Traffic signal
-
ఐటీ కారిడార్‌లో.. రెడ్ హార్ట్ ట్రాఫిక్ సిగ్నల్
గచ్చిబౌలి: గుండెను పదిలంగా ఉంచుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చనే నినాదంతో ప్రధాన కూడళ్లలో రెడ్ హార్ట్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. స్టార్ హాస్పిటల్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు రెడ్‌హార్ట్ సింబల్ ఏర్పాటు చేశారు. హృద్రోగాలపై వాహనదారులకు మరింత అవగాహన కలి్పంచేందుకు తమ వంతు ప్రయత్నంగా వీటిని ఏర్పాటు చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఐటీ కారిడార్‌లోని రెడ్ సిగ్నల్ వచి్చనప్పుడు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. దీంతో వాహనదారులు గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వీలుంటుంది. గచి్చ»ౌలి ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని గచి్చ»ౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. వినూత్న రీతిలో హార్ట్ సింబల్ కనిపించడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు సిగ్నల్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. -
సిగ్నల్ నీడలో
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్‌పూర్‌లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్‌వేవ్‌ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు. బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్‌స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్షేడ్స్ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు. -
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్‌ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్‌ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్‌కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
ఫుల్ ట్రాఫిక్..అందరూ చూస్తుండగానే రూ.40 లక్షలు స్వాహా!
అందరూ చూస్తుండగానే ఏ మాత్రం భయం లేకుండా చోరికి యత్నించారు. అదికూడా ఒక బైకర్ని అనుసరించిన ముగ్గురు దుండగులు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే సొత్తు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటన మార్చి1న సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెండు కార్లు వాటి మధ్యలో ఓ బైక్ ఆగి ఉన్నాయి. ఇంతలో ముగ్గురు దుండగులు కామ్‌గా ఆ వాహనదారుడి వద్దకు వచ్చి గమనించడం ప్రారంభించారు. ఇంతలో అతని భూజానికి తగిలించి ఉన్న బ్యాగ్‌ని నెమ్మదిగా ఓపెన్ చేసి సుమారు రూ. 40 లక్షలు కొట్టేశారు. జస్ట్ నాలుగే నాలుగు నిమిషాల్లో డబ్బుల కొట్టేసి జారుకున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని సుమారు రూ. 38 లక్షలు రికవరీ చేశారు. నిందితులను ఆకాశ్, అబిషేక్గా గుర్తించారు. ఆ ముఠా వాహనదారులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ) -
ఇంటికీ ట్రాఫిక్ ‘సిగ్నల్’ పడాల్సిందే!
ఏదో చిన్న రోడ్డులో భారీ అపార్ట్మెంట్ల సముదాయమో, షాపింగ్ మాల్‌నో నిర్మించారు.. వచ్చీ పోయే వాహనాలు, రోడ్డు పక్కనే పార్క్ చేసే వాహనాలు, జనంతో ట్రాఫిక్ సమస్య మొదలవుతుంది. ఆ రోడ్డులో వెళ్లే వాహనాలూ నిలిచిపోతాయి. మెయిన్ రోడ్డుపైనా ప్రభావం చూపిస్తుంది.. కానీ ఇకపై ఈ సమస్యకు చెక్ పడనుంది. కొత్తగా భారీ భవనాలు, సముదాయాలు నిర్మించాలంటే.. ఆ ప్రాంతంలో అవసరమైన స్థాయిలో రోడ్డు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ సదుపాయాలు ఉండాల్సిందే. లేకుంటే రోడ్డు విస్తరణ, పార్కింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లకు సదరు నిర్మాణదారు బాధ్యత వహించాల్సిందే. ఇప్పటివరకు రోడ్ల వెడల్పును పరిగణనలోకి తీసుకొని పర్మిషన్లు మంజూరు చేసే స్థానిక సంస్థలు.. త్వరలోనే ట్రాఫిక్ రద్దీని కూడా అంచనా వేసి, దానికి అనుగుణంగా అనుమతులు మంజూరు చేయనున్నాయి. చాలా చోట్ల రోడ్ల వెడల్పుతో సంబంధం లేకుండా, పార్కింగ్ స్థలం లేకున్నా.. ఎత్తయిన భవనాలను, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను నివారించడం, కూడళ్లపై ఒత్తిడిని తగ్గించడంపై ట్రాఫిక్ పోలీసు విభాగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే సదరు ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ నివారణ, క్రమబద్ధీకరణకు వీలుగా ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ను కూడా సమర్పించేలా నిబంధన తేవాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగం కలిసి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిసింది. దీని ప్రకారం ఇకపై నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందే.. భవన నిర్మాణ ప్లానింగ్‌లో సెట్‌బ్యాక్, పార్కింగ్ స్థలం, గ్రీనరీ, వర్షపు నీటి గుంతల ఏర్పాటుతో పాటు ‘టీఐఏ’నివేదికనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది అమల్లోకి వస్తే.. దేశంలో టీఐఏ ఆధారంగా నిర్మాణ అనుమతులు జారీచేసే తొలి కార్పొరేషన్‌గా హైదరాబాద్ నిలవనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రోడ్డు వెడల్పు.. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదిత రోడ్డు వెడల్పులను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం అగ్నిమాపకశాఖ, జలమండలి, పర్యావరణం, వాల్టా, నీటి పారుదల శాఖ, విమానాశ్రయం, డిఫెన్స్, రైల్వే విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల (ఎన్ఓసీ)ను జత చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఇలా.. ఇక ముందు ప్రస్తుత పత్రాలకు అదనంగా నిర్మాణదారులు టీఐఏను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక కోసం ‘ఎంప్యానల్డ్ ట్రాఫిక్ కన్సల్టెంట్’ద్వారా అవసరమైన పత్రాలు జత చేస్తూ దరఖాస్తు సమరి్పంచాలి. ఒకవేళ రోడ్డు చిన్నగా ఉంటే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో సదరు ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం భవన యజమాని అదనపు స్థలాన్ని కేటాయించాలి. లేదా లింక్ రోడ్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంత వాటా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలి దశలో 100 అడుగుల నుంచి 250 అడుగుల వెడల్పు ఉండే రహదారులను ఆనుకొని నిర్మించే భవనాలు/ సముదాయాలకు ‘టీఐఏ’నిబంధనలను వర్తింపజేయనున్నారు. కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల భవనాల స్వరూపం, వ్యాపార కార్యకలాపాలను బట్టి టీఐఏను సమరి్పంచాల్సి ఉంటుంది. తర్వాత భారీ నివాస భవనాలకూ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు.. ప్రస్తుతం పార్కింగ్ స్థలం లేకున్నా వాణిజ్య భవనాలకు ఎన్ఓసీలను మంజూరు చేస్తున్నారు. ఫలితంగా ఆ భవనాల నుంచి వచ్చే వాహనా లు, బయట పార్క్ చేసేవాటితో ట్రాఫిక్ సమస్య వస్తోంది.అందువల్ల ట్రాఫిక్ పోలీసుల అనుమతి ఉంటేనే ఎన్ఓసీలు జారీ చేయాలి. 45, 60 అడుగులకుపైన వెడల్పుండే రోడ్ల మీద కట్టేవాటికి, 25 అంతస్తులపైన ఉండే అన్ని భవనాలకు ఈ విధానాన్ని అమ లు చేయడం ఉత్తమం. – కె.నారాయణ్ నాయక్, జాయింట్ సీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ మరో ఎన్వోసీతో మరింత జాప్యం ఇప్పటికే హైరైజ్ భవనాలకు నిర్మాణ ఫీజులతోపాటు ఎక్స్టర్నల్ బెటర్మెంట్ చార్జీలు, ఇంపాక్ట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ సొమ్మును సదరు ప్రాంతంలో డ్రైనేజీ, వాటర్, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే వినియోగించాలి. కానీ ప్రభుత్వం సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా ట్రాíఫిక్ ఎన్ఓసీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదు. ఇప్పుడు పదుల సంఖ్యలో ప్రభుత్వ విభాగాల ఎన్ఓసీల కోసమే నెలల కొద్దీ సమయం పడుతోంది. కొత్తగా మరోటి అంటే జాప్యం ఇంకా పెరుగుతుంది. – సి.శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ -
‘జంపింగ్’ బాబులు జడుసుకునే వార్త
న్యూఢిల్లీ: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా సిగ్నల్ జంప్ చేసే వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జంపింగ్ బాబులు జడుసుకునే వార్త కేంద్రం తాజాగా వెల్లడించింది. రెడ్‌లైట్ జంపింగ్ కారణంగా రోడ్డు ప్రమాద మరణాలు 2019తో పోలిస్తే 2020లో 79 శాతం పెరిగాయని తాజా నివేదికలో పేర్కొంది. 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020' నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ వల్ల 2020లో 919 ప్రమాదాలు సంభవించగా.. 476 మంది మృతి చెందారు. 2019లో 266 మంది దుర్మరణం పాలయ్యారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా 2020లో 3,099 మంది ప్రాణాలు కోల్పోగా.. 2019లో 2,726 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురై 2020లో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో 2376 మరణాలు నమోదయ్యాయి. మితిమీరిన వేగమే అత్యధిక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 1,31,714 మంది మరణించగా.. 3,48,279 మంది క్షతగాత్రులయ్యారు. అయితే 2019తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 18 శాతం, మరణాల రేటు 12.8 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో 18-45 ఏళ్ల వయస్సు గల యువకులే 69 శాతం మంది ఉండగా.. మొత్తం మరణాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు వర్కింగ్ వయసులో ఉన్నవారు 87.4 శాతం మంది ఉండడం ఆందోళన కలిగించే అంశం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడానికి కోవిడ్-19 లాక్డౌన్ కారణమని నివేదిక వెల్లడించింది. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడం వల్ల కూడా దుర్ఘటనలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశంలో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి దుర్ఘటనల్లో మరణించిన ప్రతి 10 మందిలో ఒకరు మనదేశానికి చెందినవారు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. (క్లిక్: బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం) 2018లో స్వల్పంగా(0.46 శాతం) పెరగడం మినహా 2016 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. వరుసగా రెండో ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గడం కొంతలో కొంత ఊరట. అదేవిధంగా, గాయపడిన వారి సంఖ్య కూడా 2015 నుండి తగ్గుతూ వస్తోంది. (క్లిక్: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి) -
వైరల్: ఆమె అదృష్టం బాగుంది.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
అనంతపురం క్రైం: అదృష్టం బాగుండి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. అనంతపురంలోని క్లాక్‌టవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు.. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన నాగలక్ష్మి... ఐర్లాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు నెల కిందట అనంతపురానికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం టవర్‌క్లాక్ సమీపంలోని దుకాణంలో మందులు కొనుగోలు చేసి, సోదరి దివ్యాంజలితో కలిసి స్కూటీపై మారుతీనగర్‌కు వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించారు. ట్రాఫిక్ సిగ్నల్ వెలగడంతో అప్పటి వరకూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సును గమనించని నాగలక్ష్మి తన స్కూటీని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో బస్సు బంపర్ తగిలి కిందకు పడ్డారు. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసేలోపు ముందు చక్రం స్కూటీ పైకి వెళ్లింది. ఘటనలో నాగలక్ష్మి కాలు విరిగింది. వెనుక కూర్చొన్న దివ్యాంజలికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తన అజాగ్రత్త కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై ఎలాంటి కేసు అవసరం లేదంటూ పోలీసులకు విన్నవించారు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. -
‘సిగ్నల్ వద్ద యువతి అతి’, అసలేం జరిగిందంటే..
సిగ్నల్ దగ్గర ఓ క్యాబ్ డ్రైవర్‌ను, అతనికి సపోర్ట్‌గా వచ్చిన మరో వ్యక్తిని ఉత్తపుణ్యానికే రెచ్చిపోతూ చితకబాదింది ఓ యువతి. ఉత్తర ప్రదేశ్ లక్నో అవుధ్ సిగ్నల్ దగ్గర జులై 30న రాత్రి 9.40కి ఈ ఘటన జరగ్గా.. మూడు రోజుల తర్వాత సోషల్ మీడియా, మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది ఆ వీడియో. దీంతో ఆ యువతిని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తునే నిరసన నడిచింది.. ఇంకా నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరి కెమెరాల ఆధారంగా అక్కడేం జరిగిందో మీడియాకు వివరించారు. సిగ్నల్ పడకముందే రోడ్డు క్రాస్ చేయాలని ప్రయత్నించిన యువతి.. సరిగ్గా సిగ్నల్ పడిన టైంలో వేగంగా వస్తున్న ఓ కారు ముందట ఆగింది. ఆ వెంటనే క్యాబ్ డ్రైవర్ మీద ఊగిపోతూ.. ఆమె దాడి చేయడం రికార్డయ్యింది. ఫోన్ పగలకొట్టడంతో పాటు కారులో ఉన్న 600రూ. లాగేసుకుంది. అదంతా అంతా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వాహనదారులంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వచ్చారు. A man's dignity is equivalent to a woman's dignity. Cab driver Ali of #Lucknow is a true gentleman and he didn't slap back demonstrate his upbringing. #LucknowGirl Priyadarshani Yadav beats driver Ali in presence of @lkopolice. Here's CCTV footage, #ArrestLucknowGirl pic.twitter.com/dBOANBc5Dg — Joydeep Roy (@jdroy_) August 2, 2021 అటుపై యువతిని, ఆ క్యాబ్ డ్రైవర్‌ను.. అందులో ఉన్న అతని ముగ్గురి స్నేహితుల్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తనకు చిన్న గాయం కూడా అయ్యిందని, తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాపోయింది ఆ యువతి. దీంతో సదాత్ అలీ సిద్ధిఖీపై నిర్లక్క్ష్య పూరిత డ్రైవింగ్ నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. స్టేషన్లోనే ఉంచారు. ఆపై పూచీకత్తు మీద రిలీజ్ చేశారు. వైరల్ వీడియో ద్వారా ఈ మొత్తం విషయం బయటకు రావడంతో.. క్యాబ్ డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ ట్విటర్ హోరెత్తింది. కళ్ల ముందు ఏం జరిగిందో కనిపిస్తున్నా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువతి అరెస్ట్ డిమాండ్ చేస్తూ.. #ArrestLucknowGirl హ్యాష్ ట్యాగ్ నడిపించారు. మరోవైపు ఆ యువతి ఆచూకీ కోసం ఇంటర్నెట్లో విపరీతంగా వెతికారు నెటిజన్స్. Cab driver demands his self respect 😔🙏#lucknowgirl #justiceforcabdriver #ArrestLucknowGirl #Feminism pic.twitter.com/S4eYqRHyCd — Ashishhh (@cricAshish2002) August 3, 2021 ఈ పరిణామాల తర్వాత సోమవారం కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్లో యువతిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఉద్దేశపూర్వకంగా దాడి, వస్తువుల్ని నాశనం చేసిన నేరాల కింద కేసు నమోదు అయినట్లు లక్నో అదనపు డీసీపీ చిరంజీవ్నాథ్ సిన్హా వెల్లడించారు. ఇది తన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని, న్యాయం కావాలని బాధితుడు కోరుతున్నాడు. ఇంకోవైపు ఈ యువతి పేరు ప్రియదర్శిని అంటూ కొందరు.. ఆ అమ్మాయి ఫోటోలను వైరల్ చేస్తున్నారు కూడా. -
Viral Video: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్!
-
సిగ్నల్ దగ్గర యువతి ఓవరాక్షన్.. కుదిపేస్తున్న వీడియో
సోషల్ మీడియా అంటే వైరల్ వీడియోలకు హబ్. ప్రేమ-పగ-దాడి.. అదీ ఇదీ అనే తేడా లేకుండా ఏదైనా హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి చితకబాదడం అందులో ఉంది. నాన్ స్టాప్‌గా అతన్ని కొడుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. కారణం అడుగుతుంటే.. ఆ వ్యక్తి ఫోన్‌ను లాక్కుని మరీ పగలకొట్టింది ఆ యువతి. అంతేకాదు అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్ లాగి మరీ బాదేసింది. ఈ టైంలో భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. వెనకాల ఉన్న చాలామంది ‘ఆ అమ్మాయికి బుద్ధుందా?’ అంటూ వెనకాల నుంచి అరవడం వినొచ్చు. అయినా పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎగరి ఎగిరి మరీ ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వ్యక్తిని ‘నీకేం పనిరా’ అంటూ మరీ బాదింది. ఇక తనను ఢీకొట్టిన కారణంగానే ఈ పని చేసినట్లు ఆ యువతి అందులో మాట్లాడినట్లు ఉంది. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాను కుదిపిస్తోంది. సరిగ్గా ఏ తేదీన జరిగిన ఘటనో తెలియదుగానీ.. ‘మేఘ్ అప్డేట్స్’ అనే ట్విటర్ పేజీ నుంచి ఈ వీడియో సర్క్యూలేట్ అయ్యింది. ఇక ఈ ఘటనలో ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలంటూ ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో హ్యాష్ ట్యాగ్ కొనసాగుతోంది. అసలేం జరిగింది అనేదానిపై లక్నో పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.. -
చంద్రుడిని చూసి ట్రాఫిక్ లైట్‌గా పొరబడి..
కమర్షియల్ అండ్ హెవీ వెహికిల్స్ తయారీ రంగంలో దిగ్గజంగా టెస్లాకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సిలికాన్ వ్యాలీని బేస్ చేసుకుని నడుస్తున్న టెస్లా.. రెండు అమెరికా ఖండాల్లో భారీ బిజినెస్ చేస్తోంది. అయితే టెస్లా నుంచి డ్రైవర్‌లెస్ కార్ ఎప్పుడెప్పుడొస్తుందా? అని అంతా ఆత్రుతంగా ఎదురుచూస్తుండగా.. అది అంత వీజీ కాదని తేల్చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఈ తరుణంలో టెస్లా టెక్నాలజీపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా టెస్లా టెక్నాలజీలో డొల్లతనం బయటపడింది. టెస్లా ఆటోపైలెట్ సిస్టమ్ టెక్నాలజీ వెళ్తున్న ఓ కారు.. చంద్రుడిని ట్రాఫిక్ సిగ్నల్‌గా పొరపడి వేగంగా వెళ్తున్న కారు కాస్త నిదానించింది. ఓ టెస్లా కస్టమర్ ఈ పోస్ట్‌ను ట్విటర్లో పోస్ట్ చేసి మస్క్‌కి ట్యాగ్ చేశాడు. ఇదేం సాధారణమైన సమస్య కాదని, కచ్చితంగా ఇదో సంక్లిష్టమైన సమస్యేనని పేర్కొన్నాడతను. Hey @elonmusk you might want to have your team look into the moon tricking the autopilot system. The car thinks the moon is a yellow traffic light and wanted to keep slowing down. 🤦🏼 @Teslarati @teslaownersSV @TeslaJoy pic.twitter.com/6iPEsLAudD — Jordan Nelson (@JordanTeslaTech) July 23, 2021 తన టెస్లా కంపెనీ కారులో ఈ ఆటోపైలెట్ సిస్టమ్ డివైజ్‌ను ఉంచాడతను. చంద్రుడి రంగును చూసి ఎల్లో ట్రాఫిక్ లైట్‌గా చూపిస్తూ.. నిదానించింది కారు. దీంతో అతను ఫిర్యాదు చేశాడు. సుమారు పది వేల డాలర్లు విలువ చేసే ఈ టెక్నాలజీని వంద నుంచి రెండొదల డాలర్ల ఈఎంఐపై కూడా అదిస్తోంది టెస్లా. అయితే మొదటి నుంచి ఈ ఆటోపైలెట్ సిస్టమ్ సమస్యలకు కారణమవుతూ వస్తోంది. పార్క్డ్ లైన్లను గుర్తించకపోవడం, ముందు వెహికిల్స్ ఉన్నప్పుడు నిదానించి మరీ ఢీకొట్టడం లాంటి ఎన్నో సవాళ్లు కస్టమర్లకు ఎదురవుతున్నాయి. కానీ, బోస్టన్, ఫిలడెల్ఫియా లాంటి ప్రాంతాల్లో టెస్లా కస్టమర్లకు ఎలాంటి సమస్యలు ఎదురు కావడం లేదని, అయినప్పటికీ టెక్నికల్ ఇష్యూస్‌ను సాల్వ్ చేస్తామని ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది కంపెనీ. -
వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం
దేశంలో దాదాపు 47.2 కోట్ల మంది చిన్నారులున్నారు. అయితే వీరిలో చాలా మంది పొలం పనులకు వెళ్లడం, చెత్త ఏరుకోడం, రోడ్ల కూడళ్లలో బెలూన్లూ, పెన్నుల వంటివి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక సమాజంలో కొన్ని సన్నివేశాలు సినిమాను మించి ఉంటాయి. అవి చూసిన మనిషికి కన్నీళ్లు తెప్పిస్తాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఓ వీధి బాలుడు కారు వద్దకి వెళ్లి ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. అయితే అంతే వయసు ఉన్న కారులోని పిల్లాడికి ఆ దృష్యాన్ని చూసి హృదయం ద్రవించుకుపోయింది. అంతే తన దగ్గర ఉన్న డబ్బులను తీసి ఇస్తాడు. అతడు ఆడుకోవడానికి తన జేసీబీ బొమ్మను ఇచ్చాడు. ఇద్దరూ బొమ్మకార్లతో ఆడుకుంటారు. అంతేకాదండోయ్ తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పి ఇద్దరు కలిసి పంచుకు తిన్నారు. జేసీబీ బొమ్మను తిరిగి ఇస్తుంటే.. గిప్ట్గా ఉంచుకోమన్నట్టు కనిపించే దృష్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో.. తెలియదుకానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘పిల్లలు దేవుళ్లతో సమానం. కారులోని అబ్బాయి, ఆ వీధి బాలుడు ఇద్దరిది విడదీయరాని బంధమై ఉంటుంది. దేవుడి ఆశీసులు వారికి ఎప్పుడూ ఉంటాయి.’’ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నిజంగా ఇదో అద్భుతమైన దృష్యం. దీన్ని చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. సినిమాల్లో వచ్చే ఇలాంటి సన్నివేశాలు ఎక్కడి నుంచో పుట్టవు.. మనిషి జీవితాల్లోని సంఘటనలే.’’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు -
సిగ్నల్ జంప్: ఏయ్ నన్నే ఆపుతావా?
బెంగళూరు: సిగ్నల్ జంప్ చేసినందుకు జరిమానా కట్టాలన్న ట్రాఫిక్ ఏఎస్ఐపై మహిళ ఆగ్రహంతో మండిపడింది. శనివారం మధ్యాహ్నం ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మైసూరు బ్యాంక్ సర్కిల్ వద్ద ఏఎస్ఐ బసవయ్య డ్యూటీలో ఉండగా, యూపీకి చెందిన అపూరి్వడియాస్ అనే మహిళ కారులో వెళ్తూ సిగ్నల్‌ను అతిక్రమించింది. దీంతో ఏఎస్ఐ ఆ కారును అడ్డుకుని జరిమానా చెల్లించాలని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ కారు దిగి ఏఎస్ఐ మెడ పట్టుకుని దౌర్జన్యం చేసింది. తిట్ల పురాణం అందుకుంది. ఆమెపై ఏఎస్ఐ ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కసు నమోదు చేశారు. చదవండి: ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు -
హైదరాబాద్ వరదలకు కొట్టుకుపోతున్న సిగ్నల్?
ఇటీవల వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు మహా నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. నగరంలో కురిసిన వర్షానికి వరదనీరు వీధుల వెంట ఏరులై పారింంది. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలకు వర్షపునీరు చేరడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొంతమంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి విగతా జీవులుగా మారారు. ఈ క్రమంలో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న దృశ్యాలు, వరద నీళ్లలో కార్లు ఇతర వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయిన దృశ్యాలు... ఇలా వర్ష బీభత్సానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చదవండి: వందేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి నవ్వుతున్నాడా? ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వరదలకు ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కూడా కొట్టుకుపోతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ట్రాఫిక్ సిగ్నల్ రోడ్డు దాటడం చూస్తున్నాను’ ఓ నెటిజన్ షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షించడంతో నిజమేనని నమ్మి అనేకమంది విభిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టు చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో వరద నీటికి నిజంగానే ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కొట్టుకుపోయిందా అని కొంతమందికి అనుమానం వచ్చింది. తాజాగా ఈ వీడియో గురించి ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ క్లారిటీ ఇచ్చింది. ఇది హైదరాబాద్లోది కాదని రెండేళ్ల క్రితం(2018) చైనాలో యులిన్ నగరానికి చెందినదని స్పష్టం చేసింది. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే షాపుల్లో సైన్ బోర్డులు, బైక్ వెనకాల ఉన్న స్టికర్‌పై చైనీస్ భాష ఉందని వీటన్నింటిని ఆధారాలుగా పేర్కొంది. చదవండి: 'ఆ ఫోటో నాదే.. నేను చనిపోలేదు' ఇన్విడ్ టూల్‌ను ఉపయోగించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఉపయోగించి దీనికి చెందిన అసలైన వీడియోను మే 11, 2018 న చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసినట్లు కనుగొన్నారు. మరో విషయం ఏంటంటే గతేడాది కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసిన సమయంలోనూ ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టిందని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తెలిపింది. కాగా 2018 లో కురిన భారీ వర్షాల కారణంగా గువాంగ్జీ జువాంగ్‌లో 70,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారని చైనా మీడియా పేర్కొంది. వాస్తవం : హైదరాబాద్ వరదల్లో ట్రాఫిక్ సిగ్నల్ కొట్టుకుపోతున్నట్లుగా చూపించిన వీడియో హైదరాబాద్‌కు చెందినది కాదు. చైనాలోని యులిన్ నగరంలోనిది. -
బాతాఖానీ.. ఇదేం పని!
కుత్బుల్లాపూర్: బహదూర్‌పల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ లారీని ఆపినా ఆగలేదంటూ నడి రోడ్డులో నిలిపివేసి తమాషా చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఒక వైపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పటికీ సదరు కానిస్టేబుళ్లు లారీని కదలనీయకుండా రోడ్డు మధ్యలో నిలిపి ట్రాఫిక్‌ను లారీ చుట్టూ తిప్పి పంపించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలా పది నిముషాల పాటు హల్చల్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు మీదనే బాతాఖానీ కొడుతూ లారీని మధ్యలో ఆపడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీని పక్కన ఆపి ఫైన్ వేయాల్సిందిపోయి ఇలా ఇతరులకు ఇబ్బంది కలిగించారని పలువురు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు మధ్యలో లారీ ఆపుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సర్కిల్లో.. -
గీత దాటితే వాతే!
సాక్షి, సిటీబ్యూరో: ‘‘ట్రాఫిక్ నియమాలను తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఇబ్బంది రాకపోవచ్చు. ఆ ధోరణి మారకుంటే వందోసారైనా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడు చెల్లించడం ఒక ఎత్తు.. ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే ఆ కుటుంబం పడే బాధ, వ్యధ మరో ఎత్తు. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘనుల దృష్టిలో ‘పొరపాటు’గా అనుకున్న అనేక సంఘనలు బాధితుల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్, నో ఎంట్రీ మార్గాల్లోకి వాహనాలతో రావ డం ప్రధానమైంది. వీటికితోడు మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా ఆటోలు తిప్పడం వంటి ఉల్లంఘనలు సైతం ఎదుటి వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలతో నగరంలో పదేపదే చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఒకరి నిర్లక్ష్యానికి మరో కుటుంబం బలి రోడ్డుపై ప్రయాణిస్తూ కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు.. అది వన్‌వేగా కనిపిస్తున్నా.. రాంగ్ రూట్ అని తెలిసినా పట్టించుకోకుండా దూసుకుపోతున్నారు. ‘నో ఎంట్రీ’ మార్గాల్లో ఇలాగే ప్రవర్తిస్తున్నారు. బైకర్ల నుంచి భారీ వాహనాల డ్రైవర్లు సైతం నో ఎంట్రీల్లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహనచోదకులు చిన్న చిన్న ప్రమాదాలకు గురవడంతో పాటు అనేక దారుణమైన సంఘటనలకూ కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి రాంగ్‌రూట్/ నిర్లక్ష్య డ్రైవింగ్ ఎదుటి వారి ఉసురు తీయడంతో పాటు వారి కుటుంబాన్నే కకావికలం చేస్తున్నాయి. 2013లో ముషీరాబాద్ ఏఎస్సై సత్యనారాయణ ఉసురు తీసిన మరణమే దీనికి నిదర్శనం. మూడు కేటగిరీలుగా ఉల్లంఘనలు రహదారి నిబంధనల ఉల్లంఘనలను ట్రాఫిక్ విభాగం అధికారులు మూడు కేటగిరీలు పరిగణిస్తారు. వాహన చోదకుడికి ప్రమాదకరంగా మారే వి మొదటిది కాగా, ఎదుటి వ్యక్తికి నష్టం కలిగిం చేవి రెండోది. వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పు తెచ్చేవి మూడో కేటగిరీకి చెందినవి. ప్రస్తుతం నగర ట్రాఫిక్ అ«ధికారులు ఈ మూ డో కేటగిరీపై దృష్టి పెట్టారు. పదేపదే ప్రమాదాలకు కారణమవుతున్న ఏడు రకాలైన అంశాలను గుర్తించారు. వీరిపై అనునిత్యం స్పెష ల్ డ్రైవ్స్ చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాల ను రంగంలోకి దింపారు. అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ పర్యవేక్షణలోనే ఇవి పనిచేస్తున్నాయి. కొన్ని చర్యలు తీసుకున్నా.. ‘మూడో కేటగిరీ’ ఉల్లంఘనలకు చెక్ చెప్పడానికి ఇప్పటికే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ‘రాంగ్ రూట్, నో ఎంట్రీ’ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డులను మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కం ట్రోల్ రూమ్ ద్వారా ఈ–చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి ప్రాణాలు తీసుకోవడం/తీయడం చేస్తున్నారు. రంగంలోకి నాలుగు బృందాలు ట్రాఫిక్ ఉల్లంఘనులకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పాలని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా తనిఖీల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రస్తుతం స్థానిక పోలీసుల ఆధీనంలో పనిచేస్తున్న టీమ్స్ అన్ని తరహా ఉల్లంఘనలు, రెగ్యులేషన్‌పై దృష్టి పెడతాయి. అయితే, ఈ ప్రత్యేక బృందాలు మాత్రం కేవలం ఏడు రకాలైన ఉల్లంఘనల్నే పరిగణలోకి తీసుకుని డ్రైవ్స్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఒక్కో బృందంలో ఎస్సై, ఏఎస్సై, హెడ్–కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. ప్రతిరోజు ట్రాఫిక్ చీఫ్ ఆదేశాల మేరకు వీరు నగరంలోనే ఏ ప్రాంతంలో అయినా తనిఖీలు చేస్తారు. ఏ ఠాణా పరిధిలో డ్రైవ్ చేస్తుంటే అక్కడి స్థానిక ఎస్సై వీరికి సహకరిస్తారు. బుధవారం నుంచే ఈ టీమ్స్ రంగంలోకి దిగి తొలిరోజు 66 కేసులు నమోదు చేశాయి. -
ఒకటి నుంచే ‘ట్రాఫిక్ బోధన’
►రహదారి భద్రతను సబ్జెక్ట్‌గా చేర్చాలని నిర్ణయం ►ఎస్సీఈఆర్టీ బృందంతో ట్రాఫిక్ కాప్స్ కసరత్తు ►ఇప్పటికే పాఠ్యాంశాలు సిద్ధం చేసిన పోలీసులు ►ఈ ఏడాదికి ఆన్లైన్లో ఈ–బుక్స్ సాక్షి, సిటీబ్యూరో: ⇒రహదారిపై ఏఏ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసుకోవాలి? పార్కింగ్‌లో ఉన్న రకాలను వివరించండి. ⇒ ట్రాఫిక్ సిగ్నల్‌లో ఎన్ని లైట్లు ఉంటాయి? ఏఏ రంగు దేన్ని సూచిస్తుందో సోదాహరణగా రాయండి. ⇒రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? ⇒అత్యవసర సమయాల్లో ఏఏ నెంబర్లకు సంప్రదించాలో పేర్కొనండి. ....ఇకపై విద్యార్థులకు పరీక్షల్లో ఈ తరహా ప్రశ్నలూ ఎదురుకానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ‘రహదారి భద్రత విద్య (రోడ్డు భద్రత, జాతి భవిష్యత్తు)’ పేరుతో అదనంగా ఓ సబ్జెక్ట్ చేరనుంది. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) వారు కసరత్తు పూర్తి చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఉద్దేశించి మూడు పుస్తకాలను డిజైన్ చేశారు. ఆరు నుంచి ఎనిమిది వరకు అనుకున్నా... రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌ను కేవలం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వారికి మాత్రమే పరిచయం చేయాలని, వారిలో అవగాహనకు కృషి చేయాలని ప్రాథమికంగా ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు గత ఏడాదే ప్రాథమికంగా పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేశారు. అయితే నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన, ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోడ్డు క్రాసింగ్, లైన్ డిసిప్లేన్ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రహదారి భద్రతకు సంబంధించి లోతైన అంశాలతో పాటు ఎంవీ యాక్ట్‌లోని కీలక నిబంధనలు, వాటిని పాటిస్తే కలిగే లాభాలు, విస్మయిస్తే చోటు చేసుకునే పరిణామాలు తదితర అంశాలను పాఠ్యాంశంగా చేర్చనున్నారు. తొమ్మిది పది తరగతులకు పార్కింగ్ విధానాలు, వాటిలో ఉండే లోటుపాట్లు, రహదారి భద్రత నిబంధనల్నీ వివరించనున్నారు. ఈ ఏడాదికి ఈ–బుక్స్ రూపంలో... ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచే రహదారి భద్రత విద్యను ఓ సబ్జెక్ట్‌గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. అయితే తుది కసరత్తులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదికి టెక్ట్స్‌బుక్స్ అందించడం కష్టసాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌కాపీలను సిద్ధం చేసి పాఠశాలలకు ఆన్లైన్లో ఈ–బుక్స్ రూపంలో పంపించాలని భావిస్తున్నారు. వాటిని ఆయా పాఠశాలలకు చెందిన వారు ప్రింట్‌ఔట్స్ రూపంలో విద్యార్థులకు ఇచ్చేలా చర్యలు తీçసుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం (2018–19) నుంచి సోషల్ లేదా మోరల్ సైన్స్లకు అనుబంధంగా రహదారి భద్రత విద్య సబ్జెక్ట్ టెక్ట్స్‌బుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎస్సీఈఆర్టీతో భేటీ అయిన ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ సబ్జెక్టులు, అందులోని అంశాలను పరిశీలించారు. ఇతర ఉపయుక్తమైన అంశాలు... రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌లో కొన్ని ఇతర ఉపయుక్తమైన అంశాలను చేర్చాలని ట్రాఫిక్–ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. 100, 101, 108 వంటి ఎమర్జెన్సీ నెంబర్ల ఉద్దేశం, వాటిని వినియోగించాల్సిన విధానం, దుర్వినియోగం చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు తదితర వివరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు ఇంటి పరిసరాలు, వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉంచడానికి పాటించాల్సిన అంశాలనూ పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర, కేంద్ర సిలబస్‌లతో నడిచే పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో స్టేట్ సిలబస్‌లోని పాఠ్యపుస్తకాల్లో ట్రాఫిక్ పాఠాలను చేరుస్తున్నారు. సెంట్రల్ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలలకు బుక్‌లెట్స్‌ను సరఫరా చేసి ప్రత్యేక పీరియడ్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో అమలైన తర్వాత కేంద్రం పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌కు (ఎన్సీఈఆర్టీ) లేఖ రాయడం ద్వారా ఆ సిలబస్‌లోనూ పాఠ్యాంశాలుగా చేర్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాఠ్యాంశంగా కాకుండా సబ్జెక్ట్‌గా.. ‘ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న, అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి అవసరమైన అన్ని రకాలైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అంశాలను సబ్జెక్టుగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తొలుత దీన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చాలని భావించాం. అయితే ప్రతి విద్యార్థి నేర్చుకోవడమేనేది కచ్చితంగా చేయడానికే సబ్జెక్టుగా పెట్టాలని నిర్ణయించాం. బడి ఈడు నుంచే బాధ్యతల్ని పెంచితే సత్ఫలితాలు ఉంటాయి. ఆ మేరకు విద్యాశాఖ అధికారులతో కలిసి కసరత్తు పూర్తి చేస్తున్నాం’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ ఏఏ తరగతుల వారికి ఏం బోధిస్తారంటే... ఒకటో తరగతి: ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత రెండో తరగతి: పాదచారులు–జాగ్రత్తలు మూడో తరగతి: రవాణా సౌకర్యాలు –వాహనాలపై ప్రయాణం 4,5,6,7 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్–సైన్ బోర్డులు, రోడ్ ప్రమాదాలు–కారణాలు, భద్రతా చర్యలు–సురక్షిత ప్రయాణం, విద్యార్థులు, రవాణా సౌకర్యాలు 8,9,10 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, వాహనాలు నిలుపు విధానం, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు– నిరోధించే మార్గాలు, భద్రతా చర్యలు, తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు. (ప్రతి తరగతి వారికీ కొన్ని వీడియో క్లాసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి) -
మోదీ చెప్పిన ఆ వీడియో 2014 నాటిది!
న్యూఢిల్లీ: నోట్ల రద్దును సమర్థిస్తూ, ప్రజలు నగదురహిత జీవనానికి త్వరలోనే అలవాటు పడ్తారంటూ ఓ బిక్షగాడి వాట్సాప్ వీడియోను.. శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో ప్రసంగిస్తూ మోదీ ఉదహరించిన విషయం గుర్తుందా!? అది నోట్ల రద్దు నిర్ణయానికి చాలా రోజుల ముందు, 2014లో హైదరాబాద్ నుంచి అప్లోడ్ చేసిన వీడియోగా తేలింది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన కారు వద్దకు వచ్చిన బిక్షగాడికి, కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహిళ తన దగ్గర చిల్లర లేదనడం, ఆ బిక్షగాడు తన దగ్గర చిల్లర ఉందని చెప్పడంతో, తన దగ్గర నగదు లేదు కార్డు మాత్రమే ఉందంటూ ఆ మహిళ తన పర్స్ చూపడం ఆ వీడియోలో కనిపిస్తుంది. దాంతో, ‘ఏం పర్లేదు.. నా దగ్గర స్వైపింగ్ మెషిన్ ఉంది’ అని ఆ బిక్షగాడు జవాబిస్తాడు. ఆ విషయాన్ని నమ్మని ఆ మహిళ ‘ఏదీ ఆ మెషిన్ చూపించాల’ంటూ అడుగుతుంది. దాంతో అతడు తన దగ్గర ఉన్న స్వైపింగ్ మెషిన్‌ను చూపించడంతో ఆ వీడియో ముగుస్తుంది. అరుుతే, ఆ యంత్రం పనిచేస్తున్నట్లు కానీ, కార్డును అందులో స్వైప్ చేసినట్లు కానీ ఆ వీడియోలో లేదు. అదీకాక, ఆ వీడియోను చూసినవారికి అది నిజంగా జరిగిన ఘటన కాదు.. కావాలనే రూపొందించిన వీడియోగా సులభంగా తెలిసిపోతుంది. -
ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలట!
న్యూయార్క్: స్థూలకాయులైన పిల్లలు రోడ్డు దాటేటప్పుడు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని శాస్తవేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలిందేమిటంటే సాధారణ పిల్లలతో పోలిస్తే స్థూలకాయులైన చిన్నారులు రోడ్డు దాటేటప్పుడు సరైన సమయం వరకు వేచి చూడలేరు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడే అవకాశముంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు వారి మోకాలి కీళ్లపై భారం పడడంతో త్వరగా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్నారని శాస్త్రవేత్తలు వివరించారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్, అమెరికాలోని అలబామాలో 206 మంది చిన్నారులపై జరిపిన పరిశోధన ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. అలాగే, స్థూలకాయులైన చిన్నారులు మల్టిటాస్కింగ్తో చేయాల్సిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా పరిశోధనలో వెల్లడైంది. -
జంక్షన్.. నో టెన్షన్
విశ్వనగరంలో ‘సిగ్నల్ ఫ్రీ జర్నీ’ ♦ ఆటంకాల్లేని సాఫీ ప్రయాణానికి సర్కారు కసరత్తు ♦ ఇప్పటికే టెండర్లు పిలిచిన ప్రభుత్వం ♦ ఒప్పందాలు పూర్తి కాగానే పనులు మొదలు సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం.. సిగ్నల్ ఫ్రీ జర్నీ.. ఎక్కడికక్కడ మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు.. ఎలాంటి సిగ్నల్ ఆటంకాలు లేకుండా సాఫీ ప్రయాణం.. గత కొంతకాలంగా నగర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలివీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిగా విశ్వనగరం.. సిగ్నల్ ఫ్రీ జర్నీ.. గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే కొన్నింటికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అగ్రిమెంట్లు కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. అసలు సిగ్నల్ ఫ్రీ అంటే ఏమిటి..? దానికోసం ఏం చేస్తారు..? తద్వారా ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కలుగుతాయి..? ప్రయాణ భారం ఎంత తగ్గుతుంది..? ఎంత సమయం కలిసొస్తుంది..? తదితర ప్రశ్నలు ఇప్పుడు అందరి మదినీ తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సిగ్నల్ ఫ్రీ’ జర్నీ కోసం చేపట్టనున్న పనుల గురించి ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం..‘సిగ్నల్ ఫ్రీ’ అంటే ఏమిటి..? ఎక్కడైనా రెండు లేదా అంతకుమించి రోడ్ల కూడలిని దాటాలంటే ట్రాఫిక్ సిగ్నళ్లను చూసుకుని దాటాల్సిన విషయం తెలిసిందే. నగరంలో రెండు కి.మీ.ల మేర ప్రయాణించాలంటే దాదాపు నాలుగైదు చోట్ల సిగ్నళ్ల వద్ద ఆగాల్సిందే. దీనికితోడు సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ పడగానే ఒక్కసారిగా నిలిచిపోయిన ట్రాఫిక్‌తో రద్దీ పెరిగి.. గ్రీన్ సిగ్నల్ పడినా సాఫీగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇలా.. ఐదు కి.మీ.ల దూరం ప్రయాణించాలన్నా దాదాపు అరగంట పట్టేస్తోంది. అదే సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఉంటే.. ఈ అవస్థలు ఉండవు. సిగ్నల్ ఫ్రీ పనుల్లో భాగంగా మూడు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద వాహనాలు ఆగకుండానే వెళ్లేందుకు వివిధ వరుసల్లో అదనపు మార్గాలు(అండర్‌పాస్/ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్/ సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్/థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్) నిర్మించనున్నారు. తద్వారా ఒకవైపు నుంచి ముందుకు వెళ్లాల్సిన వాహనాలు అండర్‌పాస్‌ల గుండా కానీ, ప్రధాన రహదారి నుంచి కానీ వెళతాయి. అదే ఎడమ వైపునకు వెళ్లాల్సిన వాహనాలు ఒక వరుస(ఫస్ట్ లెవెల్) ఫ్లైఓవర్ మీద నుంచి వెళతాయి. కుడి వైపునకు వెళ్లాల్సిన వాహనాలు ఇంకో వరుస(లెవెల్) ఫ్లైఓవర్ నుంచి వెళతాయి. ఆయా జంక్షన్ల వద్ద పరిస్థితుల్ని బట్టి అవసరమైన అండర్‌పాస్, ప్రధాన రహదారి, ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్, సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్, థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లు క ల్పిస్తారు. అగ్రిమెంట్లు పూర్తికాగానే పనులు మొదలు.. విశ్వనగర పనుల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీ రహదారులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు మూడు ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసింది. అగ్రిమెంట్లు పూర్తయితే పనులు మొదలు కానున్నాయి. గ్రేటర్లో సిగ్నల్ ఆటంకాల్లేకుండా ప్రయాణానికి అవసరమైన ఫ్లైఓవర్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు దాదాపు రూ. 20,600 కోట్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. తొలిదశలో భాగంగా 18 ప్రాంతాల్లో రూ. 2,631 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. అప్పట్లో అమలు చేయాలనుకున్న యాన్యుటీ విధానాన్ని రద్దు చేసి ఈపీసీ విధానంలో ఐదు ప్యాకేజీల్లో ఆహ్వానించారు. అందులోనూ భూసేకరణ ఇబ్బందులు తదితరాలను పరిగణనలోకి తీసుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, క్యాన్సర్ హాస్పిటల్, ఉప్పల్, రసూల్‌పురా, బహదూర్‌పురా జంక్షన్ల వద్ద పనుల్ని ఉపసంహరించుకున్నారు. దీంతో అంచనా వ్యయం రూ. 889 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం అభివృద్ధి చేయనున్న 13 జంక్షన్లు ఇవే కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం జంక్షన్, మహారాజ అగ్రసేన్ జంక్షన్(రోడ్ నం.12 జంక్షన్), ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నంబర్ 45 జంక్షన్, ఎల్బీనగర్ ఇంటర్సెక్షన్, బైరామల్‌గూడ ఇంటర్సెక్షన్, కామినేని హాస్పిటల్ ఇంటర్సెక్షన్, చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్, ఒవైసీ హాస్పిటల్ జంక్షన్, బయోడైవర్సిటీ పార్కు జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్. కేబీఆర్ పార్కు జంక్షన్ వద్ద.. * టీఆర్ఎస్ కార్యాలయం వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు ప్రధాన రోడ్డుపై నుంచే వెళ్లవచ్చు. * జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి టీఆర్ఎస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. * పంజాగుట్టవైపు నుంచి చెక్‌పోస్టు వైపు సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తారు. * జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట వైపు ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. * టీఆర్ఎస్ కార్యాలయంవైపు నుంచి పంజాగుట్టవైపు ప్రధాన రహదారి మీదుగానే వెళ్లవచ్చు. ప్రవేశద్వారం నుంచి జూబ్లీ చెక్‌పోస్టు, రోడ్ నం.45వైపు వెళ్లే ఈ మార్గాలను 4+4 లేన్లతో, మిగతా మార్గాలను 3+3 లేన్లతో అభివృద్ధి చేయనున్నారు. సిగ్నల్ ఫ్రీ అందుబాటులోకి వస్తే.. సిగ్నల్ ఫ్రీ పనులు పూర్తయితే వాహనాల ప్రయాణ వేగం 20 కేఎంపీహెచ్ నుంచి 35 కేఎంపీహెచ్‌కు పెరుగుతుంది. ఇంధన వినియోగం, వాతావరణ కాలుష్యం, వాహన నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగర శివార్లకు చేరుకునేందుకు రెండు గంటలు పడితే.. శివార్ల నుంచి నగరంలోకి వచ్చేందుకు పడుతున్న గంటన్నర నుంచి రెండు గంటల సమయం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. -
సప్త పథం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాచమార్గాల నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా.. రయ్య్న దూసుకెళ్లేందుకు వీలుగా వివిధ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. దీనికి అధునాతన స్కైవేలు.. ఎక్స్‌ప్రెస్ కారిడార్లు.. మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు అవసరమని భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తొలిదశలో రూ.1250 కోట్లతో వీటిని నిర్మించనున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అత్యధిక ప్రాధాన్యం కలిగిన ఏడు ప్రాంతాల్లో పనులకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడింటిలో అత్యధిక రద్దీ కలిగిన ఐదు జంక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎలాం టి ట్రాఫిక్ ఆంక్షలు... రెడ్ సిగ్నళ్లు లేకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటిలో ఫ్లై ఓవర్లు... అండర్‌పాస్‌లు.. రహదారి విస్తరణ.. ఇలా అవసరానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. వీటికి దాదాపు రూ.1225 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమిక అంచనా. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ, దిగువ వరుసలో కానీ రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాల్సి ఉంది. వీటిలో జీహెచ్ఎంసీ మార్గాలు కొన్ని కాగా... ఆర్అండ్బీ పరిధిలో కొన్ని ఉన్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్, బాలానగర్, రసూల్‌పురా జంక్షన్లు ఆర్అండ్బీ పరిధిలో ఉన్నాయి. అక్కడ ఎలాంటి పరిష్కార ‘మార్గం’ చూపుతారో తేలాల్సి ఉంది. జీహెచ్ఎంసీ చేపట్టనున్న వాటిలో దుర్గం చెరువు బ్రిడ్జి, కేబీఆర్ పార్కు జంక్షన్లు, జీవ వైవిధ్య పార్కు నుంచి కూకట్పల్లి మార్గం ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు రాచమార్గం నిర్మించనున్నారు. -
చెలరేగిన చైన్ స్నాచర్లు
బెంగళూరు : కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయించారు. మంగళవారం సాయంత్రం ఆరు నుంచి 6.40 గంటల్లోపు చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా.... సిగ్నల్‌లో : హెచ్ఎస్ఆర్ లేఔట్‌కు చెందిన లెజీనా అనే మహిళ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో సిల్క్ బోర్డు మీదుగా బయలుదేరారు. సిల్క్‌బోర్డు జంక్షన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్‌లో కారు అద్దం తీసి వేచి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో అటుగా వచ్చిన ఇద్దరు కారులో ఉన్న ఆమె మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఇంటికి వెలుతుంటే : హెచ్ఆర్బీఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న భారతి అనే మహిళ ఏజీఎస్ అనే కార్యాలయంలో పని చేస్తున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో హెచ్ఆర్బీఆర్ లేఔట్లో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కోని పరారైనారు. ఇంటి ముందు నిలబడి ఉంటే : త్యాగరాజనగరలోని శాస్త్రినగరలో పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో వెళ్లిన ఇద్దరు నిందితులు అడ్రస్ అడిగే నెపంతో పద్మావతి మెడలో ఉన్న 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. విద్యుత్ బిల్లు కట్టి వెలుతుంటే : చిక్కమారనహళ్ళికి చెందిన కోమల మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తన ఇంటి సమీపంలోని బెంగళూరు ఒన్ కేంద్రంలో విద్యుత్ బిల్లు కట్టి తిరుగు ప్రయానమయ్యారు. మార్గ మధ్యలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. పక్కింటి మహిళతో మాట్లాడుతుంటే : కుమారస్వామి లేఔట్‌లోని హర్ష లేఔట్‌కు చెందిన శారద, మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు తన పక్కింటి మహిళతో మాట్లాడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాచు. ఈ ఘటనలపై మడివాళ, హెణ్ణూరు, బెంగళూరు సెంట్రల్, త్యాగరాజనగర, కుమారస్వామి లేఔట్లో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం కూడా... విజయనగర సమీపంలోని గోవిందరాజనగరకు చెందిన ఈశ్వరీ బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తన ఇంటి ముందు నిలబడి ఉండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమెను పలకరించి, అడ్రస్ అడిగే నెపంతో సమీపించారు. ఆమె తనకు తెలియదు అని చెప్పే లోపు ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనలో ఈశ్వరీ కిందపడడంతో ఆమె గాయాలయ్యాయి. ప్రశాంత నగర్లోనూ ఉషా అనే మహిళ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన ఇంటి నిలబడి స్నేహితురాలితో మాట్లాడుతుండగా బ్లాక్ పల్సర్‌పై వచ్చిన ఇద్దరు అడ్రస్ అడిగే నెపంతో ఆమె మెడలోని 70 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు విజయనగర పోలీసులు తెలిపారు. -
అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్!
లండన్: అంగారక గ్రహంపై ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టు నాసా క్యూరియోసిటి మార్స్ రోవర్ తీసిన ఫోటోను బ్రిటీష్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. క్యూరియోసిటి రోవర్ మాస్టర్ కెమెరా సహాయంతో ఎడమ వైపు ఆరు అడుగుల ఎత్తున్న ఫోటోను గ్రహాంతర సిగ్నల్ ద్వారా జోయ్ స్మిత్ గుర్తించారు. రాళ్ల గుట్టల సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లాంటి పరికరాన్ని స్మిత్ గుర్తించాడు. ప్రారంభం నుంచి నాసాలో ఈ చిత్రాలను ఫాలో అవుతున్నానని, ప్రతి రోజు నాసా వెబ్ సైట్ లో కదలడం చూస్తున్నానని జోయ్ తెలిపారు. ఆ ఛాయ చిత్రాలను చూస్తే కొత్తగా వింతగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ గా కనిపిస్తోంది. అది ఎంత పెద్దగా ఉందో చెప్పడం కష్టమే. అయితే సుమారు 12 ఇంచుల పొడవు ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు అని స్మిత్ అన్నారు. అందుకే ఇంటర్నెట్ లో పోస్ట్ చేశానని, ప్రజలు కూడా ట్రాఫిక్ సిగ్నల్ లా కనిపిస్తుందన్నారు. -
ధర్మం చెయ్యొద్దు బాబూ!
త్వరలో ‘యాచకులు లేని నగరం’ అమలుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహనకు ముమ్మర ప్రచారం ‘గౌరవ సదన్’ల ఏర్పాటుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: ‘యాచకులకు మీరు ధర్మం చేయవద్దు. వారు ఆ వృత్తిని వదిలి... సాధారణ ప్రజల్లాగా జీవించాలంటే ఇంతకంటే మరో మార్గం లేద’టూ జీహెచ్ఎంసీ ప్రచారం చేయనుంది. గ్రేటర్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు.. రహదారుల పొడవునా వీరి వల్ల ప్రజలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారంతో పాటు నగరంలో యాచ క వృత్తిని నిరోధించేందుకు జీహెచ్ఎం సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ కోసం సన్నాహాలు ప్రారంభిం చింది. యా చకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ ‘దారి’ నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విస్తృత ప్రచారం చేపట్టనుంది. బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా ‘భిక్షాటనను ప్రోత్సహించవద్దు’ అంటూ ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఇలాంటి స్లోగన్లు, డిజైన్లు తయారు చేశారు. త్వరలోనే వీటితో ప్రచారం చేయనున్నారు. ఈ అంశం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏదైనా రంగంలో ప్రసిద్ధి చెందిన వారిని (లెజెండ్‌ను) ఈ కార్యక్రమానికి అంబాసిడర్(ప్రచారకర్త)గా నియమించాలని భావిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి అంబాసిడర్‌ను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా బలవంతంగా యాచన చేయిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ (నెంబరు 040- 21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయనున్నారు. స్థితిగతులపై సర్వే నగరంలో దాదాపు 20 వేల మంది యాచకులు ఉన్నట్టు జీహెచ్ఎంసీ సర్వేలో తేలింది. వీరిలో రాత్రి బస చేసేందుకు కనీసం నీడ కరువైన వారు దాదాపు వెయ్యి మంది ఉన్నారు. భిక్షాటన ద్వారా వారికి రోజుకు లభిస్తున్న సగటు ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ, ఎలాంటి ఆశ్రయం పొందుతున్నారు..? వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు.. తదితర అంశాలను సేకరించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు? వీరి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న వంద జంక్షన్ల వివరాలు సేకరించారు. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకుస్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా యాచకుల్లోని వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ తరఫున తొలిదశలో జోన్‌కు ఒకకేంద్రం చొప్పున ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించనున్నారు. వాటికి ‘గౌరవసదన్’లుగా నామకరణం చేయనున్నారు. వాటిలో ఉండే వారికి ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెల వంటి వాటికి కొంత నగదు ఇస్తారు. పని చేయగలిగిన శక్తి ఉన్న వారికి పనులు చూపిస్తారు.