cyber gang
-
రూ. 2.46 కోట్లు అపహరణ.. పోలీసులకు చిక్కిన సైబర్ కేటుగాళ్లు
నెల్లూరు : ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 2.46 కోట్లు అపహరించిన సైబర్ కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళకు మాయ మాటలు చెప్పి, బెదిరించి కోట్లలో కాజేశారు సైబర్ నేరగాళ్లు. అయితే తాను డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని గ్రహించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాళ్ల తీగ లాగారు. దీనిలో భాగంగా రాజస్తాన్ కు చెందిన ఐదుగురు, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరానికి పాల్పడి కోట్ల రూపాయిలను ఆ మహిళా ఖాతా నుంచి అపహరించినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి నిందితుల నుంచి 2 లక్షల నగదు, 50 మొబైల్స్, 57 ఏటీఎం కార్డులు, ల్యాప్ టాప్, ప్రింటర్, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారి అకౌంట్లలో ఉన్న రూ. 39 లక్షలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు పోలీసులు. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్‌గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్‌ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్‌లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్‌సింగ్, హర్షవర్ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
డబ్బులు డ్రా చేసినా.. అకౌంట్ ఏదో తెలియదు
బెంగళూరు : ఏటీఎం మెషిన్లో సైబర్ డివైజ్‌ను అమర్చి లక్షలాది రూపాయలు నగదు డ్రా చేసే విదేశీ సైబర్ దొంగల గ్యాంగ్ ఐటీ సిటీలో ప్రవేశించింది. బ్యాంకు అధికారులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఏటీఎం మెషిన్ పాస్‌వర్డ్‌ను దొంగిలించి క్రెడిట్, డెబిట్‌కార్డ్స్ డేటా తస్కరించి ఏటీఎం కేంద్రాల్లో నగదు దోచేస్తున్నారు. రూ.17 లక్షలు డ్రా జనవరి 10వ తేదీన డాక్టర్ శివరామకారంతనగర ఎస్బీఐ శాఖ ఏటీఎంలో పరికరం అమర్చి రూ.17.71 లక్షల నగదు డ్రాచేశారు. ఈ కేసులో స్పెయిన్ దేశానికి చెందిన సేపీ అనే మహిళను సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. విచారణలో ఈమె నుంచి ఎంతో ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొరియా నుంచి ఒక పరికరాన్ని తెప్పించి ఏటీఎంకు అనుసంధానం చేస్తారు. దాని ద్వారా ఏటీఎంలో ఉన్న నగదును ఎంతైనా డ్రా చేసుకోవచ్చునని చెప్పింది. ఆమెకు సహకరించిన ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏ అకౌంటో తెలియదు కొడిగేహళ్లి ఎస్బీఐ ఏటీఎం మెషిన్లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 14 సార్లు రూ.10 వేల మేర మొత్తం రూ.1.40 లక్షల నగదు డ్రా చేశారు. ఏ బ్యాంక్ అకౌంట్‌దారు ఈ నగదును తీశారనేది రికార్డులో నమోదు కాలేదని ఎస్బీఐ అధికారులు వైట్‌ఫీల్డ్ సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సంపిగేహళ్లి పోలీసులు స్పెయిన్ యువతి నుంచి రూ.17 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఈమె అనుచరుల ఆచూకీ ఇంకా కనిపెట్టలేదు. రూ.78 లక్షలు డ్రా రాజాజీనగర పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఏటీఎంలో 2020 నవంబరు నుంచి 2021 జనవరి 30 వరకు గుర్తుతెలియని వ్యక్తులు రూ.78 లక్షలు డ్రాచేశారు. ఏ అకౌంట్ నుంచి నగదు డ్రా చేశారనేది తెలియరాలేదు. బ్యాంకు అధికారులు ఎంత తనిఖీ చేసినా క్లూ దొరకలేదు. -
జస్ట్ రూ.500కే క్రెడిట్ కార్డు వివరాలు
ఇండోర్ : సైబర్ కేటుగాళ్లు ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను మధ్య ప్రదేశ్ పోలీసు సైబర్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డు వివరాలను ఆన్లైన్లో కొనుగోలు చేసిన వీరు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను ఎంజాయ్ చేస్తున్నారని సీనియర్ అధికారులు చెప్పారు. డార్క్ వెబ్ ద్వారా హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డు వివరాలను వీరు పొందుతున్నారని, ప్రతి క్రెడిట్ కార్డును కొనుగోలు చేయడానికి రూ.500 నుంచి రూ.800 వెచ్చిస్తున్నారని రాష్ట్ర సైబర్ సెల్స్ ఇండోర్ యూనిట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు జితేంద్ర సింగ్ తెలిపారు. బిట్ కాయిన్ ద్వారా పేమెంట్లు జరిపి క్రెడిట్ కార్డు వివరాలను రాబడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను రామ్‌కుమార్ పిళ్ళై, రాంప్రసాద్ నాదర్‌గా అధికారులు గుర్తించారు. ముంబైకు చెందిన వీరు, పాకిస్తాన్‌కు చెందిన షైక్ అఫ్జల్ కా షోజి నడిపే అంతర్జాతీయ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ తరుఫున పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లాహోర్‌కు చెందిన షోజి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సందర్శించినట్టు ఎస్పీ చెప్పారు. నాదర్, పిళ్ళైతో షోజి స్కైప్‌లో మాట్లాడాడని తెలిపారు. ఈ సైబర్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు డార్క్ వెబ్ ద్వారా క్రెడిట్ కార్డు వివరాలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వివరాలతో బ్యాంకాక్, థాయ్‌లాండ్, దుబాయ్, హాంకాంగ్, మలేసియా వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం చేస్తున్నారని, అదేవిధంగా పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు కొంటున్నారని ఎస్పీ తెలిపారు. -
ఏడాదికి వడ్డీ మూడు శాతమే...
* ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే డబ్బు మీ అకౌంట్లోకి.. * రూ.10 లక్షల రుణమంటూ రూ.2.5 లక్షలు స్వాహా * ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన సైబర్ గ్యాంగ్ * ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నగరవాసికి మారు పేర్లతో ఫోన్లు చేశారు... రూ.10 లక్షల రుణం ఇస్తామంటూ ఎర వేశారు... వివిధ చార్జీల పేరుతో రూ.2.55 లక్షలు స్వాహా చేశారు... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా అనేక మందికి టోకరా వేసిన ఢిల్లీ గ్యాంగ్ గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన రేణు పాండే, అమర్‌చంద్ కేసరిలను అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావు మంగళవారం వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మధువేందర్ సింగ్, రేణు పాండే, అమర్‌చంద్ కేసరి ఓ ముఠాగా ఏర్పడ్డారు. న్యూఢిల్లీలో సోను వరల్డ్ విజన్ లిమిటెడ్, సిగ్నేచర్ హెల్త్ మేనేజ్మెంట్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేశారు. అందినకాడికి దండుకోవాలని కుట్ర పన్నిన ఈ త్రయం ఇవే పేర్లతో బ్యాంకు ఖాతాలు సైతం తెరిచారు. తమ కార్యాలయంలో టెలీకాలర్లను నియమించుకుని దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేయిస్తున్నారు. వివిధ బ్యాంకు నుంచి సాలీనా మూడు శాతం వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ టెలీకాలర్స్ ఎర వేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గాజులరామారం ప్రాంతానికి చెందిన జె.కుమారస్వామికి ఓ ఫోన్ వచ్చింది. ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు రాజీవ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తక్కువ వడ్డీకి రుణం అని చెప్పడంతో రూ.10 లక్షలు తీసుకునేందుకు కుమారస్వామి అంగీకరించాడు. దీంతో ప్రాసెసింగ్ చార్జీల పేరు చెప్పిన రాజీవ్ తన సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి రూ.1.2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆపై వాసుదేవ్ పండిట్ పేరుతో కాల్ చేసిన వ్యక్తి తాను ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. రూ.10 లక్షల రుణానికి సంబంధించి ఆదాయపు పన్నుగా రూ.1.35 లక్షలు చెల్లించాలంటూ నమ్మబలికి బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కొన్ని రోజులు రుణం కోసం వేచి చూసిన కుమారస్వామి రాజీవ్, వాసుదేవ్లుగా చెప్పుకున్న వ్యక్తులు కాల్ చేసిన నెంబర్లకు సంప్రదించే ప్రయత్నించారు. అవన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తేలడంతో మోసపోయినట్లు గుర్తించి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్, కానిస్టేబుళ్లు సతీష్, రమేష్, హరిప్రసాద్, సత్యవేణిలతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి రేణు పాండే, అమర్‌చంద్ కేసరిలను అరెస్టు చేసింది. ఈ ముఠా దేశ వ్యాప్తంగా అనేక మందికి రుణాల పేరుతో ఫోన్లు చేసి, ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆర్బీఐ చార్జీలు, ఇన్‌కమ్‌ట్యాక్స్ చార్జీల పేరుతో రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు దండుకున్నట్లు గుర్తించారు. మొత్తమ్మీద రూ.3 కోట్ల మేర మోసాలు చేసిన ఈ ముఠాకు చెందిన మిగిలిన వారి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. -
కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ పేరుతో మోసాలు
హైదరాబాద్: తమ సరికొత్త ఎత్తులతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నముఠాను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రియాల్టి షోలలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కౌన్ బనేగా కరోడ్ పతి గురించి అందరికీ తెలిసిన విషయమే. దీన్నే సైబర్ గ్యాంగ్ ఆసరాగా చేసుకుని తాజా మోసాలకు తెరలేపింది. పాకిస్తాన్ ను కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బై క్రెడిట్ కార్డులు, పలు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.