Bigg Boss 5 Telugu: Anchor Ravi Re Entry Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: హౌస్‌లోకి యాంకర్‌ రవి రీఎంట్రీ!.. టీఆర్పీ స్టంటేనా?

Published Fri, Dec 3 2021 11:44 AM | Last Updated on Fri, Dec 3 2021 12:15 PM

Bigg Boss 5 Telugu: Anchor Ravi Re Entry Rumours Goes Viral - Sakshi

Is Anchor Ravi Re Entry In Bigg Boss House: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటే టక్కున గుర్తొచ్చే పేరు యాంకర్‌ రవి. టాప్‌-5లో కశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్యంగా ఎలిమినేట్‌ కావడం ఆయన ఫ్యాన్స్‌కే కాకుండా, నెటిజన్లకు సైతం షాకిచ్చింది. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్‌ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. అయితే అనూహ్యంగా 12వ వారంలోనే ఎలిమినేట్‌ అయి బయటకు రావడాన్ని రవి ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: Bigg Boss Telugu 5: యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలు ఇవేనా?

కావాలనే రవినే ఎలిమినేట్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కలు చూపించాలంటూ స్టార్‌మా పై ఒత్తిడి పెంచుతున్నారు రవి ఫాలోవర్స్‌. ఈ నేపథ్యంలో రవిని మళ్లీ బిగ్‌బాస్‌లోకి పంపాలంటూ డిమాండ్స్‌ వినిపిస్తున్నాయి. దీనిపై స్టార్‌మా కూడా ఆలోచనలో పడ్డట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్‌లో రవిని మళ్లీ బిగ్‌బాస్‌లోకి పంపనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో రీఎంట్రీ ఏంటంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఇప్పటివరకు రీ ఎంట్రీ, వైల్డ్‌ కార్డ్‌ అన్న ముచ్చటే లేదు. దీంతో రీఎంట్రీ ద్వారా యాంకర్‌ రవిని మరోసారి హౌస్‌లోకి పంపేందుకు షో నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే వీకెండ్‌ ఎపిసోడ్‌ వరకు వేచిచూడాల్సిందే. 

చదవండి: Bigg Boss Telugu 5: సిరి- షణ్నూల రిలేషన్‌ గురించి రవి షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement