sun
-
చలికాలం.. కాస్త ఎండపడనిద్దాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చలికాలమని ముసుగుతన్ని ఇంట్లోనే పడుకుని కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా? చలికి భయపడి మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశారా? ఇంట్లోంచి నేరుగా ఉదయం 10 తర్వాత కార్యాలయానికి బయలుదేరుతున్నారా? ఉదయం బాగా చలేస్తోందని.. సాయంత్రం వాకింగ్ చేస్తున్నారా? చలి పేరుతో ఇలా చేస్తుంటే వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి తప్పదని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి.. శారీరకంగా నీరసంగా ఉన్నామనే భావన వస్తుందని.. ఈ భావనతో బయటకు వెళ్లి ఇతరులను కలవడం కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొంటున్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తెలిసిన విషయాన్ని మర్చిపోవడం.. కొన్ని పదాలను అసలు పలికేందుకు ఇబ్బంది పడి.. వేరే పదాలను పలకడం వంటివి కూడా చేస్తారని ఆయన అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యేకంగా కాంతిని ప్రసరింపచేసేందుకు ఉపయోగించే లైట్ బాక్సుల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు.ఎస్ఏడీ.. ఎలా వస్తుందంటే..చలికాలంలో కాంతి లేకపోవడం వల్ల మన మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. దీనిని సీజనల్ అఫెక్టివ్ సిండ్రోమ్ (ఎస్ఏడీ) అని.. వైద్య పరిభాషలో ‘సిర్కాడియల్ రిథమ్స్’ అని అంటారు. ఎస్ఏడీ మన మెదడులోని నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే మరో ఎంజైమ్ సెరోటోనిన్ తక్కువ విడుదల కావడానికి దోహదం చేస్తుంది. ఈ రసాయన అసమతుల్యత వల్ల నీరసంగా మారిపోతాం. తద్వారా ఎక్కువగా తినడం.. ప్రధానంగా కార్బొహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని.. ప్రోటీన్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో కలవడంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బంది పడతారని లీవైన్ స్పష్టం చేశారు. ఎస్ఏడీ అనేది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదని అంతకుమించి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటున్నారు. జ్ఞాపకశక్తి వంటి సమస్యలతో పాటు మన పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ సిండ్రోమ్ మన ఉచ్ఛారణలో సరైన పదాలు పలకలేకపోవడంతో పాటు.. సరైన సమాచారం కూడా సకాలానికి గుర్తుకురాకపోవడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు. సూర్యరశ్మి లేదా లైట్ థెరపీసీజనల్గా వచ్చే ఈ సిండ్రోమ్‌కు సాధారణంగా డోపమైన్ స్థాయిని పెంచే యాంటీ డిప్రెసెంట్స్ మందులను వాడతారు. అయితే, దీనికంటే మంచి మందు ఏమిటంటే.. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉండటమేనని హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. అది కూడా ఉదయం 10 గంటలలోపు అరగంటపాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉంటే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చని ఆయన జరిపిన అధ్యయనంలో తేలింది. ఒకవేళ చలికాలంలో వాతావరణ ప్రభావంతో సూర్యరశ్మి లేనిపక్షంలో లైట్ థెరపీని ఆయన సూచిస్తున్నారు. తెల్లని కాంతిని ఉత్పత్తి చేసే లైట్ బాక్సులను కొనుగోలు చేసి ఉపయోగించడమే ఈ లైట్ థెరపీ. ఆన్లైన్లో ఈ లైట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మీ లైట్ బాక్స్‌లో 10,000 లక్స్ (‘లక్స్’ అంటే నిర్దేశిత ప్రదేశంలో ఎంతమేర లైట్ పడుతుందని తెలిపేది. దీనిని కాంతి తీవ్రత/కాంతి ప్రకాశం అని పేర్కొంటారు) ఎక్స్పోజర్ ఉండాలి. సాధారణంగా సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో 50 వేల కాంతి ప్రకాశాలు ఉంటాయి. అందులో పదో వంతు కాంతి తీవ్రత ఉండేలా చూసుకుంటే చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. -
సూర్యుడి ‘కరోనా’ను తాకింది...
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ స్పేస్‌క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఎలాంటి ముప్పు లేకుండా సురక్షింగా ఉంది. చరిత్రలో ఇప్పటిదాకా లోకబాంధవుడికి ఇంత సమీపానికి వెళ్లి, సురక్షితంగా ఉన్న అంతరిక్ష నౌక మరొకటి లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి గురువారం రాత్రి నాసాకు సందేశం అందింది. పార్కర్ రాబోయే కొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలో చక్కర్లు కొట్టనుంది. దాంతో అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి. మానవులు ఇప్పటిదాకా నిర్మించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత వేగవంతమైంది కావడం గమనార్హం. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2,500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్‌హీట్(1,370 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను సైతం తట్టుకొనేలా పటిష్టమైన హీట్ షీల్డ్‌ను పార్కర్‌పై అమర్చారు. సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఇదిలా ఉండగా, పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది. -
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
న్యూయార్క్: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది లోకబాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4–యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్టు జో వెస్ట్‌లేక్ చెప్పారు.సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరిగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమటన్నది అంచనా వేయలేకపోతున్నారు. క్షేమంగా వెనక్కి వస్తుందా? లేక ఏదైనా జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్ అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1,371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెపె్టంబర్ దాకా అదే కక్ష్యలోకి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. -
ఈ చిత్రం అద్భుతం కదూ..!
సూర్యచంద్రులను ఏకకాలంలో మోస్తూ.. తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం అద్భుతం కదూ.. అమెరికాలోని యూటా రాష్ట్రంలో సూర్యగ్రహణం సమయంలో బెల్వా హేడెన్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రం నేచర్స్ బెస్ట్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో అవుట్డోర్ అడ్వెంచర్ కేటగిరీలో మొదటి బహుమతిని గెలుచుకుంది. -
రేపు భూమిని తాకనున్న సౌర జ్వాలలు!
సౌరప్రకోపం భూమిని అల్లాడించనుంది. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా ఏఆర్3842 సన్‌స్పాట్ మరోసారి బద్దలైంది. ఎక్స్9.1 కేటగిరీలోకి వచ్చే అత్యంత అత్యంత శక్తిమంతమైన సోలార్ ఫ్లేర్‌కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయోనీకరణం చెందింది! ఈ పేలుడు ధాటికి పుట్టుకొచి్చన శక్తిమంతమైన సౌర జ్వాలలు ఆదివారం భూమిని గట్టిగా తాకనున్నాయి. ఇప్పటికే సూర్యునిలో సంభవించిన కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) దీనికి తోడవనుంది. ఫలితంగా భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి, పెద్దపెట్టున విడుదలయ్యే రేడియేషన్ ప్రపంచమంతటా ప్రభావం చూపనుంది. దెబ్బకు ఉపగ్రహాలతో పాటు పలు దేశాల్లో పవర్ గ్రిడ్లతో పాటు నావిగేషన్ వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు అట్లాంటిక్ దక్షిణ ప్రాంతంలోని పలు దేశాల్లో షార్ట్వేవ్ రేడియో బ్లాకౌట్లు సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరించారు. రేడియో ఆపరేటర్లకు కనీసం అరగంటకు సిగ్నల్స్ అందబోవని వివరించారు. వీటివల్ల అరోరాలు (కాంతి వల యాలు) ఏర్పడనున్నాయి. కొంతకాలంగా ఉగ్ర రూపు సూర్యుడు ప్రస్తుతం తన 25వ సౌరచక్రం మధ్యలో ఉన్నాడు. దాంతో కొంతకాలంగా ఉగ్రరూపు దాలుస్తున్నాడు. సోలార్ మాగ్జిమంగా పేర్కొనే ఈ పరిస్థితులు ఊహించిన దానికంటే ముందే సంభవిస్తున్నట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంసూర్యునిపై నిరంతర పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు, సీఎంఈలకు దారి తీస్తుంది. ఇవి భూమిపై పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొంచివున్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. కారింగ్టన్ ఈవెంట్ అంటే..1859, సెప్టెంబరు 2న కారింగ్టన్ ఈవెంట్‌ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్‌లోని రెడ్ హిల్‌లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్సన్లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్ స్పాట్)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్ ఈవెంట్‌గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.భారీ పేలుళ్ల గుర్తింపురిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్‌లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కుప్పకూలనున్న కమ్యూనికేషన్ వ్యవస్థ?1859లో సంభవించిన కారింగ్టన్ ఈవెంట్ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో..కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్అవుట్లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్‌క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.భూమికి పొంచివున్న ప్రమాదం?రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10న అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్‌స్పాట్ ఏఆర్ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. -
గోశాలలో గోవుల గోస
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న గోశాలలో వసతులు కరువయ్యాయి. భక్తుల విశ్వాసంగా నిలిచే కోడెమొక్కుల కోడెలకు కనీస సౌకర్యాలు లేవు. వానకు తడుస్తూ.. ఎండకు ఇబ్బందిపడుతూ ఆరుబయటే ఉంటున్నాయి. చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న నేలపైనే పడుకుంటున్నాయి. కనీస వసతులు లేక భక్తులు అందించే కోడెలు గోశాలలో ఇబ్బంది పడుతున్నాయి. కనీసం గోవులు నిల్చోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కోడెమొక్కుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం వసతుల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.కోట్లు వస్తున్నా..వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తుంటారు. కోడె మొక్కు టికెట్ ధర రూ.200 ఉంది. అలాగే కోడెమొక్కుల ద్వారా స్వామికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం సౌకర్యాలు లేవు. గోశాలల్లోని కోడెల సంరక్షణకు ఏటా రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నా, ఈ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కలి్పంచలేకపోతున్నారు. వసతికి మించిన కోడెలు..రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉన్నాయి. గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాలలో 150 కోడెలు, 20 ఆవులు ఉన్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను ఉంచుతారు. తిప్పాపూర్‌లో రెండో గోశాల ఉంది. ఇక్కడ 300 కోడెల కోసం రేకులòÙడ్డు వేశారు. కానీ ఆరు నెలల క్రితం కోడెలను రిజి్రస్టేషన్ ఉన్న గోశాలకు ఇవ్వకుండా..అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లడంతో అప్పటి నుంచి ఇతర గోశాలలకు రాజన్న కోడెలు, ఆవులను ఇవ్వడం లేదు. కోడెలను తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తున్నా రు. ఇక్కడ 300 కోడెలకు వసతి ఉండగా..ప్రస్తుతం 1,600 కోడెలు ఉన్నా యి. దీంతో చిన్నపాటి వర్షానికే గోశాల బురదమయం కావడంతో కోడెలు కనీసం పడుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట, రాత్రి నుంచి తెల్లారేవరకు మరో చోట కోడెలను ఉంచుతున్నారు.తడిస్తే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది వర్షాకాలంలో పశువులు, ఆవులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిస్తే బలహీనమై వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాళ్లు మెత్తబడి డెక్కల్లో పుండ్లు అవుతాయి. సరిగా తినలేకపోతాయి. ఎప్పటికప్పుడు పేడ తియ్యకపోతే ఏదైనా ఒక్క ఆవుకు రోగం వస్తే అన్ని ఆవులకు సంక్రమించే అవకాశం ఉంది. బురద ఎక్కువైతే కాలు జారి కిందపడే అవకాశాలు ఉన్నాయి. – ప్రశాంత్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి, వేములవాడ త్వరలోనే అందిస్తాంభక్తులు అందించిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తున్నాము. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉన్నాయి. ఆలయ అధికారులతో కమిటీ నియామకానికి కలెక్టర్‌కు ఫైల్ పంపించాం. కమిటీ ఆదేశాలతో కోడెలను రైతులకు, రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలలకు అందిస్తాం. వారం రోజుల్లోగా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నాం. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు
హర్యానాలో వేసవి తాపం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పగటిపూట ఎక్కడ చూసినా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణీయంగా పెరిగాయి. దేశంలోని హాటెస్ట్ నగరాల్లో హర్యానాలోని నుహ్ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నగరంగా యూపీలోని ఆగ్రా నిలిచింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలోని 25 నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హర్యానాలోని 11 జిల్లాల్లో మే 23 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో మహేంద్రగఢ్, రేవారీ, గురుగ్రామ్, నుహ్, పల్వాల్, ఫరీదాబాద్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, చర్కి దాద్రీ జిల్లాలు ఉన్నాయి. పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, ఝజ్జర్, రోహ్తక్, సోనిపట్, పానిపట్, జింద్ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంబాలాలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట మార్కెట్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం పూట కొద్దిసేపు మాత్రమే వ్యాపారం జరుగుతున్నదని దుకాణదారులు వాపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. -
మే 2న సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన విస్ఫోటనం
-
పగలే కమ్ముకున్న చీకట్లు
మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. Ever seen a total solar #eclipse from space? Here is our astronauts' view from the @Space_Station pic.twitter.com/2VrZ3Y1Fqz — NASA (@NASA) April 8, 2024 అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా. Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶 Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America. pic.twitter.com/YH618LeK1j — NASA (@NASA) April 8, 2024 మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్ జత చేశారు. View of the eclipse from orbit pic.twitter.com/2jQGNhPf2v — Elon Musk (@elonmusk) April 9, 2024 -
సూర్య జయంతిని 'రథ సప్తమి' అని ఎందుకంటారు?
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్య నారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన, ఏడు గుఱ్ఱములతో లాగబడుతున్న, అనూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మాంసనేత్రముతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథము ప్రత్యేకతను తెలియజేస్తూ, సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టిన రోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని “రథసప్తమి” పేరుతో జరుపుకుంటున్నాము. సూర్య రథానికి ఉన్న ప్రత్యేకతలు.. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని 'అనూరుడు' రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథీ అంతే... కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు. కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు. కాళ్ళు లేకపోవడంవల్ల అతడు మనపాలిట వరం అయ్యాడు. సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేదఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడుగుర్రాలూ 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి. సప్త వర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను – సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్రసు, సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్త వర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. అందుకే మనల్ని భారతీయులని పిలుస్తారు.. భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. 'భా” అంటే సూర్యకాంతి. “కతి" అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారందరూ భారతీయులు. 'భారతీ” అంటే వేదమాత. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. సాంబుడు నిర్మించని కోణార్క్ దేవాలయం శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠు రోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుని ఆరాధించమనీ, రోగం నయమౌతుందనీ చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీతీరాన వేపవృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోణార్క్‌లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్య నారాయణుని ప్రతిష్టించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడుచెయ్యాలని ప్రయత్నించినా, కోణార్క్ దేవాలయం నేటికీ అత్యంత ఆకర్షణీయంగా అలరారుతున్నది. దేవేంద్రుడి నిర్మించిన అరసవెల్లి దేవాలయం ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళద్దంటాడు. అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తంతాడు. ఒక్క తాపుతో ఎగిరిపడి ఒళ్ళంతా దెబ్బలతో బాధ పడుతుంటే, ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధ పోతుందని కల వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి, ప్రతిష్ఠించినదే అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయము. అత్యంత మనోహరంగా కనిపించే శ్రీ సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. సూర్యారాధన చేసినవారు.. ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చెప్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్నిపొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పనాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమి రోజున షష్టి తిథి ఉంటే కనుక షష్టి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. ఆ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకుని, రెండు భుజాలపైన రేగు పండ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగి పండుని సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు. ‘సూర్యునికి అర్కః అని పేరు’. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే.. జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది.. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ సూర్యరాధనను తప్పక చేసి ఆయురారోగ్యాలను పొందండి. (చదవండి: గ్రీకులు, రోమన్లు సరస్వతి దేవిని పూజించేవారా?) -
మకర సంక్రాంతికి ఏ రాష్ట్రంలో ఏంచేస్తారు?
దేశవ్యాప్తంగా నేడు మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ తరుణం నుంచి హిందువులు శుభకార్యాలను ప్రారంభిస్తారు. మకర సంక్రాంతి నాడు చేసే గంగాస్నానం, దానధర్మాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరసంక్రాంతి నాడు ఏ రాష్ట్రాల్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీగా జరుపుకుంటారు. తెల్లవారుజామున నదీస్నానం చేస్తారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మాఘి నాడు శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో భారీ జాతర నిర్వహిస్తారు. తమిళనాడు దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాల్గవ రోజు కన్యా పొంగల్ నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ సందర్భంగా గంగాసాగర్ వద్ద జాతర నిర్వహిస్తారు. స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేస్తారు. ఈ రోజున యశోదమాత.. శ్రీ కృష్ణుడిని దక్కించుకునేందుకు ఉపవాసం చేశారని చెబుతారు. అలాగే ఈ రోజునే గంగామాత భగీరథుడిని అనుసరిస్తూ, గంగా సాగర్‌లోని కపిలముని ఆశ్రమాన్ని చేరిందని అంటారు. కేరళ కేరళలో సంక్రాంతిని మకర విళక్కు పేరుతో నిర్వహిస్తారు. శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకర జ్యోతిని భక్తులు సందర్శిస్తారు. కర్ణాటక కర్నాటకలో సంక్రాంతిని ‘ఏలు బిరోదు’ అనే పేరుతో జరుపుకుంటారు. స్థానిక మహిళలు.. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని ఉపయోగించి చేసిన వంటకాన్ని చుట్టుపక్కలవారికి పంచిపెడతారు. గుజరాత్ మకర సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయణం అని అంటారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ఇది కూడా చదవండి: మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి! -
శ్రీ సూర్యనారాయణా...
బతుకులో పండుగ కాని క్షణం ఏముంటుంది! జీవితాన్ని కేవలం జీవించడం కాదు, ఉత్సవీక రించుకోమని చెబుతుంది ఒక సూక్తి. కాకపోతే ఒక షరతు; మహాకవి చెప్పినట్టు, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మనకేనని ఆనందించే పసికూనలమైపోవాలి అందరం. జీవితం అనుక్షణ ఉత్సవభరితమే అయినా ప్రకృతిలో మారే ప్రతి ఋతువూ, కాలం వెంబడి మనిషి వేసే ప్రతి కీలకమైన అడుగూ పెద్దపండుగ అవుతుంది. ధనూరాశి నుంచి మకరరాశి లోకి సూర్యుడి సంక్రమణాన్ని సంకేతించే అలాంటి పెద్ద పండుగే సంక్రాంతి. ఏటా నెల నెలా రాశి విడిచి రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే ప్రతి సందర్భమూ సంక్రాంతే అయినా, మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు మైలురాయి అయిందంటే; అప్పటికి మంచుపొరలు, చీకటి తెరలు క్రమంగా తొలగి వెలుగు వాకిళ్ళు తెరచుకోవడం మొదలవుతుంది. కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో పశువులు, పక్షులతో సహా ప్రకృతి సమస్తం భాగమై మనిషిలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. అలా ప్రతి ప్రాణితోనూ, చెట్టుతోనూ, పుట్టతోనూ తన ముడిని గుర్తుచేసుకునే సందర్భమే సంక్రాంతి. ఆ మాటకొస్తే ఏ పండుగైనా అంతే. చిత్రవిచిత్రమైన రంగవల్లులను తీర్చిదిద్దేది, కొత్త బియ్యపు పిండిని చీమల వంటి సూక్ష్మజీవులకు ఆరగింపు చేసి భూతదయను చాటుకునేందుకేనని పెద్దలంటారు. ఒక్కోసారి తత్త్వం అడుగంటి తంతు మిగలడం కాలం చేసే మాయ. మనిషి ఊహలో తొలిదైవంగా ముద్రపడిన ప్రాకృతిక అద్భుతమే సూర్యుడు. పరోక్ష దేవతలకు భిన్నంగా ఆయన ప్రత్యక్ష దైవం. అందుకే సర్వసాక్షి, కర్మసాక్షి సహా ఆయన చుట్టూ ఎన్నో కల్పనలు. దేవతల్లో పెద్దాయన ఆయనే. ప్రపంచమంతటా తొలి కొలుపులు అందు కున్నవాడిగా ఆయన వైశ్విక దైవం. దేవుడి గురించిన తొలి ఎరుక కలిగించిన ఆ మెరుపు, మైమరపు ఋగ్వేదంతో సహా ఆదిమ కృతులన్నింటిలో నిసర్గసుందరంగా వ్యక్తమవుతాయి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఒకప్పుడు ప్రధాన దైవమైన సూర్యుడికి మన పౌరాణిక ప్రసిద్ధుడైన నారాయణుని పేరు చేర్చిన ఫలితంగానే ఆయన సూర్యనారాయణుడయ్యాడని గుంటూరు శేషేంద్రశర్మ అంటారు. ఒకప్పుడు పశ్చిమాసియాలో మిత్రారాధన పేరుతో వర్ధిల్లిన సూర్యారాధన ప్రభావం ఇతర మతాలపై ఎలా పడిందో అత్యంత ఆశ్చర్యకరంగా వివరిస్తాడు జి.జె.ఎం. ఫ్రేజర్ తన ‘గోల్డెన్ బౌ’ అనే బృహద్రచనలో. మన శ్రీరామచంద్రుడే కాక, ఒకనాటి పశ్చిమాసియా రాజులు, పర్షియన్ చక్రవర్తులు కూడా తమను సూర్యుడితో ముడిపెట్టుకున్నారు. ఆదిత్యçహృదయోపదేశం పొందిన తర్వాతే రాముడు రావణుని జయించగలిగాడని రామాయణం అంటుంది. సంక్రాంతినీ, సూర్యునీ లోతుగా తడిమిన కొద్దీ ఇంకా ఎన్నెన్ని విశేషాలో! సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఘట్టాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకొంటాం కానీ నిజంగా సూర్యుడికి గమనమంటూ ఉంటుందా? భూమే సూర్యుడి చుట్టూ ఒకింత వంపుతో తిరుగుతూ దూరమూ, దగ్గరా అవుతున్న క్రమంలోనే కాలాలూ ఋతువులూ ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతిని ఇప్పుడు జనవరి 15న జరుపుకొంటున్నాం కానీ, క్రీ.శ. 1000లో డిసెంబర్ 31న, క్రీ.శ.272లో డిసెంబర్ 21న జరుపుకొనేవారట. మరో తొమ్మిదివేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జూన్ నెలలో వస్తుందట. జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన కాలగణనాలు ఇలాంటి విచిత్రాలను ఆవిష్కరిస్తే, శాస్త్రవిజ్ఞానం మరో రకమైన విలక్షణ దృశ్యానికి తెరతీసి ఒక్కోసారి వెన్నులో వణకు పుట్టిస్తుంది. సూర్యుడు ఎంత పెద్దాయనంటే, ఆయన వయసు 460 కోట్ల సంవత్సరాలకు పైనేనట. మరో 500 కోట్ల సంవత్సరాలు గతిస్తే, తన చుట్టూ తిరిగే భూమితో సహా అన్ని గ్రహాలనూ తనలో కలిపేసుకుని ఓ తెల్లని మరుగుజ్జు నక్షత్రంగానూ, ఆ తర్వాత నల్లని నక్షత్రంగానూ మారిపోతాడట. ఆ లోపల తన కేంద్రంలో నిరంతరాయంగా జరిగే కోట్ల టన్నుల హైడ్రోజన్, హీలియవ్ుల కలయిక నుంచి లక్షల టన్నుల పదార్థం శక్తిగా మారిపోయే క్రమంలోనే మన మనుగడకు అవసరమైన వెలుగు, వేడి లభిస్తున్నాయి. శీతోష్ణాల నిర్విరామ ఘర్షణ నుంచే జీవి పుట్టి మనతో సహా అనేక ప్రాణుల రూపంలో పరిణామం చెందడం వేరే కథ. మన ఊహకు అతీతమే కాక, మన నిత్యజీవన సంతోషాలకు ఏమాత్రమూ అడ్డురాని సూర్యుని వైశ్విక మూలాలను ఈ పండుగ వేళ మరీ లోతుగా తడమడమెందుకు? ప్రకృతితో మమేకమై వెలుగూ వేడిలో స్నానిస్తూ ఈ క్షణాలను మధురమధురం చేసుకుందాం. పొన్న,ఉల్లి, జాజి, సంపంగి, మల్లె, మంకెన, ములగ, ఆవ, వంగ, గుమ్మడి పూచాయలు ధరించే ఆ సూర్యనారాయణుడికి నోరారా మేలుకొలుపు పాడుకుందాం. కవయిత్రి కుప్పిలి పద్మ అన్నట్టు, ఒక్కుమ్మడిగా పండుగను పిలిచేందుకు ఈ చేతులతో చుక్కల ముగ్గుల్ని, రంగుల చామంతుల్ని పూయిద్దాం. ఎక్కడెక్కడి చుట్టాలనో ఏడాదికొకచోట కలిపే సారంగధర మెట్ట మీది తనివితీరని తిరునాళ్ళ పుట్టినిల్లు జ్ఞాపకాల నెగడు దగ్గర చలి కాగుదాం. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా తుప్పల వెంటా పుంతల వెంటా పడి తిరుగుతూ, ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్క మొగ్గనీ తెంపకుండా, ఒక్క పువ్వునూ వదలకుండా మృదువైన పూల వేట సాగిద్దాం. -
25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఎంవీఎం గ్రౌండ్లో ‘సంక్రాంతి మహోత్సవ్-2024’కు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం (జనవరి 14) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఉత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకుంటారు. తరువాత పతంగుల పోటీ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పతంగుల కళాకారులు ప్రత్యేకంగా తయారుచేసిన జాయింట్ గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. దాని పరిమాణం 25 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్ పతంగులలో కార్టూన్లు, సింహాలు, వివిధ బొమ్మలు ఉంటాయి. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’లో మహిళల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా స్థాయి పతంగుల ఎగురవేత పోటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం లోహ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భోగి మంటలు వేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాలిపటాలు ఎగురవేయాలనే ఉత్సాహం కలిగినవారికి నిపుణులు శిక్షణ అందిస్తారు. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’ జనవరి 15న ముగుస్తుంది. ఇది కూడా చదవండి: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు? -
సంక్రాంతి వెనుక సైన్స్
సాక్షి, అమరావతి: సూర్యుడు జ్ఞానానికి.. జీవిత శ్రేయస్సుకు ప్రతీక. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం.. చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. మకర సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి మారతాడు. సూర్యుని ఖగోళ ప్రయాణంతో ముడిపడి ఉన్న మకర సంక్రాంతితో శీతాకాలం ముగుస్తుంది. ఎండ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుని పథం మారుతున్న రుతువులపై ప్రభావం చూపిస్తుంది. ఈ కాలం సాంస్కృతిక, వ్యవసాయ ప్రాముఖ్యతకు ప్రతీక. శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. మకర సంక్రాంతి నాడు కీలకమైన మార్పు వస్తుంది. సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖను దాటి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. వసంత కాలం మొదలవుతుంది. సూర్యుడు హారిజోన్పైన ఎక్కువ సమయం గడపడం వల్ల పగటి వేళలు క్రమంగా పెరుగుతాయి. పెరిగిన సూర్యరశ్మి భూమిని వేడెక్కిస్తుంది. మంచు తగ్గుతుంది. ఫలితంగా పంటలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను వస్తాయి. పండుగ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కీడు ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొడుకులున్న తల్లులు పరిహారం చేయాలని, ముఖ్యంగా ఒక్కడే కొడుకు ఉన్నవారు గాజులు వేసుకోవాలని కొత్త ఆచారం పుట్టుకొచ్చింది. ఒకే అల్లుడు ఉన్న అత్త, అల్లుడిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు, తులం బంగారం పెట్టాలని.. కొత్త అల్లుడైతే కాళ్లను పాలతో కడగాలంటూ వింత నియమం చక్కర్లు కొడుతోంది. అయితే.. ఎవరి గాజులు వారే కొనుక్కుని వేసుకోకూడదు. వేరే వాళ్ల నుంచి తీసుకోవాలి. దీనిని నమ్మి గ్రామాల్లో ఎక్కువగా మహిళలు ఒకరికొకరు గాజులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దీనిలో వాస్తవం ఉందా లేదా అని అన్వేషిస్తే.. ఈ సంక్రాంతి కీడు వెనుక సైన్స్ ఉందని తేలింది. అల్లుళ్లకు కాళ్లు కడగడం, కానుకలివ్వడం అనేది కేవలం పుకారు మాత్రమేనని పండితులు కొట్టిపడేశారు. కానీ గాజులు ధరించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. దేవతల చేతులకూ గాజులు ఆలయాల్లో దేవతా శిల్పాల ముంజేతికి ఆభరణాలు ఉంటాయి. వాస్తవానికి ముంజేతి మణికట్టు భాగంలో వినాళ వ్యవస్థకు అనుసంధానం చేసే నాడులు ఉంటాయి. ఈ భాగంలో చిన్నగా ఒత్తిడి కలిగించడం వల్ల ఇవి చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు బాగుంటుందని సైన్స్ చెబుతోంది. ఇలా మనం ధరించే ఆభరణాల వెనుక ఇలాంటి శాస్త్రీయ కోణం ఉంది. శాస్త్రంతో నిండిన పండుగ రోజులు ప్రతికూలతలను దహనం చేయడానికి ప్రతీకగా వేసే భోగి మంటలు సూర్యుని వెచ్చదనాన్ని స్వాగతిస్తాయి. ఈ మంటల్లో మట్టి పాత్ర వేసి వండే పాయసంలో అనేక పోషకాలుంటాయి. నువ్వులు, బెల్లం వంటి నైవేద్యాలు సంతానోత్పత్తిని పెంచుతాయి. ఎగురుతున్న గాలిపటాలు సూర్యుని ఆరోహణను అనుకరిస్తాయి. సాంస్కృతిక వేడుకలతో నూతనోత్సాహం వస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత గూటికి చేరడంతో సంతోషం వెల్లివిరుస్తుంది. -
ప్రతీ శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం
అయోధ్య.. శ్రీరాముడు కొలువైన నగరం. ఇక్కడ దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయి. దీనికితోడు శ్రీరాముని మహా మందిరంలో, ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్టు తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రతియేటా శ్రీరామనవమి నాడు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి అభిషేకం చేయనున్నాడన్నారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షంలో తొమ్మిదో రోజన సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా విగ్రహం పొడవు, ఎత్తును తీర్చిద్దిదారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు. ముగ్గురు హస్తకళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని, వాటిలో ఒక విగ్రహాన్ని భగవంతుని ప్రేరణతో ఎంపిక చేశారని చంపత్‌రాయ్ తెలిపారు. ఎంచుకున్న విగ్రహం పొడవు పాదాల నుండి నుదిటి వరకు 51 అంగుళాలు ఉందని, విగ్రహం బరువు ఒకటిన్నర టన్నులు ఉందన్నారు. ఈ విగ్రహంలోని సౌమ్యతను వివరిస్తూ.. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కపిస్తున్నదని తెలిపారు. జనవరి 16 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జనవరి 18న గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముని ప్రతిష్ఠించనున్నారు.ఈ శ్రీరాముని విగ్రహానికున్న ప్రత్యేకత ఏమిటంటే.. దానిని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. జనవరి 22న దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని, సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్ కోరింది. జనవరి 26 తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని, రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇది కూడా చదవండి: 22న పుట్టేవారంతా సీతారాములే..! -
ఇలా సెలవులిచ్చారు.. అలా క్యాన్సిల్ చేశారు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
Aditya-L1 Mission: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయిని చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత గమ్యానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్‌కు తన సేవలును అందించనుంది. కాగా గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this… — Narendra Modi (@narendramodi) January 6, 2024 ఆదిత్య ఎల్-1 మిషన సక్సెస్‌పై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్ 1 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ట్వీట్ చేశారు. ఆదిల్య ఎల్-1 మిషన్ సంపూర్ణ విజయం సాధించినట్లు చెప్పారు. చదవండి: Aditya-1 mission: ఏ పరికరాలు ఏం చేస్తాయి? -
‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్‌లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్వాలియర్‌లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. -
‘ఆదిత్య ఎల్-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?
చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య-ఎల్-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్-రే) కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్ మాస్ ఎజెక్షన్)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్ఫియర్, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్‌లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట -
సౌర విలయం!
వాషింగ్టన్: వజ్రపు మొనపై కాంతి ఒక క్రమంలో చెదిరిపోయి చిత్రించిన అందమైన వెలుగు రేఖల్లా కని్పస్తున్నాయి కదూ! కానీ ఇవేమిటో తెలుసా? సూర్యునిపై చెలరేగుతున్న ప్రచండమైన మంటలు! వీటిని ఎక్స్ కేటగిరీకి చెందిన సోలార్ ఫ్లేర్స్‌గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తిమంతమైన మంటలు ఇవేనట! సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు పునఃసంధానమయ్యే క్రమంలో ఈ మంటలు చెలరేగుతుంటాయి. తీవ్రతను బట్టి వాటిని బీ, సీ, ఎం, చివరగా అతి తీవ్రమైన మంటలను ఎక్స్‌గా వర్గీకరిస్తారు. ఇవి వరుసగా ఒక దానికంటే మరొకటి పదిరెట్లు శక్తిమంతమైనవన్నమాట. తాజా మంటలు ఎక్స్ కేటగిరీలోనూ అతి తీవ్రతతో కూడినవని నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొద్దిసేపు రేడియో ధారి్మకత బాగా పెరిగిపోయింది. వీటి దెబ్బకు ఆయా చోట్ల రెండు గంటలకు పైగా సిగ్నల్స్‌కు అంతరాయం కూడా కలిగిందట. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తిమంతమైన సోలార్ ఫ్లేమ్స్ నమోదయ్యాయి! -
Aditya L1 Mission: సౌర గాలులపై అధ్యయనం.. ఫోటో షేర్ చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యుడిపై లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక మరో మైలురాయిని సాధించింది. ఆదిత్య ఉపగ్రహంలోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ (ASPEX) పేలోడ్ తన కార్యకలాపాలను ప్రారంభించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఆదిత్య ఎల్1 ఉపగ్రహం లోని రెండు పరికరాలు పరిశోధనలన విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో ఉన్న ఎనర్జీ తేడాలను ఈ ఫోటోలో గమనించవచ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ కౌంట్‌లో తేడా ఉన్నట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించినట్లు తెలుస్తోంది. Aditya-L1 Mission: The Solar Wind Ion Spectrometer (SWIS), the second instrument in the Aditya Solar wind Particle Experiment (ASPEX) payload is operational. The histogram illustrates the energy variations in proton and alpha particle counts captured by SWIS over 2-days.… pic.twitter.com/I5BRBgeYY5 — ISRO (@isro) December 2, 2023 కాగా ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సోలర్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (Swis) నవంబర్2న, సుప్రా థర్మల్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (Steps) సెప్టెంబర్ 10న యాక్టివేట్ చేశారు. ఇవి రెండు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీ ల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదిల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని తేడా ఉనట్లు శాటిలైట్గు ఇస్రో పేర్కొంది ఇక సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. భూమి నుంచి 15 లక్షల కి,మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్1 చేరిన తర్వాత దాని కక్షలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్ 1 సూర్యుడిని ఆధ్యయనం చేస్తుంది. -
ఎల్1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్
తిరువనంతపురం: సూర్యున్ని అధ్యయనం చేయడానికి నింగిలోకి వెళ్లిన వ్యోమనౌక ఆదిత్య ఎల్-1ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్ 1 పాయింట్ చేరుకునేందుకు కావల్సిన తుది ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ ఆదిత్య ఎల్1 అప్డేట్స్ను వెల్లడించారు. ‘ఆదిత్య మిషన్ గమ్యాన్ని చేరుకునేందుకు అతి దగ్గరలో ఉంది. ఎల్ 1 పాయింట్‌కు వెళ్లేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నాం’ అని సోమనాథ్ తెలిపారు.సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ సూర్యునికి అతి సమీపంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్(ఎల్-1)ను చేరుకునే లక్ష్యంతో పంపించారు. ఎల్-1పాయింట్ చేరకున్న తర్వాత అక్కడి నుంచి ఆదిత్య సూర్యుని చిత్రాలు తీసి భూమికి పంపనుంది. ఇవి సూర్యున్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో ఇస్రోకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదీచదవండి..తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ -
‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది?
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 800 కోట్ల క్రితం విశ్వంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాన్ని గుర్తించింది. ఈ విస్ఫోటనం ఇన్ని వందల కోట్ల ఏళ్లకు భూమికి చేరుకుందని వారు తెలిపారు. ఈ పేలుడును ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ (ఎఫ్ఆర్బీ) అని అంటారు. కొత్తగా గుర్తించిన ఈ విస్ఫోటనానికి ఎఫ్ఆర్బీ-20220610ఏ అని పేరు పెట్టారు. గత ఏడాది జూన్ 10న రేడియో టెలిస్కోప్ సాయంతో దీనిని గుర్తించారు. ఈ విస్ఫోటనం ఎక్కడ నుండి ఉద్భవించిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ, వెరీ లార్జ్ టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ ఎఫ్ఆర్బీ ఇప్పటివరకూ కనుగొన్న అన్ని ఎఫ్ఆర్బీల కంటే పురాతనమైనదని, అత్యంత దూరం కలిగినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’లనేవి రేడియో తరంగాల ప్రకాశవంతమైన పేలుళ్లు. వీటి వ్యవధి మిల్లీసెకండ్ స్కేల్లో ఉంటుంది. ఈ కారణంగానే వాటి మూలాన్ని గుర్తించడం, అంతరిక్షంలో వాటి స్థానాన్ని కనుగొనడం అత్యంత కష్టమైన పని. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ను మొదటిసారిగా 2007 సంవత్సరంలో కనుగొన్నారు. నాటి నుండి శాస్త్రవేత్తలు దాని మూలాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసేంత శక్తిని ఈ పేలుళ్లు సెకనులో వెయ్యి వంతులో ఉత్పత్తి చేస్తాయి. ఎఫ్ఆర్బీ పేలుళ్లు ఎందుకు సంభవిస్తాయో శాస్త్రవేత్తలు నేటికీ గుర్తించలేకపోయారు. అయితే ఎఫ్ఆర్బీలు విశ్వంలో జరిగే సాధారణ దృగ్విషయం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఈ దృగ్విషయాలను అధ్యయనం చేయడం వలన విశ్వం ఎలా ఏర్పడిందనేది తెలుసుకునేందుకు సహాయపడుతుంది. అత్యంత వేగవంతమైన ఈ రేడియో పేలుళ్లు అనూహ్యంగా ఉంటాయి. వాటిని గమనించడం కష్టం. కెనడాలోని డొమినియన్ రేడియో ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ ఎఫ్ఆర్బీలను ట్రాక్ చేసే అబ్జర్వేటరీలలో ఒకటి. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఎఫ్ఆర్బీలపై మరింత అవగాహన కలిగేందుకు దోహదపడనుంది. కాగా ఈ అధ్యయనం వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: యూదుడైన్ ఐన్‌స్టీన్ హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? -
ఆదిత్య ఎల్1.. అసలు కథ షురూ
సూర్యుని పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ లో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు ఐదో సారి భూ కక్ష్యను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఆదిత్య ఎల్ -1 భూప్రదక్షిణ దశ ముగించుకుని.. సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.ఇక ఇక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాహన నౌక లగ్రాంజ్ పాయంట్ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శాటిలైట్ 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాటిలైట్ సూర్యుడి వైపు ప్రయాణించి.. నిర్దేశిత ఎల్-1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. డేటా సేకరణ ప్రారంభం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించింది. అయితే ఇది శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. Aditya-L1 Mission: Aditya-L1 has commenced collecting scientific data. The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth. This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri — ISRO (@isro) September 18, 2023 -
చూసేదేమిటి? చేసేదేమిటి?.. మన ఆదిత్యుడి కథా కమామిషు..
సౌర కుటుంబం మొత్తానికి తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య–ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. సుమారు 4 నెలల ప్రయాణం, 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమి, సూర్యుడు ఆకర్షణ శక్తి రెండూ లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఆదిత్య–ఎల్1లో ఏ పరికరాలున్నాయి? వాటితో చేసే ప్రయోగాలేమిటి? పరిశీలనలేమిటి?ప్రయోజనాలేమిటి?స్థూలంగా.... ఆదిత్య–ఎల్1లో మొత్తం 7శాస్త్రీయ పరికరాలు ఉంటాయి. వీటిల్లో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగిస్తే.. మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేస్తాయి. ఒక్కో పరికరం.. దాని ప్రాశస్త్యం, చేసే పని గురించి తెలుసుకుందాం... ► విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదాంట్లో ఒకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతం. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్గా పిలుస్తారు. దీని దిగువన ఉన్న ఇంకో పొరను క్రోమోస్ఫియర్ అని.. దీని దిగువన ఉన్న మరో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొర ఛాయాచిత్రాలను తీస్తుంది. అలాగే వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్–రే) కరోనాను పరిశీలిస్తుంది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి తయారు చేసిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాం (కరోనల్ మాస్ ఎజెక్షన్)పై ఓ కన్నేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్లతో వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణంపై ప్రభావం చూపగలవని అంచనా. ► సోలార్ అ్రల్టావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్పియర్, క్రోమోస్పియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అది కూడా అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధారి్మక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నిర్మించింది ఈ పరికరాన్ని. ► సోలార్ లో ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్): హై ఎనర్జీ ఎల్–1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్–రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. కాకపోతే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్–రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి పెడుతుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ► ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతల వంటివి గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్నది తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ► ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పాపా): సూర్యుడి కరోనా పొర వెలువరించే ప్లాస్మా ధర్మాలను, సౌర గాలుల్లో ఏమేం ఉంటాయి? ఉష్ణోగ్రత, సాంద్రతలను గుర్తిస్తుంది. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ తయారు చేసింది. ► అడ్వాన్స్డ్ ట్రై ఆక్సియల్ హై రెజల్యూషన్ మాగ్నెటోమీటర్: ఆదిత్య ఎల్–1 సూర్యుడిని పరిశీలించే ప్రాంతంలో గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను లెక్కగట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్రాలకు సౌర గాలులు, కరోనా తాలూకూ ప్లాస్మాల మధ్య సంబంధాలను గమనిస్తుంది. బెంగళూరులోని లా»ొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ అభివృద్ధి చేసిందీ పరికరాన్ని. మన ఆదిత్యుడి కథ కమామిషు... ► సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఖగోళ వస్తువు, నక్షత్రం అయిన సూర్యుడి వయసు సుమారు 460 కోట్ల సంవత్సరాలు ► భూమి వ్యాసార్ధం కంటే దాదాపు 864,938 రెట్లు ఎక్కువ వ్యాసార్ధం సూర్యుడిది. కొంచెం అటు ఇటుగా 13.9 లక్షల కిలోమీటర్లు!! ► అతి భారీ వాయుగోళమైన సూర్యుడిలో 75 శాతం హైడ్రోజన్ కాగా.. మిగిలిన 25 శాతం హీలియం. లేశమాత్రంగా కొన్ని ఇతర అణువులు కూడా ఉంటాయి. ► కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా సూర్యుడిపై హైడ్రోజన్ కాస్తా హీలియంగా మారుతూంటుంది. ► సూర్యుడిపై ఉష్ణోగ్రత అన్నిచోట్ల ఒకేలా ఉండదు. కంటికి కనిపించే సూర్యుడి ఉపరితలం (ఫొటోస్పియర్) ఉష్ణోగ్రత సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్. ఈ ఫొటోస్ఫియర్కు దిగువన క్రోమోస్పియర్ ఉంటే.. దాని దిగువన ఉండే కరోనా ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 నుంచి 30 లక్షల డిగ్రీల సెల్సియస్. కరోనా కంటే లోతైన ప్రాంతం లేదా సూర్యుడి మధ్యభాగంలో వేడి కోటీయాభై లక్షల డిగ్రీల సెల్సియస్ అని అంచనా. ► సముద్రానికి ఆటుపోట్ల మాదిరిగా సూర్యుడిపై జరిగే కార్యకలాపాల్లో కూడా ఒక క్రమపద్ధతి ఉంటుంది. పదకొండేళ్లకు ఒకసారి ఆ కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019 డిసెంబరులో సూర్యుడు 25వ సోలార్ సైకిల్‌లోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. -
ఆదిత్య L1 లాంచ్ : ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ వైరల్
Aditya L1 launch మిషన్ ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అటు పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా ట్విటర్(ఎక్స్)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు ఇకారస్ కథను గుర్తుచేసుకున్నారు. “‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?) మరోవైపు చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) “Don’t fly too close to the Sun” comes from the Greek legend of Icarus who flew fatally near the sun, & is used to describe TOO MUCH ambition. Thanks to @Isro :“Let’s fly close to the Sun” will mean that we should lift our ambitions even HIGHER. 🙏🏽🇮🇳 pic.twitter.com/4DQQrGKQWs — anand mahindra (@anandmahindra) September 2, 2023 కాగా చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్ఇపుడు అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. -
ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ
సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత తొలి మిషన్ విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోందని అన్నారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించడానికి మన శాస్త్రవేత్తల అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. After the success of Chandrayaan-3, India continues its space journey. Congratulations to our scientists and engineers at @isro for the successful launch of India’s first Solar Mission, Aditya -L1. Our tireless scientific efforts will continue in order to develop better… — Narendra Modi (@narendramodi) September 2, 2023 ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ‘భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. The launch of Aditya-L1, India's first solar mission, is a landmark achievement that takes India’s indigenous space programme to a new trajectory. It will help us better understand space and celestial phenomena. I congratulate the scientists and engineers at @isro for this… — President of India (@rashtrapatibhvn) September 2, 2023 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ @isro ఈరోజు ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా… pic.twitter.com/dOngtX8pUr — Telangana CMO (@TelanganaCMO) September 2, 2023 ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ27 వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఆదిత్య ఎల్1ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. రాకెట్ నుంచి విజయవంతంగా ఆదిత్య ఎల్1 విడిపోయినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. చదవండి: ఆదిత్య ఎల్-1 సక్సెస్‌పై సీఎం జగన్ హర్షం. ఇస్రోకు అభినందనలు -
ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో మైలురాయిని దాటేసింది. చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం ఇచ్చిన జోష్‌తో సూర్యుడిపై తొలి ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల క్రమంలో ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో శ్రీహరి కోట షార్‌లో శాస్త్రవేత్తల సంబురాలు చేసుకుంటున్నారు. ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్ అయ్యిందని, నిర్దేశిత కక్ష్యలోకి ఉప్రగహాన్ని పీఎస్ఎల్వీ ప్రవేశపెట్టిందని, వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. PSLV-C57/Aditya-L1 Mission: The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully. The vehicle has placed the satellite precisely into its intended orbit. India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point. — ISRO (@isro) September 2, 2023 సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం సోలార్ స్మార్ట్స్ను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ఎల్-1ను భూదిగువన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆపై దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి దింపారు. ఇక ఇక్కడి నుంచి లాంగ్రేంజ్ పాయింట్ 1 వైపు పయనిస్తుంది ఉపగ్రహం. ఈ క్రమంలో.. భూగురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభం అవుతుంది. భూమి నుంచి నాలుగు నెలలపాటు.. దాదాపు 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్. అక్కడ ఎల్1 పాయింట్‌కు చేరుకుని.. సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌ను తోలుగా అధ్యయనం చేస్తుంది ఆదిత్య ఎల్ 1. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 1475 కిలోలు. ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లకు పైనేనని ఇస్రో ప్రకటించింది. ఈ ఐదేళ్లలో.. సౌర తుఫానులు, జ్వాలలు, తీరు తెన్నులపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రతీరోజూ 1440 ఫొటోలు తీసి భూమికి పంపడంతో పాటు.. ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్‌గా డేటా అందిస్తుంది ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం. రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ (ఎల్ 1) వద్దకు చేరుకోనుంది. అనంతరం సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. ఏడు పేలోడ్స్ సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్-1. ఇందులో 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. -
ఇస్రో ఆదిత్య-ఎల్ 1 మిషన్.. భగభగల గుట్టు విప్పేనా?
బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయోత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO).. సూర్యుడిపై తొలిసారిగా ప్రయోగానికి సిద్ధమైంది. భగభగలాడే సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహాన్ని శ్రీహరి కోట(ఏపీ) అంతరిక్ష కేంద్రం షార్ వేదిక నుంచి ప్రయోగించబోతోంది. కాసేపట్లో ఇస్రో రాకెట్ ‘పీఎస్ఎల్వీ సీ-57 ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసకెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మిషన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం.. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యుడి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ ప్రవేశపెట్టే ఎల్-1(లాగ్రేంజ్) పాయింట్.. భూమి నుంచి 9లక్షల మైళ్ల దూరం(15 లక్షల కి.మీల)లో ఉంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అదే భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువ. మిషన్ ఇలా.. ‘ఆదిత్య-ఎల్ 1’ వ్యోమనౌకను తొలుత దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్1 పాయింట్ వైపు మళ్లిస్తుంది ఇస్రో. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. లాగ్రేంజ్ 1 ప్రాంతానికి చేరుకునేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ).. ఆదిత్య-ఎల్1లో కీలకం. ఇది సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు చేరవేస్తుంది. మొత్తంగా ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)’తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్ ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. శక్తివంతమైన రాకెట్ ‘ఆదిత్య-ఎల్ 1’ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) రకం రాకెట్‌ను వినియోగిస్తున్నారు. పీఎస్ఎల్వీలో ఇది అత్యంత శక్తిమంతమైనది. 2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్లనే వినియోగించారు. సూర్యుడే టార్గెట్ ఎందుకంటే.. అంత దూరంలో ఉన్నప్పటికీ.. సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు అవసరం. పైగా ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు. మరోవైపు.. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లినట్లయితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది. -
ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన
సాక్షి, నెల్లూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. ఆదిత్య ఎల్-1పై ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఇక, ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై అధ్యయనం చేయనున్న విషయం తెలిసిందే. సూర్యుడి కరోనాపై పరిశోధనలు.. చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో మరన్ని ప్రయోగాలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది. ఇందు కోసం ఆదిత్య ఎల్-1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఇవి ఉపయోగపడనున్నాయి. ఇక, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి. ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
బెంగళూరు: తక్కువ ఖర్చుతో అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ISRO మరో అడుగు వేయబోతోంది. చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్ ఆస్వాదిస్తూనే.. మరో కీలక ప్రయోగంపై ఇస్రో ప్రకటన చేసింది. ఈసారి ఏకంగా సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమని స్పష్టం చేసింది. తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్-1 Aditya L1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారాయన. ఆదిత్య ఎల్1 ISRO Sun Mission ప్రయోగంలో కరోనాగ్రాఫీ స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమికి సూర్యుడికి మధ్య ఎల్1 పాయింట్ చుట్టూ ఒక హాలో ఆర్బిట్‌లో చొప్పిస్తారు. సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు.. భూమి చుట్టూ ఉన్న పర్యావరణంపై దాని ప్రభావం తదితర అంశాలపై ఇది అధ్యయనం చేస్తుంది. ఇస్రో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను దేశంలోని వివిధ పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. పీఎస్ఎల్వీ-ఎక్సెల్(సీ 57) ద్వారా షార్ శ్రీహరికోట నుంచే ఈ ప్రయోగం చేపట్టనుంది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్1 సన్ మిషన్ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్.. సాగిందిలా! -
సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్1 మిషన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతుండగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్కు చేరుకుంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. బెంగళూరులోని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్ఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ శాటిలైట్ సెంటర్లో స్పేస్ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్ సుబ్రమణియన్ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్ ఆనే ఉపగ్రహాన్ని, చంద్రయాన్–1. చంద్రయాన్–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. ఆదిత్య ఎల్–1 ప్రయోగంలో పరిశోధనలకు పేలోడ్స్ ఇవే 1,475 కేజీలు బరువు కలిగిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలు మాత్రమే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనం ఉంటుంది. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ మధ్యంతర కక్ష్య)లోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బింవు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపుతున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీలు వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రుడు, ఆంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదిత్య ఎల్1లో ఆరు పేలోడ్స్ పరిశోధనలు.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి 1,470 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్ 1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 170 కేజీల బరువు కలిగిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేశారు. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి యెక్క వైవిధ్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి యొక్క కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. -
సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్–3 మిషన్‌ను ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆదిత్య–ఎల్1 పేరిట అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. సెపె్టంబర్ మొదటివారంలో ప్రయోగం ఉటుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలో ఉన్న ‘షార్’కు చేరుకుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగిస్తారు. ఇక్కడి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఆదిత్య–ఎల్1కు క్లీన్‌రూంలో పరీక్షల అనంతరం రాకెట్ శిఖరభాగంలో అమర్చుతారు. ప్రయోగం ద్వారా సూర్యుడు–భూమి వ్యవస్థలోని లాంగ్రేంజ్ పాయింట్ 1(ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనానికి అడ్డంకులుండవని సైంటిస్టులు చెబుతున్నారు. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంపై అధ్యయనం కోసం ఇస్రో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఆగస్ట్ మూడో వారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఆస్ట్రోశాట్‌తో పాటు చంద్రయాన్–1, చంద్రయాన్–2 మిషన్లలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహానికి రూపకల్పన చేశారు. 1,475 కేజీల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1లో ఉండే ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపి ఉంటాయి. ఉపగ్రహాన్ని సూర్యునివైపు తీసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం ఎక్కువ అవసరం. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజ్ బిందువు–1లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఆదిత్య–ఎల్1లో యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు.. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి గల కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై కూడా ఆదిత్య–ఎల్1 పరిశోధనలు చేయనుంది. సూర్యుడికి ఉన్న మరో పేరే ఆదిత్య. ఈ ఉపగ్రహాన్ని ‘లాగ్రేంజ్’ అనే బిందువు వద్ద ప్రవేశపెడుతున్నందున ఎల్ అని.. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహమైనందున ‘1’ అని పెట్టారు. దీని పూర్తి పేరు ఆదిత్య–ఎల్1 అని ఖరారు చేశారు. -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
Zero Shadow Day 2023: నేటి మధ్యాహ్నం 12:12 నిమిషాలకు నీడ ఉండదు
సాక్షి, హైదరాబాద్: విశ్వంలో వింతలు ఎన్నెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యం ఈరోజు ఆవిష్కృతం కానుంది. అది ‘నీడ లేని రోజు’ (జీరో షాడో డే). ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కనిపించనుంది. సూర్యుడు తలపైకి వచ్చిన తరువాత (మధ్యాహ్నం 12:12 నిమిషాలకు) దేని నీడా కనిపించదు. అక్షం వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. హైదరాబాద్ నగర అక్షాంశం 17.3850(ఎన్)డిగ్రీల ప్రకారం ఇక్కడ నేడు మధ్యాహ్నం 12:12 నిమి షాలకు నీడను చూడలేం. బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శన... జీరో షాడో డేపైన అందరికీ అవగాహన కల్పించడానికి నగరంలోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయో గాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్ పైన ఒక వస్తువును నిలబెట్టి మధ్యాహ్నం 12 నుంచి దాని నీడను గమనిస్తే సరిగ్గా 12:12 నిమిషాలకు అప్పటివరకు మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడ కూడా కనిపించదు. ఈ ప్రయోగాన్ని ఇంటివద్ద కూడా చేసి నీడ కోల్పోవడాన్ని గమనించవచ్చు. -
ప్రయాగ్‌రాజ్‌లో అబ్బురపరచిన కాంతి వలయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణంలో ఆకాశంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారించింది. శుక్రవారం సూర్యుడి చుట్టూ ఏర్పడిన కాంతి వలయం చూపరులను ఆశ్చర్యపర్చింది. కొన్ని గంటలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని జనం ఫోన్లలో బంధించారు. సూర్యుడి చుట్టూ ఏర్పడే కాంతి వలయాన్ని ‘సన్ హాలో’ అంటారు. వాతావరణంలో కాంతి వెదజల్లినట్లుగా మారినప్పుడు ఇలా రింగ్ లాంటి ఆకృతి ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు వాతావరణంలోని మంచు స్ఫటికాలను ఢీకొట్టినప్పుడు కాంతి వెదజల్లినట్లుగా మారుతుంది. అప్పుడు భానుడి చుట్టూ వలయాన్ని చూడొచ్చు. సాధారణ మేఘాల కంటే అధికంగా తెల్లగా, పలుచగా ఉండే సిరస్ మేఘాల్లో మంచు స్ఫటికాలు ఉంటాయి. -
మండుటెండల్లో మహా నిర్లక్ష్యం
ప్రకృతి ప్రకోపానికి గురికావడం వేరు. పాలకుల అనాలోచిత చర్య, నిర్లక్ష్యానికి బలి కావడం వేరు. నవీ ముంబయ్‌లోని ఖార్ఘర్ ప్రాంతంలో ఆదివారం 38 డిగ్రీల మండుటెండలో 306 ఎకరాల్లో ఆరుబయట ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో అసువులు బాసిన 13 మంది అమాయకులు అక్షరాలా పాలనా యంత్రాంగపు నిర్లక్ష్యానికి బలిపశువులే. మహారాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను సంఘ సంస్కరణవాది అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రదానం చేసే ఆ బహిరంగ సభకు 10 లక్షల మంది హాజరయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి, సీఎం లాంటి వీవీ ఐపీలకు ఎండ కన్నెరగని రీతిలో ఏర్పాట్లు చేసిన పెద్దలు, సామాన్యులకు నెత్తి మీద నీడ కాదు కదా.. తాగేందుకు గుక్కెడు చల్లటి మంచినీటినైనా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటే ఏమనాలి? 650 మంది దాకా వేసవి ఉష్ణతాపం వల్ల అస్వస్థతకు గురి కాగా, 18 మంది ఆస్పత్రి పాలైన ఆ సభావేదిక దృశ్యాలు చూస్తుంటే, ఎవరికైనా గుండె మండిపోతుంది. ఎండలు ముదిరిన వేసవిలో, మహారాష్ట్రలో ప్రచండ గ్రీష్మపవనాల ప్రభావం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించి సంగతి తెలిసీ... ఇలా మిడసరిలగ్నంలో బహిరంగ సభ పెట్టి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ఎవరిచ్చారు? పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడిగాలులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అత్యవసరాన్ని ఈ నిర్లక్ష్యం, వ్యవస్థాగత వైఫల్యం గుర్తుచేస్తున్నాయి. ఈ ఘటన అటు పాలకులకూ, ఇటు వేసవి గడిచేకొద్దీ ఎన్నికల రాజకీయ వేడి పెరిగి, భారీ సభలకు దిగే పార్టీలకూ పాఠాలు చెబుతోంది. మహారాష్ట్ర ఘటనలో మహాపరాధాలు అనేకం. సాయంత్రం 5 గంటలకు అనుకున్న సభను ఎందుకు ఆరు గంటలు ముందుకు జరిపినట్టు? పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది హాజరయ్యేలా ఎర్రటి ఎండలో గంటలకొద్దీ సభ పెట్టినప్పుడు నీడలో కూర్చొనే ఏర్పాటు, సక్రమంగా మంచినీటి వసతి ఎందుకు చేయలేకపోయినట్టు? ఎండ వేడి, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరై, దాహంతో నోరు పిడచగట్టుకుపోయి, కళ్ళు తిరిగి వడదెబ్బకూ, గుండెపోట్లకూ జనం మరణిస్తే, ‘దురదృష్టకరం’ అని ఒక్కమాట అనేస్తే చాలా? మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించినంత మాత్రాన... చేసిన పాపం, ఏర్పాట్లలో చూపిన నిర్లక్ష్యం మాసిపోతాయా? ఉష్ణపవనాలపై వాతా వరణ శాఖ హెచ్చరికలను యంత్రాంగం పెడచెవిన పెట్టిన ఫలితమిది. ఇది దేశంలో అందరికీ ఓ గుణపాఠం. తాజాగా ఏప్రిల్ 17 నుంచి అయిదురోజులు యూపీ, బెంగాల్, సిక్కిమ్, ఒడిశా, జార్ఖండ్, కోస్తా ఆంధ్రలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ హెచ్చరికలు రావడం గమనార్హం. గడిచిన 2022లో ఏకంగా 280 రోజులు 16 రాష్ట్రాల్లో ఉష్ణ పవనాలు వీచినట్టు ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ నివేదిక. ఇది గత దశాబ్దిలోకెల్లా అత్యధికం. ఒక్క మహా రాష్ట్రలోనే నిరుడు వేసవిలో 2 నెలల్లో, 4 హీట్ వేవ్స్ వచ్చాయి. 31 మంది మరణించారు. ఈ ఏడాదీ మార్చి నుంచి మే వరకు మధ్య, వాయవ్య భారతంలో గ్రీష్మ పవనాలు వచ్చే అవకాశం ఎక్కువని ఐఎండీ ఫిబ్రవరిలోనే పారాహుషార్ చెప్పింది. ఆ అంచనా సాక్ష్యమే ఇటీవలి ఎండలు, వడగాడ్పులు. ఏటేటా పెరుగుతూ, జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్న ఈ వేడిమిపై పాలకులు తక్షణం దృష్టి పెట్టాలంటున్నది అందుకే! 2010లోనే ఉష్ణపవనాల తాకిడికి 800 మందికి పైగా మరణించిన అహ్మదాబాద్‌లో అక్కడి నగరపాలక సంస్థ నిపుణుల సాయంతో దేశంలోనే తొలి ‘గ్రీష్మపవన కట్టడి కార్యాచరణ ప్రణాళిక’ (హెచ్ఏపీ)ను రూపొందించింది. 2013 నుంచి అమలులో పెట్టి, ఏటా వెయ్యికి పైగా మరణాలను నివారిస్తోంది. జనం జీవనోపాధినీ, ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ఈ వడగాడ్పులను ఎదుర్కోవడానికి ఇంకా అనేకచోట్ల వివిధ పాలనా యంత్రాంగాలు ప్రణాళికలు రూపొందించక పోలేదు. పిల్లల బడి వేళల్లో, రోజువారీ కూలీల పని వేళల్లో మార్పులు, ప్రథమ చికిత్స, మంచినీటి వసతుల ఏర్పాటు లాంటి ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీ) ఒడిశా లాంటి రాష్ట్రాలు రూపొందించాయి. అయితే, మన దేశంలో ఈ హెచ్‌ఏపీలను ఎక్కడికక్కడ స్థానిక అవసరాలకు తగ్గట్లు తయారు చేయట్లేదు. అది పెద్ద లోపం. నిధుల కొరత సరేసరి. పదులకొద్దీ ప్రణాళికల్ని అధ్యయనం చేసి ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ ఇది తేల్చింది. ఆ మాట మనకు మరో కనువిప్పు. అందుకే, ఈ ప్రణాళికలన్నిటినీ జాతీయ స్థాయిలో ఒకచోట సమీకరించడం అవసరం. పారదర్శకంగా, ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచి, తరచూ వాటి పనితీరును మదింపు చేయాలి. సీపీఆర్ ఆ సూచనే చేస్తోంది. అలాగే, రోజువారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్ని కొలిచే సంప్రదాయ విధానాలు సరిపోవు. ఒక ప్రాంతపు వేడినీ, తేమనూ కలిపి కొలిచే ‘వెట్–బల్బ్’ ఉష్ణోగ్రత; అలాగే గాలి వేడిమి, సాపేక్ష ఆర్ద్రత, వాయువేగాల కలయికైన ఒంటికి అనిపించే ఉష్ణోగ్రత లాంటి కొత్త విధానాల్ని అనుసరించడం మంచిది. దీనివల్ల ఒంటిపై ఉష్ణప్రభావాన్ని గ్రహించి, సునిశిత చర్యలు చేపట్టవచ్చు. ప్రజలకు వాతావరణ అక్షరాస్యత కల్పించి, అవగాహన పెంచి, అవాంఛనీయ మార్పులకు సంసిద్ధం చేయడమూ అవసరం. అందులోనూ రానున్న కాలంలో... ప్రపంచంలో తొలిసారిగా మానవ ఉనికికే ప్రమాదమయ్యే స్థాయి ఉష్ణపవనాలు ఎదురయ్యే ప్రాంతాల్లో ఒకటి భారత్ కావచ్చని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక. పంచాగ్ని మధ్యంలో పడిపోక ముందే తెలివి తెచ్చుకొని, సత్వర కార్యాచరణకు దిగడమే విజ్ఞత. ఉదాసీనతతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహారాష్ట్ర లాంటి ఘటనలే మళ్ళీ ఎదురవుతాయి. -
పట్టన ప్రాంతాల్లో ఎండ దెబ్బకు రోడ్లపై పందిర్లు
-
నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అద్భుతాన్ని చూశారు..!
నాసా శాస్త్రవేత్తలు ఈ మధ్య ఓ అద్భుతాన్ని చూశారు! సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది! కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది! అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది! సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది!! సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు... సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ డైరెక్టర్ స్కాట్ మాకింతోష్ వివరించారు. ‘‘పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్ సైకిల్లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు’’ అని వివరించారు. కారణాలు మిస్టరీయే! సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు. తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్ సైకిల్లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ‘‘ఈ సోలార్ సైకిల్ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్ ఏర్పడి ఉండవచ్చు’’ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్య వయస్సులోకి ఆదిత్యుడు... సూర్యుడిప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త గియా అంతరిక్ష నౌకతో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్‌జెయింట్‌గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలనూ మాడ్చి మసి చేసేస్తుందని అంచనా. ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందట. ఏమిటీ సోలార్ సైకిల్? సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్ సైకిల్. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి (సన్ స్పాట్స్) కనిపిస్తూంటాయి. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది. సన్‌స్పాట్స్ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్ సైకిల్ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్ సైకిల్ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్ సైకిల్‌కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Planet killer: భూమి వైపుగా ప్రమాదకరమైన గ్రహశకలం!
భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను.. అంతరిక్షంలో ఉండగానే స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీ కొట్టించడం.. తద్వారా కుదిరితే కక్ష్య వేగం తగ్గించి దారిమళ్లించడం.. లేదంటే పూర్తిగా నాశనం చేయడం.. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసాకు ఇప్పుడు లక్ష్యాలుగా మారాయి. ఈ క్రమంలో.. డార్ట్(డబుల్ ఆస్టారాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) మిషన్ తెర మీదకు వచ్చింది కూడా. అయితే డార్ట్ మిషన్‌కు కూడా అంతుచిక్కకుండా ఓ గ్రహ శకలం.. భూమి వైపుగా దూసుకొస్తే ఎలా ఉంటుంది?.. ఈమధ్య.. ఓ నెల కిందట నాసా అంతరిక్ష లోతుల్లో ఓ ఆస్టరాయిడ్‌ను స్పేస్ క్రాఫ్ట్తో ఢీ కొట్టించడం ద్వారా విజయవంతంగా దారి మళ్లించింది. ఈలోపే మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించింది నాసా. భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉన్న మరో మూడు గ్రహశకలాలను గుర్తించిందట. అంతేకాదు.. సౌరవ్యవస్థ లోపలే అవి దాక్కుని ఉన్నాయని, వాటి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని నాసా ప్రకటించింది. ఈ మేరకు చిలీలోని సెర్రో టోలోలో ఇంటర్ అమెరికన్ అబ్జర్వేటరీ వద్ద టెలిస్కోప్‌కు అమర్చిన డార్క్ ఎనర్జీ కెమెరా ద్వారా ఈ మూడు గ్రహశకలాలను గుర్తించగలిగింది నాసా బృందం. మూడు గ్రహశకలాల్లో రెండు.. కిలోమీటర్ వెడల్పుతో ఉన్నాయి. మూడవది మాత్రం ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో ఉండి.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా స్పష్టం చేసింది. అయితే.. సౌర వ్యవస్థ లోపలి భాగంలో అదీ భూమి, శుక్ర గ్రహం అర్బిట్ల మధ్య ఈ మూడు గ్రహ శకలాలు గుర్తించామని, సూర్య కాంతి కారణంగా వీటి గమనాన్ని గుర్తించడం కష్టతరంగా మారిందని నాసా బృందం తెలిపింది. వీటిని 2022 AP7, 2021 LJ4, 2021 PH27గా వ్యవహరిస్తున్నారు. ఇందులో 2022 ఏపీ7 ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో కిల్లర్ ప్లానెట్‌గా గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా కిలోమీటర్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కిల్లర్ ప్లానెట్గానే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఇవి చేసే డ్యామేజ్ ఎక్కువ. అందుకే ఆ పేరు వచ్చింది. అయితే.. గత ఎనిమిదేళ్లలో ఇంత ప్రమాదరకమైన గ్రహశకలాన్ని గుర్తించడం మళ్లీ ఇదే. ఇది ఏదో ఒకరోజు ఇది కచ్చితంగా భూ కక్ష్యలోకి అడుగుపెడుతుందని.. భూమిని కచ్చితంగా ఢీకొట్టి తీరుతుందని అంచనా వేస్తున్నారు నాసా సైంటిస్టులు. మిగతా 2021 ఎల్జే4, 2021 పీహెచ్27 మాత్రం భూమార్గానికి దూరంగానే వెళ్లనున్నాయి. అయితే ప్రమాదకరమైన ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించడం, నాశనం చేయడం గురించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయడం కుదరదని నాసా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు, కానీ.. -
స్కూల్ ఫీజు కట్టలేదని.. విద్యార్థులను రోజంతా ఎండలో..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాల్ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫీజు కట్టనందుకు టీచర్లు తమను రోజంతా ఎండలోనే కూర్చోబెట్టారని ఓ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. పరీక్షలు కూడా రాయనివ్వలేదని వాపోయింది. ఫీజు విషయంపై తల్లిదండ్రులకు చెప్పానని, వారు ఒక్కరోజులో చెల్లిస్తామన్నారని పేర్కొంది. ఈ విషయం టీచర్లకు చెప్పినా వినిపించుకోకుండా తమకు ఈ శిక్ష విధించారని రోదించింది. यूपी : उन्नाव के एक प्राइवेट स्कूल में बच्चों की फीस नहीं पहुंची तो पूरा दिन धूप में खड़ा रखा गया एग्जाम नहीं देने दिया, कब हम फ्री स्कूल-अस्पताल पर बात करेंगे? pic.twitter.com/KrBDnL6ity — Nigar Parveen (@NigarNawab) October 17, 2022 పిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చొబెట్టిన పాఠశాల యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. చదవండి: క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా.. -
సూర్యుడికి ఆయుక్షీణం
లండన్: జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందట. సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనని, ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చెబుతోంది. భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్ఏ ప్రయోగించిన గైయా స్పేస్ అబ్జర్వేటరీ(స్పేస్‌క్రాఫ్ట్) భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది. సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్ నిల్వలే. సూర్యుడి ఉపరితలం ఉన్న హైడ్రోజన్ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తుతో హైడ్రోజన్ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట! దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. సూర్యగోళం మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు. -
కుతుబ్‌మినార్ కాదు సూర్య గోపురం!
Qutub Minar was built by Raja Vikramaditya to observe the sun: తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కతుబ్‌మినార్ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు. కుతుబ్‌మినార్ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం) -
Solar Flare: రికార్డు స్థాయిలో సూర్యుడి ఎండ.. జీపీఎస్, విమానాలపై ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలోనే భానుడు భగభగమని ఉగ్రరూపం చూపిస్తున్నాడు. బుధవారం సూర్యుడి నుంచి సౌరజ్వాలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో సౌరజ్వాలలతో భానుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని కోల్కత్తా వేదికగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్(CESSI) ఇండియా వెల్లడించింది. కాగా, భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలు వెలువడ్డాయని.. ఇవి సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలను దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని సెస్సీ(CESSI) వెల్లడించింది. ఈ సందర్బంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు నంది మాట్లాడుతూ.. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్12992 నుంచి బుధవారం ఉదయం 9.27గంటలకు X2.2 తరగతికి చెందిన సౌరజ్వాలలు వెలువడ్డాయని అన్నారు. ఈ సౌరజ్వాలల ప్రభావం భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రభావం చూపించిందని తెలిపారు. దీని వల్ల హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జీపీఎస్పనితీరులో లోపాలు, ఎయిర్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్ 18నే తమ బృందం అంచనా వేసిందని ఆమె చెప్పారు. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. సౌరజ్వాలలు అంటే.. సౌర వ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడటాన్నే సౌరజ్వాలలు అంటారు. ఈ సౌరజ్వాలల వల్ల రేడియా సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్, నేవిగేషన్ సిగ్నల్స్ ప్రభావితమై.. విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇక, సౌరజ్వాలల తీవ్రతను బట్టి నాసా.. వీటిని A నుంచి B, C, M, X వంటి తరగతులుగా విభజించింది. కాగా, బుధవారం వచ్చిన ఎక్స్ తరగతి సౌరజ్వాల అన్నింటికన్నా తీవ్రమైనది. The #sun unleashed a massive #solarflare on Wednesday, which has the potential to impact satellite communications and global positioning systems, the Centre of Excellence in Space Sciences India (CESSI) said.@cessi_iiserkol Read:https://t.co/wnIrwm99db — India Ahead News (@IndiaAheadNews) April 20, 2022 -
మండే కాలం
సీతంపేట: ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో రోజువారీ నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా కనిపిస్తోంది. సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాణపాయం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఎండల్లో తిరిగితే సన్(హీట్) స్ట్రోక్ (వడదెబ్బ), హీట్ సింకోప్(తల తిరగడం), హీట్ ఎక్సాషన్( అలసట), హీట్ క్రాంప్స్(కండరాలు, పిక్కలు లాగడం)తో పాటు పలు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదకరం.. ప్రజలు వేసవిలో ఎక్కువగా వడదెబ్బ బారిన పడతా రు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగి, తగినంత లవణాలున్న నీరు తీసుకోకపోతే అపస్మారక స్థితికి చేరుతారు. తీవ్ర జ్వరం, మూత్రం రాకపోవ డం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లు తొలుత గుర్తించాలి. కొందరిలో ఫిట్స్ లక్షణాలు కూడా కనిపిస్తుండడం గమనార్హం. పార్కిన్సన్(తల ఊపడం) వ్యాధికి సంబంధించి మందులు వాడే వా రు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. బయట ఆహారం తీసుకోవడం ద్వారా డయేరియా సోకే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. శరీరమంతా యాసిడ్ ఏర్పడి అవయవాలపై ప్రభా వం చూపుతాయి. అధిక వేడిమితో చమట కాయలు రావడం, గడ్డలు కట్టడం, సన్‌బర్న్ (చర్మం కమిలిపోవడం) వంటి సమస్యలు వస్తాయి. శరీరంపై దద్దుర్లు సైతం ఏర్పడతాయి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి.. ఎండ కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయిన వ్యక్తులకు చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్ లేక కూలర్ ముందు సేదతీరేలా చేయాలి. తడిగుడ్డతో శరీరం తుడవాలి. తర్వాత దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఐవీ ప్లూయిడ్స్ ఇవ్వడంతో పాటు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. దీని ద్వారా మనిషి ప్రాణాపా య స్థితి నుంచి గట్టెక్కుతాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ♦సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ♦ఎటువంటి కార్యక్రమాలనైనా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో చేసుకోవాలి. ♦కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ♦జీన్స్, బ్లాక్ షర్టులు వేసుకోకపోవడం మంచిది. ♦బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగును వెంట తీసుకెళ్లాలి. ♦శరీరానికి ఎండ తగలకుండా దుస్తులు ధరించాలి. ♦సన్‌స్క్రీన్ లోషన్లు వాడడం మంచిది. ♦తరచుగా నీరు, లవణాలు తీసుకోవాలి. ♦నీటితో పాటు కొబ్బరి బొండాలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. ♦కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦రోడ్లపై విక్రయించే, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. ♦ఆయిల్ ఫుడ్, టీ, కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అప్రమత్తంగా ఉండాలి.. వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో తిరగకూడ దు. ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి. వాటర్ బాటిల్ వెంట తీసుకువెళ్లాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించడం చాలా మంచిది. –బి. శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, సీతంపేట, ఐటీడీఏ -
చైనా మరో కీలక ప్రయోగం.. భూమి అంతం కానుందా?
మన భూమి మీద జీవజాలం బతుకుతుందుంటే సూర్యుడు చలవే అని చెప్పుకోక తప్పదు. ఆ సూర్యుని వెలుతురే మొక్కలు ఆహారం. ఆ మొక్కలు తిని చాలా జంతువులు జీవనం సాగిస్తాయి. అలాంటి సూర్యుడు లేకుంటే అసలు ఈ భూమి మీద జీవమే లేదు. అయితే ఈ సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి ఈ చైనా శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా లాంటి జీవులను పుట్టించి ప్రపంచ వినాశనానికి కేంద్రమైన చైనీయులు తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్నారు. అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్(ఈస్ట్) అని పిలువబడే టెక్నాలజీ సహాయంతో చైనా "కృత్రిమ సూర్యుడి"ని సృష్టిస్తుంది. కృత్రిమ సూర్యుని ప్రయోగ పరీక్షలో భాగంగా 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను దాదాపు 17 నిమిషాల 36 సెకన్ల పాటు విజయవంతంగా ఉత్పత్తి చేసింది. ఇది నిజమైన సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంటుంది. సూర్యుని కోర్ వద్ద 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అణు సంలీన శక్తిలో భాగంగా హైడ్రోజన్, డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగించి సూర్యుడి వలే అణు కలయిను ప్రేరేపించడం ద్వారా ఈ స్వచ్ఛమైన శక్తిని నిరంతరం ఉత్పత్తి చేసి సరఫరా చేయవచ్చని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే, ఈ ప్రయోగ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రయోగం వల్ల భూమి అంతం కానుందా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రయోగంలో భాగంగా న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ భారీ హైడ్రోజన్, డ్యూటిరియం పరమాణువులను ఢీకొట్టి హీలియంను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదల అవుతుంది. ఇది మన సూర్యుడి వంటి నక్షత్రాలలో సహజంగా జరిగే ప్రక్రియ.. దాన్ని చైనా శాస్త్రవేత్తలు కృత్రిమంగా రూపొందించి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. చైనాలోని తూర్పు ప్రావిన్స్ అన్హుయిలోని హెఫీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ లో తాజా ప్రయోగం జరిగింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక 10,000 కంటే ఎక్కువ మంది చైనీస్, విదేశీ శాస్త్రీయ పరిశోధకులు ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్నారని తెలపింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 7,060 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలుస్తుంది. 2040 నాటికి ఈ కృత్రిమ సూర్యుని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం..! ఇక యూజర్లకు పండగే..?) -
అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు
Akshay Kumar New Year Wishes To Sun By Chanting Gayatri Mantra: న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అందరిలా ప్రియమైన వారికి, అభిమానులకు శుభాకాంక్షలు చెప్పలేదు ఈ పృథ్వీరాజ్. ఉదయాన్నే అందరిని నిద్ర నుంచి మేల్కొలిపే సూర్యుడికి గాయత్రి మంత్రం జపిస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపాడు అక్కీ. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు 54 ఏళ్ల అక్షయ్ కుమార్. 'నూతన సంవత్సరం. అదే నేను. నిద్ర లేచి నా పాత స్నేహితుడు సూర్యుడికి శుభాకాంక్షలు తెలిపాను. కరోనా కాకుండా మిగతా అన్ని అంశాలు పాజిటివ్‌గా ఉండేలా 2022 సంవత్సరాన్ని ప్రారంభించాను. అందరి ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను. హ్యాపీ న్యూయర్.' అని రాసిన క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేశాడు అక్కీ. ఈ పోస్టులో సూర్యుడికి ఎదురుగా నమస్కరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపించాడు. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, రామ్ సేతు, ఓ మై గాడ్! 2 చిత్రాలు ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! నాసా హెచ్చరిక
సూర్యుడి నుంచి భూమివైపుగా మరో పెను ఉప ద్రవం ముంచుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడిపై నెలకొన్న పరిస్థితుల కారణంగా మరోసారి సౌర తుఫాన్స్ ఏర్పడే అవకాశం ఉందని నాసా పేర్కొంది. ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు సౌర తుఫాను హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఈ సారి రెండు "పెద్ద సౌర తుఫానులు" త్వరలో సూర్యుడి నుంచి విడుదల కావచ్చని అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డా.తమిత స్కోవ్ పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ రెండు సౌర తుఫానుల భూమిని తాకే అవకాశం ఉందని డాక్టర్ తమిత అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో సుమారు ఐదారు సౌర తుఫానులు భూమిని తాకయని తెలిపింది. కాగా ప్రస్తుతం సూర్యుడి నుంచి వెలువడనున్న సౌర తుఫానుల తీవ్రతను ఇంకా నిర్దారించలేదు. గతంలో జీ2, జీ3 మాగ్నెటిక్ సౌర తుఫానులు వచ్చాయని తమిత పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే రానున్న సౌర తుఫానులు "హై అలర్ట్‌లో" ఉన్నాయని ఆమె తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతుదంటే..! ప్రతి పదకొండు సంవత్సరాలకొకసారి సూర్యుడి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్‌డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ జరిగే సమయంలో సూర్యుడి అయస్కాంత ద్రువాలు మారుతూ ఉంటాయి. దీనినే సోలార్ మాగ్జిమమ్‌గా పిలుస్తారు. సూర్యుని అయస్కాంత క్షేత్రంలోని మార్పులు ఎక్కువ సంఖ్యలో సన్ స్పాట్స్, భారీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయస్కాంత క్షేత్రంలోని హెచ్చుతగ్గుల వల్ల సోలార్ ప్లేర్స్ ఏర్పడతాయి. సౌర తుఫాన్ భూమిని తాకితే...! రేడియో కమ్యూనికేషన్లు బాగా ప్రభావితమయ్యాయి. జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇంటర్నెట్కు విఘాతం కల్గవచ్చును. ఆర్కిటిక్ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా న్యూయర్క్ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్ కాంతులను చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పవర్గ్రిడ్లలో విద్యుత్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. చదవండి: భగభగమండే సూర్యుడి వాతావరణాన్ని చూశారా..! అందులో ఎన్నో అద్బుతాలు..! -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..!అదెలా సాధ్యమైందంటే..?
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నాసా సంచలన విజయం సాధించింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారిగా సూర్యుడి వాతావరణాన్ని ముద్దాడింది. సోలార్ మిషన్‌లో భాగంగా తొలి ఘట్టాన్ని నాసా ద్విగ్విజయంగా పూర్తి చేసింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక ప్రధాన మైలురాయి దాటిందని డిసెంబర్ 14న న్యూ ఓర్లీన్స్లో జరిగిన 2021 అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఫాల్ మీటింగ్‌లో విలేకరుల సమావేశంలో తెలిపింది. పార్కర్ సోలార్ ప్రోబ్ అందించిన ఫలితాలను ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో నాసా ప్రచురించింది. చదవండి: రష్యా మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి పెనుముప్పు తొలి అడుగు విజయవంతం..! సోలార్ ప్లేర్, మాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ లాంటి దృగ్విషయాలను, సూర్యుడి వాతావరణాలను శోధించడానికి నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ను 2018లో ప్రయోగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈ ప్రోబ్ సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలో ప్రవేశించింది. ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి నాసాకు పంపింది. సూర్యుని వాతావరణంలోని ధూళి కణాలను సేకరించడంలో పార్కర్ ప్రోబ్ ప్రధాన పాత్ర పోషించింది.ఈ మిషన్‌లో భాగంగా వాహక నౌక ఈ ఏడాది సూర్యుడికి అత్యంత దగ్గరగా సుమారు 8.13 మిలియన్ మైళ్ల దూరానికి నౌక చేరుకుంది. డిసెంబర్ 2021 నాటికి 4.89 మిలియన్ మైళ్ల సూర్యుడి వాతావరణంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ చేరగా...2025 నాటికి సూర్యుడి నుంచి 3.83 మిలియన్ మైళ్ల దూరంకు చేరి చివరి ఘట్టాన్ని పూర్తి చేయనుంది. భగభగ మండే వాతావరణంలోకి ఎలా చేరిందంటే..! సూర్యుడి వాతావరణాన్ని తట్టుకునేలా పార్కర్ సోలార్ ప్రోబ్ నౌకను నాసా తయారుచేసింది. ప్రోబ్‌లో హీట్ షీల్డ్ నాసా శాస్త్రవేత్తలు అమర్చారు. 4.5-అంగుళాల మందంతో ఉండే కార్బన్-మిశ్రిత ఉష్ణ కవచం 1,377 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోనే కెపాసిటీ పార్కర్‌కు ఉంది. సూర్యుడి నుంచి దాదాపు 3.83 మిలియన్ మైళ్ల దూరం వరకు వెళ్లే విధంగా పార్కర్ ప్రోబ్‌ను నాసా డిజైన్ చేసింది. పార్కర్ సోలార్ ప్రోబ్ గుర్తించిన విషయాలు..! సూర్యుడి వాతావరణానికి సంబంధించిన అనేక విషయాలను పార్కర్ సోలార్ ప్రోబ్ వెల్లడించింది. ఈ ప్రోబ్ ముఖ్యంగా సోలార్ స్విచ్బ్యాక్లను గమనించింది. అదేవిధంగా భూమిపై పవర్ గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సోలార్ ఫ్లేర్స్ అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడింది. చదవండి: కోట్లు మింగేసిన టెలిస్కోప్! విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా? -
పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..
Astrophotographer Andrew McCarthy Sun Photo: సుడులు తిరుగుతున్న లావాలా ఉన్న అగ్నిగోళం ఉపరితలం... పసుపు, ఎరుపు కలగలిసిన ఈకలను తలపిస్తున్న భానుడి భగభగలు... అక్కడక్కడా నల్లటి చుక్కలు... సూర్యుడిని అతి సమీపం నుంచి చూస్తున్నట్టుగా ఉన్నది కదూ! ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఆస్ట్రోఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ కాతీ పట్టి బంధించాడు. నిప్పులు కక్కుతున్న ఆ నిండు సూర్యుడిని... ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో కట్టిపడేసిన ఆండ్రూ... సూర్యుడిని అంత సమీపంగా, అంత అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటోగ్రాఫర్. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) ఇందుకోసం 300 మెగాపిక్సల్స్ కలిగిన కెమెరాను ఉపయోగించాడు. ఇది... సాధారణ కెమెరాకంటే 30 రెట్లు అధికం. ఒక్క పర్ఫెక్ట్ చిత్రం కోసం... ఆయన లక్షా యాభైవేల చిత్రాలను తీసి, వాటిని లేయర్ చేశాడు. నల్లటి చుక్కలను ఫొటోషాప్‌తో ఎడిటింగ్ చేశాడు. సాధారణంగా ఇలాంటివి తీస్తున్నప్పుడు మంటలు వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు కూడా పోవచ్చు. వీటిని నివారించడానికి రెండు ఫిల్టర్లు ఉన్న ప్రత్యేక టెలిస్కోప్ వాడాడు. ‘ఆకాశాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందరూ చంద్రుడినే బెంచ్‌మార్క్‌గా చూస్తారు. కానీ సూర్యుడిని క్యాప్చర్ చేయడం నన్ను ఉత్సాహపరిచే అంశం. ఎందుకంటే సూర్యుడెప్పుడూ బోర్ కొట్టడు. తీసిన ప్రతిసారీ కొత్తగా కనిపిస్తాడు’అని ఆండ్రూ చెబుతున్నాడు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
అదిగదిగో ప్లానెట్ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా
మన సౌర కుటుంబంలో గ్రహాలెన్ని? ఇదేం ప్రశ్న తొమ్మిది గ్రహాలు కదా అంటారా.. కాదు కాదు.. ఫ్లూటోను లిస్టులోంచి తీసేశారు కాబట్టి ఎనిమిదే అంటారా.. ఏం అన్నా అనకున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం ఫ్లూటో కాకుండానే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫ్లూటో అవతల ఓ పెద్ద గ్రహం ఉందనడానికి కొన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, కానీ దాని జాడ మాత్రం కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలేమో.. అలాంటి గ్రహమేదీ లేకపోవచ్చని చెప్తున్నారు. అసలు ఈ తొమ్మిదో గ్రహం ఏమిటి? దానికి ఆధారాలేమిటి? ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? ఫ్లూటోను తొలగించాక.. మనం చిన్నప్పటి నుంచీ సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయనే చదువుకున్నాం. కానీ కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు.. గ్రహాలకు సంబంధించి కొన్ని పరిమాణం, ఆకృతి, దాని కక్ష్య వంటి పలు నిబంధనలు రూపొందించారు. అందులో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ప్లూటో అప్పటి నుంచి మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలే (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్) మాత్రమే మిగిలాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఫ్లూటోకు కొంచెం అటూఇటూగా మరో మూడు, నాలుగు మరుగుజ్జు గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. కానీ ఇటీవల ఫ్లూటో, ఇతర మరుగుజ్జు గ్రహాలు కాకుండానే.. తొమ్మిదో గ్రహం ఉండి ఉంటుందన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. ‘ప్లానెట్ 9’ ఉందంటూ.. 2016లో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)కు చెందిన అంతరిక్ష పరిశోధకులు మైక్ బ్రౌన్, కోన్స్టాంటిన్ బటిగిన్ ‘ప్లానెట్ 9’ను ప్రతిపాదించారు. ఫ్లూటో అవతల సౌర కుటుంబం చివరిలో ఓ భారీ గ్రహం పరిభ్రమిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దానికి ప్రస్తుతానికి ‘ప్లానెట్ 9’ అని పేరు పెట్టారు. ►2018లో ది ఆస్ట్రానమికల్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన కూడా సౌర కుటుంబం అంచుల్లో ఏదో పెద్ద గ్రహం ఉండవచ్చని అంచనా వేసింది. ‘2015 బీపీ519’గా పిలిచే ఓ భారీ ఆస్టరాయిడ్ కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. నెప్ట్యూన్ కక్ష్యకు సమీపంగా సూర్యుడి చుట్టూ తిరిగి వెళుతుంది. అంత దూరంలో భారీ గ్రహం ఉందని, దాని ఆకర్షణ వల్లే ఈ ఆస్టరాయిడ్ సౌర కుటుంబం పరిధిలో ఉందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. భారీ గ్రహాల గురుత్వాకర్షణను బట్టి.. అంతరిక్షంలో నక్షత్రాలు, భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి చుట్టూ ఉండే గ్రహాలు, ఆస్టరాయిడ్లు, ఇతర ఖగోళ వస్తువులపై ప్రభావం చూపుతూ ఉంటుంది. సౌర కుటుంబంలోనే అతి భారీ గ్రహమైన గురుడి గురుత్వాకర్షణ కారణంగానే.. ఆ గ్రహ కక్ష్యలో, అంగారకుడు–గురు గ్రహాల మధ్య పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు తిరుగుతుంటాయి. అదే తరహాలో క్యూపియర్ బెల్ట్‌లోనూ ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు గుంపులుగా పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏదైనా భారీ గ్రహం గురుత్వాకర్షణ ప్రభావం చూపితే తప్ప.. ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు అలా వ్యవహరించవని సూత్రీకరించారు. ►మార్స్–గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉన్నట్టుగానే.. నెప్ట్యూన్ గ్రహం పరిభ్రమించే చోటు నుంచి అవతల సుమారు 500 కోట్ల కిలోమీటర్ల వెడల్పున మరో బెల్ట్ ఉంటుంది. దానినే క్యూపియర్ బెల్ట్ అంటారు. ప్లూటోతోపాటు ఎన్నో మరుగుజ్జు గ్రహాలు, కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు ఆ బెల్ట్‌లోనే తిరుగుతుంటాయి. ఆ గ్రహం ఎలా ఉండొచ్చు? క్యూపియర్ బెల్ట్‌లో మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల గుంపులు, కక్ష్య, పరిమాణాలను బట్టి.. పలు కంప్యూటర్ సిమ్యులేషన్లు, గణిత సూత్రాల ఆధారంగా ‘ప్లానెట్ 9’ అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ లెక్కన.. భూమి ప్లానెట్ 9 ►భూమితో పోలిస్తే ప్లానెట్ 9 పది రెట్లు పెద్దగా ఉండి ఉంటుంది. ►సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఎంతదూరంలో ఉందో.. అంతకు 20 రెట్లు దూరంలో తిరుగుతూ ఉంటుంది. ►ప్లానెట్–9 సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు కనీసం 10 వేల ఏళ్ల నుంచి 20 వేల ఏళ్లకుపైగా సమయం పడుతుంది. నేరుగా ఎందుకు గుర్తించలేం? సౌర కుటుంబం అంచుల్లో ఉన్న గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్లు పరిభ్రమించే వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా సూర్యుడి చుట్టూ తిరిగేందుకు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మనం పరిశీలిస్తున్న సమయంలో.. అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు.అందువల్ల వాటిని నేరుగా గుర్తించడం కష్టం. ఒకసారి గుర్తిస్తే.. వాటి పరిమాణం, వేగం, ఇతర అంశాలు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు ప్లానెట్ 9 ►సౌర కుటుంబం చివరిలో ఉన్న నెప్ట్యూన్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 165 ఏళ్లు పడుతుంది. అదే ప్లూటోకు 248 ఏళ్లు, దాని అవతల ఉన్న మరుగుజ్జు గ్రహం ఎరిస్కు 558 ఏళ్లు, సెడ్నాకు 11,408 ఏళ్లు పడుతుంది. భిన్న వాదన కూడా ఉంది క్యూపియర్ బెల్ట్‌లోని కొన్ని మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల కక్ష్య, ఇతర అంశాలు భిన్నంగా ఉండటానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చని.. అక్కడ భారీ గ్రహం ఉండకపోవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ బ్లాక్ హోల్ అయితే? సౌర కుటుంబం ఆవల భారీ గ్రహం కాకుండా.. చిన్న స్థాయి బ్లాక్‌హోల్ ఉండి ఉండొచ్చని మరో ప్రతిపాదన కూడా ఉంది. ఆ బ్లాక్‌హోల్ ప్రభావం వల్లే కొన్ని ఆస్టరాయిడ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని 2020లో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రం వెలువరించారు. ఖగోళ వస్తువులను ఇన్ఫ్రారెడ్ తరంగాల ద్వారా కాకుండా.. ఎక్స్‌రే, గామా కిరణాల ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని సూచించారు. -
అదే జరిగితే ఇంటర్నెట్ బంద్
Solar Super Strom: ‘‘సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం’’ అంటూ గత కొంతకాలంగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం, సైంటిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జులై మధ్యలో ‘సౌర తుపాను’ దాటేసిందన్న కొన్ని మీడియా హౌజ్‌ల కథనాలు.. ఉత్తవేనని తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సౌర తుపాను ముప్పు మాత్రం భూమికి పొంచి ఉందని.. అది జరిగితే మాత్రం ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తోందని చెప్తున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి. ‘సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. ఇది కరోనా మహమ్మారిలాగే విరుచుకుపడొచ్చు’ అని ఆమె చెప్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని అబూ జ్యోతి చెబుతున్నారు. My SIGCOMM talk on the impact of solar superstorms on the Internet infrastructure is now online: https://t.co/L6Nl2Yygcs There were many interesting questions in the Q&A session. Paper: https://t.co/Wsv4RC2pbZ https://t.co/Y9ElvF7fTa — Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) August 29, 2021 సిగ్‌కామ్ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద ఆమె సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం విశేషం. చదవండి: సౌర తుపాన్‌తో అప్పుడు ఆఫీసులు కాలిపోయాయి కరోనా తరహాలోనే.. సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు చూపెడుతుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావొచ్చు అనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేం. ఒక రకంగా ఇది కరోనా మహమ్మారి లాంటిది. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదు. నష్టం కూడా ఊహించినదానికంటే భారీగానే ఉంటుంది అని ఆమె అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా సౌరతుపాను గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చని ఆమె అంటున్నారు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే చెప్తున్నారు. అయితే అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని చెప్తున్నారామె. సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. చదవండి: సౌర తుపాను వేగం ఎంతంటే.. -
Photo Story: జాలువారుతున్న కారుమబ్బులు
సాయం సంధ్యావేళ.. నింగిలో కారుమబ్బులు కమ్ముకోగా.. ఆకాశం నుంచి ఆ మబ్బులు ఇలా భూమిపైకి జాలువారుతున్నట్లు కనిపించాయి. కుమురం భీం జిల్లా కౌటాల సమీపంలో ఈ మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – చింతలమానెపల్లి భానుడి కిరణాలు.. బంగారు వర్ణాలు.. కారుమబ్బులను చీల్చుకుంటూ నీటిపై పడిన భానుడి కిరణాలు బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టు వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రం సూర్యకిరణాలతో ప్రాజెక్టు నీరు మొత్తం పసిడి వర్ణం పులుముకోగా చేపల కోసం వేటగాళ్లు పడవల్లో తిరుగుతుండడం.. చిత్రకారుడు గీసిన బొమ్మలా ఆకట్టుకుంది. – చింతలమానెపల్లి ఇవి కూడా చూడండి: సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు -
Photo Feature: రోడ్డెక్కిన రైతన్న.. సొంతూరికి జనం
కరోనాకు తోడు అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. వర్షాల కారణంగా నిండా మునిగామని, ఆదుకోవాలని పాలకులకు విన్నవించుకుంటున్నారు. కరోనా కట్టడికి దేశంలో అమలు చేస్తున్న ఆంక్షలతో నగరాల్లో ఉపాధి లేకపోవడంతో వలస కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. మరోవైపు సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు (సన్‌హాలో) బుధవారం కనువిందు చేసింది. -
వరదగూడు.. కనువిందు చేసెను చూడు!
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. ప్రచండ భానుడి చుట్టూ సప్తవర్ణశోభితమైన సుందర వలయం ఏర్పడింది. రాష్ట్రంలో సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు(సన్‌హాలో) బుధవారం మధ్యాహ్నం సుమారు గంట పాటు కనువిందు చేసింది. దీన్ని ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ‘వరదగూడు’గా పిలిచే ఈ పరిణామంతో ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ జనం చర్చించుకున్నారు. వాతావరణం గురించి తెలియని రోజుల్లో హాలో ఏర్పడితే వచ్చే 24 గంటల్లో వర్షం పడొచ్చని కూడా చెప్పుకొంటున్నారు. సన్ హాలో అంటే? సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడటాన్ని సన్ హాలో లేదా ‘22 డిగ్రీ హాలో’అని పిలుస్తారు. వాతావరణంలో ఉండే లక్షలాది షట్భుజాకారపు మంచు స్ఫటికాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెందడం వల్ల ఈ వలయాలు ఏర్పడతాయి. సూర్యుడి చుట్టూ దాదాపు 22 డిగ్రీల వ్యాసార్థంతో వలయం ఏర్పడుతుంది కాబట్టి దీనికి ‘22 డిగ్రీ హాలో’అని పేరు. ఎక్కడ ఏర్పడతాయి? ఆకాశంలో సిర్రస్ రకం మేఘాలు ఉన్నప్పు డు సన్‌హాలో ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ మేఘాలు పలుచగా, పోగుల్లా ఉంటాయి. వాతావరణంలో దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఈ మేఘాలు ఉంటాయి. వర్ణ పట్టక ప్రయోగం చిన్నప్పుడు చేసే ఉంటాం. త్రికోణాకారపు గాజు పట్టకం ఒకవైపు నుంచి కాంతి ప్రయాణించినప్పుడు ఇంకోవైపు ఉంచిన తెరపై ఏడు రంగులు కనపడటం గమనిస్తాం. ఇప్పుడు సూర్యుడి కిరణాలు పైనుంచి కిందకు వస్తున్న మార్గంలో సిర్రస్ మేఘాలను ఊహించుకోండి. ఆ మేఘాల్లోని ఒక్కో మంచు స్ఫటికం ఒక పట్టకంలా ప్రవర్తిస్తుంది. అంటే పైనుంచి వస్తున్న సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోతుంది. అదే సమయం లో పక్కపక్కన ఉన్న మంచు స్ఫటికాల ద్వారా ఈ కాంతి ప్రతిఫలిస్తుంది. వక్రీభవనం, ప్రతిఫలించడం అన్న రెండు దృగ్విషయాల కారణంగా కాంతి ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించి హాలో ఏర్పడుతుందన్నమాట. జాబిల్లి చుట్టూ కూడా.. హాలోలు ఏర్పడటం సూర్యుడికి మాత్రమే పరిమితం కాదు. రాత్రివేళల్లో జాబిల్లికీ ఏర్పడుతుంటాయి. వాయు కాలుష్యమో.. లేదా ఇంకో కారణమో స్పష్టంగా తెలియదు కానీ.. ఇటీవల జాబిల్లి చుట్టూ ఏర్పడే హాలోలు చాలా అరుదు. ఇంద్రధనుస్సు మాదిరిగానే హాలోలను కూడా నేరుగా చూడొచ్చు. కొంతవరకు తెల్లగా కనిపించినా తగిన కోణం నుంచి చూసినప్పుడు సప్తవర్ణాలు ఆవిష్కృతం అవుతాయి. -
ఆకాశం లో అద్భుతం
-
వైరల్ వీడియో: సూర్యుని చుట్టూ వలయం!
-
Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అద్భుతమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆకాశంలో బుధవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘సన్ హాలో’ అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. సన్‌హాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో చాలా స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగానే ఇంద్రధనస్సు దర్శనమిచ్చిందంటూ నగర వాసులు మురిసిపోతున్నారు. వర్షం కారణంగా, వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయనీ, అవి క్రిస్టల్స్‌గా మారతాయని, క్రిస్టల్స్‌గా మారిన నీటి బిందువులలో సూర్యుడి కాంతి ప్రసంరించినప్పుడు ఇలా రెయిన్ బో ఏర్పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
జీరో షాడో డే
భానుగుడి (కాకినాడ సిటీ): సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆవిష్కృతమయ్యే అరుదైన ఖగోళ దృగ్విషయం ‘జీరో షాడో డే’. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. ఇది ఏర్పడే మే నెల మొదటి వారంలోని రెండురోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.10 గంటల వరకు ఏ వస్తువు నీడ భూమిపై పడదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిని సాంకేతికంగా నిరూపించి, జూమ్ యాప్ ద్వారా విద్యార్థులందరికీ విశదీకరించారు. రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులం ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు కూచిపూడి గుర్రయ్య విద్యార్థులతో ఈ ప్రయోగాన్ని చేయించారు. కాజులూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పంపన కృష్ణమూర్తి విద్యార్థులతో ఈ ప్రయోగం నిర్వహించి, ఇంటర్నెట్ ద్వారా మిగిలిన విద్యార్థులందరితో పంచుకున్నారు. ఎస్సీఈఆర్టీ సాంఘిక శాస్త్ర పుస్తక రచయిత, ప్రధానోపాధ్యాయుడు రాకుర్తి త్రిమూర్తులు పాఠశాల విద్యార్థులతో ప్రయోగాలు నిర్వహించి విషయాన్ని విశదీకరించారు. -
చందమామకు తోక ఉంది తెలుసా?
తోకచుక్కలు మనందరికీ తెలుసు. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండే తోకచుక్కలు.. సూర్యుడి దగ్గరికి వచ్చే కొద్దీ తోక పెరు గుతూ ఉండటం తెలిసిందే. కానీ, మనం రోజూ చూసే చందమామకు కూడా తోక ఉంది తెలుసా? చిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమే.. చంద్రుడికి కూడా తోక ఉందని, భూమిచుట్టూ తిరుగుతున్న సమయంలో సూర్యుడివైపు వెళ్లినప్పుడల్లా ఆ తోక ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బోస్టన్ వర్సిటీ విడుదల చేసిన చిత్రం సాధారణంగా తోకచుక్కలపై ఉండే మంచు, చిన్న చిన్న రాళ్లు, దుమ్ము, వంటివి సౌర వికిరణాలకు చెదిరిపోయి వెనుక తోకగా ఏర్పడుతాయి. వాటిపై సూర్య కాంతి పడి పరావర్తనం చెందడంతో పొడుగ్గా తోకలాగా మనకు కనిపిస్తాయి. కానీ చంద్రుడికి ఏర్పడుతున్న తోక మాత్రం అలాంటి దుమ్ము, మంచుతో కాకుండా.. సోడియం అణువులతో తయారవుతోందని ఈ అంశంపై పరిశోధన చేస్తున్న బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెఫరీ తెలిపారు. అందుకే అది మన సాధారణ కంటికి కనిపించడం లేదని.. ప్రత్యేక కెమెరాలు, టెలిస్కోపులతో చూడవచ్చని చెప్పారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల.. సౌర కాంతి రేడియేషన్ నేరుగా ఎఫెక్ట్ చూపిస్తుందని, దానికితోడు నిత్యం ఢీకొట్టే ఉల్కతో చంద్రుడి ఉపరితలంపై సోడియం అణువులు పైకి ఎగుస్తున్నాయని వివరించారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ తోక చిన్న చిన్నగా ఏమీ లేదట. ఏకంగా ఐదారు లక్షల కిలోమీటర్ల పొడవునా ఏర్పడుతోందని గుర్తించారు. సూర్యుడికి, భూమికి మధ్య ప్రాంతంలోకి చంద్రుడు వచి్చనప్పుడు.. ఈ తోకలోని సోడియం అణువులు భూమివైపు కూడా వస్తాయని, కానీ మన వాతావరణం వాటిని అడ్డుకుంటోందని తేల్చారు. -
10 బిలియన్ ఏళ్ల రాతి గ్రహం.. మండుతున్న గోళంలా..
భూమిని పోలిసి ఓ రాతి గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే 50 శాతం, మూడు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న అత్యంత వేడి, రాతి గ్రహంగా నాసా టెస్ మిషన్(ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) కనుగొంది. అయితే ఇది భూమికి సమాన సాంద్రతలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి TOI-561b అని పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నందున దీనిని ఎక్స్ప్లానెట్గా నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. సూపర్ ఎర్త్‌గా పలిచే ఈ గ్రహం సూర్యునిలా ఎర్రగా, మండిపోతున్న గోళంలా కనిపిస్తోంది. మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈ నాటిది కాదని, ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా నాసా పేర్కొంది. అంటే.. ఈ గ్రహం వయస్సు దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం (TOI-561b) రాతి ప్రపంచంలో ఉంటుందని, ఇది భూమికి మూడంతలు పెద్దదిగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 24 గంటలకు కంటే ఎక్కువ సమయంలో ఈ గ్రహం స్టార్ కక్ష్యలో తిరుగుతుందట. అందువల్లే దీనిని సూపర్ ఎర్త్‌గా పేర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నాసా ప్రకారం.. విశ్వంలో చాలా వరకు రాతి గ్రహాలు ఏర్పడి ఉండవచ్చని, ఈ TOI-561b అనేది పురాతన రాతి గ్రహాలలో ఒకటై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు. పాలపుంతలోని ప్రధాన నక్షత్రాలకు మొదటి నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోందని, సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు. ఈ పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనదిగా నాసా వివరించింది. -
'సన్'మోహన దృశ్యం
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో రంగుల వృత్తం ఏర్పడింది. వలయం చుట్టూ నీలం రంగులో నిలువెత్తు కిరణాలు వెలువడ్డాయి. దీనిని అంతా ఆసక్తిగా చూసారు. దీనిపై ఖగోళ శాస్త్రవేత్త కంబాల రవికుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో వాతావరణం చల్లబడిన తర్వాత ఈ తరహా వలయాలు ఏర్పడతాయన్నారు. నదీ పరివాహక, సముద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడతాయన్నారు. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి వాతావరణంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాకారం -
వైరల్‌గా మారిన సూర్యుడి వీడియో..
వాషింగ్టన్ : ‘నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్’ సూర్యునికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. నాసా గొడ్డార్డ్ అధికారిక యూట్యూబ్ ఖాతాలో గురువారం విడుదలైన ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పది సంవత్సరాల కాలంలో సూర్యుడిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన వీడియో ఇది. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించారు. సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు, చోటు చేసుకున్న మార్పులను ఓ క్రమానుసారంగా వీడియోలో పొందుపరిచారు. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్ గిగాబైట్ల డేటా ఖర్చయింది. ( సూర్యుడు కూడా ‘లాక్డౌన్’!) ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 6.7లక్షల వ్యూస్‌ను.. 7,800 లైక్స్, 450 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియో అద్భుతంగా ఉంది... దీన్ని చూస్తున్నపుడు నాకు తెలియకుండానే నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది... ఈ పదేళ్లలో సూర్యుడిలో మంటలు పెరగటం గమనించవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( నింగిలోకి సోలార్ ఆర్బిటర్) -
సూర్యుడు కూడా ‘లాక్డౌన్’!
సాక్షి, న్యూఢిల్లీ : 930 లక్షల మైళ్ల దూరంలోని సూర్యుడి అంతర్భాగాన నిరంతరం సుడులు తిరిగే మంటలు, ఉపరితలానికి ఎగిసి పడుతుండే అగ్ని జ్వాలలు, సూర్య గోళం చుట్టూ ఆవిష్కృతమయ్యే అయస్కాంత క్షేత్రాలు హఠాత్తుగా తగ్గిపోయాయి. పర్యవసానంగా భూమిపైకి ప్రసరించే పలు రకాల కిరణాల వాడి కూడా తగ్గింది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు భయపడి ప్రపంచ మానవాళి ‘లాక్డౌన్’లోకి వెళ్లినట్లుగా సూర్యుడు కూడా లాక్డౌన్లో విశ్రాంతి తీసుకుంటున్నాడేమోనని ‘రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ’ అధికారులు వ్యాఖ్యానించారు. (లాక్డౌన్: మరో రెండు వారాలు పొడిగించండి) 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సూర్యగోళం కాస్త నెమ్మదించడం కొత్తేమి కాదని, దీన్ని ‘సోలార్ మినిమమ్’గా వ్యవహరిస్తారని రాయల్ సొసైటీ అధికారులు వివరించారు. సూర్యుడు తన నిర్దేశిత మార్గంలో సంచరిస్తున్నప్పుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడం కనిపిస్తుందని, అప్పుడు భూమి మీద ప్రసరించే కిరణాల వేడి కూడా తక్కువగా ఉంటుందని వారు చెప్పారు. ఈసారి కరోనా విజంభించడానికి, సూర్యుడిలో ఈ మార్పు రావడానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. (వైరస్‌లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి) సూర్యుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడాన్ని 17వ శతాబ్దం నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేస్తున్నారని వారు చెప్పారు. సూర్యుడిలో మంటలు తగ్గిన చోటు నల్లటి మచ్చగా కనిపిస్తుందని, అలా సూర్యుడిలో పలు మచ్చలు ఏర్పడడం, మళ్లీ అవి కనిపించక పోవడం కూడా సహజమేనని తెలిపారు. సూర్యుడు బాగా నెమ్మదించినప్పుడు భూగోళంపై భారీగా మంచు కురిసిందని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు. బాగా మంచు కురియడాన్ని ‘మంచు యుగం’గా పేర్కొన్నారు. అలా మూడు మంచు యుగాలు ఏర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. మంచు యుగాల సమయంలోనే సముద్రాలు గడ్డ గట్టిపోయి ఖండాలు కలసి పోవడంతో ప్రజలు ఖండాంతర వలసలు పోయారని మానవ నాగరికత చరిత్ర తెలియజేస్తోంది. (‘తెల్లగా, సూట్‌కేస్ సైజ్‌లో ఉంది’) -
సూర్యుడు- ఆయన భార్యలు
త్వష్టప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి. ఈమెకే ఉష అని కూడా పేరు. ఈమె సూర్యభగవానుడి భార్య. సూర్యుడి చురుకుదనాన్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకుంది ఉష. కానీ పెళ్లి అయి కొంతకాలం గడిచాక భర్త నుంచి వెలువడే వెలుగు, వేడిని భరించలేకపోయింది. ఆయన తీక్షణత తగ్గించమని ఒకటి రెండుసార్లు అడిగి చూసింది. అది తన సహజ లక్షణ మనీ, తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు సూర్యుడు. కొంతకాలం ఎలాగో భరించింది. వైవస్వతుడు, యముడు, యమి అనే సంతానం కలిగారు. ఆ తర్వాత ఆమెలో మరల మునుపటి మార్పు వచ్చింది. తన కోసం వెలుగునూ, వేడినీ తగ్గించుకోమని భర్తను అడిగిందామె. ఎప్పటిలాగే తనని సహిస్తూ, సహధర్మచారిణిగా సహజీవనం చేయాలని నచ్చచెప్పాడు సూర్యుడు. సరేనని తలాడించిందామె. అయితే, తనకు ప్రస్తుతం అమ్మానాన్నల మీద మనసు మళ్లిందనీ, కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనం కట్టిందామె. భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకూ ఆయనకూ మనస్పర్థలంటూ ఏమీ లేవు పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమ అని తెలుసామెకు. అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలి కానీ, భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంది. దాంతో ఒక ఆలోచన వచ్చిందామెకు. ముమ్మూర్తులా తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టి, తనలాగే ప్రవర్తిస్తూ, తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది. అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది. సంజ్ఞాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్లింది. అక్కడొక అడవిలో అశ్వరూపంతో ఉండి యథేచ్ఛగా సంచరించసాగింది. అలా కొంతకాలం గడిచింది. తర్వాత నారద మహర్షి ప్రబోధ ప్రోద్బలాలతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది. ఫలితంగా ఆమెకి శనైశ్చరుడు, సావర్ణి మనువు, తపతి పుట్టారు. మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది. దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంజ్ఞా సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది. వైవస్వతుడు, యముడు, యమున లకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వెళ్లాడు. మునుపటిలా తమను ప్రేమగా చూడడటం లేదేమని అడిగాడు. ఛాయ కోపంతో ఈసడించుకుని యముణ్ణి తీవ్రంగా మందలించింది. యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ, యముణ్ణి భయంకరంగా శపించింది. చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు. కన్నతల్లి ఏమిటి, కన్నబిడ్డలను శపించడమేమిటనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంజ్ఞను కాదనీ, ఆమె ప్రతిరూపమైన ఛాయననీ, సంజ్ఞాదేవి అజ్ఞలాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయాననే విషయాన్ని వివరించింది ఛాయ. చిత్రంగా సూర్యభగవానుడికి ఇద్దరి మీదా కోపం రాలేదు. తన కాంతిని భరించలేకనే కదా, సంజ్ఞ తనను వీడి వెళ్లిపోయింది... వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్లింది... అనుకున్నాడు. సంజ్ఞపైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయి. ఆమెను వెదుక్కుంటూ వెళ్లాడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు. ఆ హయమే తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగ గుర్రం రూపం ధరించాడు. భర్తను గుర్తించిన సంజ్ఞ ఆనందంగా ఆయనను చేరుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలూ, మరొక కుమారుడూ కలిగారు. ఆ కవలలే అశ్వినీ దేవతలుగా... దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు. వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు. తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంజ్ఞకు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది. సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్లింది. ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్లి, తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్నీ, శక్తి అనే ఆయుధాన్నీ తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడికి, శక్తిని పార్వతికీ ఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది. తనకోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గడం, దానికితోడు ఆయన తనకు తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంజ్ఞకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయాసంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి చాలా ఉంది. అదేమిటంటే... కాపురమన్నాక కలతలు, కలహాలు, పొరపచ్ఛాలు సహజం. అయితే, వాటిని పరిష్కరించుకోవడంలోనే మన విజ్ఞత, సమయస్ఫూర్తి బయట పడతాయి. ప్రణయ కలహాలు లేని కాపురం ఉప్పులేని పప్పు వంటిదని పెద్దలు అందుకే అంటారు కాబోలు. –డి.వి.ఆర్. భాస్కర్ -
నింగిలోకి సోలార్ ఆర్బిటర్
వాషింగ్టన్: అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడి ధృవాల చిత్రాలను మనకు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లు సంయుక్తంగా తయారు చేసిన సోలార్ ఆర్బిటర్ అంతరిక్ష నౌక సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు రూ.10 వేల కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అలియన్స్ అట్లాస్–వీ రాకెట్ సాయంతో నింగిలోకి పంపినట్లు నాసా తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైన సంకేతాలు జర్మనీలోని యురోపియన్ స్పేస్ సెంటర్‌కు అంతరిక్ష నౌక నుంచి వచ్చినట్లు నాసా తెలిపింది. ప్రయోగించిన రెండు రోజుల తర్వాత ఈ సోలార్ ఆర్బిటార్ భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడే పరికరాలైన ‘బూమ్’, పలు ఆంటెన్నాలను అంతరిక్షంలో విచ్చుకుంటాయి. సూర్యుడి ఫొటోలను తీసేందుకు ఈ ఆర్బిటార్ బుధగ్రహం కక్ష్యలో తిరగనుంది. బుధగ్రహం చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు మానవుడు కనిపెట్టని సూర్యుడి ధృవాల చిత్రాలను తీయనుంది. -
భగభగల సూరీడు.. ఇలా!
ఫొటో చూశారుగా... కుతకుత ఉడుకుతున్న సూరీడి ఉపరితలం ఛాయాచిత్రమిది. అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఏర్పాటైన సరికొత్త ‘ద ఐనోయీ సోలార్ టెలిస్కోపు’తో తీశారు. సూర్యుడి ఉపరితలం మొత్తం ఇలాగే ఉంటుందని.. కణాల్లాంటి భాగాలు అక్కడి చర్యల తీవ్రతకు ప్రతీకలని అంచనా. సూర్యుడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఈ టెలిస్కోపు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. సూర్యుడిపై జరిగే కార్యకలాపాలు భూ వాతావరణంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. సూర్యుడి ఉపరితలంపై సంభవించే పేలుళ్ల కారణంగా అయస్కాంత ధర్మం కలిగిన తుపానుల్లాంటివి చెలరేగుతుంటాయి. ఇవి కాస్తా భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై దుష్ప్రభావం చూపడంతోపాటు అవి పనిచేయకుండా చేసే చాన్సుంది. జీపీఎస్ వంటి వ్యవస్థలను నాశనం చేసేందుకు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలను దెబ్బతీసేందుకూ సౌర తుపానులు కారణమవుతాయని దీన్ని ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ ఫ్రాన్స్ కోర్డోవా తెలిపారు. సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీరుతెన్నులను ఐనోయీ టెలిస్కోపు వివరణాత్మకంగా తెలుసుకోగలదని, భవిష్యత్తులో సౌర తుపానులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం సౌర తుపానులు ఏర్పడేందుకు 48 నిమిషాల ముందు మాత్రమే మనకు తెలుస్తోంది. కొత్త టెలిస్కోపు సాయంతో 48 గంటల ముందుగానే తెలుసుకోవచ్చు. -
వచ్చే ఐదేళ్లూ సెగలే!
లండన్: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్ల పాటు సూర్యుడు సెగలు పుట్టించనున్నాడు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.60 డిగ్రీల వరకు పెరుగుతుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత వేడితో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతుందని హెచ్చరించింది. దీని కారణంగా పారిస్ ఒప్పందానికి ఉల్లంఘనలు తప్పవని తెలిపింది. ఇప్పటివరకు అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన 2016 సంవత్సర రికార్డు రానున్న ఐదేళ్లలో మాసిపోతుందని పేర్కొంది. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ప్రాంతాలు అధిక వేడికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. కేవలం ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతలు పెరిగితేనే కార్చిచ్చులు, కరువు ఇతర అనర్థాలు జరుగుతున్నాయని, అలాంటిది రానున్న ఐదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఎలాంటి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
సూర్యుడి అరుదైన, అద్భుత ఫొటోలు
వాషింగ్టన్: సూర్యుడికి సంబంధించిన అత్యంత అరుదైన ఫొటోలను అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సోలార్ టెలిస్కోప్‌గా ప్రసిద్ధి పొందిన డేనియల్ కే ఇనౌయే సోలార్ టెలిస్కోప్(డీకేఐఎస్‌టీ) అద్భుత ఆవిష్కారానికి కారణమైంది. దీని ద్వారా సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అరుదైన ఫొటోలను చూసే అవకాశం మానవాళికి దక్కింది. కాగా హవాయి ద్వీపంలో ఏర్పాటు చేసిన ఈ భారీ టెలిస్కోపు ద్వారా సూర్యుడిని అత్యంత సమీపంగా చూస్తూ.. అంతర్గత శక్తిని అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆస్ట్రోనాట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది విడుదల చేసిన ఫొటోల ఆధారంగా.. సూర్యడి ఉపరితలం మీది కణాల వంటి ఆకారాలను జూమ్ చేయగా.. ఒక్కోటి అమెరికా రాష్ట్రం టెక్సాస్ పరిమాణంలో ఉందని తెలిపారు. ఇక వీటిని విశ్లేషించడం ద్వారా సూర్యుడి నుంచి వెదజల్లబడుతున్న శక్తిమంతమైన కాంతి కిరణాలు, జ్వాలల ఉత్పన్నానికి కారణాల్ని కనుగొనవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా సదరు జ్వాలల కారణంగా ఉపగ్రహాలు, పవర్గ్రిడ్లు ధ్వంసం కాకుండా సత్వరమే హెచ్చరికలు జారీ చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. కాగా సూర్యుడి ఉపరితలంపై గల పలు రహస్యాలను తెలుసుకునేందుకు డీకేఐఎస్‌టీ రూపకల్పన జరిగింది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు లక్షలాది రెట్లు వేడిగా ఉంటుంది, అంతరిక్షంలో వేడి గాల్పులకు కారణమవుతున్న అంశాల గురించి అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. The NSF's Inouye Solar Telescope provides unprecedented close-ups of the sun’s surface, but ultimately it will measure the sun’s corona – no total solar eclipse required. 😎 More: https://t.co/UsOrXJHaY1 #SolarVision2020 pic.twitter.com/DO0vf9ZzKC — National Science Foundation (@NSF) January 29, 2020 -
ఉత్తరాయణం మహా పుణ్యకాలం
మకర సంక్రాంతి పర్వదినంతో ఉత్తరాయణం మొదలయింది. మొన్నటివరకూ మనం సంకల్పంలో దక్షిణాయనే అని చెప్పుకున్నాం. సంక్రాంతినుంచి ఉత్తరాయణం అని చెప్పుకుంటున్నాం. ఉత్తరాయణానికి పుణ్యకాలం అని పేరు. అలా ఎందుకంటారో, ఈ పుణ్యకాలంలో మనం ఆచరించవలసిన విధులేమిటో తెలుసుకుందాం.. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. దక్షిణాయణానికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ రెండు ఆయనాల మధ్య ఈ వైరుధ్య వైవిధ్యాలేమిటో తెలుసుకునేముందు ఆయనం అంటే ఏమిటో అవలోకిద్దాం. ఆయనం అంటే పయనించడం అని, ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. అయితే, సూర్యుడు సంవత్సరంలో ఆర్నెలలు దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఉత్తరదిశగానూ పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉత్తరాయణం జనవరి 14 లేదా 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) ఉత్తరాయణంలో పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుండడం వలన పుణ్య క్షేత్ర సందర్శనలు, తీర్థయాత్రలకు అనువుగా వుంటుంది... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం వల్ల, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్ల, శరీరంలో ఉత్తర భాగాన్ని విశిష్టమైనదిగా భావించడం వల్ల, మన భారతీయ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్ల, అన్ని భాషలకూ అమ్మగా, రాజభాషగా, దేవభాషగా చెప్పుకునే సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం వల్ల, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస స్థానాలు కావటం వల్ల, ముఖ్యంగా సూర్యభగవానుడు ఉత్తర ప«థ చలనం చేయడం వల్ల... ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించి గౌరవించారు పెద్దలు. అంతేగాక, కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు. ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి, పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారనీ, ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు అవుతారని, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అనీ విజ్ఞానశాస్త్రం కూడా చెబుతోంది. బహుశా ఇందుకేనేమో ఉత్తరాయణ కాలం పుణ్య కాలం అయింది.భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రింబగళ్లు ఉంటాయి. సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారు. ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. వామనావతార ఘట్టంలో వామనుడికి బలి మూడడగుల నేలను దానం చేశాడని, ఆ మూడడుగులతో ముల్లోకాలకూ వ్యాపించి బ్రహ్మాండమంతా తన రెండడుగులతోనే కొలిచి, మూడవపాదాన్ని బలి శిరస్సున మోపి పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలంలోనేనని గరుడపురాణం పేర్కొంటోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదే. ఈ దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని విశ్వాసం. -
సూర్యుడు ఓం అంటున్నాడు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ ట్వీట్‌ను 7వేల మందికి పైగా రీట్వీట్ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్ మోదీజీ.. వాహ్’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్ చేసింది. -
సూర్యగ్రహణం కనువిందు
-
ముగిసిన సూర్యగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం ముగిసింది. నేటి (గురువారం) ఉదయం 8 గంటల 8నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం 11 గంటల 11నిమిషాలకు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సప్తవర్ణాలతో సూర్యుడు వీక్షకులకు కనువిందు చేశాడు. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్, సౌదీ, సింగపూర్ దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తోంది. సంపూర్ణ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్‌గా సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఆ సమయంలో చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కనిపించనున్నాయి. హైదరాబాద్‌లో ముప్పావు వంతు మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, పిళికుల్ల, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదికాలంలో ఇది మూడో సూర్యగ్రహణం. తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు సూర్యగ్రహణం ముగియడంతో సంప్రోక్షణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మూసివేశారు. 13 గంటలపాటు మూసివేసిన శ్రీవారి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తెరుచుకోనున్నాయి. ఆలయ సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల కోసం శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది. అధిక రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలనూ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా నేడు తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయాన్ని మూసివేశారు. నిన్నరాత్రి 8 గంటల నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఇవాళ ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. 3 గంటల నుంచి వ్రతాలు, దర్శనాలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సైతం అర్చకులు మూసివేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయాన్ని అర్చకులు తిరిగి తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం 3:30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని మూసిశారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి.. ఈ ఆలయాలు తిరిగి తెరువనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిన నాసా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ అపురూప దృశ్యాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. సాధారణంగా కంటే ఎన్నో రెట్లు అధికంగా వెలుగులు జిమ్ముతున్న గుండ్రటి గుమ్మడికాయ ఆకారాన్ని పోలిఉన్న సూర్యుడి చిత్రాన్ని నాసా పోస్ట్ చేసింది. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా భాగంలో ఉండే తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలు కారణంగా సూర్యుడు వెలిగిపోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, 73, 193 ఆంగ్స్ట్రాంగ్ల యూనిట్ల అతినీలలోహిత కిరణాల కలయిక కారణంగా ఇమేజ్ అంత కాంతివంతంగా వచ్చినట్లు నాసా పేర్కొంది. సాధారణంగా ఆంగ్స్ట్రామ్స్ బంగారం, పసుపు రంగులలో హాలోవీన్ రూపాన్ని ఏర్పడటానికి ఉపయోగపడుతుందని తెలిపింది. కాగా హాలోవీన్ రూపంలో అద్భుతమైన ఈ దృశ్యాన్ని అందరూ తమ వద్ద భద్రపరుచుకోవాలని నాసా పిలుపునిచ్చింది. సూర్యుడిని నిత్యం గమనిస్తున్న నాసా సోలార్ డైనమిక్ ఆబ్సర్వేటరీ ఈ చిత్రాన్ని తీసింది. -
ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!
సూళ్లూరుపేట: భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాదే దీనిపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్ ప్రోబ్ అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీని తర్వాత ఇస్రో–నాసా కలిసి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్ స్పేస్ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముంటుందని గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఉపగ్రహంలో యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనాలో వేడి పెరుగుదలకు గల కారణాలపై పరిశోధనలు సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల కెల్విన్స్ ఉంటుంది. సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల కెల్విన్స్ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1తో పరిశోధనలు చేస్తారు. సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై కూడా పరిశోధనలు చేయడానికి ఇస్రో–నాసాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని కూడా అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. సౌరగోళాన్ని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో అమర్చబోయే ఆరు పరికరాలు. (ఊహాచిత్రం) బెంగళూరులోని ఉపగ్రహాల తయారీకేంద్రంలో ఈ ఉపగ్రహాన్ని తయారుచేసేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని మీడియా సమావేశాల్లో పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1లను అత్యంత తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి విజయం సాధించారు. తాజాగా చంద్రయాన్–2 మిషన్‌ను కూడా అత్యంత తక్కువ వ్యయంతో గత నెల 22న ప్రయోగించి మొదటిదశను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చంద్రయాన్–2 మిషన్ చంద్రుడి వైపునకు ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. మూడు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో.. నాలుగో గ్రహాంతర ప్రయోగమైన ఆదిత్య–ఎల్1ను కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. -
తదుపరి లక్ష్యం సూర్యుడే!
సూళ్లూరుపేట: భారత, అమెరికా అంత రిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాదే దీనిపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్ ప్రోబ్ అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీని తర్వాత ఇస్రో–నాసా కలిసి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్ స్పేస్ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముం టుందని గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవు తుందని భావిస్తున్నారు. సూర్యుడి వెలు పలి వలయాన్ని కరోనా అంటారు. అక్కడ దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1తో పరిశోధనలు చేస్తారు. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.