School fee
-
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్‌గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్‌ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్‌గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్‌లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్‌కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్‌తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్‌ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
ఫీజుల ‘మోత’..‘నా కుమారుడి ప్లేస్కూల్ ఫీజు రూ.4.3 లక్షలు’
న్యూఢిల్లీ : అక్షరాల రూ.4.3లక్షల ఫీజు. ఇది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో కాదు. ప్లేస్కూల్!! కోసం. అవును మీరు విన్నది కరెక్టే కొత్త విద్యా సంవత్సరం వస్తోంది. అప్పుడే దోపిడీ ప్రణాళిక కూడా మొదలైంది. గత ఏడాది కంటే 40 శాతం నుంచి 50 శాతం వసూలు చేసేందుకు ఢిల్లీ కార్పొరేట్ స్కూల్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల్ని అష్టకష్టాలు పడుతున్న పేరెంట్స్ చివరికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తమ పిల్లల స్కూల్ ఫీజు రసీదులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. My son's Playschool fee is more than my entire education expense :) I hope vo ache se khelna seekhle yaha! pic.twitter.com/PVgfvwQDuy — Akash Kumar (@AkashTrader) April 12, 2024 ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన కుమారుడు ప్లేస్కూల్ ఫీజు గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను మొత్తం చదివిన చదువుకు ఎంత ఫీజు చెల్లించానో.. అంతకంటే ఎక్కువగా నా కుమారుడు ప్లేస్కూల్ కోసం చెల్లిస్తున్నాను. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఫీజు రిసిప్ట్‌ను సైతం ట్వీట్లో చేశారు. అందులో ఏప్రిల్ 2024 - మార్చి 2025 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఫీ - రూ.10వేలు ఏడాది ఫీజు - రూ.25వేలు టర్మ్-1 (ఏప్రిల్ - జూన్ 2024) - రూ.98,750 టర్మ్-2 (జులై- సెప్టెంబర్ 2024) - రూ.98,750 టర్మ్-3 ( అక్టోబర్ -డిసెంబర్ 2024) - రూ.98,750 టర్మ్ -4 ( జనవరి - మార్చ్ 2025) - రూ.98,750 టోటల్ ఫీజు - రూ.4,40,000 అంటూ స్కూల్ ఫీజు గురించి షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ స్టోరీ పోస్ట్ చేసే సమయానికి 2.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ట్వీట్‌పై ఢిల్లీలోని అనేక మంది తల్లిదండ్రులు తమ అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. గుర్గావ్లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ. 30,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆ లెక్కన అతను ఇంటర్ వచ్చేసరికి ఆ మొత్తం సంవత్సరానికి రూ. 9 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. -
బరితెగించిన ‘భాష్యం’!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే బడికి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అనుమతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పిల్లల నిర్బంధం పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు. తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాల ఇన్చార్జ్ అనిల్‌కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డారు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
లక్షల్లో నర్సరీ ఫీజు.. పేరెంట్ ఓరియెంటేషన్ చార్జీలు అదనం..!
కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలని తల్లిదండ్రులకు మెసెజ్ వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది. ఉప్పల్ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చాలా వాటితో పోలిస్తే అక్కడ కొంత రుసుములు తక్కువనే పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. పాఠశాల ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. డిజీ తరగతులు, ఏసీ క్లాస్‌రూం, టెక్నాలజీ నేర్పుతున్నామని చెబుతూ యాజమాన్యాలు లక్షల్లో బాదుతున్నారు. అవి ఎందుకు కడుతున్నారో తల్లిదండ్రులకు సరైన వివరాలు అందుబాటులో ఉండవు. పాఠశాల యాజమాన్యం ఫలానా మొత్తం చెల్లించాలని చెప్పగానే.. వీలైతే కొంత బేరమాడి, లేదంటే వారు చెప్పినంత ముట్టజెప్పడం అలవాటైంది. కానీ పాఠశాలకు చెల్లిస్తున్న ఫీజులో అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ట్రావెల్ చార్జీలు, కాషన్ మనీ, వార్షిక చార్జీలు.. ఇలా రకరకాలుగా విభజించి తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. తాజాగా ఓ స్కూల్ యాజమాన్యం 2024-25 విద్యాసంవత్సరానికిగాను నర్సరీ, జూనియర్ కేజీకి ఏకంగా రూ.1,51,656 వసూలు చేస్తుంది. అందుకు అదనంగా ‘పేరెంట్ ఓరియంటేషన్’ పేరుతో రూ.8,400 చెల్లించాలని కోరింది. అయితే అందుకు సంబంధించిన ఫీజు వివరాలతో ఉన్న కాపీ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. अब समझ आ रहा है, पिता जी ने मुझे सरकारी स्कूल में क्यों पढ़ाया था 😭 pic.twitter.com/fkyPlDT6WP — Raja Babu (@GaurangBhardwa1) December 7, 2023 ఫీజుల వినియోగం ఇలా... విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు... వసూలు చేసిన ఫీజులను ఎలా వినియోగించాలో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: ఆ సిటీలో 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్ స్థలం నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్‌కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి. అలాగే ఆయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల సమాచారాన్ని విద్యాశాఖకు తెలియజేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాసంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలి. -
ఈ స్కూళ్లో ఫీజులుండవు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉన్న ‘అక్షర్ స్కూల్’ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూల్లో ఫీజులకు బదులు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటారు. పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు ఈ స్కూల్‌ను స్థాపించారు. ఫీజుల రూపంలో వచ్చిన బాటిల్స్‌ను వివిధ రూపాల్లో పునర్వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ను ఎలా రీసైకిల్ చేయాలో విద్యార్థులకు నేర్పుతున్నారు. నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఈ స్కూల్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ‘గుడ్ ఐడియా’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు. If this doesn't surprise you, what does?#Incredible_NorthEast Credit: northeastview_ pic.twitter.com/6RO1SqhaNa — Temjen Imna Along (@AlongImna) October 12, 2023 -
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్ వెబ్సైట్లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఫీజుల వివరాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యా సంస్థ నిర్వాహకుడు లేదా కరస్పాండెంట్ అధ్యక్షుడుగా ఉండాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్ ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడాదిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఫీజులో యాజమాన్య ఆదాయం 5 శాతం, స్కూల్ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతాలకు 50 శాతం, పాఠశాల ఉద్యోగుల గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్ చేత ఆడిట్ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
Telangana: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు.. ఎల్కేజీకి లక్షన్నర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు ఈసారి ఫీజులు భారీగా పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని బడుల్లో ఏకంగా 50 శాతం వరకూ ఫీజులు పెంచారని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత గత ఏడాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని తల్లిదండ్రుల నుంచి అందినంతా దోచేస్తున్నాయి. అదీగాక, సగం ఫీజును ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అంటూ అదనపు బాదుడు సరేసరి. ఇంకోవైపు డీజిల్ ధర విపరీతంగా పెరిగిందంటూ రవాణా చార్జీలూ 30 శాతం వరకూ పెంచారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా అంతంతమాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. చదవండి: కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్.. నియంత్రణ ఏమైనట్టు? ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. దీంతో ఫీజుల నియంత్రణ కోసం 2016లో ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. స్కూల్లో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకూ పెంచుతున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఇష్టానుసారం కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని కమిటీ సూచించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ విధానం కనుమరుగు... రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఫీజుల నియంత్రణను బడ్జెట్ స్కూళ్లు (వార్షిక ఫీజు రూ. 20 వేలలోపు ఉండేవి) స్వాగతించాయి. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15% ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇక్కడే సమస్య వస్తోంది. పెద్ద స్కూళ్లు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతీ గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపి 25 శాతం ఫీజు పెంచారు. ప్రతీ స్కూలు 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చు. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానాతోపాటు గుర్తింపు రద్దు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఫీజుల పెంపును పరిశీలించేందుకు 2018లో తిరుపతిరావు కమిటీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దాదాపు 4,500 స్కూళ్లు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘంగత ఏడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫీజులనియంత్రణ కార్యాచరణకు నోచుకోలేదు. -
ఇన్ కమ్ ట్యాక్స్ : ఈ సెక్షన్‌తో పిల్లల స్కూల్ ఫీజులు క్లెయిమ్ చేసుకోవచ్చు!
సెక్షన్ 80సి ప్రకారం ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంటుకు సంబంధించినవి.. కొన్ని ముందు జాగ్రత్త కోసం దాచుకునేవి .. కొన్ని చేసిన అప్పులు తీర్చేవి.. కొన్ని విధిగా ఖర్చులు పెట్టేవి.. ఉద్యోగస్తులకు పీఎఫ్ తప్పనిసరి. ఒక్కొక్కప్పుడు పీఎఫ్ మొత్తం గరిష్ట పరిమితి రూ. 1,50,000 దాటిపోతుంటుంది. పిల్లల స్కూలు ఫీజు విషయంలో ఇద్దరికి మినహాయింపు.. మూడో పిల్లలకు ఫీజు కడితే మినహాయింపు ఇవ్వరు. ఇలాగే అన్ని విషయాల్లో ఆంక్షలు. అయితే, కొన్ని కేసులు చదవండి. ♦వామనరావు పెద్ద జీతగాడు. కంపల్సరీ పీఎఫ్‌తో సెక్షన్ 80సి పరిమితి దాటిపోతుంది. అందుకని ఇతర సేవింగ్స్ తన పేరు మీద చేయడు. జీవిత బీమా తన తల్లిదండ్రుల అకౌంటులో చేశాడు. ఇల్లు మీద లోన్ తన భార్య సత్యవతి పేరిట తీసుకుని వాయిదా లు చెల్లిస్తాడు. తన భార్య ఇంట్లో తాను అద్దెకు ఉంటున్నట్లు క్లెయిమ్ చేస్తాడు. ఇంట్లో అందరూ 80సి కింద గరిష్ట పరిమితులు క్లెయిమ్ చేస్తున్నారు. సత్యవతి జీతం, ఇంట ద్దె అన్నీ కలిపినా 20 శాతం శ్లాబు దాటలే దు. వామనరావుగారు హమేషా 30 శాతం శ్లాబు తగ్గలేదు. కొంచం ఆలోచిస్తే 10 శాతం పన్ను సేవ్ చేసింది ఈ కుటుంబం. ♦ఇల్లరికం అని అనుకోకుండా.. ఇంట్లో పూర్తిగా సెటిల్ అయిపోయాడు అల్లుగారు అరవిందరావు. మామగారికి అద్దె ఇచ్చినట్లు రాస్తాడు. ఇస్తాడో .. ఇవ్వడో ఎవరికీ తెలీదు. మావగారు పెన్షనర్.. పన్ను పరిధిలోకి రారు. ఇటువంటి అల్లుళ్లు, కొడుకులు ఎంత మందో! కోడళ్లు .. కూతుర్లు ఎంత మందో! అరవిందరావు గారు చేసే ఇతర వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చదువుకోని భార్య సరస్వతి పేరు మీద చేస్తారు. 80సి కింద అర్హత ఉన్న సేవింగ్స్ ఆవిడ పేరు మీదే. ♦కుటుంబరావుగారికి, సంతానలక్ష్మి గారికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కాబోలు రెండుసార్లు కవలలు. మొత్తం నలుగురు పిల్లలు. నలుగురినీ చదివించారు. ఇద్దరూ కలిసి వ్యాపారంలో బాగా రాణించారు. నలుగురి పిల్లల విషయంలో చెల్లించిన స్కూలు ఫీజులు ఒక్కొక్కరు .. ఇద్దరి ఇద్దరి ఫీజులను క్లెయిమ్ చేసేవారు. ♦ఇద్దరు ఆడపిల్లల తర్వాత అబ్బాయి కోసం మూడో కాన్పుకి వెళ్లింది కాంతమ్మ. బాబు పుట్టాడు. ముగ్గుర్నీ చదివించింది ఆ జంట. ఎక్కువ ఆదాయం ఉన్న తండ్రి.. ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేయగా.. మూడో సంతానం స్కూలు ఫీజుని కాంతమ్మగారు క్లెయిమ్ చేశారు. ♦ఇలా అవకాశం ఉన్నతవరకూ చట్టపరిధి దాటకుండా మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
స్కూల్ ఫీజు కట్టలేదని.. విద్యార్థులను రోజంతా ఎండలో..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాల్ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫీజు కట్టనందుకు టీచర్లు తమను రోజంతా ఎండలోనే కూర్చోబెట్టారని ఓ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. పరీక్షలు కూడా రాయనివ్వలేదని వాపోయింది. ఫీజు విషయంపై తల్లిదండ్రులకు చెప్పానని, వారు ఒక్కరోజులో చెల్లిస్తామన్నారని పేర్కొంది. ఈ విషయం టీచర్లకు చెప్పినా వినిపించుకోకుండా తమకు ఈ శిక్ష విధించారని రోదించింది. यूपी : उन्नाव के एक प्राइवेट स्कूल में बच्चों की फीस नहीं पहुंची तो पूरा दिन धूप में खड़ा रखा गया एग्जाम नहीं देने दिया, कब हम फ्री स्कूल-अस्पताल पर बात करेंगे? pic.twitter.com/KrBDnL6ity — Nigar Parveen (@NigarNawab) October 17, 2022 పిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చొబెట్టిన పాఠశాల యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. చదవండి: క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా.. -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్‌అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్‌లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
40 శాతం పెరిగే..
బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో లలిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్‌క్లాస్‌లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ళలో 2019లో (కోవిడ్ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్‌లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్ ఆరంభం నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. నియంత్రణ ఏదీ? ► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. ► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. ► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల వైపు మొగ్గు కోవిడ్ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో (ఐఏఎస్ ఫౌండేషన్ ప్రత్యేక స్కూలు) నిశాంత్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 2019లో డీజిల్ ధర లీటర్ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ఒకేసారి పెంచేశారు మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. – గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా) -
AP: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు
ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా రంగ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో 35 శాతం సీట్లు పేదలకు కేటాయింపు చేయాలనే నిర్ణయాలు ఎంతో దార్శనికతతో తీసుకున్నవిగా స్పష్టమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకంలో భాగంగా, పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తంగా అందిస్తున్న జగనన్న కిట్లు మధ్యతరగతి, పేద విద్యార్థులకు వరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్పుచేసే విధంగా 44,512 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం, తొలి దశలో రూ. 3,625 వేల కోట్లతో 15,715 పాఠశాలలను అద్దంలా, సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అందించిన విధానం నభూతో న భవిష్యతి అన్న చందంగా సాగింది. ప్రధానంగా గతంలో గ్రామాలలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలచిన పాఠశాలలకు నాడు–నేడు పథకంలో పుష్కలంగా నిధులు సమకూర్చి అభివృద్ధి చేసిన విధానం పల్లె ప్రజల మనసులను చూరగొంది. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!) పనుల్లో పారదర్శకతను పాటిస్తూ తమ పాఠశాలను తామే అభివద్ధి చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. పాఠశాల చిన్నారులను ఆకర్షించే విధంగా రంగురంగుల వర్ణ చిత్రాలు, తరగతి గదుల్లో విద్యుత్ దీపాలు, విద్యార్థులు కూర్చునే బెంచీలు వంటి సకల వసతులను కల్పించడంతో పాటు, బాలికలకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే శౌచాలయాలను నిర్మించి అందించింది. బాలికల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, హాజరు శాతం పెంపుదల చేయడానికి ఇది ఒక కారణంగా నిలుస్తుంది. గత పాలకులు పాఠశాల విద్య విషయంలో కాగితాల్లో లెక్కలకే పరిమితం అయ్యారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నూతన పంథాలో నడిపించడానికి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్ర విద్యార్థులను సమాయత్తం చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) ‘ప్రపంచంలో నిజమైన శాంతిని కోరుకుంటున్నట్లయితే మనం చిన్నారులను విద్యావంతులుగా తయారు చేయాల’న్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను నిజం చేస్తూ పాఠశాల విద్యను అందరికీ చేరువ చేసే ప్రయత్నం ఏపీలో జరుగుతోంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఖరారు చేయడం దేశంలోనే ఒక నూతన ఒరవడికి నాందిగా చెప్పవచ్చు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో పాఠశాలల ఫీజులు రూ. 10 వేల నుంచి 18 వేల వరకు, జూనియర్ కాలేజీలకు రూ. 12 వేల నుంచి 20 వేల వరకు ఉండాలని, అదే విధంగా హాస్టల్ రుసుములు సైతం రూ. 18 వేల నుంచి రూ. 24 వేల మధ్యలో ఉండాలని నిర్ణయించారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తూ అందరికీ విద్యను చేరువ చేసే దిశగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన తరుణమిది. పేద విద్యార్థులకు అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ కలిగిన విద్యార్థులు పేదరికం కారణంగా విద్యకు దూరం కారాదనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ నిర్ణయం నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు వర్సిటీలలో ప్రవేశం పొందడం వలన పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెనతో వసతి భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ విద్యార్థికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యను పొందే వ్యవస్థను కల్పించాలని సంకల్పించారు. ఈ విధానంలో రిజర్వేషన్ అమలు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బాలికలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ అమలు జరిగి అట్టడుగు వర్గాలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుంది. భవిష్యత్తులో జరిగే సంస్కరణలకు కేవలం ఇవి తొలి అడుగుగా భావించాలి. ఎంతో ఆర్థిక భారాన్ని భరిస్తూ రాష్ట్రంలో పేద, అట్టడుగు వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే సమున్నత సంకల్పం ఎంతో అభినందనీయం. ఈ పథకాలను మరో దశాబ్ద కాలం అమలు జరిపితే ప్రతీ కుటుంబం విద్యావంతులతో సుసంపన్నం అవుతుంది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, మరొకరికి చేయూతనందించే స్థాయికి చేరుకుంటారు. - డా. టి. షారోన్ రాజు వ్యాసకర్త విద్యా విభాగాధిపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం -
నాణ్యమైన విద్య కోసమే ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య కోసం సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సుల్లో ఫీజులు పెంచక తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. ఒకేసారి డొనేషన్ ఫీజు కింద రూ.10 లక్షలు, ఏడాదికి రెగ్యులర్ ఫీజు కింద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈవిధంగా వచ్చిన సొమ్మును హాస్టళ్ల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు ఫైవ్‌స్టార్ స్థాయిలో ఉనప్పటికీ ఫీజులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 20–25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. కొత్తగా 11 రకాల వంగడాలను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రవీణ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఐదారేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు. ఐదు రకాల వరి కొత్త వంగడాలు కొత్తగా విడుదల చేస్తున్న 11 వంగడాల్లో ఐదు వరి రకాలు, రెండు జొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు, నువ్వులకు చెందిన వంగడాలు ఒకటి చొప్పున ఉన్నాయని ప్రవీణ్ రావు తెలిపారు. జొన్న రకాల వంగడాలను పండించాక వాటిని తిన్నవారికి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనమన్నారు. చీడపీడల్ని తట్టుకునే వంగడాల రూపకల్పనకి వర్సిటీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వర్సిటీ విద్యార్థులు ఏటా 30కిపైగా జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్)లు సాధిస్తున్నారన్నారు. రోబోటిక్స్‌తో కలుపు నివారణ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందంజలో ఉందని ప్రవీణ్ రావు వివరించారు. ‘రోబోటిక్స్ సాంకేతికతను మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ పరిజ్ఞానాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. తద్వారా డ్రోన్లతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. డ్రోన్లపై నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్‌ని ప్రారంభిస్తున్నాం. కేంద్రప్రభుత్వం ఈ మధ్య ఒక జిల్లాకి ఒక పంట పథకంలో భాగంగా మన వర్సిటీకి మూడు జిల్లాలకి రూ.8.4 కోట్లు మంజూరు చేసింది. వాటిని జగిత్యాలలో వరి, మామిడి, వరంగల్ జిల్లాలో పసుపు, మిరప, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం’అని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని ఆయన చెప్పారు. -
ఫీజు కట్టడానికి డబ్బు లేదా.. అయితే ప్లాస్టిక్ ఇవ్వండి!
చాలా దుకాణాల్లో మనమిచ్చిన నోట్లకు చిల్లర లేకపోతే బదులుగా చాక్లెట్లు చేతిలో పెట్టడం ట్రేడ్ ట్రెండ్ అయింది!అసోంలోని ఓ బడిలో.. ఫీజు కట్టడానికి డబ్బులేకపోతే పోగేసిన ప్లాస్టిక్‌ను ఇచ్చి బడిలో పాఠాలు నేర్చుకోవచ్చు అనేది పాలసీగా మారింది! ఆ పాఠశాల పేరు అక్షర్.. గువాహటిలో ఉంది. అదెలా మొదలైందంటే.. న్యూయార్క్‌లో ఉండే మజిన్ ముఖ్తార్ విభిన్నమైన స్కూల్ ప్రాజెక్ట్‌తో 2013లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్న పర్మిత శర్మను అనుకోకుండా కలిశాడు. విద్యారంగంలో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోన్న పర్మిత..ముఖ్తార్‌తో కలసి 2016లో అక్షర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. చక్కటి కరిక్యులమ్‌తో సాఫీగా సాగిపోసాగింది. ఒకరోజు బడి ఆవరణలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టారు. తరగతి గదుల్లోకి పొగవాసన రావడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు పిల్లలు. అది విద్యార్థుల ఆరోగ్యానికీ, పర్యావరణ హితానికి ఎంత హానికరమో గ్రహించారు పర్మిత, ముఖ్తార్లు. ఆ ప్లాస్టిక్‌ను ఇటు బడిలోని పిల్లలకు ఉపయుక్తంగా.. అటు పర్యావరణానికి క్షేమంగా మార్చాలని నిర్ణయించుకున్నా రిద్దరూ. ఫీజుకు బదులుగా ప్లాస్టిక్‌ను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టారు. ఇప్పుడు అక్షర్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా ప్రతిరోజూ పుస్తకాల సంచితోపాటు ప్లాస్టిక్ వ్యర్థాల సంచినీ పట్టుకొని బడికెళ్తున్నారు. వాళ్లందరికీ అక్కడ చదువు ఉచితం. ఆ ప్లాస్టిక్‌ను ఏం చేస్తున్నారు? ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ స్కూలు స్ట్రెన్త్.. ప్లాస్టిక్‌ను ఫీజుగా తీసుకోవడం మొదలుపెట్టేప్పటికి వందకు పైనే దాటింది. తమ పరిసరాల్లోంచి తెచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులు బడి ఆవరణలో పోగేస్తారు. వాటిని ఎలా రీసైకిల్ చేయాలి? చేసిన వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటున్నారు ఒకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా. ఇదివరకే ఉన్న ఆటలు, పాటలు, నృత్యం, సోలార్ ప్యానెలింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎంబ్రాయిడరీ, కాస్మెటాలజీ, కార్పెంటరీ, గార్డెనింగ్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిలింగ్ కూడా స్కూల్ కరిక్యులమ్‌లో భాగమైంది. ఈ రీసైకిల్ ప్లాస్టిక్‌ను తరగతి గదులు, టాయ్లెట్ల నిర్మాణానికి మెటీరియల్‌గా వాడుతున్నారట. టాయ్‌మనీ.. ‘మా ప్రతిపాదనను తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నారు స్థానికులు. వీళ్లలో ఎక్కువ మంది క్వారీల్లో కూలికి వెళ్తూ రోజుకి 150 నుంచి 200 రూపాయలు సంపాదించేవాళ్లే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే గగనం. బడి ఫీజులేం కట్టగలరు? అందుకే చాలా మంది పిల్లలు స్కూల్‌కి వచ్చేవారు కాదు. ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ను తీసుకుంటే ఇటు పిల్లలనూ బడికి రప్పించిన వాళ్లమవుతాం.. అటు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కల్పించిన వాళ్లమవుతాం అనిపించింది. ఊహించినట్టుగానే రెండూ జరుగుతున్నాయి. పిల్లలు చదువు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం తెచ్చుకునేలా వాళ్లను ట్రైన్ చేస్తున్నాం. హైస్కూలు పిల్లలతో ట్యూషన్స్ చెప్పించి వాళ్లకు కొంత డబ్బులు (టాయ్‌మనీ) ఇస్తున్నాం. అవి వాళ్లకు స్నాక్స్, బట్టలు, బొమ్మలు, షూలు వంటివి కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పారు పర్మిత, ముఖ్తార్. అక్షర్ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మరో వంద స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టూ తెలిపారు. – విజయాదిలీప్ -
ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ క్లాసులు ఎలా ఆపుతారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజలు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం చేసిన అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషన్‌దారు కోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్లైన్ తరగతులు బోధించడం లేదన్నారు. పిటిషనర్ వాదనలకు బదులిస్తూ.. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతోపాటు.. ఇప్పటికే 10వేల రూపాయల ఫీజు తగ్గించామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ తరగతులు ఎలా ఆపుతారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అలా ఆపితే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులతో ముడి పెట్టకుండా ఆన్లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది. -
స్కూలు ఫీజులు పెంచారని చెబితే.. వెళ్లి చావండన్న మంత్రి
భోపాల్: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తమ గోడును వెళ్లబోసుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే నోరు పారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్‌లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పాలక్ మహాసంఘ్ అనే బ్యానర్ కింద ఓ యూనియన్‌గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్‌ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు. కరోనా కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో సదరు మంత్రి స్పందన చూసి పేరెంట్స్ కమిటీ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పేరెంట్స్ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈయనేం మంత్రిరా బాబు..! బాధను చెప్పుకుందామని వెళితే మాపైనే ఫైరయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు. బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించకపోవడం గమనార్హం. -
25 శాతం స్కూలు ఫీజు రద్దు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని సెల్ఫ్ ఫైనాన్స్డ్ పాఠశాలలు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ 25 శాతం ట్యూషన్ ఫీజును తగ్గించుకోవడానికి అంగీకరించాయని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చూడసమ తెలిపారు. రాష్ట్రంలోని సీబీఎస్ఈ పాఠశాలలు సహా అన్ని పాఠశాలలు దీన్ని అనుసరించాల్సిందేనని ఆయన అన్నారు. పాఠశాలలు రవాణా ఫీజులు సహా ఎలాంటి అదనపు ఫీజులను వసూలు చేయబోవని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే, వాటిని రాబోననే నెలలకు అడ్జస్ట్ చేయాలని చెప్పారు. గుజరాత్ లో గత 180 రోజులకు పైగా మూసే ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులకు కేవలం 40శాతం విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు చెప్పారు. -
వేధించే స్కూళ్లకు పాఠం
సాక్షి, హైదారబాద్: ‘కారణం చెప్పకుండా పిల్లల్ని ఒక్కసారిగా చదువుకి దూరం చేస్తే.. తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోండి’ అంటూ ఆమె చెమర్చిన కళ్లతో ప్రశ్నిస్తుంటే.. నగరంలో పలువురు తల్లిదండ్రుల కళ్లు తడిదేరాయి. ఎందరో మధ్యతరగతి పేరెంట్స్‌కి పిల్లల కోసం చదువు‘కొనే’ తమ కష్టాలు గుర్తొచ్చాయి కార్పొరేట్ స్కూళ్ల కాఠిన్యంపై ధ్వజమెత్తారు సినీ సెలబ్రిటీ జంట శివబాలాజీ, స్వప్నమాధురి దంపతులు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాల నిర్వాకాలను తప్పనిసరి భరించే ఎందరో పేరెంట్స్‌కు భిన్నంగా సిటీలో తొలిసారిగా స్కూల్‌పై ఈ తరహా పోరాటం చేసిన పేరెంట్స్‌గా, స్కూల్ నుంచి తీసేసిన వందలాది మంది పిల్లలకు అండగా నిలిచారు.. తీసేసిన పిల్లల్ని తిరిగి చేర్చుకునేలా చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో స్వప్నమాధురితో సంభాషించినప్పుడు.. పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ♦ప్రీ మిడ్‌టర్మ్ పరీక్షల కోసం రివిజన్స్ జరుగుతున్న సమయంలో.. స్కూల్లో ఎనిమిదేళ్లుగా చదువుతున్న మా పిల్లల్ని ఆకస్మికంగా ఆన్లైన్ క్లాసులకు దూరం చేశారు. కారణం ఏంటని ఫ్రంట్ ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి అడిగాం. అకౌంట్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేయమన్నారు. అక్కడ నుంచీ రిప్లై లేదు. ♦మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదని కంటిన్యూగా ఫోన్స్ చేస్తున్నా ‘నో రెస్పాన్స్’.. ఫ్రంట్ ఆఫీస్‌కి కాల్ చేసి ఫోన్ చేసి, మెయిల్‌కి రిప్లై రావడం లేదంటే.. ఫీజు విషయమై ఉంటుందన్నారు. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన) ♦ఏదైనా సరే మాకు చెప్పాలి కదా.. ఏదీ చెప్పకుండా సడెన్‌గా ఇలా చేయడం ఏమిటనడిగితే ప్రిన్సిపాల్‌తో మాట్లాడిస్తామని చెబుతూ వచ్చారు. అదీ జరగలేదు. ♦కొంత మంది తల్లిదండ్రులు గ్రూప్‌గా ఏర్పడి ఫీజులు తగ్గించమని అడగడం, ఆ గ్రూప్‌లో నేనూ ఉండటం వల్లే ఇలా చేశారని ఆ తర్వాత వారి స్పందన ద్వారా అర్థమైంది. ఫీజు తగ్గించమని అడగడం తప్పా? ♦కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఆన్లైన్ క్లాసులంటే.. ల్యాప్ టాప్ కొనాలి. పనులు మానేసి కొన్ని గంటల పాటు సమయాన్ని పిల్లలతో గడపాలి.. ఇవన్నీ సమస్యలున్నాయి. కాబట్టి ఫీజు తగ్గించమని అడగడానికి వందల మంది పేరెంట్స్ కలిసి గ్రూప్‌గా ఏర్పడ్డారు. ♦ఆ గ్రూప్‌లో నన్నూ యాడ్ చేశారు. మేమైతే ఫస్ట్ టర్మ్ ఫీజు పూర్తిగా కట్టేశాం అయినా కానీ కట్టలేని వారి గురించీ ఆలోచించాలి కదా.. అందులోనూ వీరెవరూ మొత్తం ఫీజు కట్టం అనలేదు. కాస్త తగ్గించమన్నారంతే. ♦వాళ్లకు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా? తగ్గిస్తున్నామనో.. తగ్గించమనో చెప్పాలి కదా? జూన్‌లో గ్రూప్ తరఫున మెయిల్ పెడితే ‘మీరు గ్రూప్‌గా అడిగితే అసలు మేం కన్సిడర్ చేయం’ అంటూ ఆగస్టు 12న రిప్లై వచ్చింది. ♦దాంతో పర్సనల్‌గా డైరెక్టర్, ప్రిన్సిపాల్‌ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాశాం. పేరెంట్స్‌ని తప్పుగా చూడవద్దు. ఈ సమస్య లేకపోతే ఎవరూ ఇలాంటి రిక్వెస్ట్ పెట్టేవారు కాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ♦విచిత్రమేమిటంటే నేనేమీ నా పిల్లల ఫీజు విషయంలో తగ్గించాలని అడగలేదు. అయినా నా పిల్లలతో పాటు గ్రూప్‌లో ఉన్న వందలాది మంది పిల్లల్ని క్లాసులకు దూరం చేశారు. పైగా..‘మిగతా పేరెంట్స్‌ని ఫీజు కట్టకుండా ఆపుతున్నారు మీ మీద యాక్షన్ తీసుకుంటా’మంటూ మాకు మెయిల్ పెట్టారు. ♦నా పిల్లల్ని ఎందుకు తీశారు? కమ్యూనికేషన్ ఎందుకు బ్లాక్ చేసేశారు? మొత్తం ఫీజు కట్టేశాక కూడా నా తప్పు ఏమిటి? ఒక పేరెంట్‌గా నేను అడిగితే నా మీద పర్సనల్‌గా ఎందుకు యాక్షన్ తీసుకుంటామంటున్నారు? అంటూ ప్రశ్నలు అడిగితే రిప్లై లేదు. దాదాపు 3 వారాల పాటు చూసి ఇక వేరే గత్యంతరం లేక మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాం. హక్కులేమీ లేవా? పిల్లలను స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు తమకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. ‘మీ వైపు నుంచి ఈ తప్పు జరిగింది.. దాంతో మీ పిల్లల్ని తీసేస్తున్నాం’ అంటూ నోటిస్ ఇచ్చి దానికి స్పందించకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. ►అంతేగాని ఏకపక్షంగా చెప్పాపెట్టకుండా తీసేసి ఎందుకు అలా చేయాల్సి వచి్చందో కూడా సమాచారం ఇవ్వకపోతే ఎలా? ‘ఈ విషయంలో స్కూల్ తప్పేమీ లేదని తేలింది. స్వప్పమాధురి, శివబాలాజీ మీడియా పబ్లిసిటీ కోసమే డ్రామా ఆడుతున్నారు’ అంటూ మిగిలిన పేరెంట్స్‌ను తప్పుదారి పట్టించేలా స్కూల్ నుంచి మెయిల్స్ పెట్టారు. పిల్లల భవిష్యత్‌తో డ్రామాలు ఆడతామా? అంత అవసరం మాకేంటి? వదిలేది లేదు.. ప్రస్తుతం చాలా మంది తీసేసిన పిల్లల్ని తిరిగి క్లాసుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ దీన్ని వదిలేది లేదు. మా పిల్లల్ని ఎందుకు తీసేశారు? మాకు కారణం కావాలి. మాకు నగరం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఎందరో తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ కరోనా నేపథ్యంలో తమ కష్టాలు, స్కూళ్ల యాజమాన్యాలతో తమకు ఏర్పడుతున్న సమస్యలు చెబుతున్నారు. వారందరికీ మనోధైర్యం ఇచ్చేలా హెచ్ఆర్సీ జడ్జిమెంట్ రావాలి. ప్రతి స్కూల్‌కి ఇదొక పాఠం అవ్వాలి. కష్టపడి పిల్లల్ని చదివించే పేరెంట్స్‌ని అవస్థలు పెట్టడం తప్పు అని స్కూల్స్ తెలుసుకోవాలి. -
ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల ఆన్లైన్ తరగతులు, ఫీజులపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళ్తె.. ఈ ఏడాది ఫీజులు పెంచవద్దని ఏప్రిల్ 21న జీవో 46ను జారీ అయిందని విద్యాశాఖ కౌంటర్లో పేర్కొంది. జీవో ప్రకారం బోధన రుసుములు నెలవారీగా తీసుకోవాలి, కానీ 55 పాఠశాలలు జీవోని ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. జీవోను ఉల్లంఘించి వసూలు చేస్తున్న 55 పాఠశాలలకు విద్యాశాఖ షోకాజు నోటీసులు జారీ చేసింది. కాగా షోకాజు నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చాయి. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా జీవోకు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఎస్ఈ గడువు కోరగా, తదుపరి విచారణను అక్టోబరు 8కు హైకోర్ట్ వాయిదా వేసింది. -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్‌లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
చెప్పని చదువుకు ఫీజులు
నా పేరు శ్రీనివాస్ (పేరు మార్చాం). ఆదిలాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పట్టణంలోని విద్యార్థి కళాశాల సమీపంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉన్నాను. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులకు వెళ్తున్నాను. అయితే ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం మెస్సేజ్‌లు పంపుతోంది. ఆలస్యమైనందుకు రూ.60 చొప్పున ఫెనాల్టీ చెల్లించాలట. లేదంటే అడ్మిషన్‌ను రద్దు చేస్తామని భయపెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మా పిల్లల్ని పాఠశాలలో ఉంచుతారో.. లేదోనన్న భయం. చాలా మందిది ఇదే పరిస్థితి. సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మార్చి నుంచి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కొంతమంది చిరు వ్యాపారాలు చేస్తుండటం, మరికొంత మంది కూలీ పనులకు వెళ్లిన విషయం విదితమే. అయితే ఆ సమయంలో విద్యాసంస్థలు బంద్ పాటించగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పని చదువులకు సైతం ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబాలను పోషించేందుకు అష్టకష్టాలు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజులు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన సాగుతోంది. ఇదివరకే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ చదువులు ప్రారంభించలేదు. గత మార్చి నుంచి ఆగస్టు వరకు ఫీజు చెల్లించాలని, ఆలస్యమైనందుకు ఫెనాల్టీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా బాగున్న వారు ఈ ఫీజులు చెల్లిస్తుండగా, ప్రైవేట్ ఉద్యోగులు, కూలీనాలి చేసేవారు ఫీజులు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పని చదువుకు ఫీజు లాక్డౌన్ సమయంలో మార్చి 15 నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం విద్యార్థులందరిని అప్‌గ్రేడ్ చేస్తూ పైతరగతులకు పంపించింది. జిల్లాలో వందకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా. కొన్ని పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు మే నుంచి ఆగస్టు వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాయి. మరికొన్ని ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం ఆన్లైన్ తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ఈ తతంగం నడిపారు. ఆన్లైన్ తరగతుల ఫీజుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వని యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు ఏమాత్రం పాటించకపోయినా ఫీజు జులుం మాత్రం మానడం లేదు. నిబంధనల ప్రకారం పాఠశాలలకు క్రీడా మైదానం, లైబ్రరీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఫైర్ అనుమతి, తదితర సౌకర్యాలు ఉండాలి. దీనికి తోడు పాఠశాలల్లోనే షూలు, బెల్టులు, యూనిఫాం, నోటుబుక్లు, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. వీరి ఇబ్బందులతో తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. పెనాల్టీ చెల్లించాలి నెలనెలా ఫీజులు చెల్లించకపోతే జీఓ ప్రకారం ఫెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మా యాజమాన్యం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించాం. ఏవైన ఇబ్బందులు ఉంటే మమ్మల్ని పాఠశాలలో సంప్రదించాలి. వి ద్యార్థుల తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు. ఇది వరకు ఫీజులు అడగలేదు కాని, ప్రస్తుతం ఫీజులు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. -ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మెమో జారీ చేస్తాం ఆ పాఠశాల యాజమాన్యానికి మెమో జారీ చేస్తాం. ఫెనాల్టీ ద్వారా ఫీజులు వసూలు చేస్తే సహించేది లేదు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి. – ఎ.రవీందర్ రెడ్డి, డీఈఓ -
ఆన్లైన్ క్లాసులు: ఫీజు చెల్లించకుంటే ‘లైన్’కట్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోజుకు చెప్పే రెండు మూడు క్లాసులకే పూర్తి ఫీజులు వసూలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు ఈ ఫీజుల చెల్లింపు తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికే ఫస్ట్ టర్మ్ ఫీజులు..పుస్తకాలు, నోటు బుక్స్, ఫోన్లు, కంప్యూటర్ల కొనుగోలు పేరుతో భారీగా ఖర్చు చేసిన తల్లిదండ్రులకు..సెకండ్ టర్మ్ ఫీజుల చెల్లింపు వారి కుటుంబాలను మరింత ఆర్థి్క సంక్షోభంలోకి నెట్టేస్తుంది. మొత్తం ఫీజులో 50 శాతం చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తాం! లేదంటే క్లాసు నుంచి డిస్కనెక్ట్ చేస్తాం! అంటూ యాజమాన్యాలు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక ఆయా స్కూళ్ల ముందే నిరసనకు దిగుతున్నా పట్టించుకున్న నాధుడే లేరు. అంతేకాదు ఆయా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అనుమతించక పోయినా..ఆన్లైన్ తరగతులు తెలంగాణ వ్యాప్తంగా 10549 పాఠశాలలు ఉండగా, వీటిలో 30 లక్షల మంది వివిధ తరగతులు చదువుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో పది లక్షల మంది పిల్లలు ఉన్నారు. నిజానికి జూన్ 12 నుంచి అన్ని స్కూళ్లు రీ ఓపెన్ కావాల్సి ఉండగా, కరోనా విజృంభి స్తుండటంతో ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. ప్రభుత్వం అనుమతించక పోయినప్పటికీ నగరంలోని పలు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తుంది. 27 పాఠశాలలపై ఫిర్యాదులు అందినా.. పలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ పాఠాల పేరుతో తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే ఫస్ట్ టర్మ్ ఫీజులు వసూలు చేశాయి. అడిగినంత ఫీజు చెల్లించిన వారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇచ్చి పాఠాలు వినే అవకాశం కల్పిస్తున్నాయి. ఫీజు చెల్లించని వారిని ఇందుకు దూరంగా ఉంచుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు ఆయా పాఠశాలలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని 27 పాఠశాలపై ఫిర్యాదులు అందాయి. దీంతో సబంధిత అధికారులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలపై కూడా చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం విశేషం. కరోనా వల్ల ఉపాధి అవకాశాలు లేక ఆదాయం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఈ ఫీజులు మరింత ఆవేదనను మిగుల్చుతున్నాయి. ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై కేసులు కరోనా సమయంలో ఫీజులు పెంచొద్దని పేర్కొంటూ ప్రభుత్వం జీఓ నెంబర్ 46 జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలోని ఏ ఒక్క పాఠశాల కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. పలు కార్పొరేట్ స్కూళ్లు గతేడాది కంటే ఎక్కువ గా రూ. పది వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లను నిరసిస్తూ ఇటీవల పలువురు తల్లిదండ్రులు ఆయా కార్పొరేట్ పాఠశాలల ముందు ఆందోళనకు దిగడం తెలిసిందే. తల్లిదండ్రులకు అండగా నిలువాల్సిన అధికారులు, పోలీసులు ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. ట్యూషన్ ఫీజుకు మించి వసూలు చేయొద్దు హైదరాబాద్ జిల్లాలోని ఏడు ప్రైవేటు పాఠశాలలపై ఫిర్యాదులు అందాయి. అధికారుల విచారణలో మూడు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వివరించాం. ఇకపై కూడా ఏదైనా స్కూలుపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడుతాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే అట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోం. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. అంతకు మించి వసూలు చేస్తే చర్యలు తప్పవు. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్ ఇంటర్ కళాశాలల్లోనూ అంతే! సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన మధుప్రియ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గతేడాది ఫస్టియర్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం సెకండియర్‌కు చేరుకుంది. అయితే సెకండియర్‌కు అడ్మిషన్ రెన్యూవల్ చేయాలంటే తొలి విడతగా రూ.20 వేలు ఫీజు చెల్లించాల్సిందిగా కాలేజీ నుంచి ఆమె తండ్రికి ఫోన్ చేశారు. లేదంటే అడ్మిషన్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఇది ఒక మధుప్రియ తండ్రికి ఎదురైన అనుభవం మాత్రమే కాదు.. పలు కార్పొరేట్ కాలేజీల్లో ఫస్టియర్ పూర్తి చేసుకుని సెకండియర్లోకి అడుగుపెడుతున్న అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీలు ఫీజులు పేరుతో వేధింపులకు దిగుతున్నాయి. క్లాసుల నిర్వహణ, ఫీజుల వసూలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ తరగతులకు ఆఫ్‌లైన్‌లో చెల్లించే మొత్తం ఫీజులను ఎలా చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తరగతుల ప్రారంభానికి ముందే.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గత విద్యా సంవత్సరం 2,00,332 మంది విద్యార్థులు ఫస్టియర్ పూర్తి చేసుకోగా.. మరో 2,03,948 మంది సెకండియర్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఫస్టియర్ పూర్తి చేసుకుని సెకండియర్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు అధికారికంగా ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాలేదు. కానీ.. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. మొత్తం ఫీజులో 50 శాతం తొలి విడతగా చెల్లించాలని, లేదంటే అడ్మిషన్ రద్దు చేస్తామన్న కాలేజీల హెచ్చరికలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరవకముందే అప్పుడే 50 శాతం ఫీజు ఎలా చెల్లిస్తామని వాపోతున్నారు. నిజానికి ఫస్టియర్‌లో చేరిన విద్యార్థి అడ్మిషన్ ఆటోమెటిక్‌గా సెకండియర్‌కు రెన్యూవల్ అవుతుంది. -
ఫీజు వసూలుపై ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఇష్టారాజ్యం
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మాలతి సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఇంటి వద్ద నుంచే బోధన సాగిస్తోంది. కానీ జూలై 27వ తేదీ వచ్చినా ఈనెల వేతనం తన ఖాతాలో జమ కాలేదు. అంతేకాదు, జూన్ నెలలో ఇవ్వా ల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. కారణం స్కూల్ యాజమాన్యం తనకు నిర్దేశించిన ఫీజు వసూలు లక్ష్యాన్ని సాధించకపోవడమే. దీంతో రెండు నెలలుగా జీతమే లేదు. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా టీచర్లకుండే లక్ష్యాలు అత్యుత్తమ బోధన, మెరుగైన ఫలితాలు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల లక్ష్యాలు మారిపోయాయి. ఆన్లైన్లో ఎలాగోలా బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీచర్లకు విద్యార్థుల నుంచి నెలవారీ ఫీజు డబ్బులను వసూలు చేయడాన్ని యాజమాన్యాలు లక్ష్యాలుగా నిర్దేశించాయి. దీంతో ఫీజులు వసూలు చేసిన టీచర్లకు సగం వేతనాలు ఇస్తుండగా... వసూలు చేయని వారికి మొండిచేతులు చూపిస్తున్నారు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో 20 వేలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఇందులో 65 శాతంపైగా స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టుల చొప్పున మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో బోధనా సిబ్బందికి ప్రతిరోజూ తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆన్లైన్ తరగతుల ద్వారా బోధనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి సగం వేతనం చొప్పున ఇవ్వనున్నట్లు యాజమాన్యాలు తొలుత ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ మేరకు సైతం చెల్లింపులు చేయడం లేదు. ప్రతి క్లాస్ టీచర్‌కు ఆ తరగతిలోని విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో ఆన్లైన్ తరగతి పూర్తయిన తర్వాత ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లాక్డౌన్ అనంతర పరిణామాలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపార రంగం సైతం క్షీణించడంతో ఆదాయం పతనమైంది. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ టీచర్లు వారికి ఫోన్లు చేసి కొంత మొత్తమైనా చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు గొడవలకు సైతం దారితీస్తుండడం గమనార్హం. వేతన వెతలు... ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాల కోసం అల్లాడుతున్నారు. మార్చి నెల నుంచి లాక్డౌన్ మొదలైంది. దీంతో అప్పట్నుంచి వేతన చెల్లింపులు గందరగోళంగా మారిపోయాయి. ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. కొన్ని సంస్థలు మాత్రం ఏప్రిల్ నెలలో సగం వేతనంతో సరిపెట్టగా మెజార్టీ విద్యా సంస్థలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. మే నెలలో 90 శాతం సంస్థలు జీతాలకు మంగళం పాడేశాయి. జూన్, జూలై నుంచి ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నప్పటికీ వేతనాలు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఫీజు వసూళ్ల బాధ్యతలు టీచర్లపైకి నెట్టేశాయి. నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తేనే వేతనాలిస్తామని చెప్పడంతో వేలాది మంది ఉద్యోగులు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
రెండో తరగతికి లక్షపైనే...
బోడుప్పల్‌లోని సిద్ధార్థ స్కూల్లో తన కుమారుడిని రెండో తరగతిలో చేర్పించేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. క్లాసులు..టీచర్ల వివరాలు మాట్లాడిన తరువాత ఫీజు గురించి చెబితే అతని కళ్లు బైర్లు కమ్మాయి. రూ. లక్ష వరకు చెల్లించాలని చెప్పారు. అదేమని అడిగితే ఆన్లైన్ క్లాస్..ల్యాప్‌టాప్..బుక్స్..డ్రెస్.. ట్రాన్స్పోర్ట్ ఇలా కబుర్లు చెప్పారు. వామ్మో..ఇంకా మొదలే కాని స్కూలుకు ఇంత ఫీజా.. వద్దులే బాబూ అనుకొని సారథి హైస్కూల్‌కు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి. ఉప్పల్‌లోని శ్రీచైతన్య స్కూల్లో విచారించాడు. రూ.38,500 చెప్పారు. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం చెప్పింది కదా అని అడిగితే మాకేం తెలియదు సార్.. ఫీజు కట్టాల్సిందే అని నిర్లక్ష్యంగాసమాధానం ఇచ్చారు. డబ్బుచెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులతోచదువులు మొదలవుతాయి. సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు కరోనా కాలంలోనూ కనికరంలేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై జులం ప్రదర్శిస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్న పర్యవేక్షణ లేమి ఈ విద్యా సంస్థలకు కలిసి వస్తోంది. ఆన్లైన్ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46కు తూట్లు పొడుస్తున్న అనేక విద్యా సంస్థలు వివిధ రకాల పేర్లు చెప్పి అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు తాము నిర్దేశించిన ఫీజులు చెల్లించకపోతే ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ ఇవ్వమంటూ ఎస్సెమ్మెస్‌లు పంపించి బెదిరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో? ఎవరికి ఫిర్యాదు చేయాలో? అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. తాజా విద్యా సంవత్సరంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం ఈ విద్యా సంస్థలకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. దీంతో సొంత సిలబస్‌లో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టి, యథేచ్ఛగా కొనసాగించేస్తున్నాయి. ‘సాక్షి టీవీ’ నిఘాలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. (వారు కంపార్టుమెంటల్ పాస్) రెండో తరగతికి రూ.లక్షపైనే... బోడుప్పల్‌లోని సిద్ధార్థ స్కూల్ వ్యవహారం ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారానికి ఓ మచ్చుతునక మాత్రమే. ఆ పాఠశాలకు రెండో తరగతిలో చేరే విద్యార్థి తండ్రిగా వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధికి అక్కడి ఉద్యోగులు చెప్పిన ఫీజుల లెక్క అవాక్కయ్యేలా ఉంది. అడ్మిషన్ మొదలుకొని వివిధ ఫీజుల కింద రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆ ఫీజులో కాస్త తగ్గించమని కోరగా.. ఆ పాఠశాల ఉద్యోగుల నుంచి స్పందన కరువైంది. సమీపంలోని సారథి హైస్కూల్లోనూ రెండో తరగతి విద్యార్థికి స్కూలు ఫీజు కింద రూ.60 వేలు, యాక్టివిటీ ఫీజు కింద మరో రూ.40 వేలు కలిపి రూ.లక్షగా చెప్పారు. దీనికి అదనంగా రవాణా, పుస్తకాలు తదితరాలు అదనంగా ఉంటాయని ఉంటాయని స్పష్టం చేశారు. ఉప్పల్‌లోని శ్రీచైతన్య స్కూల్లో ట్యూషన్ ఫీజుగా రూ.31 వేలు, పుస్తకాలు, యూనిఫాం తదితరాలకు మరో రూ.7,500 చెల్లించాలని అక్కడి ఉద్యోగులు చెప్పారు. మిగిలిన రెండు స్కూళ్ల కంటే ఇక్కడ తక్కువే అయినా.. సామాన్యుడికి మాత్రం భారమే. కేవలం ఈ మూడే కాదు.. నరగంలోని దాదాపు ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లోనూ ఫీజుల తీరుతెన్నులు ఇలానే ఉన్నాయి. పాత స్టూడెంట్స్ నుంచి మరోలా.. కొత్తగా చేరాలని భావించిన విద్యార్థుల నుంచి వసూళ్లు ఇలా ఉంటే.. ఇప్పటికే తమ విద్యార్థులుగా ఉన్న వారి నుంచి ఈ స్కూళ్లు మరోలా పిండుకుంటున్నాయి. దీనికోసం ఆన్లైన్ క్లాసుల పేరును వాడుకుంటున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఈ విద్యా సంస్థలు తమ సొంత సిలబస్‌తో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టేశాయి. ఫీజుల పేరుతో ప్రతి పైసా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. జరుగుతున్నవి ఆన్లైన్ క్లాసులే అయినప్పటికీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల వసూళ్లలో తగ్గట్లేదు. ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, స్కూలు యూనిఫాం ఫీజు, స్కూలు డెవలప్మెంట్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు... ఇలా అందినకాడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నాయి. ఇవి చాలవన్నట్లు ఆన్లైన్ క్లాసుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు తమ వద్దే కొనాలంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. వీటిలో ఏ ఫీజు చెల్లించకపోయినా, పుస్తకాలు కొనకపోయినా ఆన్లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వమని, పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్ ద్వారా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి. వారి బాధలు వర్ణనాతీతం... నగరానికి ఎన్నో ఏళ్ల క్రితం వలసవచ్చిన బడుగుజీవులు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నది వీరి కల. దీనికోసం కడుపుకట్టుకుని పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని ఉపాధి, ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లు ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం మరో షాక్ ఇస్తోంది. ఇన్నాళ్లు ఏదో ఒక రకంగా ఫీజులు చెల్లిస్తూ వస్తున్నామని, ప్రస్తుత కరోనా పరిణామాలతో అది సాధ్యం కావట్లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు ఓర్చినా.. ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. టీచర్లు బోర్డు వైపు తిరిగి బోధిస్తున్న ఈ ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు అర్థం కావట్లేదు. వీరికి సందేహాలు వస్తే తీర్చే నాథులే కరువయ్యారు. ఈ ఇబ్బందులు అదనం... ఈ ఆన్లైన్ క్లాసుల కోసం గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ చూస్తున్న పిల్లల కళ్లు, వెన్నుముకలపై తీవ్ర ప్రభావం ఉంటోంది. అనేక మంది చిన్నారులు తల, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటర్నెట్లో ప్రవేశించినప్పుడు అనేక మంది చిన్నారులకు అశ్లీల సైట్ల పాప్అప్స్, బూతు బొమ్మలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ క్లాసులు జరిగినంత సేపూ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పని మానుకుని పిల్లల వద్దే కూర్చోవాల్సి వస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు భారం పెరుగుతోంది. వారికి కచ్చితంగా ఒక్కో ఫోన్ లేదా ట్యాబ్ సమకూర్చాల్సి వస్తోంది. ఒకే సమయంలో ఆన్లైన్ క్లాసులు కావడంతో ఇది తప్పట్లేదు. కూలినాలీ చేసుకుని జీవించే కుటుంబాల్లో కనీసం స్మార్ట్ ఫోన్ కూడా ఉండట్లేదు. దీంతో వీరి పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. ఈ ట్యూషన్ ఫీ అంతా కట్టమంటున్నారు కరోనా కష్టకాలంలో స్కూళ్లలో ఫీజులు పెంచవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కానీ విద్యా సంస్థలు మాత్రం లాస్ట్ ఇయర్ ఫీజు రూ.75 వేలను చెల్లించమంటున్నారు. దాన్ని ట్యూషన్ ఫీజు కింద చూపించి కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫీజు మొత్తాన్నే ఈ ఏడాది కూడా చెల్లించాలని.. అది కూడా తొమ్మిది వాయిదాల్లో కట్టాలంటున్నారు. ఈ విషయంలో ఎంత చెప్పినా స్కూల్ యాజమాన్యాలు రాజీపడటం లేదు. – ఓ విద్యార్థి తండ్రి ఈ క్లాసులు ఏం రీచ్ అవుతాయి? ప్రభుత్వం జస్ట్ జీవో ఇచ్చి వదిలేసింది.మానిటరింగ్ ఏంలేదు. స్కూల్ నుంచి మామూలుగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఉన్న ఫీజునే ఇప్పడు మంత్లీ పే చేయమంటున్నారు. ఈ విషయంలో స్కూల్ వాళ్లుడిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ రూ.20 వేలు, రూ.30 వేలు కట్టాలంటున్నారు. కడితేనే బుక్స్ అంటున్నారు. బుక్స్ లేకుండా క్లాసులు చెప్పడమేంటి.. వాళ్లు చెప్పినా ఏం రీచ్ అవుతుంది. అసలు నెక్ట్స్ క్లాసు బుక్స్ ఏం ఉంటాయోతెలియకుండా ఎలా..? అదేమంటే బుక్స్ లేకుండా క్లాసులు చెబుతున్నాం.. నోట్స్ ఫ్రిపేర్ చేయండని చెబుతున్నారు. – ఓ విద్యార్థి తల్లి ఛాన్స్ ఇవ్వడం లేదు.. ఆన్లైన్ క్లాసుల్లో టీచర్లు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. డౌట్స్ అడుగుదామంటే అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ల మానాన వాళ్లు చెప్పుకుంటూ వెళ్లుతున్నారు. కానీ క్లాసు లాస్ట్‌లో చెబుతాంటున్నారు. ఏమీ ఉండటం లేదు. అర్థం కావడం లేదని చాలా చెప్పాం. కానీ క్లాసుకు టైమ్ అయిపోతుందని చెప్పుకుంటూ వెళ్తున్నారు. – ఓ విద్యార్థి పేరెంట్స్‌కు కష్టమే.. ఎల్కేజీ వాళ్లకు కూడా ఆన్లైన్ పాఠాలు చెబుతున్నారు. పెద్ద క్లాసు వాళ్లు అంటే వింటారు. కానీ చిన్నపిల్లలకు ఏం అర్థం అవుతుంది. వీళ్లకేమీ అర్థమవుతుంది. ఇది పేరెంట్స్‌కు చాలా బర్డెన్. చేసే పనులను మానుకుని పిల్లలతో పాటు కూర్చుకోవాల్సి వస్తుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువ అవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాఠాలు మర్చిపోతారనే భయంతోనే ఆన్లైన్ క్లాసుల్లో కూర్చోపెట్టాల్సి వస్తుంది. – ఓ విద్యార్థి తల్లి బ్యాక్ పెయిన్ వస్తోంది ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేగాకుండా ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురికి డివైజ్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే.. చిన్న పిల్లలకు క్లాసులంటే టూ మచ్. వాళ్లకి ఏం అర్థమవుతుంది. మేడమ్ ఫాస్ట్ ఫాస్ట్‌గా చెబుతున్నారు. నేను మళ్లీ చెప్పాల్సి వస్తుంది. - ఓ విద్యార్థిని తల్లి ఫోన్ లేక పాఠాలు సాగడం లేదు చేతన్‌బాగ్ స్కూల్లో మా అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు. ఫోన్ ద్వారానే క్లాసులు జరుగుతున్నాయి. ఫోన్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఫోన్ లేక పాఠాలు ఆగిపోయాయి. పక్కింటికి వెళ్లాలంటే.. కరోనా వల్ల ఎవరూ రానివ్వడం లేదు. ఇలా కాకుండా ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది. దాన్లో చెబితే ఇంత టెన్షన్ ఉండదు కదా.. మరి మా పరిస్థితి ఏంటి..? – విద్యార్థి తల్లి, చేతన్‌బాగ్