
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment