IT Corridor
-
ఐటీ కారిడార్‌లో.. రెడ్ హార్ట్ ట్రాఫిక్ సిగ్నల్
గచ్చిబౌలి: గుండెను పదిలంగా ఉంచుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చనే నినాదంతో ప్రధాన కూడళ్లలో రెడ్ హార్ట్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. స్టార్ హాస్పిటల్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు రెడ్‌హార్ట్ సింబల్ ఏర్పాటు చేశారు. హృద్రోగాలపై వాహనదారులకు మరింత అవగాహన కలి్పంచేందుకు తమ వంతు ప్రయత్నంగా వీటిని ఏర్పాటు చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఐటీ కారిడార్‌లోని రెడ్ సిగ్నల్ వచి్చనప్పుడు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. దీంతో వాహనదారులు గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వీలుంటుంది. గచి్చ»ౌలి ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని గచి్చ»ౌలి, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్‌కు బదులు హార్ట్ సింబల్ కనిపిస్తోంది. వినూత్న రీతిలో హార్ట్ సింబల్ కనిపించడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు సిగ్నల్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. -
కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
సాక్షి, హైదరాబాద్: ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. ఇలా ఎన్ని నిర్మించినా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. చినుకు పడితే చాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ఐటీ కంపెనీలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో సమావేశమయ్యారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతోపాటు నిర్వహణ వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. ఢిల్లీలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానాన్ని ఐటీ కారిడార్ పరిధిలోనూ అమలు చేయడాన్ని ఐటీ సంస్థలు పరిశీలించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ విధానంతో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఒకే పనివేళలు కాకుండా వేర్వేరు సమయాలను కేటాయించాలన్నారు. దీనివల్ల కూడా వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.కార్ పూలింగ్ అంటే?ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒక్కో వాహనంలో వచ్చే బదులు నలుగురు చొప్పున కలిసి ఒకే కారులో ఆఫీసుకు రావడాన్ని కార్ పూలింగ్ అంటారు. ఈ విధానంలో ఒకరోజు ఒక ఉద్యోగి కారు తీసుకొస్తే ఆ మరుసటి రోజు మరో ఉద్యోగి కారులో ప్రయాణిస్తారు. దీంతో ప్రతిరోజూ ఒకే సమయంలో, ఒకే రహదారిలో నాలుగు కార్లు రోడ్లపైకి రాకుండా ఒకే కారులో నలుగురు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకుంటారు. -
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
కొత్త సంవత్సరం కానుక.. కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి.. సిగ్నల్ లేని ప్రయాణానికి మార్గం సుగమమం చేసేందుకు మరో ఫ్లైఓవర్ కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను మునిసిపల్ ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. దీనిద్వారా ఆల్విన్‌కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమమైంది. ఫ్లై ఓవర్ వివరాలు.. ► రూ.263.09 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం ► ఫ్లై ఓవర్‌తోపాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్ ► ఫ్లైఓవర్ పొడవు దాదాపు 3 కి.మీ. ► 2, 3, 4, 5 లేన్లుగా గ్రేడ్ సెపరేటర్‌గా నిర్మాణం ► ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఇది 18వ ఫ్లైఓవర్ ► ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ఉపయోగాలు.. ► గచ్చిబౌలి వైపు నుంచి ఆలి్వన్‌కాలనీ జంక్షన్ వైపు వన్‌వే ఫ్లైఓవర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్ పైకి వెళ్తాయి. మాదాపూర్ లేదా హఫీజ్‌పేట్ వైపు వెళ్లవచ్చు. హఫీజ్‌పేట్ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు అండర్ పాస్ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. ► కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు చేయవచ్చు. ► కొత్తగూడ, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ జంక్షన్లలో వాహనదారులకు ఊరట. ► ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం. ► మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలివైపు వెళ్లే వారు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం. ► గచ్చిబౌలి కూడలి నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆలి్వన్‌కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ► ట్రాఫిక్ సమస్య, సమయం, వాహనాల ఇంధనం ఖర్చు తగ్గుతాయి. ఏర్పాట్ల పరిశీలన.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్, ఏఈ పరమేష్, ఏఈ శివకృష్ణ, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నవీన్, బోస్, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, నర్సింహ్మసాగర్,ఖాజా, రామకృష్ణ ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చదవండి: అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు -
బ్యాటరీ పరిశ్రమ వద్దేవద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఐటీ, సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీల స్థాపనను స్వాగతిస్తాం గానీ.. బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు’ అని మహబూబ్‌నగర్ ప్రజలు తేల్చి చెప్పారు. పట్టణ సమీపంలోని దివిటిపల్లి ఐటీ కారిడార్ మైదానంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్, పీసీబీ ఈఈ సంగీత హాజరుకాగా.. బాధిత గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్ధాయిపల్లి గ్రామస్తులతోపాటు పర్యావరణ, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. సందిగ్ధత.. అయినా అంగీకరించం దివిటిపల్లి పారిశ్రామికవాడలో బ్యాటరీ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఈ నెల 2న అమర్‌రాజా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే, బ్యాటరీల పరిశ్రమతో జల, వాయు కాలుష్యం వెలువడి.. సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఆ కంపెనీ పేరు ప్రస్తావించ లేదు. మెకానికల్ బ్యాటరీలు అని గానీ. ఎలక్ట్రానిక్ బ్యాటరీలు అని గానీ స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ అంశాన్ని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు. బ్యాటరీ తయారీ కంపెనీతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అక్కడి హైకోర్టు కూడా ఆ పరిశ్రమ వద్దని చెప్పిందని, బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని గ్రామస్తులు నినదించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ వద్దు శ్రీసాయి మానస నేచర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రతిపాదిత ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్‌ను కూడా గ్రామస్తులు వ్యతిరేకించారు. సర్వే నంబర్ 556, 607లో సేకరించిన 377.65 ఎకరాల్లో రూ.568.49 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలు, డ్రోన్లు, ఐటీ పార్క్, మొబైల్ఫోన్ల ఉపకరణాలు, చార్జర్లు, డిస్ప్లే, కెమెరాలు తదితరాలను ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా వందకు వంద శాతం మంది ఈ క్లస్టర్ ఏర్పాటుపై వ్యతిరేకగళం వినిపించారు. సంతకాల సేకరణ కో సం రిజిస్టర్లో ముందు పేజీలో స్థలం వదిలి సంతకాలు సేకరిస్తుండటంపై పలువురు ప్రశ్నించారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన ప్రతీ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఊరు విడిచి వెళ్లాల్సిందే... గతంలో డైయింగ్ ప్లాంట్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ ప్లాంట్‌ను తొలగించాలని ధర్నాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్పందించి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వ్యయం కావడంతో కంపెనీ వాళ్లే మూసేసుకున్నారు. ఆ నీరు తాగి పశువులు, చేపలు మృత్యువాత పడ్డాయి. గర్భిణులు, పిల్లలు దీర్ఘకాలిక రోగాలతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాటరీ పరిశ్రమ పెడితే మళ్లీ అలాంటి దుస్థితే వస్తుంది. అప్పుడు మేమంతా ఊరు విడిచి వెళ్లాల్సిందే. –హన్మంతు, రైతు, ఎదిర, మహబూబ్‌నగర్ -
Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్‌ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్‌డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్‌లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్‌పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్‌హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్‌కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి అవస్థలు పడుతుండడంతో ప్రత్యేక షటిల్ సర్వీసుల సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ షటిల్ సర్వీస్‌ల కోసం ఆన్లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్‌లో ఐటీకారిడార్‌లో మరిన్ని షటిల్ సరీ్వసులను నడుపుతామని ప్రకటించింది. ఈ షటిల్ సర్వీస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు ‘షార్ట్‌యూఆర్‌ఎల్.ఏటీ/ఏవీసీహెచ్‌ఐ’ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచించింది. ఉద్యోగులు తమ కంపెనీ వివరాలు, లొకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. బుకింగ్‌కు ప్రత్యేక యాప్... ఐటీ ఉద్యోగులు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్ సర్వీస్ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సరీ్వస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం బస్ ఎక్కడుంది, ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రత నేపథ్యంలో షటిల్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. యాప్‌లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలూ ఉంటాయని వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు విరివిగా వినియోగించుకోవాలని సూచించింది. చదవండి: అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్.. నమ్మితే అంతే! -
హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్– 2లో స్టార్టప్‌లు నెలకొల్పేందుకు తాజాగా వంద వరకు దేశ, విదేశీ సంస్థలు క్యూ కట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే సుమారు 200 అంకుర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం విదితమే. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు,కృత్రిమ మేథ,సైబర్‌సెక్యూరిటీ తదితర రంగాలతో పాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఐటీ శాఖ ఈహబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా దాదాపు రెండువేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. స్టార్టప్‌లకు కేరాఫ్.. ► టీహబ్– 2 కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని.. ప్రపంచంలోనే రెండోదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీ హబ్ మొదటి దశను ఐఐఐటీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నెలకొల్పారు. ► స్టార్టప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకే చోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ సూపర్‌హిట్.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతమైంది. హబ్‌లో గత ఏడేళ్లుగా 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ, విదేశాల్లో పని చేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవ, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ► ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమోడే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. ఐటీ బూమ్‌కు దోహదం.. టీహబ్ ఒకటి, రెండో దశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత వృద్ధి సాధించేందుకు ఈ హబ్‌లు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు సూచనలివే!
గచ్చిబౌలి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఐటీ కారిడార్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రీడమ్ రైడ్ నేపథ్యంలో దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి వరకు పలు మార్లాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రారంభమయ్యే ఫ్రీడమ్ రన్ ఐకియా రోటరీ వద్ద కుడి వైపు , లెమన్ ట్రీ హహోటల్, ఫీనిక్స్ ఐటీ హబ్, డెల్, టెక్ మహీంద్రా, సీఐఐ జంక్షన్ మీదుగా మెటల్ చార్మినార్ వరకు కొనసాగుతుందన్నారు. అక్కడి నుంచి ఇందిరాగాంధీ విగ్రహం, సైబర్‌టవర్ జంక్షన్లో కుడి వైపునకు వెళ్లి మెడికవర్ హాస్పిటల్ మైండ్ స్పైస్ గేట్, రోటరీలో ఎడమ వైపు టీ హబ్ జంక్షన్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మై హోం భూజ, ఎన్సీబీ జంక్షన్ నుంచి సైబరాబాద్ కమిషనరేట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, విప్రో జంక్షన్, ఐసీఐసీఐ బ్యాంక్, కోకాపేట్ రోటరీ, యుటర్న్ తీసుకొని ఐసీఐసీఐ జంక్షన్, విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఎడమ వైపు టర్న్ తీసుకొని హెచ్‌సీయూ డిపో వద్ద యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుంది. (చదవండి: గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్ ) ► కావూరీహిల్స్ జంక్షన్ నుంచి, గచ్చిబౌలి వైపు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు సీఓడీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. సైబర్ టవర్ నుంచి మైండ్ స్పేస్ అండర్ పాస్ నుంచి బయోడైవర్సిటీ, గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లవచ్చు. ► రోడ్డు నెంబర్ 45 నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వచ్చే వాహనాలు, గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను సీవోడీ జంక్షన్, మాదాపూర్ పీఎస్‌కు మళ్లిస్తారు. ► కావూరీహిల్స్ జంక్షన్ నుంచి కొత్తగూడ,, సైబర్ టవర్ జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. సైబర్ టవర్ నుంచి ఎన్సీబీ జంక్షన్ వరకు, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు అనుమతించరు. విప్రో నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ , కొత్తగూడ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. ► మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో ట్రక్కులు, లారీలు, రెడిమిక్స్లు, డీసీఎంలకు అనుమతి లేదు. (చదవండి: గురుకుల పోస్టుల భర్తీ.. 9,096 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం) -
హైదరాబాద్‌లో అటువైపే ఇళ్లు ఎక్కువగా కొంటున్నారు
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్ ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపుతో మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకొని విశ్వనగరంగా రూపాంతరం చెందేందుకు సరికొత్త పోకడలతో విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు అధికం కావడంతో పాటు ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలిరావడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్థిరాస్తి రంగం జోరు కొనసాగుతోంది. లక్షన్నరకుపైనే దస్తావేజులు ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2022– 23 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో సుమారు లక్షన్నరకు పైగా దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం శివారు ప్రాంతాల్లోనే 1.20 లక్షల లావాదేవీలు జరగడంతో భారీగా ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే సుమారు 46 శాతం పైగా లావాదేవీల సంఖ్య పెరిగినట్లయింది. గతేడాది ఏప్రిల్, జూన్‌లో దస్తావేజులు నమోదు సంఖ్య భాగా పెరిగినా.. కోవిడ్ వైరస్ వ్యాప్తితో మే నెలలో మాత్రం కేవలం 25 శాతానికి పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ► ప్రస్తుతం శివారు పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దినసరి రిజిస్ట్రేషన్ల సంఖ్య మూడు అంకేలు దాటుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఫరూక్నగర్, మహేశ్వరం, గచ్చిబౌలి, చంపాపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్‌పై భరోసాతో.. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ భారీ కొత్త ప్రాజెక్టు వస్తుండటంతో కొనుగోలుదారులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. భూములు, ఇళ్ల ధరలు పెరుగుతుండటమే తప్ప తగ్గే అవకాశం లేదనే అంచనాలతో స్థిరాస్తి రంగం మరింత వేగం పుంజుకునట్లయింది. సామాన్యులతోపాటు ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనడమే కాదు.. పెట్టుబడులు సైతం వెనుకాడటం లేదు. గృ హ అద్దెలతో పోలిస్తే అద్దెల రాబడి అధికంగా ఉంటుందని స్థిరాస్తి రంగం వైపు మొగ్గు చూపడం అధికమైంది. మెట్రోతో... మెట్రో రవాణా అందుబాటులోకి రావడం కూడా స్థిరాస్తి రంగానికి కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్ మార్గం వైపు కూడా కొనుగోలు దారులు ఆసక్తి పెరిగింది. వరంగల్ రహదారి మార్గంలో ఘట్కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి మీదున్న ఎల్బీనగర్ వరకు మెట్రో రవాణా సదుపాయం ఉండటంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది. శివారుపై ఆసక్తి నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి మరింత ఊపొచ్చినట్లయింది. బాహ్యవలయ రహదారి బయట టౌన్‌షిప్‌లు, వందల ఎకరాల్లో వెంచర్లు. పెద్ద సంస్థల కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు మరింత జీవం పోస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఓఆర్ఆర్ బయట భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించాయి. గతంలో స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కార్యాలయానికి, ప్రధాన వాణిజ్య కేంద్రానికి ఎంత దూరమని ఆలోచన ఉండేది. రహదారుల వంటి మౌలిక వసతులు మెరుగుపడటంతో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తరలి వస్తున్న పరిశ్రమలు ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు పలు కంపెనీలు తరలివచ్చాయి. వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల హోరు కొనసాగుతోంది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ , ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. (క్లిక్: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి)