వైరల్
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.
మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్‌పూర్‌లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్‌వేవ్‌ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు.
బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్‌స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్‌షేడ్స్‌ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు.
Comments
Please login to add a commentAdd a comment