
లాస్ ఏంజెల్స్ : సమయం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలు కావొస్తోంది. అమెరికాలో అత్యంత ధనిక నగరం లాస్ ఏంజెల్స్ క్రిస్మస్ షాపింగ్ హడావుడిలో ఉంది. ఇంతలో పసిఫిక్ మహా సముద్రం మీదుగా వచ్చిన ఓ వెలుగు నగరప్రజలను సంభ్రమశ్చార్యాలకు గురి చేసింది. ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీగా ఆకారంలోకి మారి విశ్వంలోకి దూసుకువెళ్తున్నది ఏంటో తెలీక అందరూ అయోమయంలో పడిపోయారు.
పలువురు ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో బంధించి ఏలియన్లు భూమి మీదకు వచ్చేశాయా? అంటూ సోషల్‌మీడియలో పోస్టులు చేయడం ప్రారంభించారు. అలా పోస్టులు చేసిన వారిలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. అది ఉత్తరకొరియాకు చెందిన న్యూక్లియర్ ఏలియన్ అంటూ మస్క్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తన ప్రముఖ రాకెట్ లాంచర్ ఫాల్కన్-9తో మరోమారు ప్రయోగం చేసింది. దాని వెలుగే ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీ స్థాయికి చేరి నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..!
Comments
Please login to add a commentAdd a comment