ప్రపంచంలో నెంబర్ వన్ బిలియనీర్ స్థానంలో ఉన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ అందుకున్న విరుద్దంగా తన ప్రత్యర్ధి అనుకున్న వ్యాపార రంగంలో రాణించాలంటే ఎలాంటి అలవాట్లను అలవరుచుకుంటే మంచిదో సలహా ఇవ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎలన్ మస్క్ వ్యాపారం రంగంలో సాధించిన ఘనతల గురించి..అమ్మకాలు, కొనుగోళ్ల వంటి విషయాలపై బహిరంగంగానే చర్చిస్తుంటారు. అలాంటి మస్క్ ఈ సారి రూటు మార్చారు. జెఫ్ బెజోస్ చాలా మంచోడంటూ ఆకాశానికెత్తేశాడు. కానీ ఆయన పార్టీలు చేసుకోవడం నచ్చడం లేదని కామెంట్ చేయడం సోషల్ మీడియాలో ఆసక‍్తి కరంగా మారింది.
Do you think Bezos is (generally) a good person?
— Alec 🪐🔭 (@S3XYstarship) May 28, 2022
ట్వీటర్‌లో ఒక్కోసారి యూజర్లు అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇస్తుంటుంటారు. అలా సోలార్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్న అలెక్ (alec) అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు? మంచి వారేనా' అంటూ మస్క్‌ను ప్రశ్నించాడు. అందుకు మస్క్ తన శైలిలో స్పందించారు."బెజోస్ బాగానే ఉన్నాడు. అతను ఆర్బిట్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు నిర్విరామంగా పనిచేయాలి.కానీ అలా చేయడం లేదే. పార్టీల పేరుతో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ" బెజోస్‌ను ఉద్దేశిస్తూ మస్క్ ట్వీట్ చేశాడు.
చదవండి👉 Amazon: దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో
Comments
Please login to add a commentAdd a comment