![Bigg Boss 5 Telugu: Anchor Ravi Mother Shocking Comments On Bigg Boss - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/10/ravi.jpg.webp?itok=hgaCIycw)
Anchor Ravi Mother Shocking Comments On Bigg Boss: యాంకర్ రవి.. బిగ్‌బాస్ హౌస్ నుంచి అనుహ్యాంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్ షాకింగ్‌గానే ఉంది. టాప్ 3లో ఉండాల్సిన రవి ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌజ్‌లోకి రవి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ క్రమంలో రవి తల్లి కూడా కొడుకు ఎలిమినేషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.
చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి
కాగా రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్ డ్యాన్స్, డిజేతో గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమరాణి ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవి బయటకు రావడంపై మీ అభిప్రాయం ఏంటని ఆమెను అడగ్గా.. ప్రెషర్ కుక్కర్ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్‌కౌంటర్ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా కొడుకు టాప్ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్. తెలివిగా ఆడాడు.
చదవండి: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
మీకు ఆట ఆడేవాళ్లు, మంచివాళ్లు అవసరం లేదని అర్థమైంది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్ అంటే’ అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్‌ను చూపించింది. అలాగే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండే కంటెస్టెంట్ సాధారణ వ్యక్తులు కాదని, వారంతా సెలబ్రెటీలు అంది. ‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్‌కు ఇది ఫేర్ కాదు. ఇది ఎప్పటికి సరైనది కాదు. ఇప్పటికైన కాన్సెప్ట్ మార్చండి. లేకపోతే బిగ్‌బాస్ ఎవరూ చూడరు’ అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్‌బాస్‌పై మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment