Green shed Net
-
సిగ్నల్ నీడలో
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్‌పూర్‌లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్‌వేవ్‌ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు. బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్‌స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్షేడ్స్ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు. -
ఎండ 'వల'లో పడకుండా..
* బిల్డింగ్‌లపై గ్రీన్ షెడ్ నెట్ * ఆసక్తి చూపుతున్న పట్టణ వాసులు తాడేపల్లిగూడెం రూరల్ : ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పది రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో తాపం నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎండ వేడిని తగ్గించేందుకు బిల్డింగ్‌లపై గ్రీన్ షెడ్ నెట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు టమోటా, క్యాప్సికం పంటలకు రక్షణగా వినియోగించే గ్రీన్ షెడ్ నెట్లు ఇప్పుడు పట్టణవాసులకు ఉపశమనం కలిగించే సాధనాలుగా మారిపోయాయి. గ్రీన్ షెడ్ నెట్ కిలో రూ.220 చొప్పున మార్కెట్లో లభిస్తోంది. ఇంటి ఆవరణ కొలతను బట్టి కిలోల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వేడి గాలులను, ఎండ తీవ్రతను ఇవి సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. రక్షణ పొందేందుకు.. ఎండల బారినుంచి రక్షించుకునేందుకు మా బిల్డింగ్‌పై గ్రీన్ షేడ్ నెట్ వేశా. ఇది సుమారు 50 శాతం వరకు ఎండ తీవ్రతను అడ్డుకుంటోంది. దీనికి ఖర్చు కూడా తక్కువే. గత వేసవిలో ఎండకు ఇంట్లో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ సారి అలా లేదు. ఇళ్లంతా కూల్‌కూల్‌గా ఉంది. - బత్తుల ప్రసాద్, తాడేపల్లిగూడెం