Bigg Boss 5 Telugu: Vishwa Wins Access To Power Room - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ అరాచకం..ఒంటిపై దుస్తులతో సహా అన్ని లాక్కెళ్లాడుగా

Sep 7 2021 3:00 PM | Updated on Sep 7 2021 4:21 PM

Bigg Boss 5 Telugu:Vishwa Wins Access To Power Room - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్‌లోకి ఏకంగా 19 మందిని పంపి షాకిచ్చాడు బిగ్‌బాస్‌. తొలి రోజు మూడు టాస్కులు ఇచ్చి గేమ్‌ స్టార్ట్‌ చేసిన బిగ్‌బాస్‌.. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియతో ముగించాడు. ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఉన్నారు.  ఇక అసలు కథ ఈ రోజు నుంచే మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. గేమ్‌లో భాగంగా తొలిసారి పవర్‌ రూమ్‌ని పరిచయం చేశాడు బిగ్‌బాస్‌. దీని కోసం ఓ గేమ్‌ పెట్టగా, అందులో విశ్వ గెలిచాడు.

అయితే ఇక్కడ విశ్వకి ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తాను ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని చెప్పాడు. దీంతో యాంకర్‌ రవి, ప్రియలను ఎంచుకున్నాడు విశ్వ. వారిద్దరి దుస్తులలతో పాటు అన్ని వస్తువులు లాక్కెళ్లిపోవడంతో రవి, ప్రియ వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. యాంకర్‌ రవి లేడీస్‌ డ్రెస్‌ ధరించగా, ప్రియ అబ్బాయి డ్రెస్‌లో కనిపించి షాకిచ్చింది. ఇక అమ్మాయి డ్రెస్‌లో ఉన్న రవిని ఎత్తుకొని సందడి చేశాడు విశ్వ. 

మరోవైపు ప్రియాంక సింగ్‌ ఏమో మానస్‌ని తనదైన శైలీలో ఆటపట్టించింది. రవిని, విశ్వని అన్నయ్య అని పిలుస్తా కానీ, మోనస్‌ని మాత్రం అలా పిలవలేనని చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున​ నవ్వారు. మరి ఇంకా బిగ్‌బాస్‌ ఇంట్లో ఎలాంటి సందడి జరిగిందో తెలియాలంటే నేటి సాయంత్రం ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement