రాజస్థాన్‌లో ప్రియ అనే పాజెక్టు ద్వారా అమలవుతున్న కొత్త తరహా పాలనను మన రాష్ట్రంలోనూ అమలు చేయడానికి ముందుగా రెండు జిల్లాలను పరిశీలిస్తున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: రాజస్థాన్‌లో ప్రియ అనే పాజెక్టు ద్వారా అమలవుతున్న కొత్త తరహా పాలనను మన రాష్ట్రంలోనూ అమలు చేయడానికి ముందుగా రెండు జిల్లాలను పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అనంతపురం, విజయనగరం జిల్లాలు ఎంపికయ్యాయి. స మర్థవంతమైన గణాంకాలతో ముందుండే జిల్లాలుగా వీటిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన శిక్షణ కోసం జిల్లా నుంచి ఇద్దరు అధికారులు వెళ్లి వచ్చారు. రాజస్థాన్‌లో ప్రియ అనే పైలట్‌ప్రాజెక్టును ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ప్రియ అంటే పంచాయతీ రాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఎకౌంటెన్సీ. ఈ పీఆర్‌ఐఏ అనేది రాజస్థాన్‌లోని ఓ ఎన్‌జీఓ సంస్థ. ఈ సంస్థ ద్వారా పంచాయతీల్లో అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పంచుకుని పనులు చేసుకోవడం కాకుండా ప్రియ ద్వారా ఆయా గ్రామాలు, వార్డుల్లో సత్వర అవసరాలు, సామాజికం గా నెలకొన్న అసౌకర్యాలను గుర్తించి వాటిని ప్రభుత్వానికి నివేదించి నేరుగా పనులు చేయించడం జరుగుతోంది.
పస్తుతం అక్కడ ఈ ప్రాజెక్టు చక్కగా అమలవుతోంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయడానికి నిర్ణయించారు. అయితే ఒక్కసారిగా అన్ని జిల్లాలను ఈ ప్రాజెక్టు కిందికి తీసుకురావడం కుదరదు కనుక ముందుగా అనంతపురం, విజ యనగరం జిల్లాలను గుర్తించారు. ఈ జిల్లాల్లో ఉన్న ముఖ్య ప్రణాళికా విభాగం నుంచి ఓ అధికారిని, జిల్లా పంచాయతీ అధికారిని పిలిచి ఓ పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ ఏర్పాటు చేశారు. గడచిన సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్య ప్రణాళికా విభాగం ప్రిన్సిపల్ ఇన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌పి టక్కర్, రాజస్థాన్ నుంచి ప్రియ అమలు అధికారి మనోహర్ రాజ్‌లు హాజరై ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి ఎలా చేయవచ్చు? వార్డుల నుం చి గ్రామాలు అక్కడి నుంచి మండలాలు జిల్లా వరకూ అవసరాల గుర్తింపు ఎలా అన్న విషయాలను వివరించారు.
మన జిల్లా నుంచి జిల్లా పంచాయతీ అధికారి ఎన్ మోహనరావు, సీపీఓ కార్యాలయం నుంచి సహాయ సంచాలకుడు బి.రామారావులు హాజరయ్యారు. ఈవిధానం బాగుందని దీని ని అమలు చేయడానికి అవకాశాలున్నాయనీ, ఇదింకా ప్రారంభ దశలోనే ఉందనీ ఎ.డి. రామారావు సాక్షికి తెలిపారు. ఈ కొత్త విధానంలో వార్డులు, గ్రామాలు, మండలాలు, జిల్లాలవారీగా ప్రతిపాదనలు కోరతారు. ఒక గ్రామంలోని అన్ని వార్డుల ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వార్డుల వారీగా ఏఏ పను లు కావాలో గుర్తించి ఇక్కడ నుంచి పంపిస్తారు. సత్వరం చేయాల్సిన పనులన్నీ ఓ చోట, నిర్ణీత సమయంలో చేయాల్సిన పనులు మరో చోట ఇలా ప్రణాళి కలు పంపించి వాటికి నిధులు మంజూరు చేయిస్తారు.
దీని వల్ల గ్రామాల్లో ఏఏ అవసరాలు ఉంటాయన్న విషయాలు నేరుగా రాజధానిలోని ఉన్నతాధికారులు, నాయకులకు కూడా తెలుస్తుంది. వార్డుల్లో ఉన్న అవసరాలు, గ్రామాల్లో ఉన్న అవసరాలను శాఖల వారీగా గుర్తించడానికి అవకాశముంటుంది. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, విద్యుత్ అవసరాలు, సీసీ రహదారులు, సామాజిక మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ భవనాల వంటి పలు అభివృద్ధి ప నులను వార్డుల వారీగా గుర్తిస్తారు. అనంతరం వాటికి గ్రామస్థాయిలో ఎంత మేరకు అవసరమవుతుందో గుర్తిస్తారు. దీనిని మండలం ప్రాతిపదికగా గుర్తించి ప్రతి గ్రామాన్నీ కలుపుకొనేలా చర్యలు తీసుకుంటారు. వాటిని మంత్రిత్వ శాఖకు పంపించి విడతల వారీగా నిధులు విడుదల చేస్తారు.
దీనివల్ల ప్రతి గ్రామం, వార్డు అభివృద్ధి చెందే అవకాశముంటుంది. అదేవిధం గా ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఏదో ఒక ప్రాం తం కాకుండా అన్నిప్రాంతాలూ ప్రయోజనం పొందే వీలుంటుంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతో ఆయా నాయకుల పరిధిలోనే పనులు జరిగేవి. అంతేకాకుండా రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రాంతానికి నిధులు తెచ్చుకుని ఇతర ప్రాంతాలను విస్మరించే వారు. ఈ వి ధానం అమలైతే ఆ పరిస్థితులకు మంగళం పాడి నూ తన అభివృద్ధి వీచికలు వీచే అవకాశం కలుగుతుంది.