లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాల్ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఫీజు కట్టనందుకు టీచర్లు తమను రోజంతా ఎండలోనే కూర్చోబెట్టారని ఓ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. పరీక్షలు కూడా రాయనివ్వలేదని వాపోయింది. ఫీజు విషయంపై తల్లిదండ్రులకు చెప్పానని, వారు ఒక్కరోజులో చెల్లిస్తామన్నారని పేర్కొంది. ఈ విషయం టీచర్లకు చెప్పినా వినిపించుకోకుండా తమకు ఈ శిక్ష విధించారని రోదించింది.
यूपी : उन्नाव के एक प्राइवेट स्कूल में बच्चों की फीस नहीं पहुंची तो पूरा दिन धूप में खड़ा रखा गया
— Nigar Parveen (@NigarNawab) October 17, 2022
एग्जाम नहीं देने दिया, कब हम फ्री स्कूल-अस्पताल पर बात करेंगे? pic.twitter.com/KrBDnL6ity
పిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చొబెట్టిన పాఠశాల యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.
చదవండి: క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా..
Comments
Please login to add a commentAdd a comment