
నెల్లూరు : ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 2.46 కోట్లు అపహరించిన సైబర్ కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళకు మాయ మాటలు చెప్పి, బెదిరించి కోట్లలో కాజేశారు సైబర్ నేరగాళ్లు. అయితే తాను డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని గ్రహించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాళ్ల తీగ లాగారు. దీనిలో భాగంగా రాజస్తాన్ కు చెందిన ఐదుగురు, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరానికి పాల్పడి కోట్ల రూపాయిలను ఆ మహిళా ఖాతా నుంచి అపహరించినట్లు గుర్తించారు.
వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి నిందితుల నుంచి 2 లక్షల నగదు, 50 మొబైల్స్, 57 ఏటీఎం కార్డులు, ల్యాప్ టాప్, ప్రింటర్, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారి అకౌంట్లలో ఉన్న రూ. 39 లక్షలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు పోలీసులు.