
సాక్షి,నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ప్రియ పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.