Aliens
-
మనుషుల మధ్య ఏలియన్స్
-
గ్రహాంతరవాసుల సీక్రెట్స్ రష్యాకు తెలుసా..?
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అన్న అంశంపై దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతర వాసులు కొన్నేళ్ల క్రితం వరకు అయితే కేవలం ఊహాజనితమైన జీవులు. కానీ కొన్ని పరిశోధనల్లోనూ...కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యాలు మాత్రం గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకో దాచి పెడుతున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో అమెరికా, రష్యా రెండూ దొందూ దొందే అంటున్నారు వారు.పదిహేనేళ్ల క్రితం నాటి మాట..రష్యాలో గ్రహాంతర వాసులను ప్రత్యక్షంగా చూసిన నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంత వరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ కావడంతో యుఎఫ్‌వో(అన్ ఐడెంటిఫైడ్ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్)లపై పరిశోధనలు చేస్తున్నవారికి కావల్సినంత మేత దొరికినట్లయ్యింది.అసలేం జరిగిదంటే..2009 జులైలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్ మెరైన్ సాగర గర్భంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా డిస్క్ ఆకారంలో ఉన్న ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్ మెరైన్ పక్కనుంచి వెళ్లడాన్ని దాని పైలట్ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ల వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్ మెరైన్ పైలట్ ఆశ్చర్యపోయాడు.సబ్ మెరైన్ లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరివి? శత్రుసేనలవా? అని వారు కంగారు పడ్డారు. ఆ ఆరు డిస్క్ లు విష్ణు చక్రాల్లా గిర గిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా? కొత్త రకం సబ్ మెరైన్ లా? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. అవి మరోసారి సబ్ మెరైన్ కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్ లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ ఆరు వస్తువులు వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశంవైపు వెళ్లిపోయాయి.ఆ డిస్కులు కచ్చితంగా గ్రహాంతర వాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని నేవీ అధికారులు భావించారు.అంతరిక్షంలో ఎగరడమే కాదు నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానం ఎంత అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాము చూసిన దాన్ని సబ్‌మెరైన్ సిబ్బంది నేవీలోని ఇతర సహచరులకు చెప్పారు. చాలా మంది నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా దాచి పెట్టింది.అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్ధం కావడంలేదు. 27 ఏళ్ల కిందట బైకాల్ సరస్సులో వింత ఆకారాలుఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో మరో సంచలన ఘటన. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లే సరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డైవర్లు ఆశ్చర్యం..భయంతో ఉండిపోయారు. వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తోంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్ వంటి పరికరాన్ని ధరించినట్లు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి వింత మానవ ఆకారాలు కనిపించాయి. మనుషుల్లాగే కాళ్లూ చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఆ జీవులను చూసి విస్తుపోయిన డైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు.ఊహించని విధంగా పెద్ద శక్తి ఆ డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో అర్ధం కాలేదు.గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవిలు మనుగడ సాగించగలగడం ఎలా సాధ్యమో తెలియలేదు. అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది చూసినట్లు పూసగుచ్చి అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నాలుగు దశాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో అర్ధం కావడం లేదంటున్నారు పరిశోధకులు.ఈ గ్రహాంతర వాసులేంటో..వారి శక్తి సామర్ధ్యాలేంటో.. వారి స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. మనం చూడలేదు కాబట్టి గ్రహాంతర వాసులు లేరని ఎలా అనేయగలం? అంటున్నారు గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ సీక్రెట్ రీజన్ తోనే వాటిని దాచి పెడుతోందని వారు అభిప్రాయ పడుతున్నారు. -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
ఏలియన్స్ ఉన్నాయా ?..ఎలాన్ మాస్క్ కీ కామెంట్స్..
-
గ్రహాంతరవాసీ... నీవున్నావా?
విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్‌వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్‌లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్‌వో పరిశోధకుడు జైమీ మౌసాన్ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్ట్రా టెరె్రస్టియల్)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి. అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు. అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. అమెరికాలోనూఇదే తంతు... యూఎఫ్‌వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్గ్రుస్ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్‌వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్ ర్యాన్గ్రేవ్స్ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి సూగ్రౌఫ్ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51 అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది. యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్ సల్ఫైడ్ (డీఎంఎస్) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. శుక్రుడిపైనా జాడలు... తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్లో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్ బృందానికి చెందిన గ్రీవ్స్ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్ ఆ్రస్టానామికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది. భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. ఆధారాలను కనుగొనే దిశగా... గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్ రోవర్ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్ శాంపిల్ రిటర్న్ (ఎంఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది. విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్ జరిగే అవకాశమూ ఉంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
Unidentified Anomalous Phenomena: కలవో, లేవో...!
ఏలియన్స్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్. గ్రహాంతరవాసులు.. ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు. వాళ్ల చుట్టూ ఎన్నెన్నో కథలు. వాళ్ల ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్లు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (ఎగిరే పళ్లాలు) చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత ఒకట్రెండు శతాబ్దాలలో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్నిసార్లు వినువీధిలో కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి. అవి ఎగిరే పళ్లాలేనని నమ్మిన వాళ్లు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఎందరో! దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ)గా పేర్కొంటూ, దీని తాలూకు నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్ గానీ, అవి ప్రయాణించే ఎగిరే పళ్లాలు గానీ ఉన్నాయని గానీ, లేవని గానీ ఇదమిత్థంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం! నాసా యూఏపీ ప్యానల్ నివేదిక ముఖ్యాంశాలు ► ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ) చాలావాటి అసలు స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయాం. ► ఎగిరే పళ్లాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు. ► వీటిలో చాలావరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి. ► అయితే కొన్ని యూఏపీ కేసులు అప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు. ► ఏలియన్స్, ఎగిరే పళ్లాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగిందే. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటాం. నాసాకు యూఏపీ ప్యానల్ సిఫార్సులు ► యూఏపీ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ కోసం ఒక స్టాండర్డ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ► యూఏపీలపై అవగాహనను విస్తృతం చేసుకోవడానికి కృత్రిమ మేధ తదితర టెక్నాలజీల సాయం తీసుకోవాలి. ► యూఏపీల అధ్యయనంలో పారదర్శకత, ఇతర దేశాలు, అధ్యయన సంస్థలతో పరస్పర సహకారం చాలా అవసరం. ► యూఏపీ పరిశోధనలకు, డేటా సేకరణ, అధ్యయనం, ప్రభుత్వ, విదేశీ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం తదితరాల నిమిత్తం ఈ ప్రాజెక్టుకు నిధులను మరింత పెంచాలి. ఎగిరే పళ్లాలను గురించి జనాల్లో నెగటివ్ భావజాలం ఎంతగానో పాతుకుపోయింది. ఏలియన్స్ ఉనికి తాలూకు నిజానిజాలను నిర్ధారించేందుకు అత్యంత కీలకమైన డేటాను సేకరించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది’ – నాసా యూఏపీ అధ్యయన బృందం ఏలియన్స్ ఉన్నదీ లేనిదీ పక్కాగా తేల్చాలన్నా, దీనిపై లోతుగా పరిశోధన చేయాలన్నా ఇప్పుడున్న వాటికి చాలా భిన్నమైన, సృజనాత్మక శాస్త్రీయ అధ్యయన పద్ధతులు అత్యాధునికమైన శాటిలైట్ టెక్నాలజీ కావాలి. అంతకు మించి, ఈ అంశంపై జనం దృక్కోణంలోనే మౌలికంగా చాలా మార్పు రావాలి’ – నాసా – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న విచిత్ర పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మంగళవారం ఏకంగా చట్టసభలోనే ప్రదర్శించారు కొందరు పరిశోధకులు. అలాగే.. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను చట్టసభ్యులకు నివేదించారు. అయితే ఈ పరిణామంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. మెక్సికో పార్లమెంట్ ఏలియన్ల బాడీ వ్యవహారంలో పాదర్శకత అవసరమని నాసా అభిప్రాయపడింది. ‘‘ఇది ట్విటర్లోనే నేను చూశా. వాటి గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. మీదగ్గర అసాధారణమైనవి కనిపించినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలి. అది నిజంగా వింతదే అయితే.. శాంపిల్స్‌ని శాస్త్రీయ సమాజానికి అందుబాటులో ఉంచండి అంటూ మెక్సికన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డేవిడ్ స్పెర్గెల్. డేవిడ్ స్పెర్గెల్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ విభాగానికి మాజీ అధిపతి. ప్రస్తుతం యూఏపీకి అధ్యక్షత వహిస్తున్నారు.యూఏపీ అంటే unidentified anomalous phenomeno. గాల్లో ఎగిరే వింత వస్తువులు, పల్లెలు, ఆకారాలుగా ఇంతకు ముందు యూఎఫ్‌వో UFO(Unidentified Flying Objects) పేరుతో ఇది జనాలకు పరిచయం. అయితే యూఎఫ్వోనే ఇప్పుడు యూఏపీగా వ్యవహరిస్తున్నారు. నాసా కూడా.. మానవేతర జీవుల మనగడ వాస్తవమా? కదా? అనేవిషయంపై అధ్యయనం కోసం UAP పేరుతో ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎప్పటికప్పుడు తమ నివేదికలను అమెరికా ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. ప్రస్తుతానికి స్పెర్గెల్ యూఏపీకి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. త్వరలోనే ఆ బృందానికి పూర్థిస్థాయి డైరెక్టర్ నియామకం ఉంటుందని నాసా తాజాగా ప్రకటించింది. మరోవైపు మెక్సికో పార్లమెంట్లో ప్రదర్శించిన వింత ఆకారాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెరూలోని నజ్కా ఎడారిలో కుస్కోలో గల డయాటమ్ గనుల్లో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయని, వెయ్యి సంవత్సరాల కిందటివని, గ్రహాంతరవాసులవేనని సదరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకుల్లో.. మెక్సికోతో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులూ ఉన్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు అభిప్రాయపడుతుండడం గమనార్హం. మరోవైపు మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ స్పందిస్తూ.. ‘‘ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీఎన్ఏ పరీక్షల్లో స్పష్టమైందన్నారు. భూ ప్రపంచంలో వేటికీ అవి సరిపోలడం లేదు. కాబట్టే.. గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమని నమ్మాల్సి ఉంటుంది. అని పేర్కొన్నారు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. వాటికి కౌంటర్ మీమ్స్ సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!
ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను దాచిపెట్టి.. తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్‌సైట్ సబ్‌కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ‘అది జాతీయ భద్రతా అంశం’ ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్‌ఫోర్స్ మిషన్‌కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. ‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసు’ ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్ దగ్గర లేవని పేర్కొంది. ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే -
వీడు ఏలియన్ కాదు.. మరెవరు?
ఏలియన్లు ఎలా ఉంటాయి? ఆకుపచ్చ రంగు శరీరం.. పెద్ద తల.. పెద్ద పెద్ద కళ్లు.. ఇలా ఉంటాయి.. లేదా ప్రపంచాన్ని నాశనం చేసేలా భీకర స్థాయిలో ఉంటాయి.. ఇప్పటివరకూ చాలామందికి గ్రహాంతర జీవులు అంటే మదిలో మెదిలేది ఇదే.. సినిమాలు మనకు అలాగే చూపించాయి.. ఒకవేళ నిజంగానే మన సౌర కుటుంబంలోనే ఏలియన్లు ఉంటే.. అవి ఎలా ఉంటాయి? అచ్చంగా మనిషిలాగా ఉంటాయా లేక సినిమాల్లో చూపించినట్లుగానే ఉంటాయా? దీనిపై ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు అన్నింటినీ విశ్లేషించి అంచనా వేశారు. సదరు గ్రహం/ఉపగ్రహంపై ఉండే గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి), వాతావరణం సాంద్రత, ఉష్ణోగ్రతలు వంటి అంశాల ఆధారంగా వాటి రూపురేఖలను రూపొందించారు. యూఎఫ్‌వోలు కనిపించడంతో.. ఇటీవల అమెరికా గగనతలంలో ‘గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వో)’లు కనిపించాయంటూ వార్తలు రావడం, వీడియోలు, ఫొటోలు కూడా వెల్లువెత్తడంతో.. మళ్లీ గ్రహాంతరవాసుల (ఏలియన్ల)పై చర్చ మొదలైంది. ఏలియన్లు భూమ్మీదికి రావడానికి ప్రయత్నిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో మన సౌరకుటుంబంలో ఏలియన్లు ఉన్నాయా? ఉంటే ఎలా ఉండొచ్చు? అన్నదానిపై డైలీమెయిల్ వెబ్సైట్ పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఏ ఆకారంలోనైనా.. మన సౌర కుటుంబంలోనే కాదు.. విశ్వంలో లక్షల కోట్ల కొద్దీ ఉన్న నక్షత్ర మండలాల్లో ఎక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ గ్రహాల్లో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. మనుషులు, జెల్లీఫిష్‌లు, నత్తలు, స్క్విడ్ (ఆక్టోపస్ వంటివి)లు, ఎగిరే కీటకాలు, సూక్ష్మజీవులు.. ఇలా ఏ రూపంలో అయినా ఏలియన్లు ఉండవచ్చని అంటున్నారు. ►సౌర కుటుంబంలో అంగారక, శుక్ర గ్రహాలతోపాటు గురుడి ఉపగ్రహాలు యురోపా,గనిమీడ్, కలిస్టో.. శని ఉపగ్రహాలు ఎన్సెలాడస్, టైటాన్.. నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్, మరుగుజ్జు గ్రహం సెరెస్లపై జీవం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ►భూమిని పోలిన పరిస్థితులు, వాతావరణం ఉన్నచోట.. భూమ్మీది తరహాలోనే విడిగా తల, కాళ్లు, చేతుల వంటి అవయవాలు, పెద్ద మెదడుతో కూడిన జీవులు ఉండొచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాలియాంటాలజిస్ట్ సిమన్ కోన్వే మోరిస్ తెలిపారు. ఒకవేళ నక్షత్రానికి దూరంగా ఉండి, కాంతి తక్కువగా పడే గ్రహాల్లో అయితే కళ్లు బాగా పెద్దవిగా ఉంటాయన్నారు. అయితే ఆ జీవుల ఆకారం మనుషుల్లా ఉండొచ్చు, లేకపోవచ్చని పేర్కొన్నారు. ►ప్రస్తుత పరిస్థితులను బట్టి.. ఒకవేళ సౌర కుటుంబంలోనే జీవాన్ని కనుగొన్నా అవి ఏక కణ సూక్ష్మజీవులే అయి ఉంటాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ ఆండ్రూ కోట్స్ స్పష్టం చేశారు. కానీ విశ్వంలోని కోట్లాది నక్షత్ర లాల్లో చాలా చోట్ల ఏలియన్లు జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. భూమిలా ఉంటే.. భూమిపై ఉన్నట్టుగానే కాస్త అటూఇటూగా గ్రావిటీ, వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటే.. ఏలియన్లు మనుషుల మాదిరిగానే ఉండే అవకాశాలు ఎక్కువ. గ్రావిటీ ఎక్కువగా ఉంటే.. భూమికన్నా పరిమాణంలోపెద్దగా ఉండే గ్రహాల్లో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా పరిస్థితులు భూమిలా ఉన్నా, గ్రావిటీ ఎక్కువుంటే.. ఏలియన్లు ఎత్తు తక్కువగా, దృఢమైన కండరాలతో కూడి ఉంటాయి. గ్రావిటీ తక్కువగా ఉంటే.. చిన్నగా ఉండే గ్రహాలు/ ఉపగ్రహాల్లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి చోట తేలికగా, ఎక్కువ ఎత్తుతో, బలహీనమైన కండరాలతో కూడిన జీవులు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. వాతావరణం తక్కువగా ఉంటే.. గ్రహం/ఉపగ్రహం సైజుతో సంబంధం లేకుండా, వాతావరణం తక్కువ సాంద్రత (డెన్సిటీ)తో ఉంటే.. తక్కువ బరువుతో, చాలా పెద్ద రెక్కలతో కూడిన ఏలియన్లు ఉండొచ్చు. నిండా మంచుతో కప్పి ఉంటే.. గురుడి ఉపగ్రహం యూరోపా మాదిరిగా మొత్తంగా మంచుతో కప్పబడి, దాని దిగువన నీటి సముద్రాలు ఉంటే.. పీతలు, ఆక్టోపస్‌ల వంటి ఆకారాల్లో ఏలియన్లు ఉండేందుకు చాన్స్ ఎక్కువ. పొడిగా ఉండే గ్రహాలైతే.. శుక్రుడు, మార్స్ వంటి పొడిగా ఉండే వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలు/ఉపగ్రహాల్లో జీవం సూక్ష్మజీవుల తరహాలో ప్రాథమిక స్థాయిలో ఉండొచ్చు. వాతావరణం అనుకూలంగా మారితే పరిణామక్రమంలో ఎదిగి.. పెద్దస్థాయి జీవులుగా మారొచ్చు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఏలియన్స్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌజ్
వాషింగ్టన్: ఒకవైపు గగనతలంలో చైనా నిఘా బెలూన్ల కూల్చేసిన అమెరికా.. అదే సమయంలో గుర్తుతెలియని వస్తువులనూ నేల కూల్చినట్లు ప్రకటించి యావత్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. పైగా గ్రహాంతర వాసుల చర్య, ఏలియన్ల పనే అనే కోణాలను కొట్టిపారేయలేమంటూ ఆ దేశానికే చెందిన ఓ అధికారి(మాజీ) వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది కూడా. ఈ తరుణంలో.. వైట్‌హౌజ్ స్పందించింది. ఏలియన్లు, గ్రహాంతర వాసులు, యూఎఫ్‌వోల వాదనను కొట్టిపారేసింది. కూలిన వస్తువులకు.. ఏలియన్లు, గ్రహాంతరజీవుల కదలికలకు సంబంధం లేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. ‘‘తాజా కూల్చివేతలపై వైట్‌హౌజ్ నుంచి వెలువడుతున్న సుస్పష్టమైన ప్రకటన ఇది. ప్రపంచ దేశాల్లో.. ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందరో ఆరాలు తీస్తున్నారు. కానీ, ఇది గ్రహాంతర వాసుల చర్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇది మాత్రం క్లియర్ అని ప్రకటించారామె. పైగా ఆ సమయంలో.. ఏలియన్ సినిమాల పేర్లను ప్రస్తావించి ప్రెస్మీట్లో నవ్వులు పూయించారు కూడా. ఇక స్పై బెలూన్ల కూల్చివేత తర్వాత.. ఉత్తర అమెరికా ఎయిర్‌స్పేస్‌లో రెండు, కెనడా ఎయిర్‌స్పేస్‌లో ఒకటి.. గుర్తుతెలియని వస్తువులను యుద్ధవిమానాలతో నేలకూల్చేసింది అమెరికా సైన్యం. కానీ, అవి ఏంటన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఏలియన్లు, గ్రహాంతరవాసుల వాదన తెర మీదకు వచ్చింది. నేలకూల్చిన ఆ వస్తువులు కమ్యూనికేషన్‌కు సంబంధించి పరికరాలు కావని, అవి ప్రజలకు హాని కలిగించేవిగా కూడా లేవనే విషయం స్పష్టమైంది వైట్‌హౌజ్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ అవేంటో గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారు. అయితే.. నేల కూల్చిన వస్తువుల శిథిలాలను ఇంకా తాము సేకరించలేదని యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ ఇదివరకే స్పష్టం చేశారు. అసలు అవి ఏంటి? వాటి స్వభావం.. ఇతర విషయాలను వాటిని సేకరించిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారాయన. -
ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా?
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది. -
Mars Doorway: అంగారకుడి మీద ‘తలుపు’ మిస్టరీ వీడింది
అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది. ఇక డోర్ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది. చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు -
ఒడ్డున ‘వింత’ జీవి కళేబరం వైరల్! వీడిన మిస్టరీ
సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పే బ్లాగర్స్ కొందరు ఈమధ్య కాలంలో ఎక్కువైపోయారు. ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో అడ్డమైన విషయాలపైనా చర్చలు తీస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ యంగ్ బ్లాగర్ ఆస్ట్రేలియా సముద్ర తీరం ఒడ్డున పడి ఉన్న ఓ కళేబరాన్ని చూపిస్తూ వీడియో తీశాడు. దీంతో అది ఏలియన్ కళేబరం అంటూ పెద్ద దుమారమే చెలరేగింది. క్వీన్స్‌లాండ్‌లో సన్‌షైన్ తీర ప్రాంతం కాటన్ ట్రీ బీచ్ ఒడ్డులో వింత జీవి.. అంటూ అలెక్స్ టాన్ అనే పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకు ముందు తాను ఏనాడూ ఇలాంటీ జీవిని చూడలేదని, కనీసం దాని పేరు కూడా వినలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పలు సందేహాలు వ్యక్తం చేస్తూనే.. ఆ జీవి ఏంటో మీరైనా చెప్పాలంటూ ఫాలోవర్స్‌ను కోరగా.. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by ALEX TAN (@tanalex) బహుశా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండొచ్చా? అనే సందేహాన్ని సైతం వ్యక్తం చేశాడు ఆ వీడియోలో అలెక్స్. దీంతో చాలా మంది ఫాలోవర్స్.. అతని వాదనతోనే ఏకీభవించడం మొదలుపెట్టారు. అలా.. బీచ్‌లో వింత జీవి, ఏలియన్ మృతదేహం అంటూ థంబ్ నెయిల్స్ కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ జాన్స్టన్ ఆ తిక్క కథనాలను కొట్టిపారేశారు. దాన్కొక ‘పోసమ్’ (Possum)గా తేల్చారు. వరదలతో బహుశా అది అక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందని చెబుతున్నారాయన. పోసమ్లు శాకాహారి జీవులు. పువ్వులు, పండ్లు, ఆకులు తింటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతాలతో పాటు న్యూజిలాండ్‌లోనూ కనిపిస్తాయి. ముఖ్యంగా సిడ్నీలో చెట్లపై జీవిస్తూ.. మనుషులతో మమేకం అవుతుంటాయి ఇవి. ఒక్కోసారి సముద్ర తీరాలకు వెళ్తూ.. ప్రమాదం బారిన పడుతుంటాయి కూడా. View this post on Instagram A post shared by Whitecliffs Foreshore Reserve (@whitecliffsforeshorereserve) -
గ్రహాంతరవాసులు ఉన్నారా ?
-
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్‌లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్‌గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
ఏలియన్స్ జాడ కోసం వేదాంత వేత్తలను నియమించుకుంటున్న నాసా..!
ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఏలియన్స్ జాడ కనుక్కోవడం కోసం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ, రహస్యాలను తెలుసుకోవటానికి 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని కోరుతున్నట్లు టెక్నోట్రెండ్జ్ ఒక నివేదికలో తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డిగ్రీని పొందిన బ్రిటిష్ వేదాంత వేత్త రెవ్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్‌లో భాగమయ్యారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వేదాంత వేత్తల్ని నాసా అంతరిక్షంలోకి పంపిస్తుందా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని నాసా కోరినట్లు సమాచారం. ఈ నెల డిసెంబర్ 26న హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ కంటే అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ వెబ్ ను అంతరిక్షంలోకి నాసా, యూరోప్ దేశాలు ప్రయోగించాయి. ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వం పుట్టుకతో పాటు, ఏలియన్స్ జాడ కూడా తెలుసుకోవాలని నాసా భావిస్తుంది. (చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!) -
హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!
The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్‌లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్‌ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది. చదవండి: Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత! -
గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!
కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. పైగా వాళ్లు చేసే విచిత్రమైన పనులతో అందర్నీ ఇబ్బందులకు గురి చేసి కటకటాలపాలవుతుంటారు కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి గ్రహాంతర వాసులును చూసేందుకు అంటూ హాస్యగాడి వలే విచిత్రమైన ముసుగు ధరించి ఎయిర్‌పోర్టుకు వెళ్లి అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తాడు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) అసలు విషయంలోకెళ్లితే... మాథ్యూ హాన్కాక్ అనే వ్యక్తి గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నానంటూ నెవెడాలో లాస్ వేగాస్లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తాడు. పైగా విమానాశ్రయంలోకి నిబంధనలకు విరుద్ధంగా చొరబడబటమే కాక గ్రహాంతర వాసలు ఉండే ప్రసిద్ధ ప్రాంతం అయిన ఏరియా 51కి వెళ్లేందుకు విమానాన్ని హైజాక్ చేస్తున్నాను అని అక్కడ ఉన్న పోలీసులతో చెబుతాడు. అంతేకాదు అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న భద్రతా విభాగాన్ని నకిలీ బాంబుతో బెదిరిస్తాడు. ఈ మేరకు హాన్కాక్ కారుతో సహా ఎయిర్‌పోర్ట్‌లోని విమానాల పార్కింగ్ వద్దకు వచ్చేయడమే కాక తన కారులో షాట్‌గన్, గ్యాసోలిన్ వంటి ఆయుధాలు ఉన్నాయంటూ అక్కడ ఉన్నవారందర్నీ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేస్తాడు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఉద్యోగులంతా భయంతో పరుగులు పడుతుంటారు. అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. పైగా లాస్‌వేగస్‌లోని రద్దీ వీధుల్లో ఒక లగ్జరీ కారుని నిర్లక్ష్యంగా నడుపుత్నుట్లు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తిని తానెనంటూ అక్కడ ఉన్న పోలీసులకు చెబుతాడు. అంతేకాదు తనను గ్రహాంతర వాసులు ఎంచుకున్న వ్యక్తిగా సంబోధించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి కూడా చేస్తాడు. దీంతో పోలీసులు హాన్కాక్ని అదుపులోకి తీసుకోవడమే కాక నకీలి బాంబుతో బెదిరింపులకు పాల్పడినందుకు ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!!) -
మారకుంటే మరుభూమే!
ఇంట్లోంచి బయటికెళ్లాలంటే ఒంటి నిండా సూట్.. అదీ ఎయిర్ కూల్ది. చిన్నవాగుల్లా మారిపోయిన పెద్ద నదులు.. మామూలు పొలాలన్నీ మాయం.. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటల సాగు.. వాటికి డ్రోన్లతో నీటి సరఫరా.. ఇదంతా ఆదిత్య 369 చిత్రంలో ‘సింగీతం’ చూపించిన భవిష్యత్ ఊహాలోకం. ఆ సినిమాలోనే కాదు.. నిజంగానే మన భవిష్యత్ అలా ఉండబోతోందని.. మన భూమి మీద మనమే గ్రహాంతర వాసుల్లా జీవించాల్సి వస్తుందని తాజా పరిశోధన చెబుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా.. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ ‘2100’ అంచనాలు చాలవు! ఓవైపు అడవుల నరికివేత.. మరోవైపు కాలుష్యం.. పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు.. అన్నీ కలగలిసి రోజురోజుకూ వాతావరణం మారిపోతోంది. భూమి వేడెక్కి (గ్లోబల్ వార్మింగ్).. ఓవైపు తీవ్ర కరువు కాటకాలు, మరోవైపు వరదలు, తుపానులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అడవుల నరికివేత ఆపడం, మరింతగా అడవులు పెంచడం, భూమి వేడెక్కేందుకు కారణమయ్యే గ్రీన్‌హౌజ్ వాయువుల (కర్బన ఉద్గారాల)ను తగ్గించడమే దీనికి పరిష్కారం. ఈ దిశగానే పారిస్‌లో జరిగిన ‘ఐపీసీసీ (ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్)’ సదస్సు ఇటీవల పలు లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2100వ సంవత్సరం నాటికి భూమి ఉష్ణోగ్రతలో పెరుగుదలను గరిష్టంగా 2 డిగ్రీలకు పరిమితం చేయాలని అన్నిదేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. కానీ ఈ లక్ష్యాలు సరిపోవని.. భూమిపై జీవనం ప్రమాదంలో పడుతుందని ‘యూఎన్ ఎన్డీసీ (యునైటెడ్ నేషన్స్ అసెస్మెంట్ ఆఫ్ నేషనల్ డెటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్)’ నివేదిక స్పష్టం చేస్తోంది. గ్రహాంతర వాసుల్లా బతకాల్సిందే.. 2500 సంవత్సరం నాటికి మన భూమే మనం ఊహించనంతగా మారిపోతుందని.. మనమే గ్రహాంతర వాసుల్లా బతికే పరిస్థితి వస్తుందని పర్యావరణ సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ లియోన్, ఆయన సహ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చల్లగా ఉండే శీతల ప్రాంతాలు వేడెక్కి ఉష్ణమండల ప్రాంతాల్లా మారిపోతాయని.. ఇప్పుడున్న ఉష్ణమండల ప్రాంతాలు మనుషులు జీవించలేని దుర్భర వేడి ప్రాంతాలుగా మారుతాయని స్పష్టం చేశారు. భూమ్మీద వివిధ ప్రాంతాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ల కిందటి పరిస్థితులు, ప్రస్తుతమున్న తీరు, 2500 నాటికి పరిస్థితులను చిత్రాలతో సహా వివరించారు. భవిష్యత్తు అత్యంత ప్రమాదకరం వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌పై జరుగుతున్న పరిశోధనలు, లక్ష్యాలన్నీ కూడా 2100 సంవత్సరాన్నే అంచనాలకు ఆధారం (బెంచ్ మార్క్)గా తీసుకుంటున్నాయని యూఎన్ ఎన్డీసీ పేర్కొంది. ప్రపంచ దేశాలు ‘ప్యారిస్ ఐపీసీసీ’ ఒప్పందాన్ని అమలు చేసినా.. ప్రయోజనం తక్కువేనని స్పష్టం చేసింది. భూమి సగటు ఉష్ణోగ్రత 2100 నాటికే 2.2 డిగ్రీల మేర పెరిగితే.. అది 2500వ సంవత్సరం నాటికి 4.6 డిగ్రీలకు చేరుతుందని పేర్కొంది. ఇది భూవాతావరణంలో, వృక్ష, జంతుజాలంలో అత్యంత తీవ్రస్థాయిలో మార్పులకు దారితీస్తుందని వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, కరువులు, కార్చిచ్చులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కమ్ముకుంటాయని హెచ్చరించింది. అందువల్ల మన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని.. 2500వ సంవత్సరాన్ని మన లక్ష్యాలు, అంచనాలకు ఆధారంగా తీసుకోవాలని సూచించింది. ఇవి చూసైనా మారుతారని..: ఐదు శతాబ్దాల తర్వాతి పరిస్థితిని ఇలా చూసి అయినా గ్లోబల్ వార్మింగ్, కర్బన ఉద్గారాల నియంత్రణ విషయంగా ప్రభుత్వాలు, ప్రజల్లో మార్పు వస్తుందేమో అన్నదే ఈ చిత్రాల ముఖ్య ఉద్దేశమట. భారత్‌లో చండ్ర నిప్పులే.. ►ఇక్కడున్న చిత్రాల్లో మొదటిది ఐదు శతాబ్దాల కిందటి భారతదేశంలో పరిస్థితిని చూపుతోంది. గ్రామాల్లో వ్యవసాయం, వరి పంట, పశువుల వినియోగం, జీవావరణం కలిసి ఉన్న దృశ్యమిది. ►రెండో చిత్రం ప్రస్తుత కాలానిది. అడవులు తగ్గిపోయి.. సాగులో సంప్రదాయ, ఆధునిక మౌలిక సదుపాయాల కలబోతగా ఉన్నది. ►మూడోది భవిష్యత్ (2500 ఏడాది)ను చూపుతోంది. పచ్చదనం తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు, ఎండలు విపరీతంగా పెరిగి.. శరీరాన్ని పూర్తిగా కప్పేస్తున్న సూట్లో బయటికి రావాల్సిన పరిస్థితి. పెరిగిన సాంకేతికతతో రోబోటిక్ వ్యవసాయం చేస్తారని అంచనా. అమెజాన్ నది.. చిన్న వాగులా.. ►ఈ చిత్రం అమెజాన్ నది, దానివెంట ఉన్న భారీ అడవిని చూపుతోంది. ఐదు శతాబ్దాల కింద పూర్తిగా పచ్చదనంతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. ►అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితి చూపుతున్నది రెండో చిత్రం. అభివృద్ధి పేరిట వేసిన రోడ్లు, ఇతర నిర్మాణాలతో తగ్గిపోయిన పచ్చదనం కనిపిస్తోంది. ►మూడో చిత్రం భవిష్యత్తు భయానక దుస్థితిని చూపుతోంది. ప్రపంచంలోనే పెద్దదైన అమెజాన్ నది చిన్నవాగులా మారిపోవడం, అంత దట్టమైన అడవి నామరూపాల్లేకుండా పోవడం, పంటలు కూడా లేకుండా నిర్జీవంగా మారిన దుస్థితి కనిపిస్తోంది. -
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!
న్యూయార్క్: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్ అన్నారు. సలాస్ యూఎస్ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
పెంగ్విన్లు ఏలియన్లా?
ఏలియన్స్ అంటే భూమి అవతల ఎక్కడో గ్రహాల్లోనో, సుదూర సౌర వ్యవస్థల్లోనో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఏలియన్స్ ఎప్పుడో భూమ్మీదికి వచ్చి ఉంటాయని, ఇప్పటికీ వాటి అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్స్ ఏమిటో తెలుసా..? మంచు ప్రాంతాల్లో తిరిగే పెంగ్విన్ పక్షులట. మరి ఈ విశేషాలు ఏమిటో చూద్దామా? ఉండటమే చిత్రంగా.. భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లోని మంచు ప్రాంతాల్లో జీవించే పక్షులు పెంగ్విన్లు. మామూలుగానే అవి చిత్రంగా ఉంటాయి. పేరుకు పక్షులే అయినా ఎగరలేవు. నిటారుగా రెండు కాళ్లపై నిలబడతాయి, అలాగే నడుస్తాయి. నీటిలో బుడుంగున మునుగుతూ, తేలుతూ వేగంగా ఈదుతాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమ్మీద ఏ జీవిలోనూ లేని ఓ ప్రత్యేకమైన రసాయన పదార్థం పెంగ్విన్లలో ఉన్నట్టు తాజాగా గుర్తించడం ఆసక్తి రేపుతోంది. శుక్రగ్రహంలోని రసాయనం యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఫాక్లాండ్ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి విసర్జితాలను పరిశీలిస్తుండగా.. ‘ఫాస్పైన్’ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయి. భాస్వరం, హైడ్రోజన్ మూలకాల సమ్మిళితం అయిన ఈ రసాయనం.. సాధారణంగా భూమ్మీది ఏ జీవిలోనూ ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాదే శుక్రగ్రహ వాతావరణంలో ‘ఫాస్పైన్’ జాడను కనిపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హా 6.1 కోట్ల కిలోమీటర్ల దూరంలోని శుక్రుడిలో ఉన్న రసాయనం పెంగ్విన్ల విసర్జితాల్లో ఉండటం అంటే.. అవి బహుశా మరో ప్రపంచానికి చెందిన జీవులు (ఏలియన్లు) అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసలు పెంగ్విన్లలో ఈ రసాయనం ఎలా ఉత్పత్తి అవుతోందన్న దానిని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఫాస్పైన్.. వెరీ డేంజర్ ఫాస్పైన్ ప్రమాదకర వాయువు. అత్యంత విషపూరితమైనది. పీల్చుకుంటే నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది. వేగంగా మండిపోయే స్వభావం ఉంటుంది. దీనిని పారిశ్రామికంగా తయారు చేస్తారు. కీటక నాశనులు, ఎలుకల మందు వంటివాటి తయారీలో వినియోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో మంటలకు ఇంధనంగా, సెమీకండక్టర్ల తయారీ ప్రక్రియలో వినియోగిస్తారు. ఏలియన్ల జాడ తెలుసుకోవచ్చా? పెంగ్విన్ల జీవన విధానం, వాటి శరీరంలోని రసాయనాలను పరిశీలించడం ద్వారా.. భవిష్యత్తులో ఏలియన్ల జాడను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడో గ్రహాంతర వాసులు భూమ్మీదికి వచ్చి వెళ్లి ఉంటారని.. ఆ క్రమంలోనే పెంగ్విన్ల వంటి ప్రత్యేక జాతులు అభివృద్ధి చెంది ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్, అవునా.. నిజమా?!
గ్రహాంతర జీవనం.. మనిషికి ఎప్పటికీ ఓ ఆసక్తికర అంశమే. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం.. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెప్తుంటాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్ లైఫ్ గురించి ఓ క్లారిటీ కాదు కదా కనీసం ఓ అంచనా కూడా రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల థీయరీలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. ‘బ్లాక్ నైట్ శాటిలైట్ కాన్స్పిరెన్సీ థియరీ’.. ప్రకారం ఇది అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు కూడా పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్ యూనియన్లు స్పేస్‌లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందన్నమాట. టిక ఈ మిస్టరీ శాటిలైట్ గత పది రోజుల్లో విపరీతంగా షేర్ అయ్యింది. మరి నాసా దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం.. అదసలు శాటిలైట్ కాదని తేల్చేసింది నాసా. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్క్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెప్తున్నారు. పైగా భూ కక్క్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చేసింది. చదవండి: వారెవ్వా.. ఖగోళంలో మునుపెన్నడూ చూడని దృశ్యం ఇది -
అమెజాన్ బాస్ మెడకు ‘ఏలియన్’ లింక్!
కొందరు ఎదుటివాళ్ల సక్సెస్‌ను ఓర్చుకోలేరు. అమెరికాలో అలాంటి బ్యాచ్ ఒకటి ‘కుట్ర సిద్ధాంతకర్తలు’గా కొన్ని సంవత్సరాల నుంచి మనుగడ కొనసాగిస్తోంది. వీళ్లు అమెరికా ప్రభుత్వం, పౌరులు సాధించే ఓ విజయాన్ని భరించలేరు. వాటికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుంటారు. వీళ్లు చెప్పే థియరీలు ఒక్కోసారి తట్టుకోలేని రేంజ్లో ‘అబ్బో’ అనిపిస్తుంటాయి. అలాంటి ఓ థియరీని అమెజాన్ బాస్ మెడకు చుట్టేశారు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చి వారం తిరగలేదు. అప్పుడే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గురించి తిక్క వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కుట్ర సిద్ధాంతకర్తలు చెప్పేది ఏంటంటే.. అంతరిక్షంలోకి వెళ్లిన బెజోస్‌ను ఏలియన్లు కిడ్నాప్ చేశాయట. ఆయన ప్లేస్‌లో ఏలియన్ డబుల్ బాడీని తిరిగి భూమ్మీదకు పంపించాయట. కావాలంటే ఆయన మెడ చూడడండి ఎలా సాగిలపడి ఏలియన్లా ఉందో అంటూ ఏవో ఆధారాలు చూపెడుతున్నారు వాళ్లు. ఈ థియరీని అమెజాన్ ‘ఛీ’ కొట్టేసింది. పదకొండు నిమిషాల గ్యాప్‌లో.. అదీ తోడుగా సభ్యులు ఉండగా జరిగిందన్న ఏలియన్ కిడ్నాప్ వ్యవహారం ఒక పిచ్చి వాదన అని అంతా తోసిపుచ్చుతున్నారు. అంతేకాదు ఈ కిడ్నాప్ ద్వారా భూమ్మీద పట్టుసాధించాలని ఏలియన్లు ప్రయత్నిస్తున్నాయనే తట్టుకోలేని మరో వాదనను సైతం వీళ్లు లేవనెత్తుతున్నారు. ప్చ్... -
సౌర కుటుంబంలోనే ఎలియన్స్!
కొన్ని వందేళ్ల ఏళ్ల తర్వాత.. సరదాగా అలా అంతరిక్షంలోకి టూర్‌కు వెళ్లొచ్చే టెక్నాలజీ వచ్చేసింది.. చంద్రుడి మీదకు, అంగారకుడి (మార్స్) మీదకు వెళ్లినవాళ్లు.. ఇంకాస్త లాంగ్ టూర్ వేద్దామని శనిగ్రహం దాకా వెళ్లారు.. దాని ఉపగ్రహాల్లో ఒకటైన ఎన్సలాడెస్‌పై దిగారు.. అక్కడ వారిని ఏలియన్స్ బంధించాయి.. మనుషులు ఎలాగోలా తప్పించుకుని వెనక్కి వచ్చేశారు. ఇదంతా హాలీవుడ్ సినిమా కథలా ఉన్నా.. భవిష్యత్తులో నిజం కూడా కావొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎన్సలాడెస్ మీద జీవం ఉండే అవకాశాలు ఎక్కువని చెప్తున్నారు. మరి ఈ సంగతులేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మనం ఒంటరి వాళ్లం కాదు కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు.. పెద్ద సంఖ్యలో గ్రహాలు.. ఇంత విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేనా? భూమి అవతల ఎక్కడైనా జీవం ఉందా? ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్నలివి. అందుకే సౌర కుటుంబంలోగానీ, బయట ఇంకెక్కడైనాగానీ జీవం ఉందేమో అన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జీవం ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే నాసా ప్రయోగించిన కాస్సిని వ్యోమనౌక అందించిన సమాచారంతో ఎన్సలాడెస్ మీద జీవం ఉండే అవకాశం ఉందని తాజాగా అంచనా వేశారు. ఎన్సలాడెస్ ఏంటి? భూమికి చంద్రుడు ఉన్నట్టే ఇతర గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. అలా శనిగ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో ఒకటి ఎన్సలాడెస్. దీని మీద 32.9 గంటలకు ఒక రోజు గడుస్తుంది. మన చంద్రుడిలో ఏడో వంతు ఉండే ఈ ఉపగ్రహం వ్యాసార్థం (డయామీటర్) సుమారు 500 కిలోమీటర్లు. దీని ఉపరితలం మొత్తం 30 కిలోమీటర్ల మందమైన మంచు పొరతో కప్పబడి ఉందని, మంచుకు, మట్టి ఉపరితలానికి మధ్య మంచి నీళ్లు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు కాస్సిని వ్యోమనౌక సహాయంతో కొన్నేళ్ల కిందే తేల్చారు. ఎన్సలాడెస్ ఉత్తర ధ్రువంలోని వేడినీటి ఊటల నుంచి భారీగా నీటి ఆవిరి అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్నట్టు గుర్తించారు. ఆ నీటి ఆవిరిలో మిథేన్ ఉందని తేల్చారు. దీనిపై అరిజోనా, పారిస్ సైన్సెస్ అండ్ లెట్రెస్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. తాజాగా ఆ వివరాలను వెల్లడించారు. మిథేన్.. జీవం ఉనికికి సాక్ష్యం సౌర కుటుంబంలోగానీ, అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు వేటిలోగానీ సహజంగా మిథేన్ వాయువు ఉండదు. ఇది జీవక్రియల్లో భాగంగానే వెలువడుతుందని, జీవజాలం ఉన్నచోట మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎన్సలాడెస్ నుంచి మిథేన్ గ్యాస్ విడుదలవడానికి అక్కడ మెథనోజెన్స్గా పిలిచే సూక్ష్మజీవులు ఉండటమే కారణమని అంచనా వేస్తున్నారు. ‘‘భూమ్మీద సముద్రాల అడుగున ఈ మెథనోజెన్స్ ఉంటాయి. అవి డైహైడ్రోజన్, కార్బన్డయాౖక్సైడ్ను ఉపయోగించుకుని మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఎన్సలాడెస్ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిలో డైహైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్‌తోపాటు మిథేన్ కూడా గణనీయ స్థాయిలో ఉంది. ఎన్సలాడెస్ పై దట్టమైన మంచుపొర, దాని కింద లోతున నీళ్లు ఉన్నాయి. అంటే భూమ్మీద సముద్రాల అడుగున ఉండేలాంటి పరిస్థితే అక్కడా ఉంది. ఈ లెక్కన సూక్ష్మజీవులు ఉండే అవకాశాలు ఎక్కువే.. ’’ అని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ రెజిస్ ఫెర్రీర్ వెల్లడించారు. కాస్సిని గుర్తించిన వాయువుల ఆధారంగానే కాకుండా.. ఎన్సలాడెస్‌పై ఉండే వాతావరణం, రసాయనిక పరిస్థితులను గణిత మోడళ్ల ఆధారంగా విశ్లేషించి ఈ అంచనాకు వచ్చామని తెలిపారు. సూక్ష్మజీవులు ఉంటే చాలా? భూమ్మీద కూడా జీవం మొదలైంది సూక్ష్మజీవుల నుంచే.. మొదట్లో భూమి వాతావరణం, నేలపొరల్లో పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన రసాయనిక సమ్మేళనాల నుంచే జీవ పదార్థం పుట్టింది. తొలుత ఏర్పడిన ఏకకణ జీవులు క్రమంగా అభివృద్ధి చెందుతూ.. ఇంత విస్తారమైన జీవజాలం రూపొందింది. ఇప్పుడు ఎన్సలాడెస్‌పై కూడా సూక్ష్మజీవులు ఉండి ఉంటే.. అక్కడ భవిష్యత్తులో జీవం అభివృద్ధికి అవకాశం ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యురోపాపైనా పరిశోధనలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, వాటి ఉపగ్రహాల్లో..భూమి,ఎన్సలాడెస్తోపాటు గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం యురోపాపై కూడా మంచు, నీళ్లు ఉన్నాయి. అక్కడ కూడా జీవం ఉండవచ్చన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
గ్రహాంతర తాప్సీ!
కిక్ ఇచ్చే కాన్సెప్ట్ దొరికితే కాదనుకుండా పచ్చజెండా ఊపేస్తారు నటీనటులు. తాప్సీ ఇటీవల అలా కిక్ ఇచ్చే కాన్సెప్ట్ విన్నారట. చెప్పింది తమిళ దర్శకుడు భరత్ నీలకంఠన్. రెండేళ్ల క్రితం ‘కే 13’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు భరత్. తాజాగా ఆయన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు కథ రాసుకున్నారట. ఇందులో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో ఏలియన్స్ ప్రస్తావన ఉంటుందట. ఈ గ్రహాంతర వాసుల కథ వినగానే తాప్సీ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నారని సమాచారం. బహు భాషల్లో ఈ సినిమా చేయడానికి భరత్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సాంకేతిక నిపుణులనే తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ మూవీగా తీయాలన్నది టీమ్ ఆశయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందట. ఈ ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణను ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.