Curiosity Rover
-
కుజునిపై జీవముండేదా?
కుజ గ్రహం మీద పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తాజాగా కీలకమైన విశేషాలను సేకరించింది. కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఆ పగుళ్లను ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. వాటిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోయే తడి, పొడి ఆవర్తనాలకు సూచికలైన ఈ తరహా పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని చెబుతారు. ..ఎండా, వానా కాలాలు కుజ గ్రహంపై అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన పగుళ్లను క్యూరియాసిటీ రోవర్ కనిపెట్టింది. షట్కోణాకృతిలోని ఆ పగుళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు. జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకమే గాక ఎంతో అనుకూలం కూడా. భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవనేందుకు ఈ ఆవర్తనాలు నిదర్శనమని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్ అభిప్రాయపడ్డారు. మట్టి పొర, లవణ ఖనిజాలతో సమృద్ధమైన వాటి పై పొరల మధ్య జోన్లో ఈ చక్రాలను కనిపెట్టారు. బురద ఎండిపోయినకొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్ మాదిరిగా ఏర్పడ్డాయి. పదేపదే నీరు పారిన మీదట వై ఆకృతిలోకి, అంతిమంగా షట్కోకోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి. భూమ్మీద మాదిరిగానే ఎండా, వానా కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చని రేపిన్ చెప్పారు. ‘పైగా భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’అని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. జీవం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ ఇంత సురక్షితంగా ఉన్న కుజుని వంటి గ్రహం భూమికి ఇంత సమీపంగా ఉండటం ఒక రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇదో పెద్ద ముందడుగు కాగలదు’ – విలియం రేపిన్, పరిశోధన సారథి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగారకుడిపై సూర్యకిరణాలు.. ఇదే తొలిసారి!
వాషింగ్టన్: ఫొటోలో కనిపిస్తున్నవేమిటో తెలుసా? అంగారకునిపై కనువిందు చేస్తున్న సూర్య కిరణాలు. కుజ గ్రహంపై సూర్య కిరణాలు మన కంటపడటం ఇదే తొలిసారి! మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. దిగంతాల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్న క్రమంలో మేఘాలన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్న తీరును ఫొటోలో గమనించవచ్చు. కుజునిపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు, మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా. కుజ గ్రహాన్ని వాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణం, దాని కూర్పు, ఇతర స్థితిగతులను తెలుసుకోవడానికి దాని మేఘాలను విశ్లేషించడం కీలకం. -
Mars Doorway: అంగారకుడి మీద ‘తలుపు’ మిస్టరీ వీడింది
అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది. ఇక డోర్ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది. చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు -
అంగారక గ్రహం నుంచి వచ్చిన పోస్ట్కార్డ్ను చూశారా..!
NASA Curiosity Rover Sends A Rare Postcard From Mars To Mark 10th Anniversary: భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చుననే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ రోవర్లను ప్రయోగించింది. తాజాగా క్యూరియాసిటీ రోవర్‌ను లాంచ్ చేసి నవంబర్ 26తో పది వసంతాలు ముగిశాయి. 2011 నవంబర్ 26న క్యూరియాసిటీ రోవర్‌ను నాసా లాంచ్ చేసింది. మార్స్‌పైకి పది సంవత్సరాల క్రితం ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇంకా పనిచేస్తోండడం గమనార్హం. అద్భుతమైన పోస్ట్‌కార్డ్..! క్యూరియాసిటీ రోవర్ పది వసంతాలను పూర్తి చేసుకోవడంతో మార్స్ నుంచి భూమికి అద్భుతమైన ఫోటోలను పంపింది. మార్టిన్ ల్యాండ్‌స్కేప్‌లో క్యూరియాసిటీ రోవర్ బంధించిన ఆసక్తికరమైన రెండు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను నాసా తన సోషల్‌మీడియా ఖాతాలో క్యూరియాసిటీ పంపిన పోస్ట్కార్డుగా వర్ణిస్తూ షేర్ చేసింది. ఫోటో కర్టసీ: నాసా క్యూరియాసిటీ పంపిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలు కాస్త ఎడిట్ చేస్తూ..‘విష్ యూ వర్ హియర్’ అనే ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియా నాసా పోస్ట్చేసింది. క్యూరియాసిటీ రోవర్ 360 డిగ్రీల కెమెరా సహయంతో ఈ ఫోటోలను తీసింది. క్యూరియాసిటీ రోవర్ నిర్వహణ బాధ్యతలను నాసా జెట్ ప్రొపెల్షన్ లాబోరేటరీ చూసుకుంటుంది. ఇప్పటివరకు మార్స్‌పై క్యూరియాసిటీ కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి..! ⇒మార్టిన్ రేడియేషన్ వాతావరణాన్ని అంచనా వేసింది. ⇒అంగారక గ్రహాన్ని చేరిన ఏడు సంవత్సరాల తరువాత క్యూరియాసిటీ రోవర్ మార్స్‌పై ఉన్నపురాతన ప్రవాహాన్ని కనుగొంది. దీంతో మార్స్‌పై నీరు ఒకప్పుడు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ⇒మార్స్ నేలపై జరిపిన డ్రిల్లింగ్ సహాయంతో సల్ఫర్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ , కార్బన్‌తో జీవానికి సంబంధించిన కొన్ని కీలక రసాయన పదార్థాలను క్యూరియాసిటీ గుర్తించింది. ⇒పురాతన గేల్ క్రేటర్‌లో మిలియన్ల సంవత్సరాలుగా సరస్సులు ఉన్నాయని క్యూరియాసిటీ గుర్తించింది. View this post on Instagram A post shared by NASA (@nasa) చదవండి: ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో ఏదంటే..! -
అంగారకుడిపై జీవం ఉందా?
అంగారకుడిపై జీవం ఉండేదా? ఉందా? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నామంటున్నారు కొందరు పరిశోధకులు. మరో భూమి కాగలదని భావిస్తున్న అరుణ గ్రహంపై జీవం ఉండటమే కాదు.. ఇప్పుడు అక్కడ శిలీంధ్రాలు పెరుగుతున్నాయని వీరి వాదన. నీళ్లలో పెరిగే నాచు.. పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రాల రూపంలో ఇవి ఉన్నాయని, క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల ఆధారంగా వీరు ఈ అంచనాకు వచ్చినట్లు.. జర్నల్ ఆఫ్ ఆస్ట్రో బయాలజీ అండ్ స్పేస్ సైన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ద్వారా వెల్లడైంది. క్యూరియాసిటీ పంపిన కనీసం 15 చిత్రాల్లో అత్యంత సాధారణ స్థాయి జీవం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ రెజీనా డాస్ చెప్పారు. ఈ రకమైన జీవం ఇప్పుడు కూడా అక్కడ పెరుగుతూ ఉండొచ్చునని.. లేదంటే ఒకప్పుడు అక్కడ మనుగడ సాగించి ఉండవచ్చునని ఆయన అంటున్నారు. వీరి అంచనా ప్రకారం అంగారకుడి వాతావరణంలో ఉన్న మీథేన్ వాయువు ఒక క్రమ పద్ధతిలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అక్కడి జీవం బతికి ఉన్నప్పుడు ఒకలా, చనిపోయినప్పుడు మరోలా మీథేన్ స్థాయిలు మారుతున్నాయన్నమాట. క్యూరియాసిటీ పంపిన చిత్రాలు మూడు రోజులకు సంబంధించినవైతే.. మొదటి రోజు చిత్రంలోని నాచు కంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాసా ఏమంటోంది? రెజీనా డాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించామని స్పష్టంగా చెబుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) దీనిపై వ్యాఖ్యానించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉల్కా శకలాలు ఢీకొట్టినందున ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేందుకు అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంగారక గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో అక్కడి వాతావరణంపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే.. గ్రహశకలాలు ఢీకొట్టడం వల్ల జీవం ఏర్పడేందుకు అత్యంత కీలకమైన నైట్రోజన్ రూపాలు నైట్రైట్లు (ఎన్ఓ2), నైట్రేట్లు (ఎన్ఓ3)లు ఏర్పడతాయని, క్యూరియాసిటీ రోవర్ వీటిని గేల్ క్రేటర్ ప్రాంతంలో సేకరించిన మట్టి, రాతి నమూనాల్లో గుర్తించిందని పేర్కొంది. అంగారకుడిపై అత్యంత పురాతనమైన సరస్సులు, భూగర్భ జలాలు ఉన్నది ఈ గేల్ క్రేటర్లోనే కావడం గమనార్హం. క్యూరియాసిటీ గుర్తించిన నైట్రోజన్ రూపాలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేసింది. ప్రయోగంలో హైడ్రోజన్ ఎక్కువైన కొద్దీ నైట్రేట్లు, నైట్రైట్ల మోతాదు ఎక్కువ కావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండేవన్న నిర్ధారణకు వచ్చారు. -
అంగారకుడిపై అణుయుద్ధం?!
అంగారక గ్రహం ఒకనాడు ఆవాసయోగ్యంగా ఉండేదా? అక్కడ మనుషులు జీవించారా? అక్కడ అణు యుద్ధాలు జరిగాయా? యుద్దానంతరం.. జీవరాశిని గ్రహాంతరవాసులు నాశనం చేశారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వాషింగ్టన్ : అంగారక గ్రహం మీద దశాబ్దాలుగా నాసాసహా పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు రీసెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఒకప్పుడు అంగారకుడిపై జీవరాశి ఉండేదన్న నమ్మకాన్ని నాసా పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది. తాజాగా ఈ నమ్మకం నిజమనే ఆధారం వెలుగులోకి వచ్చింది. తాజాగా అంగారక గ్రహం మీద ఒక ఫిరంగి గుండు ఉన్న చిత్రాన్ని నాసా విడుదల చేసింది. అంగరాకుడి మీదున్నప్రజలకు, గ్రహాంతర వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదన వినిపిస్తోంది. అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇందుకు సంబంధించిన ఒక వీడియోను పంపింది. ఆ వీడియోలో అంగారకుడి భూ ఉపరితలానికి సంబందించి అతి దగ్గరగా ఫొటోలను రోవర్ చిత్రీకరించింది. అందులో ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని రోవర్ గుర్తించింది. వందల వేల ఏళ్ల కిందట అంగారకుడిపై జీవరాశి ఉండేదని.. అదే సమయంలో అక్కడి జీవరాశికి, గ్రహాంతరవాసుల మధ్య అణుయుద్ధంజరిగిందనే వాదన వినిపస్తోంది. ఈ అణు యుద్ధంలో అంగారకుడిపైనున్న జీవరాశి మొత్తం సర్వనాశనం అయిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండుగా దీనిని అనుమానిస్తున్నారు. గ్రహాంతర వాసులపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న స్కాట్ సీ వార్నింగ్‌కూడా ఈ వీడియో ఇటువంటి అభిప్రాయన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
ఏలియన్లు కనిపించాయా?
అంగారక గ్రహంపై ఏలియన్లు కనిపించాయా?. చాలా మంది థియరిస్టులు మార్స్ గ్రహంపై జీవరాశి ఉందని నిరూపించడానికి ఆ గ్రహానికి సంబంధించిన ప్రతి ఫోటోను పరిశీలిస్తున్నారు. తాజాగా మార్స్ గ్రహాంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన కొన్ని ఫోటోల్లో ఏలియన్లు ఉన్నాయని ఇది అంగారకుడిపై జీవరాశి నివసిస్తోందనడానికి సాక్ష్యం అని అంటున్నారు. ఆ చిత్రాల్లో రోవర్ వైపు తదేకంగా చూస్తున్న ఓ ఏలియన్, ఒక స్నెయిల్ ఉన్నాయి. దీంతో వారి వాదన మరింత బలపడుతోంది. మార్స్ పై మానవ జీవనానికి అవకాశం ఉందా? అనే లక్ష్యంతో 2012లో క్యూరియాసిటీ రోవర్ ను ప్రయోగించారు. అప్పటినుంచి రోవర్ తరచూ మార్స్ కు సంబంధించిన ఫోటోలను భూమికి పంపుతూ ఉంది. ఈ ఫోటోల్లో పలుమార్లు ఆశ్చర్యకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. తాజాగా బయటకొచ్చిన ఫోటోల్లో చుట్టుపక్కల ప్రాంతాలతో ఏలియన్ రంగు కలిసిపోయి అచ్చు ఆ ప్రాంతంలోని ఓ రాయిలా కనిపిస్తోంది. -
అంగారక గ్రహంపై అంతుచిక్కని మిస్టరీ?
న్యూయార్క్: అంగారక గ్రహం అవతరనకు దారితీసిన పరిస్థితులు అర్థం చేసుకోవడం అంత ఈజీకాదని తెలుస్తోంది. అంగారక గ్రహంపైకి పరిశోధనల కోసం పంపించిన క్యూరియాసిటీ రోవర్, అంగారకుడి ఉపరితలంపై ట్రిడిమైట్ అనే ఖనిజాన్ని కనుక్కోవడం శాస్త్రవేత్తలకు కొత్త చిక్కులు తెచ్చింది. ఇంతకుముందు శాస్త్రవేత్తలు ఊహించినదానికన్నా అంగారక గ్రహం అధిక ఉష్ణోగ్రతతో కూడిన అగ్ని పర్వతాల నిలయంగా ఉండి ఉంటుందని, అందుకనే అక్కడ ట్రిడిమైట్ ఖనిజం ఏర్పడి ఉంటుందన్నది శాస్త్రవేత్తల నవీన భావం. ఎందుకంటే భూ అంతర్భాగంలో సిలికా ఖనిజాలు మండిపోవడంతో వల్ల ఉద్భవించిన శిలా ద్రవాలు నీటితో కలసి భూ ఉపరితలానికి లావా రూపంగా ప్రవహించడం వల్ల ట్రిడిమైట్ అనే ఖనిజం ఏర్పడుతోంది. ఇదే నిజమైతే అంగారకుడి గ్రహంపై నీటి నిల్వలు కచ్చితంగా ఉండాలి. అలాంటి నీటి నిలువల జాడలకు కూడా ఇప్పటి వరకు నాసా శాస్త్రవేత్తలు కనుగొనలేక పోయారు. పైగా ఇంతకుముందు ఊహించిన దానికన్నా అంగారకుడిపై ఎక్కువ ఉష్ణాగ్రత ఉన్నట్లయితే నీటి నిల్వలు కూడా ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా ట్రిడిమైట్ ఖనిజం సిలికా శిలాజ ద్రవం, నీరు కలిస్తే ఏర్పడుతుందన్న నిర్వచనం అన్న తప్పుకావాలి. లేదా ఇంతకాలం అంగారక గ్రహాన్ని మనం అర్థం చేసుకున్న తీరైన తప్పుకావాలని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడుతున్నారు. ‘అగ్ని పర్వతాల్లో తీవ్ర విస్ఫోటనం (సిలిసిక్ వాల్కనిజం) సంభవించడం వల్ల ట్రిడ్మైట్ ఖనిజం ఏర్పడుతుందని ఇంతకాలం భావిస్తూ వచ్చాం. అంతటి ఉష్ణోగ్రతగాని, తీవ్ర అగ్ని పర్వతాలుగానీ అంగారకుడిపై లేవని అభిప్రాయంతోనే ఇంతకాలం ఉన్నాం. దీన్నిబట్టి చూస్తే చల్లటి వాతావరణంలో కూడా ట్రిడ్మైట్ ఖనిజం ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఆ దిశగా మరిన్ని పరిశోధనలు కొనసాగాల్సి ఉంది’ అని నాసా ప్లానేటరి శాస్త్రవేత్త రిచర్డ్ మోరిస్ వ్యాఖ్యానించారు. అంగారక గ్రహంపైకి జీవిని పంపించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఆశిస్తున్న తరుణంలో అంగారక గ్రహం మిస్టరీని వీలైనంత త్వరగా ఛేదించాల్సిన అవసరం ఉంది. -
అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్!
లండన్: అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టు నాసా క్యూరియోసిటి మార్స్ రోవర్ తీసిన ఫోటోను బ్రిటీష్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. క్యూరియోసిటి రోవర్ మాస్టర్ కెమెరా సహాయంతో ఎడమ వైపు ఆరు అడుగుల ఎత్తున్న ఫోటోను గ్రహాంతర సిగ్నల్ ద్వారా జోయ్ స్మిత్ గుర్తించారు. రాళ్ల గుట్టల సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లాంటి పరికరాన్ని స్మిత్ గుర్తించాడు. ప్రారంభం నుంచి నాసాలో ఈ చిత్రాలను ఫాలో అవుతున్నానని, ప్రతి రోజు నాసా వెబ్ సైట్ లో కదలడం చూస్తున్నానని జోయ్ తెలిపారు. ఆ ఛాయ చిత్రాలను చూస్తే కొత్తగా వింతగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ గా కనిపిస్తోంది. అది ఎంత పెద్దగా ఉందో చెప్పడం కష్టమే. అయితే సుమారు 12 ఇంచుల పొడవు ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు అని స్మిత్ అన్నారు. అందుకే ఇంటర్నెట్ లో పోస్ట్ చేశానని, ప్రజలు కూడా ట్రాఫిక్ సిగ్నల్ లా కనిపిస్తుందన్నారు. -
‘అంగారకుడి’ తొడ ఎముక కాదది.. రాయే!
న్యూయార్క్: అరుణగ్రహంపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న క్యూరియాసిటీ రోవర్ ఇటీవల తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోలో రాళ్లతో పాటు కనిపిస్తున్నది అంగారక మనిషి తొడ ఎముకేనని... ఒకప్పుడు మార్స్‌పై మనుషులు ఉండేవారనడానికి ఇదే ఆధారమంటూ నెట్టింట్లో ప్రచారం జోరందుకుంది. దీంతో దీనిని నిశితంగా పరిశీలించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు.. ఇది తొడ ఎముక కాదని, అలాంటి ఆకారంలోకి మారిన ఓ రాయేనని స్పష్టంచేశారు. గాలి లేదా నీటి వల్ల క్రమక్షయానికి గురైన శిల ఇలా తొడ ఎముక ఆకారంలోకి మారి ఉంటుందని వారు వెల్లడించారు. అంగారకుడిపై ఒకప్పుడు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల మనుగడకు మాత్రమే అనుకూలమైన వాతావరణం ఉండేదని, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం అక్కడ ఎప్పుడూ ఏర్పడలేదని స్పష్టం చేశారు. -
‘క్యూరియాసిటీ’ రివర్స్‌గేర్!
వంద మీటర్లు వెనక్కి నడిచిన రోవర్ వాషింగ్టన్: అంగారకుడి పై పరిశోధనలు జరుపుతున్న నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’ చక్కని విన్యాసం పూర్తిచేసింది. 100.3 మీటర్ల దూరం వెనక్కి నడిచింది. ఈ నెల 18న దాదాపు సమతలంగా ఉన్న ప్రాంతంలో ఈ ఫీట్ చేసింది. రాళ్లురప్పలపై వెళ్లేటప్పుడు రోవర్ చక్రాలు దెబ్బతినకుండా ఉండేందుకు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు నాసా శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు. క్యూరియాసిటీ అల్యూమినియం చక్రాలకు ఊహించినదానికంటే ముందే రంధ్రాలు పడ్డట్టు గత ఏడాది చివర్లో గుర్తించడంతో ఈ ప్రయోగం చేశారు. అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణ కోసం క్యూరియాసిటీని మౌంట్ షార్ప్ కొండ దిశగా తీసుకెళ్తుండడం తెలిసిందే. -
‘క్యూరియాసిటీ’లో లోపం.. కార్యకలాపాల నిలిపివేత!
వాషింగ్టన్: అంగారకుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్లో ఎలక్ట్రికల్ వ్యవస్థలో లోపం తలెత్తింది. దీంతో ఆ శోధక నౌక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నవంబర్ 17న రోవర్‌లోని అన్ని భాగాలకూ విద్యుత్‌ను సరఫరా చేసే 32 వోల్టుల సామర్థ్యంగల పవర్ బస్‌కు, చాసిస్(చట్రం)కు మధ్య వోల్టేజీలో తేడా ఏర్పడింది. ఇందుకు కారణాలను తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు పరీక్షలు చేపట్టారు. ప్రస్తుతం రోవర్ కంప్యూటర్లతోసహా పూర్తి సురక్షితంగా ఉందని, అన్ని కార్యకలాపాలూ నిర్వహించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగానే రోవర్లో వోల్టేజీ మార్పుపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. మార్స్‌పై జీవం ఆనవాళ్ల అన్వేషణ కోసం నాసా పంపిన క్యూరియాసిటీ 2012 ఆగస్టులో ఆ గ్రహంపై దిగి అక్కడి మట్టిని, శిలలను పరీక్షిస్తూ సమాచారం పంపుతున్న విషయం తెలిసిందే.