* వయసుకు సంబంధించిన గందరగోళానికి తెర
* 9 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్లు
పుణే: పాఠశాల అడ్మిషన్లలో వచ్చే ఏడాది నుంచి ఒకే వయో పరిమితిని అమలు చేయనుండటంతో ఈ ఏడాది అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ మరో మార్గం ఆలోచించింది. అడ్మిషన్ సమయంలో వయస్సుకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి ఈమేరకు ఓ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పాఠశాలలు విద్యార్థుల వయస్సు వివరాలు విడివిడిగా ఇవ్వాలని, ఆ ప్రకారమే అడ్మిషన్లు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మనే శనివారం తెలిపారు. నాసిక్‌లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న రిజిస్ట్రేషన్‌లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 16 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. పుణే, పింప్రి, చించ్‌వాడ్, ముంబై, థాణే, కల్యాణ్ దోంబివలి, నాగ్‌పూర్, భీవండి-నిజాంపూర్, ఉల్‌హస్‌నగర్, మిరా-భయందర్, నవీ ముంబై, అమరావతి, లాతూర్, ఔరంగాబాద్, కొల్హాపూర్‌లలో ఈ నెల 16 నుంచి 21 వరకు ఈ పద్ధతి కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఫిభ్రవరి 23 నుంచి మార్చి 7 వరకు స్వీకరిస్తారని వారు వెల్లడించారు. డిప్యూటీ డెరైక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెరిఫికేషన్ సెంటర్‌ను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు (rte25admission. maharashtra.gov.in)ను సంప్రదించాలని చెప్పారు. ఆర్టీఈ చట్టం ప్రకారం చేరిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.26 కోట్ల ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది.
ఓ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై జరిగిన అత్యాచార కేసు విషయంలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మానే తెలిపారు. అయితే గతంలో మూడు పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసు పురోగతి గురించి ప్రశ్నించగా చివరి నివేదిక సమర్పించడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులకు వారం రోజులు గడువిచ్చినట్లు తెలిపారు.
పాఠశాల ప్రవేశాలకు ప్రత్యామ్నాయం
Published Sun, Feb 8 2015 11:01 PM | Last Updated on Sat, Sep 15 2018 5:39 PM
Advertisement
Advertisement