తాడేపల్లిగూడెంలోని ఓ బిల్డింగ్పై గ్రీన్ షేడ్నెట్
* బిల్డింగ్‌లపై గ్రీన్ షెడ్ నెట్
* ఆసక్తి చూపుతున్న పట్టణ వాసులు
తాడేపల్లిగూడెం రూరల్ : ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పది రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో తాపం నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎండ వేడిని తగ్గించేందుకు బిల్డింగ్‌లపై గ్రీన్ షెడ్ నెట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు టమోటా, క్యాప్సికం పంటలకు రక్షణగా వినియోగించే గ్రీన్ షెడ్ నెట్‌లు ఇప్పుడు పట్టణవాసులకు ఉపశమనం కలిగించే సాధనాలుగా మారిపోయాయి.
గ్రీన్ షెడ్ నెట్ కిలో రూ.220 చొప్పున మార్కెట్‌లో లభిస్తోంది. ఇంటి ఆవరణ కొలతను బట్టి కిలోల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వేడి గాలులను, ఎండ తీవ్రతను ఇవి సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని వినియోగదారులు అంటున్నారు.
రక్షణ పొందేందుకు..
ఎండల బారినుంచి రక్షించుకునేందుకు మా బిల్డింగ్‌పై గ్రీన్ షేడ్ నెట్ వేశా. ఇది సుమారు 50 శాతం వరకు ఎండ తీవ్రతను అడ్డుకుంటోంది. దీనికి ఖర్చు కూడా తక్కువే. గత వేసవిలో ఎండకు ఇంట్లో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ సారి అలా లేదు. ఇళ్లంతా కూల్‌కూల్‌గా ఉంది.
- బత్తుల ప్రసాద్, తాడేపల్లిగూడెం