priya
-
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్‌పై పంచులు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్‌పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్‌లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్‌ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్‌తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్‌లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్‌లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్‌లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్‌ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్‌లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్‌తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్‌లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్‌ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్‌కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్‌ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్‌లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్‌కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్‌లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్‌కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్‌ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్‌లో 70 రకాల టెస్ట్‌లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్‌ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్‌గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్‌లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్‌ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్‌లో ఉన్నవారు క్లినిక్స్‌కు రారు. స్లమ్స్‌లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
Priya Chhetri: ప్రియమైన విజయం
రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్గావ్లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు. మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు. జీవితం పండింది ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్‌సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను. ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్‌లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను. పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్‌నట్, క్రాన్బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్‌కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు. కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి. జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది. -
స్టార్ జంటను ఫాలో అవుతున్న అట్లీ దంపతులు!
కోలీవుడ్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు బ్రాండ్ ఉంది. పదేళ్ల క్రితం ప్రేమలో పడి.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రికార్డు వీరిది. అయితే పెళ్లికి ముందు నుంచే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ జంట విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని ఈ జంట ఆనవాయితీగా పెట్టుకున్నారనే చెప్పాలి. అలా పుట్టిన రోజు, పెళ్లి రోజులు వస్తున్నాయంటే ఈ జంట నుంచి రకరకాల ఫొటోల కోసం నెటిజన్లు ఎదురు చూసేస్థితికి వారిని తీసుకొచ్చారు. తాజాగా వీరిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు దర్శకుడు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడు అయిన అట్లీ రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఆ తరువాత విజయ్ వంటి స్టార్ హీరోకు అవకాశం కల్పించారు. ఆయనతో మెర్శల్, తెరి, బిగిల్ వంటి హిట్ చిత్రాలను చేసి హిట్ కొట్టారు. ఇక ఇటీవల బాలీవుడ్‌కు వెళుతూ బాద్షా షారూఖ్‌ఖాన్ హీరోగా జవాన్‌తో అట్లీ సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నటి ప్రియనుప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. కాగా తొమ్మిది ఏళ్ల తరువాత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. ఇక అసలు విషయం ఏమంటే నయనతార, విఘ్నేష్ శివన్ తరహాలోనే ఈ జంట ఎలాంటి అకేషన్ వచ్చినా, లేకపోయినా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట దిగిన రొమాంటిక్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
Priya Atlee: డైరెక్టర్ అట్లీ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా! (ఫోటోలు)
-
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు
సాక్షి,నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా -
టీడీపీ నేత నారాయణపై పొంగూరు ప్రియ ఫైర్
-
తండ్రిని కాదని బుల్లితెర నటుడితో పెళ్లి.. చివరికి ఏమైందంటే?
సినీ ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్లకే విడిపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా మరో సినీ నటుడికి అతని భార్య విడాకులిచ్చింది. గతంలో పారిపోయి బుల్లితెర నటుడు మునీశ్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె.. విడిపోయినట్లు ఓ వీడియోను రిలీజ్ చేసింది. అంతే కాకుండా తన దత్త తండ్రి, నటుడు రాజ్ కిరణ్‌కు క్షమాపణలు చెప్పింది. జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. నేను జీనత్ ప్రియ. రాజ్‌కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నా. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. మేం విడిపోయి కొన్ని నెలలైంది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా. నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను. అయినప్పటికీ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న' అంటూ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మునీష్ రాజాతో జీనత్ ప్రియ వివాహం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్ మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది. కానీ రాజ్‌కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్‌కుమార్ అన్నారు. దీంతో రాజ్‌కుమార్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్‌కిరణ్‌పై పలు ఆరోపణలు చేసింది. తాజాగా భర్తతో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది. స్పందించిన రాజ్ కిరణ్ అయితే ఈ విషయంపై నటుడు రాజ్ కిరణ్ స్పందించారు. జీనత్ ప్రియ తన దత్తపుత్రిక అని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మునీష్ రాజా డబ్బు కోసం ఏదైనా చేస్తాడని రాజ్‌కిరణ్ ఆరోపించారు. తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం యత్నించాడని ఆయన ఆరోపించారు. -
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారాయణ ఒక ఉమనైజర్.. అతడిని ఎవరు నమ్మొద్దంటూ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పొంగూరు ప్రియ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాననంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు. ఇంట్లో ఆడవాళ్లని వేధిస్తూ టార్చర్‌కు గురిచేసే నారాయణ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రియ ప్రశ్నించారు. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని.. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని.. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడని గతంలో కూడా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: ‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ -
షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi — YS Sharmila (@realyssharmila) January 1, 2024 -
రెడ్ డ్రెస్‌లో హాట్ హాట్ గా నటి ప్రియా హెగ్డే (ఫోటోలు)
-
Actress Priya Home Tour: నటి ప్రియ ఇల్లు చూశారా? ఎంత అందంగా ఉందో! (ఫోటోలు)
-
Priya Varadarajan: ప్రతి స్త్రీ దుర్గ వలే...
ప్రతి స్త్రీలో ఒక దుర్గ ఉంటుంది. కాని ఆ దుర్గను అదిమి పెట్టేలా కుటుంబం, సమాజం ఆమెను తీర్చి దిద్దుతాయి. దాంతో తన మీద ఏ అన్యాయం జరిగినా చెప్పలేని స్థితికి చేరుతుంది. ‘నువ్వు దుర్గవి. పోరాడు’ అని చెప్తారు బెంగళూరులోని ‘దుర్గ ఇండియా’ టీమ్ సభ్యులు. ప్రియా వరదరాజన్ అనే యాక్టివిస్ట్ ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ స్త్రీలను కుటుంబ హింస నుంచి... లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పని చేస్తోంది. వారి పోరాటానికి శక్తినిస్తోంది. ‘ప్రతి ఒక్కరూ మార్పు కోసం ఎదురు చూస్తారు. మనమే మార్పు కోసం ప్రయత్నిద్దామని ఎందుకు అనుకోరు... ఎదురు చూస్తూ కూచుంటే మార్పు వస్తుందా?’ అంటారు ప్రియా వరదరాజన్. బెంగళూరులో ‘దుర్గ ఇండియా’ అనే సంస్థ స్థాపించి స్త్రీల సమస్యలపై పని చేస్తున్న ప్రియ ఇటీవల బెంగళూరు మాల్లో ఒక వ్యక్తి స్త్రీలను అసభ్యంగా తాకడం గురించి ప్రస్తావిస్తూ ‘పబ్లిక్ ప్లేసుల్లో– బహిరంగ ప్రదేశాల్లోగాని ఆన్‌లైన్‌లోగాని స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తే అలాంటి వారిపై చర్య తీసుకునేందుకు ఆ బాధిత మహిళకు అండగా నిలవడం మేము చేసే పని. చట్టాలు ఎన్ని ఉన్నా, పోలీసులు, మహిళా పోలీసులు ఎందరు ఉన్నా మహిళలకు సాటి మహిళ అండగా ఉంటే కలిగే ధైర్యం వేరు. తోటి మహిళలతో వారు చెప్పుకునేవి వేరు. అలాంటి వారికి యోగ్యులైన కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ చేయించి దిలాసా ఇప్పిస్తాము. అంతే కాదు బాధితులను వెంటబెట్టుకొని– ఆ స్టేషన్కుపో ఈ స్టేషన్‌కు పో అనే బాధ లేకుండా బెంగళూరులో వన్ స్టాప్ సెంటర్స్‌లో ఫిర్యాదు చేయిస్తాము. తోడుగా మేమొస్తే బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకరు. ఎటొచ్చీ వారికి తోడు నిలిచే స్త్రీల బృందాలు అన్నిచోట్లా ఉండాలి’ అంటుంది ప్రియ. ఐ యామ్ ఎవ్రి ఉమన్ పదేళ్ల క్రితం ప్రియా వరదరాజన్ ‘ఐ యామ్ ఎవ్రి ఉమన్’ పేరుతో ఒక బ్లాగ్ రాయడం మార్పు కోసం ఆమె వేసిన మొదటి అడుగు. ఆ బ్లాగ్‌కు క్రమంగా చాలామంది మహిళా ఫాలోయర్లు వచ్చారు. వారు తమ అనుభవాలను ప్రియతో పంచుకోసాగారు. ‘అందరిదీ ఒకే కథ. అందరూ మరొక స్త్రీ లాంటి వారే అని నాకు అర్థమైంది. స్త్రీల కోసం పని చేయాల్సిన అవసరం తెలియజేసింది. స్త్రీల కోసం పని చేయడం అంటే వారి పట్ల భావజాలాన్ని మార్చడమే’ అంటుంది ప్రియ. మగాడు ఎందుకు అలా చేస్తాడు? ‘గతంలో సమాజంలో స్త్రీలకు ఏదైనా సమస్య వచ్చి ఆమె బయటకు చెప్పినప్పుడు– ఆమెలో ఏ దోషం ఉందో అన్నట్టుగా నిందను ఆమె మీదే వేసేవారు ఉండేవారు. వారి భావజాలాన్ని మార్చడమే చేయవలసింది. స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మగాడు ఆమెతో అలా ఎందుకు చేశాడు అని ఆలోచించేలా చేస్తే సగం మార్పు వచ్చినట్టే. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో స్త్రీలు ఆత్మాభిమానంతో ఉండాలంటే మగాళ్లు మారాలి. అందుకు ఒకరోజు సరిపోదు. ఒకరు పని చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక మేరకు పని చేయాల్సిందే’ అంటుంది ప్రియ. అందరినీ ‘దుర్గ’లుగా మారుస్తూ అన్యాయం జరిగితే వెరవకుండా ప్రతిఘటించమని ప్రియ ఆధ్వర్యంలో ‘దుర్గల’ బృందం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూళ్లలో, కాలేజీలలో, బస్తీలలో తిరుగుతూ స్త్రీలకు తమ హక్కులను, చట్టపరమైన రక్షణను, సహాయం చేసే బృందాలను తెలుపుతుంది. ‘నేను ఒంటరిదాన్ని కాను అని స్త్రీ అనుకుంటే చాలు... ఆమె పోరాడగలదు’ అంటుంది ప్రియ. ఇంత ప్రయత్నం చేసే ప్రియ లాంటి వారి సంఖ్య ఎంత పెరిగితే దుర్గలకు అంత శక్తి పెరుగుతుంది. -
బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం
బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలు దక్కించుకుని ఆపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో అడుగుపెట్టి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ.. వెండితెరపై హీరోయిన్గా, సైడ్ ఆర్టిస్ట్‌గా ఇలా చాలా పాత్రలను పోషించింది. కానీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆమె ఇలా చెప్పింది. ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. దీంతో రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీతో పాటు.. నా పెట్స్ కూడా సేఫ్‌గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. దయచేసి నా కోసం మీరు ప్రార్థించండి. ఆందోళన వద్దు. మేము ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా ద్వారా మీకు టచ్‌లోకి వస్తాను.' అంటూ శ్వేతా వర్మ తెలిపింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ప్రియ రియాక్ట్ అయ్యారు.. 'నేను ఎప్పుడూ నీ కోసం ప్రార్థిస్తుంటాను శ్వేతా' అని ఆమె తెలిపింది. శ్వేతా అభిమానులు కూడా శ్వేతా వర్మ గురించి రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
ఏపీ సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేసిన పొంగూరు ప్రియ
-
టీడీపీ నారాయణ బండారం బయట పెట్టిన ప్రియా పొంగూరు
-
పసిడితో మెరిసిన ప్రియా మాలిక్.. రెండో భారత రెజ్లర్‌గా
అమ్మాన్ సిటీ (జోర్డాన్): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో ప్రియ 5–0తో లౌరా సెలివ్ క్యుహెన్ (జర్మనీ)పై గెలిచింది. భారత్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), సవిత (62 కేజీలు), అంతిమ్ కుందు (65 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరడంతో భారత్ ఖాతాలో మరోమూడు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాగా ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత మహిళ రెజ్లర్‌గా ప్రియా నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా -
‘మిస్టేక్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టేక్ నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు నిర్మాణ సంస్థ: ఏఎస్పీ మీడియా హౌస్ నిర్మాత: అభినవ్ సర్దార్ స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి సంగీతం: మణి జెన్నా సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి ఎడిటర్:విజయ్ ముక్తావరపు విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘మిస్టేక్’ కథేంటంటే.. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య.. ఏసీపీ కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా) అనే యువతితో ప్రేమలో ఉంటే, ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని కార్తీక్ లవ్ చేస్తాడు. ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉందని భావిస్తారు. దీంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా వెళ్లాలనుకుంటారు. తమ లవర్స్‌తో కలిసి ఫారెస్ట్ ట్రిప్ వేస్తారు. ఇందుకుగాను కార్తీక్ ఆన్లైన్లో షాపింగ్ చేసి అందరికి డ్రెస్సులు తీసుకుంటాడు. అంతా కలిసి జీపులో ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు. అతని నుంచి తప్పించుకున్న ఈ మూడు జంటలు అడవిలోకి వెళ్లిపోతారు. అడవిలో వీరికి ఎదురైన సమస్యలేంటి? అసలు ఆ రౌడీ వీరికి ఎందుకు అటాక్ చేశాడు? అతన్ని ఎవరు పంపించారు? ఈ మూడు జంటలు చేసిన మిస్టేక్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మిస్టేక్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ చిన్న పొరపాటు వల్ల మూడు జంటలు పడిన బాధలేంటి? చివరకు వారు చేసిన మిస్టేక్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఓ చిన్న పాయింట్‌ని కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్ పాయింట్. సినిమా కామెడీగా సాగుతూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలు, ట్విస్టులలో కొత్తదనం ఉండదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో చూపించారు. సస్పెన్స్ అంశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో మూడు జంటల ప్రేమ కథ, వారికి వచ్చిన సమస్యలు, దాని నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వారు చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి. మూడు జంటలకు అడవిలో మరుగుజ్జు జాతి ప్రజలతో కలిసి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం థ్రిల్లింగ్‌గా సాగినప్పటికీ కాస్త బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్‌ని రివీల్ చేయడం.. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మరింత బలంగా రాసుకొని, సెకండాఫ్‌ని ఆసక్తికరంగా నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. భయంకరమైన లుక్స్‌లో కనిపిస్తూ యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్లు నటన పరంగానే కాదు గ్లామర్‌తోను మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. మంగ్లీ పాడిన పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
నార్కో టెస్ట్‌కు నేను రెడీ : పొంగూరు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తనకు అనారోగ్యంగా ఉన్నా.. ఓపిక చేసుకొని రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు పోలీసులు తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని, ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు ప్రియ సోమవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. తాను జనసేన పార్టీకి, పవన్‌కళ్యాణ్‌కు వీరాభిమానినని తెలిపారు. తనకు సమస్య వస్తే పవన్ పట్టించుకోలేదని, ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాను చెప్పిన వాటిల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు నార్కో టెస్ట్‌కు సిద్ధమని, తనది తప్పని తేలితే నారాయణ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరతానని చెప్పారు. నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నారాయణ వైద్యశాలలో సుప్రసిద్ధులైన మహిళా డాక్టర్లు చాలా మంది నారాయణ లైంగిక వేధింపులు తాళలేక అక్కడ ఉద్యోగాలు మానేసి వెళ్లిన వాస్తవాలు ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయన్నారు. సాటి మహిళల పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే వారి పేర్లను చెప్పడంలేదని తెలిపారు. -
మాజీ మంత్రి నారాయణకు షాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియ.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, బాధితురాలు ప్రియ ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో నారాయణ.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు.. కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్టు వీడియోలో ఆరోపించారు. ఇక, తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియ.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ -
విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అకృత్యాలపై ఆయన మరదలు ప్రియ ఇన్‌స్టాగామ్‌లో మరో వీడియో విడుదల చేశారు. నారాయణ ఆయన పరువు కోసం తనను అణచివేశారని ఆమె ఆరోపించారు. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కళ్ల ముందు చెడు జరుగుతోంది కాబట్టి బయటపెట్టేందుకు సిద్ధమయ్యాను. ముందు నా విషయం వెలుగులోకి తెస్తాను. తర్వాత విద్యా సంస్థల విషయాలు బయటపెడతా. పరువు అంటున్నారు. మహా అంటే పది మంది ఫోన్ చేస్తారు. అంతే కదా. ఇది నా జీవితం. 29 ఏళ్లు కష్టపడ్డా. నాకు క్యాన్సర్ వస్తే పలకరించే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? అందుకే నేను మాట్లాడతా. విద్యా సంస్థల్లో పిల్లల ఆత్మ హత్యల విషయం క్లియర్‌గా మాట్లాడతా. నేను ఫిజి కల్గా క్యాన్సర్ పేషంట్‌ను కావచ్చు. మెంటల్‌గా వీక్ కాను. ఒక స్త్రీ తలచుకుంటే శక్తి అవుతుందని నారాయణకు తెలియజేస్తా. నేను బతుకుతానో లేదో తెలియదు. నాకు డబ్బులివ్వరు. అయినా నా ఆస్తులమ్మైనా ట్రీట్మెంట్ చేయించుకుంటా. నేను చనిపోయే లోపు వాస్తవాలు బయటపెడతా’అని ప్రియ ఆ వీడియోలో చెప్పారు. సంచలనంగా ప్రియ వీడియోలు రెండు రోజుల క్రితం ప్రియ సోషల్ మీడియాలో మొదటి వీడియో రిలీజ్ చేశారు. బావ అయిన మాజీ మంత్రి నారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది రెండు తెలుగురాష్ట్రాల్లో, రాజకీయ వర్గాల్లో, నారాయణ విద్యాసంస్థల్లో చర్చనీయాంశమైంది. దీంతో నారా యణ తన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. ప్రియతో రాజీకి ప్రయత్నించారు. అయితే గంటా ప్రయత్నా లు విఫలమయ్యాయి. ప్రియ మరో వీడియో విడు దల చేసి, అందులో మరిన్ని విషయాలు వెల్లడించారు. ఇది మరింత సంచలనమైంది. సోదరుడి సతీమణినే నారాయణ లైంగికంగా వేధించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రియ జనసేన వీరమహిళ పొంగూరు ప్రియ జనసేన సభ్యురాలు. ఆ పార్టీ వీరమహిళగా గుర్తింపు పొందింది. తన బావ టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ అభిమానిని అని ఆమె వీడియోలో వెల్లడించింది. తన కుమారుడు పుట్టిన రోజున పవన్‌తో దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఓటు కూడా జనసేనకే వేశానని తెలిపింది. తన పార్టీ వీర మహిళగా ఉన్న ప్రియ లైంగిక వేధింపులతో నరకం చూశానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసినా జనసేన పార్టీ నుంచి స్పందన లేకపోవడంపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళల అక్రమ రవాణాలపై మాట్లాడుతున్న వవన్ కళ్యాణ్ సొంత పార్టీలోని మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వైపు కేసులు.. మరో వైపు పరువు ఓ వైపు పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసు, మరో వైపు అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాల కేసుల్లో ఉన్న నారాయణకు తాజాగా సొంత మరదలు ప్రియ చేస్తున్న ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి. తన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న చీకటి కోణాన్ని కూడా వెలుగులోకి తెస్తానని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్‌గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.