
స్పేస్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఇటీవల తన కొడుకుతో దిగిన ఒక ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. అతని తొమ్మిది నెలల కుమారుడి పేరు X Æ A-Xii. ఈ బాలుడు గత ఏడాది మే 4న ఎలోన్ మస్క్, భార్య గ్రిమ్స్ కు జన్మించాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంతలా వైరల్ అవడానికి ప్రధాన కారణం "ది సెకండ్ లాస్ట్ కింగ్డమ్" అనే శీర్షికతో పోస్ట్ చేయడమే. ఈ ఫొటోలో ఎలోన్ మస్క్ బెడ్ మీద కూర్చొని ఫోన్ స్టోన్ గ్రే టీ-షర్టు ధరించి ఫోన్‌లో మాట్లాడుతుండగా తన కొడుకు టీ షర్టును లాగుతూ నాలుకను బయటకి పెట్టాడు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ షేర్ చేసిన ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. దీనిని ఇప్పటికే 487వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది అద్భుతం, నాతో ఆడుకొని తరువాత ఫోన్‌లో మాట్లాడండి అని పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.
The Second Last Kingdom pic.twitter.com/Je4EI88HmV
— Elon Musk (@elonmusk) February 6, 2021
చదవండి: మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ