గచ్చిబౌలి: గుండెను పదిలంగా ఉంచుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చనే నినాదంతో ప్రధాన కూడళ్లలో రెడ్ హార్ట్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. స్టార్ హాస్పిటల్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు రెడ్‌హార్ట్ సింబల్ ఏర్పాటు చేశారు. హృద్రోగాలపై వాహనదారులకు మరింత అవగాహన కలి్పంచేందుకు తమ వంతు ప్రయత్నంగా వీటిని ఏర్పాటు చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే.
ఐటీ కారిడార్‌లోని రెడ్ సిగ్నల్ వచి్చనప్పుడు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. దీంతో వాహనదారులు గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వీలుంటుంది. గచి్చ»ౌలి ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని గచి్చ»ౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. వినూత్న రీతిలో హార్ట్ సింబల్ కనిపించడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు సిగ్నల్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment