ఏలియన్లు కనిపించాయా?
ఏలియన్లు కనిపించాయా?
Published Sat, Dec 31 2016 12:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
అంగారక గ్రహంపై ఏలియన్లు కనిపించాయా?. చాలా మంది థియరిస్టులు మార్స్ గ్రహంపై జీవరాశి ఉందని నిరూపించడానికి ఆ గ్రహానికి సంబంధించిన ప్రతి ఫోటోను పరిశీలిస్తున్నారు. తాజాగా మార్స్ గ్రహాంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన కొన్ని ఫోటోల్లో ఏలియన్లు ఉన్నాయని ఇది అంగారకుడిపై జీవరాశి నివసిస్తోందనడానికి సాక్ష్యం అని అంటున్నారు. ఆ చిత్రాల్లో రోవర్ వైపు తదేకంగా చూస్తున్న ఓ ఏలియన్, ఒక స్నెయిల్ ఉన్నాయి. దీంతో వారి వాదన మరింత బలపడుతోంది.
మార్స్ పై మానవ జీవనానికి అవకాశం ఉందా? అనే లక్ష్యంతో 2012లో క్యూరియాసిటీ రోవర్ ను ప్రయోగించారు. అప్పటినుంచి రోవర్ తరచూ మార్స్ కు సంబంధించిన ఫోటోలను భూమికి పంపుతూ ఉంది. ఈ ఫోటోల్లో పలుమార్లు ఆశ్చర్యకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. తాజాగా బయటకొచ్చిన ఫోటోల్లో చుట్టుపక్కల ప్రాంతాలతో ఏలియన్ రంగు కలిసిపోయి అచ్చు ఆ ప్రాంతంలోని ఓ రాయిలా కనిపిస్తోంది.
Advertisement