space x
-
మోదీతో మస్క్ భేటీ.. స్పేస్ఎక్స్, టెస్లాకు లైన్‌క్లియర్?
అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్‌లో సమావేశమయ్యారు. మోదీ ట్రంప్‌తో చర్చలకు ముందు మస్క్‌ను కలిశారు. ఈ సమావేశం ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార సంబంధాల భవిష్యత్తుపై ఊహాగానాలను రేకెత్తించింది.వ్యాపార సంస్కరణలకు భారత్ మద్దతుసమావేశం అనంతరం ఇరువురి మధ్య చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయని మోదీ తెలిపారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. వ్యాపార సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన(మినిమం గవర్న్మెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్)’ అనే భావనను మోదీ హైలైట్ చేశారు. మోదీతో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలను వెంటపెట్టుకొని వచ్చారు. ఆ చిన్నారులతో మోదీ కాసేపు ముచ్చటించారు.వ్యాపార ఆసక్తులు, అవకాశాలుఈ సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీకి దేశం ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నందున ఇండియాలోకి టెస్లా ఉత్పత్తులను తీసుకురావడానికి ఈ చర్చలు దారితీసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కార్మిక శాఖ అధికారుల విచారణభారత్-అమెరికా సంబంధాలపై ప్రభావంఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకారానికి మోదీ-మస్క్ మధ్య జరిగిన సమావేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్, సుపరిపాలనలో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలను కూడా ఈ చర్చల్లో ప్రస్తావించినట్లు అధికారులు చెప్పారు. -
దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ
-
చంద్రునిపైకి ‘ఘోస్ట్’ ప్రయోగం
హాథ్రోన్: అంతరిక్ష ప్రయోగాలకు ఈ మధ్యకాస్త గ్యాప్ వచ్చింది. అయితే 2025 ఆరంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్(SpaceX) తన ప్రయోగాలను మొదలుపెట్టింది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా.. ఒకే రాకెట్‌తో ఏకంగా రెండు ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ఒకేసారి రెండు మిషన్లను ప్రారంభించినట్లైంది!. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని నాసా(NASA) కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ బ్లూ ఘోస్ట్-1, ఐస్పేస్‌కు చెందిన హకుటో-ఆర్2లను ల్యాండర్లను మోసుకెళ్లింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ స్పేస్ఎక్స్ వీటిని ప్రయోగించింది. ఈ రెండు వేర్వేరు దేశాలకు మాత్రమే కాదు.. వేర్వేరు టెక్నాలజీలకు చెందినవి కూడా. ఆయా నిర్ణీత రోజుల్లో అవి చంద్రుడి మీదకు దిగనున్నాయి. ఇంతకీ ఇవి స్విచ్ఛాఫ్ అయ్యేలోపు ఎలాంటి పనులు చేస్తాయంటే.. Today’s mission is our third launch to a lunar surface and just the first of several our Falcon fleet will launch for @NASA’s Commercial Lunar Payload Services (CLPS) program this year. These missions help humanity explore the Moon, Mars, and beyond, bringing us one step closer… pic.twitter.com/Go2yUccFb3— SpaceX (@SpaceX) January 15, 2025ఘోస్ట్ ఏం చేస్తుందంటే.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కమర్షియల్ లూనార్ ప్లేలోడ్ సర్వీసెస్(CLPS)లో భాగంగా బ్లూ ఘోస్ట్-1ను రూపొందించారు. చంద్రుడిపై ఉన్న అతిపెద్ద పరివాహక ప్రాంతం మేర్ క్రిసియంలో ఇది దిగి.. పరిశోధనలు చేయనుంది. ఈ ల్యాండర్ చంద్రుడి మీదకు చేరుకోవడానికి 45 రోజలు టైం పడుతుంది. ఇది చంద్రుడిపై స్వతంత్రంగానే ల్యాండ్ అయ్యి.. రెండువారాలపాటు సైంటిఫిక్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తుంది. అలాగే.. పది అడుగుల లోతులో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తుంది. అలాగే రెగోలిథ్(అక్కడి భూపొర)ను సేకరిస్తుంది. భూమికి చందద్రుడికి మధ్య లేజర్ కిరణాల సాయంతో దూరాన్ని కొలుస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పది సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. ఇది చంద్రుడిపై నిర్వహిస్తున్న అత్యాధునిక పరిశోధనగా నాసా చెబుతోంది. హకుటో చేసే పని ఇదే.. జపాన్‌కు చెందిన ఐస్పేస్ కంపెనీ హకుటో ఆర్2 అనే రీసైలెన్స్ ల్యాండర్‌ను రూపొందించింది. ఇది చంద్రుడి ఉత్తర గోళార్థంలోని మేర్ ఫ్రిగోరిస్లో అడుగుపెట్టనుంది. ఇందుకోసం ఈ ల్యాండర్‌కు 4 నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. కింది ఏడాది ఏప్రిల్‌లో ఐస్పేస్ ఇదే తరహా ప్రయోగాన్ని నిర్వహించినప్పటికీ.. సెన్సార్లు పనిచేయకపోవడంతో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయ్యింది. టెనాషియస్ అనే మైక్రోరోవర్ను హకుటో-ఆర్2 చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగిస్తుంది. అది అక్కడి రెగోలిత్‌ను సేకరిస్తుంది. చంద్రుడి మీద పరిశోధనలకు అంతరిక్ష పరిశోధన సంస్థలే కాదు.. ప్రైవేట్ కంపెనీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాన్వేషణలో మున్ముందు మరింత అత్యాధునిక ప్రయోగాలు జరిగే అవకాశం లేకపోలేదు. -
స్పేస్ ఎక్స్‌తో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్
అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ స్పేస్ఎక్స్తో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం జీశాట్20 (GSAT N2) అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్ సోమనాథ్.. బృందానికి అభినందనలు తెలియజేశారు. Liftoff of GSAT-N2! pic.twitter.com/4JqOrQINzE— SpaceX (@SpaceX) November 18, 2024స్పేస్ఎక్స్ ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ అనేది తెలిసిందే. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. జీశాట్20 బరువు సుమారు 4,700 కేజీలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంఛ్ వెహికల్స్ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఆ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్20ను నింగిలోకి మోసుకెళ్లింది.Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S— SpaceX (@SpaceX) November 18, 2024అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. అంతేకాదు.. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా ఈ జీశాట్20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇదీ చదవండి: మన బాహుబలికి అంతబలం లేదంట! -
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్‌కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్‌తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్‌కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'స్పేస్ ఎక్స్' రికార్డ్ బ్రేకింగ్
-
నింగిలోనే వ్యోమగాములు.. భూమిపైకి ‘స్టార్‌లైనర్’
అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్‌ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్‌లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో భూమిపై దిగింది.అసలు స్టార్‌లైనర్‌కు ఏమైంది..?బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్‌లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది. నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.వ్యోమగాముల తిరిగి రాక ఎలా..వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత వచ్చేది అప్పుడేనా..స్పేక్స్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్ఎస్కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్‌లో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది. -
సునీతా విలియమ్స్ రాక ఎప్పుడు..? ‘మస్క్’ వైపు ‘నాసా’ చూపు
కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్‌టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్‌ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్‌తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్‌లైనర్‌లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.దీంతో ఈలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్‌లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్‌లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్‌లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు. -
మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ డీసీ : స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్ఎక్స్ ఇంటర్న్ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్ఎక్స్కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్ మస్క్ తన తీరుతో టెస్లా,స్పెస్ఎక్స్లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
Florida: ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా
ఫ్లోరిడా: అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు(ఐఎస్ఎస్) ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఎండీవర్’ ప్రయాణం శనివారం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ప్రయాణం వాయిదా పడిందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ వెల్లడించింది. పై గాలులు వీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఆదివారం రాత్రి రాకెట్‌ను నింగిలోకి పంపించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లో క్రూ డ్రాగన్ ఎండీవర్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ ప్రయాణం ఇప్పటికే ఫిబ్రవరి22న తొలిసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ కంపెనీ 2020 నుంచి వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపిచే విషయంలో నాసాకు వాణిజ్యపరమైన సేవలందిస్తోంది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌తో ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ త్వరలో పోటీపడనుంది. ఇదీ చదవండి.. అమెరికాలో భారతీయుని హత్య -
భవిష్యత్ తరాలు బాగుండేలా..ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సదుద్దేశంతో త్వరలో మరిన్ని స్కూల్స్, కాలేజీలు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ‘ది ఫౌండేషన్’ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థకు 100 మిలియన్ల విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ ప్రాథమిక విద్య నుంచి హైస్కూల్స్ వరకు వినూత్న పద్దతుల్లో విద్యను అందించేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెట్లపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. 50 మంది విద్యార్ధులతో ప్రారంభించి ఎలాన్ మస్క్ ట్యాక్స్ ఫైలింగ్ ఆధారంగా బ్లూమ్‌బెర్గ్ నివేదికను విడుదల చేసింది. అస్టిన్, టెక్సాస్‌లలో నిర్మించనున్న పాఠశాలలను దాదాపు 50 మంది విద్యార్థులతో ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. ఒక వేళ విద్యార్ధులకు ప్రత్యేకంగా ట్యూషన్లు పెట్టాలనుకుంటే అందుకు వారికి అయ్యే ఖర్చును స్వయంగా భరించనున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు కోసం ది ఫౌండేషన్ ద్వారా స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్ధులకు అత్యున్నత స్థాయిలో విద్యను అందించి.. యూనివర్సిటీ స్థాయిలో తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మస్క్ ట్యాక్స్ ఫైలింగ్‌లో తెలిపారు. ఇక తాను ఏర్పాటు చేయనున్న స్కూల్స్, కాలేజీలకు గుర్తింపు కోసం అమెరికా ప్రభుత్వ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన సదరన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ స్కూల్స్ కమీషన్ (Sacscoc) తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడా? ఎలాన్ మస్క్ విజినరీ ఆంత్రప్రెన్యూర్. స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓగా ఉన్న ఆయన 2014లో ఆస్ట్రా నోవా స్కూల్ పేరుతో తన సంస్థల్లో పనిచేసే పిల్లలకు విద్యను అందిస్తున్నారు. సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెప్పి యూనిక్‌గా చదువు చెప్పిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్ గత కొంతకాలంగా విద్యా వ్యవస్థపై అసంతృప్తని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్ధుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయంటూ ఎక్స్.కామ్‌లో వరుస ట్వీట్లు చేశారు. తాజాగా, ఆయనే మరిన్ని స్కూల్స్,కాలేజీలు నిర్మించేందుకు నడుం బిగించారు. సింథసిస్ స్కూల్ సైతం ఎలాన్ మస్క్, జోష్ డాన్లు కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్‌ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్‌లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు నేర్పిస్తారు. గతంలో స్పేస్ఎక్స్ కంపెనీలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్‌తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు. మూడేళ్ల క్రితం ఈ స్కూల్లో వరంగల్‌కు చెందిన అనిక్‌పాల్ సీటు సంపాదించాడు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రిని కలిసిన ఎలాన్ మస్క్!
స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఏడేళ్ల తర్వాత తన తండ్రి ఎర్రోల్ మస్క్‌ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గరుయ్యారంటూ పలు నివేదకలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ గత వారం స్పేస్ఎక్స్కి చెందిన స్టార్‌షిప్‌ను లాంచ్ చేశారు. టెక్సాస్‌లోని బోకా చికాలో స్టార్ట్షిప్ ప్రారంభోత్సవానికి ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ హాజరయ్యారు. ఎర్రోల్ మస్క్‌తో పాటు తన మాజీ భార్య హైడ్, మనవరాలు కోరాను వెంటపెట్టుకుని వచ్చారు. 2016లో చివరి సారిగా ఎలాన్ మస్క్ తన తండ్రి ఎర్రోల్ మస్క్‌ను చివరిసారిగా 2016లో కలుసుకున్నారు. తన తమ్ముడు కింబాల్ మస్క్‌తో కలిసి తండ్రి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకోవడం మస్క్ కుటుంబంలో పండుగ వాతావారం నెలకొందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. సంతోషం.. అస్సలు ఊహించలేదు ‘స్టార్‌షిప్ లాంచ్ కోసం ఎర్రోల్ మస్క్‌ని ఆహ్వానించడం ఆశ్చర్యానికి గురి చేసింది. కుటుంబం మొత్తం ఏడ్చేసింది. ఇది చాలా ఎమోషనల్. ఎర్రోల్ మస్క్ .. ఎలాన్ మస్క్‌ని చూసి చాలా సంతోషించాడు. ఎలాన్ మస్క్ తన తండ్రిని చూసి చాలా సంతోషంగా కనిపించారు’ అని ఎర్రోల్ మస్క్ మాజీ భార్య హెడీ చెప్పారు. భోజనం టేబుల్ వద్ద తండ్రి-కుమారులిద్దరూ కుర్చుని మాట్లాడుకున్నారు. సమయం తెలియలేదని గుర్తు చేసుకున్నారు. తండ్రంటే ఎలాన్ మస్క్‌కు తన తండ్రి ఎర్రోల్ మస్క్ అంటే అస్సలు నచ్చదు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్‌గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీరక సుఖ కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎర్రోల్ తొలిసారి ఎలాన్ మస్క్ తల్లి మేయల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత మేయల్‌కు విడాకులిచ్చి అప్పటికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె జానాకు ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వయస్సు వ్యత్యాసం 40ఏళ్లు. స్పేస్ఎక్స్ ప్రయోగం ఫెయిల్ స్పేస్ఎక్స్ గత వారం లాంచ్ చేసిన ఈ స్టార్ షిప్ ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ తయారు చేసిన రాకెట్లలో ఇదే పెద్దది. స్టార్‌షిప్‌లోని రెండు దశలను కలిపితే, రాకెట్ 397 అడుగుల (121 మీటర్లు) పొడవు ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 90 అడుగుల ఎత్తును అధిగమించింది. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
చంద్రయాన్-3పై ఎలన్ మస్క్ రియాక్షన్
చంద్రయాన్-3పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవేళ.. ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. చంద్రయాన్-3 బడ్జెట్.. హాలీవుడ్ ఇంటర్స్టెల్లార్ చిత్రం బడ్జెట్ కంటే తక్కువనే ఓ నెటిజన్ ట్వీట్‌కు ఎక్స్(ట్విటర్)లో మస్క్ బదులిచ్చారు. ఎలన్ మస్క్ సైతం స్పేస్ఎక్స్ అనే స్పేస్ సంస్థకు యాజమాని అనే సంగతి తెలిసిందే. Good for India 🇮🇳! — Elon Musk (@elonmusk) August 22, 2023 దాదాపు ఏడు వందల కోట్ల ఖర్చుతో(75 మిలియన్ల డాలర్ల) చంద్రయాన్-3 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మిషన్ కోసం ఖర్చు చేసిన బడ్జెట్‌ను ఓ నెటిజెన్ హాలీవుడ్ సినిమాతో పోల్చాడు. ఇంటర్స్టెల్లార్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టినట్లు ఓ నెటిజన్ అన్నాడు. ఇదే చంద్రయాన్ ప్రయోగాన్ని ఆమధ్య ఓ నెటిజెన్ ప్రభాస్ ఆదిపురుష్ బడ్జెట్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. ఇంటర్స్టెల్లార్ చిత్ర నిర్మాణం కోసం దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఆదిపురుష్ కోసం 700 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా. అయితే లోబడ్జెట్ చంద్రయాన్‌పై మస్క్ మాత్రం ఇది మంచి పరిణామమే అన్నట్లుగా ఆయన రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ జోడించారు. ఇక స్పేస్ఎక్స్ ద్వారా అంతరిక్ష టూరిజంలో క్రియాశీలకంగా ఉన్న ఎలన్ మస్క్.. అంగారకుడితో పాటు చంద్రుడిపైకి మనిషిని పంపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. -
చంద్రుడి మీదకు మనుషులు.. నాసా కీలక ప్రకటన!
చంద్రుని వద్దకు మనుషుల్ని పంపేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్న నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్న నలుగురు ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ప్రారంభించింది. ఈ శిక్షణ 18 నెలల పాటు కొనసాగనుందని నాసా తెలిపింది. 51 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపిస్తున్న నాసా ఆర్టెమిస్ 2పై పనిచేస్తుంది. ఇందులో భాగంగా జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లును సురక్షితంగా తీసుకెళ్లే ఓరియన్ క్యాప్య్సూల్, స్పేస్ లాంచ్ సిస్టం గురించి ఈ 18 నెలల కఠిన శిక్షణలో వివరించనుంది. వీటితో పాటు సిస్టమ్‌లను ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం కూడా నేర్చుకుంటారు. ఆరోహణ, కక్ష్య, తీరం, ఎంట్రీ ఫేజ్‌లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి’ అనే అంశం గురించి ఆస్ట్రోనాట్స్ వీరికి వివరించనుంది. View this post on Instagram A post shared by NASA (@nasa) -
అయ్యో! ఇది అసలు ఊహించలేదు.. ట్విటర్ చీఫ్‌గా తప్పుకోనున్న ఎలాన్ మస్క్?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్వీట్ చేసినా సరే అది సంచలనంగా మారుతుంది. అనుహ్య పరిణామాల నడుమ మస్క్ ట్విటర్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ట్వీటర్ సంస్థలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు మస్క్. మరో వైపు తన నిర్ణయాలకు సంబంధించి ట్విటర్ పోలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వాటిలో కొన్నింటిని ఈ పోలింగ్ ద్వారానే తీసుకోవడం గమనార్హం. తాజాగా ఎలాన్ మస్క్ మరో సంచలన ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ట్విటర్ నుంచి తప్పుకోమంటారా? ఎలాన్ మస్క్ ఇటీవల ఈ పేరు వార్తల్లో విపరీతంగా వినపడుతోంది. ట్విటర్ సీఈఓగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి అందులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ సంస్థ భవిష్యత్తుపై నీలనీడలు కమ్ముకుంటున్నాయి. ఇదిలా ఉండగాఈ ఏడాదిలో ఏకంగా 107 బిలియన్ డాలర్లు అంటే రూ.8.84 లక్షల కోట్లను కోల్పోయి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు మస్క్. ఇన్నీ అనుహ్య సమస్యలతో సతమవుతున్న మస్క్ తాజాగా మరో ట్వీట్‌తో నెటిజన్ల ముందుకు వచ్చారు. అందులో .. తాను ట్విటర్ చీఫ్‌గా కొనసాగాలా వద్దా అని పోలింగ్ పెట్టారు. వచ్చే ఫలితాలు ఏవైనా తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ పోలింగ్‌లో దాదాపు 58 శాతం మంది మస్క్ చీఫ్‌గా తప్పుకోవాలని ఓటు వేశారు. దీనిపై స్పందిస్తూ కొందరు నెటిజన్లు అయ్యా ఎలాన్ మస్క్ చేసిన అరాచకాలు చాలు ఇక దయ చెయ్ అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ట్వీటర్‌తో ఆటలాడకు తొందరగా తప్పుకోవాలని కామెంట్ చేశాడు. అయితే ఈ ఫలితాన్ని మస్క్ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. Should I step down as head of Twitter? I will abide by the results of this poll. — Elon Musk (@elonmusk) December 18, 2022 చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇండియన్ టెకీలకు తీపికబురు అందించారు. తాజా అంచనాలు ఈ ఊహాగానాలను బలాన్నిస్తున్నాయి. ట్విటర్ కొత్త నియామాకాల్లో ఎక్కువగా భారతదేశ ఇంజనీర్లను నియమించాలని మస్క్ యోచిస్తున్నారట. ట్విటర్ ఇంటర్నెల్ సమావేశంలో, ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీ స్టాక్‌ను మొదటి నుండి నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మస్క్ ఇండియన్ ఇంజనీర్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) ట్విటర్లో ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియకు ముగింపు పలికిన మస్క్ ఇపుడిక మరింత మందిని నియమించుకోవాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువమందిని నియమించుకునే తన ప్రణాళికలను వెల్లడించారు. సంస్థ అంతర్గత సమావేశంసందర్భంగా, జపాన్, ఇండియా, ఇండోనేషియా. బ్రెజిల్‌లలో ఇంజనీరింగ్ బృందాలను నియమించుకోనున్నారని ది వెర్జ్ రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం భారత్‌లోనూ ఇంజినీరింగ్ బృందాల ఏర్పాటును మస్క్ సూచనప్రాయంగా వెల్లడించారు. మస్క్ ఎలాంటి ఇంజనీర్లు లేదా ఎలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించు కోవాలనుకుంటున్నారో నివేదిక పేర్కొనలేదు. అయితే సాఫ్ట్వేర్ రాయడంలో నిపుణుల అవసరాన్ని నొక్కి చెప్పిన మస్క్ వారికే 'అత్యున్నత ప్రాధాన్యత' అని ప్రకటించారు. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) ఉద్యోగులకు కొత్త పరిహారం, ప్రధాన కార్యాలయ మార్పులేదు అంతేకాదు తొలగించిన ఉద్యోగులకు అందించే పరిహారంపై కూడా మస్క్ మాట్లాడారు. స్పేస్ఎక్స్ కంపెనీలో మాదిరిగానే వారికివ్వాల్సిన పరిహారాన్ని స్టాక్ ఆప్షన్లలో చెల్లిస్తామనీ, ప్రతిసారీ ఆ స్టాక్లను లిక్విడేట్ చేయడానికి అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్ ట్విటర్ పై మస్క్ ప్రశంసించిన ట్విటర్ అమెరికా ట్విటర్ సెంట్రిక్ కాదని వ్యాఖ్యానించారు. యూఎస్‌తో పోలిస్తే తక్కువ జనాభా ఉన్నప్పటికీ జపాన్‌లో యాక్టివ్ యూజర్ల సంఖ్య దాదాపు అదే రేంజ్లో ఉందని పేర్కొన్నారు. ట్విటర్ తన ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుండి టెక్సాస్‌కు తరలింపు వార్తలను కూడా మస్క్ ఖండించారు. ట్విటర్లో ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతున్న తరుణంలో చాలా తప్పులు ఉంటాయి కానీ కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయని మస్క్ ట్వీట్ చేయడం గమనార్హం. అక్టోబరులో మస్క్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ట్విటర్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 7,500 ఉండగా, ప్రస్తుతం 2,750 మందికి చేరింది. కాగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అలాగే సంస్థలో సగంమంది ఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. దీనికి తోడు ఎక్కువ పనిగంటలు పనిచేస్తారా, రాజీనామా చేస్తారా అన్న అల్టిమేటంపై అనూహ్యంగా స్పందించిన దాదాపు 1200 మంది ఉద్యోగులు ట్విటర్‌కు బైబై చెప్పారు. కాగా నెలకు 8 డాలర్లతో బ్లూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 29నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సేవను మస్క్ మరోసారి వాయిదా వేశారు. ట్విటర్ డీల్ తరువాత మస్క్‌కు భారత సంతతికి చెందిన మాజీ ట్విటర్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్ కృష్ణన్ ప్రధాన సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగామరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను అసలు ఏం కంపెనీకి సీఈవోగా ఉండాలని కోరుకోవడం లేదని ఈ క్రమంలోనే త్వరలోనే ట్విటర్‌కు కొత్త సీఈవోను ఎంపిక చేయనున్నామని ప్రకటించారు. అంతేకాదు మాజీ టెస్లా బోర్డు సభ్యుడు జేమ్స్ ముర్డోక్ ప్రకారం, మస్క్ టెస్లా సీఈవోగా కూడా వైదొలగాలని కూడా ఆలోచిస్తున్నారు. (ElonMusk మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్) ప్రపంచంలోని అత్యంత విలువైన వాహన తయారీ సంస్థ టెస్లా, రెండవ అతిపెద్ద రక్షణ కాంట్రాక్టర్ స్పేస్ఎక్స్, తాజాగా అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ట్విటర్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఎలాన్ మస్క్ బుధవారం డాలావర్ కోర్టుకు తెలిపారు.టెస్లా సీఈవోగా ఉన్నందుకు 2018లో 56 బిలియన్ డాలర్లు ప్యాకేజీ చెల్లింపులపై వచ్చిన ఆరోపణలపై విచారణ సందర్భంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలకు సక్సెస్‌ఫుల్‌గా నడిపించాల్సిన బాధ్యత తనదేననీ, అలాగే కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కంపెనీ ఇంజనీర్ల పాత్ర చాలా ఎక్కువ అని ప్రకటించారు. ముఖ్యంగా టెస్లాను విజయపథంలో నడిపించేందుకు విశేష కృషి చేసినందుకే ఆ చెల్లింపులను తన ‘పే’ను సమర్ధించుకున్నారు మస్క్. అలాగే తన ట్విటర్ బాధ్యతలు తాత్కాలికమేనని మస్క్ కోర్టుకు తెలిపారు. త్వరలోనే కొత్తవారికి బాధ్యతలను అప్పగిస్తానని ఈ వారంలో సంస్థాగత పునర్నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. టెస్లా వాటాదారు రిచర్డ్ జే టోర్నెట్టా పిటిషన్‌తోపాటు, లాస్ ఏంజిల్స్ టెస్లా కారు క్రాష్ కేసు విచారణ సందర్భంగా ఎలన్ మస్క్ ఈ ప్రకటన చేశారు. (Sandhya Devanathan: మెటా ఇండియా కొత్త బాస్, ప్రత్యేకతలివే!) -
భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చర్యలు కాస్త వింతగా ఉండడంతో పాటు నెట్టింట వైరల్‌గా కూడా మారుతుంటాయి. ఇక తాజాగా ఆయన హస్తగతం చేసుకున్న ప్రముఖ ట్విటర్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాలా స్లోగా ఉంది అనుహ్య పరిణామాల మధ్య ట్విటర్ సీఈవోగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయిలో ట్విటర్ సిబ్బంది తొలగింపు, బోర్డు మేనేజ్మెంట్ మార్చడం వంటివి చేయగా తాజాగా ట్విటర్ భారత్‌తో పాటు పలు దేశాల్లో చాలా నెమ్మదిగా ఉందంటూ ఏకంగా షాక్ ఇచ్చాడు. ఒక సీఈవో తన కంపెనీ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. "భారతదేశం, ఇండోనేషియా & అనేక ఇతర దేశాలలో ట్విట్టర్ చాలా నెమ్మదిగా ఉంది. ఇది వాస్తవం. హోమ్లైన్ ట్వీట్లను రిఫ్రెష్ చేయడానికి 10 నుండి 15 సెకన్ల సమయం సాధారణం. కానీ ముఖ్యంగా (Android phone) యాండ్రాయిడ్ ఫోన్లలో కొన్నిసార్లు, ఇది అస్సలు పని చేయడం లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే బ్యాండ్‌విడ్త్/లేటెన్సీ/యాప్ కారణంగా ఎంత ఆలస్యం అవుతుందని’ ఈ ట్విట్టర్ కొత్త యజమాని ట్వీట్ చేశారు. వీటితో పాటు.. యుఎస్‌లో అదే యాప్ రిఫ్రెష్ కావడానికి ~2 సెకన్లు పడుతుంది (చాలా ఎక్కువ సమయం), కానీ బ్యాచింగ్/వెర్బోస్ కామ్ల కారణంగా భారతదేశంలో ~20 సెకన్లు పడుతుందని తెలిపారు. మరోక ట్విట్లో.. ‘చాలా దేశాల్లో ట్విట్టర్ స్లో అయినందుకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. హోమ్ టైమ్‌లైన్ (sic) రెండర్ కోసం వెయ్యికంటే ఎక్కువ పూర్లీ బ్యాచ్డ్ RPCలను (Remote Procedure Call) యాప్ చేస్తోందని’ పోస్ట్ చేశారు. కాగా RPC అంటే డిస్ట్రిబ్యూటెడ్, క్లైంట్ సర్వర్ బోస్డ్ అప్లికేషన్స్ కన్స్ట్రక్షన్ కోసం వాడే పవర్ఫుల్ టెక్నిక్. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
ఎలాన్ మస్క్ అనాలోచిత నిర్ణయం, ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ నిలిపివేత!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ బ్లూటిక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ విషయంలో వెనక్కి తగ్గారు. పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కొనుగోలు అనంతరం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు సంస్థను మరిన్ని ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఇప్పటికే ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగుల్ని తొలగించిన మస్క్ నాలుక్కరుచుకున్నారు. పింక్ స్లిప్ జారీ చేసిన ఉద్యోగుల్లో కొంతమంది తిరిగి కార్యాలయాలకు తిరిగి రావాలని కోరారు. తాజాగా బ్లూటిక్ వెరిఫికేషన్‌లో అదే తరహా నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే ఎవరికైనా బ్లూట్ టిక్ వెరిఫికేషన్‌ను బ్యాడ్జీని అందిస్తామని కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఒరిజనల్ సంస్థలు, వ్యక్తుల పేర్లమీద కొంతమంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని, వాటి వల్ల ఏ అకౌంట్ ఒరిజినల్, ఏ అకౌంట్ డూప్లికేట్ అనేది గుర్తించడం కష్టంగా మారింది. అందుకే పెయిడ్ సబ్ సబ్స్క్రిప్షన్ మోడల్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, దివాలా తీసేందుకు దగ్గరగా ఉన్న ట్విటర్‌ను.. మస్క్ తన నిర్ణయాలతో ఇంక ఎన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తారేమోనని షేర్ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్ .. ఆ ఫొటోకు వేలంలో ఊహించని ధర.. ఎంతంటే?
స్పేస్ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన షేర్ చేసే పోస్ట్‌ల నుంచి వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల వరకు ప్రతీది వైరల్ గా మారి వార్తల్లోకెక్కుతుంది. చివరికి మస్క్ టీనేజ్ ఫొటోలను వేలం వేయగా వాటికి కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే వాటి కోసం జనాలు ఎగబడి మరీ లక్షలు పోసి కొన్నారు. మస్క్ టీనేజ్ ఫోటోలకి భారీ డిమాండ్.. ఏకంగా కోటి! ఎలాన్ మస్క్పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జెన్నిఫర్ గ్విన్ అనే యువతితో డేటింగ్లో ఉన్నాడు. ఇతర ప్రేమికుల మాదిరిగానే మస్క్ కూడా వారి జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఆమెకు కొన్ని ఫోటోలు, ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్షిప్లో లేరు, ఎవరిపనుల్లో వారు బిజిగా ఉన్నారు. తాజాగా మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వైన్ వీళ్లకు సంబంధించిన ఫొటోలను, వస్తువులను ఆన్లైన్లో వేలానికి ఉంచింది. అందులో 18 ఫోటోలు, మస్క్ చేతితో వ్రాసిన పుట్టినరోజు కార్డు, తనకు బహుమతిగా ఇచ్చిన బంగారు హారాన్ని ఉంచింది. బోస్టన్‌కు చెందిన ఓ సంస్థ వేలం వేసింది. మస్క్, జెన్నిఫర్ కలిసి ఉన్న ఫోటో ఏకంగా రూ.1.3 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోటోను రివీల్ చేయలేదు. కాగా ఇంత మొత్తానికి ఆ ఫోటో అమ్ముడువుతుందని ఎవరూ ఊహించలేదట. మస్క్ గిఫ్ట్‌గా ఇచ్చిన నెక్లెస్‌కు రూ. 40 లక్షలు, బర్త్‌డే కార్డుకు రూ.13 లక్షలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌తో లీగల్ వార్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో ట్విటర్‌ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపిన మస్క్, ఆపై పలు కారణాల వల్ల ఈ డీల్ నుంచి తప్పుకున్నారు. SOLD: Elon Musk’s ex-girlfriend sold photos and mementos for more than $165,000 @RRAuction.https://t.co/NNGUJwtBDd#Auction #Consign #RemarkableResults pic.twitter.com/QTbjbefU5Q — RR Auction (@RRAuction) September 15, 2022 చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు! -
వైరల్: ఏంటి ఎలాన్ మస్క్ సడన్‌గా అంత మాట.. షాక్‌లో నెటిజన్లు!
ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసిన అది సెన్సేషన్, ఏం చెప్పిన అది వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ట్విటర్ లాంటి దిగ్గజ సంస్థతో కుదర్చుకున్న డీల్ నుంచి తప్పుకునేంత సాహసం చేయాలన్నా, ఉక్రెయిన్ రష్యా వార్‌పై కామెంట్ చేసినా, అది మస్క్‌కి మాత్రమే సాధ్యం. వ్యాపార పరంగానే ఎంత బిజీగా ఉన్నా ఈ కుబేరుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ చమత్కారమైన ట్వీట్లతో తన మిలియన్లు ఫాలోవర్లను నవ్విస్తూ ఉంటాడు. తాజాగా మస్క్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎలాన్ మస్క్ డబ్బులపై తన అభిప్రాయం తెలిపారు. అందులో.. ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం డబ్బు అని కొందరు భావిస్తారు. అంతేకాకుండా ఇదే విషయంలో కాస్త గందరగోళానికి కూడా గురువుతారు. డబ్బు అనేది కేవలం వస్తు సేవల మార్పిడికి వినియోగించి ఓ డేటాబేస్ మాత్రమేనని, ప్రత్యేకించి చెప్పాలంటే మనీకి ఎలాంటి పవర్ లేదని అన్నారు. ఈ వీడియో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఎంటీ మస్క్ అంత మాట అన్నావని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు నిజం చెప్పాడని కామెంట్ చేశారు. ఎలన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి ఆపై పలు కారణాల వల్ల ఈ డీల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ట్విటర్ యాజమాన్యం.. మస్క్‌కు వ్యతిరేకంగా కోర్ట్‌ను ఆశ్రయించింది. కోర్టులో మస్క్‌కి ప్రతికూలంగా.. ఫిబ్రవరిలో 11రోజుల పాటు విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని తిరస్కరించడంతో పాటు అక్టోబర్‌లో 5రోజుల పాటు విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. "People get confused sometimes they think an economy is money. Money is a database for exchange of goods & services. Money doesn't have power in & of itself. The actual economy is goods & services"- @elonmusk pic.twitter.com/TzquCRWNqb — DogeDesigner (@cb_doge) July 23, 2022 చదవండి: Airtel Sunil Mittal Salary: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
కోర్టులో ట్విటర్ రచ్చ.. అదిరిపోయే ప్లాన్ వేసిన ఎలాన్ మస్క్!
టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ వెర్సస్ ట్విటర్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుట్లో ముగిసేలా లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే డైలీ సీరియల్లా సాగతీతే కనిపిస్తోంది. వారిద్దరి మధ్య డీల్ రద్దు కావడంతో ఇటీవల ట్విటర్ కోర్టు మెట్లేక్కి త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరగా , మస్క్ మాత్రం విచారణ వాయిదా వేయాలని కోరుతున్నాడు. ట్విటర్ ఏమంటోంది.. ‘44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన ఎలాన్ మస్క్ ఇటీవల ఆ డీల్ నుంచి తప్పుకున్నారు. ఒప్పందంలోని నిబంధనలను మస్క్ ఉల్లంఘించారు. కనుక ముందుగా అనుకున్న ప్రకారమే ఈ డీల్‌ను పూర్తి చేయాలని’ ట్విట్టర్ తన దావాలో కోరింది. విచారణను కూడా త్వరగా పూర్తి చేయాలని కోర్టును కోరింది. మస్క్ తరపు న్యాయవాది వాదన ఏంటి? దీనికి మస్క్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు అభ్యర్థనలను కోర్టు ముందు ఉంచారు. ఆయన మాట్లాడుతూ.. ట్విటర్ కావాలనే విచారణ త్వరగా పూర్తి చేయాలని అంటోంది. ఎందుకుంటే విచారణ త్వరగా పూర్తి చేసే ప్రక్రియలో ట్విటర్ తన తప్పలను కప్పిపుచ్చకోవచ్చని భావిస్తోందని ఆయన ఆరోపించారు. ట్విటర్లో ఉన్న నకిలీ, స్పామ్ అకౌంట్లును కనిపెట్టేందుకు కాస్త సమయం పడుతుందని అసలు నిజాలు బయటపడాలంటే కనీసం ఐదు నుంచి ఆరు నెలలు సమయం పడుతుందని తెలిపారు. అందుకు విచారణను 2023 వరకు వాయిదా వేయాలని మస్క్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అమెరికా మీడియా కథనాలు.. ఎలాన్ మస్క్ కావాలనే విచారణ ఆలస్యం చేయాలని చూస్తున్నాడని, దీని ద్వారా డీల్‌ను ఆటోమెటిగ్గా రద్దు అయ్యేలా చేయడమే ఆయన ప్రధాన వ్యూహమని అమెరికా మీడియాలో కధనాలు వెలువడ్డాయి. చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్! -
'జీతాలిచ్చే వాళ్లపై జోకులేస్తే ఇలాగే ఉంటది', ఎలన్ మస్క్‌కు భారీ ఝులక్!
టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు ఝలక్ ఇచ్చేలా ఉద్యోగులు తమని అక్రమంగా విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు లేబర్ కోర్ట్‌ను ఆశ్రయించుకోవచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే టెస్లా సంస్థ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల టెస్లా ఉద్యోగులు ఆ సంస్థ తీరును, సీఈవో ఎలన్ మస్క్‌ను విమర్శిస్తూ ఉద్యోగులు ఇంటర్నల్ చాట్ సిస్టం (ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ)లో దుమ్మెత్తి పోశారు. బహిరంగంగా ఓపెన్ లెటర్‌ను విడుదల చేశారు. ఆ లెటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్ ఉద్యోగుల్ని (ఎంత మంది అనేది స్పష్టత లేదు) తొలగించారు. ఈ తొలగింపుతో ఉద్యోగులు మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఉద్యోగుల పట్ల ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో టెస్లా తొలగించిన ఉద్యోగులు నేషనల్ లేబర్ రిలేషన్ బోర్డ్ (ఎన్ఎల్ఆర్బీ)లో పిటిషన్ దాఖలు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయంపై న్యాయవ్యవస్థకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. ఎన్ఎల్ఆర్బీలో టెస్లాకు వ్యతిరేకంగా ఉద్యోగులు పిటిషన్ దాఖలు ఆ సంస్థకు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించారని అపవాదుతో పాటు తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదే అంశంపై సీటెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షార్లెట్ గార్డెన్ మాట్లాడుతూ..కోర్ట్లు కేసు ఫైల్ అయితే టెస్లా సంస్థ ఆకస్మికంగా ఉద్యోగుల్ని ఎందుకు తొలగించిందో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. అలాంటిది ఏం లేదు! మస్క్‌ను విమర్శించినందుకే ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న ఆరోపణలపై టెస్లా ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించిన ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపారు. ఎందుకు వారి వల్ల సంస్థకు నష్టంతో పాటు..సాధారణ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు ఇలాంటి అనాలోచిత చర్యలు సరైనవి కావని ఉద్యోగులకు పంపిన లేఖలో గ్విన్ షాట్వెల్ పేర్కొన్నారు. చదవండి👉టెస్లా ఉద్యోగులు: ఎలన్ మస్క్ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం! -
‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’!
ప్రపంచంలో నెంబర్ వన్ బిలియనీర్ స్థానంలో ఉన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ అందుకున్న విరుద్దంగా తన ప్రత్యర్ధి అనుకున్న వ్యాపార రంగంలో రాణించాలంటే ఎలాంటి అలవాట్లను అలవరుచుకుంటే మంచిదో సలహా ఇవ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎలన్ మస్క్ వ్యాపారం రంగంలో సాధించిన ఘనతల గురించి..అమ్మకాలు, కొనుగోళ్ల వంటి విషయాలపై బహిరంగంగానే చర్చిస్తుంటారు. అలాంటి మస్క్ ఈ సారి రూటు మార్చారు. జెఫ్ బెజోస్ చాలా మంచోడంటూ ఆకాశానికెత్తేశాడు. కానీ ఆయన పార్టీలు చేసుకోవడం నచ్చడం లేదని కామెంట్ చేయడం సోషల్ మీడియాలో ఆసక్తి కరంగా మారింది. Do you think Bezos is (generally) a good person? — Alec 🪐🔭 (@S3XYstarship) May 28, 2022 ట్వీటర్లో ఒక్కోసారి యూజర్లు అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇస్తుంటుంటారు. అలా సోలార్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్న అలెక్ (alec) అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు? మంచి వారేనా' అంటూ మస్క్‌ను ప్రశ్నించాడు. అందుకు మస్క్ తన శైలిలో స్పందించారు."బెజోస్ బాగానే ఉన్నాడు. అతను ఆర్బిట్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు నిర్విరామంగా పనిచేయాలి.కానీ అలా చేయడం లేదే. పార్టీల పేరుతో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ" బెజోస్‌ను ఉద్దేశిస్తూ మస్క్ ట్వీట్ చేశాడు. చదవండి👉 Amazon: దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో -
ఎలన్ మస్క్ మరో సంచలనం, అంతరిక్షంపై నడక కోసం!
ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ మరో సంచలనానికి తెరతీయనుంది. నలుగురు వ్యక్తులు సివిలియన్ పొలారిస్ డాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో నడిచేందుకు మే నెలలో స్పేస్ ఎక్స్ ట్రైనింగ్‌ను ప్రారంభించనుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఆ నలుగురు సిబ్బంది అంతరిక్షంపై కాలు మోపనున్నారు. ఇప్పటివరకు భూమి నుంచి 853 మైళ్ల ఎత్తులో భూ కక్ష్యను చేరిన రికార్డ్ ఉంది. అయితే ఇప్పుడు 'ఇన్స్పిరేషన్4'..ఎలన్ మస్క్ తన స్పేస్ఎక్స్ అంతరిక్షయానానికి పెట్టిన పేరు. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్4 ద్వారా షిఫ్ట్4 పేమెంట్స్ అధినేత, బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని పొలారిస్ డాన్ మిషన్ ద్వారా ఇప్పుడా ఆ రికార్డ్‌ను అధిగమించి 870 మైళ్ల గరిష్ట ఎత్తుకు చేరుకోవాలనే లక్ష్యంతో స్పేస్ఎక్స్ తన ట్రైనింగ్‌ను ప్రారంభించనుంది. Thanks @PanAquaDiving and instructors Peter and Sean... Im feeling up to speed on SCUBA again and ready to rejoin w/ @PolarisProgram crew next week for training. — Jared Isaacman (@rookisaacman) May 13, 2022 అన్నీ అనుకున్నట్లు జరిగితే, 1972లో చివరిగా చంద్రుడు దిగినప్పటి నుండి మళ్లీ ఇప్పుడు మానవులు భూమి నుండి అంతరిక్షానికి ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డ్ నెలకొల్పనుంది. వచ్చే వారం నుంచే ట్రైనింగ్ ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పొలారిస్ డాన్ మిషన్ లో పాల్గొనేందుకు క్రూ సిబ్బంది సిద్ధమవుతుందని ఐసాక్‌మాన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆస్ట్రోనాట్స్ మిషన్‌లో స్పేస్ ఎక్స్ బిజీ బిజీ 2020 నుంచి స్పేస్ఎక్స్ సంస్థ భూమి మీద నుంచి 408 కిలోమీట్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ నాసాకు ఆస్ట్రోనాట్స్‌ను పంపిస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో క్రూ-3కి చెందిన ఆస్ట్రోనాట్స్‌లు రాజా చారి, థామస్ మార్ష్‌బర్న్, కైలా బారన్, మాథియాస్ మౌరర్'లను స్పేస్ ఎక్స్ సంస్థ నాసాకు పంపించింది. మళ్లీ 6నెలల త్వరాత ఆ క్రూ-3 సిబ్బంది మే6 (శుక్రవారం ఉదయం)న అమెరికాలోని సముద్ర ప్రాంతమైన ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. ఐసాక్ మాన్ ఇంటర్వ్యూ స్పేస్ ఫ్లైట్ నౌ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఐసాక్‌మాన్ స్పేస్‌వాక్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రస్తుతం కూ-3, ప్రైవేట్ ఏఎక్స్-1 లాంచింగ్, లాంచ్ క్రూ-4తో బిజిగా ఉంది. త్వరలో స్పేస్ వాక్ కోసం ట్రైనింగ్ తీసుకోబోతున్నాం' అని వెల్లడించారు. రీయూజబుల్ రాకెట్లతో రీయూజబుల్ రాకెట్లతో (పునర్వినియోగ రాకెట్) పోరాలిస్ ప్రోగ్రామ్ సిరీస్ లాంచ్ కానున్నాయని, దానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు ఐసాక్‌మాన్ తెలిపారు. అంతేకాదు ఐజాక్మాన్ రీయూజబుల్ రాకెట్లతో స్టార్‌షిప్‌లో మొదటి స్పేస్ వాక్ మూడవ పొలారిస్ ప్రోగ్రామ్ లాంచ్ కోసం స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. చదవండి👉చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
వారం రోజుల అంతరిక్ష టూర్.. ఒక్కొక్కరు ఎన్ని కోట్లు చెల్లించారంటే?
కేప్ కార్న్‌వాల్: వారం రోజులు అంతరిక్షంలో నివసించేందుకు ముగ్గురు బడా వ్యాపారవేత్తలను, వారి రక్షక ఆస్ట్రోనాట్‌ను శుక్రవారం స్పేస్ఎక్స్ కంపెనీ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు పంపింది. ఐఎస్ఎస్కు స్పేస్ఎక్స్ తొలి ప్రైవేట్ ప్రయాణం ఇదే కావడం విశేషం. శనివారం ఈ ముగ్గురూ ఐఎస్ఎస్లోకి చేరుకున్నారు. రాకెట్ ప్రయాణానికి, అంతరిక్షంలో విడిదికి వీరు ఒక్కొక్కరు దాదాపు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 418 కోట్లు) చెల్లించారు. వీరు ఐఎస్ఎస్లో రష్యా సొంతమైన ప్రాంతం తప్ప ఇతర ప్రాంతాలన్నీ చూడవచ్చు. అమెరికాకు చెందిన లారీ కానర్, కెనెడాకు చెందిన మార్క్ పాతీ, ఇజ్రాయిల్‌కు చెందిన ఈటాన్ స్టిబ్బె ఈ టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి రక్షణగా సీనియర్ ఆస్ట్రోనాట్ మైకెల్ లోపెజ్ వెళ్లారు. ఇప్పటికే రష్యా, అమెరికా దేశాల స్పేస్ ఏజెన్సీలు అంతరిక్ష టూర్లను నిర్వహిస్తున్నాయి. తాజా ప్రయాణంతో వీటి సరసకు స్పేస్ఎక్స్ చేరింది. జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్ కంపెనీ అంతరిక్షం అంచులకు ప్రైవేట్ యాత్రలు నిర్వహిస్తోంది.త్వరలో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ సైతం ఈ యాత్రలు నిర్వహించనుంది. చదవండి: (కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి) -
మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తిగిన తర్వాత ఆ దేశంలో ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో స్టార్‌లింక్ సేవలను అందించాలని ఆదేశ ఉపాధ్యక్షుడు మస్క్'ను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి తెస్తానని రెండు రోజుల క్రితం మాటిచ్చిన మస్క్.. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుద్దరించడం కోసం స్టార్ లింక్ పరికరాలను(టర్మినల్స్)ను పంపిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరికరాలను స్పేస్ ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు చేరవేసింది. స్టార్ లింక్ పరికరాలు ఉక్రెయిన్‌కు చేరిన విషయాన్ని ఆదేశ ఉపాధ్యక్షుడు నేడు ధృవీకరించారు. టర్మినల్స్‌తో ఉన్న ఓ ట్రక్కు ఫొటోను ఆయన ట్విటర్లో షేర్ చేస్తూ ‘‘స్టార్ లింక్ వచ్చేసింది. చాలా ధన్యవాదాలు మస్క్’’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో సునామీ కారణంగా ఇటీవల అతలాకుతలమైన టోంగా ద్వీపంలో మస్క్ శాటిలైట్ అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. Starlink — here. Thanks, @elonmusk pic.twitter.com/dZbaYqWYCf — Mykhailo Fedorov (@FedorovMykhailo) February 28, 2022 ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్టార్‌లింక్ కృషి చేస్తోంది. ఇప్పటికే 11కు పైగా దేశాలలో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్‌లింక్ ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్'ను మారుమూల ప్రాంతాలకు అందించాలని స్పేస్ ఎక్స్ చూస్తుంది. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్టు కోసం 18 వందలకు పైగా శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించింది. (చదవండి: పీఎన్బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!) -
వారెవ్వా! అదిరిపోయిన ఎలన్ మస్క్ మార్స్ విజన్ వీడియో..!
స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ గతంలో రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్ఎక్స్ ద్వారానే సాధ్యం అవుతుందని గతంలో చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా మస్క్ వేగంగా చర్యలు చేపట్టారు. స్పేస్ఎక్స్ తన ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మొదటి కక్ష్య ప్రయోగం పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతరిక్ష నౌకలో అంగారక గ్రహాన్ని ఎలా చేరుకొనున్నారో అనే దాని గురించి బిలియనీర్ ఎలన్ మస్క్ తన ట్విటర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తూ.. "ఇది మన జీవితకాలంలో నిజం కాబోతుంది" అంటూ స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ టూర్ కి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పోస్టును 58 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పటివరకు నిర్మించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ ఎత్తు 390 అడుగుల(119 మీటర్ల) వరకు ఉంటుంది. Starship to Mars simulation https://t.co/fkpYvv5pMR — Elon Musk (@elonmusk) February 15, 2022 2050 నాటికి 10 లక్షల మందిని అంగారక గ్రహానికి పంపాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2025లో తొలిసారి మనిషిని అక్కడికి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు. మార్స్ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్ మస్క్ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగానికి బీజం వేయించింది. (చదవండి: బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!) -
కూలిపోతున్న స్పేస్ ఎక్స్ శాటిలైట్లు
కేప్ కన్నవెరల్: సౌర తుఫాన్ల కారణంగా తమ కొత్త శాటిలైట్లలో కనీసం 49 దాకా తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినట్టు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ‘‘గత వారం ప్రయోగించిన వీటిలో చాలావరకు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. మిగతావీ కూడా అదే బాటలో ఉన్నాయి’’ అని చెప్పింది. గత శుక్రవారం నాటి జియోమాగ్నటిక్ తుఫాన్ల దెబ్బకు వాతావరణ సాంద్రత పెరగడం తమ శాటిలైట్ల పుట్టి ముంచిందని వివరించింది. ఒక్కోటీ కేవలం 260 కిలోలుండే ఈ బుల్లి శాటిలైట్లను కాపాడేందుకు గ్రౌండ్ కంట్రోలర్లు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయిందని వాపోయింది. అయితే స్పేస్ ఎక్స్‌కు చెందిన కనీసం 2,000 స్టార్ లింక్ శాటిలైట్లు దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమికి చుట్టూ తిరుగుతూ ప్రపంచంలోని మారుమూలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమకూరుస్తున్నాయి. -
కొత్త ఏడాదిలో ఎలన్ మస్క్ జోరు.. గంటకు వేలకోట్ల సంపాదన!
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కొత్త ఏడాది 2022లో తన జోరును కొనసాగిస్తున్నారు. 2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్‌లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు. టెస్లా అమ్మకాలు భారీగా పెరగడంతో కంపెనీ సంపద కూడా అదే స్థాయిలో పెరిగింది. నాల్గవ త్రైమాసిక ఫలితాలు వచ్చిన తరువాత టెస్లా షేర్లు సోమవారం 13.5% పెరిగి $1,199.78కు చేరుకున్నాయి. దీంతో ఎలోన్ మస్క్ సంపద కూడా భారీగా పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ సంపద సోమవారం 33.8 బిలియన్ డాలర్లు పెరిగి 304.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే, గంటకు 1.4 బిలియన్ డాలర్లకు పైగా సంపాదన పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద 196 బిలియన్ డాలర్లుగా ఉంది. నవంబర్, డిసెంబర్ ప్రారంభంలో తగ్గిన కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ కంటే గత నెలలో కంపెనీ విలువ $1 ట్రిలియన్పెరిగింది. టెస్లాలో సుమారు 18% కలిగి ఉన్న మస్క్, సంస్థలో తన వాటాలో 10 శాతం అమ్మేస్తాను అని చెప్పినప్పుడు షేర్లు భారీగా కుప్పకూలాయి. మస్క్ నవంబర్ నుంచి ఇప్పటివరకు టెస్లాలోని 10 బిలియన్ డాలర్లు విలువైన వాటాలను విక్రయించాడు. (చదవండి: టెస్లా రికార్డులు, 3నెలల్లో 3లక్షలకు పైగా కార్ల అమ్మకాలు!) -
అమెరికాకు వచ్చినప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ అమెరికాలో గడిపిన తన ప్రారంభ రోజుల గురించి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అసలు తాను విద్యార్థిగా అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని గుర్తు చేసుకున్నారు. హోల్ మార్స్ కేటలాగ్ అనే వ్యక్తి మస్క్‌ను ప్రశంసిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.. "ఎలోన్ మస్క్ 17 సంవత్సరాల వయస్సులో అమెరికాకు వచ్చాడు. అతను మన దేశానికి సంపద సృష్టించారు. మస్క్ మన ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎంతో ఆదాయాన్ని కల్పించారు, అలాగే అమెరికా దేశ ఎగుమతులను కూడా పెంచారు. నా అభిప్రాయం ప్రకారం, అతను జాతీయ భద్రతను ముందుకు తీసుకువెళ్ళాడు. మస్క్ మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఎంతో మందిని లక్షాధికారులను చేశారు’ అంటూ చాలా గొప్పగా చెప్పారు. లక్ష డాలర్ల రుణం.. ఆ వ్యక్తి చేసిన ట్వీట్‌కు మస్క్ బదులు ఇస్తూ ఇలా అన్నారు.. "నేను చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అమెరికాకు వచ్చాను. పాఠశాలలో ఉన్నప్పుడే రెండు ఉద్యోగాలు చేశాను. స్కాలర్షిప్ వంటివి వచ్చినప్పటికీ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేనాటికి లక్ష డాలర్ల రుణం ఉంది" అని మస్క్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. మస్క్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే 48 వేల మందికి పైగా ఆ ట్వీట్‌ను లైక్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు. I came to the US with no money & graduated with over $100k in debt, despite scholarships & working 2 jobs while at school — Elon Musk (@elonmusk) December 16, 2021 క్రిప్టో మార్కెట్‌ను శాసిస్తున్న మస్క్ సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ మ్యాగజైన్ కూడా ఆకాశానికి ఎత్తేసింది. సోలార్, రోబోటిక్స్, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్న మస్క్.. 250 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అపర కుబేరుడు ఎలోన్ మస్క్ కెరీర్ తొలిరోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు ఆయనే స్వయంగా చెప్పడం ఎంతో మంది యువపారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: Electric Mobility: ఐదేళ్లు.. రూ. 94,000 కోట్ల పెట్టుబడులు) -
మరో సంచలన ప్రయోగానికి సిద్దమైన ఎలన్ మస్క్..!
ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ తన క్రేజీ చేష్టలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒక్కోసారి తను చేసే ట్విట్స్తో అందరినీ షాక్‌కి గురి చేస్తారు.. మరికొన్ని ట్విట్స్తో ఎంటర్టైన్ చేస్తారు. తాజాగా మరోసారి, ఎలన్ మస్క్ ఆసక్తికరమైన ఒక ట్వీట్ చేశారు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్వీట్లో ఇలా పేర్కొన్నారు.. "స్పేస్ ఎక్స్ వాతావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు తీసి రాకెట్ ఇంధనంగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉంటే దయచేసి చేరండి. అంగారక గ్రహానికి కూడా ఇది ముఖ్యం" అని మస్క్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు. అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి, అంగారక గ్రహాన్ని నివాస యోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు. మనుషులను అంతరిక్షంలోకి తసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌకను కూడా తయారు చేస్తోంది. అది అంగారక గ్రహం మీద స్థిరపడే ప్రక్రియను ప్రారంభిస్తుంది. స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌక 100 మెట్రిక్ టన్నులకు పైగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Will also be important for Mars — Elon Musk (@elonmusk) December 13, 2021 (చదవండి: బిట్‌కాయిన్ గాలి తీసేసిన బిలియనీర్ కింగ్!) -
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్
Time's person of the year 2021: టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్ ఎక్స్‌కు కూడా మస్క్ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మధ్యలో ఇద్దరి మధ్య దోబుచులాట నడిచినప్పటికీ.. చివరికి తన సంపదను అమాంతం పెంచేసుకుని అపర కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యాభై ఏళ్ల మస్క్. ప్రస్తుతం సంపద దాదాపు 253 బిలియన్ డాలర్లు ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి(చాలా వరకు అమ్మేసుకుంటూ పోతున్నాడు). 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్`ను ఎంపిక చేస్తుంది. సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక ట్విట్టర్లో ఎలన్ మస్క్ 6.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్ఎక్స్ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు ది బోరింగ్ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్ చిప్ స్టార్టప్ ‘న్యూరాలింక్’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. చదవండి: ఎలన్ మస్క్ వెటకారం! ప్రధాని పైనా సెటైర్లు -
లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1
Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్‌లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్. శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో మస్క్ మొదటి ప్లేస్‌లో ఉండగా.. రెండో ప్లేస్‌లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్. జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్‌గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్‌లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం. ఎటు చూసినా టాపే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్‌గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్‌లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్‌స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య. చదవండి: ట్విటర్ సీఈవో పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్ -
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన ఇండో-అమెరికన్
ఫ్లోరిడాలోని ఒక మాజీ ఇండో-అమెరికన్ ఇంజనీర్ స్పేస్ ఎక్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇతర ఉద్యోగులతో పోలిస్తే శిక్షణ, పని విషయంలో సంస్థ తన పట్ల జాతి వివక్ష ప్రదర్శించినట్లు భారతీయ-అమెరికన్ అజయ్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో ఓర్లాండోలోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎలోన్ మస్క్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌కు వ్యతిరేకంగా రెడ్డి దావా వేశారు. ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు మంగళవారం(నవంబర్ 9) సంస్థకు సమన్లు జారీ చేసింది. స్పేస్ ఎక్స్ జాతి వివక్ష, జాతీయ మూల వివక్ష, ప్రతీకారం & ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆరోపించింది. ఈ వ్యాజ్యంలో తనను తాను భారతీయ సంతతికి చెందిన ఆసియా-అమెరికన్ వ్యక్తిగా పేర్కొన్న అజయ్ రెడ్డి 2020 మేలో ఫెయిర్ రికవరీ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలిగించినట్లు ఆరోపించారు. జూన్ 2020లో యుఎస్ ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీ కమిషన్(ఈఈఓసీ), ఫ్లోరిడా కమిషన్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ కు ఈ విషయం గురుంచి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈఈఓసీకి స్పేస్ ఎక్స్ ఇచ్చిన పొజిషన్ స్టేట్ మెంట్ ప్రకారం.. స్పేస్ ఎక్స్ మేనేజర్ రాబర్ట్ హిల్ అజయ్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఒక సమావేశంలో రాబర్ట్ హిల్ వేసిన ప్రశ్నలకు సమాధానాలకు ప్రతిస్పందనగా రెడ్డి అసభ్యకరంగా ముఖ కవళికలు చేయడంతో తన ఉద్యోగాన్ని రద్దు చేసినట్లు హిల్ తెలిపారు. (చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?) "స్పేస్ ఎక్స్ సంస్థలో ఉన్న కాలమంతా తను తీవ్రమైన వేధింపులకు గురి అయినట్లు, ఎగతాళి చేసినట్లు, బెదిరించినట్లు, పనితీరు గురించి తప్పుడు ప్రకటనలు చేసినట్లు" రెడ్డి వ్యాజ్యంలో తెలిపారు. వీటి గురుంచి రెడ్డి న్యాయవాది అడిగిన ప్రశ్నలకు స్పేస్ ఎక్స్ స్పందించలేదు. అజయ్ రెడ్డి సంస్థలో ఇద్దరు తెల్ల ఇంజనీర్లతో కలిసి పనిచేశాడు. వారు ఫెయిర్యింగ్ రికవరీ ఉద్యోగం కోసం అతని కంటే ముందు సెలెక్ట్ అయ్యారు. ఈ ముగ్గరు ఇతర ఉద్యోగులతో కలిసి స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు సముద్రంలో పడినప్పుడు రాకెట్ల శకలాలను తిరిగి తీసుకొని రావాలి. ఈ కార్యక్రమం కొత్తది కావడం వల్ల మొదట ఎవరికి శిక్షణ ఇవ్వలేదు. కానీ, తర్వాత అతని సహచరులలో ఒకరికి కాలిఫోర్నియాలో అనేక రోజుల శిక్షణ ఇచ్చారు, మరొకరికి ఈ వ్యవస్థను రూపొందించిన ఇంజనీర్లతో కలిసి పనిచేసే అవకాశం కల్పించినట్లు రెడ్డి ఆరోపించారు. ఈ శిక్షణ శిక్షణ గురుంచి రెడ్డి అడిగినప్పుడు వారు నిరాకరించినట్లు తెలిపాడు. దీంతో రెడ్డి "ఆ విషయన్ని తను అవమానంగా భావించినట్లు, ఒ౦టరిగా ఉన్నట్లు భావించాడని" దావాలో పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యంలో పేర్కొన్న తన ఇద్దరు సహచరులు చాలా తప్పులు చేశారని, దానివల్ల సంస్థ మిలియన్ల డాలర్ల నష్టం వచ్చినట్లు రెడ్డి ఆరోపించారు. కానీ వారిని శిక్షించలేదని పేర్కొన్నాడు. చేయని తప్పులకు తనను శిక్షించారని రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని సహోద్యోగుల పనితీరు ఎలా ఉన్న వారిని సంస్థ ఏమి అనేది కాదని, తనను మాత్రం తప్పు లేకున్నా శిక్షించినట్లు తెలిపాడు. స్పేస్ ఎక్స్ తనపట్ల వివక్ష చూపిందని రెడ్డి ఆరోపించారు. అదే విధంగా ఆసియాయేతర ఇంజనీర్ల మాదిరిగానే తనకు ఉద్యోగ విధులను నిర్వహించడానికి చాలా తక్కువగా ప్యాకేజీని చెల్లించినట్లు పేర్కొన్నాడు. స్పేస్ ఎక్స్ సంస్థ వల్ల అతను "ఆర్ధికంగా నష్ట పోయినట్లు, మానసిక బాధపడినట్లు, తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడికి గురి అయినట్లు" దావాలో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన తీసుకోవాలని, న్యాయ నిపుణుల ఫీజుల ఖర్చులను, తనకు న్యాయం చేయాలని అజయ్ రెడ్డి కోర్టును కోరారు. (చదవండి: ఇండియా క్రికెట్ టీమ్ ఎఫెక్ట్.. స్టార్ ఇండియాకు ఇన్ని కోట్లు నష్టమా?) -
Tesla: టెస్లాను నిండాముంచుతున్న ఎలన్ మస్క్!
Tesla Shares Dip: ఒక్క పెట్టున మిలియన్ డాలర్లు సంపాదించాలన్నా.. నిమిషాల్లో అంతే సంపదను ముంచేయాలన్నా అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి చిటికేసినంత పని. గతంలో ‘ట్వీట్ల’ ద్వారానే అలాంటి పనులు చేశాడాయన. అలాంటిది తన చేష్టలతో ఈసారి టెస్లా కొంపముంచుతున్నాడు. ఈవీ దిగ్గజం టెస్లా షేర్లు ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో పతనం దిశగా దూసుకుపోతున్నాయి. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేష్టల తర్వాతే ఈ పతనం మొదలుకావడం విశేషం. సుమారు 5 బిలియన్డాలర్ల విలువైన తన పది శాతం వాటా ఎలన్ మస్క్ అమ్మేసుకున్న విషయం తెలిసిందే. ఈ మరుక్షణం నుంచే షేర్ల విలువలు పడిపోతూ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో 0.4 శాతం పడిపోయిన టెస్లా షేర్ విలువలు.. ఈ వారం 1,063.51 డాలర్ల వద్ద ముగిసింది. ఇక వారం మొత్తంగా 157 బిలియన్డాలర్ల విలువైన పతనం చవిచూసింది టెస్లా. ఇక ఈ పతనం ఇంకొంత కాలం కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్పేస్ఎక్స్ పదిలం ఎలన్ మాస్క్ మొత్తం సంపదలో టెస్లా వాటా ద్వారా ఉన్న విలువే ఎక్కువ!. 2016 తర్వాత తాజాగా తన షేర్లను అమ్మేసుకున్న ఎలన్ మస్క్.. అదీ ట్విటర్ పోల్ అభిప్రాయం ద్వారా ముందుకు వెళ్లడం కొసమెరుపు. ఇక సొంత కంపెనీ స్పేస్ఎక్స్ షేర్లను మాత్రం భద్రంగా చూసుకుంటున్నాడు. అయితే ఈవీ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ.. మార్కెట్ పతన ప్రభావం మాత్రం టెస్లాపై కొనసాగుతోంది. అయితే ఈ ప్రతికూల ప్రభావం సుదీర్ఘ కాలం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం మస్క్‌ను చూసి ఇన్వెస్టర్లు టెస్లాలో ఇన్వెస్ట్ చేయడం లేదని టెస్లా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం.. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. -
తెలుగోడి నేతృత్వంలో ఐఎస్ఎస్కు నాసా బృందం
-
అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం
మాస్కో: రష్యన్ సిని బృందం తొలిసారిగా భూకక్ష్యలో విజయవంతంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. రష్యా నటి యులియా పెరెసిల్డ్, దర్శకుడు క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ కజికిస్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో 12 రోజులు పాటు విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు. అయితే వీరు కజకిస్తాన్ స్టెప్పీ సమీపంలో సురక్షింతంగా ల్యాండ్ అయ్యినట్లు రష్యన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ సినిమా బడ్జెట్ వ్యయం విషయం కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. పైగా వారు ఈ ప్రయాణం కోసం నాలుగు నెలలు శిక్షణను కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అమెరికాలో అత్యాధునిక రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేసేలా సరి కొత్త చరిత్రను తిరగారాయలన్న ఉద్దేశంతోనే రష్యా స్పేస్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ మేరకు 'చాలెంజ్' అను పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమా అంతరిక్షంలోని వ్యోమోగామీకి గుండె నొప్పి రావడంతో అతనికి చికిత్స చేసేందుకు వెళ్తున్న సర్జన్ ఏ విధంగా అంతరిక్షం చేరుకుంటుంది అనేది ఇతివృత్తంగా చేసుకుని తీస్తున్నారు. ఇందులో ఇద్దరూ రష్యన్ వ్యోమోగాములు అతిధి పాత్రలో నటించడం విశేషం. ఈ సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్షం నుంచి తిరిగి భూమికి పయనమయ్యే సమయంలో కొంత సమయం ఇబ్బంది తలెత్తినప్పటికీ సురక్షితం అనుకున్న సమయానికి భూమికి చేరుకన్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ పేర్కొంది. Touchdown after 191 days in space for @Novitskiy_ISS and 12 days in space for two Russian filmmakers! More... https://t.co/CrQl3O1BUl pic.twitter.com/kzXlCTr0og — International Space Station (@Space_Station) October 17, 2021 -
అంతరిక్ష రంగంలో పోటీ పడుతున్న దేశీయ ప్రైవేట్ కంపెనీలు
గత దశాబ్ద కాలంలో అంతరిక్ష ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అమెరికాలో బ్యాక్ టూ బ్యాక్ రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తుంది. స్పేస్ ఎక్స్ నిజంగా యుఎస్ అంతరిక్ష చరిత్రకు పర్యాయ పదంగా ఉండే పేర్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి కంపెనీలు ఈ మధ్య కాలంలో ఈ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మన దేశంలో కూడా గత కొద్ది కాలంగా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. రాకెట్లు నిర్మించడం, లాంచింగ్ వెహికల్స్, ఉపగ్రహాలను ప్రయోగించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం లాంటి వాటిపై ప్రైవేట్ కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అంతరిక్ష రంగం వైపు చూస్తోన్న టాప్-4 కంపెనీలు ఏవో చూద్దాం. స్కైరూట్ ఏరోస్పేస్ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది 2018లో స్థాపించిన హైదరాబాద్ కు చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ. దీనిని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలిసి స్థాపించారు. ఈ సంస్థ తన 'విక్రమ్' శ్రేణి రాకెట్లపై పనిచేస్తోంది. 2022 మధ్యలో విక్రమ్-1 లాంచ్ చేయాలని చూస్తోంది. విక్రమ్-1ను వాణిజ్యీకరించడంతో పాటు ఇదే వరుసలో విక్రమ్-2, విక్రమ్-3ను రూపొందించాలని ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సంస్థ 11 మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించినట్లు తెలిపింది. ఈ సంస్థలో పెట్టుబడిదారులుగా వాట్సాప్ గ్లోబల్ బిజినెస్ ఛీఫ్ నీరజ్ అరోర్, మింత్రా వ్యవస్థాపకులు ముఖేశ్ బన్సాల్ కూడా ఉన్నారు.(చదవండి: టయోటా మరో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!) అగ్నికుల్ కాస్మోస్ అగ్నికుల్ కాస్మోస్ అనేది శ్రీనాథ్ రవిచంద్రన్, మొయిన్ ఎస్పిఎమ్ 2016 లో స్థాపించిన చెన్నైకి చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ. 3డీ ప్రింటెడ్ ఇంజిన్లతో రెండు ప్రదర్శనల రాకెట్ అయిన 'అగ్నిబాన్' అనే రాకెట్లపై ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుతం స్మాల్-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అయిన అగ్నిబాన్ను డెవలప్ చేస్తోంది. ఇది 100 కిలోల పేలోడ్‌ను 700 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యంలో ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పిక్సెల్ పిక్సెల్ సంస్థ అంతరిక్షంలో 30 కిలోమీటర్ల పై నుంచి భూమిని పరిశీలించే సూక్ష్మ ఉపగ్రహాలపై (మైక్రో శాటిలైట్లు) పరిశోధనలు చేస్తోంది. డేటాను సేకరించడానికి వ్యవసాయం, వాతావరణ మార్పు మొదలైనవాటిని అధ్యయనం చేయడానికి ఈ సంస్థ సుమారు 24 అల్ట్రా-హై రిజల్యూషన్ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెట్టింది. సాంకేతికతను అభివృద్ధి చేయడం, ఉపగ్రహాల కూటమిని నిర్మించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. ఈ స్టార్టప్ కు మెషిన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం కూడా ఉంది.(చదవండి: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు!) బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ఇది శాటిలైట్ ప్రొపల్షన్ లో ప్రత్యేకత కలిగిన భారతీయ ఏరోస్పేస్ ఆర్ అండ్ డి కంపెనీ. ఇది తమిళనాడులోని కోయంబత్తూరు కేంద్రంగా ఉంది. దీనిని రోహన్ ఎం గణపతి, యశస్ కరణం స్థాపించారు. బెల్లాట్రిక్స్ 'చేతక్' అనే రాకెట్ పై పనిచేస్తోంది. ఇది మీథేన్, ద్రవ ఆక్సిజన్ ను ఉపయోగించే ఇంజిన్లతో మొదటి రాకెట్ కావచ్చు. వారు తమ రాకెట్ ను ప్రయోగించడానికి 'మొబైల్ లాంచర్'ను ఉపయోగించాలని యోచిస్తున్నారు. -
SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా?
స్పేస్ టూరిజం టార్గెట్‌గా రంగంలోకి దిగిన స్పేస్ ఎక్స్ సంస్థ మరో అద్భుతానికి సాక్షిగా నిలిచింది. ఆ సంస్థ ప్రయోగించిన డ్రాగన్ క్యూపోలా భూమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో బంధించింది. 585 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌లో భాగంగా గత బుధవారం డ్రాగన్ క్యూపోలాను అంతరిక్షంలోకి పంపించింది. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ డ్రాగన్ స్పేస్ షిప్లో అంతరికక్షానికి చేరుకున్నారు. భూమి నుంచి 585 కిలోమీటర్ల ఎత్తులో ఇప్పుడా డ్రాగన్ చక్కర్లు కొడుతోంది. చూసేందుకు వీలుగా గతంలో నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు అంతరిక్షంలోకి స్పేస్షిప్లను పంపినప్పటికీ ఎందులో కూడా పై నుంచి భూమిని చూసేందుకు అనువైన ఏర్పాట్లు లేవు. కానీ స్పేస్ఎక్స్ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌లో ప్రత్యేక పద్దతిలో ట్రాన్స్పరెంట్ మెటీరియల్‌తో అతి పెద్ద క్యూపోలాను రూపొందించారు. అక్కడి నుంచి భూమిని స్పష్టంగా చూసే వీలుంది. చీకటి పడుతుండగా డ్రాగన్ క్యూపోలా నుంచి శుక్రవారం సాయంత్రం భూమిపై చీకటి పడే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియో ఫుటేజీని స్పేస్ ఎక్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఆకాశం నుంచి చూస్తుంటే సగం భూమిపై చీకటి ఉండగా సగం భూమిపై వెలుతురు ఉంది. క్రమంగా సగ భాగం చీకటిగా మారిపోయింది. ఆ తర్వాత స్పేస్ షిప్ ఉన్న వైపు భూమి మొత్తం చిమ్మ చీకటిలో కలిసిపోయింది. View of an orbital sunset from Dragon's cupola pic.twitter.com/Fl1fLrXD9o — SpaceX (@SpaceX) September 18, 2021 చదవండి: విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం -
బంపరాఫర్: 14 వేల కోట్ల భారీ డిస్కౌంట్!
అంతరిక్షయానం ఇప్పుడు పక్కా కమర్షియల్‌గా మారిపోయింది. భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కర్మన్ లైన్’ దాటి వెళ్లొస్తూ.. రోదసియానం పూర్తైందని జబ్బలు చరుచుకుంటున్నాయి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు. తద్వారా పాపులారిటీతో పాటు ప్రభుత్వ అంతరిక్ష సంస్థలతో భారీ ఒప్పందాలను సొంతం చేసుకుంటున్నాయి . ఈ క్రమంలో అమెజాన్ ఫౌండర్, బ్లూ ఆరిజిన్ స్పేస్ ఏజెన్సీ ఓనర్ జెఫ్ బెజోస్.. నాసాకు బంపరాఫర్ ప్రకటించాడు. బ్లూ ఆరిజిన్ ఓనర్ జెఫ్ బెజోస్.. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు ఓ బహిరంగ లేఖ రాశాడు. నాసా చేపట్టబోయే ‘మూన్ మిషన్-2024’లో మూన్ ల్యాండర్ బాధ్యతలను తమ కంపెనీకి అప్పగించాలని, తద్వారా 2 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 14 వేల కోట్ల రూపాయలు) డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించాడు. తద్వారా చరిత్రలోనే అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్‌తో వార్తల్లోకెక్కింది ఈ డీల్. అయితే ఈ లేఖపై నాసా ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా 2024లో చంద్రుడి మీదకు ప్రణాళికలు వేస్తున్న నాసా.. అక్కడి అనుభవాలు 2030-మార్స్ క్రూ మిషన్ కోసం ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో మూన్‌ల్యాండర్ కోసం ఆక్షన్ నిర్వహించింది. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన ‘ది హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ వ్యవహారంపై ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో పాటు డైనెటిక్స్ కంపెనీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో నాసా పునరాలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో బెజోస్ నుంచి నాసాకు బంపరాఫర్ వెళ్లడం విశేషం. ‘ఫండింగ్ లేని కారణంగా నాసా ఒకే కాంట్రాక్టర్‌ను తీసుకుందనే విషయం తెలుసు, కానీ, పోటీతత్వం ఉంటేనే పని సమర్థవంతంగా సాగుతుందనే విషయం గుర్తించాల’ని ఆ బహిరంగ లేఖలో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు సూచించాడు బెజోస్. అంతేకాదు ‘బ్లూ మూన్ ల్యాండర్’ ప్రత్యేకతలను వివరించడంతో పాటు.. కక్క్ష్యలో ల్యాండర్‌ను పరీక్షించేందుకు అవసరమయ్యే ఖర్చును కూడా తామే భరించుకుంటామని బెజోస్ స్పష్టం చేశాడు. ఒకవేళ ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటే చరిత్రలోనే భారీ డిస్కౌంట్ దక్కించుకున్న క్రెడిట్ నాసా సొంతమవుతుంది. -
నవలోకం... మన కోసం..!
‘మానవుడే మహనీయుడు... గగనాంతర రోదసిలో గంధర్వగోళ గతులు దాటిన... మానవుడే మాననీయుడు’ అన్నారు ఆరుద్ర. మానవుడిలోని ఆ శక్తినీ, యుక్తినీ మరోసారి గుర్తుచేస్తూ గత పది రోజులుగా వస్తున్న అంతరిక్ష యాత్రల వార్తలే అందుకు నిదర్శనం. ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, తరువాత సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు. వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా ఆసక్తిగా చెప్పుకుంటోంది. త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో జరిపేది ముచ్చటగా మూడో విహారం. నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు. అయితేనేం, లక్షల డాలర్లు ఖర్చుపెట్టి వారు రూపొందిస్తున్న అంతరిక్ష విమాన నౌకలు, ఈ విహార ప్రయత్నాలు ప్రపంచంలో వస్తున్న మార్పుకు సూచనలు. ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే అనాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తేల్చిన నిరూపణలు. భవిష్యత్తులో రోదసీ పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన కీలక సంఘటనలు. కొద్ది నిమిషాల్లోనే భూవాతావరణాన్ని దాటి రోదసిలోకి ప్రయాణించి, భారరహిత స్థితిలో అంతెత్తు నుంచి భూగోళాన్ని చూసి, ఆ వెంటనే సురక్షితంగా భూమి మీదకు తిరిగొచ్చేయడం ఇక సాధ్యమని ఈ యాత్రలు చాటాయి. అపురూపమైన ఆ అనుభవం కావాలను కొనే సంపన్నులు, సాహసికులు ఇప్పుడిక డబ్బు సంచులు సిద్ధం చేసుకోవడమే తరువాయి! నాలుగు నిమిషాల అపూర్వ అనుభవం కావాలంటే, టికెట్ రెండున్నర లక్షల డాలర్లు. అలా ‘వర్జిన్ గెలాక్టిక్’ ఇప్పటికే 600 టికెట్లు విక్రయించడం గమనార్హం. తాజా రెండు యాత్రల్లోనూ కొన్ని విశేషాలున్నాయి. రిచర్డ్ బ్రాన్సన్ బృందంలో భాగమై, 86 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి, రోదసీ విహారం చేసిన తొలి తెలుగమ్మాయిగా బండ్ల శిరీష చరిత్రకెక్కారు. ఆ వెంటనే బెజోస్ బృందం వంద కిలోమీటర్ల ఎత్తులోని కార్మాన్ రేఖ దాటి, భూమి నుంచి మరింత ఎత్తుకు 106 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి రికార్డు సృష్టించింది. ఈ కొత్త రికార్డు యాత్రలో రోదసీ విహారం చేసిన అతి పిన్నవయస్కుడు (18 ఏళ్ళ ఆలివర్ డేమన్), అతి పెద్ద వయస్కురాలు (82 ఏళ్ళ వ్యోమగామి వ్యాలీ ఫంక్) కూడా భాగం కావడం మరో చరిత్ర. నిజానికి, మానవాళి రోదసీ విజయ చరిత్ర ఎప్పుడో ఆరంభమైంది. అంతరిక్షయానం మనకు మరీ కొత్తేమీ కాదు. ఇప్పటి కుబేరుల పోటీలానే, దశాబ్దాల క్రితం ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధవేళ అంతరిక్ష విజయానికి అగ్రరాజ్యాల మధ్య పోటీ సాగింది. అరవై ఏళ్ళ క్రితం రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ 1961లో రోదసీ యాత్ర చేసిన తొలి మానవుడనే ఖ్యాతి దక్కించుకున్నారు. ఇక, 52 ఏళ్ళక్రితం 1969 జూలై 20న అమెరికన్ నీల్మ్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపాడు. ఇరవై ఏళ్ళ క్రితమే 2001లో రష్యన్లు ధనికుడైన పెట్టుబడిదారు డెన్నిస్ టిటోను రోదసిలోకి తీసుకువెళ్ళారు. ప్రైవేటు రోదసీ విమాన నౌకలో మనుషుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపే వాణిజ్య ప్రయత్నాలు కూడా ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ద్వారా గతంలో అనేకం జరిగాయి. అయితే, ఈ అనేకానేక తొలి అడుగులు, అనేక పరాజయాలు ఇప్పటికి ఓ కీలక రూపం ధరించాయని అనుకోవచ్చు. అలా తాజా రోదసీ విహారాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని భావించవచ్చు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన చారిత్రక ఘట్టానికి సరిగ్గా 52 ఏళ్ళు పూర్తయిన రోజునే ఇప్పుడు బెజోస్ బృందం రోదసీ విహారం చేశారు. పాతికేళ్ళ పైచిలుకు క్రితం ఓ చిన్న గ్యారేజ్‌లో ఇ–కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఆలోచనకు శ్రీకారం చుట్టి, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన 57 ఏళ్ళ అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్‌కు రోదసీ విహారం తన అయిదో ఏట నుంచి ఓ కల. అందుకోసం 2000లో ‘బ్లూ ఆరిజన్’ స్టార్టప్‌ను స్థాపించి, ఇప్పటికి తన కల నిజం చేసుకున్నారు. దశాబ్దాల ముందు కేవలం కల అనుకున్న అనేక విషయాలు ఇప్పుడు నిజం చేసుకోవడం సాంకేతిక పురోగతికి ప్రతీకలే. అయితే, అందుకు శ్రమ, ఖర్చూ కూడా అపరిమితం. రోదసీ విహారానికి జెఫ్ బెజోస్ ఖర్చు పెట్టింది అక్షరాలా 5.5 బిలియన్ డాలర్లని ఓ లెక్క. అయితే, ఇలా ఇన్నేసి లక్షల డాలర్లను మనోవాంఛ తీర్చే విహారానికి ఖర్చు చేసే బదులు మానవాళి నివాసమైన ఈ పుడమిని కాపాడుకొనేందుకు అర్థవంతంగా ఖర్చు చేయవచ్చుగా అనే విమర్శలూ లేకపోలేదు. ఏమైనా, కొన్ని దశాబ్దాలుగా రష్యా, అమెరికా, చైనా, భారత్ సహా అనేక దేశాల మధ్య సాగిన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల పోటీ ఇప్పుడు ధనిక వ్యాపారవేత్తలు, సంస్థల గగనవిహారం దిశగా మళ్ళింది. దీనివల్ల అంతరిక్షమొక సరికొత్త వ్యాపార వేదికగా రూపుదాల్చనుంది. నవలోకానికి దారులు తీసింది. మరోపక్క మన దేశం కూడా అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచి, ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందుకే, అంతరిక్ష పరిశోధన, పర్యాటకం – రెండూ ఇక రెండు కళ్ళు కావడం ఖాయం. చంద్రాది అనేక గ్రహాల మీద శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటు కూడా అచిరకాలంలోనే సాధ్యం కావచ్చు. ఇవాళ్టి కోటీశ్వరుల ప్రేమలు, పెళ్ళిళ్ళు, డెస్టినేషన్ వివాహాల సంస్కృతి... భవిష్యత్తులో రోదసీలో, భారరహిత స్థితిలోకి విస్తరించినా ఆశ్చర్యం లేదు. అంటే... ఒకప్పుడు మానవాళి తలపులకే పరిమితమైన తారాతీరం ఇప్పుడిక అందనంత ఎత్తేమీ కాదు! తలుపులు తెరుచుకున్న రోదసీ నవలోకానికి బాన్ వాయేజ్!! -
SpaceX CEO: ఎలోన్ మస్క్ ఆసక్తికర ట్వీట్!
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్ లింక్ 69,420 మంది ఆక్టివ్ యూజర్లను చేరుకున్నట్లు, "వ్యూహాత్మకంగా ముఖ్యమైన పరిమితి"ని దాటినట్లు ఆసక్తికర ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో ధ్రువ ప్రాంతాలు మినహా ఆగస్టు నాటికి ప్రపంచ కవరేజీని ప్రారంభించనున్నట్లు పోస్ట్ చేశారు. స్టార్ లింక్ కంపెనీ అధ్యక్షుడు గ్వైన్ షాట్ వెల్ ఇంటర్నెట్ సర్వీస్ సెప్టెంబర్ నాటికి ప్రపంచ కవరేజీని అందించనున్నట్లు చెప్పిన వారం తర్వాత మస్క్ ఈ ట్వీట్ చేశారు. మొత్తం 72 ఉపగ్రహాలు ఆగస్టులో క్రియాశీలం కానున్నట్లు మరో ట్వీట్ లో తెలిపారు. అయితే, 69,420 సంఖ్యపై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. @StevenCravis ట్విట్టర్ వినియోగదారుడు 69,420 సంఖ్య వ్యూహాత్మకంగా ఎందుకు ముఖ్యమని అడిగారు. దానికి మస్క్ సమాధానం ఇవ్వలేదు. మరో ట్విట్టర్ యూజర్(@flcnhvy) ఎయిర్ లైన్ వై-ఫై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడిగారు. దీనికి మస్క్ ఇలా జవాబిచ్చారు.. "గల్ఫ్ స్ట్రీమ్ లో చాలా మంది ప్రజలకు సేవలందించే బోయింగ్ 737, ఎయిర్ బస్ ఎ320లలో టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌లో ఏలోన్ మస్క్ టెస్లా మోడల్ ఎస్ 69,420 డాలర్లకు లభిస్తున్నట్లు చెప్పినట్లు మరికొందరు ట్వీట్ చేశారు. అయితే, ఎలోన్ మస్క్ ఈ సంఖ్య (69,420) ఎందుకు అంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అన్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. Starlink simultaneously active users just exceeded the strategically important threshold of 69,420 last night! — Elon Musk (@elonmusk) June 25, 2021 చదవండి: బగ్ కనిపెట్టి రూ.22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి! -
అమ్మ ఒడిలోని ఈ చిన్నారి ఎవరో తెలుసా?
కొత్తగా ఆలోచించడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, కొత్త ఆలోచనలతో అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒక్కడే ఎలన్ మస్క్. వింత ఆలోచనల పుట్ట, మొండి మేధావి, ముక్కుసూటి మనిషిగా పేరున్న ఎలన్ మస్క్ 50వ పుట్టినరోజు ఇవాళ. పైన అమ్మ ఒడిలో ఒదిగిన ఆ చిన్నారి కూడా ఎలన్ మస్కే. వెబ్‌డెస్క్: ఎలన్ మస్క్ కన్నతల్లి మయే మస్క్ ఆ ఫొటోను షేర్ చేసింది. కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యాభై ఏళ్ల క్రితం అదొక అద్భుతమైన రోజని, తనలో సంతోషాన్ని నింపాడని చెబుతూ.. ప్రేమగా ట్విటర్లో పోస్ట్ చేసిందామె. పైగా ట్విటర్లో ట్రెండ్ అవుతున్న #HappyBirthdayElonMusk ట్యాగ్‌ను సైతం జత చేసింది. తల్లి పంచిన గుర్తుకు.. సింపుల్‌గా హార్ట్ సింబల్‌తో బదులిచ్చాడు మస్క్. పోయినవారం ఆమె మస్క్, అతని సోదరుడితో ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మస్క్ చిన్నప్పటి ఫొటోను షేర్ చేయగా.. ఆయన అభిమానులు మురిసిపోయారు. Happy birthday @elonmusk 🎂🎉 Thank you for this wonderful day 50 years ago. You have brought me great joy. Lots of love ❤️❤️❤️ #HappyBirthdayElonMusk now trending 🙌🙏 pic.twitter.com/xro3QwQD1z — Maye Musk (@mayemusk) June 28, 2021 పన్నెండేళ్లకే.. టెస్లా, స్పేస్ ఎక్స్, ది బోరింగ్ కంపెనీలకు హెడ్‌గా న్యూరాలింక్ లాంటి అరుదైన ప్రయోగాలతో ప్రపంచానికి పరిచయమైన మేధావి ఎలన్ మస్క్. ఒక్క ట్వీట్‌తో కోట్లకు కోట్లకు ముంచెత్తడం, అదే టైంలో ఒకే ట్వీట్‌తో సంపాదించడం అతనికి తేలికైన పని. అంతేకాదు బిట్‌కాయిన్ తలరాతను డిసైడ్ చేస్తూ.. డిజిటల్ కరెన్సీ మార్కెట్‌ను శాసిస్తుంటాడు కూడా. 1971, జూన్ 28న ప్రిటోరియా (దక్షిణాఫ్రికా)లో పుట్టాడు ఎలన్ మస్క్. తండ్రి ఎర్రోల్ ఇంజినీర్. తల్లి మయే మస్క్ మోడల్. వ్యక్తిగత విభేధాలతో మస్క్‌కి తొమ్మిదేళ్లున్నప్పుడు విడిపోయారు. ఆ తర్వాత తండ్రి దగ్గరే పెరిగాడు మస్క్(తాను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తండ్రి దగ్గర ఉండడమే అని ఎందుకనో తరచూ చెప్తుంటాడు మస్క్). పన్నెండేళ్లకే వీడియో గేమ్‌ను తయారు చేసిన మస్క్.. దక్షిణాఫ్రికాలో ఉంటే సైన్యంలో చేరాల్సి వస్తుందన్న భయంతో కెనడాలోని తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత ఒంటారియో క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీల నుంచి నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసుకుని.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కోసం ప్రయత్నించాడు. కానీ, రెండో రోజుకే దానిని వదిలేశాడు. నెట్‌స్కేప్‌లో ఉద్యోగాన్ని వదులుకుని సోదరుడితో కలిసి జిప్2 అనే వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాడు. అది అతన్ని మిలియనీర్‌ను చేసింది. ఆపై బ్యాంకింగ్ సర్వీస్ సంస్థను పేపాల్‌కు అమ్మేసి.. ఏకంగా దానికి సీఈవో అయ్యాడు. ఆకాశంలో ఆలోచనలు మస్క్ ఆలోచనలన్నీ కొత్తగానే ఉంటాయి. అందుకే తిక్క మేధావి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు అతని అభిమానులు. బ్యాంకింగ్ సర్వీస్, స్పేస్ ట్రావెల్ కంపెనీ, ఎలక్రి్టకల్ వెహికిల్స్, అండర్‌గ్రౌండ్ టన్నెల్స్, జంతువుల తలలో చిప్‌లతో కంట్రోల్ చేయడం.. ఇలాంటి పనులు అతని క్రేజ్‌ను మరింత పెంచాయి. మార్స్‌పై మొక్కలు పెంచాలన్న ఆలోచన నుంచి.. మస్క్ బుర్రలో స్పేస్ ఎక్స్ ఆలోచనకు బీజం పడింది. స్పేస్ టెక్నాలజీ కోసం అమెరికా సాయం కాకుండా.. రష్యా సాయం తీసుకోవాలని ప్రయత్నించి ఘోరంగా అవమాన పడ్డాడు. కలల సామ్రాజ్యం స్పేస్ ఎక్స్ సంస్థ అందుకు ప్రతీకారంగానే స్పేస్ ఎక్స్‌ను స్థాపించి.. 2008లో ఫాల్కన్ లాంఛ్ ద్వారా స్పేస్ఎక్స్ తొలి సక్సెస్ చవిచూశాడు. రాబోయే రోజుల్లో ఎలక్రి్టక్ వెహికిల్స్‌కే భవిష్యత్తు ఉంటుందని నమ్మి.. 2004లో టెస్లాను లీడ్ చేయడం ప్రారంభించాడు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా రవాణా, అత్యంత వేగంగా ప్రయాణం, డ్రైవర్‌లెస్ కార్లు, గాల్లో ఎగిరే కార్లు, ఇక జంతువుల బ్రెయిన్లలో చిప్‌లు జొప్పించి.. ప్రయోగాలు. ఇలా మస్క్ మైండ్‌లో ఉండే ఆలోచనలు ఒక్కొక్కటి కార్యరూపం దాలుస్తూ వస్తున్నాయి. టెస్లా సీఈవో హోదాలో.. విమర్శలు.. వివాదాలు బహిరంగంగానే గంజాయి పీల్చే ఎలన్ మస్క్‌కు విమర్శలు, వివాదాలు కొత్తేంకాదు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. పరువు నష్టం దావాల కింద మూల్యం చెల్లించుకున్నాడు. ఒకానొక టైంలో సొంత కంపెనీలపై సెటైరిక్ ట్వీట్లు వేసి.. ఊహించలేని నష్టాన్ని తెస్తుంటాడు. అయినప్పటికీ కంపెనీని సమర్థవంతంగా నడిపిస్తుండడం, జనాల్లో అతనికి ఉన్న క్రేజ్, మేజర్ వాటా తదితర కారణాల వల్ల అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పెళ్లిళ్లు.. డేటింగ్లు మస్క్ వ్యక్తిగత జీవితం కూడా ఆగం ఆగమే. గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేను వివాహం చేసుకున్నాడు. 2012లో రిలేకు విడాకులిచ్చి. ఆ మరుసటి ఏడాది మళ్లీ పెళ్లి చేసుకోవడం విశేషం. చివరికి 2016 రిలేకు విడాకులిచ్చేసి సెలబ్రిటీలతో డేటింగ్ చేశాడు. 2018 నుంచి కెనెడియన్ సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్లో ఉన్నాడు మస్క్. పుట్టిన కొడుక్కి కూడా అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు. సింగర్ గ్రిమ్స్‌తో ఓ ఈవెంట్లో.. ఇక మస్క్ డేటింగ్ లిస్ట్చాలా పెద్దదే. అందులో హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ కూడా ఉంది. మస్క్ వెండి, బుల్లితెరలపైనా సందడి చేశాడు. ఐరన్ మ్యాన్ 2, వై హిమ్, మెన్ ఇన్ బ్లాక్:ఇంటర్నేషనల్‌తో పాటు ది సింప్సన్, ది బిగ్‌బ్యాంగ్ థియరీ, సౌత్‌పార్క్, రిక్ అండ్ మోర్టీ, శాటర్డే నైట్ లైవ్ లాంటి టీవీ కార్యక్రమాలతోనూ రేసింగ్ ఎక్స్టింగ్షన్, వెన్నెర్ హెర్గోజ్ లాంటి డాక్యుమెంటరీలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ ఆస్తుల విలువ సుమారు 165 బిలియన్ల డాలర్లుగా అంచనా. ఐరన్‌మ్యాన్ 2 సినిమాలో ఓ సీన్లో.. కన్నతల్లితో మయేతో ఎలన్ ఎలన్ మస్క్.. ఇంజినీర్ మేధావా? లేక సైంటిస్టా లేదంటే కాల జ్ఞానినా? ఇలాంటి డౌట్లు చాలామందికే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకైతే కృత్రిమ మేధస్సునే నమ్ముకున్న మొండి మేధావి అని మాత్రం చెప్పొచ్చు. చదవండి: మస్క్ చిలిపితనం.. పోర్న్ కాయిన్లకు మహర్దశ -
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కు హ్యాకర్ గ్రూప్ బెదిరింపులు
ప్రముఖ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ లక్ష్యంగా చేసుకొని ప్రపంచ ప్రఖ్యాత హ్యాకర్ గ్రూప్ Anonymous హెచ్చరికలు జారీ చేసింది. ఎలోన్ మస్క్ ను బెదరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో మస్క్ తన ట్వీట్లతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల జీవితాలను నాశనం చేశాడని ఆరోపిస్తూ టెస్లా సీఈఓను హెచ్చరించింది. మస్క్ ఇటీవల చేసిన కొన్ని ట్వీట్లు సగటు పని చేసే వ్యక్తి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు, అతని "పబ్లిక్ టెంపర్ టాంట్రమ్స్" కష్టపడి పనిచేసే వ్యక్తుల కలలను నాశనం చేస్తున్నట్లు ఈ వీడియోలో పేర్కొంది. టెస్లా సీఈఓ ఇటీవల వేసిన అనేక ఎత్తుగడలను ఈ వీడియోలో వివరించారు. కేవలం కంపెనీ భవిష్యత్ కోసమే ఈ ట్వీట్లు చేస్తునట్లు, క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుకు సంబంధం లేదని ఆరోపించారు. క్రిప్టోకరెన్సీకి సంబందించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవారు ఎవరి చేత ప్రభావం కావొద్దు అని Anonymous హ్యాకర్ గ్రూప్ పేర్కొంది. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు సంబంధించి బిట్‌కాయిన్ చెల్లింపులను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం కంపెనీ స్వలాభం కోసం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ తయారీ కోసం ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలలో ప్రధానమైన లిథియం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి లిథియం గనులలో చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు ఈ వీడియోలో ప్రస్తావించారు. చదవండి: 5జీ టెక్నాలజీ చాలా సేఫ్: సీఓఏఐ -
స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్
న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ యాజమాన్యంలోని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్ 36 కొత్త లో ఎర్త్ ఆర్బిట్(లియో) ఉపగ్రహాలను ఈ రోజు ప్రయోగించినట్లు ప్రకటించింది. రష్యాలోని ఏరియన్‌స్పేస్ నుంచి ఇవి దూసుకెళ్లాయని తెలిపింది. ‘5 టు 50’ లక్ష్యంలో భాగంగా మరొక శాటిలైట్‌ను ప్రయోగించడం ద్వారా యూకే, అలస్కా, ఉత్తర యూరప్, గ్రీన్‌ల్యాండ్, కెనడావంటి దేశాలకు ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. వాణిజ్య సేవలు 2022 నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది. దీంతో కక్ష్యలోకి చేరిన మొత్తం శాటిలైట్ల సంఖ్య 218కి చేరుకుందని భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ వెల్లడించింది. వన్‌వెబ్ గత మార్చి నెలలో ఇదే అంతరిక్ష కేంద్రం నుంచి 36 ఉపగ్రహాల ప్రయోగించింది. కంపెనీ తన సేవల్లో భాగంగా 648 లియో ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. జూన్ 2021 నాటికి 50 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలకు సేవలను అందించడానికి కంపెనీ ఒక అడుగు దూరంలో ఉంది. వన్‌వెబ్, ఏరోస్పేస్ సంస్థ ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ కింద ఈ ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఏప్రిల్ చివరిలో వన్‌వెబ్ లో పారిస్ కు చెందిన యూటెల్సాట్ కమ్యూనికేషన్స్ 550 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా యుటెల్సాట్ వన్‌వెబ్‌లో 24శాతం వాటాను సొంతం చేసుకుంది. స్పేస్ ఎక్స్ కు పోటీగా వన్‌వెబ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
స్పేస్ఎక్స్ కు ఇండియాలో ఎదురుదెబ్బ
స్టార్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించటానికి ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ చేసున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లకు స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల బీటా వెర్షన్‌ను ముందే అమ్మకుండా నిరోధించాలని లేఖ రాసింది. భారతదేశంలో ఇటువంటి సేవలను అందించడానికి స్పేస్ఎక్స్కు అనుమతులు లేవని ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. స్పేస్ఎక్స్ భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ బీటా సేవల ప్రీ-ఆర్డర్ల కోసం 99 డాలర్లు( సుమారు రూ.7,000) చెల్లించాలని గతంలో ఆఫర్ చేసింది. ఇదే తరహా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతి గ్రూప్(ఎయిర్ టెల్), యుకే ప్రభుత్వ కలిసి వన్‌వెబ్ ప్రాజెక్ట్ కింద 2022 వరకు అందించాలని చూస్తున్నాయి. అలాగే అమెజాన్ ప్రాజెక్ట్ కైపెర్ ఇతర ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవల కోసం ఇతర సంస్థలతో పోటీపడుతుంది. ఇండియాలో స్టార్‌లింక్‌కు సొంత గ్రౌండ్ లేదా ఎర్త్ స్టేషన్లు లేకపోవడంతో పాటు ఇస్రో & టెలికమ్యూనికేషన్ విభాగం(డిఓటి) నుంచి శాటిలైట్ ఫ్రీక్వెన్సీ ఆథరైజేషన్ లేదని ఫోరం తెలిపింది. యుఎస్, కెనడా, యుకే దేశాలలో ఇప్పటికే ఇటువంటి సేవలను అందిస్తున్న స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ 2022 వరకు ఉపగ్రహాల ద్వారా భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని చూస్తుంది. వివిధ దేశాలలో విజయవంతంగా బీటా పరీక్షలు జరగడంతో ఇండియాలో కూడా బీటా సేవల కోసం బుక్ ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సేవలు అందించనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. చదవండి: -
విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ?
స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ‘సీరియల్ నెం.10’ (ఎస్ ఎన్ 10) రాకెట్ విజయవంతంగా భూమిపై దిగినప్పటికీ తర్వాత మంటలు మండుతూ లాంచ్ పాడ్(భూమి)పై పడిపోయింది. ప్రయోగించిన 4 నిమిషాలకు ఆరు మైళ్ళ ఎత్తుకు చేరుకున్న తర్వాత మూడు రాప్టర్ ఇంజిన్లను ఆపివేశారు. కిందకు వస్తున్న క్రమంలో మళ్లీ రాప్టర్ ఇంజిన్లను మండించారు. అయితే, కిందకు విజయవంతగా దిగిన తర్వాత రాకెట్ లో మంటలు మండుతూ భూమిపై పడిపోయింది. నిజానికి ఈ ప్రయోగం సక్సెస్ అయిందని ఈ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇది వరకి ప్రయోగించిన ఎస్ఎన్ 8, 9 వంటి ప్రోటోటైప్ రాకెట్ల మాదిరిగా ఇది పేలి పోలేదని ఆయన అన్నారు. లాండింగ్ పాడ్ పై ఈ రాకెట్ విజయవంతంగా తాకిందని ఇది బ్యూటిఫుల్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ సార్ షిప్ అని ఆయన తెలిపారు. కాగా ఈ పేలుడుకి కారణం తెలియలేదు. బేస్ లో ఎటాచ్ అయిన లాండింగ్ లెడ్స్ తెరచుకోలేదని తెలుస్తుంది. టెక్సాస్ లోని బోకా చికా నుంచి బుధవరం సాయంత్రం 5:15 గంటలకు ఈ రాకెట్ ని ప్రయోగించారు. ఇది మూడవ హై-ఎలిట్యూడ్ పరీక్ష. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ ద్వారా భవిష్యత్ లో వ్యోమగాములను చంద్రుడు, అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. తాజా పరిణామంపై ఆయన స్పందిస్తూ తమ బృందం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజున స్టార్ షిప్ ఫ్లైట్స్ సాధారణమే పోతాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే తన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ నమూనాలను ఆయన హాలీవుడ్ చిత్రాల్లో వినియోగించిన ప్రోటోటైప్ ఇమేజీలతో పోలుస్తున్నారు. -
భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ సంస్థకు అనుబంధ సంస్థ స్టార్ లింక్... శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను మన దేశంలో అందించేందుకు ప్రీబుకింగ్ ప్రారంభించింది. హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రపంచంలో ఇంటర్నెట్ సదుపాయం లేని మారు మూల ప్రాంతాలకు అందించాలన్న లక్ష్యంతో, అలాగే ఇంటర్నెట్ ఇప్పటికే ఉన్న ప్రాంతాల్లో లో లేటెన్సీ (డేటా తన గమ్యస్థానాన్ని చేరుకునే వ్యవధి) కనెక్టివిటీ అందించాలన్న లక్ష్యంతో స్టార్‌లింక్.. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. మన ఇంట్లో డీటీహెచ్ యాంటెన్నా కంటే చిన్న సైజులో ఉండే యాంటెన్నా ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నది దీని లక్ష్యం. 2015లోనే ఎలన్ మస్క్ దీనిపై సూత్రప్రాయ ప్రకటన చేశారు. స్పేస్ఎక్స్ కమ్యునికేషన్ శాటిలైట్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు శాటిలైట్ నెట్వర్క్ ద్వారా అందించనున్నట్టు ప్రకటించారు. దీనిని అభివృద్ధి పరిచేందుకు వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇంటర్నెట్ సేవలు ఇలా.. భూమి నుంచి పంపే ఇంటర్నెట్ సిగ్నల్‌ను స్టార్‌లింక్ శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ శాటిలైట్ తన నెట్‌వర్క్‌లోని ఇతర శాటిలైట్లతో లేజర్ లైట్ సాయంతో కమ్యునికేట్ చేస్తుంది. లక్షిత శాటిలైట్ డేటా రిసీవ్ చేసుకోగానే.. కింద భూమిపై ఉన్న వినియోగదారుడి రిసీవర్‌కు రిలే చేస్తుంది. ఒక్కో శాటిలైట్ మొత్తం శాటిలైట్ల కూటమిలోని ఏవైనా నాలుగు శాటిలైట్లకు ఎల్లవేళలా అనుసంధానమై ఉంటుంది. యారే యాంటెన్నాలు శాటిలైట్లు డేటా బదిలీ చేసేందుకు సహకరిస్తాయి. వాటి నుంచి వినియోగదారులకు చిన్నసైజు డిష్ యాంటెన్నా ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే నార్త్ అమెరికా తదితర ప్రాంతాల్లో బీటా(టెస్టింగ్) సేవలు అందిస్తోంది. ఎక్విప్మెంట్ కిట్ కోసం 499 డాలర్లు వసూలు చేస్తోంది. ఇప్పటివరకు 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుతుందని సంస్థ చెబుతోంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్ ప్రీబుకింగ్ ప్రారంభించింది. స్టార్‌లింక్ వెబ్సైట్లోకి వెళ్లి వినియోగదారులు తమ ప్రాంతంలో ఆ సేవల లభ్యతను తెలుసుకోవచ్చు. సేవల లభ్యత ఉంటే 99 డాలర్లు (సుమారు రూ.7 వేలు) చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్ చేసుకున్న వారందరికీ సేవలు అందుతాయన్న గ్యారంటీ లేదు. ముందుగా వచ్చిన వారికి ముందుగా సేవలు అన్న ప్రాతిపదికన అందించనుంది. అలాగే ఈ సేవలకు మన దేశ అధీకృత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అన్నీ సాఫీగా సాగితే 2022 నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. అంతరిక్షంలోకి 12 వేల శాటిలైట్లు 2019 మే 24న స్పేస్ఎక్స్.. స్టార్‌లింక్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. భూమిపై 550 కి.మీ. ఎత్తులోలో ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్లను స్టార్‌లింక్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఎత్తులో ఈ శాటిలైట్ ఉండడంతో లోలేటెన్సీ రేటు ఉంటుంది. ఒక్కో శాటిలైట్ 260 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉండేలా చాలా కాంపాక్ట్‌గా రూపొందించారు. ఈ శాటిలైట్‌కు నాలుగు యారే యాంటెన్నాలు ఉంటాయి. ఒక సింగిల్ సోలార్ యారే, అయాన్ ప్రొపల్షన్ సిస్టమ్, నావిగేషన్ సెన్సార్లు, డెబ్రిస్ ట్రాకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటాయి. -
అంతరిక్షానికే ‘హైలీ’ అద్భుతం!
భరించలేని సమస్యలు ఎన్ని ఎదురైనా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే వివిధ కారణాల మూలంగా కష్టాల కడలిలో కొట్టుకుపోయిన మన కల లేదా లక్ష్యాన్ని చేరుకోవచ్చని 29 ఏళ్ల హైలీ ఆర్కేనో చెబుతోంది. అమెరికాకు చెందిన హైలీ ఆర్కేనోకు చిన్నప్పుడు ఓ పెద్ద కోరిక ఉండేది. ఎలాగైనా ఆస్ట్రోనాట్ కావాలని ఆమె కలలు కనేది. కానీ హైలీకీ పదేళ్లు ఉన్నప్పుడు విధి కన్నెర్ర చేయడంతో బోన్క్యాన్సర్ బయటపడింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా హైలీ ఫీమర్ బోన్ (తొడ ఎముక) ను తొలగించి ఆ స్థానంలో రాడ్లను అమర్చారు. ప్రస్తుతం హైలీ కృత్రిమ మోకాలి సాయంతో నడవగలుగుతోంది. దీంతో వ్యోమగామి అవ్వాలన్న తన కల కరిగిపోయిందనుకుంది హైలీ. కానీ ఈ ఏడాది చివర్లో స్పేస్ఎక్స్ చేపట్టబోయే ‘సివిలియన్ స్పేస్ ఎక్స్ మిషన్’లో రెండో క్రూ మెంబర్‌గా హైలీ ఎంపికైనట్లు బిలియనీర్ జారెడ్ ఐజక్‌మాన్ ప్రకటించారు. దీంతో హైలీ చిరకాలం నాటి కల చిగురులు తొడిగింది. అన్నీ సక్రమంగా జరిగితే అతిచిన్న వయసు(29)లో స్పేస్‌లోకి వెళ్లిన మొదటి అమెరికన్‌గా, తొలి ప్రోస్తెటిక్ స్పేస్ ట్రావెలర్‌గా హైలీ చరిత్ర సృష్టించనుంది. పదేళ్ల వయసులో హైలీ ఏ హాస్పిటల్లో అయితే బోన్క్యాన్సర్కు చికిత్స తీసుకుందో అదే హాస్పిటల్లో అంటే ‘సెయింట్ జుడే చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్’లో ఆంకాలజీ యూనిట్లో అసిస్టెంట్ ఫిజీషియన్‌గా చేరింది. చిన్నతనంలో కాలిని కోల్పోయినప్పటికీ ఆమె అధైర్యపడకుండా వైద్యవిద్యను అభ్యసించి మళ్లీ అదే ఆసుపత్రిలో డాక్టరుగా సేవలందించడం ఎంతో గొప్ప విషయం. ఈ కారణంతోనే ఐజక్‌మాన్ హైలీని తన క్రూలో రెండో సభ్యురాలుగా చేర్చుకున్నారు. అలా జుడే హాస్పిటల్లో చేరడం వల్ల హైలీకి తన చిరకాల కోరిక తీరే మార్గం దొరికింది. ఆస్ట్రోనాట్‌గా ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ స్పేస్‌లోకి వెళ్లే గోల్డెన్ చాన్స్ హైలీని వెతుక్కుంటూ రావడం విశేషం. ప్రముఖ స్పేస్ ఎక్స్ సంస్థ త్వరలో లాంచ్ చేయబోయే డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో నలుగురు పర్యాటకులను పంపనుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఓ నాలుగురోజుల పాటు భూమి చుట్టూ తిరిగి మళ్లీ భూమిమీదకు వస్తుంది. ఈ మొత్తం మిషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని బిలియనీర్ అయిన 38 ఏళ్ల జారెడ్ ఐజక్‌మాన్ భరిస్తున్నారు. పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తోన్న ‘షిఫ్ట్ ్ట4 పేమెంట్స్’ కంపెనీకీ ఆయన వ్యవస్థాపక సీఈఓగా వ్యవహరిస్తున్నారు. సివిలియన్ పైలట్ అయిన ఐజక్‌మాన్ నలుగురు మాత్రమే వెళ్లే ఈ స్పేస్ క్రాఫ్ట్ లో తనతోపాటు మరో ముగ్గురిని సొంత ఖర్చుతో తీసుకెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురు సభ్యుల కోసం ఆయన వివిధ రకాల పద్ధతుల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైలీని రెండో క్రూ మెంబర్‌గా ఎంపిక చేశారు. ‘‘హైలిన్ చిన్నతనంలోనే ఎంతో కష్టమైన సవాళ్లను ఎదుర్కోని ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఆమె స్పేస్‌లోకి వెళ్లి.. ప్రపంచానికే స్ఫూర్తిదాయక సందేశంతోపాటు మరెంతోమందికి ఆదర్శంగా నిలవనుంది. హైలీ అనేక కష్టాలు ఎదుర్కొని నేడు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోనుండటం గొప్ప విశేషం. అందుకే ఈ అమ్మాయి అంతరిక్షానికే ఓ అద్భుతం’’ అని ఐజక్‌మాన్ చెప్పారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఆస్ట్రోనాట్స్ తీసుకునే ఎటువంటి శిక్షణనూ నేను తీసుకోలేదు. అయినా నాకు స్పేస్‌లోకి వెళ్లడానికి ఎలాంటి భయం లేదు. బహుశా చిన్నతనం నుంచే క్యాన్సర్‌తో పోరాడడం వల్ల నాకు ఈ ధైర్యం వచ్చి ఉండవచ్చు. మరో విషయం ఏమిటంటే, ఈ మిషన్‌లో నన్ను ఎంపిక చేసేవరకు నేను ఎప్పుడూ స్పేస్‌లోకి వెళ్తానని అస్సలు అనుకోలేదు. ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్నవారికే అవకాశం ఉంటుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్లకు కూడా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని సివిలియన్ స్పేస్ మిషన్ ఇస్తోంది. ఈ మిషన్ ఎన్నో విషయాలను మార్చేస్తూ.. క్యాన్సర్‌ను జయించిన నన్ను స్పేస్‌లోకి పంపుతూ నమ్మశక్యం కాని గౌరవాన్ని ఇస్తోంది’’ అని హైలీ సంతోషంతో చెప్పింది. చదవండి: చంద్రుడి పైకి తొలి మహిళ! చదవండి: నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే! -
షేర్లు అమ్మేసిన ఎలోన్ మస్క్ సోదరుడు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలోన్ మస్క్ సోదరుడు, టెస్లా ఇంక్. బోర్డు సభ్యుడు కింబాల్ మస్క్ తన వాటా షేర్లను అమ్మేశాడు. యుఎస్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమీషన్ తెలిపిన వివరాల ప్రకారం కింబాల్ మస్క్ 25.6మిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయించారు. 48 ఏళ్ల కింబాల్ మస్క్ ఈ ఫిబ్రవరి 9న 30,000 షేర్లను సగటున 852.12 డాలర్లకు విక్రయించినట్లు యుఎస్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమీషన్ తెలిపింది. అలాగే కింబాల్ మస్క్ ది కిచెన్ రెస్టారెంట్ సీఈఓ, గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. టెస్లా షేర్లు బుధవారం 5.3 శాతం పడిపోయి 804.82 డాలర్లకు చేరుకుంది. టెస్లా షేర్లు 2020లో 743 శాతం పెరగగా 2021లో మరో 14 శాతం పెరిగింది. టెస్లా ఒక షేర్ ధర జనవరి 8న 880 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం టెస్లా ఇన్సైడర్లు కంపెనీలో 19.6 శాతం వాటాను కలిగి ఉన్నారు. అలాగే మరో టెస్లా బోర్డు సభ్యుడు ఆంటోనియో గ్రాసియాస్ కూడా 150,747 టెస్లా షేర్లను విక్రయించాడు. అతను కంపెనీలో 2,545 స్టాక్ హోల్డింగ్ కలిగి ఉన్నాడు. అతను భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అమ్మేసుకున్నట్లు తెలుస్తుంది. దీనిని లాంగ్-టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్(LEAP) అని పిలుస్తారు. -
కుమారుడి ఫోటో షేర్ చేసిన ఎలోన్ మస్క్
స్పేస్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఇటీవల తన కొడుకుతో దిగిన ఒక ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. అతని తొమ్మిది నెలల కుమారుడి పేరు X Æ A-Xii. ఈ బాలుడు గత ఏడాది మే 4న ఎలోన్ మస్క్, భార్య గ్రిమ్స్ కు జన్మించాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంతలా వైరల్ అవడానికి ప్రధాన కారణం "ది సెకండ్ లాస్ట్ కింగ్డమ్" అనే శీర్షికతో పోస్ట్ చేయడమే. ఈ ఫొటోలో ఎలోన్ మస్క్ బెడ్ మీద కూర్చొని ఫోన్ స్టోన్ గ్రే టీ-షర్టు ధరించి ఫోన్లో మాట్లాడుతుండగా తన కొడుకు టీ షర్టును లాగుతూ నాలుకను బయటకి పెట్టాడు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ షేర్ చేసిన ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. దీనిని ఇప్పటికే 487వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది అద్భుతం, నాతో ఆడుకొని తరువాత ఫోన్లో మాట్లాడండి అని పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. The Second Last Kingdom pic.twitter.com/Je4EI88HmV — Elon Musk (@elonmusk) February 6, 2021 చదవండి: మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త! సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ -
మరోసారి పేలిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ తన మార్స్ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ "స్సేస్ ఎక్స్" హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్‌షిప్ నమూనా రూపొందించారు. ఈ నమూనాలో భాగంగా స్టార్‌షిప్ రాకెట్ లను పరీక్షిస్తున్నారు. తాజాగా టెక్సాస్‌లోని బోకా చికా నుంచి మంగళవారం ప్రయోగించిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ ఎస్ఎన్9 రాకెట్ ల్యాండ్ అవుతుండగా పేలిపోయింది. ఇంతక ముందు కూడా డిసెంబర్ నెలలో ఎస్ఎన్8 స్టార్‌షిప్ రాకెట్ కూడా పేలిపోయింది. టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్ కక్ష్యలోకి అధిరోహించి కిందకు భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో 6 నిమిషాల 26 సెకన్ల వ్యవధి తర్వాత పేలిపోయింది.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) Live feed of Starship SN9 flight test → https://t.co/Hs5C53qBxb https://t.co/ioM0D5J91I — SpaceX (@SpaceX) February 2, 2021 స్సేస్ ఎక్స్ యొక్క స్టార్‌షిప్ రెండు రాకెట్ లు వరుసగా పేలిపోయాయి. ఎలాన్ మస్క్ స్థాపించిన ఈ స్పేస్ ఎక్స్ సంస్థ.. భవిష్యత్ రోజుల్లో మార్స్ మిషన్, అంతరిక్షంలోకి మానవులను, 100 టన్నుల సరుకులను తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేస్తున్న హెవీ-లిఫ్ట్ రాకెట్ నమూనా ఇది. సెల్ఫ్ గైడెడ్, 16 అంతస్తుల ఎత్తైన రాకెట్.. ప్రారంభంలో స్టార్‌షిప్ రాకెట్ ఎలాంటి సమస్య లేకుండా లాంచ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఈ వ్యోమనౌక కొద్దిసేపు అది గాలిలోనే ఉండిపోయింది. ఈ సమయంలో దాని ఇంజిన్లను ఆపివేసి, ఏరోడైనమిక్ పద్దతిలో భూమిపైకి తిరిగి దించడానికి "బెల్లీ-ఫ్లాప్" ట్రిక్ ను అమలు చేశారు. తిరిగి కిందకు వచ్చేటప్పుడు నేరుగా దించడానికి ప్రయత్నించినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. కుప్పకూలే సమయంలో రాకెట్లో వేగం పెరిగినట్లు ఫుటేజీ ద్వారా అర్ధమవుతున్నది. ఈ రాకెట్‌ను స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేశారు. -
చైనా కంపెనీపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీపై టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ అయిన ఎక్స్‌పెంగ్ సంస్థ తన(టెస్లా) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యొక్క పాత సోర్స్ కోడ్లను చోరీ చేసిందని ఎలోన్ మస్క్ ఆరోపించారు. అదే సమయంలో గతంలో ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ నుంచి ఎక్స్‌పెంగ్ డేటా చోరీ చేయించింది అని తెలిపారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఉపయోగించే లిడార్ టెక్నాలజీని ఎక్స్‌పెంగ్ ఎందుకు ఉపయోగిస్తోందని తన అనుచరులలో ఒకరు ట్విటర్లో అడిగిన ప్రశ్నకు మస్క్ ఇలా సమాధానం ఇచ్చారు. "వారి దగ్గర మా సాఫ్ట్వేర్ యొక్క పాత వెర్షన్ ఉంది, వారు ఆపిల్ కోడ్‌ను కూడా దొంగిలించారు" అని బదులిచ్చారు. 2019 జూలైలో, టెస్లా మాజీ ఇంజనీర్ గువాంగ్జి కావో టెస్లా యొక్క ఆటోపైలట్ సోర్స్ కోడ్‌ను తన ఐక్లౌడ్ ఖాతాలో అప్లోడ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఎక్స్పెంగ్కు సీక్రెట్ కోడ్ ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. అందుకు గాను టెస్లా కంపెనీ కావోపై కేసు కూడా నమోదు చేసింది. (చదవండి: వన్‌ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్) -
‘స్పేస్ ఎక్స్’: మరోసారి నింగిలోకి మనుషులు
న్యూయార్క్ : ‘స్పేస్ ఎక్స్’ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. నాసాకు చెందిన ముగ్గురు, జపాన్‌కు చెందిన ఓ వ్యోమగామిని ఈ శనివారం నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి నాసా మంగళవారం అనుమతి తెలిపింది. శనివారం రాత్రి 7:49 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకేట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు బయలుదేరనుంది. ( ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’ ) అమెరికన్ వ్యోమగాములు మైకెల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శనాన్ వాకర్, జపాన్‌కు చెందిన సోచి నగూచీలు ఈ మిషన్‌లో భాగం కానున్నారు. 2021లో మరో మానవసహిత అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. కాగా, గత మే నెలలో స్పేస్ ఎక్స్‌కు చెందిన ఓ రాకేట్ ఇద్దరు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి నష్టం లేకుండా ఆగస్టు నెలలో క్షేమంగా భూమిపైకి చేరింది. -
‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ : ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రయోగశాల ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. అంగారకుడికిపైకి మానవులను తీసుకెళ్లే మిషన్‌ను చేపట్టి ఇప్పటికే ఎంతో పురోగతిని సాధించిన స్పేస్ ఎక్స్ ప్రపంచంలో ఏ దేశానికైనాసరే గంట లోపల ఆయుధాలు తీసుకెళ్లి దించి వచ్చే రాకెట్‌ను తయారు చేసేందుకు అమెరికా సైన్యంతో ఒప్పందం చేసుకుంది. ఓ చోటుకు ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించడంలో ఇప్పటికే విజయం సాధించిన స్పేస్ ఎక్స్ కార్గో రాకెట్ అంటే సరకును రవాణా చేసే రాకెట్‌ను తయారు చేయబోవడం మాత్రం ఇదే మొదటిసారి. చదవండి: విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం అందుకే ఈ ప్రయత్నంలో తనకు అనుబంధంగా కొనసాగుతున్న వైమానిక సంస్థ ఎక్స్ ఆర్క్ సహకారాన్ని కూడా తీసుకుంటోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు 7,500 మైళ్ల దూరంలోని అఫ్ఘానిస్థాన్లోని అమెరికా వైమానిక స్థావరానికి ఆయుధాలను గంటలో చేరవేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుతం కార్గో విమానం ద్వారా అక్కడికి ఆయుధాలను చేరవేయడానికి 15 గంటల సమయం పడుతోంది. అతి వేగంగా ఆయుధాలను తరలించే అత్యాధునిక కార్గో విమానాలు అమెరికా వద్ద ప్రస్తుతం 233 ఉన్నాయి. అయితే వాటి గరిష్ట వేగం గంటకు 590 మైళ్లే. 80 టన్నుల సరకు రవాణా చేసేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా తీసుకోను -
జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ చేపట్టిన చంద్రమండల యాత్రకు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ‘హ్యూమన్ ఎక్స్‌ఫ్లోరేషన్, ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్’ హెడ్‌గా కాథీ లూడెర్స్ను నియమిస్తున్నట్లు నాసా ప్రతినిధి జిమ్ బ్రైడెన్స్టోన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇద్దరు వ్యోమగాములతో మే 30వ తేదీన ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ఈ కార్యక్రమాన్ని కాథీ లూడెర్స్ స్వయంగా పర్యవేక్షించారు. ఆమె 1922లో నాసాలో చేరారు. స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలు తయారు చేసిన స్పేస్ క్యాప్సూల్స్ అభివృద్ధి విషయంలో టెస్టింగ్ ప్రోగ్రామ్‌లకు ఇన్చార్జిగా సేవలందించారు. 2024లో చేపట్టనున్న చంద్రమండల యాత్రకు నాసా సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలన్నదే ఈ యాత్ర లక్ష్యం. నాసా చంద్రమండల యాత్ర కాథీ లూడెర్స్ ఆధ్వర్యంలోనే జరగనుంది. -
రాకెట్‌ని నిలబెట్టిన మన అమ్మాయి
భూమి నుంచి 408 కి.మీ. ఎత్తులో ఆకాశంలో అంతరిక్ష కేంద్రం ఉంది. అది ఆమెరికా వాళ్లది. రష్యా వాళ్లది. జపాన్ వాళ్లది, ఐరోపా వాళ్లది. కెనడా వాళ్లది. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు నిరంతరం పైన ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో ఏడుగురు అంతరిక్ష పరిశోధకులు ఉన్నారు.. నాసా నుంచి ఈ ఆదివారం వెళ్లిన డో హర్లీ, బాబ్ బెన్కెన్ లను కూడా కలుపుకుని. అయితే ఆ ఇద్దరిని ‘నాసా’ గానీ, మిగతా నాలుగు అంతరిక్ష సంస్థలు గానీ పైకి పంపలేదు. ‘స్పేస్ ఎక్స్’ అనే ఒక అమెరికన్ ప్రైవేటు సంస్థ పంపింది! అంతరిక్షయాన చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ ఇలా రోదసీలోకి మనుషుల్ని పంపడం ఇదే మొదటిసారి. వాళ్లను ‘క్రూ డ్రాగన్’ అనే వ్యోమనౌకలో పైన వదిలిపెట్టిన ‘ఫాల్కన్ 9’ రాకెట్ వెంటనే భూమి మీదికి తిరిగి వచ్చేసింది కూడా! టు అండ్ ఫ్రో.. రాకెట్ ప్రయాణం సక్సెస్. ఆ సక్సెస్‌లో కణిక అనే 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని వాటా కూడా ఉంది! కణిక లక్నో అమ్మాయి. ప్రస్తుతం బోస్టన్లోని ఎం.ఐ.టి.లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 2018లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ‘స్పేస్ ఎక్స్’ లో ఇంటెర్న్‌గా పని చేసింది. భూమిపై నుంచి లేచేందుకు, తిరిగి భూమి మీద దిగేందుకు ఫాల్కన్ 9కు బలమైన కుదురు కాళ్లను (ల్యాండింగ్ లెగ్స్) డిజైన్ చేసిన ఆనాటì స్పేస్ ఎక్స్ బృందంలోని ఎనిమిది మందిలో కణికా గఖర్ కీలక సభ్యురాలు!(చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్) లక్నోలోని ఇందిరానగర్‌లో 86 ఏళ్ల వయసున్న కణిక బామ్మగారు రాజకుమారి ఇప్పుడు కణిక ఇండియా రాక కోసం చూస్తున్నారు. ‘ఆ రాకెట్‌ను డిజైన్ చేసింది నా మనుమరాలే’ అని ఇప్పటికే ఆ బామ్మ గారు తన ఆనందాన్ని తెలిసిన వారందరితోనూ పంచుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు. ‘స్పేస్ ఎక్స్’ తక్కువ సంస్థేమీ కాదు. ‘నాసా’కు యంగర్ వెర్షన్. అందులోనే మూడు నెలలు ఇంటెర్న్‌గా చేశారు కణిక. ఫాల్కన్ 9 ల్యాండింగ్ లెగ్స్ డిజైనింగ్‌లో ప్రధానమైన బాధ్యతలు ఆమెకే అప్పగించారు. మూడుసార్లు దరఖాస్తు చేసి, మూడుసార్లు ఇంటర్వ్యూకు వెళితేగానీ సాధించలేకపోయిన ఇంటెర్న్షిప్ అది. అందుకే పెద్ద బాధ్యత అని భయపడలేదు కణిక. టీమ్‌లో సీనియర్స్ ఉన్నారన్న తడబాటు లేకుండా టీమ్‌ని నడిపించారు. ఇంటెర్న్‌గా ఉన్నప్పుడు ‘స్పేస్ ఎక్స్’ యజమాని ఎలాన్ మస్క్‌తో, ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు డో హర్లీ, బాబ్ బెన్కెన్తో కూడా ఫాల్కన్ 9 డిజైనింగ్‌లోని మార్పు చేర్పుల గురించి తరచు మాట్లాడేవారు కణిక. ‘‘వాళ్లిచ్చే మోటివేషన్ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో చెప్పలేను’’ అని ఎం.ఐ.టి.లోని సహ విద్యార్థులతో అంటుంటారు కణిక. ఈ ఏడాది ఆగస్టులో ఆమె చదువు అయిపోతుంది. వెంటనే ఉద్యోగం. ఎక్కడో కాదు. తనకెంతో నచ్చిన ‘స్పేస్ఎక్స్’లోనే! పిల్లలందరికీ ఎగరాలనే ఆశ ఉంటుంది. కణిక కూడా ఐదేళ్లకే ఆకాశం వైపు చెయ్యి చూపించింది. ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని ప్రతి తల్లీ తండ్రి అడిగినట్లే నాన్న సందీప్, అమ్మ సిమీ అడిగినప్పుడు ‘రాకెట్లో రయ్‌న ఎగిరిపోతా’ అంది కణిక. అదిప్పుడు ఇంకోలా నెరవేరింది. రాకెట్‌ను రయ్‌న ఎగరనిస్తోంది! కణిMý, కణిక అక్క (ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో డాక్టర్) యు.ఎస్. చదువుల కోసం తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హ్యూస్టన్ వచ్చేశారు. పదవ తరగతి వరకు బెంగళూరులోనే చదివారు కణిక. తర్వాత సింగపూర్‌లో ఐ.బి.స్కూల్లో చేరారు. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. కణిక బామ్మగారు పెద్దగా చదువుకోలేదు. అయితే చదువు ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో మనవరాలు ఎప్పటికప్పుడు తనకు పంపే వీడియోలలో చూస్తుంటారు. ‘‘ఆ చిన్న పిల్ల ఇంత పెద్దదయిందా..’ అని.. ఆకాశంలో ఎప్పుడైనా కనిపించే పెద్ద నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయే చిన్నపిల్లలా.. బుగ్గలు నొక్కుకుంటుంటారు బామ్మగారు. ఇప్పుడా పెద్ద నక్షత్రం బుగ్గలు పుణకడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్పేస్ ఎక్స్.. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ అనేది అమెరికాలోని ప్రఖ్యాత ప్రైవేటు అంతరిక్షయాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ. కాలిఫోర్నియాలోని హాథోర్న్‌లో ఉంది. ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్. ఏరోస్పేస్ టెక్నాలజీ అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకల్ని తయారు చేస్తుంది. అంతరిక్షయానానికి ఏర్పాట్లు చేస్తుంది. అంగారకుడిలో మానవుల కోసం ఒక కాలనీ నిర్మించేందుకు, అక్కడికి భూగోళం నుంచి మనుషుల్ని తీసుకెళ్లేందుకు ఏళ్లుగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది. ‘నాసా’ వంటి సంస్థే తన వ్యోమగాముల్ని రోదసీలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సహకారం తీసుకుందంటే ఎలాన్ మస్క్ ఏ స్థాయి అంతరిక్ష పారిశ్రామికవేత్తో స్పష్టం అవుతోంది. 48 ఏళ్ల ఎలాన్ మస్క్ పద్దెనిమిదేళ్ల క్రితం ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంటే తన ముప్పై ఏళ్ల వయసులో! అతడికి మూడు దేశాల పౌరసత్వం ఉంది. (దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా). టెస్లా కార్ల తయారీ కంపెనీ అతడిదే. ఇంకా రాబడినిచ్చే అనేక వాణిజ్య సంస్థలు, వ్యాపకాలు ఉన్నాయి. ఆరుగురు పిల్లలు. మొదటి భార్య రచయిత్రి. రెండో భార్య బ్రిటిష్ నటి. ఇద్దరికీ విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రైమ్స్ అనే కెనడా గాయనితో కలిసి ఉంటున్నాడు. గ్రైమ్స్కి మే 4న మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు అంకెలు, ఆల్ఫాబెట్స్ కలిపి ‘ఎక్స్ యాష్ ఎ ట్వెల్’ అని ఎలాన్ పేరు పెట్టుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
వాషింగ్టన్: అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు లాంచ్ ప్యాడ్ 39ఏ నుంచి క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను మోసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెహంకన్ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయల్దేరింది. నింగిలోకిదూసుకెళ్లిన 19గంటల తర్వాత ఐఎస్ఎస్కు చేరుకుంది. నలుపు తెలుపు రంగుల్లో బుల్లెట్ ఆకారంలో ఉన్న డ్రాగన్ కాప్సూ్యల్ నింగికి ఎగరడానికి ముందు ‘లెట్స్ లైట్ దిస్ క్యాండిల్’అంటూ వ్యోమగామి హార్లీ ఉద్నిగ్నంగా అరిచి చెప్పారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములతో వీరూ పనిచేస్తారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్ నేరుగా వీక్షించారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌తో ట్రంప్ ముచ్చటించారు. ఆయనని ఒక మేధావి అంటూ ప్రశంసించారు. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాముల్ని తీసుకొని రోదసి యాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అగ్రరాజ్యానికి ఊరట కరోనా వైరస్ విజృంభణతో లక్ష మందికిపైగా మరణించడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయిన తరుణంలో స్పేస్ ఎక్స్ సాధించిన విజయం అగ్రరాజ్యానికి బాగా ఊరటనిచ్చింది. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వాయిదా పడింది. 2011 తర్వాత మానవసహిత అంతరిక్ష ప్రయాణాలు అమెరికా నేల మీద నుంచి జరగలేదు. చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయోగాలపైనే నాసా దృష్టి సారించింది. రష్యాకు చెందిన సూయజ్ అంతరిక్ష నౌకలో అమెరికా వ్యోమగాముల్ని రోదసిలోకి పంపిస్తోంది. ఇంచుమించుగా దశాబ్దం తర్వాత అమెరికా గడ్డ మీద నుంచి ఒక ప్రైవేటు సంస్థ రోదసిలోకి మనుషుల్ని పంపడంతో అమెరికా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నట్టయింది. స్పేస్ ఎక్స్.. అంగారక గ్రహంపై నివసించడానికి వీలుగా కాలనీలు నిర్మించాలని, అంతరిక్ష ప్రయాణానికయ్యే వ్యయ భారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన బిలియనీర్ ఎలన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో ఈ సంస్థను ప్రారంభించారు. అప్పట్నుంచి వ్యోమనౌకల తయారీ పనులు, ఇతర అంతరిక్ష పరిశోధనల్లో ఈ సంస్థ నిమగ్నమైంది. 2011 తర్వాత ఐఎస్ఎస్ కేంద్రానికి సరకు రవాణా చేసిన అనుభవం కూడా ఉంది. ప్రయోగ బృందంలో భారతీయుడు ఈ మధ్య కాలంలో చరిత్ర సృష్టించే అన్ని ప్రయోగాల్లోనూ భారత్ భాగస్వామ్యం ఏదో విధంగా ఉంటోంది. అలాగే స్సేస్ ఎక్స్ డెమో–2 ప్రయోగంలోనూ భారత ఇంజనీర్ ఒకరు ఉండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పేస్ క్రూ ఆపరేషన్స్ అండ్ రీసోర్సెస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాల రామమూర్తి ఈ ప్రయోగం సమయంలో కెన్నడీ లాంచ్ కంట్రోల్ సెంటర్ ఫైరింగ్ రూమ్ 4లో విధులు నిర్వర్తించారు. చెన్నైకి చెందిన రామమూర్తి అన్నా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొమ్మిదేళ్లుగా ఆయన స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్నారు. ఇవాళ అద్భుతమైన రోజు. దేశం సంక్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ స్పేస్ ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అందుకే నేను స్వయంగా దీనిని వీక్షించడానికి వచ్చాను. నాసాకు, ఎలన్ మస్క్‌కు అభినందనలు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు పట్టరాని భావోద్వేగంతో నోట మాట రావడం లేదు. నేను కన్న కలలు, స్పేస్ ఎక్స్‌లో ప్రతీ ఒక్కరి కల నిజమైన రోజు. స్పేస్ ఎక్స్ బృందం చేసిన కృషితో అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. నాసా, ఇతర భాగస్వాముల సహకారంతో ఇది సాధ్యమైంది. ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ సీఈవో నింగిలోకి దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
ఎలన్ మస్క్.. ఈ పేరుకు అర్థం ఏంటి?
స్పేస్ఎక్స్, టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్ మస్క్ ప్రియురాలు గ్రిమ్స్‌కు మే 5న బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. కాగా తన బిడ్డ ఫోటోలను ఎలన్ మస్క్ ట్విటర్లో కూడా షేర్ చేశారు. నెటిజన్లు ఫోటోలను చూసి బేబీ క్యూట్‌గా ఉందంటూ ట్వీట్స్ కూడా చేశారు. మీకు పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారని ఎలన్ మస్క్‌ను ఒక నెటిజన్ ట్విటర్లో ప్రశ్నించాడు. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ.. మాకు పుట్టిన బిడ్డ పేరు 'X Æ A-12 మస్క్' అని చెప్పాడు. అయితే ఎలన్ మస్క్ చెప్పిన పేరు అర్థం కాక నెటిజన్లు నెత్తి గోక్కున్నారు.అంతేగాక ఎలన్ చెప్పిన పేరు సంభావ్యతను(ప్రాబబిలిటీ)ని పోలి ఉందంటూ కామెంట్లు చేశారు. (నా బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్: సింగర్) దీనిపై ఎలన్ మస్క్ ప్రియురాలు గ్రిమ్స్ ట్విటర్లో క్లారిటీ ఇచ్చారు. ' X Æ A-12 లో X అంటే అన్నోన్ వేరియబుల్, Æ A అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, A-12 అంటే తమ ఫేవరెట్ ఎయిర్‌క్రాఫ్ట్( ఎస్ఆర్-12) అంటూ ' పేర్కొన్నారు. అయితే గ్రిమ్స్ ఇంత వివరంగా చెప్పినా ఇప్పటికి ఆ పేరును ఎలా పలకాలో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు 17వేలకు పైగా రీట్వీట్లు, 86వేలకు పైగా లైకులు రావడం విశేషం. కాగా విజువల్ ఆర్టిస్టు, రికార్డు ప్రొడ్యూసర్, గాయనిగా గుర్తింపు పొందిన 31 ఏళ్ల క్లేర్ బౌచర్.. గ్రిమ్స్ అనే పేరుతో పాపులరయ్యారు. 2018 నుంచి గ్రిమ్స్ ఎలన్ మస్క్‌తో డేటింగ్లో ఉన్నారు. (హిజ్బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం) X Æ A-12 Musk — Elon Musk (@elonmusk) May 5, 2020 •X, the unknown variable ⚔️ •Æ, my elven spelling of Ai (love &/or Artificial intelligence) •A-12 = precursor to SR-17 (our favorite aircraft). No weapons, no defenses, just speed. Great in battle, but non-violent 🤍 + (A=Archangel, my favorite song) (⚔️🐁 metal rat) — ꧁ ༒ Gℜiꪔ⃕es ༒꧂ 🍓🐉🎀 小仙女 (@Grimezsz) May 6, 2020 -
నా బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్: సింగర్
తనకు పుట్టబోయే బిడ్డకు స్పేస్ఎక్స్, టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తండ్రి అని ఆయన ప్రియురాలు, ప్రముఖ కెనడా సింగర్ క్లేర్ బౌచర్ తెలిపారు. తాను ఇప్పుడు గర్భవతినని, ఎలన్ మస్క్‌తో కలిసి త్వరలోనే తమ జీవితాల్లోకి బిడ్డను ఆహ్వానించబోతున్నట్లు వెల్లడించారు. అయితే బిడ్డకు జన్మనివ్వడం గురించి తానెప్పుడూ ఆలోచించలేదని.. ఇదొక పిచ్చి త్యాగం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి క్లేర్ బౌచర్ రోలింగ్ స్టోన్‌తో మాట్లాడుతూ... ‘‘ ప్రతీ అమ్మాయి తన శరీరంపై స్వాతంత్ర్యాన్ని కోల్పోతుంది. ఇది నిజంగా క్రేజీగా ఉంది. ప్రపంచంలోని సగం జనాభా మాత్రమే ఇలాంటి త్యాగం చేస్తారు. నాకైతే ఈ విషయం ఎంతో లోతైనదిగా అనిపిస్తోంది. ఇప్పుడు నా శక్తిని నేను త్యాగం చేస్తున్నా. ఎవరికో లొంగిపోయినట్లుగా అనిపిస్తుంది. అసలు నా జీవితంలో ఇలాంటి ఓరోజు వస్తుందని ఊహించలేదు. ఇదో కమిట్మెంట్ అంతే. అయితే నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను నేను అమితంగా ప్రేమిస్తాను’’అని చెప్పుకొచ్చారు.(టెస్లా సీఈవో స్టెప్పులు, వీడియో వైరల్) కాగా విజువల్ ఆర్టిస్టు, రికార్డు ప్రొడ్యూసర్, గాయనిగా గుర్తింపు పొందిన 31 ఏళ్ల క్లేర్ బౌచర్.. గ్రిమ్స్ అనే పేరుతో పాపులరయ్యారు. 2018 నుంచి ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్నారు. ఇక ఆమెకు ఇది మొదటి సంతానం కాగా.... ఎలన్ మస్క్‌కు ఇప్పటికే ఐదుగురు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య జస్టిన్‌తో ఆయనకు కలిగిన సంతానం వీరు. కాగా ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో జరిగిన గేమ్ అవార్డ్స్‌లో గ్రిమ్స్ తన కొత్త సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వేడుకకు హాజరైన ఎలన్ మస్క్ ఆమెను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. -
ఒక్క గంటలో ఆయన సంపాదన రూ.16వేల కోట్లు
షేర్ మార్కెట్ ఓడలను బండ్లను చేస్తుంది.. బండ్లను ఓడలు చేస్తుందన్నది పాతమాట. ఈ మధ్య ట్రెండ్ మారింది. దిగ్గజ కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకుంటూ సంపదను పోగు చేసుకుంటున్నాయి. స్పేస్ ఎక్స్, టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలన్ మస్క్ సంపాదన ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్ డాలర్లు (రూ.16వేల కోట్లకు పైగా) పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగానే ఉంటాయనే అంచనాలు, మోడల్ వై క్రాసోవర్ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్ స్ట్రీట్‌లో ఈ కంపెనీల షేర్లు పరుగులుపెట్టాయి. టెస్లా సీఈవో స్టెప్పులు, వీడియో వైరల్ 580.99 డాలర్లు వద్ద ఈ షేరు ట్రేడింగ్ ముగించింది. ఒక దశలో 12శాతం పెరిగి 649 వద్దకు చేరింది. ఈ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద దీంతో 36బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ అంచనా కట్టింది. అతనికి టెస్లాలో ఐదోవంతు షేర్లు, స్పేస్ ఎక్సోప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్లో 14.6 బిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. టెస్లా మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను ఇప్పటికే అధిగమించింది. టెస్లా మూడో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో షేర్ల ధరలు పెరుగుతున్నాయి. చైనాలో మోడల్ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కంపెనీ 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్‌కు భారీ షాక్.. 2 నిమిషాల్లో.. -
ఐఎస్ఎస్కు ఎలుకలు, పురుగులు
కేప్ కార్నివాల్ (అమెరికా): ఆదివారం తెల్లవారుజామునే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కొత్త మిత్రులు సందడి చేశాయి. స్టేషన్ కమాండర్, ఇటలీకి చెందిన ల్యూకా పార్మిటానో ఓ పెద్ద రోబో చెయ్యిని వినియోగించి వాటిని కేంద్రంలోకి తీసుకొచ్చి సాదరస్వాగతం పలికారు. ఇంతకీ ఈ మిత్రులు ఎవరో చెప్పలేదు కదా..! ఓ స్మార్ట్ రోబో, కండలుదిరిగిన పెద్దపెద్ద ఎలుకలు, క్రిమిసంహారక పురుగులే..!‘స్పేస్ ఎక్స్’అనే అమెరికా సంస్థే వీటిని ఐఎస్ఎస్కి చేర్చింది. దీనికోసం కేప్ కార్నివాల్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రెండు అంతరిక్ష నౌకల సాయంతో 3 రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎలుకలు, పురుగులే కదా.. వీటి బరువు కేవలం ఓ రెండు, మూడు కిలోలు ఉంటాయని అనుకుంటే పొరపాటే. వీటి బరువు దాదాపు 3 టన్నులు.. అంటే 2,720 కిలోగ్రాములు అన్నమాట. కొత్త మిత్రుల్లో ఓ 40 ఎలుకలు ఉన్నాయి. వీటిని కండలు, ఎముకల పరీక్షల కోసం అక్కడకు పంపించారు. వీటిలో జన్యుపరంగా తయారు చేయబడిన బాహుబలి లాంటి ఎలుకలు 8 ఉన్నాయి. వీటి బరువు సాధారణ ఎలుకల కంటే రెట్టింపు ఉంటుంది. అలాగే లక్షా 20 వేల నులి పురుగులు ఉన్నాయి. వీటిని వ్యవసాయంలో క్రిమిసంహారకం కోసం అక్కడకు పంపించారు. కృత్రిమ మేథస్సు సాంకేతికతతో పనిచేసే రోబో అయితే ఎదుటివారి భావాలను అర్థం చేసుకోగలదు. దీని పేరు సిమన్. దీనిని వ్యోమగాముల భావాలను అర్థం చేసుకోవడానికి పంపించారు. ఇక ఐఎస్ఎస్లో ఉన్న ఆరుగురు వ్యోమగాముల కోసం నాసా క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులు పంపింది. -
చరిత్ర సృష్టించిన ‘స్పేస్ఎక్స్’
కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్–9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. ఫ్లోరిడాలోని కేప్ కనరవల్ నుంచి 60 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ శాటిలైట్స్ ద్వారా ఇక నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో భాగంగా సుమారు 12వేల స్పేస్‌క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపాలని ఎలన్ మస్క్ కంపెనీ భావిస్తోంది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్ఎక్స్ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్లను ప్రయోగిస్తుంది. -
మరోసారి చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
స్పేస్ ఎక్స్ (స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) మరోసారి చారిత్రాత్మక అత్యంత శక్తివంతమైన మానవ రహిత రాకెట్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్ చేసింది. ఫ్లోరిడా ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు ఒక మానవరహిత క్రూడ్రాగన్‌ను శనివారం ప్రారంభించింది. స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 రెండవ దశలో భాగంగా దీన్ని లాంచ్ చేసింది. శక్తివంతమైన, పునర్వినియోగ రాకెట్ల రూపకల్పనతో, ప్రయోగాలు నిర్వహిస్తూ ఇతర గ్రహాలపై మానవుల నివాసమే లక్ష్యంగా స్పేస్ ఎక్స్ సాధించిన ఇది గొప్ప మైలు రాయిగా నిపుణులు భావిస్తున్నారు. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తోందని స్పేస్ ఎక్స్ఫౌండర్ ఎలాన్ మస్క్ నాసా మీడియా సమావేశంలోభావోద్వేగంతో ప్రకటించారు. మాజీ వ్యోమగామి కెనెడీ స్పేస్ సెంటర్ డైరెక్టర్ బాభ్ కబానా కూడా ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ప్రయోగంలో విజయం సాధించిన స్పేస్ ఎక్స్ పలుపరిశోధనల అనంతరం గత ఏడాది ఉపగ్రహ ప్రయోగానంతరం స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్-9 సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ చేసి ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో గొప్ప ముందడుగు వేసింది. వీటి ద్వారా చంద్రుడు, అంగారక గ్రహాల వద్దకు అంతరిక్ష యాత్రికులను తీసుకెళ్లాలని ఈ సంస్థ ప్రాణాళికలు రచిస్తోంది. అంతేకాదు, భూమికి సుదూరంలో ఉన్న బృహస్పతి, శని గ్రహాలకు మానవ రహిత(రోబోలు) యాత్రలు చేపట్టాలని కూడా స్పేస్ ఎక్స్ యోచిస్తోంది. తాజా ప్రయోగంతో ఈ ప్రక్రియ ఎంతో దూరంలో లేదని నిరూపించింది. కాగా టెస్లా ఇన్కార్పొరేషన్ సీఈవో ఎలాన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో స్పేస్ఎక్స్ సంస్థను స్థాపించారు. ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలు సాగిస్తోన్న సంస్థతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం తన అవసరాల మేరకు ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. Crew Dragon is on its way to the International Space Station! Autonomous docking at the @Space_Station set for early tomorrow morning. Watch live starting at 3:30 a.m. EST, 8:30 a.m. UTC → https://t.co/gtC39uBC7z — SpaceX (@SpaceX) March 2, 2019 Webcast is live→ https://t.co/gtC39uBC7z pic.twitter.com/7VgyvPfwu0 — SpaceX (@SpaceX) March 2, 2019 -
20 వేల ఏలియన్ ప్రపంచాలు..!!
కేప్ కానావెరల్, ఫ్లారిడా(అమెరికా) : విశ్వంలోని 20 వేల ఏలియన్ ప్రపంచాలను పరిశోధించేందుకు నాసా నడుంబిగించింది. భవిష్యత్‌లో కొత్త ఆవిష్కరణలకు ఊపరిలూదుతూ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా టీఈఎస్ఎస్(టాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్)ను బుధవారం ప్రయోగించింది. విశ్వంలో ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్న కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ స్థానాన్ని టీఈఎస్ఎస్ భర్తీ చేయనుంది. కెప్లర్‌తో పోల్చితే రాత్రి సమయాల్లో 400 రెట్లు ఎక్కువ ప్రదేశాన్ని టీఈఎస్ఎస్ స్కాన్ చేయగలుగుతుంది. ప్రాథమికంగా వచ్చే రెండేళ్ల కాలంలో భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 2 లక్షలకు పైగా సూర్యుడిలా కాంతిమంతంగా మెరుస్తున్న నక్షత్రాలపై జీవుల జాడ కోసం టీఈఎస్ఎస్ అన్వేషణ చేయనుంది. వీటిలో కనీసం 20 వేలకు పైగా గ్రహాంతరవాసులు నివాసముండే గ్రహాలను టీఈఎస్ఎస్ కనుగొంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిలో 50 గ్రహాలు భూమి సైజుతో సరిసమానంగా, 500 గ్రహాంలో భూమి సైజులో సగం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ గ్రహాలను నాసా గుర్తించిన అనంతరం వాటిపై విస్తృత పరిశోధన సాగించేందుకు 2020లో జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్‌ను ప్రయోగించనున్నట్లు వివరించారు. -
అంతరిక్షంలో కొత్త పుంతలు
‘ఎల్లుండి ఏం తమాషా జరుగుతుందో/ ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి/ చెబితే మాత్రం నమ్మకండి’ అంటాడు మహాకవి శ్రీశ్రీ తన ‘శరశ్చంద్రిక’ కవితలో. అరవై య్యేళ్ల క్రితం సైన్స్ ఫిక్షన్ రచయితల ఊహకందని విషయాలు సైతం వాస్తవ రూపం దాల్చే రోజులొచ్చేశాయి. ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ప్రయోగించిన రాకెట్లన్నిటినీ తలదన్నే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ‘ఫాల్కన్ హెవీ’ బుధవారం నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 23 అంతస్తుల భవంతికి సమానమైన ఎత్తున్న ఈ రాకెట్‌కు 27 ఇంజిన్లు అమర్చి మండించడం ద్వారా ఈ అనూహ్య ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. అది తీసుకెళ్లిన టెస్లా సంస్థ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు అంగారకుడి కక్ష్యకు ఆవలనున్న గ్రహ శకలాల మధ్య తిరుగాడు తోంది. అచ్చం వ్యోమగామి పోలికతో రూపొందించిన బొమ్మ డ్రైవర్ సీటులో కూర్చుని ఉండగా, అంతరిక్ష అద్భుతాలను గానం చేస్తూ డేవిడ్ బోవీ 1972లో విడుదల చేసిన గీతమొకటి ఆ కారులో శ్రావ్యంగా వినిపించే ఏర్పాటు చేశారు. ఆ కారులోని మూడు కెమెరాలు తమ కళ్లముందున్న దృశ్యాలను ఎప్పటికప్పుడు భూమ్మీదకు పంపే సదుపాయమూ ఉంది. అంగారకుడి కక్ష్యలో అది తిరుగాడాలని శాస్త్రవేత్తలు భావించినా అనుకోని రీతిలో అది ఆ కక్ష్యను దాటిపోయింది. అంగా రకుడే వారి లక్ష్యం గనుక ఆ కారు రంగును కూడా ఎర్రగానే ఉంచారు. దాని ఖరీదు 2 లక్షల డాలర్లు(సుమారు రూ. కోటీ 29 లక్షలు). అది భయమో, విస్మయమో...ఆకాశంలో నిరంతరం జ్వలించే బంతిలా కన బడే అంగారకుడంటే మానవాళికి ఆదినుంచీ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే అంగా రకుడి చుట్టూ అనేక ఊహలల్లింది. అంగారక గ్రహంపై మనుషుల్ని పోలిన జీవరాశి ఉన్నట్టు, వారు భూమ్మీద దండయాత్ర చేసేందుకు వచ్చినట్టు హెచ్‌జీ వెల్స్ 1906లో వెలువరించిన ‘వార్ ఆఫ్ ది వర్ల్›్డ్స’ నవల చిత్రించింది. కుజుడి ఉపరిత లంపై ఉన్న ఇనుము ఆక్సైడ్ రూపంలో ఉన్న కారణంగా ఆ గ్రహం ఎర్రెర్రగా కనబ డుతున్నదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రహాన్ని చేరుకోవాలని, అక్కడున్నదేమిటో తెలుసుకోవాలని, ముఖ్యంగా ఆవాసానికి అది అనువుగా ఉంటుందో, లేదో తేల్చా లని ఆసక్తి ఉన్నవారికి కొదవలేదు. శాస్త్రవేత్తలు సైతం అలాంటి కలలు సాకారమ య్యేందుకు అనువైన పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచ యిత ఆర్థర్ సి. క్లార్క్ అన్నట్టు ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుం టాయి. అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి. ఈ రెండూ ప్రమా దకరమైనవేనంటాడు క్లార్క్. ఎందుకంటే ఒంటరితనం ఎటూ భయానకం. మరె వరో ఉన్నారనుకున్నా వారెలాంటివారో తెలియనంతకాలమూ అది కూడా భీతిగొ ల్పేదే. ఎవరిలోనూ కలవలేని అశక్తత ఉన్న వ్యక్తి సైతం సమూహంలో ఒంటరిగా ఉండాలనుకుంటాడు తప్ప అందరూ నశించి తానొక్కడే మిగిలిపోవాలనుకోడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే ఈ తత్వమే అన్వేషణలకు పురుడుపోసింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ అన్వేషణాక్రమం ఎన్నో నేర్పుతున్నది. మనుషుల్ని ‘బహుళ గ్రహ’ జీవులుగా మార్చాలని స్పేస్ ఎక్స్ 2002 నుంచీ కలలుగంటోంది. అందుకవసరమైన సాంకేతికతను అభివృద్ధి పరిచే క్రమంలో అది తలమునకలై ఉంది. అందులో ఇప్పుడు జరిగిన ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం మొట్టమొదటిది. వాస్తవానికి ఈ ప్రయోగం 2011లో జరపాలని సంకల్పించారు. అప్పటినుంచి అది వాయిదాలు పడుతోంది. 2016లో ఫ్లారిడాలోని ప్రయోగ వేది కపై ఫాల్కన్ 9 రాకెట్ పేలి 20 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన ఉపగ్రహం క్షణాల్లో బూడిదైంది. తాను ప్రయోగించబోయే ఫాల్కన్ హెవీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురుకావొచ్చునని, తానైతే దేనికైనా సిద్ధంగా ఉన్నానని అప్పట్లోనే మస్క్ ప్రకటించాడు. విఫలమై ప్రమాదం సంభవిస్తే అందుకు కారణాలేమిటో పరిశో ధించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ పనిలో ముందుకెళ్తా మని కూడా చెప్పాడు. భూగోళంపై ఈ మూల నుంచి ఆ మూలకెళ్లి తిరిగి స్వస్థలానికెలా చేరుకుంటున్నామో అదే రీతిలో ఏ గ్రహానికైనా వెళ్లొచ్చే రోజులు రావాలన్నది, అది కూడా చౌకగా ఉండాలన్నది ఎలన్ మస్క్ కాంక్ష. అందుకే ఈ ప్రయో గంలో మూడు బూస్టర్లను పంపి అవి తిరిగి భూమిని చేరుకునే ఏర్పాటు చేశారు. అయితే రెండు బూస్టర్లు అనుకున్నట్టే విజయవంతంగా వెనక్కు వచ్చినా మూడోది మాత్రం మధ్యలోనే కాలిపోయింది. ఈ రెండు బూస్టర్లూ మరో ప్రయోగానికి ఉపయోగపడతాయి. ఎలన్ మస్క్ 2002లో తొలిసారి తన పథకమేమిటో చెప్పినప్పుడు అందరూ వింతగా చూశారు. కానీ తాజా విజయంతో ఆయన సంస్థ ప్రపంచంలోనే ఇప్పుడు అగ్రగామి ప్రైవేటు అంతరిక్ష వాణిజ్య సంస్థగా అవతరించింది. ఇంత ఆర్భాటం లేదుగానీ... గత నెల 21న ‘హ్యుమానిటీ స్టార్’ పేరిట కాంతులీనే బంతిలా ఉండే ఉపగ్రహాన్ని చడీచప్పుడూ లేకుండా ప్రయోగించారు. విజయవంతమైన తర్వాతే దాన్ని ప్రకటించారు. ఇప్పుడది 90 నిమిషాలకొకసారి భూమిని చుట్టివస్తుంది. భూగోళంలో ఏ మూలనున్నవారికైనా స్పష్టంగా కనబడు తుంది. దాని గమనాన్ని తెలుసుకోవడానికి అదే పేరుతో ఒక వెబ్సైట్ ఏర్పా టుచేశారు. మానవాళి తన గురించి, తన చర్యల గురించి, వాటికుండే పర్యవసా నాల గురించి అవలోకనం చేసుకుని తీరుతెన్నులను మార్చుకుంటుందన్న ఆశతో దీన్ని రూపొందించానని రాకెట్లాబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీటర్ బెక్ చెబుతు న్నాడు. అయితే ఆశయాలు ఎంత ఉన్నతంగా ఉన్నా, ప్రతీకలెంత ప్రభావవం తమైనవైనా ఇప్పటికే వ్యర్థాలతో అస్తవ్యస్థంగా తయారైన అంతరిక్షం భవిష్యత్తులో మరింత కంగాళీగా మారడానికి తప్ప ఈ ప్రయోగాల వల్ల ఉపయోగమే లేదని నిట్టూర్చే నిరాశావాదులున్నారు. ఏదేమైనా స్పేస్ ఎక్స్, రాకెట్లాబ్ సంస్థలు అంత రిక్ష ప్రయోగాలను ఒక కొత్త దశకు తీసుకుపోయాయి. ఈ ప్రయోగాలు అంతి మంగా మానవాళి శ్రేయస్సుకే తోడ్పడాలి. ప్రభుత్వాలకైనా, ప్రైవేటు సంస్థలకైనా అదే గీటురాయి కావాలి. -
‘స్పేస్ ఎక్స్’ ప్రయోగం విజయవంతం.. కానీ...
కేప్ కనవెరాల్: అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో మైలురాయికి అమెరికా సాక్షిగా నిలిచింది. ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు నిమిషాల తర్వాత రాకెట్‌కు అమర్చిన రెండు బూస్టర్లు విడిపోయి విజయవంతంగా భూమిని చేరుకున్నాయి. సముద్రంలో ల్యాం డ్ అవ్వాల్సిన రాకెట్‌లోని మూడో బూస్టర్ కాలిపోయినట్లు ఎలన్ చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఫ్లోరిడాలోని కేప్ కనవెరాల్లో సంబరాలు మిన్నంటాయి. కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’.. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. -
అది ఉత్తర కొరియా న్యూక్లియర్ ఏలియన్..!
-
ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..!
లాస్ ఏంజెల్స్ : సమయం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలు కావొస్తోంది. అమెరికాలో అత్యంత ధనిక నగరం లాస్ ఏంజెల్స్ క్రిస్మస్ షాపింగ్ హడావుడిలో ఉంది. ఇంతలో పసిఫిక్ మహా సముద్రం మీదుగా వచ్చిన ఓ వెలుగు నగరప్రజలను సంభ్రమశ్చార్యాలకు గురి చేసింది. ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీగా ఆకారంలోకి మారి విశ్వంలోకి దూసుకువెళ్తున్నది ఏంటో తెలీక అందరూ అయోమయంలో పడిపోయారు. పలువురు ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో బంధించి ఏలియన్లు భూమి మీదకు వచ్చేశాయా? అంటూ సోషల్‌మీడియలో పోస్టులు చేయడం ప్రారంభించారు. అలా పోస్టులు చేసిన వారిలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. అది ఉత్తరకొరియాకు చెందిన న్యూక్లియర్ ఏలియన్ అంటూ మస్క్ ట్విట్టర్లో పోస్టు చేశారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తన ప్రముఖ రాకెట్ లాంచర్ ఫాల్కన్-9తో మరోమారు ప్రయోగం చేసింది. దాని వెలుగే ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీ స్థాయికి చేరి నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..! -
వాడిన రాకెట్‌ను మళ్లీ వాడారు
కేప్ కానావెరల్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (స్పేస్ ఎక్స్) మొట్టమొదటి సారిగా పునర్వినియోగ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఫాల్కన్ 9 అనే రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. మొదటిసారి ఈ రాకెట్‌ను ఏడాది క్రితం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సముద్రం సురక్షితంగా ల్యాండ్ చేశారు. మళ్లీ అదే రాకెట్‌కు తొమ్మిది ఇంజన్లను ఏర్పాటు చేయడంతోపాటు స్పేస్ ఎక్స్ దీన్ని ఆధునికీకరించింది. లక్సెంబర్గ్‌లోని ఎస్ఈఎస్ కంపెనీకి చెందిన ఉపగ్రహాన్ని ఈ రాకెట్లో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ పంపించింది. తిరిగి ఈ రాకెట్‌ను విజయవంతంగా సముద్రంపై ల్యాండ్ చేయాలన్న లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఉన్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతంగా జరిపిన ఈ ప్రయోగం గొప్ప ముందడుగు అని స్పేస్ ఎక్స్ ముఖ్య సాంకేతిక అధికారి మార్టిన్ హాల్లివెల్ అన్నారు. -
సురక్షితంగా భూమిని చేరిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక
వాషింగ్టన్: అంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, తిరిగి భూమిని (పసిఫిక్ మహాసముద్రంలోని లాంచ్ ప్యాడ్) చేరింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ కంపెనీ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాముల పరిశోధనకు అవసరమయ్యే ప్రతి చిన్న వస్తువును భూమిపై నుంచే పంపాలి. ఇప్పటిదాకా రాకెట్లు ఈ పనిని నిర్వర్తిస్తుండగా.. అవి తిరిగి భూమిని చేరే అవకాశం లేదు. దీంతో వీటి తయారీ ఖర్చు భారీగా పెరిగి పోతోంది. దీనికి పరిష్కారంగా స్పేస్ ఎక్స్ పునఃవినియోగ సామర్థ్యం కలిగిన రాకెట్లను రూపొం దించింది. గతంలో అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌ను భూమిపైకి దింపడంలో పలుమార్లు విఫలమైన స్పేస్ ఎక్స్ కొంతకాలంగా వరుసగా సఫలీ కృతమవుతోంది. ఈ ప్రయత్నంలోభాగంగానే గతనెల 23వ తేదీన అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక అక్కడి వ్యోమగాముల కోసం అవసరమైన వస్తువులు తీసుకెళ్లడమే కాకుండా అంతరిక్షం నుంచి దాదాపు 4,000 పౌండ్ల బరువైన పరిశోధన నమూనాలను, అంతరిక్ష వ్యర్థాలను తీసుకొచ్చింది. -
చంద్రయాత్ర.. పారాచ్యూట్ ల్యాడింగ్
సాధారణ మనిషిని త్వరలో చంద్రమండలానికి తీసుకెళ్లనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. 2018లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్పేస్ షిప్‌ను నాసాకు చెందిన ఆస్ట్రోనాట్లు అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి 2018 ద్వితీయార్ధంలో చంద్రమండల యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజులపాటు జరిగే చంద్రయాత్రకు ఒక్కొక్కరి నుంచి ఎంత చార్జ్ చేస్తున్నారనే విషయంపై స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ చీఫ్ ఎలాన్ మస్క్ మాట్లాడలేదు. అయితే, హాలీవుడ్ నుంచి మాత్రం ఎవరూ ఈ యాత్రలో పాల్గొనడంలేదని ఆయన వెల్లడించారు. చంద్రునిపై కాలుమోపేందుకు ఇద్దరు యాత్రికులు ఇప్పటికే తమను కలిశారని.. వారివురికి అంతరిక్ష యానం గురించి విస్తృత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఒకసారి యాత్రకు వెళ్లి రావడానికి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. భూమి నుంచి చంద్రమండల యాత్రకు బయల్దేరే వ్యక్తులు 4,80,000 కిలోమీటర్ల నుంచి 6,40,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై పారాచ్యూట్ ద్వారా ల్యాండ్ అవుతారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల రక్షణ చర్యలను నాసా తీసుకుంటున్నట్లు మస్క్ తెలిపారు. చంద్రుని యాత్ర చేయాలంటే మాత్రం ఒక్కో టిక్కెట్టు ధర రూ.16,69,06,252లతో కొనాల్సిందేనని తెలిసింది. -
రాకెట్ల చరిత్ర తిరగరాతకు..!
రాకెట్ అంతరిక్ష ప్రయోగం కొత్త పుంతలు తొక్కనుందా?.. అవును! స్పేస్ ఎక్స్ తాజాగా చేసిన ప్రయోగం దీన్నే సూచిస్తోంది. రాకెట్ వేగంగా దూసుకుపోవడానికి ఉపయోగపడే బూస్టర్లను తిరిగి ఉపయోగించుకునే విధంగా చేసిన ప్రయోగం విజయవంతమైంది. శనివారం స్పేస్ ఎక్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన ఫాల్కన్ రాకెట్ విజయవంతమైంది. ఇందుకు ఉపయోగించిన బూస్టర్ తిరిగి విజయవంతంగా సముద్రంలో ఉన్న స్టేషన్ మీద ల్యాండ్ అయింది. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని రాకెట్లో ఉపయోగించింది స్పేస్ ఎక్స్. ప్రధాన భాగాన్ని విడుదల చేసిన అనంతరం రాకెట్ నుంచి విడిపోయిన బూస్టర్ 50 మైళ్ల వేగం నుంచి ఇంజన్ల సాయంతో సముద్రంలో ఉంచిన స్టేషన్ మీద ఆగింది. గత ఏడాది డిసెంబర్లో కేప్ కానవేరల్లో బూస్టర్‌ను విజయవంతంగా నిలిపినా సాంకేతికలోపంతో పేలిపోయిన సంగతి తెలిసిందే. ప్రయోగ విజయానంతరం స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ విమానాల్లా తిరిగి ఉపయోగించగల రాకెట్ల తయారీయే కంపెనీ లక్ష్యమని తెలిపారు. ముందు ముందు ఇలాంటి విజయాలు ప్రజలకు సాధారణమైపోతాయని అన్నారు. గత కొద్ది నెలల కిందట జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్‌ను పశ్చిమ టెక్సాస్‌లో విజయవంతంగా ప్రయోగించినా అది ఫాల్కన్ అంత వేగంగా గమ్యాన్ని చేరుకోలేకపోయింది. స్పేస్ ఎక్స్ విజయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. -
ఇంటర్నెట్.. స్పేస్ టు హోమ్
ఓవైపు స్మార్ట్‌ఫోన్ యుగం మొదలైంది. మరోవైపు ప్రపంచంలో మూడొంతుల మందికి ఇంటర్నెట్టే ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే అంతరిక్షంలో ఉపగ్రహాలను మోహరించి భూమిపై అన్ని ప్రాంతాల వారికీ ఇంటర్నెట్ అందేలా చేసేందుకు స్పేస్ఎక్స్, గూగుల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఆకాశంలో డ్రోన్లను విహరింపజేస్తూ ఇంటర్నెట్ను ప్రసారం చేసేందుకు ఫేస్బుక్ కూడా ప్రాజెక్టును చేపట్టింది. అయితే, వీటన్నిటికన్నా ముందే అంతరిక్ష ఇంటర్నెట్ వచ్చేసింది! ఇంటర్నెట్కు దూరంగా మారుమూలల్లో ఉన్న 300 కోట్ల మంది కోసం 12 ఉపగ్రహాలతో ‘ఓ3బీ నెట్వర్క్స్’ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్ష ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది! ఓ3బీ అంటే.. ద అదర్ 3 బిలియన్. అంటే ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని ‘ఇతర 300 కోట్ల మంది ప్రజల’ కోసం అన్నమాట. భూమి చుట్టూ 8 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతూ సిగ్నళ్లను ప్రసారం చేసే 12 ఉపగ్రహాలను ఓ3బీ నెట్వర్క్స్ మోహరించింది. కొన్ని నెలలుగా ప్రధానంగా భూమధ్య రేఖాప్రాంతంలోని దేశాలు, దీవులకు ఈ ఇంటర్నెట్ సేవ లను అందిస్తోంది. ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌మాదిరిగానే వేగవంతమైన ఇంటర్నెట్ను చవకగానే అందించడం దీని ప్రత్యేకత. గూగుల్, హెచ్ఎస్బీసీ వంటి అనేక సంస్థల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శాటిలైట్ నెట్వర్క్ నుంచి భూగోళంపై 70 శాతం ప్రాంతాలు కవర్ అవుతాయని, మరో 8 ఉపగ్రహాలను మోహరించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ3బీ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు గ్రెగ్ వీలర్ వెల్లడించారు. భారతీ ఎయిర్టెల్ వంటి 21 కంపెనీలతో ఇదివరకే ఒప్పందాలు ఖరారయ్యాయని, మరో 20 కంపెనీలతో ఒప్పందాలకూ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇవీ ‘ఓ3బీ’ ప్రత్యేకతలు.. ⇒ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ను అందిస్తున్న తొలి కంపెనీ ఇదే. ⇒ స్కూళ్లు, ఆస్పత్రులు, కార్యాలయాలకు 200-500 డాలర్లకే శాటిలైట్ సిగ్నళ్లను స్వీకరించే టెర్మినల్‌ను ఓ3బీ అందిస్తోంది. ⇒ పెద్ద కంపెనీలకు మరింత ఎక్కువ ధరకు పెద్ద యాంటెన్నాలను సమకూరుస్తోంది. ⇒ అంతరాయాలు లేకుండానే వేగవంతమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలను కల్పిస్తోంది. ⇒ ప్రస్తుత ఇంటర్నెట్ సేవల ఖర్చుతో పోల్చితే ఓ3బీ సేవలు చవకే. ⇒ మొబైల్ సేవలకు ‘ఓ3బీ సెల్’, టెలికం కంపెనీల కోసం ‘ఓ3బీ ట్రంక్’, సముద్రప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు ‘ఓ3బీ మారీటైమ్’, ప్రభుత్వ సంస్థల కోసం ‘ఓ3బీ గవర్నమెంట్’ సర్వీసులను అందిస్తోంది.