అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్!
అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్!
Published Fri, Sep 26 2014 5:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM
లండన్: అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టు నాసా క్యూరియోసిటి మార్స్ రోవర్ తీసిన ఫోటోను బ్రిటీష్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. క్యూరియోసిటి రోవర్ మాస్టర్ కెమెరా సహాయంతో ఎడమ వైపు ఆరు అడుగుల ఎత్తున్న ఫోటోను గ్రహాంతర సిగ్నల్ ద్వారా జోయ్ స్మిత్ గుర్తించారు. రాళ్ల గుట్టల సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లాంటి పరికరాన్ని స్మిత్ గుర్తించాడు.
ప్రారంభం నుంచి నాసాలో ఈ చిత్రాలను ఫాలో అవుతున్నానని, ప్రతి రోజు నాసా వెబ్ సైట్ లో కదలడం చూస్తున్నానని జోయ్ తెలిపారు. ఆ ఛాయ చిత్రాలను చూస్తే కొత్తగా వింతగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ గా కనిపిస్తోంది. అది ఎంత పెద్దగా ఉందో చెప్పడం కష్టమే. అయితే సుమారు 12 ఇంచుల పొడవు ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు అని స్మిత్ అన్నారు. అందుకే ఇంటర్నెట్ లో పోస్ట్ చేశానని, ప్రజలు కూడా ట్రాఫిక్ సిగ్నల్ లా కనిపిస్తుందన్నారు.
Advertisement
Advertisement