సహా ప్రముఖులు చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ ముందే సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. "రూట్ ఫర్ ఇండియా! గుడ్ లక్, చంద్రయాన్-3," బెజోస్ ఇస్రోపోస్ట్ను రీషేర్ చేస్తూ థ్రెడ్స్ యాప్‌లో పేర్కొన్నారు. అలాగే ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ బయోపిక్ 'రాకెట్రీ: దినంబి ఎఫెక్ట్' లో కీలక పాత్ర పోషించిన మాధవన్ "చంద్రయాన్-3 సంపూర్ణ విజయం సాధిస్తుంది.. మార్క్ మై వర్డ్స్ అంటూ ట్విటర్ ద్వారా ముందుగానే అభినందలు తెలిపారు. Chandrayaan-3 WILL BE ABSOLUTE SUCCESS —- MARK MY WORDS . Congratulations @isro .. IN ADVANCE .. on this spectacular success .. I AM SO SO HAPPY AND PROUD … congratulations to @NambiNOfficial too .. Vikas engine delivers yet once again during the launch.… — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, "చంద్రయాన్ ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది" అని పేర్కొన్నారు. టెస్లా , స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్-3 మూన్ మిషన్‌పై స్పందించారు. 'ఇంటర్స్టెల్లార్' సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్-3 ఖర్చు తక్కువగా ఉందని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌పై మస్క్ స్పందిస్తూ, మిషన్ "భారతదేశానికి మంచిది" అని వ్యాఖ్యానించారు. #WATCH | On Chandrayaan 3 landing, actor Kareena Kapoor Khan says, "It's a great moment for India and a proud moment for every Indian. All of us are waiting to watch it. I'm going to do that with my boys." pic.twitter.com/MLJKJjoPsS — ANI (@ANI) August 21, 2023 ఇంకా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తదితరులు ఈ మిషన్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.కాగా ఇస్రో వెబ్‌సైట్‌తోపాటు, పలు చానెళ్లు ఈ ల్యాండింగ్ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ అద్భుత విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?
అమెజాన్ కో ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.ఇప్పటికే భారీ ఆస్తులను సొంతం చేసుకున్న బెజోస్ ప్రపంచంలోనే మూడో కుబేరుడు ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో దాదాపు రూ.560 కోట్ల (68 మిలియన్ల డాలర్లు) ఎస్టేట్‌ను కొనుగోలుకు అంగీకరించినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. రికార్డుల ప్రకారం దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది. లారెన్ శాంచెజ్‌తో చెట్టాపట్టాల్, రూ.560 కోట్ల ఇల్లు ఇటీవల గర్ల్‌ఫ్రెండ్‌తో లారెన్ శాంచెజ్‌తో సందడి చేసిన జెఫ్ బెజోస్ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్‌ను జోడించడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. 1965లో నిర్మించిన 2.8-acre (1.1హెక్టార్లు) మూడు పడకగదులప్రాపర్టీ MTM స్టార్ ఇంటర్నేషనల్ పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై దృష్టి పెట్టారని, ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్ ఇండియన్ క్రీక్‌ను "బిలియనీర్ బంకర్" అని పిలుస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి సమాచారం ద్వారా తెలుస్తోందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. బెజోస్‌తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు బెజోస్ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే దిమ్మదిరిగే ప్రాపర్టీలు బెజోస్‌కు ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్ , ఇంకా మౌయ్లోని ఒక ఎస్టేట్‌తో సహా పలు లగ్జరీ భవనాలు ఆయన సొంతం. అలాగే మాన్హాటన్ ,సీటెల్‌లో ఖరీదైన ఆస్తులు, టెక్సాస్‌లో 300,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడే బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్‌కు ప్రయోగ కేంద్రం కొలువై ఉంది. లగ్జరీ ప్రాపర్టీలపై మోజు 2021లో అమెజాన్ సీఈవోగా వైదొలగిన బెజెస్కు భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకుల తరువాత సూపర్ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడంపై మోజు పెరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్‌యాచ్ కోరును కొనుగోలు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 163 బిలియన్ల డాలర్ల సంపదతో, ఈ ఐలాండ్ ఎస్టేట్‌లో అత్యంత సంపన్న నివాసి అవుతాడు. ఈ ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ . సొంత పోలీసు విభాగం గా ఉన్నాయి. -
ప్రియురాలితో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ - (ఫోటోలు)
-
ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్
న్యూఢిల్లీ: బిలియనీర్, 59 ఏళ్ల అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎప్పటినుంచో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని పేజ్ సిక్స్ నివేదించింది. ఈ వార్తలను వారు ధృవీకరించినట్లు కూడా పేర్కొంది. 500 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ యాచ్ ‘కోరు’లో ఆమెకు ప్రపోజ్ చేశాడు బెజోస్. ఖరీదైన డైమండ్ ఉంగరంతో ఉన్న లారెన్ ఫోటోలు వైరల్‌గా మారాయి . 20 క్యారెట్ల హార్ట్ షేప్‌లో ఉన్న ఈ డైమండ్ రింగ్ విలువ సుమారు 2.5 మిలియన్ డాలర్లని అంచనా. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) ఈ లవ్‌బర్డ్స్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. స్టార్-స్టడెడ్ పార్టీకి ఖరీదైన బోటులో కేన్స్‌కు చేరుకున్నారు. భార్యతో విడాకుల తర్వాత,గత కొంత కాలంగా తన గర్ల్ఫ్రెండ్నుపెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం సాగుతున్నసంగతి తెలిసిందే. మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ సాంచెజ్, బెజోస్ 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. కాగా 25ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య మెకెంజీ స్కాట్‌తో 2019లో బెజోస్ విడాకులు తీసుకున్నాడు. బెజో, మెకెంజీ నలుగురు పిల్లలున్నారు. అటు శాంచెజ్ కూడా తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకుంది. శాంచెజ్, వైట్ సెల్ జంటకు ఎల్లా , ఇవాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కేన్స్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో బెజోస్ గ్రాండ్ ఎంట్రీ.. వారు వచ్చిన బోట్ ఖరీదు తెలుసా?
బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కేన్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తో కలిసి బెజోస్ 500 మిలియన్ డాలర్ల (రూ.4 వేల కోట్లకుపైనే) విలువైన సూపర్‌యాచ్ (బోట్)లో ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న కేన్స్‌కు చేరుకున్నారని పేజ్ సిక్స్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ నివేదించింది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గ్లోబల్ సెలబ్రిటీలు ఈ రిసార్ట్ టౌన్‌కి చేరుకుంటున్నారు. కోరు అనే పేరుతో ఉన్న ఈ లగ్జరీ బోట్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సెయిలింగ్ యాచ్‌గా చెబుతారు. దీని తయారీని 2018లో ప్రారంభించగా ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే పూర్తి చేశారు. గత ఏప్రిల్‌లోనే ఇది తన తొలి సముద్రయానం చేసింది. సూపర్‌యాచ్ ముందు భాగంలో లారెన్ శాంచెజ్‌ను పోలి ఉండే మత్స్యకన్య బొమ్మ ఉన్నట్లు ఆ మ్యాగజైన్ పేర్కొంది. ఈ సూపర్‌యాచ్ నిర్వహణ కోసం జెఫ్ బెజోస్‌కు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని తెలిసింది. బెజోస్ కోరుతో పాటు తన మరో బోట్ అబియోనాను కూడా కేన్స్‌కు తీసుకువచ్చారు. కేన్స్‌లోని డు క్యాప్ ఈడెన్ రోక్ హోటల్లో జరిగిన మ్యాగజైన్ పార్టీలో అలాగే హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఇచ్చిన ప్రైవేట్ మాన్షన్ పార్టీలో బెజోస్ ఆయన గర్ల్‌ఫ్రెండ్ శాంచెజ్ కనిపించారు. ఇదీ చదవండి: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా.. రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్త! -
చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్!
యాబై ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు మనుషులను పంపించే అర్టెమిస్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భారీ నాసా కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో బెజోస్ ఏరో స్పెస్ కంపెనీ బ్లూ ఆరిజన్ని స్థాపించిన విషయం తెలిసింది. తాజాగా నాసా ‘ఆర్టెమిస్ వి’ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్లూ ఆరిజన్ సంస్థ ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదికి (మూన్ సర్ఫేస్) పంపే స్పేస్‌క్రాఫ్ట్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదే విషయాన్ని నాసా చీఫ్ అధికారికంగా ప్రకటించారు. నాసా నిర్ణయంతో రెండో ప్రాజెక్ట్‌పై బ్లూ ఆరిజన్ పనిచేయనుంది. ఇప్పటికే అర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్‌లోకి అడుగు పెట్టేలా స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్‌లను తయారు చేసింది. 2021లో అదే స్టార్‌షిప్ స్పేస్ క్రాప్ట్ సాయంతో లూనార్ సర్ఫేస్‌లోకి ఆస్ట్రోనాట్స్ విజయ వంతంగా కాలు మోపారు. దాదాపూ పదేళ్ల తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్ విజయవంతంమైంది. దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 24,850 కోట్లు. బ్లూ ఆరిజన్ ప్రాజెక్ట్ విలువ రూ.28,150 కోట్లు ఇక తాజాగా జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజన్ నాసా నుంచి దక్కించుకున్న కాంట్రాక్ట్ విలువ అక్షరాల 3.4 బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.28,150 కోట్లని నాసా ఎక్స్‌ప్లోరేషన్ చీఫ్ జిఫ్ ఫ్రీ తెలిపారు. సంతోషంగా ఉంది. నాసా ప్రాజెక్ట్ దక్కించుకోవడంపై బెజోస్ ట్వీట్ చేశారు. ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు అడుగు పెట్టే నాసా ప్రయత్నాల్లో తాను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. Honored to be on this journey with @NASA to land astronauts on the Moon — this time to stay. Together, we’ll be solving the boil-off problem and making LOX-LH2 a storable propellant combination, pushing forward the state of the art for all deep space missions. #Artemis… pic.twitter.com/Y0zDhnp1qX — Jeff Bezos (@JeffBezos) May 19, 2023 2029లో ప్రారంభం కానున్న ప్రయోగం నాసా కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్న బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజన్ 50 అడుగుల పొడవైన ‘బ్లూమూన్’ అనే స్పేస్ క్ట్రాఫ్ట్ను తయారు చేయనుంది. తయారీ అనంతరం ఈ స్పేస్ క్రాప్ట్‌లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించి మూన్ సర్ఫేస్‌లో అడుగు పెట్టనున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! -
ప్రపంచంలో అత్యంత సంపన్నుడు.. మరీ ఇంత చవక షర్ట్ ఏంటి?
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు జెఫ్ బెజోస్. ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టవల్కు ఆయన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తోపాటు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన ధరించిన షర్ట్ చర్చనీయాశంగా మారింది. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఏప్రిల్ 21 రాత్రి జరిగిన రాపర్ బాడ్ బన్నీ సంగీత కార్యక్రమానికి బెజోస్ హాజరైనట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇందులో బెజోస్ బ్లూ కలర్ బటర్‌ఫ్లై ప్రింట్ ఉన్న షర్ట్‌ను ధరించారు. ఈ వీడియోలో బెజోస్ ధరించిన దుస్తుల వివరాలను నెటిజన్లు తవ్వితీశారు. అమెజాన్‌లో బెజోస్ ధరించిన షర్ట్ ధర 12 డాలర్లు (సుమారు రూ.980) కంటే తక్కువని తెలుసుకుని షాక్ అయ్యారు. అత్యంత సంపన్నుడు మరీ ఇంత చవకైన చొక్కా ధరించాడేంటని ఆశ్చర్యపోతున్నారు. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు బెజోస్ ధరించిన షర్ట్ ధర తక్కువే అని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం బెజోస్ ధరించింది డిజైనర్ షర్ట్ అని, అమెజాన్‌లో ఉన్న తక్కువ ధరకు ఉన్న ఆ షర్ట్లు ఖరీదైన డిజైనర్ బ్రాండ్‌కు డూప్లికేట్ అని పేర్కొంటున్నారు. Kendall Jenner, Kris Jenner and Jeff Bezos during the second weekend of the Coachella Valley Music & Arts Festival. pic.twitter.com/OaX7ZjgkJz — @21metgala (@21metgala) April 22, 2023 Absolutely love that Bezos went to Coachella and did the same thing I would do - wore a $15 Hawaiian shirt from Amazon.https://t.co/CcQIDK2uGV pic.twitter.com/x8zGzWs5S9 — Sheel Mohnot (@pitdesi) April 24, 2023 -
భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు భారీ షాక్!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ 18వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్న ప్రకటించారు. ఆ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్ వ్యాల్యూ ఒక్క శాతం కోల్పోయింది. దీంతో బెజోస్ ఒక్క రోజే 670 మిలియన్ డాలర్లు నష్టపోయారు. రెండ్రోజుల క్రితం ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా అమెజాన్ ర్యాపిడ్‌గా ఉద్యోగుల్ని నియమించుకుంది. కానీ గత కొద్ది కాలంగా ఆర్దిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. కాబట్టే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. బెజోస్ కొంపముంచిన ప్రకటన ఆ ప్రకటనే బెజోస్ కొంప ముంచింది. ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటనతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్లను అమ్ముకోవడంతో ఒక్కరోజే 600మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన అధినేత బుధవారం ఒక్కరోజే 675 మిలియన్లు కోల్పోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 108 బిలియన్ డాలర్లు ఉండగా.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. కాలం కలిసి రావట్లేదా? గత కొద్ది కాలంగా బిలియనీర్ల జాబితాలో బెజోస్ తన స్థానాన్ని కోల్పోతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టారు. బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బెజోస్‌ను అధిగమించి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో గతేడాది దిగ్గజ కంపెనీలకు ఏమాత్రం కలిసి రాలేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2022లో అమెజాన్ మార్కెట్ విలువ సుమారు 834.06 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ఆ తర్వాత అమెజాన్ కంటే ఎక్కువగా టెక్ దిగ్గజం యాపిల్ 846,34 బిలియన్ డాలర్లు కరిగాయి. -
లైవ్‌లో తొలగింపు..ఉద్యోగుల ఫ్రస్టేషన్‌తో జడుసుకున్న దిగ్గజ సంస్థ సీఈవో!
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ సీఈవో మీటింగ్ పెట్టి ఫైర్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.అంతేకాదు తమని ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించిన ఉద్యోగుల ఫ్రస్టేషన్ దెబ్బకు జడుసుకొని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం లైవ్ ‘లే ఆఫ్స్’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈకామర్స్ రంగంతో పాటు ఇతర రంగాల్లో వ్యాపార కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో మీడియా విభాగానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లోపనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ ర్యాన్ ఆఫీస్ మీటింగ్‌లో తెలిపారు. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులతో సీఈవో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో 2,500మంది పనిచేస్తున్న సంస్థలో సింగిల్ డిజిట్ పర్సంటేజ్ సిబ్బందిని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించారు. తొలగించిన వారి స్థానాల్ని భర్తీ చేసేలా మరికొంత మందిని నియమించుకుంటామని, ఉద్యోగుల సంఖ్య తగ్గదని ర్యాన్ పేర్కొన్నారు. అంతేకాదు ఉద్యోగాల కోత మా ఆశయాలకు వ్యతిరేకం కాదు. కానీ మా కస్టమర్ల అవసరాలను తీర్చని కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రకటనలపై ఆధారపడే కంపెనీలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడమే ఉద్యోగుల తొలగింపులకు కారణమని కంపెనీ పేర్కొంది. ర్యాన్ తొలగింపుల ప్రకటనపై కంపెనీ ఉద్యోగులు మూకుమ్ముడిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కానీ ఉద్యోగుల తీరుతో జడుసుకున్న సీఈవో రిప్లయి ఇవ్వకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. Today, we came into WaPo’s so-called town hall with questions about recent layoffs and the future of the company. Our publisher dropped a bombshell on us by announcing more layoffs and then walking out, refusing to answer any of our questions. pic.twitter.com/ajNZsZKOBr — Washington Post Guild (@PostGuild) December 14, 2022 సమావేశంలో ఉద్యోగుల ప్రశ్నలకు రిప్లయి ఇచ్చేందుకు సీఈవో ర్యాన్ ఎందుకు నిరాకరించారో వాషింగ్టన్ పోస్ట్ గిల్డ్ (సంఘం) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవర్తన ఏ నాయకుడికి ఆమోదయోగ్యం కాదు. కానీ పారదర్శకత, జవాబుదారీతనం వంటి ప్రధాన విలువలు కలిగిన వార్తా సంస్థ నాయకుడు ర్యాన్ అని గిల్డ్ పేర్కొంది. కొద్ది వారాల క్రితం వాషింగ్టన్ పోస్ట్ వీక్లీ మ్యాగజైన్‌ను క్లోజ్ చేసింది.11 మంది న్యూస్‌రూమ్ ఉద్యోగులపై కోత విధించింది. ఆ ప్రకటన చేసిన కొద్ది వారాల తర్వాత..తాజాగా ఆర్థిక ప్రతికూలతల్ని కారణంగా చూపిస్తూ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. పత్రిక వీక్లీ చివరి మ్యాగజైన్‌ను డిసెంబర్ 25న ప్రచురించబడుతుందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. -
‘టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రమాదం ముందుంది’.. జెఫ్ బెజోస్ షాకింగ్ వ్యాఖ్యలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని, మాంద్యం ముప్పు ముంచుకొస్తోందని ప్రజలు అందుకు తగ్గట్టు సన్నద్ధంగా ఉండాలని ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు ప్రజలకు దూరంగా ఉండాలన్నారు. ఇకపై డబ్బులు దాచుకోవాలన్న బెజోస్, టీవీ ,ఫ్రీజ్, కారు కొనాలనే ఆలోచన ఉంటే వాటిని దూరంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు నగదుని మీ వద్దే ఉంచుకునేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా కనిపించడం లేదు. దీని ప్రభావమే అనేక రంగాలలో ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు చెప్పారు. ఈ క్రమంలోనే చిరు వ్యాపారులు తమ వద్ద నగదు నిల్వ ఉంచుకొని.. కొత్త వస్తువుల కొనుగోలు నిలిపి వేయాలని సూచించారు.కాగా, బెజోస్ తన సంపదలో సింహ భాగం సమాజ సేవకు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ విలువ $123.9 బిలియన్ డాలర్లు ఉన్నాయి. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కింద రూ.50వేల వరకు రుణాలు! -
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం!
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయంవైపుగా కదులుతోంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని కంపెనీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 10వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టర్ వర్కర్లను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ముగిసిన అసైన్మెంట్ నోటిఫికేషన్లను ఆయా ఉద్యోగులు అందుకుంటున్నారు. దీంతో ఇ-కామర్స్ దిగ్గజం అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా హెడ్‌కౌంట్‌ను ఎక్కడ తగ్గించే క్రమంలో ఆయా టీంలు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థికమాంద్యం, పడిపోతున్న ఆదాయాల నేపథ్యంలో అమెజాన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సా డిజిటల్ అసిస్టెంట్లకు బాధ్యత వహించే టీం, అలాగే అమెజాన్ రిటైల్ విభాగాలు, హెచ్ఆర్ విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయి. (ఉద్యోగులకు అలర్ట్: ఆ బాటలో ఇన్ఫోసిస్, సూపర్ ఆఫర్ కూడా) డిసెంబర్ 31, 2021 లెక్కల ప్రకారం అమెజాన్‌లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ మొత్తం దాదాపు 16,08,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్టోబర్‌లో, హాలిడే సీజన్ డిమాండ్ కనుగుణంగా రెగ్యులర్ వార్షిక హైరింగ్ స్ప్రీలో భాగంగా దాదాపు లక్షా యాభై వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది. కానీ ఒక నెలలోనే పరిస్థితి తారుమారైంది. నియామకాలను నిలిపివేసిన కంపెనీ ఇపుడిక ఉద్యోగులను తగ్గించుకుంటోంది. కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తున్నాని టెక్ నిపుణులు చెబుతున్నారు. ట్విటర్, మెటా పెద్ద ఎత్తున తొలగింపులను ప్రకటించగా, సోషల్‌మీడియా దిగ్గజం మెటా ఏకంగా 11వేల మందికి ఉద్వాసన పలికింది. ఇదీ చదవండి: ఎయిరిండియాకు భారీ షాక్, 122 మిలియన్ డాలర్ల జరిమానా -
ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత
న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అలాగే సమాజ సేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శలు వచ్చాయి. -
దారుణ పరిస్థితుల్లో పనిచేశాం: జెఫ్ బెజోస్పై కోర్టుకెక్కిన మాజీ మహిళా ఉద్యోగి
న్యూఢిల్లీ: అమెజాన్ సీఈవో, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. జాతి వివక్ష, ఎక్కువ పనిగంటలు ఆరోపణలతో ఆయన మాజీ విమెన్ హౌస్ కీపర్ కోర్టుకెక్కడం కలకలం టెక్ వర్గాల్లో కలకలం రేపింది. సరైన తిండి, నిద్ర, కనీసం వాష్‌రూం కూడా లేకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ సీటెల్ స్టేట్ కోర్టులో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. 2019 సెప్టెంబరులో అమెజాన్ బాస్ బెజోస్ వ్యవస్థాపక సిబ్బందిలో చేరిన మెర్సిడీస్ వేదా ఈ దావా వేశారు. ఇదు నుండి ఆరుగురు హౌస్కీపర్ల బృందానికి తాను సూపర్వైజర్గా ఉన్నట్టు తెలిపారు. ఈ సమయంలో తమపై జాతి వివక్ష చూపించారనీ, కనీస విశ్రాంతి, భోజన విరామాలు లేకుండా కొన్నిసార్లు రోజుకు 10 నుండి 14 గంటలు పనిచేయించుకున్నట్టు ఆరోపించారు. నిర్ణీత విరామ గది లేదా విశ్రాంతి స్థలం లేకుండా, సరైన రెస్ట్రూమ్ లేకుండా దయనీయ పరిస్థితుల్లో పనిచేశామన్నారు. కనీసం సెక్యూరిటీ రూంకు దగ్గరలోని టాయిలెట్‌ని వాడుకోనీకుండా ఆంక్షలు విధించే వారనీ, బాత్రూంలోకి ప్రవేశించడానికి కిటికీ నుండి వెళ్లమని చెప్పేవారని, ఒకదశలో హౌస్‌కీపింగ్ సిబ్బంది లాండ్రీ గదిలో తినేవారనీ వేదా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో తనను అన్యాయంగా తొలగించారని ఆమె వాపోయారు. చట్ట ప్రకారం తమకు పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు "శ్రామిక, ఉపాధి చట్టాలకనుగుణంగా శ్రామికులకు వేతనాలు చెల్లించడమే కాకుండా, వారికి సురక్షితమైన, సానిటరీ, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని’’ వేదాకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది పాట్రిక్ మెక్గైగన్ వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు సరైననవి కావంటూ బెజోస్ లాయర్లు తిరస్కరించారు. ఈ మేరకు న్యాయవాది హ్యారీ కొరెల్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. బెజోస్ గృహ నిర్వాహకులతో ఒకరు వేదాతో దురుసుగా ప్రవర్తించడంతో దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు చెప్పారు. -
‘అదిరిందయ్యా అదానీ’..ప్రపంచ కుబేరుల జాబితాలో దూసుకెళ్తున్న గౌతమ్ అదానీ
ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను అధిగమించారు. మూడు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత రెండు వారాలుగా అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్‌లో నమోదైన కంపెనీల షేర్ల కంటే..అదానీ కంపెనీల షేర్లు లాభాల పంట పండించాయి. వెరసీ సోమవారం నాటికి అదానీ సంపదలోకి మరో 314 మిలియన్ డాలర్లు వచ్చి చేరగా..ఆయన మొత్తం సంపద 131.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రముఖ ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 156.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాతి స్థానంలో అదానీ నిలిచారు. అదానీకి కలిసొచ్చింది ఆర్ధిక పరమైన అంశాల్లో ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేయడం, చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మూడో వారంలో దేశీయ స్టాక్ సూచిలకు పై అంశాలు కలిసొచ్చాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో షేర్లు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో అదానీ షేర్లు పుంజుకోవడం, ప్రపంచంలో ధనవంతుల జాబితాలో జెఫ్బెజోస్ను వెనక్కి నెట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. బెజోస్ షాక్.. అదానీ రాక్ గత గురువారం అమెజాన్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డులు నమోదయ్యాయి. సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోయాయి. దీంతో ఆ ఒక్కరోజే మార్కెట్ ముగిసే సమయానికి అమెజాన్ షేర్లు 21 శాతానికి క్షీణించడంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో జెఫ్ బెజోస్ తన ఉనికిని కోల్పోతుండగా అదానీ ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళుతున్నారు. స్టాక్ మార్కెట్లో గందర గోళం 126.9 బిలియన్ డాలర్ల సంపదతో ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్‌ను అదానీ అధిగమించినప్పటికీ..ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న గందర గోళంతో ఫోర్బ్స్ జాబితాలోని ర్యాంకింగ్‌లు మారుతున్నాయి. బిలియనీర్ల మ్యూజికల్ చైర్ గేమ్ స్టాక్ మార్కెట్ల పనితీరుతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ సంపదలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ఆధారంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ మారుతోంది. అయినప్పటికీ ఈ ముగ్గురు బిలయనీర్ల మధ్య వ్యత్యాసం సుమారు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవలి వారాల్లో గౌతమ్ అదానీ, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ మధ్య మ్యూజికల్ చైర్ గేమ్ నడుస్తోంది. 2,3,4 ఇలా ధనవంతుల జాబితాల్లో వారి స్థానం కోసం పోటీపడుతున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం 223.8 నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రథమ స్థానంలో దూసుకెళ్తున్నారు. -
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ తగిలింది. బెజోస్ 23 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. కొనసాగుతున్న సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోయాయి. ఆ ప్రభావంతో మదుపర్లు అప్రమత్తం కావడంతో ట్రేడింగ్‌లో షేర్లు క్షీణించడంతో బెజోస్ సంపద కరిగిపోయింది. బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం...బెజోస్ ఇంత భారీ మొత్తంలో కోల్పోవడంతో..చరిత్రలో క్షీణించిన సంపద జాబితాలో నిలించింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత స్టాక్ దాదాపు 21 శాతం పడిపోయింది. పెట్టుబడి దారులు టెక్నాలజీ స్టాక్‌లలో భారీగా పెట్టుబుడుల పెట్టడంతో ఆ ప్రభావం అమెజాన్‌పై పడింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి అతని సంపద ఈ సంవత్సరం $58 బిలియన్లకు పైగా పడిపోయింది. చదవండి👉 700మందికి చుక్కలు చూపిస్తున్న జోబైడెన్ ..వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కూడా! మెటా అదినేత మార్క్ జూకర్బర్గ్, ఎలాన్ మస్క్, చాంగ్‌పెంగ్ జావో మాత్రమే ఇంతకుముందు భారీ ఎత్తున నష్టపోయారు. ఇలాగే బెజోస్ తన సంపదను కోల్పోతుంటే పైన పేర్కొన్న జాబితాలో ఒకరిగా నిలవనున్నారు. కాగా, అమెజాన్.కామ్ స్టాక్ 2022లో దాదాపు 33 శాతం పడిపోయాయి. అలాగే, ఆగస్ట్ ఫైలింగ్ ప్రకారం..బెజోస్ అమెజాన్‌లో దాదాపు 996 మిలియన్ షేర్లను కలిగి ఉన్నారు. చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’! -
గౌతమ్ అదానీ దూకుడు.. ఏకంగా బెజోస్‌కే ఎసరు
సాక్షి,ముంబై: భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరో పెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఇటీవలి ర్యాలీతో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ 155.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే అదానీ సంపద 5.5 బిలియన్లు లేదా దాదాపు 4శాతం పెరిగింది. (బెజోస్ మస్క్ సరే! అదానీ,అంబానీ సంపద మాట ఏంటి?) అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని సాధించారు. ఫోర్బ్స్ రియల్ టైం డేటా ప్రకారం 273.5 బిలియన్ డాలర్లతో నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న టెస్లా సీఈవోన్ ఎలాన్ మాస్క్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: బెజోస్ నుంచి మస్క్ దాకా,ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్ కాగా 2022ఏడాదిలో ఇప్పటివరకు అదానీ సంపద 70 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఈ సంవత్సరం తన నికర విలువ పెరిగిన ప్రపంచంలోని టాప్-10 సంపన్న వ్యక్తులలో ఒకరు మాత్రమే. ఈ ఏడది ఫిబ్రవరిలో ఆసియా ధనికుడిగా ముఖేశ్ అంబానీని అధిగమించారు. ఏప్రిల్‌లో సెంటి బిలియనీర్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ బిల్ గేట్స్‌ను గత నెలలో ప్రపంచంలోని నాలుగో సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత ఆసియాలోనే గ్లోబల్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాజాగా తన రికార్డును తానే అధిగమించి రెండో స్థానాన్ని సాధించిన తొలి ఆసియా కుబేరుడిగా నిలిచారు గౌతమ్ అదానీ. అంతేకాదు ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఫస్ట్ ప్లేస్చేరుకోవడం కూడా పెద్దకష్టమేమీ కాదని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. -
బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?
సాక్షి,ముంబై: అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి బిలియనీర్లు బిలియన్ డాలర్ల సంపదను కోల్పోతున్నారు. టాప్ 10లో ఉన్న అక్కడి బిలియనీర్ల సంపదకు ఈ ఏడాది గడ్డుకాలంగా నిలుస్తోంది.ఒక్క జులై మినహా ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ఫలితంగా ఈ ఏడాది తొలి అర్దభాగంలో ప్రపంచ కుబేరులు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. ఫెడ్ వడ్డీరేటు తప్పదనే భయాలు ఇన్వెస్టర్లనువెంటాడుతున్నాయి. ఫలితంగా S&P 500 జూన్ 2020 నుండి అత్యధికంగా 4.4 శాతం, టెక్-హెవీ నాస్డాక్ 100 ఇండెక్స్ 5.5శాతం కుప్పకూలింది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ఎనిమిది నిమిషాల ప్రసంగం తర్వాత బిలియనీర్ల సంపద ఒక రోజులో 78 బిలియన్ డాలర్ల కోల్పోయింది. అదే భయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే దేశీయ వ్యాపార దిగ్గజాలు, ఆసియా కుబేరులు సంపద మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. (బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్) గ్లోబల్ బిలియనీర్ల జాబితా టాప్-10 లో ఒక్క రోజులొ సంపదను కోల్పోని బిలియనీర్లు ఇద్దరు మాత్రమే. వారే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ,గౌతమ్ అదానీ.బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం దేశవ్యాప్తంగా దీపావళి నాటికి తన స్వతంత్ర 5జీ సేవలను ప్రారంభించబోతున్న అంబానీ 9,775 కోట్లు సంపాదించారు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 12,556 కోట్లు (1.58 బిలియన్ డాలర్లు ) సంపాదించడం విశేషం. ముఖ్యంగా టాప్‌లో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇద్దరూ గత 24 గంటల్లో లక్షా 50 వేల కోట్ల మేర సంపదను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
గౌతమ్ అదానీ మరో ఘనత: బిజినెస్ మాగ్నెట్లకు షాకిచ్చి మరీ
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారదిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి మరీ ప్రపంచ కుబేరుల సరసన చోటు సంపాదించడం విశేషం. అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని సాధించిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డును తన ఖతాలో వేసుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా, సంపన్నుల జాబితాలో నిలిచినప్పటికీ ఎప్పుడూ మొదటి మూడు స్థానాలకు చేరుకోలేదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాకు చెందిన వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. 137.4 బిలియన్ల డాలర్ల మొత్తం నికర విలువతో, 60 ఏళ్ల అదానీ, సంపదలో లూయిస్ విట్టన్ ఛైర్మన్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. అంతేకాదు ఈ ర్యాంకింగ్‌లో బిజినెస్ మాగ్నెట్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల సమీపంలోకి వచ్చారు. ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ నికర విలువ వరుసగా 251 బిలియన్ డాలర్లు, 153 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా ఈ ఇండెక్స్‌లో ముఖేశ్ అంబానీ మొత్తం 91.9 బిలియన్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. దేశీయంగా అదానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత మూడో అతిపెద్ద వ్యాపారసంస్థగా ఉంది. ఒక్క 2022 లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. మిగిలిన బిలియనీర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీని దాటేశారు. ఆ తరువాత ఏప్రిల్‌లో సెంట్ బిలియనీర్ అయ్యారు. గతనెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్‌గేట్స్‌ను తలదన్ని ప్రపంచంలో నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. -
మీరు మీ స్టేట్ మెంట్లు..జో బైడెన్‌పై అమెజాన్ బాస్ ఆగ్రహం!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై మండిపడ్డారు. ఇప్పటికే పలు మార్లు బైడెన్ నిర్ణయాల్ని తూర్పారబడుతూ వస్తున్న బెజోస్..తాజాగా గ్యాస్ కంపెనీలను ఉద్దేశిస్తూ జోబైడెన్ చేసిన ట్వీట్‌పై బెజోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో గ్యాస్ స్టేషన్లను(పెట్రోల్ బంకులు) నిర్వహిస్తున్న సంస్థలకు జోబైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..యుద్ధం, సంక్షోభం తలెత్తింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్యాస్ ధరల్ని తగ్గించాలి. ఆ ప్రభావం మీరు కొనే ప్రొడక్ట్ ధరపై ప్రభావం చూపుతుంది.ఇప్పుడే నేను చెప్పినట్లు చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై అమెజాన్ బాస్ స్పందించారు. Ouch. Inflation is far too important a problem for the White House to keep making statements like this. It’s either straight ahead misdirection or a deep misunderstanding of basic market dynamics. https://t.co/XgKfEICZpk — Jeff Bezos (@JeffBezos) July 3, 2022 బైడెన్ పాలసీలపై గుర్రు ప్రపంచంలోనే రిచెస్ట్ బిలియనీర్ల జాబితాలో 2వ స్థానంలో ఉన్న జెఫ్‌బెజోస్..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయాల్ని తప్పు పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అంశంలో బైడెన్ పాలసీలను తప్పుబడుతున్నారు. ఈ తరుణంలో జోబైడెన్ గ్యాస్ స్టేషన్ నిర్వహణ సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేయడంపై జెఫ్ బెజోస్ స్పందించారు. 'అయ్యో. ద్రవ్యోల్బణం చాలా ముఖ్యమైంది. బైడెన్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ..వైట్ హౌస్ ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా ముఖ్యం.ఈ స్టేట్మెంట్లు తప్పుదారి పట్టించడం లేదంటే మార్కెట్‌ను దెబ్బ తీసేస్తాయని జెఫ్ బెజోస్ ట్వీట్లో పేర్కొన్నారు. -
అపర కుబేరులకు భారీ షాక్.. లక్షల కోట్ల నష్టం!
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలు,సెంట్రల్ బ్యాంక్‌లు ఉద్దీపన చర్యలు చేపట్టడం, జాతీయ, అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో టెక్ కంపెనీల నుంచి క్రిప్టో కరెన్సీ వరకు ఇలా అన్నీ రంగాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వెరసి ప్రపంచ వ్యాప్తంగా 500 మంది బిలియనీర్లు కేవలం 6నెలల వ్యవధిలో 1.4 ట్రిలియన్ డాలర్లను నష్టపోయారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం..వరల్డ్ 500 రిచెస్ట్ బిలియనీర్లలో ఎలన్ మస్క్ తన సంపదలో దాదాపు 62 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 63 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్ బర్గ్ నికర సంపద సగానికి పైగా తగ్గింది. ఇలా ప్రపంచంలో 500 మంది సంపన్నులు 2022 మొదటి 6 నెలల్లో 1.4 ట్రిలియన్ డాలర్లను కోల్పోయారు. కారణాలివేనా! పాలసీ మేకర్లు ప్రస్తుతం నెలకొన్న అధిక ద్రవ్యోల్బణాన్నితగ్గించేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. దీంతో బిలియన్లు తన ఆదాయాన్ని పెద్ద ఎత్తున కోల్పోయారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజంటెస్లా జూన్ నుండి కేవలం మూడు నెలల్లో అత్యంత దారుణమైన నష్టాల్ని చవిచూసింది. అమెజాన్ సైతం అదే దారిలో పయనించింది. అయినా వాళ్లే టాప్ ప్రప౦చ౦లోని అత్య౦త ధనవ౦తులైన ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచ ధనవంతుల జాబితాలో వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ఎలన్ మస్క్ ఇప్పటికీ 208.5 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అమెజాన్ బాస్ బెజోస్ 129.6 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్‌లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్‌కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్‌లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్‌లో బిడ్లు వేస్తారు. స్క్రీన్‌లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్‌లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్‌లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్‌కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్‌కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్‌గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్‌కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్‌కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్‌స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
బ్లూ ఆరిజిన్ యాత్ర సక్సెస్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్షయాన సంస్థ బ్లూ ఆరిజిన్ తన ఐదో పర్యాటక యాత్రను విజయ వంతంగా ముగించింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8గంటల 26నిమిషాలకు వెస్ట్ టెక్సాస్‌లోని ప్రయోగకేంద్రం ఇందుకు వేదికైంది. న్యూ షెపర్డ్(ఎన్ఎస్–21) రాకెట్ ఒక మెక్సికన్ మహిళసహా ఆరుగురు ప్రయాణికులను 106 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పర్యటనకు తీసుకెళ్లి సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. మెక్సికో మూలాలున్న ఒక మహిళ(కట్యా ఇచాజెరెట్టా) ఇలా అంతరిక్ష పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోకి వెళ్లి అత్యంత పిన్న వయస్కురాలైన అమెరికన్‌గా నూ కట్యా (26) చరిత్ర సృష్టించింది. యాత్ర మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. -
మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద!
బిలయనీర్లు ఈలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్' సంపద కరిగి పోతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల కాలంలో ఆ ముగ్గురు ధనవంతులు 115బిలియన్ డాలర్లను నష్టపోయారు. వీరితో పాటు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సైతం 44.7 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..అత్యధికంగా బెజోస్ 53.2 బిలియన్ డాలర్లు, మస్క్ 46.4 బిలియన్ డాలర్లు, అత్యల్పంగా బిల్ గేట్స్ 15.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో గత శుక్రవారం నాటికి మస్క్ సంపద 224 బిలియన్ డాలర్లు, బెజోస్ ఆస్తి 139 డాలర్లు, గేట్స్ ఆస్తి 123 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 133 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఇది కూడా చదవండి : Elon Musk: నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత కొంపముంచిన ట్విటర్! ముఖ్యంగా మస్క్ సంపద కరిగిపోవడానికి కారణం ఆయన నిర్ణయాలేనని బ్లూం బర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. టెస్లాలో మస్క్ వాటా 15.6శాతం ఉండగా మొత్తం సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో టెస్లా కారు షేర్లు ఈ ఏడాదిలో మొత్తం (గత వారం శుక్రవారం వరకు) 37శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్‌ను 9.2శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు టెస్లా పట్ల అతని నిబద్ధతను పెట్టుబడిదారులను ప్రశ్నించేలా చేసింది.దీంతో టెస్లా స్టాక్స్ పడిపోయాయి. ఆ తర్వాత మస్క్ సైతం ట్విట్టర్‌ను 44 బిలియన్లకు టేకోవర్ చేసుకునేందుకు 8.4 బిలియన్ల విలువైన టెస్లా షేర్లను మస్క్ అమ్మాడు. వెరసీ మస్క్ సంపద కరిగిపోవడానికి పరోక్షంగా కారణమైంది. -
‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’!
ప్రపంచంలో నెంబర్ వన్ బిలియనీర్ స్థానంలో ఉన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ అందుకున్న విరుద్దంగా తన ప్రత్యర్ధి అనుకున్న వ్యాపార రంగంలో రాణించాలంటే ఎలాంటి అలవాట్లను అలవరుచుకుంటే మంచిదో సలహా ఇవ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎలన్ మస్క్ వ్యాపారం రంగంలో సాధించిన ఘనతల గురించి..అమ్మకాలు, కొనుగోళ్ల వంటి విషయాలపై బహిరంగంగానే చర్చిస్తుంటారు. అలాంటి మస్క్ ఈ సారి రూటు మార్చారు. జెఫ్ బెజోస్ చాలా మంచోడంటూ ఆకాశానికెత్తేశాడు. కానీ ఆయన పార్టీలు చేసుకోవడం నచ్చడం లేదని కామెంట్ చేయడం సోషల్ మీడియాలో ఆసక్తి కరంగా మారింది. Do you think Bezos is (generally) a good person? — Alec 🪐🔭 (@S3XYstarship) May 28, 2022 ట్వీటర్లో ఒక్కోసారి యూజర్లు అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇస్తుంటుంటారు. అలా సోలార్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్న అలెక్ (alec) అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు? మంచి వారేనా' అంటూ మస్క్‌ను ప్రశ్నించాడు. అందుకు మస్క్ తన శైలిలో స్పందించారు."బెజోస్ బాగానే ఉన్నాడు. అతను ఆర్బిట్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు నిర్విరామంగా పనిచేయాలి.కానీ అలా చేయడం లేదే. పార్టీల పేరుతో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ" బెజోస్‌ను ఉద్దేశిస్తూ మస్క్ ట్వీట్ చేశాడు. చదవండి👉 Amazon: దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో -
ఈలాన్ మస్క్‌కు టెస్లా షాక్, ఆ క్లబ్‌నుంచి ఔట్..అయినా
టెస్లా సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఈలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఎలైట్ 200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోంచి తాజాగా కిందకి జారుకున్నాడు. మంగళవారం టెస్లా షేర్లు దాదాపు 7 శాతం కుప్పకూలడంతో మస్క్ సంపద కూడా అదే స్థాయిలో నష్టపోయింది. ఈలాన్ మస్క్ నికర విలువ 5.40 శాతం క్షీణించి 192.7 బిలియన్ల డాలర్లు చేరుకుంది. ఈ పరిణామం తరువాత మస్క్ సంపద 2021, ఆగస్టు స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయినా మస్క్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండటం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 127.80 బిలియన్ల డాలర్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు. గ్లోబల్ మార్కెట్లో కరెక్షన్తో దిగ్గజ కంపెనీలు నెట్ వాల్యూ బాగా క్షీణించింది. ముఖ్యంగా అమెజాన్ స్టాక్ ఈ ఏడాదిలో 35.4 శాతం నష్టపోగా, టెస్లా షేరు 36.1 క్షీణించింది. మస్క్ విలువ ఇప్పుడు 204 బిలియన్ డాలర్లు కాగా, బెజోస్ నికర విలువ 131 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చి 2022లో ఈలాన్ మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల కిందికిపడిపోయింది. అయితే ఆ తరువాత నష్టాలనుంచి మార్కెట్లు బలంగా పుంజుకోవడంతో మస్క్ నికర విలువ తిరిగి ఎగిసి ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో 288 బిలియన్ డాలర్లకు చేరింది. గ్లోబల్ రిచెస్ట్ మాన్‌గా అవతరించిన తరువాత ట్విటర్లో 9 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఈ డీల్ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
ఒకే ఫ్రేమ్‌లో ఈలాన్ మస్క్, జెఫ్‌బేజోస్.. హార్ష్ ఆకట్టుకునే వ్యాఖ్య
ఈలాన్‌మస్క్, జెఫ్బేజోస్లో స్టార్టప్‌లతో తమ కెరీర్ ప్రారంభించి ప్రపంచంలోనే అతి పెద్ద కార్పోరేట్ కంపెనీలకు యజమానులు అయ్యారు. అయితే తమ విజయం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగే వరకు ఇద్దరు ‘తగ్గెదేలే’ అన్నట్టుగా వ్యవహరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా తమ గళం విప్పడం మాత్రం ఆగలేదు. ఇందుకు ఉదాహారణగా అనేక ఘటనలు ఉన్నాయి. 2004లో జరిగిన వీరిద్దరు ఓ రెస్టారెంట్లో కలిసి స్పేస్ గురించి సీరియస్‌గా చర్చించారు. ఇలా ఇద్దరు దిగ్గజాలు కలిసున్న ఫోటోను ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్, ఆర్పీజీ గ్రూపు ఎండీ హార్ష్ గోయెంకా ట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో ఈలాన్‌మస్క్, జెఫ్ బేజోస్లిద్దరు ఉన్నారు. వీరిద్దరి మధ్య పసుపు రంగులో విరబూసిన ఓ టులిప్ పువ్వు కూడా ఉంది. ఈ ఫోటోను వర్ణిస్తూ హార్ష్.. ది మోస్ట్ ఇంపార్టెంట్ టూ లిప్స్ ఇన్ ది వరల్డ్ అంటూ ఆసక్తికరంగా కామెంట్ జోడించారు. నెటిజన్లు సైతం భారీ ఎత్తున ఈ ఫోటోకు తమ స్పందన తెలుపుతున్నారు. The most important ‘Two-lips’ in the world! pic.twitter.com/m2FHHwWCvL — Harsh Goenka (@hvgoenka) May 15, 2022 చదవండి: హెచ్ఆర్ ఎంతో ప్రతిభావంతులు.. కానీ జీతం దగ్గర మాత్రం.. -
కార్పోరేట్ ట్యాక్స్.. జోబైడెన్ వర్సెస్ జెఫ్ బేజోస్
అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వివిధ దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ఓ ప్రతిపాదన కార్పోరేట్ కంపెనీలకు కంటగింపుగా మారింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. కరోనా మొదలైన చీకటి రోజులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ద్రవ్యోల్బణం అక్కడ నమోదు అవుతోంది, డాలరు విలువకు బీటలు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఓ ప్రతిపాదన తెరమీదకు తెస్తూ ట్వీట్ చేశారు. అందులో ద్రవ్యోల్బణం కట్టడి చేయాలంటే.. సంపన్న కార్పోరేట్ కంపెనీలు పన్నులు సక్రమంగా చెల్లించాలంటూ కోరారు. యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ ట్వీట్‌కు వెంటనే కౌంటర్ ఇచ్చాడు ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెప్బేజోస్. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేయాలనుకోవడం మంచి విషయమే.. చర్చించతగిన అంశమే. అలాగే కార్పోరేట్ ట్యాక్సుల చెల్లింపు కూడా చర్చకు ఆమోదించతగిన విషయమే. అయితే ఈ రెండింటిని కలగలిపి కలగాపులగం చేయడం మాత్రం సరైన పద్దతి కాదు. దీంతో అసలు విషయం పక్కదారి పడుతుందంటూ జో బైడెన్ అభిప్రాయంతో విబేధించాడు జెఫ్‌బేజోస్. The newly created Disinformation Board should review this tweet, or maybe they need to form a new Non Sequitur Board instead. Raising corp taxes is fine to discuss. Taming inflation is critical to discuss. Mushing them together is just misdirection. https://t.co/ye4XiNNc2v — Jeff Bezos (@JeffBezos) May 14, 2022 గత కొంత కాలంగా పన్నుల చెల్లింపులో అమెజాన్ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2018లో 11 బిలియన్ డాలర్ల లాభంపై అమెజాన్ పన్ను చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో జోబైడెన్, జెఫ్ బేజోస్ల మధ్య నడిచిన సంవాదం ఆసక్తికరంగా మారింది. చదవండి: జెఫ్ బేజోస్‌కి ఝలక్ ఇచ్చిన ఎలన్‌మస్క్! -
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ తగిలింది. గురువారం ప్రకటించిన అమెజాన్ క్యూ1 ఫలితాలతో గంటల వ్యవధిలో బెజోస్ బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురువారం అమెజాన్ క్యూ1 ఫలితాల్ని ప్రకటించింది. ఈ ఫలితాల్లో 2015 తర్వాత ఈ ఏడాదిలో అత్యధికంగా 3.84 బిలియన్ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. దీంతో అప్రమత్తమైన షేర్ హోల్డర్లు అమ్మకాలు జరిపారు. ఫలితంగా గంటల వ్యవధిలో ఆ సంస్థ బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఒక్క మార్చి నెలలోనే అత్యంత దారుణంగా ట్రేడింగ్ జరిగిన టెక్నాలజీ షేర్ల విభాగంగా అమెజాన్ షేర్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అమెజాన్ క్యూ1 ఫలితాలు ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ సంపదపై ప్రభావం చూపాయి. గురువారం రోజు అమెజాన్ 14.05 శాతం నష్టపోవడంతో జెఫ్ బెజోస్ గంటల వ్యవధిలో 20.5 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1.56లక్షల కోట్లు) నష్టపోయారు. కాగా, బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో బెజోస్ సంపద తగ్గి 148.4 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. చదవండి👉ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి! -
ట్విటర్ డీల్.. చైనా పరపతితో ఎలన్ మస్క్‌కు పంచ్
ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ఈ అంశం ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛా గొంతుక(పోస్టులు) వినిపించే అవకాశం యూజర్లకు కల్పిస్తానంటూ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భారీ డీల్‌పై ఎలన్ మస్క్ వ్యాపార ప్రత్యర్థి జెఫ్ బెజోస్ స్పందించారు. అమెజాన్ బాస్, ప్రపంచంలో రెండో ధనికుడు జెఫ్ బెజోస్.. ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన అంశంపై స్పందించారు. చరకలు అంటిస్తూనే.. ఆ వెంటనే మస్క్‌ను అభినందించినట్లు బెజోస్ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ తరుణంలో తెరపైకి ఆయన చైనా ప్రస్తావన తీసుకొచ్చారు. ► ఇకపై టెస్లాతో పాటు ట్విటర్లోనూ చైనా కీలక పాత్ర పోషించబోతుందంటూ అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారాయన. ‘‘చైనీస్ ప్రభుత్వం ‘టౌన్ స్క్వేర్’తో.. ఇప్పుడు పరపతి పొందుతుందా? ఆసక్తికరమైన ప్రశ్న..’’ అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారాయన. Interesting question. Did the Chinese government just gain a bit of leverage over the town square? https://t.co/jTiEnabP6T — Jeff Bezos (@JeffBezos) April 25, 2022 ► విషయం ఏంటంటే.. ఆటోమేకింగ్ దిగ్గజం టెస్లా.. చైనాలోనే తొలి ఓవర్సీస్ ఫ్యాక్టరీ నెలకొల్పింది. తద్వారా అతిపెద్ద మార్కెట్ ఆసియా మీద దృష్టిసారించింది. ఇప్పుడు ట్విటర్తోనూ మస్క్.. చైనా పరపతిని పెంచుతాడేమో అంటూ పరోక్షంగా విసుర్లు విసిరాడు బెజోస్. ► స్వేచ్ఛా ప్రకటనకు ట్విటర్ అనేది డిజిటల్ టౌన్ స్క్వేర్ లాంటిదని ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెజోస్.. టౌన్‌స్క్వేర్ అంటూ సెటైర్ వేశాడు. అయితే ప్రశ్న సంధించినట్లే సంధించి.. దానికి సమాధానం ఏమో పాజిటివ్‌గా ఇచ్చాడు బెజోస్. ► నా ఉద్దేశంలో అలా జరగకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. చైనా-టెస్లాలో ఉన్న సంక్లిష్టత, ట్విటర్‌కు ఉన్న సెన్సార్షిప్ అడ్డంకులు ఒకటి కాకపోవచ్చంటూ కామెంట్ చేశాడు. ఆ వెంటనే.. మస్క్ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను డీల్ చేయడంలో దిట్ట అంటూ ప్రశంసలు గుప్పించాడు జెఫ్ బెజోస్. మొత్తానికి తన అక్కసును వెల్లగక్కినట్లే కక్కి.. మస్క్‌పై ప్రశంసలు గుప్పించాడు బెజోస్. దీనిపై మస్క్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. My own answer to this question is probably not. The more likely outcome in this regard is complexity in China for Tesla, rather than censorship at Twitter. — Jeff Bezos (@JeffBezos) April 26, 2022 But we’ll see. Musk is extremely good at navigating this kind of complexity. — Jeff Bezos (@JeffBezos) April 26, 2022 చదవండి: మస్క్ చేతికి ట్విటర్! అనిశ్చితిలోకి అడుగు అంటూ.. -
ఎవరికీ అందనంత ఎత్తులో స్పేస్ఎక్స్ సీఈవో ఎలన్‌మస్క్!
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు స్పేస్ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్‌మస్క్. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం ఎలన్‌మస్క్ సందప 282 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. ఎలన్ మస్క్ తర్వాత రెండో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బేజోస్ మార్కెట్ క్యాప్ 183.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంచుమించు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్యక్తుల మద్య వత్యాసం వంద బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో అద్భుతం జరిగే తప్ప సంపాదన పరుల జాబితాలో సమీప భవిష్యత్తులో ఎలన్ మస్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చే వారు కనిపించడం లేదు. కరోనా సంక్షోభ సమయం తర్వాత చాలా మంది ధనవంతుల సంపద హరించుకుపోగా ఇందుకు విరుద్ధంగా ఎలన్ మస్క్ దగ్గర సంపద పోగుపడిపోతోంది. 2020 ఆరంభంలో ఎలన్‌మస్క్ సంపాదన 26 బిలియన్ డాలర్లు. కానీ ఆ ఏడాది ముగిసే సరికి ఎలన్‌మస్క్ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దీంతో 2020లో తొలిసారి ఎలన్‌మస్క్ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరాడు. ఈ ఏడాదిలో అతని సంపాదన 110 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచాన్ని దాదాపు రెండేళ్ల పాటు కుదిపేసింది. ఈ సమయంలో ఎలన్ మస్క్ సంపాదన భారీగా పెరిగింది. ఇక 2021కి వచ్చే సరికి మరో 90 బిలియన్ డాలర్ల సొమ్ము ఎలన్ మస్క్ పంచన చేరింది. దీంతో ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ టైకూన్లను వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ఎలన్‌మస్క్ దెబ్బకి 2021 ఆరంభంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న జెప్బేజోస్ ఏడాది ముగిసే సరికి రెండో స్థానానికి పడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడిగా దీర్ఘకాలం కొనసాగిన బిల్‌గేట్స్ దగ్గరున్న సంపదకు రెట్టింపు సంపద ఈరోజు ఎలన్‌మస్క్ దగ్గర ఉంది. చదవండి: ఎలన్ మస్క్ మా బోర్డ్‌లో చేరడం లేదు! -
హీటెక్కిస్తోన్న ఐపీఎల్...ఢీ అంటే ఢీ అంటోన్న ముఖేశ్ అంబానీ, జెఫ్ బెజోస్..!
గత కొన్నేళ్లుగా భారత్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీలు తమ ఆధిపత్యం కోసం ఇరువురు పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఫ్యుచర్ గ్రూప్‌కు చెందిన వ్యాపారాలను పూర్తిగా హస్తగతం చేసుకుందమని భావిస్తోన్న ముఖేష్ అంబానీకి అమెజాన్ అడ్డుగా నిల్చుంది. ప్రస్తుతం ఈ కంపెనీలు ఐపీఎల్ ప్రసార హక్కుల (డిజిటల్)ను తీసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులపై అమెజాన్, రిలయన్స్ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. ప్రసార హక్కుల విషయంలో ఇప్పుడు ఇరువురి మధ్య ఐపీఎల్ మరో తీవ్రమైన పోటీకి దారితీస్తోంది. మూహుర్తం ఖరారు..! ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను వేలం వేయడానికి మార్గదర్శకాలు ఈ వారంలో వెలువడనున్నాయి. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం వేలం పాటలను త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా....టెలివిజన్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి, వాటిని ఆన్లైన్లో ప్రసారం చేయడానికి హక్కులు విడిగా విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను దక్కించుకునేందుకుఅమెజాన్ ప్రైమ్ వీడియా, జియో సిద్దమైనాయి. బ్రాడ్ కాస్టింగ్ హక్కులను పొందేందుకు ఇరు కంపెనీలు తీవ్రంగా పోటీ పడనున్నట్లు సమాచారం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ-కామర్స్ ఆధిపత్యం కోసం ఇరు కంపెనీలు పోరాడుతున్నందున, అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా విజయం సాధించాలని నిశ్చయించుకుంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన వేలం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. వీటిని దక్కించుకునేందకు ఆయా కంపెనీలు బిడ్స్ వేస్తూ గెల్చుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐపై కాసుల వర్షం..! ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ వేలం జూన్ 12న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకు కాసుల వర్షం కురియనుంది. బ్రాడ్ కాస్టింగ్ హక్కులతో బీసీసీఐకి దాదాపు రూ. 40,000 నుంచి రూ. 45,000 కోట్ల ఆదాయం ఖజానాలో చేరనున్నుట్లు సమాచారం. వేలం గెల్చుకున్న సంస్థలు 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను పొందుతాయి. 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియాకు రూ. 16,347.50 కోట్ల రూపాయలకు విక్రయించింది. స్టార్ ఇండియా మాతృ సంస్థ వాల్ట్ డిస్నీ అని తెలిసిందే. కాగా పలు నివేదికల ప్రకారం..ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకునేందుకు అమెజాన్, రిలయన్స్‌తో పాటుగా సోనీ గ్రూప్, వాల్ట్ డిస్నీతో పోటీ పడనున్నాయి. చదవండి: అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..? -
జోబైడెన్ కీలక నిర్ణయం: ఆ 700మందికి చుక్కలే..వారిలో ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ కూడా!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దేశంలోని బిలియనీర్లకు భారీ షాక్ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమలు చేసేలా ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపూ 700 మంది అమెరికన్ ధనవంతులు పెద్ద ఎత్తున పన్ను కట్టాల్సి ఉండగా..వారిలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 35 బిలియన్ డాలర్లు,స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ 50 బిలియన్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. 2023లో జోబైడెన్ ప్రభుత్వం 'బిలియనీర్ మినిమమ్ ఇన్ కమ్ ట్యాక్స్'ను వసూలు చేయనుంది. వైట్ హౌస్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన ప్రకారం..100 మిలియన్ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న 700 మంది బిలియనీర్ల నుంచి ఒక్కొక్కరు కనీసం 20శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే 10ఏళ్లలో కనీసం 1 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ లోటును తగ్గించడానికి యూఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని' ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఎవరు ఎక్కువ చెల్లించాలి? అమెరికా ప్రభుత్వం వసూలు చేయనున్న ట్యాక్స్ 0.01శాతం కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఊహించని విధంగా సంపన్నుల నుంచి $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ పన్ను వసూలు కానుంది. ఇక ఈ జోబైడెన్ ప్రతిపాదన యూఎస్‌లో తమని తాము మధ్య తరగతిగా కుటుంబాలకు చెందిన వారిగా చెలామణి అవుతూ, పన్ను ఎగ్గొట్టేవారికి ఇబ్బందేనని అమెరికా ఆర్ధిక నిపుణులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం చేసిన అధ్యయనంలో 400 బిలియనీర్ కుటుంబాలు 2010 - 2018 మధ్య వారి ఆదాయంపై సగటున 8.2శాతం మాత్రమే పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది. జెఫ్ బెజోస్ 35 బిలియన్లు, స్పేస్ ఎక్స్ అధినేత 50 బిలియన్లు కొత్త ప్రతిపాదన బిలియనీర్లుకు ఎదురు దెబ్బ తగలనుంది. ఉదాహరణకు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ అదనంగా 50 బిలియన్ డాలర్లు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 35 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని వాషింగ్టన్ పోస్ట్ ఉదహరించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ ఆర్థికవేత్త గాబ్రియేల్ జుక్మాన్ అంచనా వేసిన గణాంకాలు చెబుతున్నాయి. మరిన్ని అనుమతులు కావాలి బిలియనీర్లపై అధిక పన్ను విధించాలని రాజకీయ వామపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే కొత్త ఈ కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తేనే 10ఏళ్లలో 360 బిలియన్ల వరకు జోబైడెన్ ప్రభుత్వానికి ఆదాయం చేకూరనుంది. చదవండి: ట్విట్టర్‌కే ‘శీల’ పరీక్ష పెట్టిన ఎలన్‌మస్క్ -
ఇప్పటి వరకు ట్రిలియనీర్లు లేరు.. ఒక వేళ అయితే అది కచ్చితంగా అతడే!
యాభై ఏళ్ల క్రితం మిలియనీర్ అంటే మహాగొప్ప. ఇప్పుడు బిలియనీర్లు కూడా వందల సంఖ్యలో వచ్చేశారు. కానీ ఇప్పటి వరకు వ్యక్తిగత ఆస్తుల్లో ట్రిలియనీర్ అయిన వ్యక్తి లేరు. కానీ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే అతి త్వరలో ఓ వ్యక్తి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉందని తిపాల్టీ అప్రూవ్ సంస్థ తేల్చి చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ కుబేరిగా ఎలన్ మస్క్ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ పత్రిక అంచనాల ప్రకారం ఆయన సంపద 260 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన తర్వాతి స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ 190 బిలియన్ డాలర్లతో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల మధ్య సుమారు 70 బిలియన్ డాలర్ల వత్యాసం ఉంది. జెఫ్ బేజోస్‌కి అందనంత ఎత్తులో ఉండటమే కాదు లాభాలు అందిపుచ్చుకోవడంలోనూ ఎలన్ మస్క్ దూకుడుగా ఉన్నారు. 2017 నుంచి ప్రతీ ఏడు ఎలన్ మస్క్ సంపద వృద్ధి 127 శాతంగా ఉంది. పైగా టెస్లా కార్లకు తోడు స్పేస్ఎక్స్ సంస్థ నుంచి కూడా అతి త్వరలోనే లాభాలు అందుకోనున్నాడు ఎలన్ మస్క్. ఈ రెండు సంస్థలు కనుకు అంచనాలకు తగ్గట్టుగా లాభాలు అందిస్తే 2024 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ తర్వాత ప్రపంచ కుబేరుడు అయ్యే ఛాన్స్ ఉన్న వ్యక్తిగా ఝాంగ్ యామింగ్ ఉన్నారు. టిక్‌టాక్ అండతో ఆయన వేగంగా దూసుకువస్తున్నారు. ప్రస్తుతం టిక్‌టాక్ సాధిస్తున్న వృద్ధి ఇదే తీరుగా కొనసాగితే 2026 కల్లా ఝాంగ్యామింగ్ రెండో ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ట్రిలియనీర్ అయ్యే నాటికి ఝాంగ్ యామింగ్ వయస్సు కేవలం 42 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బేజోస్ ట్రిలియనీర్ అయ్యేందుకు 2030 వరకు వేచి ఉండక తప్పదంటున్నాయి నివేదికలు. ఈ కామర్స్ రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ జెఫ్ బేజోస్ సంపదకు కోత పెడుతుండటమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తారాస్థాయిలో కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటే ప్రస్తుత అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. -
అదానీ జోరు.. ఎలన్‌మస్క్, జెఫ్‌బేజోస్ బేజారు !
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మించిపోయారు. 2021లో ఏకంగా 49 బిలియన్ డాలర్లు (రూ.3.67 లక్షల కోట్లు) మేర తన సంపద విలువను పెంచుకున్నారు. ప్రపంచంలో టాప్–3 బిలియనీర్లు అయిన ఎలాన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఎల్వీఎంహెచ్) పెంచుకున్న సంపదతో పోలిస్తే.. అదానీ నెట్‌వర్త్ వృద్ధి గతేడాది ఎక్కువగా ఉందని ‘ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022’ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ ముకేశ్ అంబానీ మొత్తం 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయునిగా ఈ జాబితాలో కొనసాగారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో అంబానీకి 9వ స్థానం దక్కింది. వార్షికంగా చూస్తే 2021లో ఆయన సంపద 24 శాతం పెరిగింది. అంబానీ తర్వాత అదానీయే ఐశ్వర్యవంతుడిగా ఉన్నారు. ఆయన సంపద 2021లో 153 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరింది. గత పదేళ్లలో అంబానీ నికర విలువ 400 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో అదానీ సంపద 1,830 శాతం ఎగసింది. ప్రపంచ బిలియనీర్లలో అదానీకి 12వ ర్యాంకు లభించింది. హెచ్‌సీఎల్ కంపెనీ ప్రమోటర్ శివ్‌నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో (ప్రపంచవ్యాప్తంగా 46వ ర్యాంకు) ఉంటే.. 26 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా, 25 బిలియన్ డాలర్ల విలువతో లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఐశ్వర్యం గణాంకాలు.. ► గౌతమ్ అదానీ సంపద 2020లో 17 బిలియన్ డాలర్లు ఉంటే.. రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీని లిస్ట్ చేసిన తర్వాత ఆయన సంపద ఐదు రెట్లు పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. ► 2021లో ముకేశ్ అంబానీ సంపద 20 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. సంపదను పెంచుకునే విషయంలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ముకేశ్ ఉన్నారు. ► నైకా ప్రమోటర్ ఫాల్గుణి నాయర్ 7.6 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లోకి కొత్తగా అడుగు పెట్టారు. ► గౌతమ్ అదానీ తర్వాత గతేడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్, లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ► హెచ్‌సీఎల్ శివ్‌నాడార్ నెట్‌వర్త్ గత పదేళ్లలో 400 శాతం వృద్ధి చెందింది. ► 23 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ, ఇంతే నెట్‌వర్త్‌తో హిందుజా గ్రూపు ప్రమోటర్ ఎస్పీ హిందుజా జాబితాలో టాప్ 100లో నిలిచారు. ► చైనాలో 1,133 బిలియనీర్లు, అమెరికాలో 716 మంది, భారత్‌లో 215 మంది ఉన్నారు. ► ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్‌లో ఉండగా, ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం మందికి భారత్ కేంద్రంగా ఉంది. ► గత పదేళ్లలో భారత బిలియనీర్లు 700 బిలియన్ డాలర్ల మేర ఉమ్మడిగా సంపదను పెంచుకున్నారు. ఇది స్విట్జర్లాండ్ జీడీపీకి సమానం కాగా, యూఏఈ జీడీపీకి రెండింతలు. ► బిలియనీర్లకు ముంబై నివాస కేంద్రంగా ఉంది. ఇక్కడ 72 మంది ఉంటే, ఢిల్లీలో 51 మంది, బెంగళూరులో 28 మంది ఉన్నారు. ► గత రెండేళ్లలో బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబం సంపద పరంగా 916 ర్యాంకులు మెరుగుపరుచుకుని జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 1083వ ర్యాంకు సొంతం చేసుకుంది. వీరి సంపద 3.3 బిలియన్ డాలర్లు. ► భారత్‌లో 40 మంది గతేడాది బిలియన్ డాల ర్లు అంతకుమించి సంపద పెంచుకున్నారు. ► ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022లో మొత్తం 69 దేశాల నుంచి 3,381 బిలియనీర్లకు చోటు లభించింది. అంతక్రితం జాబితా నుంచి చూస్తే 153 మంది కొత్తగా వచ్చి చేరారు. -
ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ దాటేసిన గౌతమ్ అదానీ..!
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ సంపాదన 2021లో భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో ప్రపంచంలోనే అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. నికర సంపద పేరుగదలలో ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ కంటే అదానీ ముందున్నారు. 2020లో 17 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 81 బిలియన్ డాలర్లకు చేరిందని ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 తన నివేదికలో తెలిపింది. భారత్‌కు చెందిన మరో కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపాదనపరుడైన ముకేశ్ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం గమనార్హం. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.. గత సంవత్సరం గౌతమ్ అదానీ సంపద 49 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. గౌతమ్ నికర సంపద పెరుగుదల "ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర సంపద పెరుగుదల కంటే ఎక్కువ" అని హురున్ గ్లోబల్ పేర్కొంది. గత 10 ఏళ్లలో అంబానీ సంపద 400 శాతం వృద్ధి చెందగా, అదానీ సంపద 1,830 శాతం పెరిగినట్లు అని జాబితా హురున్ గ్లోబల్ తన నివేదికలో తెలిపింది. హెచ్.సీ.ఎల్ టెక్నాలజీ చైర్మెన్ శివ్ నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో ఉండగా, సీరం ఇనిస్టిట్యూట్'కు చెందిన సైరస్ పూనావాలా (26 బిలియన్ డాలర్లు), స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ ఎన్ మిట్టల్(25 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్, పవర్ ష్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్ ప్రెజెస్ ముందుకొచ్చింది. దీంతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్ అడుగు పెట్టినట్టయ్యింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులుకు షాకిచ్చిన టాటా మోటార్స్..!) -
చిక్కుల్లో ప్రపంచ కుబేరుడు.. కుళ్లిన కోడిగుడ్లతో కొడతామంటూ ప్రజల హెచ్చరిక!
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బేజోస్ ఊహించని చిక్కుల్లో పడ్డారు. ఎంతో ముచ్చపడి తయారు చేయించుకున్న పడవ ఆయన్ని కలవరపాటుకి గురి చేస్తోంది. అలలపై ప్రయాణం మొదలుకాకముందే ఆయన్ని వివాదాల్లోకి ముంచింది. మెగాయాచ్ ఎలన్‌మస్క్ కంటే ముందు ప్రపంచంలో నంబర్ ధనవంతుడిగా రికార్డులెక్కారు జెఫ్ బేజోస్. దాదాపు 200 బిలియన్ డాలర్లకు సంపద ఆయన సొంతం. ఈ క్రమంలో తను సేద తీరేందుకు.. విహార యాత్రలు చేపట్టేందుకు సర్వాంగ సుందరంగా.. సకల సౌకర్యాలతో ఓ పడవ (మెగాయాచ్) తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. కస్టమైజ్డ్ యాచ్‌లు తయారు చేసే ఓ డచ్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. హలాండ్లో నిర్మాణం హలాండ్లోని ప్రముఖ పోర్టు సిటీల్లో రోటెర్డామ్ దగ్గరున్న ఆల్బ్లెస్సర్డామ్లో Y721 పేరుతో మెగాయాచ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పడవ ఖరీదు రమారమీ 485 మిలియన్ డాలర్లు. ఎట్టకేలకు ఫుట్‌బాల్ స్టేడియం కంటే పెద్దదిగా ఈ యాచ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యాచ్‌ని సముద్రంలో ప్రవేశపెట్టే సమయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. రోటెర్డామ్లో చారిత్రక సంపదగా భావించే ఓ వంతెన యాచ్ ప్రయాణానికి అడ్డుగా నిలిచింది. చారిత్రక వంతెన యాచ్‌ని తయారు చేసిన చోటు నుంచి సముద్రంలోకి తీసుకెళ్లే నీటి ప్రవాహంపై పురాతన కాలం నాటి కోనింగ్షావెన్ అనే వంతెన ఉంది. దీనిని మొదటిసారి 1878లో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలతో జరిగిన యుద్దంలో బాంబింగ్ కారణంగా ఈ వంతెన పాడవగా.. తిరిగి పునర్మించారు. అప్పటి నుంచి ఈ వంతెన ఓ చారిత్రాత్మక కట్టడంగా స్థానికులు భావిస్తున్నారు. చివరిసారి 2017లో వంతెనకు మరమ్మత్తులు చేశారు. వంతెన కూల్చేద్దాం జెఫ్‌బేజోస్ కోసం తయారు చేసిన మెగా యాచ్‌ను సముద్రంలోకి పంపే క్రమంలో పురాతన వంతెన అడ్డుగా ఉన్నందున... పాక్షికంగా వంతెనను కూల్యేయాలంటూ పడవ తయారీ సంస్థ రోటెర్డామ్ పాలకమండలకి విజ్ఞప్తి చేసింది. యాచ్‌ను సముద్రంలో పంపిన తర్వాత వంతెన పునర్ నిర్మాణానికి నిధులు అందిస్తామని పేర్కొంది. మేం ఒప్పుకోం జెఫ్ బేజోస్ పడవ వెళ్లేందుకు తమ చారిత్రక కట్టడానికి కూల్చాలనే ప్రతిపాదనలను రోటెర్డామ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంతెన కూల్చివేతకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. తమ సెంటిమెంట్స్ పట్టించుకోకుండా వంతెన కూల్చి ఈ మార్గంలో జోఫ్ బేజోస్ పడవని తీసుకెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లతో యాచ్‌పై దాడి చేస్తామంటూ తమ కార్యాచరణ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ కోడిగుడ్ల దాడికి మద్దతు రోజురోజుకి పెరుగుతోంది. బాయ్‌కాట్ అమెజాన్ ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక ఇటు రోటెడ్డ్యామ్ పాలకమండలి, అటు పడవ తయారీ కంపెనీలు బిక్కచచ్చిపోయాయి. మరోవైపు జెఫ్‌బేజోస్‌కి వ్యతిరేకంగా బాయ్‌కాట్ అమెజాన్ అంటూ గళం విప్పుతున్నారు. మొత్తంగా ఈ కొత్త పడవ వ్యహారం జెఫ్‌బేజోస్‌కి టైటానిక్‌లా మారింది. చదవండి: అమెజాన్ బాస్ పంటపండింది.. ఏకంగా లక్షా నలభై వేల కోట్లకు పైనే పెరిగిన సంపద -
గుండు బాస్ ఖాతాలోకి లక్షా నలభై వేల కోట్లు!
ఆయన తల్చుకుంటే.. బోడిగుండుపైన జుట్టు మొలిపించుకోవడం ఎంత సేపు? కానీ, ఆయనకది ఇష్టం లేదు. ఎందుకంటే.. సక్సెస్ అనేది లుక్కులో కాదు.. లక్కులో, హార్డ్ వర్క్‌లో ఉందని నమ్ముతున్నాడాయన. అందుకే గుండ్ బాస్‌గా పాపులర్ అయ్యాడు. ఆయనే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్(58).. అమెజాన్ అనే ఈ-కామర్స్ కంపెనీతో సంచలనాలకు నెలవయ్యాడు. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి పక్కకు జరిగాక.. సొంత స్పేస్ కంపెనీ బ్లూఆరిజిన్ మీదే ఆయన ఫోకస్ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఆయన(ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం). ఈ తరుణంలో తాజా పరిణామాలు బెజోస్‌కి బాగా కలిసొచ్చాయి. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ అమెజాన్ ఆమధ్య ఈవీ కంపెనీ రివియన్‌లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ప్రైమ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో షేర్ల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 15 శాతం పెరగ్గా.. అక్టోబర్ 2009 నుంచి ఇదే అధికం కావడం గమనార్హం. మరోవైపు అమెజాన్ కేవలం అడ్వర్టైజింగ్ బిజినెస్‌ల ద్వారా 31 బిలియన్ డాలర్లు సంపాదించుకోవడం గమనార్హం. ఈ దెబ్బతో బెజోస్ వ్యక్తిగత సంపద 20 బిలియన్ డాలర్లకు(మన కరెన్సీలో లక్షా నలభై వేల కోట్ల రూ.) పెరిగింది. ప్రస్తుతం ఈయన మొత్తం సంపద విలువ.. 164.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకవైపు ఫేస్బుక్ యూజర్ల ఎఫెక్ట్‌తో జుకర్‌బర్గ్ ఒక్కరోజులోనే 2.2 లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్‌తో రియల్ టైం బిలియనీర్ల జాబితాలో దిగజారిపోగా.. భారతీయ బిజినెస్ టైకూన్స్ ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు జుకర్‌బర్గ్ కంటే పైస్థానాల్లోకి ఎగబాకడం తెలిసిందే. చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
జనవరి 1న ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేసిన బిలియనీర్ జెఫ్ బెజోస్..!
డిసెంబర్ 31 తర్వాత ఇంగ్లీష్ క్యాలెండర్ ఎండ్ అవడం.. జనవరి 1తో కొత్త సంవత్సరం రావడం ప్రతి సారీ కామనే.. కానీ ప్రతి ఏడాదీ ప్రతి ఒక్కరూ చేసుకునే పార్టీలు మాత్రం కామన్ కాదు. అందరి లాగానే తను కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్లు ప్రపంచ 2వ అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ వేడుకల్లో తనతో పాటు మాజీ టీవీ హోస్ట్ లారెన్ బ్లాక్ కూడా ఉన్నారు. తనతో పాటు అతని తమ్ముడు మార్క్, లారెన్ కుమారుడు నిక్కో, మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ టోనీ గొంజాలెజ్ కూడా ఉన్నారు. జెఫ్ తన కుటుంబంతో కలిసి 'క్రేజీ డిస్కో పార్టీని' ఆస్వాదించానని, కొత్త సంవత్సరం 'వ్యక్తిగత ఎదుగుదల'కు సమయం అని తన అనుచరులకు చెప్పాడు. ఇంస్టాగ్రామ్ పోస్ట్ కింద ఇలా రాశారు.. 'గత రాత్రి కుటు౦బ౦తో క్రేజీ డిస్కో పార్టీ జరుపుకు౦టున్న౦దుకు మేము ఎ౦తో ఆన౦ది౦చా౦. అలాగే, కొత్త స౦వత్సరం కూడా వ్యక్తిగత ఎదుగుదల, పునరుద్ధరణ, పునర్జన్మ, మీ జీవిత౦లో ప్రతి క్షణ౦ జాగ్రత్తగా శ్రద్ధ వహించడానికి ఇది గొప్ప సమయ౦. మంచి & చెడు అన్నీ జరుపుకోండి, ఎదగండి" అని పేర్కొన్నారు. (చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!) -
జస్ట్ ఆ పది మంది సంపాదనే 400 బిలియన్ డాలర్లు!
సంపాదించడం ఎంత కష్టమో.. ఖర్చు పెట్టడం అంత సులువు. ఈ సూత్రం అందిరికీ వర్తించదు. అలాగే క్షణాల్లో కోట్లు సంపాదించి.. అంతే వేగంగా కోటాను కోట్లు పొగొట్టుకున్న వ్యాపార దిగ్గజాలను మన కళ్ల ముందే చూస్తున్నాం. 2021 ముగింపు సందర్భంగా ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన అపర కుబేరుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ర్యాంకింగ్‌లను పక్కనపెట్టి.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల సంపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంపాదనలో సింహభాగం ఒక్కడిదే కావడం.. ఆ ఒక్కడు ఎలన్ మస్క్ కావడం మరో విశేషం. ఎలన్ మస్క్.. ఆయన సంపాదన 277 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదించింది అక్షరాల 121 బిలియన్ డాలర్లు. 60 శాతం పెరిగిన టెస్లా షేర్లు, సొంత కంపెనీ స్పేస్ఎక్స్ ఒప్పందాలతో ఈ ఏడాది విపరీతంగా సంపాదించాడీయన. తద్వారా కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం సంపద 176 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదన 61 బిలియన్ డాలర్లు. యూరప్ దేశాల అత్యంత ధనికుడిగా పేరున్న ఈ 72 ఏళ్ల వ్యాపార దిగ్గజం.. ప్రపంచంలోనే లగ్జరీ గూడ్స్ కంపెనీ పేరున్న ఎల్వీఎంహెచ్కు చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతున్నారు. లారీ పేజ్.. ఈయన కంప్యూటర్ సైంటిస్ట్, గూగుల్ కో-ఫౌండర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ మాతృక సంస్థ)ను ఈ ఏడాది కూడా విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు లారీ పేజ్. ఈ గూగుల్ మాజీ సీఈవో మొత్తం సంపద 130 బిలియన్ డాలర్లు కాగా, కేవలం ఈ ఏడాదిలో 47 బిలియన్ డాలర్ల ఆదాయం(షేర్ల రూపేనా) వెనకేసుకున్నాడు. సెర్గె బ్రిన్.. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు. ఈ ఏడాది 45 బిలియన్ డాలర్ల సంపాదనతో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేశాడు. సెర్గె బ్రిన్(48) మొత్తం సంపాదన 125 బిలియన్ డాలర్లు. ఈయనకు ఆల్ఫాబెట్ కంపెనీలో 38 మిలియన్ షేర్లు ఉన్నాయి. స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మాజీ సీఈవో. ఎన్బీఏ లాస్ ఏంజెల్స్ క్లిపర్స్ టీం యాజమాని కూడా. తన వ్యాపారంతో పాటు మైక్రో సాప్ట్ కంపెనీ(కంపెనీ లాభాల వల్ల)లో ఉన్న షేర్ల ద్వారా ఈ ఏడాది 41 బిలియన్ డాలర్లు సంపాదించాడు స్టీవ్ బాల్మర్(65). ల్యారీ ఎల్లిసన్ ఒరాకిల్ చైర్మన్, వ్యవస్థాపకుడు ఈయన. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నెలలో భారీ ఆదాయం వెనకేసుకుంది ఒరాకిల్ కంపెనీ. దీంతో ఈ 77 ఏళ్ల వ్యాపార దిగ్గజం 29 బిలియన్ డాలర్లు సంపాదించడంతో పాటు 109 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో సెంచరీ బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ(ఫేస్బుక్) సీఈవోగా ఈ ఏడాది 24 బిలియన్ డాలర్ల సంపాదన వెనకేసుకున్నాడు మార్క్ జుకర్‌బర్గ్. కంపెనీ పేరు మారినా, వివాదాలు వెంటాడినా.. లాభాల పంట మాత్రం ఆగలేదు. మెటాలో ఇతనికి 13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది 20 శాతం పెరిగింది జుకర్‌బర్గ్ సంపద. ఇదిలా ఉంటే ఈ టాప్ 10 లిస్ట్‌లో అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్(37). వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన సంపదలో సగం సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించాడు. కానీ, ఈసారి ఈ ప్రకటన వర్కవుట్ కాలేదు. కంపెనీ షేర్ల తీరు ఆశాజనకంగా సాగలేదు. దీంతో కేవలం 21 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే వెనకేసుకున్నాడు. 91 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం మొత్తం సంపద విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్ దానాలు చేసుకుంటూ పోతున్నా.. బిల్‌గేట్స్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. ఏడు బిలియన్ల డాలర్లు సంపాదనతో.. సంపదను 139 బిలియన్ డాలర్లకు పెంచుకున్నాడు 66 ఏళ్ల గేట్స్. జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఎలన్ మస్క్‌తో పోటాపోటీగా వార్తల్లో నిలిచిన పర్సనాలిటీ. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన మొత్తం వెనకేసుకుంది కేవలం 5 బిలియన్ డాలర్లు మాత్రమే. 57 ఏళ్ల బెజోస్.. ఈ ఏడాది అమెజాన్ సీఈవో పగ్గాల నుంచి దిగిపోవడంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ గడిపాడు. ఈ ఏడాది అపర కుబేరుల్లో గట్టి దెబ్బ పడింది ఎవరికంటే.. ఈయనకే!. -సాక్షి, వెబ్ స్పెషల్ -
ఆ విడాకుల విలువ అక్షరాల యాభై వేల కోట్లు!
Russian Billionaire Vladimir Costly Divorce Case News: రష్యన్ బిలియనీర్ వ్లాదిమిర్ పొటానిన్ అత్యంత ఖరీదైన విడాకులతో వార్తల్లోకెక్కాడు. ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన(మన కరెన్సీలో అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) విడాకుల భరణం కోరుతూ ఆయన భార్య(మాజీ) కోర్టుకెక్కింది. తద్వారా జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ తర్వాత అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది ఇది. వ్లాదిమిర్ పొటానిన్.. రష్యాలోనే రెండో రిచ్చెస్ట్ పర్సన్. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 31 ఏళ్ల కాపురం తర్వాత వ్లాదిమిర్ పొటానిన్, నటాలియా పొటానినా విడాకులకు సిద్ధమయ్యారు. అయితే ఖనిజం ఫ్యాక్టరీ ఎంఎంసీ నోరిల్స్క్ నికెల్ పీఎస్జేసీలో వ్లాదిమిర్‌కు చెందిన వాటా నుంచి యాభై శాతం భరణంగా ఇప్పించాలంటూ మాజీ భార్య నటాలియా లండన్ కోర్టుకు ఎక్కింది. ఆ విలువ ఏడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. అంతేకాదు ఆయన వ్యాపారాల్లో ఆ విలువ మూడో వంతు పైనే ఉంటుంది. ఇలాంటి హైప్రొఫైల్ కేసులకు తీర్పులు ఇవ్వడంలో లండన్ కోర్టుకు ఘన చరిత్రే ఉంది. గతంలో బిలియనీర్ ఫర్ఖద్ అఖ్హ్మెదోవ్ విడాకుల కేసులో 450 మిలియన్ పౌండ్ల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది కూడా. ఇంతకు ముందు నటాలియా పొటానీనా కింది కోర్టులో 84 మిలియన్ డాలర్లు కోరగా.. 40 మిలియన్ డాలర్లకు జడ్జి తీర్పు ఇచ్చారు. కానీ, పొటానీనా మాత్రం భారీ భరణం కోరుతూ ఈసారి లండన్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పోటానిన్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మాక్మెకంజీ స్కాట్‌కు 36 బిలియన్ డాలర్లు విడాకుల భరణం చెల్లించగా.. బిల్‌గేట్స్, మిలిండాకు 26 బిలియన్ డాలర్ల భరణం చెల్లించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో మూడో బిలియనీర్‌గా ఖరీదైన విడాకుల జాబితాలో వ్లాదిమిర్ నిలుస్తాడా? లేదా? అన్నది తెలియడానికి కొంత టైం పడనుంది. -
అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ పర్యావరణ పరిరక్షణ విషయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే సంస్థలకు అమెజాన్ వ్యవస్థాపకుడు సోమవారం 443 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ పర్యావరణ పరిరక్షణ కోసం కోసం రూ.75 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) నిధులను ఖర్చు చేయనున్నట్టు గతంలో వెల్లడించారు. క్లైమేట్ చేంజ్‌పై పోరాటం కోసం ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ కింద ఈ నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సైంటిస్టులు, యాక్టివిస్టులు, ఎన్జీవోలు చేసే ఎలాంటి ప్రయత్నానికైనా తాము బెజోస్ ఎర్త్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందచేస్తామన్నారు. ఇప్పుడు ఆ నిధులలో నుంచి బెజోస్ 443 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం కోసం పనిచేస్తున్న 19 విభిన్న సంస్థలకు $130 మిలియన్లను ఇచ్చారు. అలాగే, సెప్టెంబర్ నెలలో వాతావరణ న్యాయ సమూహాలకు మరో $150 మిలియన్లను ఇచ్చినట్లు బెజోస్ ఎర్త్ ఫండ్ అధ్యక్షుడు, సీఈఓ ఆండ్రూ స్టీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్రాంట్లలో 130 మిలియన్ డాలర్లను అమెరికాలో జస్టిస్ 40 చొరవను ముందుకు తీసుకువెళ్ళడానికి, 30ఎక్స్30 చొరవ కింద 2030 నాటికి 30 శాతం భూమి & సముద్రాన్ని రక్షించడానికి 261 మిలియన్ డాలర్లను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంకా అమెరికా & ఆఫ్రికాలో భూ పునరుద్ధరణకు కోసం 51 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. -
లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1
Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్‌లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్. శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో మస్క్ మొదటి ప్లేస్‌లో ఉండగా.. రెండో ప్లేస్‌లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్. జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్‌గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్‌లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం. ఎటు చూసినా టాపే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్‌గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్‌లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్‌స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య. చదవండి: ట్విటర్ సీఈవో పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్ -
అమెజాన్ బాస్‌పై గర్ల్‌ఫ్రెండ్ కామెంట్స్
ఎంత బిజీ పర్సన్ అయినా తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించి తీరాలి కదా! అందుకే అలుపెరగకుండా పని చేసే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్(57) కూడా వీలుచిక్కినప్పుడల్లా తన ప్రేయసితో విహార యాత్రలకు చెక్కేస్తుంటాడు. ‘ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్ ఏదో తెలుసా?.. నువ్వు నా పక్క ఉండడం. అది చాలు.’ అంటూ బెజోస్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది బెజోస్ ప్రేయసి లారెన్ సాన్షెజ్. పెంపుడు కుక్కతో ఇద్దరూ సరదాగా కయాకింగ్ చేస్తున్న ఫొటోల్ని షేర్ చేసిందామె. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) భార్య(మాజీ) మెక్కెంజీ స్కాట్‌తో విడాకుల అనంతరం.. అమెరికా టాప్ న్యూస్ యాంకర్ అయిన లారెన్ సాన్షెజ్(51) ప్రేమాయణం నడిపిస్తున్నాడు బెజోస్. విశేషం ఏంటంటే.. ఆమెకి కూడా ఇది రెండో రిలేషన్షిప్. ఇక మెక్సికన్-అమెరికన్ అయిన లారెన్ 2019 నుంచి బెజోస్‌తో రిలేషన్లో ఉంది. జర్నలిజంలో ఎమ్మీ అవార్డు సైతం అందుకున్న లారెన్.. హెలికాప్టర్ పైలెట్ కూడా. ఆమె సంపద విలువ 30 మిలియన్ డాలర్లు. సీటెల్‌లో పక్కపక్కనే ఇల్లు ఉండడం ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం మొదలైంది . కిందటి ఏడాది జనవరిలో బెజోస్ భారత పర్యటన సందర్భంగా ఇద్దరూ కలిసి తాజ్ మహల్ దగ్గర ఫొటోలు సైతం తీయించుకున్నారు. చదవండి: తన ప్రేయసితో హీరో డికాప్రియో కబుర్లు.. జెలసీగా బెజోస్ -
Jeff Bezos: పిల్లికి బిచ్చం పెట్టడని తిట్టారు కదా! ఇప్పుడేమో ఏకంగా..
Jeff Bezos donates Million Dollars to Obama Foundation: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్నప్పటికీ.. దాతృత్వం విషయంలో మాత్రం ఆ ఇద్దరి మీద ‘పిసినారులు’ అనే ట్యాగ్ వినిపిస్తుంటుంది. వాళ్లే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు. ఛారిటీ ఫండ్ పేరుతో స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంది ఒకరైతే.. అసలు పిల్లికి బిచ్చం వేయడంటూ రెండో ఆయనపై విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ తరుణంలో నెంబర్ టూ, అమెజాన్ బాస్ అయిన జెఫ్ బెజోస్ భారీ వితరణ ద్వారా తన పెద్ద మనసు చాటుకోవడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు. 57 ఏళ్ల ఈ అమెరికన్ వ్యాపార దిగ్గజం ఏకంగా 100 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు 750 కోట్ల రూపాయలు) డొనేషన్ ప్రకటించాడు. ఆ సొమ్మును అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా నడిపిస్తున్న ఫౌండేషన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. అమెరికా పొలిటీషియన్, పౌర హక్కుల నేత జాన్ లూయిస్(దివంగత) గౌరవార్థం ఈ భారీ దానం చేస్తున్నట్లు బెజోస్ ప్రకటించారు. అంతేకాదు ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ పేరును జాన్ లూయిస్ ప్లాజాగా పేరు మార్చాలని అమెజాన్ చీఫ్, ఒబామా ఫౌండేషన్‌ను రిక్వెస్ట్ చేశారు. జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఈ దానం చాలామందికి చిన్నదే అనిపించొచ్చు.. కానీ, సాయం అందుకునే ఎందరికో ఇది పెద్దదే అని Obama Foundation ప్రతినిధి కోర్ట్నీ విలియమ్స్ వెల్లడించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంటూ.. కనీస దానాలు కూడా చేయట్లేదని, భూమి మీద సమస్యలు పట్టించుకోకుండా స్పేస్ టూరిజం మీద ఫోకస్ పెడుతున్నారంటూ మస్క్, బెజోస్లపై విమర్శలు ఉన్నాయి. బిల్ గేట్స్ లాంటి వాళ్లు సైతం వీళ్లను విమర్శిస్తూ వస్తున్నారు. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. బెజోస్ దానాలు మాత్రం భారీగానే ఉంటున్నాయి. తాజాగా ఓవైపు ఒబామా ఫౌండేషన్‌తో పాటు మరోవైపు న్యూయార్క్ యూనివర్సిటీ ఆధర్వ్యంలోని ఓ ఆస్పత్రికి సైతం 166 మిలియన్ డాలర్ల డొనేషన్ ఇవ్వడంతో ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మాక్‌కెంజీ స్కాట్‌తో జెఫ్ బెజోస్ (పాత చిత్రం) ఇక అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నాక.. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 600 మిలియన్ డాలర్లు డొనేషన్లు ఇచ్చినట్లు పక్ మీడియా ఓ కథనం ప్రచురిచింది. ఇవిగాక క్లైమేట్ ఛేంజ్ పోరాటం కోసం ఎర్త్ ఫండ్ ప్రతిజ్ఞ, నిరాశ్రయులైన వాళ్ల కోసం 2 బిలియన్ల దాకా సాయం ప్రకటించారు. బెజోస్ మాత్రమే కాదు.. ఆయన మాజీ భార్య మాక్‌కెంజీ స్కాట్ విడాకుల భరణం రూపంలో దక్కిన 8.5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు దానం చేసి సంచలనం సృష్టించింది. చదవండి: మనిషి పుట్టుక ఇక అంతరిక్షంలోనే! కానీ.. -
అందుకోసమైనా భూమిని కాపాడుకుందాం.. బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jeff Bezos On Space Human Colonies: మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందా? మనిషి మనుగడ అక్కడే కొనసాగనుందా? అప్పుడప్పుడు చుట్టపు చూపుగా భూమ్మీదకు వచ్చి చూసిపోతుంటాడా?.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికైతే అతిశయోక్తి కావొచ్చు! కానీ, భవిష్యత్తులో ఇదే జరిగి తీరుతుందని అంచనా వేస్తున్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. ఇగ్నాటియస్ ఫోరమ్ 2021లో ‘స్పేస్ ట్రావెల్, భవిష్యత్తులో దాని సామర్థ్యం’ అంశం మీద బ్లూఆరిజన్ ఓనర్ హోదాలో జెఫ్ బెజోస్ ప్రసంగించాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాక.. మనిషి పుట్టేది అంతరిక్షంలోనే!. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మనిషి బతుకుతుంటాడు. అప్పటికి భూమి ఒక పరిరక్షక గ్రహంగా ఉంటుంది. దానిని చూసేందుకు మనిషి టూరిస్టుగా మారిపోతాడు. కాబట్టి, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. ‘‘భూమి ఎంతో విలువైన గ్రహం. కోట్లలో పెరుగుతున్న జనాభాతో భూమ్మీద ఒత్తిడి ఉంటోంది. ఈ కారణంతోనే రాబోయే రోజుల్లో వృక్ష, జంతు సంపద తగ్గిపోవడం ఖాయం. కాబట్టి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు నివాసయోగ్యమైన ప్రాంతం వెతుక్కోవడంలో తప్పేముంది?. అంగారకుడి లాంటి గ్రహాల మీద జీవనం ఏర్పరుచుకోవడం వల్ల భూమి భారాన్ని తగ్గించొచ్చు. విలువైన జీవన సంపదతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు బీజం వేసిది స్పేస్ టూరిజమే’’ అంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసమే! -
జెఫ్ బెజోస్‌కు ఇక చుక్కలే..20కి పైగా దేశాల్లో అమెజాన్ ఉద్యోగుల స్ట్రైక్..!
Amazon Workers Strike on Black Friday: అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు ఆ సంస్థ ఉద్యోగులు షాక్ ఇవ్వనున్నారు. 20దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేయనున్నారు. కరోనా మహమ్మారిలోనూ రేయింబవళ్లు సంస్థకోసం పనిచేశామని, అందువల్లే జెఫ్‌బెజోస్ 200 బిలియన్ల డాలర్లతో ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారని గుర్తు చేస్తున్నారు. తాము పనికి తగ్గట్లు వేతనాన్ని ఆశిస్తున్నామని ఇప్పటికే స్ట్రైక్‌లో పాల్గొన్న ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 26న నవంబర్ 26న అమెజాన్‌లో పనిగంటలు, కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు అకౌంటబులిటీ (జవాబు దారీతానాన్ని)తో పాటు మొత్తం 25రకాల డిమాండ్లను నెరవేర్చాలని బ్లాక్ ఫ్రైడే రోజు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెలో 20 లేదా అంతకాన్నా ఎక్కువ దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు,యూనియన్ సంఘాలు, గ్రీన్‌పీస్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు స్ట్రైక్‌కు మద్దతు పలకనున్నారు. ఎక్కువ తీసుకుంటుంది.. తక్కువ ఇస్తుంది అమెజాన్‌లో పనిగంటలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనిగంటలు ఎక్కువగా ఉన్న అందుకు తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని, కానీ అలా జరగడం లేదన్నారు. ఉద్యోగులతో పని ఎక్కువ పనిచేయించుకుంటుంది. తక్కువ జీతాల్ని చెల్లిస్తుంది' అంటూ ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్ ప్రపంచానికి తెలిపేందుకు మేక్ అమెజాన్‌పే.కామ్ పేరుతో వెబ్సైట్ ను లాంఛ్ చేశారు. ఆ వెబ్ సైట్లో ఉద్యోగులు పేర్కొన్నారు. జెఫ్ జెజోస్పై ఆగ్రహం ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్‌కు మద్దతుగా పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటుందంటూ 'ప్రోపబ్లికా' నివేదిక వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం జెఫ్‌బెజోస్ 2006 నుంచి 2018 మధ్య ఎలాంటి పన్నులు చెల్లించలేదని నివేదికలో పేర్కొంది. అయితే ఈ పరిణామల నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగులు చేస్తున్న ధర్నా జెఫ్‌బెజోస్‌కు పెద్దదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..దిగ్భ్రాంతిలో ఆనంద్ మహీంద్రా -
Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది
William Sharner Dies In a Plane Crash: హలీవుడ్ యాక్టర్ స్టార్‌ట్రెక్ ఫేం విలియం శాట్నర్ ప్లేన్ క్రాష్ ప్రమాదంలో మరణించారు. న్యూజెర్సీలో వుడ్‌ల్యాండ్ ఏరియాలోని ససెక్స్ కౌంటీ దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. సింగిల్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన ప్రమాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శాట్నర్తో పాటు థామస్ ఫిషర్ కూడా చనిపోయారు. విలియం శాట్నర్ గతంలో అమెజాన్ అధినేత జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ రాకెట్లో అంతరిక్ష ప్రయాణం చేశారు. జెఫ్‌బేజోస్, శాట్నర్ల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో శాట్నర్ మరణించడం జెఫ్ బేజెస్ షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా శాట్నర్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. మరణ వార్త విని తన గుండె ముక్కలయ్యిందన్నారు జెఫ్ బేజోస్. Such a tragic loss. Warm and full of life, Glen made us laugh and lit up the room. He was a visionary, and an innovator – a true leader. Lauren and I are heartbroken and will remember the precious time we got to spend together. (1/2) pic.twitter.com/AYKCGIUQfD — Jeff Bezos (@JeffBezos) November 12, 2021