pilot project
-
ప్రొఫెసర్లకు ఇండస్ట్రీ ఫెలోషిప్
సాక్షి, అమరావతి: పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి... పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి... సాంకేతిక విద్య అధ్యాపకుల్లో బోధన సామర్థ్యాలను మరింత పెంచడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్య ప్రొఫెసర్లను ఫెలోషిప్ పేరుతో ఏడాదిపాటు పరిశ్రమల్లో పని చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా ప్రొఫెసర్లు తమ పరిశ్రమ అనుభవాన్ని బోధనలో వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సిద్ధం చేసింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన ప్రొఫెసర్లకు యథావిధిగా జీతంతోపాటు రూ.లక్ష వరకు స్టైఫండ్ అందించనుంది. ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులను పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా ప్రొఫెసర్లు సిద్ధం చేయగలరని ఏఐసీటీఈ భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 300 ఫెలోషిప్‌లు.. » ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏఐసీటీఈ గుర్తించిన లిస్టెడ్ కంపెనీల్లో సాంకేతిక విద్య ప్రొఫెసర్లు పని చేయాలి. » తొలుత పైలట్ ప్రాజెక్టుగా 2025–26 విద్యా సంవత్సరానికి 300 ఫెలోషిప్‌లు ఇచ్చేలా త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఇందులో 200 మంది ప్రొఫెసర్లు సంవత్సరంపాటు పరిశ్రమల్లో పని చేసేందుకు అనుమతిస్తుంది. మరో 100 మంది ఆరు నెలలు చొప్పున నియామకాలను ఎంపిక చేసుకోవచ్చు. » 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఈ ఫెలోషిప్‌నకు అర్హులు. వారు వృత్తి జీవితంలో గరిష్టంగా రెండుసార్లు ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. » కంపెనీల విశ్వసనీయతను నిర్ధారించడానికి స్టాక్ మార్కెట్లో లిస్టెడ్(జాబితా చేసిన)వాటిలో మాత్రమే ఫెలోషిప్‌లకు ఏఐసీఈటీ అవకాశం కల్పిస్తుంది. కంపెనీ బహుళజాతి సంస్థ అయినప్పటికీ భారతదేశంలోని పోస్టింగ్‌లకు మాత్రమే ఫెలోషిప్ వర్తిస్తుంది. » అదేవిధంగా ప్రొఫెసర్లను ఇండస్ట్రీ ఫెలోషిప్‌నకు పంపడంపై నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫెలోషిప్ తర్వాత అధ్యాపకులను నిలుపుకోవడం వంటి సవాళ్లు విద్యాసంస్థలకు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ప్రొఫెసర్లు ఏడాదిపాటు కళాశాలలకు దూరంగా ఉండటం వల్ల వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
పీ4 సర్వేపై ప్రజల్లో ఆందోళన.. ఎన్నో సందేహాలు!
కడప సెవెన్‌రోడ్స్: పీ4 పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు పరచకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా పైలెట్ ప్రాజెక్టు (pilot project) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 20వ తేది నుంచి వైఎస్ఆర్ జిల్లాలో పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టిసిపేషన్ (పీపీపీ) పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేది నాటికి పీ4 సర్వే (P4 Survey) పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,70,365 కుటుంబాలు ఉండగా, ఇప్పటికి 1,88,893 కుటుంబాలను అంటే 40.16 శాతం సర్వే పూర్తి చేశారు. ఇందులో 157213 కుటుంబాల (83.23 శాతం) ఆమోదం తీసుకున్నారు. ఇక 2,81,472 కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 645 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 20 శాతం నిరుపేద కుటుంబాలు గుర్తించి గ్రామ సభల ద్వారా నిర్దారిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు.ఎన్నో సందేహాలు! సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయభూమి ఎంత ఉంది? మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్‌కం ట్యాక్స్ (Income Tax) ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్ వినియోగం ఎంతమంది అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీస్తున్నారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. నాడు సంక్షేమ జాతర.. నేడు పాతరవైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమం అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే నేతలు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు.చదవండి: బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..పెన్షన్ రూ. 1000లు పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా పీ4 సర్వే చేపట్టడం ఇందులోభాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారి పేర్లు సైతం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం, అలాంటి వివరాలు నమోదు చేసినపుడు బయో మెట్రిక్ ద్వారా ధృవీకరించాలని కూడా చెప్పడం అనుమానాలు బలపడేందుకు కారణాలుగా ఉన్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేగుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు. -
ఇంటర్‌పోల్ మొట్టమొదటి సిల్వర్ నోటీస్
న్యూఢిల్లీ: సభ్య దేశాలకు రంగుల కోడ్ కలిగిన నోటీసులు జారీ చేసే ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ పోలీస్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్) అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది. సరిహద్దులు దాటి వెళ్లే అక్రమ సంపదను గుర్తించేందుకు మొట్టమొదటిసారిగా సిల్వర్ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భారత్ సహా 54 సభ్య దేశాలు, ప్రాంతాలున్నాయని ఇంటర్ పోల్ శుక్రవారం తెలిపింది. సీనియర్ మాఫియా ముఠా సభ్యుడికి చెందిన ఆస్తుల వివరాలను కనుగొనాలంటూ ఇటలీ చేసిన వినతి మేరకు ఈ నోటీస్ జారీ చేశామంది. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది సభ్య దేశాలకు మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ నోటీస్ అమల్లో ఉంటుందని వివరించింది. అక్రమాలు, అవినీతి, డ్రగ్స్ రవాణా, పర్యావరణ సంబంధ నేరాలు, ఇతర తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేస్తామని ఇంటర్ పోల్ తెలిపింది. ఈ నోటీసులను అవసరమైతే మొత్తం 196 సభ్య దేశాలకు లేదా ఎంపికైన దేశాలకు పంపవచ్చని పేర్కొంది. ఇటువంటి నేరగాళ్లు సంపాదించిన సొత్తును స్వాధీనం చేసుకోవడం ద్వారా సంస్థాగత నేరాలను అరికట్టేందుకు అక్రమార్కుల నెట్‌వర్క్‌ను చేధించవచ్చని వివరించింది. కాగా, ప్రస్తుతం భారత్‌కు చెందిన కనీసం 10 మంది నేరగాళ్లు ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరు ఎంత మొత్తం నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారనే దానిపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. తాజా పరిణామంతో, మనం కూడా మెహుల్ చోక్సీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేయాలని కోరేందుకు అవకాశం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆ 8 నోటీసులు ఏవంటే.. ఫ్రాన్సులోని లియోన్ నగరం కేంద్రంగా ఇంటర్‌పోల్ కార్యకలాపాలు సాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్య దేశాల నుంచి అవసరమైన సమాచారం కోసం ఇంటర్‌పోల్ ప్రస్తుతం 8 రకాల కోడెడ్ నోటీసులను జారీ చేస్తోంది. ఇందులో రెడ్ నోటీస్‌ను మరో దేశంలో దాక్కున్న పరారైన నేరగాడిని పట్టుకునేందుకు లేదా గుర్తించేందుకు సభ్యదేశం విజ్ఞప్తి మేరకు జారీ చేస్తుంది. యెల్లో నోటీస్‌ను కనిపించకుండా పోయిన వారిని, ముఖ్యంగా చిన్నారులను వెదికి పట్టుకునేందుకు జారీ చేస్తుంది. ఓ నేర ఘటన దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని లేదా ప్రాంతాన్ని గుర్తించేందుకు బ్లూ నోటీస్‌ను పంపుతుంది. ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారిన వ్యక్తి, అతడి నేర కార్యకలాపాలపై గ్రీన్ నోటీసును, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోసం బ్లాక్ నోటీసును, ఒక ఘటన, వ్యక్తి లేదా వస్తువు, ప్రక్రియ కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదమని భావిస్తే ఆరెంజ్ నోటీసును, నేరగాళ్లు ఆవలంభించే వివిధ ఆయుధాలు, లక్ష్యాలు, రహస్య విధానాలకు సంబంధించిన సమాచారంతో పర్పుల్ నోటీసును సభ్య దేశాలకు పంపుతుంది. అంతేకాదు, ఐరాస సర్వప్రతినిధి సభ వివిధ వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా విధించే ఆంక్షలకు సంబంధించిన నోటీసులను సైతం ఇంటర్‌పోల్ జారీ చేస్తుంది. -
భారత్‌కు తిరిగిరాకుండానే హెచ్1బీ రెన్యూవల్!
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. 2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్‌కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి. -
కేంద్రం కంట్రోల్లో ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలును ఇకపై పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు జరిగినా వాటికి సంబంధించిన అన్ని రకాల చెల్లింపులను నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులకు, సంస్థలకు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలుత ఏడు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విధానం అమలులోకి వస్తే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఇక రాష్ట్రాల పాత్ర నామమాత్రం కానుంది.రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం పథకం అమలుకు రాష్ట్రాలు చేసే ఖర్చులో కనీసం 60 శాతం (ఏడాదిలో రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే అందులో కనీసం రూ.60 కోట్లు) కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులను ఎప్పుటికప్పుడు ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతనాలు, మెటీరియల్ నిధులను రెండు వేర్వేరు కేటగిరీలుగా వర్గీకరించి 2006లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మెటీరియల్ కేటగిరీ నిధులు కూడా..ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించడంతోపాటు పలుచోట్ల అవినీతి చోటు చేసుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏడేళ్ల కిందట 2017–18లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వారి బ్యాంకు ఖాతాలకు కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని అమలులోకి తెచ్చింది. రాష్ట్రాల వారీగా కూలీల ద్వారా జరిగిన పనులకు అయ్యే మొత్తంలో గరిష్టంగా 40 శాతం మెటీరియల్ నిధులను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తూ వస్తోంది. ఆయా నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఇక మీదట మెటీరియల్ కేటగిరీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని తీసుకురానుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, చత్తీస్గడ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మెటీరియల్ కేటగిరీ నిధులను సైతం కేంద్రమే నేరుగా ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే విధానాన్ని అమలు చేయనుంది. తొలుత మన రాష్ట్రంలో కూడా పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భావించినా అనంతరం తొలగించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నూతన విధానానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పది రోజుల క్రితమే రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్రం వాటా కూడాఉమ్మడి ఖాతాలో జమ! మెటీరియల్ కేటగిరీ నిధులను కూడా నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే ప్రక్రియ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఇవ్వాల్సిన 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.90 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల దాకా ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతుండగా, మన రాష్ట్రంలో ఏటా రూ.9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల విలువైన పనులు నమోదవుతున్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా మెటీరియల్ కేటగిరీ నిధుల వాటా ఏటా రూ.30 వేల కోట్ల దాకా ఉండగా, మన రాష్ట్రంలో దాదాపు రూ.ఐదు వేల కోట్ల దాకా మెటీరియల్ కేటగిరీ నిధులు ఉంటాయి. కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తే మన రాష్ట్రం ఏటా సుమారు రూ.1,250 కోట్ల వరకు ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం ఉమ్మడి ఖాతాకు నిధులు జమ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మార్చిలోగా వొడాఫోన్ ఐడియా 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 2025 మార్చిలోగా వాణిజ్యపరంగా 5జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 11,500లకుపైగా 4జీ టవర్స్ ఉన్నాయి. దశలవారీగా వీటిని 5జీకి అప్‌గ్రేడ్ చేస్తాం. స్పామ్ సందేశాలను అడ్డుకునే సాంకేతికతను పరిచయం చేశాం. ఈ సేవలను కాల్స్‌కు కూడా త్వరలో విస్తరిస్తాం. ప్రస్తుతం స్పామ్ కాల్స్ కట్టడికి సంబంధించి టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోటికి పైగా చందాదార్లు ఉన్నారు. ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తున్న సగటు ఆదాయం నెలకు రూ. 200 ఉంది. సగటున ఒక్కో కస్టమర్ డేటా వినియోగం ప్రస్తుతం నెలకు 18–20 జీబీ ఉందని ఆనంద్ చెప్పారు. దేశవ్యాప్తంగా కంపెనీ రూ.18,000 కోట్ల తాజా పెట్టుబడులు చేస్తోందని తెలిపారు. -
పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు వైద్య సేవలు
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్‌సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్‌సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. -
132 సీట్ల బస్సు.. పైలట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించిన గడ్కరీ
భారతదేశంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణంగా ప్రతివ్యక్తి సొంతంగా వాహనం కలిగి ఉండాలనుకోవడమే. ఓ ఇంట్లో నలుగురు జనాభా ఉంటే.. నలుగురికీ నాలుగు కార్లు ఉంటాయి. చాలామంది ప్రజా రవాణా ఉపయోగించడమే పూర్తిగా మానేశారు కూడా. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' పైలట్ ప్రాజెక్ట్ మొదలైనట్లు వెల్లడించారు.ఇటీవల ఇన్‌ఫ్రాశక్తి అవార్డుల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గడ్కరీ రాబోయే 132 సీట్ల బస్సు గురించి వివరించారు. ఈ బస్సులలో విమానం మాదిరిగా ఉండే సీట్లు, ఎయిర్ హోస్టెస్ మాదిరిగానే 'బస్ హోస్టెస్' ఉంటారని వెల్లడించారు. ఇంధనం తక్కువగా వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకున్నట్లు, భవిష్యత్తులో భారత్ ఇంధన దిగుమతిదారుగా కాకుండా.. ఎగుమతిదారుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ఇంధన వినియోగం తగ్గించడానికి ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా.. 300 ఇథనాల్ పంపులను ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు.ప్రజా రవాణా ఖర్చును తగ్గించడానికి కూడా ప్రభుత్వం మార్గాలను అన్వేషితోందని గడ్కరీ అన్నారు. డీజిల్ బస్సు ఒక కిమీ నవ్వడానికి 115 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 41, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 37 మాత్రమే ఖర్చు అవుతుంది. నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు.. టికెట్ ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం మేము టాటాతో కలిసి నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. నేను చెక్ రిపబ్లిక్కు వెళ్ళినప్పుడు.. అక్కడ మూడు ట్రాలీలు ఉన్న బస్సు చూశాను. అలాంటిదే ఇండియాలో కూడా రోపొందించాలని అనుకున్నాను. రాబోయే ఎలక్ట్రిక్ బస్సు 132 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 40 సెకన్లలో 40 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జింగ్ వేసుకుంటుంది. దీనికోసం అయ్యే ఖర్చు రూ. 35 నుంచి రూ. 40 మాత్రమే. -
పుస్తకాలు చూస్తూనే పరీక్ష!
న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్లోనే బోర్డ్ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచి్చంది. నిరీ్ణత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్–బుక్ ఎగ్జామ్’ పైలట్ ప్రాజెక్టుకు సీబీఎస్ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్ఈ అధికారులు స్పష్టంచేశారు. కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, సామాన్య శా్రస్తాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, జీవశా్రస్తాల్లో ఈ ఓపెన్–బుక్ ఎగ్జామ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు? అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్ఈ ఓ నిర్ణయానికి రానుంది. -
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అనాథలకు 2 % కోటా
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో తల్లిదండ్రులు లేనివారికి (అనాథలు) రెండు శాతం కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని అధికారులను రాష్ట్ర పీఆర్, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నా, నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువమంది ముందుకు రావడం లేదన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా సులభతరం చేయాలని సూచించారు. అంగన్వాడీలకు వచ్చే పాలను సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లో ఉన్న డెయిరీల ద్వారా సేకరించాలని, ఇందుకు ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మహిళ, శిశు సంక్షేమశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లల రక్షణ యూనిట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వాలని, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచినా డిపార్ట్మెంట్ నియంత్రణ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒకటి, రెండు రోజుల పనికోసం వచ్చే వర్కింగ్ ఉమెన్‌కు ముఖ్యమైన పెద్ద నగరాల్లో శాఖాపరంగా హాస్టళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు ఉండేవిధంగా అధికారులు చొరవ చూపాలనన్నారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘స్త్రీ నిధి’ దుర్వినియోగంపై విచారణ కమిటీ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్త్రీ నిధి పథకంలో నిధుల దుర్వినియోగం ఫిర్యాదులపై శాఖాపరమైన విచా రణ కమిటీని ఏర్పాటు చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ నిధుల దుర్వినియోగంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో వస్తున్న ఆరోపణలు, జరిగిన ప్రచారం వల్ల దీనిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివా లయంలో స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌పై సమీక్ష సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, స్త్రీనిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రుణాలు ఎక్కువ ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. హైవేలతో పాటు ఇతర ప్రధానమైన రోడ్లకు ఇరుపక్కల వివిధ రకాల పండ్లు, కూరగా యలు, ఇతర వస్తువులు అమ్ముకునే వారికి షెడ్స్ ఏర్పాటు ద్వారా మరింత ఉపాధి పొందటానికి అవ కాశం ఉంటుందని చెప్పారు. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబల్ ఏరియాలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. మహిళలు వంద శాతం స్వయం సహాయక సంఘాలలో జాయిన్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా ఒకసారి సమీక్షా సమావేశం ఉంటుందని, మహిళల ఆర్థిక సాధికారికత పెంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, స్త్రీనిధి డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘వ్యర్థాలతో’ జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రయత్నాలు ఆరంభించింది. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో గుట్టలు, గుట్టలుగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను దేశంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేసేందుకు ఉపయోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఇందుకోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. వ్యర్థాలను జాతీయ రహదారుల నిర్మాణం కోసం సద్వినియోగం చేసుకోవడాన్ని ఎన్హెచ్ఏఐ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టింది. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే, ఢిల్లీ–ఎన్సీఆర్ హైవేల నిర్మాణంలో ఈ వ్యర్థాలను ఉపయోగించింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం మార్కింగ్ చేసిన మార్గంలో భూమిని కొంత వరకు ఎత్తు పెంచిన అనంతరం కొత్త రహదారులను నిర్మిస్తారు. ఇందుకోసం ఇప్పటి వరకు మట్టి, కంకరలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటు నగరాలు, పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలోని సాలిడ్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల్లో ఈ వ్యర్థాలను ఉపయోగించాలని ఎన్హెచ్ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని నగరాలు, పట్టణాల్లోని 2,304 డంపింగ్ యార్డుల్లో ప్రస్తుతం 170 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ అందుబాటులో ఉందని స్వచ్ఛ భారత్ మిషన్ అంచనా వేసింది. దాదాపు 10వేల హెక్టార్ల మేర ఉన్న డంపింగ్ ప్రదేశాల్లో ఆ వ్యర్థాలన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐకు అందించాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశించింది. ఇందుకోసం డంపింగ్ యార్డ్ల వద్ద బయోమౌనింగ్ యంత్రాలను ఎన్హెచ్ఏఐ సమకూర్చనున్నది. తద్వారా దేశంలోని వ్యర్థాలను సక్రమ నిర్వహణ, సరైన రీతిలో సద్వినియోగానికి సాధ్యపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరోవైపు పర్యావరణ కాలుష్య సమస్యకు కూడా సరైన పరిష్కారంగా పరిగణిస్తోంది. -
నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస
లోన్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (PTPFC)ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్బీఐ బోర్డ్ మీటింగ్‌లో ప్రదర్శించారు. దీన్ని వీక్షించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అద్భుతమంటూ ప్రశంసించారు. రుణగ్రహీతలు, రుణ సంస్థలను అనుసంధానించి తక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలనుకునేవారికి రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ పీటీపీఎఫ్‌సీని రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్ రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు, ఎంఎస్ఎంఈలకు నాన్-కొలేటరల్ ఆధారిత రుణాలు, హోం లోన్లు, డెయిరీ రుణాలు, వ్యక్తిగత రుణాల మంజూరులో సహాయపడుతుంది. తాజాగా ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశానికి హాజరైన ఆనంద్ మహీంద్రా ఆ విశేషాలను ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పంచుకున్నారు. "కొన్నిసార్లు ముందు వరుసలో సీటు పొందడం గొప్పగా ఉంటుంది. శనివారం (సెప్టెంబర్ 2) ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న మాకు రిజర్వ్ బ్యాంక్ పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (PTPFC) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. ఇది కేవైసీ ప్రక్రియలు, డాక్యుమెంట్లను సమీకృతం చేయడం ద్వారా రుణం మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని రోజుల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. తద్వారా గ్రామీణ కస్టమర్లకు క్రెడిట్ డెలివరీ మెకానిజంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ఓపెన్ ప్లాట్‌ఫారమ్ దీనిని ఉపయోగించాలనుకునే అన్ని బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. భారత్ మళ్లీ డిజిటల్ పోల్ పొజిషన్‌ను తీసుకుంటోంది. అభినందనలు ఆర్బీఐ" అంటూ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు. పీటీపీఎఫ్సీ పైలట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను జత చేశారు. Sometimes, you feel you’ve been privileged to get a front-row seat to a Social & Technological disruption. At the @RBI board meeting in Indore last Saturday, we were given a demonstration of the Reserve Bank’s Public Tech Platform for Frictionless Credit (PTPFC) pilot project.… pic.twitter.com/3QpkT4lNqz — anand mahindra (@anandmahindra) September 4, 2023 -
కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తాజాగా యూపీఐ ఇంటరాపరబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. వ్యాపారుల యూపీఐ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ ఎండీ కె. సత్యనారాయణ రాజు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా సీబీడీసీ బోర్డింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ప్రస్తుతం తమకున్న యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారానే వ్యాపారులు డిజిటల్ కరెన్సీలో చెల్లింపులను పొందవచ్చని ఆయన వివరించారు. అనుసంధానించిన ఖాతా నుంచి కస్టమర్లు తమ సీబీడీసీ వాలెట్‌లోకి కరెన్సీని లోడ్ చేసుకోవచ్చని, దాన్ని సీబీడీసీ వాలెట్ ఉన్న ఎవరికైనా బదలాయించవచ్చని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, స్వీకరించవచ్చని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో దీన్ని కస్టమర్లు, వ్యాపారులకు పైలట్ ప్రాతిపదికన దీన్ని ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. -
ఆర్బీఐ ‘పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం’.. లోన్ మంజూరు వేగవంతానికి చర్యలు
ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్ఫామ్లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది. ప్రస్తుతం డిజిటల్‌గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడనుంది. -
ఎంఎస్ఎంఈల నమోదుకు సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను)గుర్తించి వాటిని నమోదు చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో నమోదుకాని ఎంఎస్ఎంఈలకు ఎటువంటి ప్రభుత్వసాయం అందటం లేదు. కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యం పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలతో పాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఉత్పత్తులు విక్రయించే అవకాశాలు ఎంఎస్ఎంఈలకు ఏర్పడతాయి. 2015–16 శాంపిల్ సర్వే ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 33,87,000 నమోదుకాని ఎంఎస్ఎంఈలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మన రాష్ట్రం నుంచి ఉద్యం పోర్టల్‌లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 5,26,993 మాత్రమే. ఎంఎస్ఎంఈల సంఖ్య పరంగా మన రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. 31.22 లక్షల ఎంఎస్ఎంఈలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 17.82 లక్షలతో తమిళనాడు రెండోస్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇలా నమోదుకాని ఎంఎస్ఎంఈలను గుర్తించి వాటిని నమోదు చేయించడం ద్వారా ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సర్వే పేరిట వాస్తవంగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్యను వెలికితీయనుంది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో ఈ వివరాలను సేకరించడానికి టీసీఎస్ సంస్థతో ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఎంఎస్ఎంఈ వ్యాపార పరిమాణ, ఏ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయిమెంట్ వంటి అన్ని వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే బాధ్యతను ప్రభుత్వం పరిశ్రమల శాఖతోపాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ సర్వేకి సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్లకు శిక్షణ ఇచ్చి తొలుత పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సర్వే అనంతరం వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్ట కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది. విజయవాడలో తొలిసారిగా.. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది. ఈ ఔట్లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది. కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. -
మిర్చి ఘాటు.. ఏఐ చెబుతుంది!
రైతులు మార్కెట్ యార్డుకు పంటను తీసుకెళ్తే.. అక్కడి వ్యాపారులు, నిపుణులు ఆ పంటను పరిశీలించి, వాసన చూసి, తేమ ఎంత ఉంటుందో అంచనా వేసి ధర కడతారు. అలా కాకుండా కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే యంత్రాలే.. కాస్త శాంపిల్ చూసి పంట నాణ్యత, తేమశాతం కచ్చితంగా చెప్పేస్తే రైతులకు ఎంతో ఊరట. పని త్వరగా పూర్తవుతుంది, మోసాలకు తావుండదు. వ్యాపారులు కొర్రీపెట్టి ధర తగ్గించేసే అవకాశం ఉండదు. ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్), ఏజీనెక్ట్స్ స్టార్టప్ సంస్థల సహకారంతో ఇలా ఏఐతో పనిచేసే మెషీన్లతో మిర్చి పంట విక్రయాలు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ (ఏఐ4ఏఐ)’కార్యక్రమంలో భాగంగా.. ‘సాగు–బాగు’పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. దీనితో మొత్తం ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – ఖమ్మం వ్యవసాయం మూడు యంత్రాలతో.. మూడు ప్రమాణాల గుర్తింపు మిర్చి పంట నాణ్యతను తేల్చేందుకు ఏఐ ఆధారిత ‘విజియో బాక్స్, 7స్పెక్‌ఎక్స్ ప్రో, 7స్పెక్‌ఎక్స్ కనెక్ట్’గా పిలిచే మూడు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనిలో విజియో బాక్స్‌లో మిర్చిని పెడితే.. అది కాయ పరిమాణం, రంగు, మచ్చలు ఇతర అంశాలను పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. ♦ 100 గ్రాముల మిర్చిని పరిశీలించి నాణ్యత, రసాయనాల శాతం, తేమశాతాన్ని పరిశీలించడం కేవలం 20–25 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే ప్రస్తుత సాధారణ పద్ధతిలో ఒక రోజు వరకు పడుతుంది. ♦ ఏఐ పరికరాల్లో పరిశీలన పూర్తయిన వెంటనే.. మిర్చికి ఏ, బీ, సీ, డీ అంటూ గ్రేడింగ్ ఇస్తుంది. ఈ వివరాలతో ఆటోమేటిగ్గా రైతుల ఫోన్ నంబర్లకు సంబంధిత ఎస్సెమ్మెస్ కూడా వస్తుంది. ♦ నిపుణులు, రైతుల సహకారంతో మిర్చికి సంబంధించిన వేలాది ఫొటోలను అప్లోడ్ చేసి ఏఐ ప్రోగ్రామ్‌ను రూపొందించామని.. దీనితో మంచి నిపుణులతో పోల్చితే 98శాతం కచ్చితత్వంతో ఏఐ యంత్రాలు పనిచేస్తున్నాయని ఏజీ నెక్ట్స్ స్టార్టప్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. పొలాల వద్దే మిర్చి కొనుగోళ్లు కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ‘సాగు– బాగు’కార్యక్రమాన్ని మిర్చి సాగు మొదలు పంట అమ్మకం వరకు తగిన సాయం అందేలా రూపొందించింది. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం.. ఎగుమతులకు పేరున్న ‘తేజ’రకం మిర్చిని సాగుచేసే ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయ డివిజన్లోని ఏడు వేల మంది రైతులను ఎంపిక చేశారు. వారికి కొత్త విధానంపై అవగాహన కల్పించేందుకు 25 మంది సీఆర్పీలను నియమించారు. రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి.. ఎరువులు, పురుగు మందుల వాడకం తదితర అంశాలపై తగిన సూచనలు అందించారు. రైతులు మిర్చి పంటను పొలాల వద్దే విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం రైతువేదికల్లో పంట నాణ్యత పరిశీలన కోసం ఏఐ మెషీన్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రాజెక్టు అమలు చేసిన మూడు మండలాల్లో 150 టన్నుల మిర్చిని విక్రయించగా.. క్వింటాల్‌కు రూ.19,500 నుంచి రూ.22వేల వరకు ధర దక్కడం గమనార్హం. పొలం వద్దే పంట విక్రయించా.. మిర్చి తోటలోనే పంటను విక్రయించా. సాగు–బాగు ప్రాజెక్టు ప్రయోజనకరంగా ఉంది. నేరుగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇచ్చారు. పంట నాణ్యతను రైతువేదిక వద్దే పరీక్షించి, తోటలోనే విక్రయించాను. మార్కెట్లో కంటే మెరుగ్గా క్వింటాల్‌కు రూ.22 వేల ధర లభించింది. కమీషన్, రవాణా చార్జీలు కూడా మిగిలాయి. వెంటనే సొమ్ము చెల్లించారు. – వి.రమేశ్, లింగారం తండా, కూసుమంచి మండలం -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
డిజిటల్ రోడ్లు రాబోతున్నాయ్!
(కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. తొలి విడతతో ప్రయోగాత్మకంగా 1,367 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఢిల్లీ–ముంబై జాతీయ రహదారితోపాటు 512 కిలోమీటర్ల మేర హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులను డిజిటల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి పక్కన 3 మీటర్ల మేర డెడికేటెడ్ కారిడార్‌లో ఓఎఫ్సీ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి సైతం డిజిటల్ రోడ్డుగా మారనుంది. డిజిటల్ రోడ్ల ఏర్పాటుతో ఈ రహదారి వెంట 5జీ, 6జీ నెట్వర్క్ సేవలు లభించడంతోపాటు రహదారి వెంట ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ కేబుల్ నెట్‌వర్క్‌ను ఎక్కడికక్కడ వినియోగించుకునేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా ఈ రహదారి వెంట ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఐటీ కంపెనీల ఏర్పాటుకూ అనుకూలం జాతీయ రహదారి వెంట ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్–బెంగళూరు రహదారి వెంట ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గల జడ్చర్ల, కర్నూలు, అనంతపురం, గుత్తి, హిందుపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉండనుంది. డిజిటల్ రోడ్ల వల్ల టైర్–2, 3 పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది. ♦ హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే సంతోష్ అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యలో కంపెనీ నుంచి ఫోనొచ్చింది. అర్జెంటుగా క్లయింట్‌తో మాట్లాడమని. దగ్గరలోనే రహదారి వెంట ఏర్పాటైన ప్లగ్ అండ్ ప్లే వర్క్ స్టేషన్లోకి వెళ్లి క్లయింట్‌తో మాట్లాడిన సంతోష్ క్లయింట్‌కు గల అనుమానాలను నివృత్తి చేశారు. తన హెడ్‌కు ఇదే విషయాన్ని కమ్యూనికేట్ చేశాడు. కంపెనీ నుంచి సంతోష్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ♦ హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న రమేష్‌కు ఓ అలర్ట్ వచ్చింది. ఆ రహదారిలో యాక్సిడెంట్ అయ్యిందని.. రాకపోకలు స్తంభించిపోయాయని.. రోడ్డు క్లియర్ అయ్యేందుకు మరో గంట సమయం పడుతుందని అందులోని సారాంశం. దీంతో రమేష్ ప్రత్యామ్నాయ మార్గంలో తన ప్రయాణం కొనసాగించి సకాలంలో ఇంటికి చేరుకున్నాడు. ఇవేకాదు.. రానున్న రోజుల్లో డిజిటల్ రోడ్ల ఏర్పాటుతో మరింత సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు దారి వెంట మారుమూల ప్రాంతాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి 5జీ, 6జీ సేవలు లభించనున్నాయి. ప్రయోజనాలివీ..! ♦ జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ తెలిసే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. వాహనం నడిపే డ్రైవర్లకు అవసరమైన, కచ్చితమైన సమాచారం అందుతుంది. ♦ రియల్ టైం డేటాను ప్రయాణికులకు అందించడం ద్వారా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు మరింత మెరుగ్గా అవకాశం కలుగుతుంది. ప్రమాదాలను నివారించే అవకాశం ఏర్పడుతుంది. పక్కా సమాచారం అందటం వల్ల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ♦ డ్రోన్లను వినియోగించుకునే వీలు కలుగుతుంది. తద్వారా రిమోట్ ఏరియాల్లో సమాచారాన్ని కూడా పొందవచ్చు. ప్రతిసారి ఏవైనా పనులు చేపట్టే సంస్థ సైట్ విజిట్స్‌ను తగ్గించుకోవచ్చు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏరియల్ సర్వే చేసే వీలవుతుంది. ♦ డ్రైవర్ అవసరం లేకుండా రోడ్లపై పరుగులు పెట్టనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా నడిచే వాహనాల వినియోగానికి ఈ రహదారులు మరింత అనువుగా ఉండనున్నాయి. ♦ ఈ రహదారులు మొత్తం కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించే వీలుంది. తద్వారా జాతీయ రహదారి వెంట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే వీలు కలుగుతుంది. -
ఆరోగ్యాన్నిచ్చే సముద్రపు నాచు.. ఎన్నెన్నో పోషకాలు.. ఏపీకి సదావకాశం
సీవీడ్.. శతాబ్దాలుగా పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన పేరిది. దశాబ్ద కాలంగా దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీని ప్రత్యేకతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సముద్రపు నాచుగా పిలిచే సీవీడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ సమ్మేళనాల్లో ఉంటాయి. శతాబ్దాలుగా చైనా, జపాన్, కొరియా, మెక్సికో వంటి కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సముద్రపు నాచును సంప్రదాయ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఐరోపా వంటకాల్లో సముద్రపు నాచును చేర్చేందుకు ఫ్రాన్స్‌లో పెద్దఎత్తున ప్రయత్నాలు చేసి కొంతమేర విజయం సాధించారు. జపాన్ దేశీయులు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, హవాయి వంటి ప్రాంతాల్లో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్లలో ఇది సాధారణంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఆస్ట్రియా, జర్మనీలలో సముద్రపు నాచును అత్యంత విలువైన బ్రెడ్–అల్టెన్బ్రోట్ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌లో బారామోర్ లేదా బ్రెడ్ ఆఫ్ సీ తయారీకి ఉపయోగిస్తున్నారు. తృణ ధాన్యాల మిశ్రమం సీవీడ్ తృణధాన్యాల మిశ్రమం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు మానవ వినియోగం కోసం ప్రత్యేకంగా సముద్రపు నాచును పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ జనాభా పెరుగుదల, పరిమిత భూమి, విలువైన సహజ వనరుల ప్రాముఖ్యత దీనిపై పరిశోధనలకు కారణమైంది. జపాన్, చైనా వంటి కొన్ని దేశాల్లో వీటి పెంపకం పరిశ్రమ స్థాయికి చేరుకుంది. జపాన్, చైనా, కొరియా, మెక్సికో, అమెరికన్ దేశాల్లో శతాబ్దాలుగా దాదాపు 66 శాతం ఆల్గే (సముద్రపు నాచు) జాతులను రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని గుర్తించారు. ఏపీకి అందివచ్చిన అవకాశం సువిశాల సముద్ర తీరం గల ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ఇప్పుడు మెగా మిషన్‌ను ప్రారంభించింది. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు శ్రీకాకుళం జిల్లా బారువ, విశాఖపట్నం భీమిలి బీచ్‌కు వెళ్లే దారిలో మంగమారిపేట, బాపట్ల జిల్లా సూర్యలంక, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పైలట్ ప్రాతిపదికన సీవీడ్ సాగును ప్రారంభించారు. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో 49 ప్రదేశాలు దీని సాగుకు అనువైనవిగా గుర్తించారు. మన దేశంలో సముద్రపు నాచును మందులు, వస్త్రాలు, ఎరువులు, పశువుల దాణా, జీవ ఇంధన పరిశ్రమల్లోనూ వినియోగిస్తున్నారు. సీవీడ్ ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఉంటుంది. అత్యధికంగా సాగు చేస్తున్న సీవీడ్ రకాలు కప్పాఫైకస్ ఆల్వారెజి, గ్రాసిలేరియా, సాచరినా జపోనికా, ఫైరోపియా, సర్గస్సమ్ ప్యూసిఫార్మ్. ప్రభుత్వ ప్రోత్సాహం సీవీడ్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి సాగును ప్రోత్సహిస్తోంది. ఏపీలో 10 వేల సీవీడ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. మత్స్యకారులు, మత్స్యకార మహిళా సొసైటీలు, ఎస్సీ, ఎస్టీ కో–ఆపరేటివ్ సొసైటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడిలో 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రానికి ఈ ఏడాది 7,200 యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.12 కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా రూ.74.40 లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ♦ సీవీడ్ సాగుకు అయ్యే వ్యయం అత్యల్పం. శ్రమశక్తి వినియోగం కూడా స్వల్పమే. ♦ ఒకసారి విత్తనాలు కొని తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పునరుత్పత్తి అయ్యే విత్తనాలే వాడుకోవచ్చు. ♦ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వేయాల్సిన అవసరం లేదు. ♦కొద్దిపాటి శిక్షణతో మహిళలు, నిరక్షరాస్యులు సైతం పెద్దఎత్తున సాగు చేయవచ్చు. ♦రెండు నెలల వ్యవధిలోనే ఉత్పత్తులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ♦దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో పాటు ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. ♦ సముద్రపు నాచులో అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ♦ రొయ్యలు, చేపల పెంపకంలో నాణ్యమైన ఫీడ్‌గా, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ♦అధిక పోషకాలు ఉన్నందున ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ♦ నీటిని శుభ్రపరిచే గుణం దీనికి ఉంది. సముద్రంలో చేరే మురుగు, ఇతర వ్యర్థాలను శోషించుకుని నీటిని స్వచ్ఛంగా ఉంచేందుకు నాచు సహాయ పడుతుంది. సాగు ఇలా.. సముద్రంలో అలలు తక్కువగా ఉండే ప్రదేశాలు, బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతాల్లో సీవీడ్ సాగు చేసుకోవచ్చు. అలల ఉధృతి అధికంగా ఉంటే నాచు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదముంది. ఏడాదిలో ఏడెనిమిది నెలలు దీని సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సీవీడ్ విత్తనాలను కిలో రూ.50 చొప్పున తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. అధిక సాంద్రత కలిగిన పాలీవినైల్ పైప్స్ లేదా ట్యూబ్ నెట్ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. సీఎంఎఫ్ఆర్ఐ, పీఎంఎంఎస్వై ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తాయి. విత్తనాలను వలల్లో అమర్చి ఆ వలలను కర్రలు లేదా పైపులకు కడతారు. కెరటాల అలజడి లేని తీర ప్రాంతాల్లో వాటిని తెప్పల్లా అమర్చుతారు. 2 రోజులకోసారి వాటిని పరిశీలిస్తుంటారు. 45–60 రోజుల్లో మొక్కలు పెరుగుతాయి. వాటిని ఎండబెట్టి విక్రయిస్తారు. – సురేష్, మత్స్యశాఖ జేడీ, బాపట్ల జిల్లా -
గుడ్‌న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. ఉద్యోగులు ఫుల్ ఖుష్.!
లండన్: ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్‌లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో.. నాలుగు రోజులు పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు. చిన్న పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు చెప్పాయి. ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానాన్నే తాము కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం సంస్థలు కాస్త సందిగ్ధత వ్యక్తం చేయగా.. మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే(ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 35 శాతం పెరిగిన రెవెన్యూ.. వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజెనెస్ పర్ఫామెన్స్‌కు 7.5 రేటింగ్ ఇచ్చాయి. ఈ విధానం వల్ల గతేడాదితో పాల్చితే రెవెన్యూ 35 శాతం పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. కొత్త నియామకాలు పెరిగాయని, ఆఫీసులకు గైర్హాజరు శాతం తగ్గిందని పేర్కొన్నాయి. ఉద్యోగులకు సంతృప్తి.. నాలుగు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రయల్‌లో తేలింది. చాలా మంది వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించారని, ఉద్యోగ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల కన్పించిందని వెల్లడైంది. అలాగే ఉద్యోగులకు ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు కూడా తగ్గాయి. పర్యావరణ ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నాలుగు రోజులే పనిదినాలు కాడవంతో ఆపీస్‌కు వెళ్లే సమయంతో పాటు వాహనాల వినియోగం కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. మహిళలకే ఎక్కువ బెనిఫిట్.. ఈ కొత్త విధానం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మేలు జరుగుతున్నట్లు ట్రయల్‌లో తేలింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు పురుషులు సమయం కేటాయించడంతో మహిళలకు ఆ భారం తగ్గినట్లు వెల్లడైంది. వారానికే నాలుగు రోజుల పనిదినాలు విధానాన్ని భవిష్యత్తులో తాము ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు '4 డే వీక్ గ్లోబల్' స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ, చార్లోటె లాక్హార్ట్ చెప్పారు. చదవండి: 'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..' -
‘అమ్మా’రావం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇలా అంతా కోరుకున్న రీతిలో వస్తున్న ఆవు దూడలు పాడి రంగంలో కొత్త క్షీర విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. స్వదేశీ ఆవుల సంఖ్యను పెంచడం.. అలాగే అధికంగా పాలిచ్చే జాతి ఆవులను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీన్ని తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తోపాటు మరో పది రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టింది. ఇందులోభాగంగా కామారెడ్డి జిల్లా తిప్పాపూర్, ఎర్రపహాడ్, కొండాపూర్, చిన్నమల్లారెడ్డి, లింగంపల్లి, ఎల్లంపేట, మోతె, కొయ్యగుట్ట, మహ్మదాపూర్, కరత్పల్లి పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన 160 ఆవుల్లో లింగ నిర్ధారణ చేసి సాహివాల్, గిర్ తదితర స్వదేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే హెచ్ఎఫ్, జెర్సీ కోడెల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. ఇందులో ఇప్పటివరకు 134 ఆవులు గర్భం దాల్చి 126 (94 శాతం) ఆడ దూడలు, 8 కోడె దూడలకు జన్మనిచ్చాయి. దీంతో రైతులు స్వదేశీ గిర్, సాహివాల్ ఆడ దూడలతోపాటు అధిక పాలనిచ్చే ఆవులకు యజమానులయ్యారు. లక్షలు పోసినా దొరకని స్వదేశీ, విదేశీ ఆవుజాతులు ఇప్పుడు తమ పంటపొలాల్లో పరుగెడుతుండటంతో సంబరపడిపోతున్నారు. ‘స్వదేశీ ఆవును పెంచుకోవాలన్నది నా జీవితాశయం. ఎవరి వద్దనైనా కొందామంటే ధర.. రూ.లక్షల్లో చెబుతున్నారు. అంత సొమ్ము భరించే స్తోమత లేదు. నా కల ఇక నెరవేరదు అనుకున్నా..! కానీ ఓ రోజు కేంద్ర పశుసంవర్థక శాఖ వారు మా ఊరిలో క్యాంప్ పెట్టి.. నా వద్ద ఉన్న విదేశీ జాతి హెచ్ఎఫ్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో కోరుకున్న స్వదేశీ ఆవు దూడ పుట్టేలా ఉచితంగా చేస్తామన్నారు. అందులో ఆడ–మగ.. ఏది కోరుకుంటే అదే పడుతుందన్నారు. నాకు సాహివాల్ రకం ఆడ దూడ కావాలని అడిగాను. నా దగ్గర ఉన్న ఆవు గర్భంలో లింగ నిర్ధారణ వీర్యం ప్రవేశపెట్టి 9 నెలల్లో సాహివాల్ ఆడ దూడను కానుకగా ఇచ్చారు. ఇలా మా ఊరి ఆవుల్లో చేసిన కృత్రిమ గర్భధారణతో అందరికీ కోరుకున్న జాతి ఆడ దూడలే పుట్టాయి. ఇది మాకు ఆశ్చర్యంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది’ అంటూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ పాడిరైతు ఏలేటి గణేశ్‌రెడ్డి ఆనందంతో గంతేశాడు.. ఈ ఆనందం ఇప్పుడు ఈయన ఒక్కడిదే కాదు కామారెడ్డి జిల్లాలో మరికొందరిది కూడా. ఇక అన్ని పల్లెలకు.. కేంద్ర ప్రభుత్వం–విజయ డెయిరీ సహకారంతో చేపట్టిన కామారెడ్డి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,192 మంది వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులతో కృత్రిమ గర్భధారణ శిబిరాల్లో రైతు రూ.250 చెల్లిస్తే వారు కోరుకున్న దూడలకు జన్మనిచ్చేలా ఆవులను సిద్ధం చేయనున్నారు. అయితే 90 శాతం ఆడ దూడలు, 10 శాతం కోడె దూడలుండే విధంగా సమతౌల్యం పాటించనున్నారు. ఈ పథకం విస్తృతంగా రైతుల్లోకి వెళ్తే వచ్చే ఏడేళ్లలో టాప్–10 రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశం ఉందని పాడి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెరీవెరీ స్పెషల్.. ►గిర్, సాహివాల్ ఆవుల పాలల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. సంతానోత్పత్తి సమర్థత కూడా అధికం. తక్కువ మేత, ఎక్కువ పాల దిగుబడితో ప్రస్తుతం ఈ స్వదేశీ జాతి ఆవులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. ►హెచ్ఎఫ్ ఆవుల్లో ఎక్కువ పాల దిగుబడితోపాటు ప్రసవించే పదిహేను రోజుల ముందు వరకు పాలు ఇవ్వడం ప్రత్యేకం. పాడిలో పెను మార్పులు పైలట్ ప్రాజెక్ట్‌గా పది గ్రామాల్లో చేసిన ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఈ పథకాన్ని మార్చిలో రాష్ట్రమంతా విస్తరిస్తాం. దీంతో పాడి రంగంలో పెనుమార్పులు రానున్నాయి. –డాక్టర్ మంజువాణి, సీఈఓ, లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మా ఇంట్లో పోషకాల గోవు.. స్వదేశీ గిర్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో మళ్లీ గిర్ ఆడ దూడ పుట్టింది. గిర్ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నా ఆవు రోజుకు 16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఒక్క స్వదేశీ ఆవు ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే. –మన్నె గంగారెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి పుణేలో.. ఫలించిన ప్రయోగంతో.. అంతరిస్తున్న దేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే విదేశీ జాతి సంతతి వృద్ధి కోసం భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (ఫుణే).. ఫ్లో సైటీమెట్రీ (బయాలాజికల్ విశ్లేషణ)తో తొలి అడుగు వేసింది. లింగ నిర్ధారణ వీర్యంతో పుణేలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, అక్కడి నుంచి తొలుత దేశీ జాతులు, ఆపై విదేశీ జాతుల లింగ నిర్ధారణ వీర్యాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆవుల్లో కృత్రిమ గర్భధారణ చేయగా, ఆశించిన విధంగానే ఎక్స్ క్రోమోజోమ్‌తో అండ ఫలదీకరణ ప్రయోగంతో కోరుకున్న స్థాయిలో ఆడ ఆవుదూడలు పుట్టాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్, ఒడిశాల్లో కృత్రిమ గర్భధారణ వేగవంతం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని విస్తృతం చేయనున్నారు. -
ప్రయాణికుల ఆనందమే లక్ష్యం.. సిటీ బస్సుల్లో 'టీఎస్ఆర్టీసీ రేడియో’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో కూకట్పల్లి డిపోకు చెందిన బస్సులో ఈ రేడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కూకట్పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్చెరువు, కూకట్పల్లి-శంకర్పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ సరికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు. TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 28, 2023 -
నాలుగు నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపీ
న్యూఢిల్లీ: రిటైల్ డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ గురువారం నాలుగు నగరాల్లో తొలి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ ఈ నగరాల్లో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో యూజర్లతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును పరీక్షిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. రెండో విడతలో దీన్ని హైదరాబాద్ సహా తొమ్మిది నగరాలకు విస్తరించనుండగా, మరో నాలుగు బ్యాంకులు కూడా పాల్గోనున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే టోకు లావాదేవీల కోసం నవంబర్ 1న డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భౌతిక రూపంలో నగదు నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని విశ్లేషకులు తెలిపారు. బ్యాంకులు అందించే మొబైల్ యాప్ వాలెట్ ద్వారా కస్టమర్లు ఈ–రూపీతో లావాదేవీలు నిర్వహించవచ్చని వివరించారు. కస్టమర్ల అభ్యర్ధన మేరకు వారి వాలెట్లలోకి బ్యాంకులు ఈ–రూపీని క్రెడిట్ చేస్తాయని, వ్యక్తులు .. వ్యాపార సంస్థలకు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపేందుకు దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలకు భిన్నంగా బ్యాంకుల అవసరాలను బట్టి ఆర్బీఐ అధికారికంగా ఈ కరెన్సీని జారీ చేస్తుంది. -
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
మోర్తాడ్: గల్ఫ్ వలస కార్మికులకోసం తెలంగాణలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్వో), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ప్రతినిధులు ముందుకొచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ఐఎల్వో దక్షిణాసియా దేశాల ఇన్చార్జి, వలస కార్మికుల వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి ఈనెల 22న హైదరాబాద్‌లో సీఎస్ సోమేష్‌కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డితో సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల నుంచి సొంత గడ్డకు చేరుకునే వారికి పునరావాసంతో పాటు, కుటుంబం, సమాజంతో వారు మమేకం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తాము కొన్ని కార్య క్రమాలను చేపట్టనున్నామని, దీనికి తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ వలసల వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఐఎల్వో ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా ధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే వలస కార్మికుల కుటుంబాలు బాగుపడే అవకా శాలు న్నాయి. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయా లన్న ఐఎల్వో ప్రతిపాదనలపై గల్ఫ్ వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎల్వో ప్రా జెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలి.. ఐఎల్వో ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలపాలి. ఇక్కడ అమలు చేయకపోతే పైలట్ ప్రాజెక్టు మరో రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నాయకులు -
RBI CBDC: డిజిటల్ రూపీ ట్రయల్స్ షురూ
ముంబై: దేశీయంగా తొలిసారి డిజిటల్ రూపాయి (సీబీడీసీ) ప్రాజెక్టు నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్‌సేల్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు, వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీ – రిటైల్ సెగ్మెంట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది. ‘డిజిటల్ రూపీ (హోల్‌సేల్ విభాగం) తొలి పైలట్ ప్రాజెక్టు నవంబర్ 1న ప్రారంభమవుతుంది‘ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన 9 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. సీమాంతర చెల్లింపులకు కూడా పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సీబీడీసీతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది. లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య, ఆర్బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా.. 2022–23లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి. -
డిజిటల్ కరెన్సీ: ఆర్బీఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ రూపాయికి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. పరిమిత వినియోగం నిమిత్తం పైలట్ ప్రాతిపదికన ఈ-రూపాయిని త్వరలో ప్రారంభించనున్నామని శుక్రవారం విడుదల చేసిన కాన్సెప్ట్ పేపర్లో ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు కనిష్టంగా లేదా అంతరాయం కలగని విధంగా ఈ-రూపాయి వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను ఇ-రూపాయి తుది డిజైన్‌లో పొందుపరుస్తామని ఆర్బీఐ కాన్సెప్ట్ పేపర్ జారీ సందర్భంగా ప్రకటించింది. ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలతో ఎలాంటి రిస్క్ లేకుండా, రిస్క్ ఫ్రీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ మనీని పౌరులకు అందించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించింది. అలాగే ఇ-రూపాయి నిర్దిష్ట లక్షణాలు,ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటామని ఆర్బీఐ పేర్కొంది కాగా ఆర్బీఐ కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సాధకబాధకాలను పరిశీలిస్తోంది. దశల వారీగా డిజిటల్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలిపిన సంగతి విదితమే. Issuance of Concept Note on Central Bank Digital Currencyhttps://t.co/JmEkN7rPyA — ReserveBankOfIndia (@RBI) October 7, 2022 -
కేంద్రం తెచ్చిన స్వమిత్వ పథకం ఏంటి? ఉపయోగాలేంటి?
సాక్షి, కామారెడ్డి: పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇందుకుగాను పైలెట్‌గా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ అధికారులు పని మొదలుపెట్టారు. పైలట్ గ్రామాలు ఇవే...: కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. దోమకొండ మండల కేంద్రంలో 3,718 ఇళ్లు, 1,332 ఓపెన్ ప్లాట్లు, ఆర్లి(కే) గ్రామంలో 774 ఇళ్లు, 17 ఓపెన్ ప్లాట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 470 ఇళ్లు, 80 ఇళ్లస్థలాలు, గోధుమకుంటలో 279 ఇళ్లు, 235 ప్లాట్లు, సరస్వతిగూడలో 336 ఇళ్లు, 28 ప్లాట్లు ఉన్నట్టు డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. చదవండి👉అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు స్వమిత్వ పథకం అంటే... సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు. ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల ఖాళీస్థలం కొలతలు తీసుకుంటారు. ఇంటి యజమాని పేరు, వివరాలు సేకరిస్తారు. ఇరుగుపొరుగు వారి పేర్లు నమోదు చేస్తారు. రోడ్డు ఉంటే ఆ వివరాలు పొందుపరుస్తారు. పెరడు జాగాను కొలుస్తారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసుకుంటారు. సేకరించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఉపయోగం ఏంటీ.. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు రుణం పొందడానికి వీలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు. ఇంటింటి సర్వేలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. వివరాల సేకరణ పూర్తయిన తరువాత ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు పంచాయతీ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి👉చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్.. -
క్యాన్సర్‌పై యుద్ధం..మాస్ స్క్రీనింగ్ దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంపై దృష్టిపెట్టింది. దేశంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు సంభవిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్)గా నియమించింది. ఆయన ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్‌కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి (ఓరల్) క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్), రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామంలో సచివాలయం యూనిట్‌గా మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సాయంతో ముగ్గురు గైనకాలజీ, ముగ్గురు అంకాలజీ వైద్యులు గత శనివారం స్క్రీనింగ్ నిర్వహించారు. గ్రామంలో 2,400 మంది జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు 640 మందికి ఉన్నారు. వీరందరికీ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ వలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 240 మంది మహిళలు స్క్రీనింగ్‌కు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న 70 మందికి వైద్యులు ఎంఎంయూలోనే మామోగ్రామ్ పరీక్ష చేశారు. అదేవిధంగా 117 మందికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన పాప్‌స్మియర్ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్‌లన్నింటీని గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ కేర్ విభాగానికి తరలించారు. ఇక్కడి నిపుణుల పరిశీలన అనంతరం బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించనున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చిన 27 మంది పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు చేయగా ఇద్దరికి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ నేతృత్వంలోని కోర్ కమిటీ ప్రణాళిక సిద్ధంచేసింది. మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు మూడు విధానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. సచివాలయం యూనిట్‌గా స్క్రీనింగ్ నిర్వహణ సచివాలయం యూనిట్‌గా మాస్ స్క్రీనింగ్ నిర్వహణ చేపట్టబోతున్నాం. అనంతరం గుర్తించిన క్యాన్సర్ రోగులను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ద్వారా దగ్గరలోని నెట్వర్క్ ఆసుపత్రికి తరలిస్తాం. ఆసుపత్రిలో వీరికి ప్రభుత్వమే ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తుంది. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు వాకబు చేస్తారు. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్ మైన్ ప్లాంట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది. భారత ప్రభుత్వం మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్ మైన్ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది. 350 ఎకరాలు కొనుగోలు తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్, డంప్ యార్డ్, వాటర్ రిజర్వాయర్ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్ మైన్ మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనే 1945లో రాయచూర్‌లో హట్టిమైన్స్‌ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. అనంతపురం జిల్లాలోనూ బంగారు నిక్షేపాలు తుగ్గలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ వీటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. అప్పట్లో టీడీపీ నేత పరిటాల రవీంద్ర కారణంగానే ఆ కంపెనీ ధైర్యం చేయలేకపోయిందని చెబుతారు. అక్కడి బంగారు నిక్షేపాలను కూడా వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు జియో మైసూర్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ చేస్తోంది. భారతదేశంలోని కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ పనులు చేపట్టాం. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. 12 నెలల్లో పూర్తి చేస్తాం. కరెంటు, నీరు తదితర వనరులు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రతినిధులు ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. – హనుమ ప్రసాద్, సీఈవో, జియో మైసూర్ -
స్పైసీ రుచులతో ఆక్వా రెస్టారెంట్లు.. ఇలా వెళ్లి అలా తిని రావొచ్చు
చేపలు.. రొయ్యలు.. పీతలు. వీటితో పులుసు.. ఇగురు.. వేపుడే కాదు. బిర్యానీ.. మంచూరియా.. స్నాక్స్ కూడా అప్పటికప్పుడు తయారవుతాయి. విభిన్న రుచులతో మత్స్య ప్రియుల జిహ్వ చాపల్యాన్ని ఇట్టే తీర్చేస్తాయి. దేశంలోనే తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులు లైవ్ (బతికి ఉన్నవి)గానే కాకుండా ‘రెడీ టు కుక్’ రూపంలోనూ లభిస్తాయి. అంతేకాకుండా శుచిగా.. రుచిగా వండి అక్కడికక్కడే వడ్డించే రెస్టారెంట్లు సైతం అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, చేప, రొయ్య పచ్చళ్లు కూడా అక్కడే లభిస్తాయి. వీటిలో ఏది కావాలన్నా స్వయంగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేదంటే.. ఇంట్లోనే ఉండి డోర్ డెలివరీ ద్వారా పొందవచ్చు. వీటి శాంపిల్స్‌ను ఆక్వా ల్యాబ్స్‌లో పరీక్షించిన తర్వాత ఫిష్ ఆంధ్రా హబ్, రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందేలా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఫిష్ ఆంధ్రా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు సరసమైన ధరలకే లభించడమే కాకుండా మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వనరులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఆక్వా పరిశ్రమకు మంచి రోజులొస్తాయి. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. అక్కడే మరో 100 అవుట్‌లెట్స్, 2 స్పోక్స్ కూడా అందుబాటులోకి రావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా అవుట్ లెట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సీఎం జగన్ ప్రారంభించనున్న పులివెందుల ఆక్వా హబ్ కంటైనర్ తరహా రెస్టారెంట్ మినీ అవుట్ లెట్లో బతికిన చేప, రొయ్యలు, రెడీ టు కుక్ పేరిట మారినేట్ చేసిన (ఊరవేసిన) ఉత్పత్తులు, ఎండు చేపలు, రొయ్యలు, పచ్చళ్ల విక్రయాలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడికక్కడే తయారు చేసిన స్నాక్ ఐటమ్స్ పార్శిల్స్ రూపంలో అమ్ముతారు. మినీ అవుట్ లెట్ తరహాలోనే అన్నిరకాల ఉత్పత్తులు డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్లలోఅందుబాటులో ఉంటాయి. వాటితోపాటు డెయిలీ యూనిట్లో కిచెన్‌తో పాటు 6–7 మంది, సూపర్ యూనిట్లో 10–15 మందికి పైగా కూర్చుని వాటిలో వండిన ఆహార పదార్థాలను భుజించేందుకు వీలుగా ఏసీ సౌకర్యంతో డైనింగ్ ఉంటుంది. లాంజ్ యూనిట్ పూర్తిస్థాయి రెస్టారెంట్ తరహాలో ఉంటుంది. ఇక్కడ కనీసం 20–30 మంది కూర్చుని వాటిలో వండిన మత్స్య పదార్థాలను అక్కడే తినేందుకు వీలుగా కంటైనర్ తరహాలో డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్స్‌లో ఫిష్ మసాలా, ప్రాన్ మసాలా, ప్రాన్ తవా ఫ్రై, అపొలొ ఫిష్, మసాలా ఫిష్, ఫిష్ పిలెట్, ఆంధ్రా చిల్లీ ఫిష్, ఆంధ్రా చిల్లీ ప్రాన్స్, మసాలా ప్రాన్స్, పెప్పర్ ప్రాన్స్, పాంఫ్రెట్ స్టీక్స్, పాంఫ్రెట్ హోల్, వంజరం, పండుగప్ప ఫుల్ ఫిష్ ఫ్రై వంటి వాటితో పాటు సైడ్స్, డ్రింక్స్, బేకరీ, ఫ్రూట్ ఐటమ్స్, అన్ని రకాల ఐస్‌క్రీమ్స్ కూడా విక్రయిస్తారు. ఆక్వా హబ్‌కు అనుసంధానంగా.. సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, మారినేట్ ఉత్పత్తులు, చేప, రొయ్య పచ్చళ్లను విక్రయించేందుకు వీలుగా ఆక్వా హబ్‌లకు అనుబంధంగా మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్, ఈ–మొబైల్ 3 వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, మొబైల్ 4 వీలర్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్, డెయిలీ (ఫిష్ కియోస్క్) యూనిట్లు, సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), ఒకటి లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలిసారి సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను వీటిద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. విశాఖలోని ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లేట్ వినియోగదారులతోపాటు మత్స్యకారులకూ ప్రయోజనం నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ వనరులను పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆక్వా హబ్‌లను తీసుకొస్తున్నాం. దీనివల్ల స్థానిక వినియోగం పెరగడంతోపాటు ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా పులివెందుల ఆక్వా హబ్‌తో పాటు దాని పరిధిలోని అవుట్‌లెట్స్, స్పోక్స్‌ను ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. – సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ మంత్రి -
Meenakshi Vashist: దీపం వెలిగింది
మీనాక్షి వశిష్ట్ సాఫ్ట్వేర్రంగంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించింది. ఓ దశాబ్దం గడిచేటప్పటికి ఆ ఉద్యోగంలో అసంతృప్తి మొదలైంది. ఇంకా ఏదో చేయాలి... ఏం చేయాలి? స్పష్టంగా ఒక రూపం రాలేదు, కానీ ఆమె మాత్రం 2010లో ఉద్యోగం మానేసింది. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించింది. నాలుగ్గోడల మధ్య కూర్చుని ఎంత ఆలోచించినా కొత్త ఆలోచనలేవీ రావడం లేదు. ఇప్పటి వరకు తనకు బాగా తెలిసిన విషయాల చుట్టూనే తిరుగుతోంది మెదడు. కొత్తగా ఏదైనా చూస్తే, కొత్త విషయాలను ఒంట పట్టించుకుంటే అప్పుడు కొత్త ఆలోచనలు రావచ్చు అనుకుంది. అప్పుడు దేశ పర్యటనకు బయలుదేరిందామె. మనదేశంలోని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాలు, కుగ్రామాలను కూడా చుట్టేసింది.అక్కడి మనుషులతో మాట్లాడింది.అడవుల్లో ఉన్న గ్రామాలను కూడా దగ్గరగా చూసింది. దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలో ఒక మహిళ జీవనశైలి మీనాక్షిలో కొత్త ఆలోచనకు బీజం వేసింది. ఆమె నివసిస్తున్న ఇంటికి కరెంటు లేదు. ప్రభుత్వం సోలార్ ప్యానెల్ ఇచ్చింది. కానీ దానిని వాళ్లు సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు. ఆ ఇంట్లో ఒక ట్రాన్సిస్టర్ ఉంది. బయటి ప్రపంచంతో ఆ గ్రామాన్ని కలుపుతున్న ఒకే ఒక బంధం అది. అలాంటి గ్రామాలు మరెన్నో ఆమెకు తారసపడ్డాయి. కొన్ని గ్రామాల్లో కరెంటు లైన్ ఉంది, కానీ నాణ్యమైన కరెంటు సరఫరా కావడం లేదు. పవర్ ప్రాజెక్టుల్లో తయారవుతున్న విద్యుత్ మొత్తం వినియోగంలోకి రాకపోవడం లేదు. పెద్ద మొత్తంలో వృథా అవుతోంది. దొంగతనానికి గురవుతోంది. అందువల్ల శివారు గ్రామాలకు సరిగ్గా అందడం లేదు. అప్పటికి మీనాక్షికి ఏమి చేయాలో స్పష్టంగా ఒక రూపం రాలేదు కానీ, ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ రంగంలో కొంత శూన్యత ఉందని, పని చేయడానికి అవకాశం ఉందని మాత్రం అర్థమైంది. గతంలో తనతో పని చేసిన సహోద్యోగులను సంప్రదించింది. వారందరి సహకారంతో మీనాక్షి పది యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. వారందరి ప్రయోగంతో ఎవన్‌లాట్ అనే పరికరం రూపొందింది. అది చూడడానికి పవర్ హెచ్చుతగ్గులను క్రమబద్దీకరించే స్టెబిలైజర్లాగా ఉంటుంది. ఈ ఎవన్‌లాట్ పరికరం ద్వారా పవర్ గ్రిడ్ నుంచి విడుదలయ్యే విద్యుత్తు ప్రసారంలో లీకేజ్, మాల్ ఫంక్షన్, ఫిల్ఫరేజ్లను అరికట్టవచ్చు. ఈ ప్రయోగం 2018 నాటికి విజయవంతమైంది. తొలి పైలట్ ప్రాజెక్టులో భాగంగా 2019లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రయోగాత్మకంగా నిరూపణ అయింది. ఆ తర్వాత మరో రెండు పైలట్ ప్రాజెక్టుల ద్వారా మంచి ఫలితాలతో ఆమోదయోగ్యమైంది. మొత్తంగా చెప్పాలంటే వృథా అవుతున్న విద్యుత్తును పొదుపు చేయవచ్చన్నమాట. ఆ మిగులు విద్యుత్తు... శివారు గ్రామాలకు చేరుతోంది. కొత్తగా కరెంట్ లైన్లను విస్తరించడమూ సాధ్యమవుతోంది. తమిళనాడుకు చెందిన మీనాక్షి వశిష్ట్ తన ప్రయోగాలకు గుర్గావ్ను క్షేత్రంగా మార్చుకుంది. ప్రయోగాలు లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందని నమ్మే మీనాక్షి అప్పటికే ఎలక్ట్రికల్ మార్కెట్లో ఉన్న దిగ్గజ కంపెనీలకు దీటుగా తాను స్థాపించుకున్న టెక్ అన్కార్క్డ్ కంపెనీ సీఈవోగా విజయవంతంగా దూసుకుపోతోంది. -
Dalit Bandhu: రాధమ్మ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా..
రాజే తలచుకుంటే దెబ్బలకు కొదువా..? ప్రభుత్వమే తలచుకుంటే పథకం ఇవ్వలేదా? పథకం కేవలం 15 మందికేనా అని కొందరు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు రెండు నెలల్లో పథకం అమలు చేస్తాం. నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 500 కోట్లకు అదనంగా 15 రోజుల్లో మరో రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తాం. రూ. 1.75 లక్షల కోట్లు.. నాయకుడికి చేసే పనిమీద వాక్శుద్ధి, చిత్తశుద్ధి, అవగాహన ఉంటే పనులు అవే సాగుతాయి. దళితబంధు పథకాన్ని ముమ్మాటికీ 100 శాతం విజయవంతం చేసి తీరుతాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరందరి కోసం రూ.1.75 లక్షల కోట్లను మూడు, నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం. అయితే నిరుపేదలకు ముందు ఇస్తాం, తర్వాత మిగతా కుటుంబాలకు ఇస్తాం. ఇప్పటికీ పేదరికంలోనే.. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రం గాల్లో దళితులకు కొన్ని అవకాశాలు చిక్కాయి. అయినా 95% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అందుకే ఆఖరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘దళితబంధు’అందజేయాలని అనుకుంటున్నాం. దీని లబ్ధిదారులకు ఇతర పథకాలేవీ రద్దు కావు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘రాష్ట్రంలో దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే ‘దళితబంధు’పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. దళితవాడలు బంగారు మేడలవ్వాలి.. దళిత జాతి రత్నాలను, దళిత శక్తిని బయటికి తీయాలన్నది మా సంకల్పం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పేదరికం, ఆకలి, వివక్ష, అవమానాలతో వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా సీఎం కేసీఆర్ సోమవారం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై అంబేడ్కర్, జగ్జీవన్రామ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. చివరిలో జైభీమ్, జై దళితబంధు అంటూ ముగించా రు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. ‘‘సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ‘దళితబంధు’పథకానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎనిమిదేళ్ల నాటి సర్వే కావడంతో ఇప్పుడు అదనంగా రెండుమూడు వేల మంది లబ్ధిదారులు పెరిగినా నష్టమేమీ లేదు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేసి తీరుతాం. హుజూరాబాద్ ఒక ప్రయోగశాల. గతంలో ఇక్కడే రైతు బంధును ప్రారంభించాం. ఇప్పుడు అదే సెంటిమెంటుతో దళిత బంధును ప్రారంభిస్తున్నాం. దీనిని నూటికి నూరుపాళ్లు విజయవంతం చేసితీరుతాం. ఈ పథకాన్ని ప్రకటించాక కొందరు చిల్లరమల్లర విమర్శలు చేశారు. నేను స్పందించలేదు. స్పందించి మొత్తం వివరాలు చెప్పి ఉంటే.. ఆనాడే ఆ నాయకుల గుండెలు ఆగి మరణించేవారు. అలాంటి వారిని చూసి ఆగం కావొద్దు. సోమవారం హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, దళితబంధు లబ్ధిదారులు 25 ఏళ్లనాటి ఆలోచన.. ఈ పథకం ద్వారా దళిత వాడలను బంగారు మేడలు చేయడమే మా లక్ష్యం. వాస్తవానికి దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు. 25ఏళ్ల క్రితం నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట వారి అభ్యున్నతికి పాటుపడ్డాం. గత ఏడాదే ఈ పథకం ప్రారంభించాల్సి ఉంది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. దళితబంధు పథకం నిధులతో మీకు నచ్చిన, వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, హార్వెస్టర్లు, బార్లు, వైన్‌షాపులు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు ఏది చేసినా.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు మీకు మార్కెటింగ్ కల్పిస్తాయి. ఈ మేరకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తాం. పొరపాటున లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబం ఆపదకు లోనుకాకుండా దళిత రక్షణనిధి నుంచి సాయం అందిస్తాం. కొత్తగా ‘దళిత బంధు’ఖాతాలు దళితబంధు పథకం కింద ఇచ్చే సొమ్ముకు బ్యాంకుల నుంచి కిస్తీల బాధ ఉండదు. మీ డబ్బుకు మీరే యజమానులు. బ్యాంకు వారు పాత బకాయిలు కట్ చేసుకోకుండా కొత్తగా దళితబంధు పేరుతో ఖాతాలు తెరిపించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లు తీసుకుంటారు. దళితబంధు పథకం కాదు.. ఇదొక మహా ఉద్యమం. దేశమంతా ఈ ఉద్యమం పాకాలి. అందుకు హుజూరాబాద్ పునాది రాయి కావాలి. పథకం అమలుకోసమే కర్ణన్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించాం. దళిత జాతి అభ్యున్నతికి, ఉద్యమకారులకు అండగా నిలిచిన బొజ్జా తారకం కుమారుడు ఐఏఎస్ అ«ధికారి, ఎస్సీ వెల్ఫేర్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా ప్రకటించాం. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో దళితబంధు ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రజలు విద్యార్థులు గ్రామాలకు వెళ్లాలి దళితబంధు పథకం విజయవంతం అయ్యేలా దళిత మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతీ గ్రామానికి వెళ్లి ‘గో టు విలేజేస్ అండ్ ఎడ్యుకేటెడ్ అవర్ మాసెస్’అన్న నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు రూ.లక్ష కోట్లకుపైగా, యాదవులకు రూ.11 వేల కోట్లకుపైగా కేటాయించాం. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధాప్య పింఛన్లు తదితర విజయవంతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు..’’ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా.. సభలో ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. తొలి చెక్కును రాధమ్మ అనే మహిళకు ఇచ్చారు. ఈ డబ్బుతో ఏం చేస్తావని కేసీఆర్ ఆమెను అడగ్గా.. తనకు డెయిరీ అంటే ఆసక్తి ఉందని రాధమ్మ చెప్పింది. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘అయితే.. మళ్లీ వచ్చినప్పుడు మీ ఇంట్లో చాయ్ తాగుతా’ అని పేర్కొన్నారు. జంబో వేదిక.. శాలపల్లి సభలో విశాల వేదికను ఏర్పాటు చేశారు. కీలక మంత్రులు, ఎమ్మెల్యేలంతా వేదికపై ఆసీనులు కావడం గమనార్హం. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కె.కేశవరావు, లక్ష్మీకాంతరావు, సురేశ్‌రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, సుంకె రవిశంకర్, దానం నాగేందర్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, రేఖానాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌బాబు, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తాజా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు. గోప్యంగా లబ్ధిదారుల తరలింపు – చివరి నిమిషం దాకా బయటపెట్టని వైనం – వేదిక వెనుక నుంచి తీసుకువచ్చిన అధికారులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘దళితబంధు’ పథకాన్ని అందుకునే లబ్ధిదారుల పేర్లను అధికారులు చివరివరకు గోప్యంగా ఉంచారు. వారికి ఆదివారం రాత్రే సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయమే వెళ్లి లబ్ధిదారులను, వారి కుటంబసభ్యులను ప్రత్యేక వాహనాల్లో సభ వద్దకు తీసుకువచ్చారు. సభ వద్ద కూడా వారు ఎవరికంటా పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. వెనుకవైపు వీఐపీ మార్గం ద్వారా వేదికపైకి పంపించారు. సభ వద్ద ఆయా లబ్ధిదారులు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడారు. డెయిరీ పెట్టుకుంటా.. మేం కూలి పనిచేసుకొని బతుకున్నాం. ఈ 10 లక్షలతో పాడి పశువులు కొని డెయిరీ పెట్టాలనుకుంటున్నాం. సాయం రావడం కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ సార్.. మా బతుకుల్లో వెలుగులు నింపిండు. -కొత్తూరిరాధ–మొగిలి, కనుకులగిద్ద, హుజూరాబాద్, తొలి లబ్ధిదారు ట్రాక్టర్ తీసుకుంటం అధికారులు వచ్చేంత వరకూ నా పేరు ఎంపికయిందని తెలియదు. ఆర్థిక సాయంతో ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. నా కుమారుడికి ట్రాక్టర్ అప్పజెబుతా. మాకున్న ఎకరం భూమికి మరింత భూమి కౌలు తీసుకుని, దున్నుకోవాలని ఆలోచిస్తున్నం. -రవీందర్, కన్నూరు, కమలాపూర్ భూమి కొనుక్కుంటా.. మాకు భూమి లేదు. మేమిద్దరం కూలీలమే. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో 20 గుంటల భూమి కొనుక్కుంటాం. సీఎం చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మరువలేం. మాకు వస్తదనుకోలే.. - రాధిక, శనిగరం, కమలాపూర్ మండలం అధికారులు సూచించినట్టు చేస్తా.. నేను దినసరి కూలీని. దళిత బంధు సాయానికి ఎంపికైనట్టు ఉదయం దాకా తెలియదు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారులు ఎట్ల చెప్తే అట్ల చేసుకుంటా. -బాజాల సంధ్య, హుజూరాబాద్ మండలం సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నది వీరే.. 1. కొత్తూరి రాధ–మొగిలి, హుజూరాబాద్ రూరల్ 2. రొంటల రజిత– సరిత, హుజూరాబాద్ అర్బన్ 3. కొత్తూరి స్రవంతి – కనకం 4. శనిగరపు సరోజన – రవీందర్ 5. చెరువు ఎల్లమ్మ – రాజయ్య, జమ్మికుంట మండలం నగరం గ్రామం 6. రాచపల్లి శంకర్– మౌనిక, జమ్మికుంట టౌన్ 7. పిల్లి సుగుణ– మొగిలి, జమ్మికుంట రూరల్ 8. సంధ్య బాజాల– గంగయ్య 9. కడెం రాజు– వినోద, ఇల్లందకుంట 10. కసరపు స్వరూప– రాజయ్య, వీణవంక 11. ఎలుకుపల్లి కొమురమ్మ– రాజయ్య, చల్లూరు 12. కనకం రవీందర్– హరిత, కమలాపూర్ 13. నామపెల్లి రాజేందర్ 14. మాట్ల సుభాష్– మనెమ్మ 15. రాజేందర్, కమలాపూర్ -
ఉపాధి.. రక్షణ.. సాధికారత.. ఉన్నతస్థితి 'దళిత బంధు'
అదనంగా రక్షణ నిధి పథకం అమలు, పర్యవేక్షణ.. ఫలితాలను అంచనా వేయడం.. లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం.. ఈ మూడు ముఖ్యమైన అంశాలు దళిత బంధు పథకంలో ఉంటాయి. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నగదు అందిస్తారు. అదనంగా లబ్ధిదారుడు–ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వారికి సహాయం అందుతుంది. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబాల పరిస్థితి ఆపదల కారణంగా మళ్లీ దిగజారకుండా ఈ నిధి రక్షక కవచంగా నిలుస్తుంది. నేరుగా ఖాతాల్లోకి రూ. 10 లక్షలు కుటుంబం యూనిట్‌గా అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం చేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. దళారుల బాధలేకుండా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తాం. ‘హుజూరాబాద్’లో 20,929 కుటుంబాలకు... హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లంతకుంటలో 2,586.. కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా 20,929 దళిత కుటుంబాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారిలో అర్హులైనవారిని పథకానికి ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో అర్హులందరికీ వర్తింపజేస్తామని సీఎం ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితుల సాధికారత కోసం అమలు చేయనున్న కొత్త పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్‌లోని హుజూరాబాద్ నియోజవర్గంలో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత ఈ నియోజకవర్గంలోని మండలాల్లో దళిత కుటుంబాల స్థితిగతులపై అధ్యయనం చేసి.. అర్హులను గుర్తించి, పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. ‘దళిత సాధికారత పథకం– పైలట్ ప్రాజెక్టు ఎంపిక– అధికార యంత్రాంగం విధులు’ అంశాలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఇప్పటికే నిర్ణయించిన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకానికి ఈ ఏడాది రూ.1,200 కోట్లు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించామని.. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం అదనంగా మరో రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఆ నియోజకవర్గంలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దడం, మరింతగా మెరుగుపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సులువు అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు అమల్లో కలెక్టర్లతోపాటు కొందరు అధికారులు పాల్గొంటారని.. వారితో త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రగతి భవన్లో దళిత సాధికారత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. దళిత బంధు అమలులో అలసత్వం వహిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని సీఎం కేసీఆర్ అధికారులను హెచ్చరించారు. ‘‘పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఈ పథకం అమల్లో ముందుకు సాగాలి. మనం తినేటప్పుడు ఎంత లీనమై రసించి ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంత దీక్ష కనబరుస్తామో.. దళిత బంధు పథకం అమల్లో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. కుల, ధన, లింగ భేదాలతో వ్యక్తులపై వివక్ష చూపి, ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం.. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా మొత్తం జాతికే నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. దళిత కుటుంబాల ప్రొఫైల్ రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాల ప్రొఫైల్ రూపొందించాలని, వారి జీవన స్థితిగతులను అందులో పొందుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దళితుల సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ అనేవిధంగా విభజించాలని సూచించారు. ఆయా సమస్యలకు అనుగుణంగా దళిత బంధు అమలు చేయాలన్నారు. హుజూరాబాద్ నుంచి ఎందుకంటే? ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారన్న వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. ‘‘సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని.. తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా చాలా వరకు కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టారు. రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. ఈ ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఆయన స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తేదీ, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు’’ అని తెలిపింది. చిత్తశుద్ధి, నిబద్ధత గల అధికారులు కావాలి ‘‘క్షేత్రస్థాయిలో దళిత బంధును పటిష్టంగా అమలు చేయడం కోసం.. దళితుల అభివృద్ధిపై మనసుపెట్టి నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరం. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి చిత్తశుద్ధి, దళితులపై ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించండి’’ అని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. -
ప్రజల సంక్షేమం కోసమే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ
విజయనగరం గంటస్తంభం: రేషన్ బియ్యం అంటే ఏదో మొక్కుబడిగా అందివ్వడం కాదు. అవి ప్రతీఒక్కరూ వినియోగించుకునేవిగా ఉండాలి. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడాలి. ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్‌ను అందిస్తోంది. ప్రయోగాత్మకంగా ఇప్పటివరకూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనే వీటిని పంపిణీ చేస్తుండగా ఈ నెల నుంచి జిల్లాలోని అందరికీ అందిస్తోంది. వీటిని వృథా చేసుకోకుండా వినియోగించుకుంటే వారి ఆరోగ్యానికి, పిల్లలకు ఎంతో మంచిది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి రాష్ట్రంలో విజయనగరం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో జిల్లాలో 78.7శాతం పిల్లల్లో, 75.5శాతం మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు తేలడంతో తొలి ప్రాధాన్యతగా జిల్లాను ఎంపిక చేశారు. రక్తహీనత నివారించేందుకు ఈ బియ్యం దోహదపడుతా యన్న ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా అందజేస్తున్నారు. గతంలో మన రైతులు పండించిన ధాన్యాన్ని మరపట్టి వాటిని రేషన్‌డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేది. ఇప్పుడు అదే ధాన్యం మరపట్టి బియ్యంలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అదనంగా చేర్చుతున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలు చేర్చడం వల్ల పోషకా హార లోపాన్ని అధిగమించేలా చేస్తుంది. జిల్లాలో 21 రైస్ మిల్లుల్లో ఇప్పుడు ఫోరి్టఫైడ్ రైస్ తయారవుతోంది. ఈ ఏడాది 1.10లక్షల మెట్రిక్ టన్నులు తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా అవసరమైన బియ్యా న్ని ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తారు. ఎక్కువ మంది పోషకాహార లోపం నుంచి బయట పడేందుకు ఈ బియ్యం సరఫరా చేయాలని సర్కారు యోచించింది. ఈ రైస్ వల్ల రుచి బాగుంటుంది. వంట చేసే విధానంలో ఏమీ మార్పు ఉండదు. పోషకాహార లోపంతో సమస్యలు పోషకాహార లోపంవల్ల చాలా ఇబ్బందులున్నాయి. పోషకాహార లోపం ఉన్నవారు ఎత్తు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడడం, మానసికంగా అలసిపో వడం, నాలుక పాలిపోవడం, తలవెంట్రుకలు రాలడం, ఏకాగ్రత లోపించడం, బలహీనంగా, చికాకుగా ఉండడం, అరచేతులు, అరికాళ్లు పాలిపోవడం, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. రేషన్ బియ్యం పొందేవారిలో కష్టపడే వారు ఎక్కువ. పోషకాహార లోపం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఫోరి్టఫైడ్ రైస్ సరఫరా చేస్తోంది. ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ రైస్‌లో ముఖ్యంగా లభించేది ఫోలిక్ యాసిడ్. బాలింత తల్లుల్లో పెరుగుదలకు తోడ్పడుతుంది. పిండం అభివృద్ధి చెందుతుంది. పసిపిల్లల్లో మెదడు, వెన్నెముక పెరగడానికి తోడ్పడుతుంది. రక్త నిర్మాణం బాగా జరుగుతుంది విటమిన్ బి–12 మెదడు, నాడీ మండలం పని చేయడంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఐరన్ మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల్లో ఐరన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన మోతాదులో ఉంచి రక్తహీనత అరికట్టడంలో ఐరన్‌ది ప్రధాన పాత్ర. ఫోర్టిఫైడ్ రైస్ తినడం వల్ల అందులో ఐరన్ రక్తహీనతతో పోరాడుతుంది. వృథా చేయవద్దు ప్రభుత్వం ఫోరి్టఫైడ్రైస్ సదుద్దేశంతో సరఫరా చేస్తోంది. దీనికోసం అదనంగా కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోంది. కార్డుదారులు వాటిని వండి తింటే వారి ఆరో గ్యం బాగుంటుంది. సాధారణ బియ్యంలో మి ల్లింగ్ సమయంలో పోషకాలు కలుపుతున్నాం. బియ్యంపై ప్రజలు అపోహలు వీడాలి. ఇందులో కలిపే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి–12 వంటి అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. కార్డుదారులంతా వాటిని వినియోగించుకోవాలి. - జి.సి. కిశోర్‌కుమార్, సంయుక్త కలెక్టర్, విజయనగరం -
కాలుష్య కాటుకు మియావాకి మందు!
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కాలుష్యానికి ‘మియావాకి’ అడవులతో చెక్ పెట్టాలని పురపాలక శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో తగినంత ఆక్సిజన్‌ను అందించడంతోపాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. ఇటీవల విశాఖపట్నంలో పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఇతర నగరాలు, పట్టణాలకూ విస్తరించాలని నిర్ణయించింది. ఏమిటీ ‘మియావాకి’ అడవుల పెంపకం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం, పరిమిత వ్యయంతో దట్టమైన పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూపకల్పన చేసిన విధానమే ‘మియావాకి’ అడవుల పెంపకం. జపాన్‌కు చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ఈ విధానానికి రూపకల్పన చేశారు. నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మట్టిని సేంద్రియ విధానంలో ట్రీట్మెంట్ చేసి చుట్టూ ఫెన్సింగ్ నిరి్మస్తారు. అనంతరం మట్టి స్వభావానికి అనుగుణంగా స్థానిక జాతులకు చెందిన వివిధ రకాల మొక్కలనే అడుగుకు ఒకటి చొప్పున ఏడు వరుసలుగా రకరకాల మొక్కలను నాటుతారు. దాంతో మొక్కలు విశాలంగా విస్తరించకుండా పొడవుగా పెరుగుతాయి. పెరిగిన తరువాత మొక్కలు ఒకదానికి ఒకటి అడ్డురాకుండా వాటి ఎత్తు, విస్తరణలను పరిగణనలోకి తీసుకుని తగిన జాతులవే నాటుతారు. దాంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో దట్టమైన అడవులుగా రూపుదిద్దుకుంటాయి. ఈ విధానంతో దాదాపు 2.50 లక్షల వ్యయంతో ఒక ఎకరాలో 50 రోజుల్లోనే అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ ‘మియావాకి’ అడవుల పెంపకాన్ని పురపాలక శాఖ విశాఖపట్నంలో చేపట్టింది. గాజువాక, మధురవాడలలో 25 ప్రాంతాలను ఎంపిక చేసింది. మొక్కల వేర్ల వరకు నీరు సులభంగా వెళ్లేలా మట్టిని రీఫిల్లింగ్ చేశారు. మారేడు, నేరేడు, పనస, మోదుగు, ఇరిడి, మద్ది, వేప, శ్రీగంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు వంటి దాదాపు 40 రకాల మొక్కలను నాటారు. సేంద్రియ ఎరువులు వాడారు. రూ.50 లక్షలతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. త్వరలోనే విశాఖలోని 25 ప్రాంతాల్లో దట్టమైన ‘మియావాకి’ అడవులు కనువిందు చేయనున్నాయి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా.. ‘మియావాకి’ అడవుల పెంపకాన్ని రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. తొలుత మిగిలిన 16 మునిసిపల్ కార్పొరేషన్లలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఒక్కో కార్పొరేషన్లో 5 నుంచి 10 ప్రాంతాల్లో ఈ ‘మియావాకి’ అడవులను పెంచాలని భావిస్తున్నారు. అందుకోసం ఖాళీ ప్రదేశాలను గుర్తించడంతోపాటు స్థానిక మొక్కల జాతులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇతర మునిసిపాలిటీల్లోనూ కనీసం ఒకటి చొప్పున ‘మియావాకి’ అడవులను పెంచాలన్నది పురపాలక శాఖ ఉద్దేశం. ఉపయోగాలు ఇవీ.. ► ఇంతవరకు ‘అర్బన్ ఫారెస్ట్రీ’ విధానంలో చేపడుతున్న మొక్కల పెంపకం కంటే మియావాకి అడవులు పదిరెట్లు దట్టంగా ఉంటాయి. ► నగరాలు, పట్టణాల్లో విస్తారంగా ఆక్సిజన్‌ను అందిస్తాయి. ► కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. ► మట్టి కోతను నివారిస్తాయి. ► భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడతాయి. ► ఎన్నో వృక్ష జాతులతో ఉండే ఈ అడవులు పక్షులు, ఇతర జాతులకు నెలవుగా మారి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి. -
జిల్లా కేంద్రాల్లో జగనన్న మహిళా మార్ట్
సాక్షి, అమరావతి: పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా.. పురపాలకశాఖ మౌలిక వసతులు సమకూర్చేలా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆర్థిక సహకారంతో ఈ మార్టుల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. ఇప్పటికే వైఎస్సార్ జిల్లా పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ విజయవంతమైంది. దీంతో వీటిని అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో దశలవారీగా ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. డ్వాక్రా మహిళలే యజమానులుగా.. పట్టణ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే ఈ జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులు. ప్రతి పట్టణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య యూనిట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తారు. సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారు. తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుంది. మెప్మా రూ.3 లక్షలు సమకూరుస్తుంది. మున్సిపాలిటీ స్థలం కేటాయించటమేగాక సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ సహకారంతో భవనం నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలను కూడా ఈ మార్ట్‌కు వర్తింపజేస్తారు. దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మా సహకరిస్తుంది. కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్లను తీర్చిదిద్దుతారు. నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని మెప్మా ఏర్పాటు చేస్తుంది. సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుంది. ఈ మార్ట్లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తారు. ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారు. పులివెందులలో నెలకు రూ.10 లక్షల టర్నోవర్ పైలట్ ప్రాజెక్టుగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రారంభించిన జగనన్న మహిళా మార్ట్ విజయవంతమైంది. 25 డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ మార్టు టర్నోవర్ నెలకు రూ.10 లక్షలకు చేరింది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ మార్ట్లను ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లోని సమాఖ్య సభ్యులతో చర్చిస్తోంది. తరువాత దశలో రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్లలో రెండుమూడు చొప్పున ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధే లక్ష్యం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పట్టణ మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం ఈ జగనన్న మహిళా మార్ట్‌లకు రూపకల్పన చేశాం. ఇతర మార్ట్ల కంటే తక్కువ ధరకు, నాణ్యమైన సరుకులను అందించడం ద్వారా ప్రజల ఆదరణ పొందేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. వీటి నిర్వహణపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ కూడా ఇస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా -
ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు
సాక్షి, అమరావతి: ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్ఈడీ బల్బులను విద్యుత్ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ‘గ్రామ ఉజాలా’ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి చేపట్టే ఈ పథకాన్ని దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకానికి ఈఈఎస్ఎల్ రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► తొలి విడత వారణాసి (ఉత్తరప్రదేశ్), వాద్నగర్ (గుజరాత్), నాగపూర్ (మహారాష్ట్ర), ఆరా (బీహార్), కృష్ణా (ఆంధ్రప్రదేశ్) జిల్లాలను ఎంపిక చేశారు. ► ఇంధన పొదుపులో భాగంగా గతంలో 9 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందించారు. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందిస్తారు. సాధారణ బల్బుతో పోలిస్తే 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బుల వల్ల 75 శాతం కరెంట్ ఆదా అవుతుంది. 25 శాతం మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ బల్బుకు ఉంది. ►ఏపీలో తొలి దశలో కృష్ణా జిల్లాలోని గుణదల, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ టౌన్, రూరల్‌లో ప్రతి ఇంటికి 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు నాలుగు ఇస్తారు. వీటిని తీసుకునే ముందు సాధారణ బల్బులను (40, 60, 100 వాల్టుల బల్బులు ఏదైనా) విద్యుత్ అధికారులకు అందజేయాలి. ఈ జిల్లాలో 8.83 లక్షల ఇళ్లకు ఇంటికి నాలుగు బల్బుల చొప్పున పంపిణీ చేయనున్నారు. ► గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బల్బులు తీసుకోవచ్చు. ఈఈఎస్ఎల్ నేతృత్వంలో స్థానిక విద్యుత్ అధికారుల సమన్వయంతో పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా డేటా రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. -
విక్రేతలకు అండగా అమెజాన్ సాథి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ‘సాథి’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విక్రేతలు తమ ఆన్లైన్ వ్యాపార విస్తరణకు కావాల్సిన సలహాలు, సూచనలను విక్రేతల నుంచే స్వీకరించడం దీని ప్రత్యేకత. సాథీస్ (మెంటార్స్) నుంచి ఆన్లైన్ అమ్మకాలు, అనుసరించాల్సిన ఉత్తమ విధానాల గురించి అమెజాన్ విక్రేతలు ఎవరైనా తెలుసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎనమిది నెలల్లో 41,000 పైచిలుకు విక్రేతలు 50కిపైగా మెంటార్స్‌ను సంప్రదించినట్టు అమెజాన్ మంగళవారం వెల్లడించింది. -
జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్
సాక్షి, ముంబై: ఫేస్ బుక్, వాట్సాప్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో మార్ట్ ఆన్లైన్ కిరణా వ్యాపారంలోకి దూసుకొచ్చేందుకు సిద్దంగా వుంది. మరోవైపు ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగిపోయింది. 'లోకల్ షా ప్స్ ఆన్ అమెజాన్' పేరుతో పైలట్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది. 6 నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భారతదేశంలోని 100కుపైగా నగరాల్లో 5 వేల స్థానిక షాపులురిటైలర్ల భాగస్వామ్యంతో కిరాణా, తదితర అవసరమైన సరుకులను వినియోగదారులకు అందించనుంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో అత్యవసర వస్తువులతో పాటు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి కూడా అనుమతినివ్వాలని రీటైలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో అమోజాన్ తాజా వ్యూహంతో ముందుకు రావడం గమనార్హం. టాప్ మెట్రోలతో పాటు టైర్ 1, టైర్ 2 నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, సూరత్, ఇండోర్ లక్నో, సహారాన్పూర్, ఫరీదాబాద్, కోటా, వారణాసి తదితర నగరాల్లోని రీటైలర్స్ సిద్దంగా ఉన్నారని అమెజాన్ వెల్లడించింది. కిచెన్, ఫర్నిచర్, దుస్తులు, ఆటోమోటివ్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, కిరాణా, తోట, పుస్తకాలు, బొమ్మలు ఇతర ఉత్పత్తులను అందుబాటులోకి ఉంచినట్టు చెప్పింది. అమెజాన్ అందిస్తున్న ఈ కొత్త సదుపాయం ద్వారా స్థానిక దుకాణాల నుండి తమకు కావాల్సింది ఎంపిక చేసుకునే వెసులుబాటుతో పాటు వేగంగా డెలివరీ చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపింది. అంతేకాకుండా, దుకాణదారులు తమ ప్రాంతానికి మించి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుందని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడైనా, భారతదేశంలోని స్థానిక దుకాణాల సరుకులను ఆన్లైన్లో విక్రయించడానికి శక్తినిచ్చేందుకు, తమ టెక్నాలజీ సామర్థ్యాలను ఉపయోగిస్తామని అమెజాన్ ఇండియా వివరించింది. వినియోగదారులకు ఖచ్చితమైన డెలివరీ కోసం అమెజాన్ డెలివరీ యాప్‌ను ఉపయోగించాలని, అన్ని సరుకుల రవాణాను రోజూ ట్రాక్ చేస్తామని స్పష్టం చేసింది. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) స్థానిక దుకాణాలు డిజిటల్ స్టోర్లుగా మారనున్నాయి. షాపులు తమ ప్రస్తుత ప్రోగ్రామ్‌లో చేరవచ్చనీ, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి వారికి సహాయపడుతుందని అమెజాన్ వెల్లడించింది. అంతేకాదు తమ యాప్ లోని ఐ హ్యావ్ స్పేస్ సదుపాయం ద్వారా డెలివరీ, పికప్ పాయింట్లుగా పనిచేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ పిళ్ళై చెప్పారు. దీంతో పాటు వాక్-ఇన్ కస్టమర్లకు 'అమెజాన్ ఈజీ' అనే సౌకర్యం కూడా అందుబాటులో వుంటుందన్నారు. అమెజాన్ ఈజీ మార్కెట్లలోని వినియోగదారులకు ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యాన్ని పొందటానికి వీలు కల్పిస్తుందనీ, మొదటిసారి ఆన్లైన్ దుకాణదారులకు, ఇంటర్నెట్, భాషతో పాటు డిజిటల్ చెల్లింపులు వంటి వివిధ లావాదేవీల అడ్డంకులను తొలగించడానికిసహాయపడుతుందన్నారు. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండైనా స్థానిక షాపులు, ఆఫ్‌లైన్ రిటైలర్లు ఈ కార్యక్రమంలో చేరవచ్చన్నారు. ఈ పైలట్ కార్యక్రమం కోసం రూ .10 కోట్లు పెట్టుబడులతో ఇప్పటికే 100 కి పైగా నగరాల నుండి 5,000 మంది స్థానిక దుకాణాలను, రిటైలర్లను తన ప్లాట్ఫామ్లోకి చేర్చుకున్నామని గోపాల్ పిళ్లై వెల్లడించారు. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) (1/2) Happy to announce “Local Shops on Amazon”, a program enabling local retailers & shopkeepers of all sizes to leverage Amazon’s technology & grow their footprint digitally. After a successful pilot with 5000+ stores, we are pledging Rs10 Crores to scale the program. — Gopal Pillai (@GopalPillai) April 23, 2020 -
ఇక టెలీ మెడిసిన్..
నారాయణ పేట: లాక్డౌన్ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా టీ కన్సల్ట్ ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సమగ్ర టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ కన్సల్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును శ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రారంభించి కలెక్టర్ దాసరి హరిచందనకు ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తూ శ్రీకారం చుట్టారు. టీటా నేతృత్వంలో.. జిల్లాలో ఇప్పటికే టీటా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో తమ జిల్లాలో టెలీమెడిసిన్ సేవలు ప్రవేశపెట్టాలని కలెక్టర్ హరిచందన టీటా గ్లోబల్ ప్రసిడెంట్ సందీప్‌కుమార్‌ను కోరడంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా.. రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను అందించేందుకు టెలీ మెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మండలంలో 39 గ్రామాలు ఉండగా.. అందులో ఇదివరకు 17 గ్రామాల్లో సేవలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలు ఇలా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో వ్యక్తులు బయటికి రావొద్దని ఆదేశాలు ఉండటంతో వాటిని గౌరవించడంతో పాటుగా మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా చేరువ కానున్నాయి. టెలీమెడిసిన్ సేవలు అందించడంలో భాగంగా ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత ప్రత్యేక అధికారులు తమ అందుబాటులోని సమయం పేర్కొంటారు. దానికి అనుగుణంగా ప్రజలు అపాయింట్మెంట్ పొందుతారు. అనంతంర సంబంధిత డాక్టర్, గ్రామస్తుడు ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవుతారు. వీరిద్దరి మధ్య జరిగిన టెలీ మెడిసిన్ ప్రక్రియ అనంతరం ప్రిస్కిప్షన్ సైతం ఆన్లైన్ ద్వారా సంబంధిత గ్రామస్తులకు వాట్సాప్ ద్వారా చేరుతుంది. నోడల్అధికారి పంచాయతీ కార్యాలయంలో ఉంటూ సేవలు అందిస్తారు. ఈ వీడియో కనెక్ట్ ప్రక్రియకు సమన్వయం చేస్తారు. క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయంతో.. దేశంలోనే పూర్తిస్థాయిలో మొదటిసారిగా ఒక మండలాన్ని టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పంచాయతీ కార్యాలయం నోడల్ కార్యాలయంగా ఉండగా.. పంచాయతీ కార్యదర్శి నోడల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. అందుబాటులో 96 మంది డాక్టర్లు వివిధ రోగాలను ప్రజలకు ఆన్లైన్లో నివృత్తి చేస్తూ.. వైద్య సేవలను అందించేందుకు 96 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్, డెంటిస్ట్, న్యూరాలజిస్ట్, ఈఎన్టీ, కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డయాబెటిస్, గ్రాస్టాలజిస్ట్, తదితర ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. జిల్లా అంతటా విస్తరింపజేస్తాం.. మక్తల్ మండలంలో ప్రాజెక్టు ఫలితాలు అధ్యయనం చేసిన తర్వాత జిల్లాలోని మిగతా 10 మండలాల్లో విస్తరింపజేసేందుకు కృషిచేస్తాం. మక్తల్ ప్రజలు ఈ సేవలు అందుకునేందకు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలి. కరోనా నియంత్రణకు ఇంటినుంచి బయటికి రాకుండా ప్రతిఒక్కరూ సహకరించాలి. లాక్డౌన్ సమయంలో ఈ సేవలు చాలా ప్రయోజనకరంగా ఉంది. – హరిచందన, కలెక్టర్, నారాయణపేట ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా.. లాక్డౌన్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా టెలీ మెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మక్తల్ మండలంలో 250 మందికి వైద్య సేవలను అందించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పల్లె సీమల్లోని ప్రజలకు ఈ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. – సందీప్ కుమార్ మక్తాల, టీటీ గ్లోబల్ ప్రసిడెంట్ -
ఆరోగ్య ధీమా
మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం ఎక్కడా లేకుండా తొలిసారిగా అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల క్యాన్సర్లకూ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో పాటు సీజనల్ వ్యాధులకు కూడా చికిత్స అందిస్తారు. ఈ పథకం కింద శస్త్ర చికిత్స చేయించుకున్న వారు కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున, లేదా నెలకు రూ.5 వేలు ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారు. గత నెల 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో 1,42,54,134 కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఈ పథకం వర్తింప చేస్తూ నేడు ఏలూరులో నాంది పలకనున్నారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్ ప్రాజెక్టును తొలుత ఈ జిల్లాలో అమలు చేయనున్నారు. మిగతా జిల్లాల్లో కూడా శుక్రవారం నుంచి 1,259 వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింప చేయనున్నారు. ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఆసుపత్రులతో టై అప్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా క్యాన్సర్ చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు పాత కార్డులు కూడా పని చేస్తాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తొలి రోజు అంటే శుక్రవారం 1.5 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కాగా, గతంలో ఈ పథకం కింద చిన్నారులకు ఒక చెవికి మాత్రమే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు దాన్ని రెండు చెవులకూ వర్తింప చేస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే వర్తింపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని కొనసాగించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయితే ఈ పథకానికి ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ పథకాన్ని పూర్తిగా నీరుకార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం అందక పడుతున్న ఇక్కట్లను అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు. ఆదాయ పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వర్గాల వారికి ఈ పథకం ఒక వరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించారు. నవంబర్ నెలలో వైఎస్సార్ నవశకం పేరుతో గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తించారు. సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం గ్రామ, వార్డు సభలు నిర్వహించి తుది జాబితా తయారు చేశారు. నాడు వైఎస్ కూడా ఇక్కడి నుంచే.. సాక్షి ప్రతినిధి, ఏలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభిస్తుండటం విశేషం. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టడం పేద, మధ్యతరగతి వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ఔదార్యాన్ని చాటుతోంది. డయాలసిస్ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా అమలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. నాడు వైఎస్ కూడా ఇక్కడి నుంచే.. సాక్షి ప్రతినిధి, ఏలూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచి ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేసి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టనున్నారు. డయాలసిస్ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా అమలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. -
‘ఉపకారా’నికి టీ–వ్యాలెట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన పథకానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అనే నిబంధనకు కాస్త బ్రేక్ పడింది. బ్యాంకు ఖాతా తెరవడం, దాని నిర్వహణ తదితర అంశాలు విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆందోళన ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ–వ్యాలెట్ యాప్/ఆన్లైన్ సర్వీసు ద్వారా ఉపకారవేతనాలు పంపిణీ చేసేలా నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గతేడాది అందుబాటులోకి తెచ్చింది. ఈ జిల్లాలోని విద్యార్థులు ఉపకారవేతనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా నంబర్ బదులుగా టీ–వ్యాలెట్ బటన్ ను ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తుదారు ఎంట్రీ చేసిన ఫోన్ నంబర్, విద్యార్థి పేరు ఆధారంగా టీ–వ్యాలెట్ రిజి స్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఉపకారవేతనం విడుదలైన వెంటనే విద్యార్థి టీ–వ్యాలెట్ ఖాతాకు నిధులు జమవుతాయి. వీటిని సమీప మీ సేవా కేంద్రంలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. గతేడాది నిజామాబాద్ జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు టీ–వ్యాలెట్ ఎంపిక చేసుకున్నారు. మరో నాలుగు జిల్లాల్లో.. నిజామాబాద్ జిల్లాలో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో మరో నాలుగు జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉపకారవేతనాలు ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాలెట్ ఆప్షన్ ఇస్తే మేలు.. ప్రస్తుతం ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు. నిర్దేశించిన 4 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో టీ–వ్యాలెట్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే విద్యార్థులంతా బ్యాంకు ఖాతాకు బదులుగా టీ–వ్యాలెట్ వివరాలు సమర్పించవచ్చు. కొత్తగా నాలుగు జిల్లాల్లో టీ–వ్యాలెట్ అమలుపై అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
మై చాయిస్..మై ఫ్యూచర్ అంటున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. తొలుత రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రారంభించింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించింది. మై చాయిస్, మై ఫ్యూచర్ పేరుతో విద్యార్థుల ప్రతిభ, ఆసక్తులు, వారి భవిష్యత్తు అంచనాలపై నిర్వహించిన సైకోమెట్రిక్ టెస్టు ఫలితాల ఆధారంగా విద్యార్థులను సరైన దిశలో నడిపించే కార్యక్రమాన్ని గురువారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ సత్యనారా యణరెడ్డి వెల్లడించారు. ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణను పైలట్ ప్రాజెక్టుగా 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ, ఆయా పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు త్వరలోనే నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి భవిష్యత్‌పై మార్గదర్శనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు మార్గదర్శిగా.. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారే. వ్యవసాయ పనులు, రోజువారీ కూలి చేసుకొని బతికే కుటుంబాలకు చెందిన ఆయా విద్యార్థులు ఏ రంగంపై దృష్టి సారించాలో, దానికోసం ఎలాంటి కృషి చేయాలో, అందులో ఎలాంటి భవిష్యత్ ఉంటుందో తెలియదు. వారిని సరైన దిశలో వెళ్లేలా ప్రోత్సహించే వారు తక్కువ. అలాంటి వారెలా ముందుకెళ్లాలి.. తమకున్న ప్రతిభాపాటవాలేంటి? ఏ రంగంలో కృషి చేస్తే తొందరగా సక్సెస్ అవుతామన్న అంశాలపై అవగాహన కల్పించి, వారిని ఆ వైపు పోత్సహించేందుకు ‘మై చాయిస్.. మై ఫ్యూచర్’ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమల్లోకి తెచ్చింది. క్రమంగా దీనిని విద్యాశాఖ పరిధిలోని 26 వేల పాఠశాలల్లోని 29 లక్షల మంది విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో ఏం చేశారంటే.. వ్యక్తిత్వం, కెరీర్ సంబంధమైన 12 కేటగిరీల్లో 72 ప్రశ్నలతో విద్యార్థులందరికీ సైకోమెట్రిక్ టెస్టు (మై చాయిస్.. మై ఫ్యూచర్) నిర్వహిస్తారు. అందులో ఫలితాల ఆధారంగా ప్రతి విద్యార్థి ఆసక్తుల్ని తెలుసుకుంటారు. మోడల్ స్కూళ్లలో నిర్వహించిన ఈ టెస్టులో.. 27 శాతం మంది బాలురు పోలీసు కావాలని, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగంలో స్థిరపడాలని 15 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఇక బాలికల్లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగాల్లో స్థిరపడాలని 20 శాతం మంది, మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్ వైపు వెళ్లాలని 17 శాతం మంది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడేం చేస్తారంటే... ప్రతి విద్యార్థిపై చేసిన సైకోమెట్రిక్ టెస్టు ఆధారంగా ఆ విద్యార్థి ఎంచుకున్న కెరీర్‌కు సరిపడా సామర్థ్యాలుంటే అందుకోసం పాఠశాల స్థాయి నుంచే చేయాల్సిన కృషిని వివరించడం, ఆ రంగంలో పరిస్థితులను తెలపడం, వాటిని ఎదుర్కొని ముందుకుసాగేలా ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడతారు. కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్ వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుంటారు. అయితే ఆసక్తి ఉన్న రంగానికి సరిపడా సామర్థ్యాలు లేకపోతే వాటిని సాధించేలా విద్యార్థికి కౌన్సెలింగ్‌తోపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, అందుకు అనుగుణమైన పరిస్థితులను ఏర్పరచేలా కృషి చేస్తారు. ఇక విద్యార్థికి ప్రభుత్వోద్యోగంపై ఆసక్తి ఉన్నా అతనికి స్కిల్స్ మాత్రం ప్రైవేటు మార్కెటింగ్‌లో రాణించేలా ఉంటే.. వాటిని ఆ విద్యార్థికి వివరించి, ఆ స్కిల్స్, ప్రతిభ ఆధారంగా ఆ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తామని మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వివరించారు. -
రీచార్జ్ రోడ్స్..
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం... మహానగ రంగా రూపొందినా చినుకు పడితే చాలు, రోడ్లపై వరద పారాల్సిందే. ఎక్కడి నీరు అక్కడ ఇంకే దారి లేక అవి చెరువులను తలపిస్తాయి. పది నిమిషాల వాన పడ్డా రోడ్లపై నీరు నిలిచి ప్రజలు పడేపాట్లు అన్నీఇన్నీ కావు. దీని పరిష్కారానికి కొంతకాలంగా ప్రయోగాలు చేస్తోన్న జీహెచ్ఎంసీ పర్మియబుల్ సిమెంట్ కాంక్రీట్ రోడ్ నిర్మాణానికి సిద్ధమైంది. ఇంజనీర్లు దీనినే పర్వియస్ కాంక్రీట్, పోరస్ కాంక్రీట్ అని కూడా వ్యవహరిస్తారు. పర్మియబుల్ రోడ్లు ఇలా... ఈ పర్మియబుల్ రోడ్ నిర్మాణంలో ఇసుక వాడరు. ఈ రోడ్డుపై పడ్డ వర్షపు నీరు రోడ్డు కుండే రంధ్రాల ద్వారా నేరుగా భూమిలోకి వెళ్తుంది. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అవుతుంది. రెండు విధాలా ఉపయుక్తం కావడంతో వీటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. భారీ వాహనాలు వెళ్లేరోడ్లకు ఇది ఉపయు క్తం కాదు. అంతర్గత రహదారులు, లైట్ వెహికల్స్ వెళ్లే మార్గాల్లోనే ఇది ప్రయోజనకరం. పైలట్ ప్రాజెక్టుగా.. పైలట్ ప్రాజెక్టుగా కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 20 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు పనులు చేపట్టారు. నిర్మాణం పూర్తయ్యాక రోడ్డుపై ట్యాంకర్లతో నీటిని వదిలి పరిశీలించనున్నట్లు జీహెచ్ఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ దత్తు పంత్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదన్నారు. సాధారణ సిమెంట్ రోడ్లో సిమెంట్, నీరు నిష్పత్తి 0.5 అంత కంటే ఎక్కువే, పర్మియబుల్ రోడ్లో మాత్రం 0.3 శాతమే. ఈ రోడ్డు నిర్మాణానికి కి.మీ. కు దాదాపు రూ. 30 లక్షలు ఖర్చవు తుందని తెలిపారు. పర్యావరణ హి తంతోపాటు భూగర్భజలాలు పెరగ డం అదనపు ప్రయోజనమన్నారు. ఈ పైలట్ ఫలితాన్ని బట్టి అంతర్గత రహదారుల్లో చేపట్టనున్నారు. వీడీసీసీ రోడ్లు... రహదారులపై నీటినిల్వల ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి కొన్ని ప్రాంతా ల్లో వీడీసీసీ(వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్) రోడ్ల నిర్మాణం చేపట్టిన జీహెచ్ఎంసీ.. గ్రేటర్ పరిధి లో 297 మార్గాల్లో 416 కి.మీ.ల మేర వీడీసీసీ రోడ్లకు ప్రతిపాదించింది. అంచనా వ్యయం రూ.208 కోట్లు. వీటికి స్పెషల్ ఫండ్స్ కేటాయిం చాలంటూ కోరింది. ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్ కోసం వేచి చూస్తోంది. -
ఎంత కష్టపడితే అంత సుఖం!
సాక్షి, అమరావతి: ఎంతగా కష్టపడితే అంతగా సుఖపడతారు అనేది జీవితానికే కాదు శరీరానికి సైతం వర్తిస్తుంది. ఆధునిక జీవనశైలి అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. నేటితరం మనుషులకు వ్యాయామం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. ఫలితంగా మధుమేహం, హైపర్ టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ–అసాంక్రమిక వ్యాధులు) సంక్రమిస్తున్నాయి. ఒకప్పుడు జీవిత చరమాంకంలో వచ్చే మధుమేహం ఇప్పుడు మూడు పదుల వయసులోనే పలుకరిస్తోంది. చాలామంది నలభై ఏళ్ల వయసుకు ముందే గుండెపోటు బారిన పడుతున్నారు. ఇక రక్తపోటు కామన్ డిసీజ్‌గా (సాధారణ జబ్బు) మారిపోయింది. అధిక రక్తపోటు కారణంగా ఏటా వేలాది మంది పక్షవాతం (పెరాలసిస్) బారిన పడి శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. అసాంక్రమిక వ్యాధుల వల్ల బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు... శరీరానికి తగిన వ్యాయామం లేక జబ్బులకు గురవుతుండగా, మరోవైపు జంక్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడం తీవ్ర అనర్థాలకు దారి తీస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సర్వే ప్రకారం.. ఆధునిక యుగంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం బాగా తగ్గిపోయింది. దీనివల్ల చిన్నతనం నుంచి రకరకాల జబ్బులు సోకుతున్నాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక ఉండాలని, లేదంటే చాలా జబ్బులు చుట్టుముడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 20 శాతం మంది మధుమేహ(డయాబెటిస్) బాధితులేనని అంచనా. జీవనశైలి జబ్బులు అమాంతం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌తో(ఐసీఎంఆర్) కలిసి పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖ, కృష్ణా జిల్లాల్లో హైపర్ టెన్షన్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. తర్వాతి దశలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. -
భూమిలో సారమెంత
సాక్షి,నిజామాబాద్: భూసారంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. రైతుల పంట పొలాల్లో పంటల సాగుకు అవసరపడే పోషకాలు భూమిలో ఉన్నాయా..? లోపమున్న పోషకాలు ఏంటీ..? వంటి అంశాలను తేల్చే పనిలో పడింది. రైతులు కనీస అవగాహన లేకుండా విచ్చలవిడిగా ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఆ గ్రామంలో ఉన్న రైతులందరి భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తోంది. గ్రామ పరిధిలో ఎంత మంది రైతులు ఉంటే అంత మందికి సంబంధించిన భూముల మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ఈ నమూనాలకు నిజామా బాద్, బోధన్‌లో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటివరకు 26 గ్రామాల్లో సుమారు 4,094 మట్టి నమూనాలను సేకరించింది. సుమారు 80 శాతం నమూనాల సేకరణ పూర్తికాగా, మరో వెయ్యి నమూనాలను ఇంకా సేకరించాల్సి ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. యూరియా.. జిల్లాలో రైతులు విచక్షణా రహితంగా ఎరువులను వాడుతున్నట్లు భూసార పరీక్షల్లో తేలింది. యూరియా వినియోగం విపరీతంగా ఉండటంతో భూముల్లో నత్రజని అవసరానికి మించి ఉన్నట్లు గుర్తించారు. అలాగే రైతులు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 60,563 మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. ఈ ఎరువు వినియోగం జిల్లాలో ఏటా పెరుగుతూ వస్తుండటాన్ని వ్యవసాయశాఖ గుర్తించింది. అలాగే కాంప్లెక్ ఎరువుల వినియోగం కూడా అధికంగా ఉంది. సుమారు 26,500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వాడుతున్నట్లు ఆ శాఖ అనధికారిక అంచనా. దీంతో ఎరువులకు సంబంధించిన పోషకాలు అవసరానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఇలా అవసరానికి మించి ఎరువులు వాడటంతో పంట సాగు వ్యయం పెరుగుతోంది. ఈ ఎరువుల మీదే రైతులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ఈ సాగు వ్యయాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విత్తనోత్పత్తికి అండగా.. రైతులు విత్తనోత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసార పరీక్షల ద్వారా వచ్చి న ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించనున్నారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. 80 శాతం సేకరణ పూర్తయింది మట్టి నమూనాల పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాము. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశాము. ఇప్పటి వరకు 80 శాతం రైతుల భూములకు సంబందించి మట్టి నమూనాల సేకరణ పూర్తయింది. ఈ నమూనాలను భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టే గ్రామీణ విత్తనోత్పత్తి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మేకల గోవిందు, జిల్లా వ్యవసాయశాఖాధికారి -
తోడేస్తున్నారు..
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): జిల్లాకు సాగు నీటి గండం వచ్చింది. అవసరానికి మించి నీటిని తోడేస్తుండడంతోనే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన సాగు నీటి కొరత ఫిబ్రవరి చివరి నుంచే మొదలైంది. ఇప్పటికే వ్యవసాయ, బోరుబావుల్లో గణనీయంగా నీటి మట్టం తగ్గిపోయింది. ఏడు మండలాల్లో బోరుబావుల తవ్వకాలతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోవు రోజుల్లో పరిస్థితి మరింత జఠిలంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 28,000 వ్యవసాయ బోరుబావులు, 32,000 వ్యవసాయ బావులున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 24,768 హెక్టార్లు ఉండగా యాసంగిలో 23,728 హెక్టర్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 12,605 హెక్టార్లు, మొక్కజొన్న 9986 హెక్టార్లు, వేరుశనగ 553 హెక్టార్లరు. రైతులు ప్రధానంగా యాసంగిలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిరంతర ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సాగు నీటి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వర్షం నీటిని నిల్వ ఉంచకపోవడంతో కొరత ఏర్పడుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల మందుగానే సాగు నీటి సమస్య మొదలైంది. యాసంగిలో వేసిన పంటను కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేయించడంతోపాటు వ్యవసాయ బావులు తవ్విస్తున్నారు. పలు గ్రామాల్లో 600 ఫీట్ల వరకు బోరు వేసినా నీటి జాడ కనిపించడంలేదు. దీనిని బట్టి పరిస్థితి నీటి వినియోగం ఎమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా నీటి వినియోగం చేసే గ్రామాలు జిల్లాలో అత్యధికంగా సాగు నీటిని వినియోగి స్తున్న గ్రామాలను అధికారులు గుర్తించారు. అందులో భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగపూర్, భీమదేవరపల్లి, కొప్పుర్, కొత్తకొండ, మల్లారం, మాణిక్యాపూర్, ముల్కనూర్, ముస్తఫా పూర్, ముత్తారం, ధర్మసాగర్ మండలంలో జానకిపురం, మల్లక్కపల్లి, నారాయణగిరి, ఎల్కతుర్తి మండలంలో బావుపేట, దండెపల్లి, జీల్గుల, పెంచికల్‌పేట, తిమ్మాపూర్, వల్భాపూర్, హసన్‌పర్తి మండలంలో దేవన్నపేట, జయగిరి, లక్నవ రం, పెంబర్తి, ఐనవోలు మండలంలో గర్మిల్లపల్లి, ఐనవోలు, పంతని, పున్నేల, సింగారం, కమలా పూర్ మండలంలో భీంపల్లి, దేశరాజుపల్లి, గూనిపర్తి, ఖాజిపేట మండలంలో మడికొండ, తరాలపల్లి, ఖిలా వరంగల్ మండలంలో గాదేపల్లి, స్తంభంపల్లి, వసంతాపూర్, వేలేరు మండలం లో మల్లికుదుర్ల, వేలేరు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే తగ్గిన నీటి మట్టం జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో భూగర్భజల నీటి మట్టం 8.33 మీటర్లు ఉండగా ఈ ఏడాది 9.52 మీటర్లకు చేరింది. గతేడాదితో పోల్చుకుంటే 1.19 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటికే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తుండగా ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. దీంతో సాగు నీరు విషయం పక్కనబెటితే తాగు నీటికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పెలా లేవు. పైలెట్ ప్రాజెక్టుగా భీమదేవరపల్లి భూగర్జ జలాలను పెంపొందిచడంలో భాగంగా భీమదేవరపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇందులో కొప్పుర్, గట్లనర్సింగపూర్, కొత్తకొండ, ముల్కనూర్, ముస్తఫాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో చెక్ డ్యాంలు, చెరువుల్లో కృత్రిమ ఇంకుడు బోరుబావులను నిర్మించనున్నారు. 150 ఫీట్ల వరకు బోరుబావులను తవ్వనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఖరీఫ్‌లో సాగు నీరు అధికం కావడానికి ఈ కృత్రిమ ఇంకుడు బోరుబావులు ఉపయోగపడునున్నాయి. ఒక్కో కృత్రిమ ఇంకుడు బోరుబావి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి ఎక్కడ కృత్రిమ ఇంకుడు బోరుబావుల తవ్వకం చేపట్టాలనే అంశంపై తీర్మానాలు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కొత్తకొండలో సమావేశం నిర్వహించారు. నూతన బోర్లు, బావులకు చెక్.. భూగర్జ జలాలు తగ్గిపోతుండడంతో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 37 గ్రామాలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ యా గ్రామాల్లో నూతనంగా బోరులు వేయొద్దని, బావుల తవ్వకం చేపట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వేసినట్లైతే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు సైతం విధించనున్నారు. -
త్వరలో ఈఎన్టీ పరీక్ష శిబిరాలు..
సాక్షి, హైదరాబాద్: చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) సహా దంత పరీక్షలను పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈఎన్టీ శిబిరాలను నిర్వహించనుంది. అందుకోసం ఈఎన్టీ విభాగానికి చెందిన మూడు ప్రత్యేక బృందాలు, దంత విభాగం నుంచి మరో 3 ప్రత్యేక బృందాలను గుర్తించింది. ఒక్కో బృందంలో మొత్తం 11 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారందరికీ బుధ, గురువారాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక వారిని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన ప్రాంతాలకు ఈ నెల 6 నుంచి పంపిస్తారు. వారక్కడ శిబిరాలు నిర్వహిస్తారు. ఆ ప్రాజెక్టు అనుభవాల ఆధారంగా మార్గదర్శకాలు ఖరారు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్టీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ఈఎన్టీ శిబిరాల నిర్వహణపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచే శిబిరాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వైద్యాధికారులు ఆగమేఘాల మీద కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదు జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. పైలట్ ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాలపై రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచి సలహాలు తీసుకున్నారు. ఏడాదిపాటు ఈఎన్టీ పరీక్షలు.. ప్రస్తుతం కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం ఫిబ్రవరిలో పూర్తి కానుంది. ఆ వెంటనే ఈఎన్టీ, దంత వైద్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. కంటి వెలుగు కింద వచ్చే నెల నాటికి దాదాపు 2 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసే అవకాశముంది. అదే స్థాయిలో ఈఎన్టీ, దంత పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కంటి పరీక్షలు చేయడం, వెంటనే రీడింగ్ గ్లాసులు ఇవ్వ డం సులువే. కానీ ఈఎన్టీ, దంత పరీక్షలు చేయడం కష్టమైన వ్యవహారం. దానికి సరం జామా అధికంగా ఉండాల్సి ఉందని అధికా రులు చెబుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఆరు నెలల్లోపే పూర్తి చేయగలిగితే, ఈఎన్టీ పరీక్షలు పూర్తి చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంటున్నారు. -
మహిళా పోలీస్ వాలంటీర్లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో జరిగే ప్రతీ విషయాన్ని, నేరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఇప్పటికే వీపీవో(విలేజ్ పోలీస్ ఆఫీసర్) వ్యవస్థ తెలంగాణలో అందుబాటులో ఉంది. ఇదే తరహాలో.. గ్రామాల్లో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులు, ఇతర ఘటనల నేపథ్యంలో.. పోలీసులు, బాధితుల మధ్య వారధిగా పనిచేసేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. ఇదే మహిళా పోలీస్ వాలంటీర్ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎదురవుతున్న వేధింపులు, వారిపై జరుగుతున్న దాడులు, వరకట్న హత్యలు, ఆత్మహత్యలు తదితర నేరాలను నియంత్రించేందుకు ‘మహిళా పోలీస్ వాలంటీర్ల’ను నియమించనుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఈ మహిళా పోలీస్ వాలంటీర్ విధానం ద్వారా సత్ఫలితాలు సాధించింది. దీంతో ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సన్నాçహాలు చేస్తోంది. పనితీరును బట్టి బహుమతులు.. ఈ వాలంటీర్లకు నెలకు రూ.500 గౌరవ వేతనంగా అందించనున్నారు. అదే విధంగా ప్రతి మూడు నెలలు, ఆర్నెల్లకోసారి వేధింపుల నియంత్రణలో పనితీరును బట్టి రూ.10వేలు, రూ.5వేలు, రూ.3 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా ఉన్నవారు, నాయకులుగా చెలామణి అవుతున్నవారు, నేరచరిత్ర కల్గిన వారు ఈ వాలంటీర్ పోస్టుకు అనర్హులని పోలీ స్ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీస్, స్త్రీ–శిశు సంక్షే మశాఖ నేతృత్వంలో ఈ వ్యవస్థ పనిచేస్తుందని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణ, మహిళావేధింపుల కట్టడికి కృషిచేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 21 ఏళ్లు, ఇంటర్ పాస్ తప్పనిసరి... రాష్ట్రంలో నల్లగొండ, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతీ గ్రామంలో మహిళా పోలీస్ వాలంటీర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇంటర్ పాసయిన 21 ఏళ్ల యువతులకు వాలంటీర్‌గా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీరు.. గ్రామాల్లో మహిళలపై జరిగే వేధింపులు, ఇతర నేరాలను స్థానిక స్టేషన్‌కు చేరవేయాల్సి ఉంటుంది. దీంతో పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయడం, వేధింపులను నియంత్రించడం సులభతరం కానుంది. -
ఇక రైళ్లలో స్మార్ట్ కోచ్‌లు..
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని రాయ్‌బరేలి మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవనున్న అత్యాధునిక స్మార్ట్ కోచ్‌లను భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనుంది. నూతన స్మార్ట్ కోచ్‌లు బ్లాక్ బాక్సులు, కోచ్ సమాచారం, డయాగ్నస్టిక్ వ్యవస్థలు కలిగిఉంటాయి. కోచ్ పరిస్థితిని నివేదించే అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, రియల్‌టైమ్‌లో ప్రయాణీకుల సమాచారం చేరవేత వంటి ఫీచర్లను బ్లాక్ బాక్సుల్లో పొందుపరిచారు. కోచ్ డయాగ్నస్టిక్ వ్యవస్థలపై స్మార్ట్ కోచ్‌లు పనిచేస్తాయి. ట్రాక్‌లు ప్రయాణానికి అనువుగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని వైబ్రేషన్ ఆధారిత సెన్సర్లు కలిగిన స్మార్ట్ కోచ్‌ల చక్రాలు ఇట్టే పసిగడతాయి. రైలులో ఉండే జెర్క్స్ ద్వారా సెన్సర్లు చార్జ్ అవుతాయి. ఒకే విండో ద్వారా అన్ని సెన్సర్లను సెంట్రలైజ్డ్ కంప్యూటర్ ద్వారా పర్యవేక్షిస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం జీఎస్ఎం నెట్‌వర్క్‌తో అనుసంధానించే ఇండస్ర్టియల్ గ్రేడ్ కంప్యూటర్ సేవలు అందించనుంది. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ రైలు ప్రస్తుత లొకేషన్, తదుపరి స్టేషన్ వివరాలు సహా స్టేషన్‌కు ఎంతసేపటిలో చేరుకోగలదనే విషయాలను వెల్లడిస్తుంది. రైలు వేగాన్ని కూడా ఈ వ్యవస్ధ చూపుతుంది. కృత్రిమ మేథ సామర్థ్యాలతో కూడిన సీసీటీవీ ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా రైళ్లలో రైల్వే సిబ్బంది ప్రవర్తన, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా 100కు పైగా స్మార్ట్ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు యోచిస్తున్నాయని రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వని లోహాని వెల్లడించారు. -
మంత్రి మెప్పుకోసం.. గిరిజనుల ఆరోగ్యం తాకట్టు
బొబ్బిలి: రాష్ట్ర గనుల శాఖా మంత్రి ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు మెప్పు కోసం గిరిజనుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారు మున్సిపల్ అధికారులు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని పాత పథకాలకే మెరుగులు దిద్దిన యంత్రాంగం తీరుతో మున్సిపాలిటీ పరిధిలోని రామందొరవలసలో కలుషిత నీటిని తాగి ఇటీవల ఒక గిరిజనుడు మృతి చెందారు. మరికొంతమంది తీవ్ర అస్వస్థత పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకోలేదు. కనీసం గ్రామంలో వైద్యశిబిరం కూడా నిర్వహించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 20 మందికి పైగా డయేరియా బాధితులున్నారు. బొబ్బిలి ఆస్పత్రిలో సరైన వైద్యం అందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్, నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. మంత్రి మెప్పుకోసం అధికారులు చేసిన ఈ పనికి గ్రామస్తులు చావులను కొనితెచ్చుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రి చేతుల మీదుగా త్వరితగతిన కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు పాత శునకాల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సల షెడ్లతో పాటు రామందొరవలస గిరిజన గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ ఆదరాబాదరాగా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఒక ట్యాంకు, మోటారు అమర్చాల్సి ఉండగా ఎప్పుడో 30 ఏళ్ల నాటి పాత బోరుకున్న హెడ్ తీసేసి దానికి మోటార్ బిగించి ట్యాంకును, ట్యాపులను ఏర్పాటు చేసి హడావిడిగా పైలట్ ప్రాజెక్ట్‌ను మంత్రి చేతుల మీదుగా కొద్ది రోజుల కిందట ప్రారంభించేశారు. మంత్రి ప్రారంభించాలన్న ఒకే లక్ష్యంతో ఆదరాబాదరాగా చేసిన ఈ పనుల్లో ట్యాంకును శుభ్రం చేయలేదు. పైపెచ్చు ఎప్పుడో 30 ఏళ్ల నాటి బోరుకే మోటారు బిగించేసి వదిలేశారు. దీంతో తాగునీరు కలుషితమై గిరిజనులకు రోగాల భారిన పడ్డారు. పైప్‌లైన్ కట్‌చేసి వదిలేసిన అధికారులు.. గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు గ్రామానికి వెళ్లి టాంకులోని నీళ్లను పారబోశారు. బోరు కనెక్షన్ కట్ చేశారు. మామూలుగా నీరు పట్టుకున్నట్లు పాత బోర్లనుంచే నీరు పట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చి వచ్చేశారు. ఆ నీరు పారబోసినపుడు పెద్ద పురుగులు వచ్చాయని, వాటిని తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పైప్‌లైన్ సూపర్వైజర్ సింహాచలం తెలిపారు. -
తెలుగులోనూ ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తోన్న ‘ధరణి’వెబ్‌సైట్‌ను తెలుగు భాషలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి సంబంధించిన భూముల వివరాలన్నింటినీ పొందుపరిచే ఈ వెబ్‌సైట్‌ను అందరికీ అర్థమయ్యేలా తొలిసారి మాతృభాషలో రూపొందిస్తున్నారు. డాటా మొత్తాన్ని తెలుగులోనే అందుబాటులో ఉంచనున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా ఈ వెబ్సైట్ రూపొందిస్తున్నారు. జిల్లాకో మండలంలో.. కాగా, ధరణి వెబ్‌సైట్‌ను ఈనెల 19 నుంచి జిల్లాకో మండలంలో ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గుడిహత్నూర (ఆదిలాబాద్), పాల్వంచ రూరల్ (భద్రాద్రి కొత్తగూడెం), రాయికల్ (జగిత్యాల), రఘునాథపల్లి (జనగామ), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), ఐజ (గద్వాల), యెల్లారెడ్డి (కామారెడ్డి), మానకొండూరు (కరీంనగర్), ముదిగొండ (ఖమ్మం), ఆసిఫాబాద్ (కొమురం భీం), కేసముద్రం (మహబూబాబాద్), దేవరకద్ర (మహబూబ్‌నగర్), నెన్నెల్ (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), మేడిపల్లి (మేడ్చల్), బిజినేపల్లి (నాగర్‌కర్నూలు), కట్టంగూరు (నల్లగొండ), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతుకుంట (రాజన్న సిరిసిల్ల), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), రామచంద్రాపురం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), చివ్వెంల (సూర్యాపేట), నవాబ్‌పేట (వికారాబాద్), పెబ్బేర్ (వనపర్తి), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), నర్సంపేట (వరంగల్ రూరల్), తుర్కపల్లి (యాదాద్రి) మండలాల్లో ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నారు. అదే రోజు నుంచి తహశీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, ఈ బాధ్యతల అమలును పైలట్ ప్రాజెక్టు తరహాలో పరిశీలించాలా లేక రాష్ట్రంలోని అన్ని మండలాల్లో (సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలు) ఒకేసారి అప్పగించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని సేవలతో అనుసంధానం ధరణి వెబ్‌సైట్‌తో రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఫలానా భూమిపై జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు క్షణాల్లో అప్డేట్ అయ్యే లా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. ముఖ్యం గా కోర్‌బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, సర్వే సెటిల్మెంట్ తదితర వివరాలన్నింటినీ అందు బాటులోకి తెస్తున్నారు. బ్యాంకర్లు ఆన్లైన్లోనే రైతుల భూముల వివరాలు చూసు కుని రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పిం చేలా డేటా రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను ప్రయోగాత్మకంగా ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో అమల్లోకి తెస్తున్నారు. జగదేవ్‌పూర్ (సిద్దిపేట), ఘట్కేసర్ (మేడ్చల్), కొత్తూరు (రంగారెడ్డి), సదాశివపేట (కామారెడ్డి), కూసుమంచి (ఖమ్మం) మండలాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు ఆ రోజునుంచి ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. -
కర్ణాటక ఎన్నికలు: ఫేస్బుక్ పైలట్ ప్రాజెక్ట్
సాక్షి, బెంగళూరు: డేటా బ్రీచ్ నేపథ్యంలో ఫేస్బుక్ దేశంలో దిద్దుబాటు చర్యలకు దిగింది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో సోషల్‌మీడియా దిగ్గజం ముందు జాగ్రత్త చర్యలకు సమాయత్తమైంది. తన ఫ్లాట్‌ఫారమ్‌పై నకిలీ వార్తలను నిరోధించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. భారత్ లో 217 బిలియన్లకుపై యూజర్లను కలిగి వున్న ఫేస్బుక్ రానున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఈ కీలక చర్యను చేపట్టింది. ఒక పైలట్ ప్రోగ్రాం ద్వారా ఫేక్‌న్యూస్‌ను అరికట్టేందుకు రంగంలోకి దిగింది. 2018, మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్వతంత్ర డిజిటల్ జర్నలిజం సంస్థ బూమ్‌తో కలిసి పైలట్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రకటించింది. థర్పార్టీ ఫాక్ట్ చెకింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు బ్లాగ్ స్పాట్లో తెలిపింది. దీని ద్వారా ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. ఒక కథనాన్ని తప్పుగా రేట్ చేస్తే, దాన్నిన్యూస్ ఫీడ్‌లో లోయర్ చేసిన చూపుతామని, అలాగే ఈ నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు యూజర్లకు, పేజీ అడ్మిన్స్ నోటిఫికేన్ పంపుతామని తెలిపింది. తద్వారా పదేపదే తప్పుడు వార్తలను షేర్ చేస్తున్న పేజీలు, డొమైన్లకు షేరింగ్ తగ్గుతుంది. దీంతోపాటు వాణిజ్య ఆదాయం కూడా తగ్గిపోతుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్ వర్క్, పోయింటర్ చేత ధృవీకరించబడిన బూమ్ తో భాగస్వామాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది. దీని ద్వారా ఆంగ్ల భాషా వార్తా కథనాలను ఫ్లాగ్ చేసి, వాస్తవాలను తనిఖీ చేసి, వాటి ఖచ్చితత్వాన్ని అంచనా వేయినున్నట్టు చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఫేస్బుక్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి. -
ఆస్తులకు ఇక భూధార్!
కర్నూలు(అగ్రికల్చర్): పౌరులకు ఆధార్ సంఖ్య కేటాయించినట్లుగానే భూములకు, ఇతర స్థిరాస్తులకు భూధార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూధార్ విధానం ఇప్పటికే జగ్గయ్యపేట, ఉయ్యూరుల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలులో ఉంది. ఈ విధానం అమలుపై తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో త్వరలో జరగనున్న వర్క్‌షాపునకు కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్ వెళ్లనున్నారు. ఆయన తిరిగొచ్చిన అనంతరం జిల్లాలో ప్రాజెక్టు అమలుపై ప్రాథమిక పనులు మొదలు కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లోపు అమలయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భూధార్‌లోనే అన్ని వివరాలు.. భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరును కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 4,67,243 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇవిగాక 60 లక్షలకు పైగా స్థిరాస్తులు అంటే ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆధార్ నంబర్ల తరహాలో భూధార్ నంబర్లు ఇవ్వనున్నారు. భూధార్‌లో భూ యజమానిపేరు, విస్తీర్ణం, భూమి మార్కెట్ విలువ తదితర 20 అంశాలు ఉంటాయి. ఇందులో ప్రతి సర్వే నంబరును జియోట్యాగింగ్ చేస్తుండటంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు విశిష్ట నంబరు.. ప్రభుత్వ భూములు, స్థలాలు మొదట రెండు సున్నాలతో విశిష్ట నంబరును కేటాయిస్తారు. వీటిని కూడా జియోట్యాగింగ్ చేయడం వల్ల ఆన్లైన్లో భూధార్ నంబరు కొట్టగానే ఆ భూమి ఎక్కడ ఉందో తెలుస్తుంది. జియోట్యాగింగ్ చేసిన తర్వాత భూములను ఎవరైన కొనుగోలు చేస్తే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ (మార్పులు) జరుగుతాయి. మ్యుటేషన్ కోసం మీసేవ కేంద్రాలు, రెవెన్యూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరితంగా రుణాలు పొందే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటి నంబర్లు ఇక డిజిటల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ డిజిటల్ డోర్ నంబర్లు కేటాయించనున్నట్లు పురపా లకశాఖ సంచాలకులు టీకే శ్రీదేవి వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే సూర్యా పేట మున్సిపాలిటీలో దీన్ని ప్రారంభించామన్నారు.సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల క్రయావిక్రయాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిపే సమయంలోనే స్థానిక మున్సిపాలిటీ రికార్డుల్లోనూ యజమాని పేరు మారేలా ఆటోమెటిక్ మ్యుటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అయితే కొన్ని ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న డోర్ నంబర్లతో ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రికార్డుల్లో ఒక నంబర్ ఉంటే క్షేత్రస్థాయిలో మరో నంబర్ ఉంటుండటంతో మ్యుటేషన్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కొత్తగా డిజిటల్ డోర్ నంబర్లు కేటాయిస్తున్నామన్నారు. 16 అంకెలతో డిజిటల్ డోర్ నంబర్లు... రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్ నెంబర్‌ను పురపాలక శాఖ కేటాయించనుంది. ఈ 16 అంకెల్లో మూడు విభాగాలు ఉండనున్నాయి. నగరం/పట్టణాన్ని తెలిపేందుకు ఓ కోడ్, స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు మరో కోడ్ ఉండనుంది. ఈ మూడు కోడ్ల తర్వాత ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్ నంబర్‌ను కేటాయించనున్నారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇళ్లు ఏ నగరం/పట్టణం, ఏ వార్డు/డివిజన్లో ఉన్నాయో తేలికగా కనుక్కునే విధంగా డిజిటల్ డోర్ నెంబర్ల సిరీస్ ఉండనుంది. నిరాశ్రయులు, నిరుద్యోగుల కోసం రెండు యాప్‌లు పురపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అర్బన్ దోస్త్, అర్బన్ జీనీ పేరుతో 2 కొత్త యాప్‌లను ప్రవేశపెట్టామని శ్రీదేవి వివరించారు. పట్టణాల్లో రోడ్లపై కనిపించే నిరాశ్రయులను గుర్తించి వారి ఫొటో, వివరాలను అర్బన్ దోస్త్ యాప్‌లో అప్లోడ్ చేస్తే స్థానిక మున్సిపాలిటీ అధికారులు అటువంటి వారికి ఆశ్రయం కల్పిస్తారన్నారు. జీవనోపాధి పథకాలు పొందాలనుకునే నిరుద్యోగులు అర్బన్ జీనీ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సాయం పొందవచ్చన్నారు. 23 రకాల పౌర సేవలు ఆన్లైన్లో... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 23 రకాల పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నామని శ్రీదేవి తెలిపారు. 73 పురపాలికల పరిధి లో 12.5 లక్షల ఇళ్లను జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఇంటి యజమాని ఎక్కడి నుంచైనా ఆస్తి పన్ను, ఇంటి ఫొటో తదితర వివరాలను పురపాలకశాఖ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఆస్తి న్యాయ వివాదంలో ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చని, ఆస్తుల క్రయవిక్రయాల సమయం లో ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. పట్టణాల్లో కొత్త వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ట్రేడ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను పూర్తిగా సరళీకృతం చేశామన్నారు. పురపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఆన్లైన్ దరఖాస్తుల వి ధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
బొబ్బిలికి భారీ పైలట్ ప్రాజెక్టు
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టు ఎట్టకేలకు మంజూరైంది. దీంతో బొబ్బిలి ప్రజల తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభమై సకాలంలో పనులు పూర్తయితే రానున్న రోజుల్లో బొబ్బిలి ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. అయితే ప్రస్తుత పాలకులు, అధికారులు దీన్ని ఎంత కాలంలో పూర్తి చేస్తారోనన్న సందేహం ప్రజల్లో లేకపోలేదు. బొబ్బిలి: బొబ్బిలి మున్సిపాలిటీకి భారీ తాగునీటి పథకం మంజూరైంది. రూ.98 కోట్లతో సీతానగరం మండలంలోని సువర్ణముఖి నదిలో భారీ ఇన్‌ఫిల్టరేషన్ బావులను ఏర్పాటు చేసి అధిక సామర్ధ్యం కలిగిన మోటార్లు, పైపులతో బొబ్బిలి పట్టణానికి తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పలుమార్లు ఈ పథకం గూర్చి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో కృషి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ గతంలో జీఎస్టీ లేకపోవడంతో ఇప్పుడు జీఎస్టీ పన్నులను కలిపి తాజా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. దీంతో గతంలోని రూ.98 కోట్ల ప్రతిపాదనలు ఇప్పుడు సుమారు 30 శాతం జీఎస్టీతో అది రూ.100 కోట్లకు పైగానే పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ తరహా కొత్త ప్రతిపాదనలను ఈ నెల 26లోగా పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఈ ప్రతిపాదనలను తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బృందం వచ్చి పరిశీలనలు చేసి వెళ్లింది. ప్రతిపాదనలు పంపిన తరువాత ఈఎన్సీకి పంపించి ఆ తరువాత పరిపాలన ఆమోదంతో టెండర్లను పిలుస్తారు. వెయ్యి కిలోలీటర్ల చొప్పన మూడు ఓవర్ హెడ్ ట్యాంకులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. కొత్త తరహా విధానంలో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని మున్సిపల్ డీఈఈ మహేశ్ తెలిపారు. గెనటింగ్ విధానంలో మరమ్మతుల ప్రతిపాదనలు ప్రస్తుతం మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తున్న ట్యాంకులు లీకులతో ఉండటంతో కొత్తగా వీటిని మరమ్మతులు చేసేందకు రూ.35 లక్షలకు కేటాయించనున్నారు. పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ట్యాంకు పూర్తి లీకుల మయం కావడంతో దీనికి ఈ నిధులతో కొత్త విధానంలో మరమ్మతులు చేయనున్నారు. గెనటింగ్ అనే ఈ తరహా విధానంలో లూజ్ కాంక్రీట్‌ను తొలగించి పైపింగ్, స్ప్రేల ద్వారా కొత్త కాంక్రీటు, సిమెంట్ పేస్ట్లను లోనికి పంపిస్తారు. తద్వారా మరో పదేళ్ల పాటు ఈ ట్యాంకులు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామనీ డీఈఈ మహేష్ విలేకర్లకు తెలిపారు. -
ఆర్థిక సంస్థల్లో రాష్ట్రానికి 12వ స్థానం
ఆరో గణన వివరాలను విడుదల చేసిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంస్థల సంఖ్యలో రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో పదో స్థానంలో ఉంది. జాతీయ స్థాయి లో నిర్వహించిన ఆరో ఆర్థిక గణన ప్రకారం ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిం చింది. దేశవ్యాప్తంగా 2013 ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ గణన నిర్వహించారు. అంత కు ముందు 2005లో నిర్వహించిన అయిదో ఆర్థిక గణనతో పోలిస్తే తెలంగాణలో ఆర్థిక సంస్థలు 77.94శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఆయా ప్రాంత పరిధిలో ఉన్న ఆర్థిక సంస్థలు, యూనిట్లను లెక్కించటమే ఆర్థిక గణన. జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ గణన ప్రకారం సరుకుల ఉత్పత్తి లేదా సేవల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వాటిని ఆర్థిక సంస్థలుగా పరిగణించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళ వారం సచివాలయంలో ఈ గణాం కాల సీడీ, పుస్తకాలు, రాష్ట్ర ప్రణా ళిక విభాగం రూపొందించిన వ్యవ సాయ విస్తీర్ణం, ఉత్పత్తికి సంబం ధించి మూడో ముందస్తు అంచనా గణాంకాలను విడుదల చేశారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) ఆ«ధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరులను సమగ్రంగా గుర్తించే ప్రాజెక్టు అమలవుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజూ రాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వివరాలను ప్రణాళిక విభాగం విడు దల చేసింది. ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర అర్థగణాంక విభాగం డైరెక్టర్ ఎ సుదర్శన్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
అటకెక్కిన ‘దక్షత’
► ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు ఎంపిక ► అమలుకు నోచుకోని కార్యక్రమం మాతాశిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షత కార్యక్రమం అటకెక్కింది. మరణాలను కనీస స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 200 ఏరియా సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 25 కేంద్రాలు ఎంపికయ్యాయి. ఇందుకోసం నలుగురు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో అమలు కావల్సిన దక్షత కార్యక్రమం ఆరంభంలోనే కనుమరుగైంది. – ఉట్నూర్ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 90 శాతం ప్రసవాలు జరుగుతుండగా అందులో 10శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచుతూ మాతాశిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్యంతోపాటు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఆశయంతో దక్షత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పది శాతం నుంచి 50 శాతం పెరగడంతోపాటు మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రతీ లక్షా ప్రసవాల్లో 78 మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, నవజాత శిశువుల్లో ప్రతీ వెయ్యిమందిలో 28 మంది మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపారు. దక్షత లక్ష్యాలివి.. ప్రసవ సమయంలో ప్రధానంగా నాలుగు రకాల సమస్యలతో తల్లులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, బీపీ పెరిగి ఫిట్స్ రావడం, మధ్యలో ప్రసవం ఆగిపోవడం, నవజాత శిశువుల్లో ఊపిరితిత్తుల్లో శ్వాసకోస సమస్య, నెలలు నిండకుండానే జననం తదితర ఇన్ఫెక్షన్ల వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిని నివారించేందుకు మెరుగైన వైద్యంతోపాటు సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వారితో వైద్యం అందించే ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో నలుగురు వైద్యశాఖ సిబ్బందికి దక్షత అమలుపై శిక్షణ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు.. దక్షత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 25 ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇందులో 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, పదకొండు 24+7 ఆస్పత్రులు, రిమ్స్, ఒక్కొక్కటి చొప్పున పీహెచ్సీ, ఎంసీహెచ్‌లు ఉన్నాయి. వీటిలో రిమ్స్‌తోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, బోథ్, లక్సెట్టిపేట, ముథోల్, సిర్పూర్(టి), ఉట్నూర్, 24+7 ఆస్పత్రుల్లో వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), కాగజ్‌నగర్, గుడిహత్నుర్, బెజ్జూర్, కాసిపేట, కౌటాల, తాండూర్, భీమిని, ఏరియా ఆస్పత్రుల్లో భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, ఎంసీహెచ్ నిర్మల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిర్యాణిలను ఎంపిక చేశారు. ఆయా ఆరోగ్యకేంద్రాల్లో దక్షత కార్యక్రమం ద్వారా మాతాశిశు రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కాని ఇంత వరకు దీని అమలుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్యక్రమం కనుమరుగైంది. శిక్షణ పొందిన వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అక్కడక్కడ తప్ప పూర్తి స్థాయిలో నిర్వహించలేదని వైద్యశాధికారులు అంటున్నారు. ప్రభుత్వం మంచి ఆశయంతో దక్షతకు శ్రీకారం చుట్టినా అమలుపై దృష్టి సారించకపోవడంతో ఇది ప్రకటనకే పరిమితం అయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా దక్షతను పూర్తి స్థాయిలో అమలు చేసి మరణాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
రక్తహీనత మహిళలకు పోషకాహారం
⇒ ఇక్రిశాట్‌తో ఒప్పందానికి వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం ⇒ పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లా ఎంపిక ⇒ జొన్న, ఇతర తృణధాన్యాల మిశ్రమ పొట్లాల పంపిణీ సాక్షి, హైదరాబాద్: రక్తహీనతతో బాధపడే గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు పోషకాహారం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇక్రిశాట్ అధికారులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చర్చించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఏరియాలో పైలట్ ప్రాజెక్టు కింద మహిళలకు పోషకాహారంతో కూడిన ఆహారా న్ని రోజువారీగా సరఫరా చేయ నున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. 60 శాతం మందికిపైగా రక్తహీనత బాధితులే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 60 శాతానికిపైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. రక్తహీనత కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతు న్నాయి. వాకాటి కరుణ ఆధ్వర్యంలో జిల్లాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎక్కడ చూసినా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. దీంతో పోషకాహార సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్రిశాట్ ఇప్పటికే పోషకాహార మిశ్రమాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచింది. జొన్నలు, శనగలు, రాగులు, ఇతరత్రా సమపాళ్లలో కలిపిన ఆహారపదార్థాలను కలిపి ఉంచిన పొట్లాలను సిద్ధం చేసింది. అలాగే ప్రత్యేకంగా తయారు చేసిన పోషకాహార బిస్కెట్లను కూడా ఇక్రిశాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని రక్తహీనతతో బాధపడుతున్న మహిళలతోపాటు ఇతర మహిళలకు కూడా సరఫరా చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఉద్దేశం. దీనికి సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులను ఉపయోగించుకోనుంది. ఉట్నూరులోని మహిళల సంఖ్య, వారిలో రక్తహీనతతో బాధపడుతున్న వారెందరు వంటి వివరాలను సేకరించి త్వరలో అక్కడ పోషకాహారాన్ని సరఫరా చేయనుంది. -
పాస్‌పోర్టు కేంద్రాలుగా 40 పోస్టాఫీసులు
న్యూఢిల్లీ: దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పాస్‌పోర్టుల జారీని సులభతరం చేసేందుకు పోస్టల్, విదేశాంగ శాఖలు చేతులు కలిపాయి. ఎంపిక చేసిన 40 పోస్టాఫీసులు.. పాస్‌పోర్టు సేవలను అందించనున్నాయి. పోస్టల్ శాఖ అధికారులకు సంబందిత శిక్షణనిచ్చి పోస్టాఫీసును పాస్‌పోర్టులకు ‘సింగిల్ పాయింట్ సెంటర్’గా మార్చనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలిదఫాలో బుధవారం కర్ణాటకలోని మైసూరు, గుజరాత్‌లోని దాహోద్‌లలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. ప్రతీ జిల్లా హెడ్‌పోస్టాఫీసులో ఇలాంటి కేంద్రం ఏర్పాటుచేయాలనే యోచన ఉందన్నారు. -
విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ తనిఖీ
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు; త్వరలో దేశవ్యాప్తం! న్యూఢిల్లీ: దేశీయ విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ భద్రతా తనిఖీ వ్యవస్థ త్వరలో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ విధానం పట్ల సానుకూల స్పందన రావడంతో మిగిలిన విమానాశ్రయాల్లోనూ దీన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల వివరాల తనిఖీకి బయోమెట్రిక్ వ్యవస్థ ఉండడం ఓ మంచి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో బయోమెట్రిక్ సౌకర్యం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం. మంచి స్పందన వచ్చింది. భద్రతాపరంగా బయోమెట్రిక్ వ్యవస్థ మంచి ఆలోచన’’ అని రాజు వివరించారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరినట్టు పేర్కొన్నారు. ఆధునికీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని... భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రయాణికులు అవాంతరాల్లేకుండా వచ్చి పోయేందుకు వీలుగా ‘నాన్ స్టాంపింగ్ బ్యాగేజ్ ట్యాగ్’ విధానాన్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాల్లో ప్రవేశపెట్టగా... క్రమంగా ఇతర విమానాశ్రయాలకు దీన్ని విస్తరించనున్నట్టు అశోక్‌గజపతి రాజు తెలిపారు. -
హైవేల వెంట పచ్చదనం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్‌లో భాగంగా పర్యావరణ అనుకూల జాతీయ రహదారులను నిర్మించేందుకు నడుం బిగించింది. హైవేలకు ఇరువైపుల పెద్ద ఎత్తున చెట్లను పెంచుతారు. ఈ క్రమంలో ఎన్హెచ్ఏఐతో ఐటీసీ గురువారం న్యూఢిల్లీలో చేతులు కలిపింది. ఐటీసీకి చెందిన పేపర్‌బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రాంతాలను ఏపీలో గుర్తించారు. కర్నూలు నుంచి కడప మధ్య ఎన్‌హెచ్-40లో 114 కిలోమీటర్ల మేర 100 హెక్టార్లలో పేపర్ తయారీకి అవసరమైన చెట్లను పెంచుతారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు రహదారిలో ఎన్‌హెచ్-44పై 149 కిలోమీటర్లలో 100 హెక్టార్లలో ఈ ప్రాజెక్టును చేపడతారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తల్లి–బిడ్డ ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక ఆరోగ్య అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో పొందుపరిచే ఒక బృహత్తర కార్యక్రమాన్ని దేశంలో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. మాతా, శిశు మరణాల సంఖ్యను ఏ విధంగా తగ్గించాలో, పిల్లలకు పోషకాహారం అందిస్తున్న తీరు, గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు జరిగే వరకు మహిళ తీసుకోవాల్సిన ఆరోగ్య చర్యలు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కామన్ అప్లికే షన్ సాఫ్ట్వేర్ విధానాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకూ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని, ఈ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరచాల్సి ఉంటుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు పాల్గొన్నారు. -
6 జిల్లాల్లో డయాలసిస్ సెంటర్లు, పాఠశాలలు
పాలకొల్లు అర్బన్ : రోటరీ ఇంటర్నేషనల్ ప్రోత్సాహంతో ఈ ఏడాది ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్లు, రోటరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు అన్నారు. గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన పాలకొల్లు మండలంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నాగరాజుపేటలోని గురుకుల విద్యార్థులు ఎండ్ పోలియో ఆకృతిలో కూర్చుని పోలియోని శాశ్వతంగా నిర్మూలిద్దాం అంటూ నినాదం ఇచ్చారు. అంజలి మానసిక వికలాంగుల స్కూల్లో మదర్‌థెరిస్సా 150వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు బాలి ఏడుకొండలు విరాళం రూ.5 లక్షలతో నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అంజలి స్కూల్ విద్యుదీకరణ నిమిత్తం రూ.40 వేలు విరాళాన్ని ప్రకటించారు. ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు స్కూల్‌కి 12సీలింగ్ ఫ్యాన్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ రోటరీ డయాలసిస్ సెంటర్, రోటరీ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, దాతల సహకారంతో సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణణ, క్ల»Œ æకార్యదర్శి అనంతపల్లి కిరణ్‌కుమార్, రావూరి వెంకట అప్పారావు, చందక రాము, గొర్ల శ్రీనివాస్, సోమంచి శ్రీనివాసశాస్త్రి, గుడాల హరిబాబు, యాతం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివ్వంపేట’లో ఆపరేషన్ ‘గగన్’
పైలెట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాల ఎంపిక శాటిలైట్ అనుసంధానంతో అధికారుల భూ సర్వే శివ్వంపేట: భూముల వివరాలు సులభతరం చేసేందుకు కేంద్రప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద వివరాలు నమోదు చేసేందుకు శివ్వంపేట మండలాన్ని ఎంపిక చేసింది. ఈమేరకు శబాష్‌పల్లి , పోతారం, గంగాయపల్లి గ్రామాల్లో మంగళవారం గగన్ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అధికారులు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భూ సర్వే పనులు చేపట్టారు. ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సెంట్రల్ సర్వే ఆఫీస్‌కు చెందిన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూముల వివరాలు కంప్యూటరీకరణ గ్రామంలోని ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటరీకరణ చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీంతో సర్వే చేసిన భూమి వివరాలను రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. సెల్ఫోన్లోనూ పూర్తి వివరాలు అందుతాయి. భూమికి సంబంధించిన నక్ష హద్దులు సైతం ఇందులో పొందుపర్చనున్నారు. మూడు బృందాలుగా సర్వే మొదటగా శబాష్‌పల్లి గ్రామంలో సర్వే పనులను మూడు బృందాలు చేపడుతున్నాయి. ముందుగా సర్వే నెంబర్లు, పట్టాదారులకు సంబంధించిన భూమి విస్తీర్ణం కొలతలు వేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం శాటిలైట్ పరిజ్ఞానంతో ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేసి చుట్టు కొలతలు నమోదు చేస్తున్నారు. దీంతో అసలు పట్టాదారులను గుర్తించడంతో పాటు నకిలీ పట్టాదారుల తొలగింపు శాశ్వతంగా జరుగనుంది. క్షణాల్లో పహాణీ భూములకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లో పొందుపర్చడం ద్వారా క్షణాల్లో పహాణీ సర్టిఫికెట్లు రైతులు పొందే అవకాశం ఉంది. ఇదే గగన్ పైలెట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడంతో పాటు రెవెన్యూ సేవలు సులభతరం అవుతాయని చెప్పారు. మూడు నెలల పాటు సర్వే ఒక్కో గ్రామంలో సర్వే పూర్తి చేయడానికి నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. సమగ్ర సర్వేపై పట్టాదారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శబాష్‌పల్లిలో 1,683 ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా రెండు రోజుల్లో వంద ఎకరాల సర్వే చేపట్టారు. పరిశీలించనున్న ఉన్నతాధికారులు సర్వే పనులను రాష్ట్ర చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రేమన్ పీటర్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించనున్నట్టు తెలిసింది. సర్వే బాగుంది: రైతు వెంకటేశ్, శబాష్‌పల్లి అసలైన పట్టాదారుకు సంబంధించిన భూములను గుర్తించడం బాగుంది. భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కావడం వల్ల రెవెన్యూ ఇబ్బందులు ఉండవు. మూడు బృందాలుగా సర్వే: నర్సింగ్‌యాదవ్, వీఆర్వో శబాష్‌పల్లి మూడు బృందాలుగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. శబాష్‌పల్లిలో రెండురోజుల పాటు వంద ఎకరాల సర్వే పూర్తి చేశారు. రైతులు సహకరించాలి: ఫర్హీన్‌షేక్, తహసీల్దార్, శివ్వంపేట శాటిలైట్ సర్వేకు రైతులు సహకరించాలి. వారికి సంబంధించిన భూముల హద్దులు చూపెట్టడం ద్వారా నమోదు జరుగుతుంది. భూమలు అన్యాక్రాంతం కాకుండా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. మూడునెలల్లో సర్వే పూర్తి: అనంతపద్మనాభ, టీమ్ లీడర్ మూడు నెలల్లో ఈ మూడు గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ఆపై పూర్తి సమాచారాన్ని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్కు అందిస్తాం. ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు పరిచే అవకాశం ఉంది. -
ఇది ‘ప్లాస్టిక్ రోడ్డు’
ఉప్పల్‌లో పైలట్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం హైదరాబాద్: మహానగరంలో తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా నాగోలు బ్రిడ్జి నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు రూ.11 లక్షల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఆదివారం ప్రారంభమైన ఈ రోడ్డు 16 మీటర్ల వెడల్పుతో వంద మీటర్ల దూరం పూర్తయింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పనులు ప్రారంభించారు. నగరంలో అధిక శాతం రోడ్లు చిన్నపాటి వర్షానికే దెబ్బతింటుండడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని.. ఈ ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణంతో సమస్య తీరుతుందని ఆయన చెప్పారు. ‘బీటీ, సిమెంట్ రోడ్లతో పోలిస్తే ప్లాస్టిక్ రహదారులు పది కాలాల పాటు మన్నికగా ఉంటాయి. గుంతలు, నీరు నిలవడం వంటి సమస్యలుండవు. 8 శాతం ప్లాస్టిక్‌ను నిర్మాణంలో వాడతారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది’ అని మదురైలోని త్యాగరాజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల సాంకేతిక విభాగం సలహాదారు ఆర్.వాసుదేవన్ తెలిపారు. -
వానరానికి తీరని కష్టం
రాష్ట్రంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక చించోలి(బి) వద్ద ఏర్పాటుకు ఆదేశాలు రూ.2 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు నెలలు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు నిర్మల్‌రూరల్ : కనిపించిన చెట్టునల్లా నరుడు నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టం వచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనావాసాల బాట పట్టాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు ఫలాలు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇన్ని మెతుకుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ ఒక్క మెతుకు దొరికినా ఏరుకు తింటున్నాయి. సరిపడా ఆహారం దొరకక తమలో ఘర్షణ పడుతున్నాయి. ఆకలికి తాళలేకనే ఇళ్లలోకి చొరబడుతున్నాయి.. మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఈ వానర కష్టం.. వాటితో మనిషికి కలుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వానరజాతిని మళ్లీ వనాలబాట పట్టించాలని నిర్ణయించింది. ఇందుకు పెద్దఎత్తున హరితహారం చేపడుతోంది. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వానర జాతిని అరికట్టేందుకు, వాటి సమస్యలను తీర్చేందుకు మన జిల్లాకు పునరావాస కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే.. ఉత్తర్వులు జారీ అయి దాదాపు మూడునెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేంద్రం ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చించోలి(బి) వద్ద ఏర్పాటుకు.. అడవుల జిల్లాగా.. కోతుల ఖిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాను పునరావాస కేంద్రానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సారంగాపూర్ మండలం చించోలి(బి) సమీపంలో కోతులకు పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2 కోట్ల వరకు కేటాయించింది. ప్రభుత్వం చించోలి(బి)ని ఎంచుకోవడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల ఈ గ్రామానికి సమీపం నుంచే మహబూబ్ ఘాట్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ దట్టమైన అటవీప్రాంతంతో పాటు నీటి లభ్యత కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రాంతంలోనే కోతులు అధికంగా ఉన్నాయి. వానరాల సంఖ్య అధికంగా ఉన్న నిర్మల్ నుంచి ఇక్కడికి వాటిని సులువుగా తరలించవచ్చు. నిర్మల్‌లోనే ఎక్కువ.. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక వనవాసం వదిలిన కోతులు కొన్నేళ్ల కిందటే జనావాసాల్లోకి వచ్చి చేరాయి. జిల్లాలో వీటి సంఖ్య నిర్మల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ కోతులు జీవనం సాగించడానికి అనువైన గుట్టలు, సమీపంలోనే అడవులు ఉండటంతో పట్టణంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. మొదట్లో ఇళ్లలో తినగా మిగిలిన పదార్థాలను చెత్తకుండీల్లో పడేస్తే ఏరుకుని తింటూ జీవనం సాగించాయి. కాలక్రమంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. రానురాను ఆహారం దొరకడం కష్టంగా మారడంతో వాటి తీరు కూడా మారింది. ఆహార పదార్థాల కోసం ఇళ్లల్లో దూరడం, మనుషులపై దాడులు చేయడం మొదలు పెట్టాయి. ఇక గ్రామాల్లో పంటపొలాలను నాశనం చేయడం, ఇళ్లపై పెంకులు తొలగించడం చేస్తున్నాయి. దీంతో నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ కోతులు సమస్యగా మారాయి. కొంతకాలంగా వాటిని అడవుల్లోకి తరలించాలంటూ అధికారులకు వినతిపత్రాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం దాదాపు 2500 కోతులను పట్టుకుని జన్నారం అటవీ ప్రాంతానికి తరలించింది. అప్పట్లో అటవీశాఖ మంత్రి జోగురామన్న దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. కేంద్రం ఏర్పాటయితే.. రక్షణతోపాటు పునరావాస కేంద్రం ఏర్పాటయితే వానరాలతో మనుషులకు సమస్య తీరడంతో పాటు.. వాటి సమస్యలూ తీరనున్నాయి. ఈ కేంద్రంలో వెటర్నరి వైద్యశాలను ఏర్పాటు చేస్తారు. కోతులకు వచ్చే వ్యాధులను నయం చేసే వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందుకో సిబ్బందికి అక్కడే క్వార్టర్స్‌ను నిర్మిస్తారు. అలాగే విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు ఇక్కడ ప్రత్యుత్పత్తి చికిత్సలూ చేస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడతారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచుతారు. పునరావాసం ఇంకెప్పుడు.. వానరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనడంతో జంతుప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. తమకు బాధ తప్పడంతోపాటు వాటిని సరైన ఆవాసం దొరకనుందని భావించారు. అయితే.. ఇది గడిచి ఇప్పటికే దాదాపు మూడునెలలు కావస్తోంది. కానీ.. ఇంకా పునరావాస కేంద్రానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారులు వచ్చి చించోలి(బి)లో స్థలాన్ని మాత్రం పరిశీలించి వెళ్లారు. మరోవైపు నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల వానరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని వేలాది కోతులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతులను ఇంకెప్పుడు వనాలకు తరలిస్తారని, పునరావాస కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హరితహారం సీజన్ పూర్తికాగానే పునరావాస కేంద్రంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. -
64 ప్రాంతాలు.. 100 కి.మీ
► వైట్‌టాపింగ్ రోడ్ల కోసం ► అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ► అవరోధాల తొలగింపుపై అధ్యయనం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు నిర్మించేందుకు అవసరమైన రహదారులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, విద్యుత్ తదితర విభాగాల ఉన్నతాధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో రహదారులను పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్లలో వైట్టాపింగ్రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో 64 ప్రాంతాల్లో 100 కి.మీ.ల రోడ్లు వేయాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అధికారులు లిబర్టీ, బషీర్‌బాగ్, ఆబిడ్స్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, సైదాబాద్, డీఆర్డీఎల్, కంచన్‌బాగ్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, అంబర్‌పేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని తనిఖీలు నిర్వహించి ఆయా మార్గాల్లో తొలగించాల్సిన మంచినీటి, సివరేజి పైప్లైన్లు, విద్యుత్ లైన్లు ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తొలుత ఎలాంటి ఆటంకాలు లేని మార్గాల్లో పనులు చేపడతాన్నారు. ప్రతి రోడ్డుకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందులో తాగునీరు, సివరేజి లైన్లు, కేబుళ్లకు అవసరమైన డక్ట్లు , వరద కాలువలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు రామేశ్వరరావు, సతీష్, సురేష్‌కుమార్, సుభాష్‌సింగ్, ఎస్ఈ అశ్వనీకుమార్ తదితరులు ఉన్నారు. వివిధ పనుల తనిఖీ.. ఈ పర్యటనలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మార్గమధ్యంలో పారిశుధ్య పనులు, రోడ్ల మరమ్మతులు, వ్యాపార దుకాణాల్లో ట్రేడ్ లైసెన్సులు తదితరమైనవి కూడా తనిఖీ చేశారు. అలియాబాద్‌లో బియ్యం విక్రయదారులకు ట్రేడ్‌లైసెన్సు లేకపోవడం గుర్తించి సదరు మార్గంలోని దుకాణాలన్నీ తనిఖీచేసి ట్రేడ్ లైసెన్సులు లేనివారికి వాటిని జారీ చేయాలని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. -
ట్రాఫిక్ ఇక్కట్లపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి ట్రాఫిక్ ఇక్కట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులు తొలగేలా రోడ్ల పరిస్థితిని తక్షణం మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్‌గా 100 కిలోమీటర్ల మేర మెరుగైన రోడ్లు, సిమెంట్ పరిశ్రమలతో కలిసి వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం, వెడల్పయిన రోడ్లు, మళ్లీ మళ్లీ తవ్వకుండా డక్ట్‌ల నిర్మాణం చేపడతామని కేసీఆర్ వెల్లడించారు. -
మురుగు నీళ్లతో సాగునీరు!
సాక్షి, న్యూఢిల్లీ: మురుగునీటిని శుద్ధి చేసి సాగుకు పనికొచ్చేలా మార్చే కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. భారత్, యూరోపియన్ యూనియన్లకు చెందిన 11 సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహకారంతో ‘వాటర్ ఫర్ క్రాప్స్’ ప్రాజెక్ట్ కింద పరిశోధనలు జరిపి దీన్ని రూపొందించాయని వెల్లడించారు. గత 4 ఏళ్లుగా ‘వాటర్ ఫర్ క్రాప్స్’ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని ఇక్రిసాట్ సమన్వయంతో జరిపిన పరిశోధనలు, ప్రణాళికలను ఆయన బుధవారం సమీక్షించారు. మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడితే 40 శాతం అధిక దిగుబడి వస్తుందన్నారు. ఈ నీటిలో నత్రజని, భాస్వరం ఉంటాయని, అందువల్ల ఎరువుల వాడకం తగ్గుతుందని, సాగు చేసిన పంటలు సురక్షితమని తెలిపారు. రూ. 3 నుంచి 5 లక్షల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించాయని, ఇక్రిసాట్ సహకారంతో ఏపీలో పైలట్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. -
యువతకు చేయూత
► 18 నుంచి 35 సంవత్సరాల యువతతో ► స్వయం సహాయక సంఘాలు ► సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం... ► స్వయం ఉపాధిలో శిక్షణ ► పైలట్ ప్రాజెక్టు కింద 14 మండలాలు ఎంపిక ► మే 4వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ విధానంలో భాగంగా యువత కోసం వినూత్న పథకాలు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యు వజన నంఘాలు, అధికారులు, జాతీయ యువజ న అవార్డు గ్రహీతల అభిప్రాయూలు సేకరించింది. సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం యువత సేవా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా మండల స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. యువజన సంఘాలు రక్తదాన శిబిరాలు, అవయవ దానాలపై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే కార్యక్రమం(హరితాహారం), స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ భారత్, మిషన్ కాకతీయ, యోగా, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వనుంది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్బంగా జిల్లా, మండల స్థాయిలో అవార్డులను ఇచ్చి ప్రోత్సహించనుంది. సోషల్ మీడియాలో.. యువజన సంఘం వారి పేరు మీద ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసుకుని అందులో చేసే కార్యక్రమాలను పొందుపర్చాలి. అలాగే ఈ మెయిల్ ఐడీని సైతం క్రియేట్ చేయాలి. మొదట యూత్ క్లబ్ పేరు తరువాత మండలం, జిల్లా పేరు తో మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ప్రతి మం డలానికి మండల పరిషత్ అధికారి మండల యువజన అధికారిగా వ్యవహరించనున్నారు. ఇక నుంచి యువజన వ్యవహారాలు అన్ని మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు చుసుకోనున్నారు. యువజన భవనాల నిర్మాణం యువత సంస్థాగత తోడ్పాటు కోసం దేశంలో తొలిసారిగా యూత్ భవన్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఈ భవనాలను నిర్మించేందుకు వెసులుబాటు కల్పించింది. అందులోనే మల్టీలెవల్ ట్రెనింగ్ ఇచ్చేందుకు, గ్రంథాలయం నిర్వహణకు సైతం ఉపయోగపడే విధంగా నిర్మించనున్నారు. యువతకు స్థానిక చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు సైతం కల్పించనుంది. యువతకు మీ సేవ కేంద్రాలను సైతం కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనుంది. యువజన సంఘ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించేందుకు నివేదిక రుపొందిస్తోంది. 14 మండలాలు ఎంపిక జిల్లాలో యువ చేతన కార్యక్రమంలో భాగంగా 14 మండలాలు పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికయ్యూరుు. మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, తొర్రూరు, వర్ధన్నపేట, పరకాల, మొగుళ్ళపల్లి, ఏటురునాగారం, జనగాం, దేవరుప్పుల, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, ఖానాపూర్, హసన్‌పర్తి మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాలలో పథకం విజయవంతమైతే దశల వారీగా జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ మండలాల వారు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా యువజన సంఘం పేరు మీదనే ఉండాలి. ఈ క్లబ్‌లోని సభ్యులందరు 18 నుంచి 35 సంవత్సరాల వారే ఉండాలి. యువజన సంఘాలను పాతవి అయిన కొత్తవి అయినా సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఈ నెల 4వ తేదీలోగా అందజేయాలి. మరిన్ని వివరాలకు వరంగల్ ములుగు రోడ్‌లోని జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో గానీ, 0870-2623125 నెంబర్ ద్వారా గానీ సంప్రదించొచ్చు. యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోస ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ప్రోత్సహిస్తుంది. యువత కోసం అనేక పథకాలను అమలు చేయనుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు సైతం అందజేయాలని పరిశీలిస్తుంది. మొదట పెలైట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని 14 మండలాలను ఎంపిక చేశాము. గోపాల్ రావు, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి -
బీసీ ఫెడరేషన్లకు జవసత్వాలు!
♦ కులవృత్తుల ఆధునీకరణకు సర్కారు ప్రణాళికలు ♦ బీసీ సమాఖ్యలకు 70, 80 శాతం రాయితీతో రుణాలు ♦ వడ్డెర్లకు పొక్లెయిన్లు.. నాయి బ్రాహ్మణులకు బ్యూటిషియన్ కిట్ ♦ రజకులకు దోబీఘాట్లు, ఇతర సదుపాయాలు సాక్షి, హైదరాబాద్: బీసీ ఫెడరేషన్లకు జవసత్వాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఫెడరేషన్లలోని ఆయా కులవృత్తులను ఆధునీకీకరించే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మారుతున్న కాల, పరిస్థితులకు అనుగుణంగా కులవృత్తుల ద్వారా అందించే సేవలను ఆధునీకీకరించే చర్యలు చేపట్టనున్నారు. తద్వారా ఆయా వృత్తులవారు తగిన పారితోషకం, లబ్ధి పొందేలా మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ ఫెడరేషన్లలోని ఒక్కో సభ్యుడికి రూ.లక్ష లేదా రెండు లక్షల చొప్పున (15 సభ్యులున్న గ్రూపునకు) రూ.15 లక్షలు లేదా రూ.30 లక్షలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, నూతన రాయితీ విధానంలో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 2015-16 నుంచి రూ.లక్ష-10 లక్షల మధ్య 80-60 శాతం సబ్సిడీలతో రుణాలు ఇస్తున్నారు. అయితే ఫెడరేషన్లకు మాత్రం ఇంకా 50 శాతం సబ్సిడీతోనే రుణాలు ఇస్తున్నారు. కానీ వీటి ద్వారా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. దాంతో వీటిని కూడా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఫెడరేషన్లకు ఇస్తున్న రుణాలకు రూ.లక్షకు 80 శాతం, రూ. రెండు లక్షలకు 70 శాతం సబ్సిడీ ఇచ్చేలా ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర), వాల్మీకి/బోయ, కృష్ణబలిజ-పూసల, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి/శాలివాహన, మేదర, కల్లు గీతకారులకు ఫెడరేషన్లు ఉన్నాయి. కొత్తగా 2016-17 ఏడాదిలో సంచారజాతుల సంక్షేమం కోసం రూ. ఐదు కోట్ల రూపాయలతో సంచారజాతుల సమాఖ్య లిమిటెడ్‌ను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డెర్లకు పొక్లెయిన్లు.. వడ్డెర్లు అనేక ప్రయాసలకు ఓర్చి కఠినతరమైన వృత్తిని నిర్వహిస్తుండడంతో వారి గ్రూపులకు పొక్లెయిన్లు వంటి వాటిని రుణాల ద్వారా అందజేయాలని నూతన ప్రణాళికలో భాగంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రజకవృత్తి ఆధునీకీకరణలో భాగంగా దోబీఘాట్ల నిర్మాణానికి బోరుబావి తవ్వకం, విద్యుత్ కనెక్షన్‌తో మోటారు అమరిక , నీటితొట్టి, షెడ్లనిర్మాణం, విశ్రాంతి గది, మరుగుదొడ్ల నిర్మాణం, డ్రైక్లీనింగ్ సామగ్రి వంటి వాటిని అందించనున్నారు. అలాగే నాయీ బ్రాహ్మణులకోసం మొబైల్ బ్యూటీషియన్‌కు అవసరమైన హంగులు సమకూర్చనున్నారు. వినియోగదారుల ఇంటివద్దనే సేవలు అందించేందుకు కావాల్సిన శిక్షణనిచ్చి ఒక ద్విచక్రవాహనం, బ్యూటీషియన్ కిట్, యాప్రాన్, ఫోన్ సమకూర్చి, వినియోగదారులు సంప్రదించేందుకు వీలుగా ఒక యాప్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తాన్ని భరించేందుకు ఎస్ బ్యాంక్ సుముఖత వ్యక్తంచేసింది. ఇదే తరహాలో ఇతర వృత్తులను కూడా ఆధునీకీకరించి, ఆయా కులవృత్తుల వారు ఆర్థికాభివృద్ధిని సాధించేలా బీసీ శాఖ ప్రణాళికలకు తుదిరూపునిస్తోంది. -
112 అమలుకు తెలంగాణ ఎంపిక
* తొలుత పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ * రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం * రెండు నెలల్లో అందుబాటులోకి కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112 సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేయనున్న కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112కు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ ఇటీవల అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతమున్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నెంబర్ల స్థానంలో దేశ వ్యాప్తంగా 112ను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అత్యవసర స్పందన వ్యవస్థ (ఎన్‌ఈఆర్‌ఎస్) ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం మొదట గుజరాత్, తెలంగాణను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.100 కోట్ల విలువైన సాంకేతిక పరికరాలను అందించనుంది. దీని ద్వారా అత్యవసర సేవలు మరింత సులభతరం, వేగవంతం కానున్నాయి. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. కేంద్రానిదే నిర్వహణ ఖర్చు..: పోలీస్, మెడికల్, అగ్నిమాపక తదితర సేవల కోసం ప్రస్తుతం వేర్వేరు నంబర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాగే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నంబర్ ఉంటోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఒకే నంబర్ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రమే సమకూర్చనుంది. జీపీఎస్ ఆధారంగా ఆపదలో ఉన్న వారి దగ్గరికి దగ్గర్లోని పోలీసులను పంపిస్తారు. ఇదంతా నిమిషాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రానికి డబ్బులు ఆదా..: నేరాలను అరికట్టడం, ప్రజలకు సమర్థమైన పోలీసు సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త వాహనాలు, స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చు ట్టింది. పోలీసు వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థను పొం దుపరిచి ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే వారి దగ్గరికి క్షణాల్లో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కూడా మం జూరు చేసింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టి ఎమర్జెన్సీ నంబర్ 112 ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ భావాలకు అనుగుణంగా ఉండటం, నిర్వహణ ఖర్చులను కేం ద్రమే భరించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పోలీసు శాఖ వెనక్కి పంపించింది. -
ఇక ఇంటికి రెండు ఫ్యాన్లు
విద్యుత్ ఆదా కోసం కేంద్ర పథకం ఎల్ఈడీ బల్బుల తరహాలో మరో ప్రయత్నం దేశంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా నరసాపురం ఎంపిక సంక్రాంత్రికి పంపిణీ చేయడానికి సన్నాహాలు ఒక్కోదాని ఖరీదు రూ.1200.. వాయిదాల్లో చెల్లించవచ్చు నరసాపురం : దేశంలో విద్యుత్ వినియోగం, ఉత్పత్తిని మించి పెరిగిపోతోంది. దీంతో దీంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయేతర (సౌర, పవన) విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తూనే, వినియోగంలో పొదుపును పాటించే విధంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే గతంలో దేశంలో కొన్ని రాష్ట్రాలతో పాటుగా మనరాష్ట్రంలో కూడా తక్కువ విద్యుత్ వినియోగం అయ్యే ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసింది. ఇప్పుడు అదే తరహాలో తక్కువ విద్యుత్ అవసరం అయ్యే ఫ్యాన్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఈడీ బల్బుల పంపిణీని జిల్లాలో నరసాపురం పట్టణం నుంచే ఆరంభించారు. ఇప్పుడు ఫ్యాన్ల పంపిణీని కూడా నరసాపురం నుంచే ప్రారంభించనున్నారు. దేశంలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా నరసాపురం పట్టణాన్ని ఎంపిక చేయడం మరో విశేషం. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. సంక్రాంతి నుంచి ఫ్యాన్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించి, ప్రయత్నాలు చేస్తున్నామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (విశాఖపట్నం) కమర్షియల్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.రమేష్ వివరించారు. ప్రాజెక్ట్ ద్వారా ఫ్యాన్ల పంపిణీ ఇలా.. గతంలో ఎల్ఈడీ బల్బులను ప్రతి సర్వీస్ దారుడుకి రూ.20కి రెండు చొప్పున అందించారు. అయితే ఈసారి ప్రతి సర్వీస్‌కు రెండు ఫ్యాన్లు ఇస్తారు. ఒక్కో ఫ్యాన్ రూ.1200 ఖరీదు ఉంటుంది. ఈ సొమ్మును 10 నుంచి 20 వాయిదాల్లో సర్వీస్ దారులు తిరిగి చెల్లించాలి. చెల్లించాల్సిన వాయిదా సొమ్ము ప్రతినెలా విద్యుత్ బిల్లుతో కలిపి పంపుతారు. ఇందులో బలవంతం ఏమీ ఉండదు. ఇష్టం ఉన్న సర్వీస్ దారుడు మాత్రమే ఫ్యాన్లు తీసుకోవచ్చు. సాధారణంగా మామూలుగా మనం గృహాల్లో వినియోగించే ఫ్యాన్లు 70-80 వాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తాము పంపిణీ చేసే ఫ్యాన్లు కేవలం 35 వాట్స్ సామర్జ్యం మాత్రమే ఉంటాయని, దీంతో మూడవ వంతు కరెంట్ ఆదా అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడు సంవత్సరాల పాటు ఫ్యాన్లకు గ్యారంటీ ఇస్తారు. ఏపీ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్‌గా పట్టణానికి చెందిన జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ కొనసాగుతున్నారు. దీంతో నరసాపురాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం సులువయింది. విజయవంతమైతే, రాష్ట్రంలో ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను మన జిల్లాలోనే అమలు చేసే అవకాశం ఉంది. ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.. ఫ్యాన్ల పంపిణీకి సంబంధించి ఢిల్లీలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ టెండర్లు పిలిచిందని సీజీఎం రమేష్ వివరించారు. ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా గృహాలకు ఉచితంగా ఇచ్చిన ఎల్ఈడీ బల్బులు బాగానే పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇళ్లలో చాలామంది అద్దెలకు ఉంటున్నారు. గతంలో ఎల్ఈడీ బల్బులను, ఇంటి యజమానులు అద్దెదారులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్యాన్ల విషయంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అద్దెదారులే విద్యుత్ వినియోగం అధికంగా చేస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరడంలేదు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారనేది వేచిచూడాలి. -
హైదరాబాద్‌లో ఈజీ వాష్ కేర్ లాండ్రీ సర్వీసులు
వ్యవస్థీకృత రంగంలో రాష్ట్రంలో తొలి కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవస్థీకృత రంగంలో లాండ్రీ సర్వీసులు అందించే హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ ఈజీవాష్కేర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈజీ వాష్ కేర్ పేరుతో తొలి కేంద్రాన్ని ఇక్కడి మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది. బట్టలు ఉతకడమేగాక ఇస్త్రీ చేసి మరీ కస్టమర్‌కు అప్పగిస్తారు. కంపెనీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లి దుస్తులను సేకరించి, తిరిగి డెలివరీ చేస్తారు. సెప్టెంబరులో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇటీవలే వాణిజ్యపరంగా కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇప్పటికే 750కిపైగా కస్టమర్లున్నారని కంపెనీ వ్యవస్థాపకులు కలిశెట్టి నాయుడు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కస్టమర్ల సౌకర్యార్థం మొబైల్ యాప్‌ను త్వరలో తీసుకొస్తామన్నారు. ఏడాదిలో నాలుగు కేంద్రాలు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూఎస్ కంపెనీ మేట్యాగ్ వాషింగ్ మెషీన్లను భారత్‌లో తొలిసారిగా తాము వినియోగిస్తున్నామని కలిశెట్టి నాయుడు చెప్పారు. ‘బట్టలు ఉతకడానికి ట్రీటెడ్ వాటర్‌తోపాటు నాణ్యమైన డిటర్జంట్, కండీషనర్, కలర్ బ్లీచ్‌ను వాడుతున్నాం. చార్జీలు ప్యాక్‌నుబట్టి రూ.999 నుంచి ప్రారంభం. ఇక రూ.2,999 ప్యాక్‌లో ఒక కుటుంబానికి నెలంతా సేవలందిస్తాం. ఈ ప్యాక్‌లో ఉన్నవారికి ఎనమిదిసార్లు బట్టలు సేకరించి డెలివరీ చేస్తాం. ప్రస్తుతం ఆరు మెషీన్లను దిగుమతి చేసుకున్నాం. అధిక సామర్థ్యమున్న మెషీన్లు మరిన్ని రానున్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఏడాదిలో నాలుగు కేంద్రాలు ప్రారంభిస్తాం’ అని తెలిపారు. -
యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు ఉచిత వైఫై
హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు.. * త్వరలో వైజాగ్, బెంగళూరుకు విస్తరణ * గ్రూప్ సీఈవో బాల మల్లాది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్లకు శుభవార్త. వినియోగదార్లు ఇక నుంచి వారి ఫైబర్‌నెట్ కనెక్షన్ కలిగిన ఇల్లు, కార్యాలయం వెలుపల కూడా ఉచితంగా, అపరిమిత వైఫై ఎంజాయ్ చేయొచ్చు. అదనంగా ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్ ఫైబర్‌నెట్ వైఫై యాక్సెస్ పాయింట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులకు ఉచిత వైఫైని అందిస్తోంది కూడా. ఒకట్రెండు నెలల్లో అధికారికంగా సర్వీసులను ప్రకటిస్తామని గ్రూప్ సీఈవో బాల మల్లాది సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త సర్వీసులతో మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. ఇలా పనిచేస్తుంది.. కంపెనీకి చెందిన బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌కు వినియోగదారులైన వారు వైఫై జోన్లో అపరిమితంగా, ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. కస్టమర్ ఒక్కసారి లాగిన్ అయితే చాలు. వైఫై జోన్లోకి వెళ్లగానే నెట్ కనెక్ట్ అవుతుంది. కస్టమర్ ఎంత డేటా వాడితే ఆ మేరకు బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లో భాగంగా ఇచ్చే ఉచిత డేటా నుంచి తగ్గిస్తారు. ఉదాహరణకు ఏ-మ్యాక్స్ 650 ప్యాక్‌లో ఉన్న కస్టమర్‌కు 50 జీబీ డేటా ఉచితం. వైఫై జోన్లో ఉన్నప్పుడు 1 జీబీ డేటా వాడితే, కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్ నుంచి 1 జీబీని తగ్గిస్తారు. బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్ పరిమితి దాటినా కొంతమేర ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యం ఉంది. ఇక కంపెనీ కస్టమర్లు కానివారికి మాత్రం వైఫై జోన్లో 30 నుంచి 60 నిమిషాల వరకు మాత్రమే నెట్ ఉచితం. చాలా మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇల్లు, కార్యాలయం దాటగానే ఆయా టెలికం ప్రొవైడర్ అందించే మొబైల్ ఇంటర్నెట్ను చార్జీలు చెల్లించి వాడుతున్నారు. ఇటువంటి వారికి యాక్ట్ వైఫై సర్వీసు పెద్ద ఉపశమనమే. వారు ఇకనుంచి మొబైల్లో యాక్ట్ ఫైబర్‌నెట్ వైఫై జోన్లో ఉచితంగా ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఇతర నగరాలకూ విస్తరణ.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్యను ఏడాదిలో 200, రెండేళ్లలో 500లకు చేరుస్తామని బాల మల్లాది తెలిపారు. వైఫై జోన్ల ఏర్పాటు విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చొరవ అభినందనీయమని అన్నారు. ‘200ల హాట్‌స్పాట్ లొకేషన్లకుగాను రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నాం. మూడు నెలల్లో వైజాగ్, బెంగళూరులో ఇటువంటి సేవలు తీసుకురావాలని యోచిస్తున్నాం. డేటా చార్జీలు పెంచడం లేదు. ఉచిత డేటా పరిమితిని పెంచుతూ కస్టమర్లకు దగ్గరయ్యాం’ అని బాల తెలిపారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో దేశంలో 7.7 లక్షల మంది కస్టమర్లతో యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) నాల్గవ స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్ట్ ఫైబర్‌నెట్ కస్టమర్ల సంఖ్య 5 లక్షలు. -
జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఠాణాలు!
పైలట్ ప్రాజెక్టుగా నల్లగొండ జిల్లా ఎంపిక నల్లగొండ: జాతీయ రహదారులపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మృత్యుమార్గాలుగా మారిన జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణతో పాటు నిషేధిత పదార్థాల రవాణా జరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లోని జాతీయ రహదారులపై ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నల్లగొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి ంది. నల్లగొండమీదుగా హైదరాబాద్-విజయవాడ(ఎన్‌హెచ్-65), హైదరాబాద్-వరంగల్(ఎన్‌హెచ్-163) జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటిపై ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ చొప్పున ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా జిల్లా పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్‌హెచ్-65పై ఆరు, ఎన్‌హెచ్-163పై రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటవుతాయని అంచనా. నల్లగొండ నుంచి 200 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వెళుతున్నాయి. చౌటుప్పల్ మండలం కొత్తగూడెం నుంచి కోదాడ మండలం రామాపురం వరకు 153 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. మరోవైపు హైదరాబాద్-వరంగల్ మార్గంలో బీబీనగర్ నుంచి ఆలేరు వరకు 55 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది. ఇవి తరచూ ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ ఠాణా.. ఓ భరోసా నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయరహదారులపై ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా చాలా రకాలుగా మేలు జరుగుతుందని స్థానిక పోలీసులంటున్నారు. ప్రమాదాలను నివారించడమే కాకుండా ప్రమాదాలకు గురయ్యే బాధితులకు సత్వర సాయం అం దుతుందని చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం అయితే జాతీయ రహదారులను తనిఖీ చేయడం, నిషేధిత పదార్థా లు, అక్రమ మద్యం, దొంగ రేషన్ బియ్యం, ఇసుక లాంటి వనరుల అక్రమరవాణా కూడా అరికట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు. -
తగ్గిన ట్రాక్ డెత్‌ల సంఖ్య
- గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గుదల సాక్షి, ముంబై: రైల్వే ట్రాక్ డెత్‌లు గతేడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఇప్పటివరకు 793 ట్రాక్ డెత్‌లు సంభవించగా గత ఏడాది ఇదే సమయంలో 845 నమోదయ్యాయి. సుమారు ఆరు శాతం వరకు మరణాల సంఖ్య తగ్గినట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. వాడాలా రైల్వే స్టేషన్ పరిధిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19 కాగా, కుర్లా, థానేల్లో రైల్వే స్టేషన్ పరిధిలో 34 మంది రైల్వే ట్రాక్‌లపై ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైల్వే బోగీలలో క్లోజ్డ్ డోర్ విధానం ట్రాక్ మరణాలను కొంతమేర అరికట్టవచ్చని అధికారులు భావించారు. వెస్టర్న్ రైల్వేలో పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని మహిళా బోగీలలో ఈ వ్యవస్థను అమర్చారు. కల్యాణ్‌లో అధికంగా 65, వాషిలో 57 మరణాల కేసులు నమోదయ్యాయి. ఈ ఇరు రైల్వే స్టేషన్లలో రైలు పట్టాలు దాటుతూ ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. చాలా మంది ఫుట్‌బార్‌కు ప్లాట్‌ఫాంకు మధ్య ఉన్న గ్యాప్‌లో పడి మరణిస్తున్నారు. కొన్ని స్టేషన్లలోనే ప్లాట్‌ఫాం ఎత్తు పెంచారు. సబర్బన్ రైల్వే ప్లాట్‌ఫాంల ఎత్తును ఎంత మేరకు పెంచాలనే విషయమై ఓ బృందాన్ని బాంబే హైకోర్టు నియమించింది. వెస్టర్న్ రైల్వేలో 31 ప్లాట్‌ఫాంల్లో ఎత్తును 920 ఎం.ఎం. వరకు పెంచామని ఓ అధికారి తెలిపారు. సెంట్రల్ రైల్వేలో 24 గాను 13 ప్లాట్‌ఫాంల ఎత్తు పెంచడం పూర్తి అయింది. మే నాటికి ఈ పనులన్ని పూర్తి అవుతాయని, ప్రస్తుతం నాలుగు ప్లాట్‌ఫాంలలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. -
నేటి నుంచి హైదరాబాద్‌లో ఉచిత వైఫై
పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌ను వైఫై నగరంగా మార్చుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. నగరవాసులకు ఉచిత వైఫై సేవలు అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గురువారం సాయంత్రం 5.15 గంటలకు హోటల్ మారియట్‌లో ఉచిత వైఫై పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తొలి వీడియో(ఫేస్‌టైం) కాల్ చేసి కేటీఆర్ సంభాషించనున్నారు. ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుకు బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా సేవలు అందించనున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోని వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని, ఒకేసారి 2,500 మంది లాగిన్ కావచ్చని అధికారులు తెలిపారు.2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఉచిత వైఫై సేవలు లభిస్తాయని, ఒక్కో పౌరుడు 30 నిమిషాలు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వివరించారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘వాష్’
స్వచ్ఛభారత్‌లో భాగంగా అమలు నీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యత 150 మండలాల్లో 13 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టు కింద 12 గ్రామాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాం తాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ అమల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) కార్యక్రమాన్ని ప్రారంభించాలని సర్కారు సంకల్పించింది. దీన్ని ఈ నెల రెండో వారంలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘వాష్’ ద్వారా వ్యక్తిగత పరిశుభ్రతపట్ల విస్తృత అవగాహన, మరుగుదొడ్ల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద 9 జిల్లాల నుంచి 12 గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించనుంది. ఫలితాలను సమీక్షించిన తర్వాత మిగిలిన గ్రామాలకూ విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ‘వాష్’ అమలు నిమిత్తం మొదటి విడతగా రూ.47.56 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 33.3 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14.26 కోట్లు విడుదల చేసింది. ‘వాష్’ అమలు ఇలా.. ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ అమలు బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేసేలా చర్యలు చేపడతారు. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజ లను చైతన్యం చేస్తారు. ఎంపిక చేసిన వలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుధ్యం అంశాలకు సంబంధించి గ్రామంలో కుటుంబాల వారీగా బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వలంటీర్లకు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది సహకరిస్తారు. సర్వేలో వెల్లడైన వివరాలను గ్రామసభలో చర్చించి నిర్ణీత సమయంలోగా ప్రతి కుటుం బం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ప్రొక్యూర్మెంట్, నిర్మాణం, నిఘా పేరుతో 3 ఉపకమిటీలను నియమిస్తారు. కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పం చ్, వార్డు సభ్యులు ఉంటారు. వాష్ కమిటీలకు సర్పంచులే అధిపతులుగా వ్యవహరిస్తారు. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200 ఇస్తారు. విరాళాలనూ సేకరించవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు రివాల్వింగ్ ఫండ్‌ను గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య (ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అందజేస్తుంది. ఈ నిధులను గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు. -
చిన్నారులకు ‘టీకా’ రక్ష
* ‘మిషన్ ఇంద్రధనుష్’ను ప్రారంభించనున్న కేంద్రం * మార్చి నుంచి దేశంలోని శిశువులందరికీ టీకాలు * ఏపీలో 5, తెలంగాణలో 2 జిల్లాలు సహా తొలిదశలో 201 జిల్లాల్లో అమలు * ‘మిషన్ ఇంద్రధనుష్’ దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో.. ఏపీలో తూ.గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ * తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు సరిగా అందడం లేదన్న ‘డీఎల్‌హెచ్‌ఎస్’ సర్వే నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ వివిధ వ్యాధులకు సంబంధించిన టీకాలు వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘మిషన్ ఇంద్రధనుష్’ పేరిట ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టి... మార్చి నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, కేంద్ర గణనశాఖల ఆధ్వర్యంలో డీఎల్‌హెచ్‌ఎస్ (డిస్ట్రిక్ట్ లెవెల్ హౌస్‌హోల్డ్ సర్వే) నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వ్యాక్సిన్లకు సంబంధించి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. కొందరు చిన్నారులు కొన్ని వ్యాక్సిన్లకే పరిమితంకాగా... కొందరు అసలు ఏ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని బయటపడింది. దేశవ్యాప్తంగా 89 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయలేదని వెల్లడైంది. అంతేగాకుండా గర్భిణులు, చిన్నారుల్లో తీవ్ర రక్తహీనత నెలకొందని తేలింది. ఈ సర్వే నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ ఇంద్రధనుష్’ను ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో చిన్నారులకు వందశాతం టీకాలు వేసేందుకు ఈ భారీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మిషన్ ఇంద్రధనుష్’ పథకాన్ని తొలిదశలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్నారు. ఈ జిల్లాల్లో 50% మాత్రమే టీకాల కార్యక్రమం జరిగిందని, అందువల్లే వాటిని తొలిదశలో ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల నుంచి ప్రతి నెలలో 7 రోజుల పాటు పూర్తిగా చిన్నారులకు వ్యాక్సిన్లు వేయడంపైనే అధికారులు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. 8 ప్రాణాంతకమైన జబ్బులకు ఈ పథకం కింద టీకాలు వేయనున్నారు. 5 రకాల జబ్బులకు పనిచేసే పెంటావాలెంట్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అందుబాటులోకి తేనున్నారు. టీకాలు వేసే జబ్బులు డిఫ్తీరియా (కంఠసర్పి), పర్చూసిస్ (కోరింత దగ్గు), టెటనస్ (ధనుర్వాతం), పోలియో, ట్యూబర్క్యులోసిస్ (టీబీ), మీజిల్స్ (తట్టు), హెపటైటిస్-బి, జపనీస్ ఎన్సెఫలైటిస్ (మెదడువాపు) అందరికీ అందించడమే.. మురికివాడలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలతో పాటు వ్యాక్సిన్లు సరిగా అందని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో శిశువులందరికీ వ్యాక్సిన్లు వేయాలనేది లక్ష్యం. -
పాఠశాల ప్రవేశాలకు ప్రత్యామ్నాయం
* వయసుకు సంబంధించిన గందరగోళానికి తెర * 9 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్లు పుణే: పాఠశాల అడ్మిషన్లలో వచ్చే ఏడాది నుంచి ఒకే వయో పరిమితిని అమలు చేయనుండటంతో ఈ ఏడాది అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ మరో మార్గం ఆలోచించింది. అడ్మిషన్ సమయంలో వయస్సుకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి ఈమేరకు ఓ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పాఠశాలలు విద్యార్థుల వయస్సు వివరాలు విడివిడిగా ఇవ్వాలని, ఆ ప్రకారమే అడ్మిషన్లు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మనే శనివారం తెలిపారు. నాసిక్‌లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న రిజిస్ట్రేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తులు 16 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. పుణే, పింప్రి, చించ్వాడ్, ముంబై, థాణే, కల్యాణ్ దోంబివలి, నాగ్‌పూర్, భీవండి-నిజాంపూర్, ఉల్హస్నగర్, మిరా-భయందర్, నవీ ముంబై, అమరావతి, లాతూర్, ఔరంగాబాద్, కొల్హాపూర్‌లలో ఈ నెల 16 నుంచి 21 వరకు ఈ పద్ధతి కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తులు ఫిభ్రవరి 23 నుంచి మార్చి 7 వరకు స్వీకరిస్తారని వారు వెల్లడించారు. డిప్యూటీ డెరైక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెరిఫికేషన్ సెంటర్‌ను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు (rte25admission. maharashtra.gov.in)ను సంప్రదించాలని చెప్పారు. ఆర్టీఈ చట్టం ప్రకారం చేరిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.26 కోట్ల ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. ఓ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై జరిగిన అత్యాచార కేసు విషయంలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మానే తెలిపారు. అయితే గతంలో మూడు పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసు పురోగతి గురించి ప్రశ్నించగా చివరి నివేదిక సమర్పించడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులకు వారం రోజులు గడువిచ్చినట్లు తెలిపారు. -
ప్రతి చుక్కా పట్టాలి
జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు నానాటికీ అడుగంటుతున్నాయి. ఈ తరుణంలో భూగర్భజలాలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వృథాగా పోతున్న వాన నీటిని భూమిలోకి ఇంకింపజేసేలా ‘బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్’ను ఏర్పాటు చేస్తూ అధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు. తద్వారా ఏ పొలంలో పడిన వర్షపు నీరు ఆ పొలంలోనే ఇంకి భూగర్భజలాలు పెరగనున్నాయి. ఇందుకు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని అధికారులు ప్రతిపాదనలకు సిద్ధం చేశారు. * భూగర్భ జలమట్టం పెంచేందుకు ప్రణాళిక * పైలట్ ప్రాజెక్టుగా గజ్వేల్ నియోజకవర్గం * రూ.66.49 కోట్లతో రూపకల్పన * ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో భూగ ర్భ జల మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాలు డార్క్ ఏరియాలోకి వెళ్లాయి. కొత్త బోరుబావుల తవ్వకాల సంఖ్య పెరుగుతుండడం, అవసరానికి మించి భూగర్భ జలాలు వాడుకోవడం వల్ల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుతోంది. దీని ప్రభావం సాగుపై చూపడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో భూగర్భ జలమ ట్టాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రతి వర్షపు చుక్కనూ వడిసి పట్టి భూగర్భంలోకి ఇంకిపోయేలా (వాటర్ రీచార్జ్) చేసి తద్వారా భూగర్భ జల మట్టాలను పెంచేలా రూ.66.49 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజే సి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదానికి అధికారులు వేచి చూస్తున్నారు. సీఎం కేసీఆర్ భూగర్భ జలశాఖ అధికారు లు ప్రతిపాదించిన పైలట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఏటా భూగర్భ జల మట్టాలు 0.66 మీటర్లు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 68 పెద్ద చెరువులు, 823 చిన్న చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల ద్వారా తక్కువ మొత్తంలో పంటలు సాగు అవుతున్నాయి. దీంతో రైతులు బోరు బావులను తవ్వుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 33,722 బోర్లు ఉన్నాయి. ఆయా బోర్ల ద్వారా పంటల సాగు కోసం ఖరీఫ్, రబీ సీజనల్ పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. 2011-12 భూగర్భ జలశాఖ నివేదికను పరిశీలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో 13,568 హెక్టా మీటర్ల భూగర్భ జలాలు ఉంటే, బోరుబావుల ద్వారా 11,984 హెక్టా మీటర్ల నీటిని తోడేశారు. 2013-14 నివేదికను అనుసరించి 11,019 హెక్టా మీటర్ల నీటిని వాడుకున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలను విరివిగా వినియోగిస్తుండడంతో క్రమంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 15 నుంచి 25 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టాలు పడిపోయినట్లు అంచనా. ప్రతి వర్షం బొట్టూ ఇంకించేందుకు ప్రతిపాదన వర్షాకాలంలో కురిసే ప్రతి నీటిబొట్టును భూగర్భంలోకి ఇంకించి తద్వారా గజ్వేల్ అంతటా భూగర్భ జల మట్టాలు పెంచాలని భూగర్భ జల శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగానే బోరు బావి సమాంతరంగా పది మీటర్ల దూరంలో పది మీటర్ల లోతుతో బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తారు. పొలంలో కురిసిన వర్షం నీరంతా బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ ద్వారా భూమిలోకి ఇంకిపోయేలా చేస్తారు. ఇలా చేయడం ద్వారా బోరు బావులు ఉన్న ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలో మొదటి దశలో దళితులు, గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో భూగర్భ జల మట్టాలను పెంచేందుకు వీలుగా రూ. 66.49 కోట్లతో 16,624 బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని భూగర్భ జలశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చారు. ఒక్కో బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం రూ.40 వేలు ఖర్చు అవుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టాలని భూగర్భ జలశాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బోరుబావుల కింద సాగు అవుతున్న 39,459 హెక్టార్లలకు అదనం గా మరో 11,665 హెక్టార్లలో రైతులు డ్రిప్ ద్వారా పం ట లు సాగు చేసుకోవచ్చని భూగర్భ జలశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు రూపొందించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. -
ట్రాన్షిప్మెంట్ హబ్‌గా విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ట్రాన్షిప్మెంట్ హబ్గావిశాఖపట్నం రూపాంతరం చెందనుందని విశాఖ పోర్టుట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఈ క్రమంలో విశాఖ కంటైనర్ టెర్మినల్‌ను ‘ట్రాన్షిప్మెంట్ హబ్’గా అభివృద్ధి చేయనున్నటు ఆయన వెల్లడించారు. ‘ఈస్టుకోస్టు మేరిటైమ్ బిజినెస్ సమ్మిట్’ను విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 12వేల టీయూవీ సామర్థ్యం ఉన్న నౌకలే ప్రవేశించడానికి అవకాశం ఉన్న విశాఖ పోర్టు ఛానల్ సామర్థ్యాన్ని 15వేల టీయూవీలకు పెంచుతామన్నారు. సాగరమాల ప్రాజెక్టును పశ్చిమ తీరంలో మహారాష్ట్రలోనూ తూర్పుతీరంలో మన రాష్ట్రంలోనూ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. దీని కింద రాష్ట్రంలోని పోర్టులలో ప్రస్తుత ఉన్న మౌలిక వసతులను ఆధునీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచుతారని తెలిపారు. ముంబాయి- ఢిల్లీ తరహాలో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి డెడికేటెడ్ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదిస్తున్నామన్నారు. అదే విధంగా విశాఖపట్నంను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అనకాపల్లి వద్ద 500 ఎకరాలలో వేర్‌హౌసింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుశీల్ ముల్చందాని మాట్లాడుతూ కృష్ణపట్నం నుంచి మయన్మార్‌కు గత అక్టోబరులో అంతర్జాతీయ వాణిజ్య మార్గం ఏర్పడిందని ఆయన చెబుతూ త్వరలో కృష్ణపట్నం-చిట్టగాంగ్ మార్గానికి కూడా అనుమతి వస్తుందన్నారు. -
ప్రతి ఇంటా ఈ-సాక్షరత
పల్లె ప్రజలకు ఐటీ పాఠాల కోసం కొత్త కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఇంటా ఓ వ్యక్తి సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో కనీస నైపుణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేదా ఏదైనా డిజిటల్ పరికరం ఉపయోగించి ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడంతోపాటు కావాల్సిన సమాచారం కోసం ఇంటర్నెట్లో శోధించగలగాలి. జాతీయ ఐటీ విధానం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటైన ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ (ఎన్డీఎల్ఎం)ను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రతి ఇంటా ఈ- సాక్షరత’ పేరుతో అమలు చేయనున్న ఈ పథకాన్ని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన పరస్పర అంగీకార పత్రంపై కేంద్ర ఐటీ శాఖ అధికారి దినేష్ కుమార్ త్యాగి, మీ సేవా తెలంగాణ రాష్ట్ర సంచాలకులు బి.శ్రీధర్ సంతకాలు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాలు ఎంపిక పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని కోసం గజ్వేల్ (మెదక్), సూర్యాపేట(నల్లగొండ), సిరిసిల్ల (కరీంనగర్), అచ్చంపేట (మహబూబ్‌నగర్) మండలాలను ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో ఎన్డీఎల్ఎం శిక్షణ ఇవ్వనున్నారు. మండలానికి 7,500 మంది చొప్పున తొలిదశ కింద నాలుగు మండలాల్లో 30 వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. -
మొబైల్ సిమ్ కార్డులకు ఇక ఆధార్!
అనుసంధానం కోసం పైలట్ ప్రాజెక్టు న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీస్తోంది. తద్వారా ఆధార్ కార్డుదారులకు మొబైల్ సిమ్ కార్డుల యాక్టివేషన్ వేగవంతం కానుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ(యూఐడీఏఐ) రూపొందించిన ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ) సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రాజెక్టును త్వరలో చేపట్టనున్నట్లు టెలికం శాఖ(డాట్) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఐదు టెలికం కంపెనీల భాగస్వామ్యంతో లక్నో(ఎయిర్టెల్), భోపాల్(ఆర్‌కామ్), ఐడియా(ఢిల్లీ), వొడాఫోన్(కోల్‌కతా), బెంగళూరు(బీఎస్ఎన్ఎల్) నగరాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు డాట్ వెల్లడించింది. ఈ-కేవైసీ సర్వీస్ ద్వారా బ్యాంకులు, టెలికం కంపెనీలు ఇలా ఇతరత్రా సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారునికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే తనిఖీ చేసేందుకు వీలవుతుంది. ఇందుకు ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాల ఆధారంగా వివరాలను సరిచూస్తారు. ప్రస్తుతం కస్టమర్ నుంచి ద్రువపత్రాలు ఇతరత్రా వివరాలన్నీ తీసుకున్న తర్వాత వాటిని తనిఖీ చేసి మొబైల్ సిమ్ కార్డు యాక్టివేషన్ చేసేందుకు కనీసం రెండు రోజుల వ్యవధి పడుతోంది. ఆధార్‌కు గనుక దీన్ని అనుసంధానం చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ పూర్తయ్యేందుకు వీలవుతుంది. జనవరిలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కావ చ్చని సమాచారం. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు డాట్ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం కస్టమర్ల ఐడెంటిటీ, అడ్రస్ ధ్రువీకరణకు కోసం అమల్లో ఉన్న విధానం కొనసాగుతుందని డాట్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. -
తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో సోమవారం నుంచి ఈ టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో కూడా ఆన్లైన్ బుకింగ్ సోమవారం ప్రారంభం కానుంది. టికెట్లను ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేస్తారని తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు. స్లాట్‌లో 500 టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. -
ఎక్కడైనా.. ఎప్పుడైనా రేషన్
* త్వరలో అమలులోకి రానున్న పోర్టబిలిటీ * ‘తూర్పు’ నుంచే పైలట్ ప్రాజెక్టు! సాక్షి, రాజమండ్రి : బడుగులకు రేషన్ పంపిణీ విధానంలో సంస్కరణలు తేవడమే కాకుండా ఆధార్ అనుసంధానంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానం అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో వంద దుకాణాల్లో అమలవుతున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈపీఓఎస్) వచ్చే నెల 15 నుంచి జిల్లా అంతటా అమలు చేస్తున్నారు. ఈ విధానం కూడా జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన అమలులోకి తేనున్న ఈ విధానానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ కూడా లభించింది. పోర్టబిలిటీ అంటే.. ఇదొక స్మార్ట్ కార్డు తరహా విధానం. స్మార్ట్ కార్డుల ద్వారా ఆన్లైన్ విధానంలో ఎలా సేవలు పొందుతామో, అలాగే ఏ ఊళ్లో లేదా, ఏ జిల్లాలో నుంచైనా సరకులు తెచ్చుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లోనే సరకులు తెచ్చుకునే వారు. ప్రతి నెలా 18లోగా తెచ్చుకోకపోతే అవి వెనక్కి వెళ్లిపోతాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ విధానంలో ఉండవు. ఏ రేషన్ దుకాణం నుంచైనా ఎప్పుడైనా సరకులు తెచ్చుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. సమీపంలోని రేషన్ దుకాణం నుంచి సరకు తెచ్చుకోవచ్చు. సాధ్యమేనంటున్న అధికారులు జిల్లాలో 99 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఆ డేటా అంతా సెంట్రలైజ్డ్ విధానంలో ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ఆధార్ నంబరును పరీక్షించి, ఆన్లైన్ చేస్తారు. కార్డు నంబరు రేషన్ దుకాణంలో ఫీడ్ చేస్తే లబ్ధిదారుడి వివరాలు లభ్యమవుతాయి. కేటాయించిన మేరకు సరకు ఇస్తే ఆ వివరాలు అక్కడే ఆన్లైన్లో నమోదవుతాయి. ఏ దుకాణంలో పరిశీలించినా.. ఆ వివరాలు తెలుస్తాయి. దీంతో మరోచోట సరకులు తీసుకునే వీలుండదు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతా సరళీకృతం జిల్లాలో దాదాపు 2700 రేషన్ దుకాణాలున్నాయి. వీటిలో ప్రతీ నెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకూ సరకులు ఇస్తారు. తర్వాత 19న డీలర్లు వాటి రికార్డులు సమర్పిస్తారు. కొత్తగా వచ్చే సరకు కోసం డీడీలు తీస్తారు. 20 నుంచి 30 వరకూ డీలర్లకు సరకు చేరుతుంది. కొత్త విధానం వల్ల ఈ వంతుల వారీ పద్ధతులు ఉండవు. డీలర్లకు సరకు పరిమితి తొలగిస్తారు. రోజుకు ఎన్ని కార్డులకు, ఎంత సరకు ఇచ్చారో ఆన్లైన్లో గణాంకాలు స్పష్టమవుతాయి. రాజమండ్రిలో ఈపీఓఎస్పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఎదుట జిల్లా మేనేజర్ కుమార్ ఈ ప్రతిపాదన ఉంచారు. ముందుగా ఇక్కడి నుంచే ఒకేసారి ఈ విధానం ప్రారంభించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా అమలయ్యాక రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. -
రూ. 100 కోట్లతో కొత్త టెక్నాలజీ రోడ్లు
- 6 తారురోడ్లకు గ్రీన్‌సిగ్నల్ - పైలట్ ప్రాజెక్టుగా కుప్పం పీఆర్ సబ్‌డివిజన్ చిత్తూరు(టౌన్): జిల్లాలో కొత్త టెక్నాలజీ ద్వారా నిర్మించనున్న ఆరు రోడ్లకు అవసరమైన *100 కోట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కుప్పం, చిత్తూరు, మదనపల్లె సబ్డివిజన్ల పరిధిలో రెండేసి తారురోడ్ల నిర్మాణాలను చేపట్టడానికి సంబంధిత ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ నుంచి కూడా అనుమతి లభించింది. తొలుత కుప్పం సబ్ డివిజన్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. వీలైనంత త్వరగా కుప్పంలో ఈ టెక్నాలజీ ద్వారా పనులు చేపట్టడానికి అవసరమైన చర్యలను పంచాయతీరాజ్ ఇంజనీర్లు తీసుకుంటున్నారు. వీటి మంజూరు, అంచనాల తయారీ, పరిపాలన మంజూరు, సాంకేతిక మంజూరు తదితరాలను నెలలోపు ముగించి నిర్మాణ పనులను రెండు నెలల్లోగా పూర్తిచేయించాలని సిద్ధమవుతున్నారు. ఈ టెక్నాలజీతో ఉపయోగాలివి జిల్లాలో అమలు చేయనున్న కొత్త టెక్నాలజీ ద్వారా పలు ఉపయోగాలున్నాయి. ఇసుక, కంకర, సిమెంటు, తదితరాలను అవసరానికన్నా అధికంగా వాడుతూపోతే రాబోవు తరాలకు ఇవి ఉండవనే ఉద్దేశంతో ప్రత్నామ్యాయంగా స్థానికంగా లభించే వనరుల ఆధారంగా నిర్మాణాలను చేపట్టడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తారురోడ్లు, సిమెంటురోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలను చేపట్టడంలో కంకర, ఇసుక, సిమెంటు తదితరాలను అవసరమైన మోతాదులో వాడుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీ ద్వారా మూడు లేయర్ల మెటల్ (కంకర)ను వాడే బదులు కొత్త టెక్నాలజీ ద్వారా రెండు లేయర్లను వాడితే ఒక లేయర్ ఆదా అవుతుంది. అదేవిధంగా ఇసుక బదులు క్వారీల్లో వృథాగా ఉన్న క్వారీడస్ట్ను వాడొచ్చు. సిమెం టును కొంత తగ్గిస్తూ మిగిలిన మోతాదుకు ఫ్లైయాష్‌ను వాడొచ్చు. దీనివల్ల కిలోమీటరు దూరం తారు రోడ్డు నిర్మించేందుకు ఇంచుమించు *5 లక్షల వరకు ఆదా చేయ చ్చు. పది కిలోమీటర్ల పొడవున్న తారు రోడ్డు నిర్మాణంలో రూ. 50 లక్షల వరకు ఆదా అవుతుంది. జిల్లాకు అనుకూలంగా ‘టెర్రాజైమ్’ మనజిల్లాలో లూజ్‌సాయిల్ (దిగబడే నేలలు) లేనందున చెన్నైకి చెందిన అవిజీత్ కంపెనీ అందిస్తున్న ‘టెర్రాజైమ్’ అనే ఫార్ములా తారురోడ్ల నిర్మాణాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. తారురోడ్డు నిర్మాణంలో ముందుగా మట్టి, మెటల్ (కంకర)లో టెర్రాజైమ్ అనే లిక్విడ్‌తో కలిపి చదునుచేసి గట్టిపరచి దానిపై తారురోడ్డు నిర్మిస్తే నాణ్యతతో పాటు మన్నిక వస్తుంది. ఈ ఫార్ములాను ఇంజనీర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. దాంతో కొత్త టెక్నాలజీ ద్వారా ఆరు రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించింది. -
హైవేపై ప్రమాదమా..1033కు ఫోన్ చేయండి..
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్-విజయవాడ హైవే ఎంపిక చౌటుప్పల్: జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో ఏటా వేలాదిమంది చనిపోతున్నారు...ఈ ప్రమాదాలను నివారించే దిశగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ)అడుగులేస్తోంది. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా దేశంలోని హైవేలన్నింటిపై అంబులెన్సుల ఏర్పాటుకు ఉపక్రమించింది. మొట్టమొదటగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఎన్హెచ్ఏఐ అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను ఏర్పాటు చేయనుంది. కేవలం హైవేలపై జరిగే ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆదుకునేందుకు 1033 నంబరును కేటాయించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 60 కిలోమీటర్లకు ఒక అంబులెన్సు చొప్పున 270 కి.మీ.ల పరిధిలో 5 అంబులెన్సులను ఏర్పాటు చేసింది. ఇవి..నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహడ్, మునగాల, కృష్ణా జిల్లా నందిగామ మండలం చిల్లక ల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద అందుబాటులో ఉంటాయి. -
ఛోటా భీమ్ బడా హిట్
‘ఛోటా భీమ్’... బుల్లితెరపై ఇది బడా హిట్. చిన్నారుల క్రేజీహీరో ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక తన విజయగాథతో ఆగస్ట్ఫెస్ట్లో ఔత్సాహికులకు స్ఫూర్తినివ్వనున్నారు. ఛోటాభీమ్ బుల్లితెరపైకి వచ్చేంత వరకు ఒడిదొడుకుల పయనం ఆయనది. అకుంఠితమైన ఆత్మవిశ్వాసంతో అన్ని ఆటంకాలను అధిగమించి, విజయపథంలో దూసుకుపోతున్న రాజీవ్ చిలక ‘సిటీప్లస్’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే... ఆలోచనల్లోంచి పుట్టిన పాత్ర... నా ఆలోచనల్లోంచి ఛోటా భీమ్ పాత్ర 2003 సెప్టెంబర్ 18న పుట్టింది. దాని చుట్టూ కథ అల్లుకుని, పైలట్ ప్రాజెక్టు చేసేసరికి ఆరు నెలలు పట్టింది. నచ్చకపోవడంతో మరో ఏడాది శ్రమించి రీడిజైన్ చేశా. తర్వాత 2005లో కార్టూన్ నెట్వర్క్, డిస్నీ వంటి అన్ని చానల్స్‌కూ చూపించా. ఇండియన్ మార్కెట్లో నడవదని వాళ్లు రిజెక్ట్ చేశారు. మరికొన్ని మార్పులతో తిరిగి ప్రెజెంట్ చేసినా, ‘నో’ అనేశారు. స్టోరీ టెల్లింగ్‌లో ఇంకొన్ని మార్పులు చేసి అప్రోచ్ అయితే ‘పోగో’ చానల్ ఓకే చేసింది. అప్పుల కుప్పలు మాకొచ్చిన ఆర్డర్‌తో కొత్త ఆఫీసు తీసుకున్నాం. ‘ఛోటా భీమ్’ మరో పదిరోజుల్లోగా పోగో చానల్లో కనిపిస్తుందనగా, 2008 మార్చి 26 అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఛోటా భీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసుకోక ముందే అంతా బూడిదైంది. అప్పుల కుప్పలు భయపెట్టాయి. అయినా, ఒక చిన్న ఆశ... ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చెక్కుచెదరలేదు కదా అని! అదే మమ్మల్ని ముందుకు నడిపింది. అప్పుల వాళ్లందరినీ పిలిచి జరిగింది చెప్పాను. మరో మూడు నెలలు టైమిస్తే అణాపైసలతో సహా అప్పంతా తీర్చేస్తానన్నాను. అయితే, అప్పటి వరకు ఇంకొంచెం మెటీరియల్ సప్లయ్ చేయమని అడిగా. అంతా వింతగా చూశారు. ఏం చూసుకుని మళ్లీ అప్పు అడుగుతున్నాడని అనుకున్నారేమో! పదిరోజుల్లో టెలికాస్ట్ కాబోయే ‘ఛోటాభీమ్’ గురించి చెప్పి వాళ్లను కన్విన్స్ చేశా. ఛోటాభీమ్ స్క్రీన్‌పైకి వచ్చింది. అనుకోని రేంజ్లో హిట్ అయింది. అనుకున్న సమయానికే అప్పులన్నీ తీరిపోయాయి. ఆర్డర్స్ వచ్చిపడ్డాయి. ఇదే ఎగ్జాంపుల్‌గా మాట్లాడతా... ఆగస్ట్ ఫెస్ట్‌లో నాకు ఇరవై నిమిషాల సమయం కేటాయించారు. సక్సెస్ఫుల్ ప్రాజెక్టును ఎలా క్రియేట్ చేసుకోవాలి, కలలను నెరవేర్చుకోవడానికి ఎలా పనిచేయాలి అనే దానిపై ‘ఛోటాభీమ్’నే ఎగ్జాంపుల్‌గా మాట్లాడాలనుకుంటున్నా. నా కథలో డ్రీమ్, ఐడియా, క్రియేటివిటీ, మార్కెటింగ్, కరేజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అచీవ్మెంట్ అన్నీ ఉన్నాయి. వాటినే ‘ఛోటాభీమ్’ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేస్తూ వచ్చిన వాళ్లకు ఇన్స్పిరేషన్గా చూపించదలచుకున్నా. ఈరోజు ఏ కంపెనీలోనైనా ఇండియన్ పవరే అద్భుతాలు సృష్టిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ను తీసుకుంటే... విండోస్ నుంచి ప్రతి ప్రాడక్ట్లోనూ ఇండియన్సే ఎక్కువమంది. ఆ కంపెనీ సీఈవో కూడా ఇండియనే. మనకు ఎబిలిటీ ఉంది. దానిని కెరీర్‌గా మలచుకునే ధైర్యమే కావాలి. ఇదే మన సక్సెస్ సూత్రం. -
ఎల్ఈడీ వెలుగులు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటివరకు ఎస్వీ(సోడియం వెపర్) వీధి దీపాలు వాడుతుండగా వీటి ద్వారా వచ్చే విద్యుత్ బిల్లులు తడిసిమోపెడు అవుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని గట్టెకేల్కా ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు శ్రీకారం చు ట్టింది. ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ పెలై ట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. త్వరలోనే పట్టణంలో ఎల్ఈడీ విద్యుత్ వెలుగులతో పట్టణానికి శోభ చేకూరనుంది. భారీగా విద్యుత్ బిల్లులకు కారణం అవుతున్న ఎస్వీ ల్యాంపులు, ఫ్లడ్‌లైట్లకు మంగళం పలికి వాటి స్థానంలో విద్యుత్‌బిల్లులను ఆదా చేసేలా ఎల్ఈ డీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేయాలని పురపాలక అధికారులకు ఆదేశాలు అందాయి. మొదటి దశలో 150ఎల్ఈడీ వీధి దీపాలు పైలట్ ప్రాజెక్టు క్రింద మంచిర్యాల పురపాలక సంఘం ను గుర్తించగా అధికారులు కూడా వెంటనే ఇందుకు ప్ర తిపాదనలు చేస్తున్నారు. మొదటి దశలో మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి ఏసీసీ చౌరస్తా వరకు ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 156 ఎస్వీ ల్యాంపులను వినియోగిస్తుండగా వీటి స్థానంలో ఎల్ఈడీలను ఏర్పాటు చేయనుండగా 150ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణాల్లో 200ల వరకు ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పా టు చేసేలా వెసులుబాటు ఉండగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 250 వాట్స్ వరకు సామర్థ్యమున్న ఎల్ఈడీ వీధిదీపాలను అమర్చేలా ప్రతిపాదనలు చేవారు. హైమాస్ట్ లైట్లను ఈ ప్రాజెక్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ పెలైట్ ప్రాజెక్టు కింద ఏరియాకు ప్రత్యేక విద్యుత్ మీటర్‌ను బిగించి విద్యుత్ వినియోగంలో వచ్చిన మార్పులపై పరిశీలన చేస్తారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే పట్టణం మొత్తం విస్తరించేలా కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ఓ ప్రియా... ప్రియా...
విజయనగరం కంటోన్మెంట్: రాజస్థాన్‌లో ప్రియ అనే పాజెక్టు ద్వారా అమలవుతున్న కొత్త తరహా పాలనను మన రాష్ట్రంలోనూ అమలు చేయడానికి ముందుగా రెండు జిల్లాలను పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అనంతపురం, విజయనగరం జిల్లాలు ఎంపికయ్యాయి. స మర్థవంతమైన గణాంకాలతో ముందుండే జిల్లాలుగా వీటిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన శిక్షణ కోసం జిల్లా నుంచి ఇద్దరు అధికారులు వెళ్లి వచ్చారు. రాజస్థాన్‌లో ప్రియ అనే పైలట్‌ప్రాజెక్టును ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ప్రియ అంటే పంచాయతీ రాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఎకౌంటెన్సీ. ఈ పీఆర్ఐఏ అనేది రాజస్థాన్‌లోని ఓ ఎన్జీఓ సంస్థ. ఈ సంస్థ ద్వారా పంచాయతీల్లో అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పంచుకుని పనులు చేసుకోవడం కాకుండా ప్రియ ద్వారా ఆయా గ్రామాలు, వార్డుల్లో సత్వర అవసరాలు, సామాజికం గా నెలకొన్న అసౌకర్యాలను గుర్తించి వాటిని ప్రభుత్వానికి నివేదించి నేరుగా పనులు చేయించడం జరుగుతోంది. పస్తుతం అక్కడ ఈ ప్రాజెక్టు చక్కగా అమలవుతోంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయడానికి నిర్ణయించారు. అయితే ఒక్కసారిగా అన్ని జిల్లాలను ఈ ప్రాజెక్టు కిందికి తీసుకురావడం కుదరదు కనుక ముందుగా అనంతపురం, విజ యనగరం జిల్లాలను గుర్తించారు. ఈ జిల్లాల్లో ఉన్న ముఖ్య ప్రణాళికా విభాగం నుంచి ఓ అధికారిని, జిల్లా పంచాయతీ అధికారిని పిలిచి ఓ పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ ఏర్పాటు చేశారు. గడచిన సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్య ప్రణాళికా విభాగం ప్రిన్సిపల్ ఇన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పి టక్కర్, రాజస్థాన్ నుంచి ప్రియ అమలు అధికారి మనోహర్ రాజ్‌లు హాజరై ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి ఎలా చేయవచ్చు? వార్డుల నుం చి గ్రామాలు అక్కడి నుంచి మండలాలు జిల్లా వరకూ అవసరాల గుర్తింపు ఎలా అన్న విషయాలను వివరించారు. మన జిల్లా నుంచి జిల్లా పంచాయతీ అధికారి ఎన్ మోహనరావు, సీపీఓ కార్యాలయం నుంచి సహాయ సంచాలకుడు బి.రామారావులు హాజరయ్యారు. ఈవిధానం బాగుందని దీని ని అమలు చేయడానికి అవకాశాలున్నాయనీ, ఇదింకా ప్రారంభ దశలోనే ఉందనీ ఎ.డి. రామారావు సాక్షికి తెలిపారు. ఈ కొత్త విధానంలో వార్డులు, గ్రామాలు, మండలాలు, జిల్లాలవారీగా ప్రతిపాదనలు కోరతారు. ఒక గ్రామంలోని అన్ని వార్డుల ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వార్డుల వారీగా ఏఏ పను లు కావాలో గుర్తించి ఇక్కడ నుంచి పంపిస్తారు. సత్వరం చేయాల్సిన పనులన్నీ ఓ చోట, నిర్ణీత సమయంలో చేయాల్సిన పనులు మరో చోట ఇలా ప్రణాళి కలు పంపించి వాటికి నిధులు మంజూరు చేయిస్తారు. దీని వల్ల గ్రామాల్లో ఏఏ అవసరాలు ఉంటాయన్న విషయాలు నేరుగా రాజధానిలోని ఉన్నతాధికారులు, నాయకులకు కూడా తెలుస్తుంది. వార్డుల్లో ఉన్న అవసరాలు, గ్రామాల్లో ఉన్న అవసరాలను శాఖల వారీగా గుర్తించడానికి అవకాశముంటుంది. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, విద్యుత్ అవసరాలు, సీసీ రహదారులు, సామాజిక మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ భవనాల వంటి పలు అభివృద్ధి ప నులను వార్డుల వారీగా గుర్తిస్తారు. అనంతరం వాటికి గ్రామస్థాయిలో ఎంత మేరకు అవసరమవుతుందో గుర్తిస్తారు. దీనిని మండలం ప్రాతిపదికగా గుర్తించి ప్రతి గ్రామాన్నీ కలుపుకొనేలా చర్యలు తీసుకుంటారు. వాటిని మంత్రిత్వ శాఖకు పంపించి విడతల వారీగా నిధులు విడుదల చేస్తారు. దీనివల్ల ప్రతి గ్రామం, వార్డు అభివృద్ధి చెందే అవకాశముంటుంది. అదేవిధం గా ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఏదో ఒక ప్రాం తం కాకుండా అన్నిప్రాంతాలూ ప్రయోజనం పొందే వీలుంటుంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతో ఆయా నాయకుల పరిధిలోనే పనులు జరిగేవి. అంతేకాకుండా రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రాంతానికి నిధులు తెచ్చుకుని ఇతర ప్రాంతాలను విస్మరించే వారు. ఈ వి ధానం అమలైతే ఆ పరిస్థితులకు మంగళం పాడి నూ తన అభివృద్ధి వీచికలు వీచే అవకాశం కలుగుతుంది. -
సమస్యలకు చెక్
కందుకూరు:మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇకపై కూలిడబ్బుల పంపిణీ విషయంలో జాప్యాన్ని నివారించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి సమాయత్తమైంది. మధ్యలో ఏజెన్సీలు, సీఎస్పీల పంపిణీ గొడవ లేకుండా బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా కూలిడబ్బులను జమ చేసేలా ప్రయోగాత్మకంగా జిల్లాలోని కందుకూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇటీవల డ్వా మా అధికారులు ప్రకటించారు. దీంతో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. సమస్యలను అధిగమించేందుకు.. ఇప్పటి వరకు కూలీలు చేసిన పనులకు సంబంధించిన నగదును మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎంత మందికి ఎంత కూలిడబ్బులు ఇవ్వాలో సీఆర్డీకి నివేదిస్తే, అక్కడి నుంచి నగదు బదిలీ ఆదేశాల ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చేరేది. ఆ బ్యాంక్ ఆధ్వర్యంలో మణిపాల్, ఫినో వంటి ఏజెన్సీల ద్వారా కూలీలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. సీఎస్పీలు సమయానికి రాకపోవడం, బినామీలు వంటి పలు సమస్యలను అధికారులు గుర్తించారు. దీంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా పని చేసేలా చేయడానికి ప్రయోగాత్మకంగా కందుకూరు మండలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. కూలీలకు నేరుగా ఆయా బ్యాంక్ ఖాతాల్లో కూలీ డబ్బు జమ అవుతుంది. దీంతో పాటు వారి సెల్ నంబర్‌కు జమ చేసిన వివరాలతో కూడిన మెసేజ్ చేరుతుంది. అవసరమైతే ఆ సెల్ నంబర్‌కు ఉన్నతాధికారులు ఫోన్ చేసి కూలీలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో అవకతవకలను నివారించే అవకాశం ఉంది. పథకం పటిష్టంగా అమలైతే కూలీ డబ్బులు అందలేదని ఆందోళన చెందాల్సిన అవసరం ఇకపై తప్పనుంది. పనులు ప్రారంభం.. మండలంలో 15,453 జాబ్ కార్డులు ఉన్నాయి. 653 శ్రమశక్తి సంఘాల్లో 13,465 మంది కూలీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం కూలీల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు సెల్ ఫోన్ నంబర్లను సిబ్బంది సేకరించే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తే తెలంగాణ రాష్ర్టమంతటా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
నిధులున్నా మెట్టవేదాంతమే!
ఆర్ఏడీపీ పథకానికి గ్రహణం వర్షాధార ప్రాంత అభివృద్ధి మిధ్యే గ్రామాల ఎంపికే అవరోధం మెట్టభూముల్ని సాగు భూములుగా మార్చడం, ఆ ప్రాంతంలోని రైతులకు వ్యవసాయ సాగుకు అవసరమైన వనరుల్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు క్షేత్రస్థాయిలో కష్టాలు తప్పడం లేదు. నిధులు చాలక వ్యవసాయ అనుబంధ పథకాలు విలవిల్లాడుతుంటే ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నం. నిధులు మూలుగుతున్నా...వెచ్చించడానికి అర్హత ఉన్న గ్రామాల అన్వేషణే సంబంధిత అధికారులకు భారంగా మారింది. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం(ఆర్ఏడీపీ) దుస్థితి ఇది. అనకాపల్లి: ప్రతి ఏటా మెట్ట భూముల్ని దశల వారీగా సాగులోకి తీసుకొచ్చేందుకు వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకాన్ని రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 2011-12లో పైలట్ ప్రాజెక్టు క్రింద అమలు చేశారు. ఆ జిల్లాల్లో విశాఖ జిల్లా కూడా ఉంది. తదనంతరం 2013-14 ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లాలో ఈ పథక అమలుకు సుమా రు 60 లక్షల రూపాయల వరకూ నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ జిల్లాలోని ఏజెన్సీయేతర ప్రాంతంలోని 23 మండలాల్లో ఈ పథకం అమలుకు అవకాశం ఉం ది. ప్రతి యేటా ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు నీటి బోర్లు, ఆయిల్ ఇంజిన్లు, సాగు నీటి సరఫరా పైపులు, పనిముట్లు, ఎరువులు, కాయగూరల విత్తనాలు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ సాగు ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఆయా గ్రామాలను ఏడీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఎంపిక చేస్తుంది. లబ్దిదారులను భూసంరక్షణ పథకం ఏడీఏ, మండల పరిషత్ అధికారి అధ్యక్షతన జరిగే గ్రామసభలో ఎంపిక చేస్తారు. 600ఎకరాలు అదనంగా సాగులోకి... ప్రతి యేటా సాగులోని మెట్టభూముల్ని సారవంతమైన సాగు భూములుగా మార్చేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందించడ మే ఈ పథకం అసలు ఉద్దేశ్యం. దీనిలో భాగంగా జిల్లాలోని 10 గ్రామాల్లో ఏడాదికి 600 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. సుమారు 1200 మంది లబ్దిదారులకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ అనుబంధ వనరుల్ని సమకూరుస్తారు. 2013-14 ఆర్థిక సంవత్సరలో బుచ్చియ్యపేట మండలం నుంచి లోపూడి, ఎల్బి అగ్రహారం, కొండపాలెం, పెందుర్తి మండలం నుంచి సరిపల్లి, ముదపాక, గురన్నపాలెం, కశింకోట మండలం నుంచి తీగ, విసన్నపేట, నాతవరం మండలం నుంచి శృంగవరం, ఎంబీ పట్నం గ్రామాల్లో ఈ పథకం అమలయినప్పటికీ నిధులు పూర్తిగా వినియోగం కాలేదు. దీనికి ప్రధాన కారణం లబ్దిదారులు చెల్లించాల్సిన 50 శాతం నిధులను చెల్లించేందుకు ముందుకు రాకపోవడమే. ఈ కారణంగా లక్షలాది రూపాయల నిధులు వినియోగంలోకి రాక మూలన పడిఉన్నాయి. ప్రహసనంగా మారిన గ్రామాల ఎంపిక... 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు అర్హత ఉన్న గ్రామాల ఎంపిక ప్రహసనంగా మారింది. ముఖ్యంగా మెట్టభూములై, సంబంధిత వనరుల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ చెల్లించేందుకు రైతులు ముందుకు రాకపోవడం, ఇక్కడ సమకూర్చే వనరులు మిగిలిన పథకాల్లో రైతులకు అందడం వంటి కారణాల వల్ల పథక అమలుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పశువుల కొనుగోలుకు రైతులకు సబ్సిడీ ఇచ్చినందున పలువురు రైతులు ముందుకు వచ్చేవారు. ఏదేమైనా మంచి లక్ష్యంతో అమలు చేస్తున్న వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం అర్హత ఉన్న గ్రామాల ఎంపిక సజావుగా జరగాలంటే దీనిపై మరింత విస్తృత ప్రచారం జరగాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు. -
పై‘లేట్’ ప్రాజెక్టు
రెండేళ్ల నుంచి ఊరిస్తున్న పథకం రూ.35కోట్లు మంజూరైనా ప్రారంభం కాని పనులు నక్కపల్లి, న్యూస్‌లైన్ : పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చే పైలట్ ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్ల నుంచి ఊరిస్తోంది తప్ప ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ప్రారంభం కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 105 గ్రామాల్లో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం పెలైట్ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.35 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో స్టోరేజీ ట్యాంకులను నిర్మించి అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు పైపు లైన్లు ద్వారా నీటిని సరఫరా చేయాలనేది ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని ఏలేరు కాలువ నుంచి ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. నాతవరం మండలం గొలుగొండపేట నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వచేసి, శుద్ధి చేసి అక్కడ నుంచి అవసరమైనగ్రామాలకు పైపులైన్ల ద్వారా నీరందించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశ్యం. స్టోరేజీ ట్యాంకుల నిర్యాణం కోసం 40 ఎకరాల విస్తీర్ణం గల చెరువులు అవసరం కావడంతో ఉద్దండపురం ఊరచెరువు, గోపాలపట్నం ఆవ ప్రాంతాన్ని రెవెన్యూ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పరిశీలించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఉద్దండపురం చెరువు అయితే స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించారు. కానీ ఈ చెరువు కింద సుమారు 300 ఎకరాలు ఆయకట్టు ఉండడంతో రైతులు అంగీకరించడం లేదు. అయితే సాగునీటికి ఇబ్బందులు లేకుండా చెరువును లోతుచేసి కొద్ది భాగం సాగునీటి కోసం కేటాయించి మిగతా భాగాన్ని స్టోరేజీ ట్యాంకుల కోసం వినియోగించుకొనేలా అధికారులు రైతులను ఒప్పించారు. స్టోరేజీ ట్యాంకుల పరిశీలనే తప్ప ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. రామచంద్రపురం పైలట్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన పైపులైన్లు ఏడాది క్రితం వచ్చిన తుపానుకు ధ్వంసమయ్యాయి. మరమ్మతులు చేయించ డానికి లక్షలాది రూపాయలు వ్యయమవుతాయని అధికారులు చెబుతున్నారు. సరిపడా నిధులు లేకపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవ్వాలంటే కొత్తగా మంజూరైన పెలైట్ ప్రాజెక్టు ఒక్కటే మార్గమని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యేదెప్పుడో ప్రజల దాహార్తి తీరేదెన్నడో అధికారులకే తెలియాలి. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వీడియో పోలీస్...
ఈయన లండన్‌లో గస్తీ తిరిగే ఓ పోలీస్ కానిస్టేబుల్. కుర్రాడు స్మార్ట్‌గా ఉన్నాడు కదా..! కానీ మనం చెప్పుకోబోయేది అతగాడి గురించికాదు. అతడి కుడి భుజం దగ్గర ఉన్నదే ఓ అగ్గిపెట్టెలాంటి పరికరం.. దాని గురించే. ఈ పెట్టె ధరించడం ద్వారా ఆధారాలు సులభంగా దొరుకుతాయని, బాధితులకు న్యాయం త్వరగా అందుతుందని, పోలీసుల్లో అవినీతి తగ్గుతుందని మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ విభాగం నమ్ముతోంది. ఆ నమ్మకంతోనే నగరంలో పైలట్ ప్రాజె క్టు కింద పలువురు పోలీ సులకు వీటిని తగిలిం చింది. ఇంతకీ టేజర్ కంపెనీ తయారు చేసిన ఈ పెట్టె ఏంటంటారా.. ఇదొక బాడీ కెమెరా. ఇది తగిలించుకున్న పోలీసు.. నేర ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రతి అంశాన్నీ ఇది వీడియో తీస్తుంది. వీడియోతోపాటే ఆడియో కూడా రికార్డైపోతుంది. ఫలితంగా కేసు విచారణ దశలో ఎలాంటి ఆధారాలూ మిస్ కాకుండా ఉంటాయని వీటిని ప్రవేశపెట్టారు. -
రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వోద్యోగుల ‘పెన్షన్ల’పై పైలట్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ: రిటైరైన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వారి పెన్షన్ మంజూరు ప్రక్రియలో పురోగతి గురించి తెలియజేసే సరికొత్త విధానాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. పెన్షన్ మంజూరు సమాచారాన్ని ఎస్ఎంఎస్ , ఈ మెయిల్ ద్వారా తెలిపే వెబ్ ఆధారిత పెన్షన్ మంజూరు, చెల్లింపు పర్యవేక్షణ వ్యవస్థను 15 కేంద్ర మంత్రిత్వశాఖల్లో చేపట్టింది. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేటప్పుడు ‘భవిష్య’గా పిలవనున్నారు. ఈ విధానంలో పెన్షనర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు వారి మొబైల్ నంబర్, ఈ మెయిల్ వంటి వివరాలను సేకరించి పెన్షన్ మంజూరు ప్రక్రియ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ప్రభుత్వశాఖల్లో పెన్షన్ల మంజూరు, రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో జాప్యాన్ని గుర్తించడంలో ఈ చర్య దోహదపడనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు విధానాన్ని కేంద్ర హోం, ఐటీ, గణాంక, ఉక్కు, ఆరోగ్య, పట్టణాభివృద్ధి, జౌళి, వాణిజ్యం, సిబ్బంది శిక్షణ వ్యవహారాల వంటి 15 శాఖలతోపాటు ప్రణాళికా సంఘం వంటి విభాగాల్లో చేపట్టింది. -
బాలికలకు ఆత్మ‘రక్షణ’!
ముంబై: ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ముందడుగు వేసింది. ఆమ్వే ఇండియా కంపెనీ సహకారంతో నగరంలోని ఎంసీజీఎం కింద నడుస్తున్న మున్సిపల్ పాఠశాలల విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పించేందుకు నిశ్చయించింది. నమూనా ప్రాజెక్టుగా నగరంలోని రెండు పాఠశాలల్లో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై బుధవారం ఎంసీజీఎం, ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సంతకాలు చేశాయి. తూర్పు అంధేరిలోని ఆర్.కె.మార్గ్ మున్సిపల్ స్కూల్, చకల మున్సిపల్ స్కూల్లో చదువుతున్న 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థినులకు మొదటి దఫా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్(విద్య) మాట్లాడుతూ..‘ ప్రస్తుత సమాజంలో మహిళలపై వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు సర్వసాధారణమైపోయాయి. ఇటువంటివాటిని అరికట్టాలంటే మొదట మహిళలు తమను తాము రక్షించుకునేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరాటే, కుంఫూ, కిక్ బాక్సింగ్ వంటి విద్యల్లో వారికి శిక్షణ ఇస్తే ఎటువంటి విపత్కర పరిస్థితుల నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వారికి లభిస్తుంది.. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న వేలాదిమంది కౌమార విద్యార్థినులకు ఆత్మరక్షణ నిమిత్తం మార్షల్ ఆర్ట్స్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంసీజీఎం పర్యవేక్షిస్తుంది..’ అని తెలిపారు. ‘మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడమే కాక వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టాం. బాలికల భవిష్యత్తును కాపాడటం మన నైతిక బాధ్యత. ఈ బృహత్తర కార్యక్రమంలో ఆమ్వే ఇండియా సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం..’ అని ఆయన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ‘ఆమ్వే వంటి కంపెనీలు సహకారం ఇలాగే ఉంటే మున్ముందు ఎంసీజీఎం మహిళల, బాలికల రక్షణకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుంది..’ అని అసిస్టెంట్ కమిషనర్ (ప్లానింగ్ ) ప్రాచి జంభేకర్ అన్నారు. ఆమ్వే ఇండియా పశ్చిమ విభాగ అధికారి సందీప్ ప్రకాశ్ మాట్లాడుతూ బాలికల రక్షణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం బాధ్యతగా గుర్తించి తమ కంపెనీ ఎంసీజీఎంతో అవగాహనకు వచ్చిందని తెలిపారు. ‘ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మేం కూడా పాలుపంచుకోవడం గర్వంగా ఉంది. నేడు మహిళలు అన్నివిధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సమాజంలో రక్షణ మృగ్యమైపోతోంది. ఏ రంగంలోనూ వారు పురుషులతో సమానంగా హక్కులను పొందలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా సంస్థలో 60 శాతానికి పైగా పంపిణీదారులు మహిళలేనని చెప్పడానికి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో మహిళలు స్వయంసమృద్ధి సాధించడమేకాక తమను తాము రక్షించుకునేవిధంగా వారికి తగిన రక్షణ, శిక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..’ అని సందీప్ అన్నారు. ఇదిలా ఉండగా ఎంసీజీఎంలోని సామాజిక బాధ్యత విభాగం నగరంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా ఏర్పడింది. దీనికి ఎటువంటి నిధుల కేటాయింపు లేకపోయినా, వివిధ సంస్థల సహకారంతో కార్యక్రమాలను చేపడుతోంది. -
త్వరలో పశుగ్రాస బ్యాంకులు
కరువు, వరదల సమయంలో సరఫరా.. మిగతా సమయాల్లో లాభనష్టాలు లేని ధరకు అమ్మకాలు.. పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం.. దశల వారీగా జిల్లాకో పశుగ్రాస బ్యాంక్ ఏర్పాటు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిఏటా కొన్ని చోట్ల వరదలు.. మరి కొన్ని చోట్ల కరువు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశువులకు మేత దొరకని పరిస్థితి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, రైతులు పశువులను కబేళాలకు అమ్ముకోవడం పరిపాటి అవుతోంది. కరువు ప్రాంతాలకు పశుగ్రాసాన్ని తరలించాలంటే పశుగ్రాస ఖరీదు కన్నా మూడింతలు రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆ ఎండుగడ్డిలో ఎలాంటి పోషకాలూ ఉండవు. ఈ సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ‘ఫాడర్(పశుగ్రాస) బ్యాంక్’ అన్న వినూత్న పథకాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం రూ.2.10కోట్ల నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా పులివెందులలోని ‘ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ఆన్ లైవ్‌స్టాక్’(ఐజీకార్ల్) ఆవరణలో ‘ఫాడర్ బ్యాంక్’ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఐజీకార్ల్’లో వినియోగంలో లేని నిర్మాణాలు ఉండటం, పశుగ్రాసాన్ని పెంచేందుకు 600 ఎకరాల స్థలం ఉండటం లాంటి అనుకూలతల దృష్ట్యా పైలట్ ప్రాజెక్టుకు పులివెందులను ఎంచుకున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పశుగ్రాసాభివృద్ధి పథకం ఉన్నా.. కేంద్ర నిధులతో ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’(ఆర్కేవీవై) ప్రాజెక్ట్ కింద ‘పశుగ్రాసాభివృద్ధి పథకం’(యాగ్జిలరేటెడ్ ఫాడర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) అమలవుతోంది. మేలుజాతి గడ్డి విత్తనాలు, గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించే ‘ఛాప్ కట్టర్ల’ను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నారు కానీ వరదలు, కరువులు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో పశువులకు మేత అందించే ఏర్పాట్లేమీ ఈ పథకంలో లేవు. ఈ లోటును పూరించే విధంగా పశుసంవర్ధక శాఖ ‘ఫాడర్ బ్యాంక్’ పథకాన్ని రూపొందించింది. బ్యాంకు పనిచేస్తుందిలా.. ప్రభుత్వం స్థలంలో పశుగ్రాసాన్ని పండించడం, చుట్టుపక్కల రైతుల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేయడం, పశుగ్రాసానికి తగిన పోషకాలను జోడించి అత్యాధునిక యంత్రాల ద్వారా ‘బేళ్లు’గా చేసి గోదాముల్లో నిల్వచేయడం ద్వారా ‘ఫాడర్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తారు. వరికోత యంత్రాలు వచ్చినప్పటి నుంచి మాగాణుల్లో వినియోగంలోకి రాకుండా పోతున్న వరిగడ్డిని సేకరించి, తగిన పోషక లవణాలను జోడించి బేళ్లుగా తయారు చేసి పశుగ్రాస కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేస్తారు. పది లారీల్లో పట్టే గడ్డిని బేళ్లుగా తయారు చేస్తే ఒక లారీలోనే రవాణా చేయవచ్చు. అలాగే ఒక టన్ను ధాన్యాన్ని నిలువచేసేందుకు అవసరమైన స్థలంలోనే ఒక టన్ను పశుగ్రాసాన్ని కూడా నిల్వ చేసుకోవచ్చు. గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవర్‌తో ప్యాకింగ్ చేయడం వల్ల ‘మాగుడు గడ్డి’ని రెండేళ్లపాటు నిల్వ చేయవచ్చు. ఇలా పశుగ్రాసాన్ని బేలింగ్, ప్యాకింగ్ చేసే యంత్రాలను ‘ఫాడర్ బ్యాంక్’ పథకం కింద సమకూర్చుకోనున్నారు. పులివెందులలో పైలట్ ప్రాజక్ట్‌ను ఆరంభించి ఆ తర్వాత ఈ పథకాన్ని మిగతా జిల్లాలకు విస్తరించను న్నారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చదలవాడ, నెల్లూరు జిల్లా చింతల దీవి, అనంతపురం జిల్లా రెడ్డిపల్లి, మెదక్‌జిల్లా గుర్గార్ పల్లి, కర్నూలు జిల్లా బనవాసి, గుంటూరు జిల్లా నకిరేకల్లలోని పశుపరిశోధనా స్థానాల్లో ‘ఫాడర బ్యాంక్’లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త పథకం అమలైతే పశువులకు కూడా ఆహార భద్రత ఏర్పరచినట్లవుతుందని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఈ-సేవా కేంద్రాల ద్వారా చిన్న పాలసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం తక్కువగా ఉండి ఏజెంట్లు విక్రయించడానికి అంతగా ఆసక్తి చూపని చిన్న పాలసీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) ప్రకటించింది. సంక్లిష్టమైన పథకాలు కాకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే పథకాలను ఎంపిక చేసి వాటిని ఈ-సేవా, మీ-సేవా వంటి ఉమ్మడి కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని, వచ్చే రెండు మూడు నెలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఇందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, చిన్న ప్రీమియాలున్న జీవిత బీమా పాలసీలతోపాటు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన ట్రాక్టర్, మోటార్ ఇన్సూరెన్స్ పథకాలను ఈ సేవా కేంద్రాల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. బీమా ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ఒక పాఠ్యాంశంగా చేసే యోచనలో ఉన్నామని, ప్రస్తుతం ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ జీవిత బీమా మార్కెట్ విలువ జీడీపీలో 3.8%గా ఉందని, ఇది ఆరు శాతానికి చేరే అవకాశాలున్నాయన్నారు. బ్యాంకులు మంచి పాలసీలు సూచించాలి బ్యాంకులు తమ ఖాతాదారులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని పాలసీల్లో మంచిదాన్ని సూచించాలే కాని ఒకే కంపెనీకి చెందిన పాలసీని సూచించడం సరికాదని విజయన్ అన్నారు. బ్యాంకులు ఏజెంట్‌గా కాకుండా బ్రోకరుగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే బ్యాంక్ అష్యూరెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసి ఈ నెలాఖరు వరకు సూచనలు ఆహ్వానించిందని, వచ్చే రెండు మూడు నెలల్లో తుది మార్గదర్శకాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
నిధుల ‘పంచాయితీ’
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: కొట్టినా దెబ్బ తగలరాదు.. పొడిచినా రక్తం కారకూడదు.. కాల్చినా చనిపోరాదు.. ఈ కోవకు చెందినదే ప్రభుత్వ తాజా పాలసీ. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను ఆయా గ్రామ పంచాయతీలే సమకూర్చుకునేలా ప్రజలపై పన్నుల భారం మోపేందుకు కసరత్తు జరుగుతోంది. పెలైట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి అమలు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్న గ్రాంట్లు ఏటా తగ్గిపోతున్న దృష్ట్యా పంచాయతీల్లో ఆర్థిక వనరుల పెంపునకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో సీమాంధ్ర జిల్లాల పంచాయతీ అధికారులు, సర్పంచ్ల వర్క్‌షాప్‌లో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్న మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర మండల అధికారులకు పన్నుల వసూలుపై అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 852 మైనర్, 31 మేజర్ గ్రామ పంచాయతీల నుంచి ఇంటి పన్నులకు సంబంధించి డిమాండ్ మేరకు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్లు.. మార్కెట్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్సుల ద్వారా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు వసూలవుతున్నాయి. వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే టీఎఫ్సీ కింద రూ.15 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.4.96 కోట్లను విడుదల చేశాయి. ఈ మొత్తంతో పాటు వసూలవుతున్న పన్నులు ఏమాత్రం సరిపోకపోవడంతో ఆ భారాన్ని ప్రభుత్వం ప్రజలపైనే మోపేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత పన్నులతో పాటు ప్రకటనలు, కేబుల్ టీవీ కనెక్షన్లు, సెల్ టవర్లపై ఇప్పుడు వసూలు చేస్తున్న అనుమతి ఫీజుతో పాటు అదనంగా బాదనున్నారు. జీఓ నెంబర్ 67 ప్రకారం బిల్డింగ్ ఫీజు స్కైర్ మీటర్ ప్రకారం రెసిడెన్షియల్, కమర్షియల్‌కు వేర్వేరుగా.. లేఅవుట్లు, నాలుగు చక్రాల వాహనాలకు, చేపలు, ఫల సాయం తదితరాల నుంచి ఆదాయాన్ని పెంచుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ పరిధిలో నాలుగు చక్రాల వాహనాలు కలిగిన యజమానుల నుంచి ఏడాదికి కొంత మొత్తాన్ని పన్ను రూపంలో వసూలు చేసే ప్రయత్నం లో భాగంగా ప్రభుత్వం సర్పంచ్ల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజలకు తెలియకుండా భారం మోపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.